ప్రభుత్వ నియంత్రణ నిబంధనలు పాటించనందుకు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియాపై రూ.30 లక్షల జరిమానా విధించారు. నియమాలకు విరుద్ధంగా విమానాన్ని నడపడానికి పైలట్‌ను అనుమతించినందుకు ఎయిరిండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పదేపదే రోస్టరింగ్ సమస్యలు, పైలట్లకు తప్పనిసరి రికెన్సీ(విమానాలను నడపడంలో నైపుణ్యం కలిగి ఉండేలా చేయడం) ఉల్లంఘనలకు సంబంధించి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. అయితే అందుకు సరైన విధంగా స్పందించకపోవడం వల్ల ఈ జరిమానా విధిస్తున్నట్లు డీజీసీఏ స్పష్టం చేసింది.
ప్రతి పైలట్ నిత్యం మూడు టేకాఫ్‌లు, ల్యాండింగ్‌లు చేయాల్సిన అవసరం లేనప్పటికీ జులై 7, 2024న విమానాన్ని నడపడానికి ఎయిరిండియా ఒక పైలట్‌ను అనుమతించిందని డీజీసీఏ గుర్తించింది. పైలట్ విమానం నడపడానికి ముందు ఎయిరిండియా రోస్టింగ్ కంట్రోలర్లు సీఏఈ విండోలో ప్రతిబింబించే అనేక హెచ్చరికలను పట్టించుకోలేదని డీజీసీఏ ఎత్తిచూపింది. కంపెనీ చర్యలను హైలైట్ చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కానీ సంస్థ ఇచ్చిన ప్రతిస్పందనతో డీజీసీఏ సంతృప్తి వ్యక్తం చేయలేదు.
ఇదీ చదవండి: చౌకగా ప్రీమియం మోటార్ సైకిళ్లు
జనవరి 29, 2025న రూ.30 లక్షలు జరిమానా విధించినట్లు ఇటీవల పేర్కొంది. 30 రోజుల్లోగా జరిమానా మొత్తాన్ని జమ చేయాలని ఎయిరిండియాను ఆదేశించింది. ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి నియంత్రణ ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ నొక్కి చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment