Aircraft
-
ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో - ఆకట్టుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు (ఫోటోలు)
-
కొత్తగా మరో 2,835 విమానాలు
న్యూఢిల్లీ: విమాన ప్రయాణానికి నానాటికీ పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి.. వచ్చే 20 ఏళ్లలో భారత్, దక్షిణాసియాలోని పౌర విమానయాన సంస్థలు కొత్తగా 2,835 విమానాలను సమకూర్చుకునే అవకాశం ఉందని యూఎస్‌కు చెందిన విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ వెల్లడించింది. గురువారం విడుదల చేసిన కమర్షియల్ మార్కెట్ ఔట్లుక్ ప్రకారం.. భారత బలమైన ఆర్థిక వ్యవస్థ, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ మార్కెట్ మద్దతు, 2043 నాటికి ఏటా 7 శాతం కంటే వార్షిక ట్రాఫిక్ వృద్ధి ఇందుకు దోహదం చేయనుంది. అలాగే మెరుగైన కనెక్టివిటీ, విమాన రంగానికి మద్దతు ఇచ్చే విధానాలు వృద్ధికి ఆజ్యం పోస్తాయి. భారత ట్రావెల్ మార్కెట్లో అతిపెద్ద, అభివృద్ధి చెందుతున్న సెగ్మెంట్‌గా దేశీయ విమాన ట్రాఫిక్ ఉంటుంది. లో–కాస్ట్ ఎయిర్‌లైన్స్ మరిన్ని కొత్త మార్గాలకు చేరుకోవడంతోపాటు, నూతన గమ్యస్థానాలను అనుసంధానిస్తాయి. అలాగే కార్గో విమానాల సంఖ్య అయిదింతలకు పెరుగుతుంది. అంతర్జాతీయంగా సరఫరా విస్తరణ, తయారీ, ఈ–కామర్స్ రంగం జోరు ఇందుకు కారణం. ప్రపంచంలోనే అత్యంత వేగంగా.. బలమైన ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య వృద్ధి, పెరుగుతున్న గృహ ఆదాయాలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధిలో పెట్టుబడులు.. వెరశి భారత్, దక్షిణాసియా ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాణిజ్య విమానయాన మార్కెట్‌గా కొనసాగుతోందని బోయింగ్ భారత్, దక్షిణాసియా కమర్షియల్ మార్కెటింగ్ ఎండీ అశ్విన్ నాయుడు తెలిపారు. ‘ప్రజలకు విమాన ప్రయాణం ఎక్కువ అందుబాటులో వస్తుంది. రాబోయే రెండు దశాబ్దాలలో పెరిగిన డిమాండ్‌ను తీర్చడానికి ఈ ప్రాంతంలోని విమానయాన సంస్థలకు ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించే ఆధునిక విమానాల అవసరం. వీటిలో న్యారో బాడీ విభాగంలో 2,445, వైడ్ బాడీ సెగ్మెంట్లో 370 విమానాలకు డిమాండ్ ఉండొచ్చు. పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, టెక్నీషియన్ల డిమాండ్ నాలుగు రెట్లు పెరిగి 1,29,000కి చేరుతుంది’ అని చెప్పారు. -
మధ్యప్రదేశ్‌లో కూలిన యుద్ధ విమానం
భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపురి సమీపంలో వైమానిక దళానికి చెందిన ట్విన్ సీటర్ మిరాజ్ 2000 యుద్ధ విమానం కూలిపోయింది. నివాస ప్రాంతాల్లో కూలకపోవడంతో పెనుప్రమాదమే తప్పింది. ట్విన్ సీటర్ మిరాజ్ 2000లో ప్రయాణిస్తున్న ఇద్దరు పైలెట్లు సురక్షితంగా ప్రాణాలతో భయటపడ్డారు. A twin-seater Mirage 2000 fighter aircraft today crashed near Shivpuri in Madhya Pradesh while it was on a routine training sortie. A Court of Inquiry is being ordered to ascertain the cause of the crash. More details are awaited: Defence officials pic.twitter.com/I1mMYpN6gj— ANI (@ANI) February 6, 2025 -
ఎయిర్‌క్రాఫ్ట్ ఎంఆర్వో సేవల్లోకి స్టార్ ఎయిర్
ముంబై: ప్రాంతీయ విమానయాన సంస్థ స్టార్ ఎయిర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎంఆర్వో సేవల వ్యాపారంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది. 2019లో ప్రారంభమైన బెంగళూరుకు చెందిన ఈ సంస్థ ఆరేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. మార్చి నాటికి ఫ్లీట్ సంఖ్య 14కు చేర్చనున్నట్టు వెల్లడించింది. అలాగే సర్వీసుల సంఖ్యను 100కు పెంచనున్నట్టు తెలిపింది.ప్రస్తుతం సంస్థ వద్ద ఎంబ్రాయర్ తయారీ తొమ్మిది విమానాలు ఉన్నాయి. 23 కేంద్రాలను అనుసంధానిస్తూ రోజుకు 44 సర్వీసులను నడుపుతోంది. 15 లక్షల మందికిపైగా కస్టమర్లకు సేవలు అందించింది. ఉడాన్ స్కీమ్ కింద కంపెనీకి కేటాయించిన రూట్లలో 90 శాతంపైగా కవర్ చేసినట్టు స్టార్ ఎయిర్ సీఈవో సిమ్రాన్ సింగ్ తివానా తెలిపారు. నెట్‌వర్క్‌కు మరో అయిదు కేంద్రాలు తోడు కానున్నట్టు చెప్పారు. -
నల్లపెట్టె మౌనరాగం!
