ప్రీమియం ఎకానమీ సీట్లు కలిగిన ‘ఏ320 నియో’ నారోబాడీ(వెడల్పు తక్కువగా ఉండే) విమానం ఎయిరిండియా ఎయిర్‌క్రాఫ్ట్‌ల్లోకి చేరింది. ఫ్రాన్స్‌లోని ఎయిర్‌బస్ సంస్థ దీన్ని రూపొందించినట్లు ఎయిరిండియా తెలిపింది. ఇటీవలే ఇది దిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి.
ఎయిరిండియా తెలిపిన వివరాల ప్రకారం..ఈ విమానంలో 8 విలాసవంత బిజినెస్ తరగతి సీట్లు, అదనపు లెగ్‌రూం ఉండే 24 ప్రీమియం ఎకానమీ సీట్లు, సౌకర్యవంతమైన 132 ఎకానమీ తరగతి సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత విమానాల డిజైన్‌కు భిన్నంగా, సరికొత్త లివరీ(ఇంటెరియర్ డిజైన్)తో ఈ విమానాన్ని తయారుచేశారు.
ఇదీ చదవండి: ‘అనంత్-రాధికల పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’
ఎయిరిండియా సంస్థ తిరిగి టాటా గ్రూప్ అధీనంలోకి వచ్చాక కీలక మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది. విమానాల ఆధునికీకరణ ప్రారంభమైంది. కొత్త విమానాలను కొనుగోలు చేస్తామని, ఉన్నవాటిలో సదుపాయాలను మెరుగుపరుస్తామని సంస్థ ఇప్పటికే ప్రకటించింది. దేశీయంగా టైర్ 2, టైర్ 3 నగరాలకు విమాన సర్వీసులు అందించాలని ప్రభుత్వం విధానాలు రూపొందిస్తుంది. దాంతో విమానయాన కంపెనీలు అందుకు అవసరమయ్యే ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకుంటున్నాయి. దేశీయ మార్గాల్లో ఎయిరిండియా కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఏ320 నియో’ నారోబాడీ విమానాన్ని వచ్చే నెల నుంచి నడపనుంది.
Comments
Please login to add a commentAdd a comment