నల్ల రంగులో ఉండదు. పేరు మాత్రం బ్లాక్ బాక్స్. ‘డెత్ కోడ్’ను తనలో గోప్యంగా దాచుకుంటుంది. నిజానికిది ఒక్క బాక్సు కూడా కాదు. రెండు పెట్టెలు! విమానం కూలిందంటే అందరి కళ్లూ దానికోసమే చూస్తాయి. రికవరీ బృందాలు దాని వేటలో నిమగ్నమవుతాయి. అది దొరికితే ప్రమాద కారణాలు తెలిసినట్టే. కానీ ఇటీవల బ్లాక్‌బాక్సులు తరచూ విఫలమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.గాలిలో ప్రయాణం ఎప్పుడూ గాల్లో దీపమే. రన్ వే నుంచి ఎగిరిన విమానం క్షేమంగా కిందికి దిగేదాకా టెన్షనే. వైమానిక దుర్ఘటనలకు కచి్చతమైన కారణాలు తెలియాలంటే బ్లాక్ బాక్స్ చిక్కాలి. అందులో ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్డీఆర్), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) అని రెండు భాగాలుంటాయి. వీటిని ఫ్లైట్ రికార్డర్స్ అంటారు. సులభంగా గుర్తు పట్టేందుకు వీలుగా అవి ప్రకాశవంతమైన ఆరెంజ్ రంగులో ఉంటాయి. బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉండేలా ప్రమాదాల్లో తక్కువ నష్టం జరిగే తోక భాగంలో అమర్చుతారు. ఎఫ్డీఆర్ సెకన్ల వ్యవధిలో దాదాపు వెయ్యి పరామితులను నమోదు చేస్తుంది. ప్రమాద సమయంలో విమానం ఎంత ఎత్తులో, ఎంత వేగంతో ఎగురుతోంది, ఇంజన్ పనితీరు, ప్రయాణ మార్గం, దిశ తదితరాలను రికార్డు చేస్తుంది. ఇక సీవీఆర్ పైలట్ల సంభాషణలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు వారు పంపిన, స్వీకరించిన సమా చారం, కాక్‌పిట్ శబ్దాల వంటివాటిని నమోదు చేస్తుంది. కనుక విమాన ప్రమాదాలకు దారితీసిన కారణాలు, చివరి క్షణాల్లో మార్పులు తదితరాలను బ్లాక్ బాక్స్ మాత్రమే వెల్లడించగలదు. దాని డేటాను విశ్లేషించి ప్రమాద కార ణంపై పరిశోధకులు అంచనాకు వస్తారు. ఇంత కీలకమైన ఈ ‘నల్ల పెట్టె ఇటీవల మొండికేస్తుంది. మూగనోము పడుతుంది. దక్షిణ కొరియాకు చెందిన ‘జెజు ఎయిర్’విమానం గత నెల 29న కూలిపోయి ఇద్దరు మినహా 179 దుర్మరణం పాలవడం తెలిసిందే. కూలడానికి నాలుగు నిమిషాల ముందు నుంచే అందులోని ఫ్లైట్ రికార్డర్లు పని చేయడం మానేశాయి. దాంతో దర్యాప్తు క్లిష్టంగా మారింది.వైఫల్యానికి కారణాలివీ...బ్లాక్ బాక్సులోని రెండు రికార్డర్లు 4.5 కిలోలుంటాయి. గురుత్వశక్తి కంటే 3,400 రెట్లు అధిక శక్తితో విమానం కూలినా బ్లాక్ బాక్స్ తట్టుకోగలదు. వెయ్యి డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతనూ కాసేపటిదాకా భరించగలదు. సము ద్రంలో కూలినా హై పిచ్ శబ్దాలతో 90 రోజులపాటు సంకేతాలు పంపగలదు. 20 వేల అడుగుల లోతులోనూ నెల పాటు పని చేయగలదు. దొరికాక కీలక డేటా, ఆడియో చెరిగిపోకుండా జాగ్రత్తగా వివరాలు సేకరిస్తారు. డేటాను డౌన్లోడ్ చేసి కాపీ చేస్తారు. దాన్ని డీకోడ్ చేసి గ్రాఫ్స్ రూపొందిస్తారు. అయితే... → సర్క్యూట్ పాడవటం, సెన్సర్లు విఫ లమవడం తదితర సాంకేతిక అవరోధాలు, సాఫ్ట్వేర్ లోపాలు తలెత్తినప్పుడు బ్లాక్ బాక్సు పనిచేయదు. → ప్రమాద తీవ్రత విపరీతంగా ఉండి భౌతికంగా ధ్వంసమైనప్పుడు కూడా దానిపై ఆశ వదిలేసుకోవాల్సిందే. → విమాన సిబ్బంది ఉద్దేశపూర్వకంగా డీ యాక్టివేట్ చేసినా బ్లాక్‌బాక్స్ పనిచేయడం మానేస్తుంది. → డేటా ఓవర్ లోడ్ అయినప్పుడు కూడా మొరాయిస్తుంది. → కొన్ని పాత బ్లాక్ బాక్సుల్లో నిరీ్ణత కా లం తర్వాత డేటా ఓవర్ రైట్ అయిపోతుంది. దాంతో వాటినుంచి ఎ లాంటి సమాచారమూ లభించదు. నిరుడు జనవరిలో అలస్కా ఎయిర్‌లైన్స్ బోయింగ్ విమానం ప్రయాణ సమయంలో తలుపు ఊడటంతో సీవీఆర్ పూర్తిగా ఓవర్ రైట్ అయింది. దాని నుంచి డేటా లభ్యం కాలేదు. → అత్యుష్ణ, అత్యల్ప ఉష్ణోగ్రతలు, ఎక్కువ కాలం నీటిలో నానడం వల్ల కూడా ఫ్లైట్ రికార్డర్లు పాడవుతాయి. → తేమ చేరి సున్నిత భాగాల్లో పరికరాలు దెబ్బతిని షార్ట్ సర్క్యూట్ కావడం, అత్యధిక ఎత్తుల్లో పీడనం, పక్షులు ఢీకొనడం, పిడుగుపాట్లు వంటి వాటి వల్ల కూడా బ్లాక్ బాక్సు పనిచేయకపోవచ్చు. పదేళ్లుగా జాడ లేని మలేసియా విమానం! నిజానికి ఫ్లైట్ రికార్డర్ల సామర్థ్యం పెంచాల్సిన అవసరం చాలా ఉంది. కానీ ఖర్చు, పరిమితుల దృష్ట్యా అది ఆలస్యమవుతోంది. అత్యవసర సందర్భాల్లో ఫ్లైట్ రికార్డర్లు పనిచేయాలంటే వాటికి విమానంలో ప్రత్యేక వ్యవస్థల నుంచి పవర్ సరఫరా తప్పనిసరి. రెండు ఇంజిన్లూ విఫలమైనప్పుడు విమానమంతటా ఎలక్ట్రికల్ పవర్ నిలిచిపోతుంది. 1999లో న్యూయార్క్ నుంచి కైరో వెళుతున్న ‘ఈజిప్ట్ ఎయిర్’విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలి 217 మంది మరణించారు. ఎలక్ట్రికల్ పవర్ ఆగిపోగానే దాని ఫ్లైట్ రికార్డర్లు పని చేయడం మానివేశాయి. దాంతో, విమానం లోపల సాధారణ అవసరాల కరెంటుపై ఆధారపడకుండా ఫ్లైట్ రికార్డర్లు 10 నిమిషాలు అదనంగా రికార్డింగ్ చేయడానికి వీలుగా ప్రత్యామ్నాయ బ్యాకప్ పవర్ ఏర్పాట్లుండాలని అమెరికా జాతీయ రవాణా సేఫ్టీ బోర్డు సిఫార్సు చేసింది. బ్లాక్ బాక్సుల బ్యాకప్ బ్యాటరీల జీవితకాలం తక్కువ. కొన్ని సందర్భాల్లో పనే చేయవు. దక్షిణ కొరియా ‘జెజు ఎయిర్’విమానంలోనూ విద్యుత్ వ్యవస్థ విఫలమై ఫ్లైట్ రికార్డర్లకు పవర్ అందక మూగవోయాయని భావిస్తున్నారు. సీవీఆర్ ఒక విడతలో రెండు గంటలపాటు మాత్రమే రికార్డు చేయగలదు. ఆ డేటానే రిపీట్ చేస్తుంది. రికార్డింగ్ నిడివిని 25 గంటలకు పెంచాలన్న డిమాండ్ కార్యరూపం దాలుస్తోంది. 2009లో ఎయిర్ ఫ్రాన్స్ విమానం బ్రెజిల్‌లోని రియో డి జెనీరో నుంచి పారిస్ వెళ్తూ అట్లాంటిక్ మహాసముద్రంలో కూలి 228 మంది చనిపోయారు. మలేసియా ఎయిర్‌లైన్స్ ఎంహెచ్ 370 విమానానిదైతే ఇప్పటికీ అంతు లేని వ్యథే! 2014లో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తూ అకస్మాత్తుగా రాడార్ తెర నుంచి అదృశ్యమైంది. మొత్తం 239 మందీ మరణించారని భావిస్తున్నారు. విమానం ఎందుకు, ఎలా అదృశ్యమైందో ఇప్పటికీ అంతుచిక్కలేదు. వైమానిక చరిత్రలోనే ఇదో పెద్ద మిస్టరీ. విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిందని అనుమానిస్తున్నారు. దాని జాడ కోసం మళ్లీ అన్వేషణ చేపట్టాలని మలేసియా తాజాగా నిర్ణయించింది. ‘ఎయిర్ ఫ్రాన్స్’దుర్ఘటన దరిమిలా మహా సముద్రాలను దాటి ప్రయాణించే విమానాల కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో 25 గంటల డేటా రికార్డింగ్ తప్పనిసరి చేయాలని ఫ్రాన్స్ సిఫార్సు చేసింది. అమెరికా కూడా దీన్ని చట్టంలో చేర్చింది. కానీ కొత్తగా తయారయ్యే విమానాల్లోనే ఈ మార్పులకు వీలుంది. పాతవాటిలో సాధ్యపడటం లేదు. ఇప్పుడు తిరిగే చాలా విమానాల జీవిత కాలం 40–50 ఏళ్లు! కొత్త టెక్నాలజీతో బ్లాక్ బాక్సులు! తాజా సవాళ్లు, మారిన సాంకేతికత నేపథ్యంలో అధునాతన రీతిలో సరికొత్త బ్లాక్ బాక్సుల కు పకల్పన జరుగుతోంది. ఎక్కువ గంటల రికార్డింగ్, అధిక డేటా స్టోరేజీ, బ్యాకప్ బ్యాటరీల జీవితకాలం పెంపు వంటివి వీటిలో ప్రధానాంశాలు. ప్రమా ద తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నా సమర్థంగా పనిచేసే బ్లాక్ బాక్సులూ రానున్నాయి. సముద్రాల్లో కూలినప్పుడు తక్కువ శ్రమతో సత్వరం గుర్తించే అండర్ వాటర్ లొకేటర్ బీకాన్స్ అభివృద్ధి దశలో ఉన్నాయి. ముఖ్యంగా, డేటాను రియల్ టైమ్‌లో పంపే బ్లాక్ బాక్సులు రానున్నాయి. తద్వారా కీలక సమాచారం వెంటనే గ్రౌండ్ స్టేషనుకు చేరుతుంది కనుక ప్రమాదంలో బ్లాక్ బాక్స్ నాశనమైనా ఇబ్బంది ఉండబోదు. – జమ్ముల శ్రీకాంత్ -
విమానంలోనూ వైఫై
దేశీయ ప్రయాణం కోసం విమానం ఎక్కుతున్నామంటే మన మొబైల్ ఫోన్లో ఫ్లైట్ మోడ్ ఆన్ చేయాల్సిందే. నో సిగ్నల్స్.. నో ఇంటర్నెట్... సెల్‌ఫోన్‌ని మడిచి లోపల పెట్టుకోవాల్సిందే. ఇది ఒకప్పటి మాట. కానీ ఇకమీదట... విమానంలో ప్రయాణిస్తూ ఇంటర్నెట్ ద్వారా సినిమాలు చూడొచ్చు. మీ బంధువులు, స్నేహితులతో వీడియో కాల్స్ మాట్లాడొచ్చు. ఆఫీస్ పని చేసుకోవచ్చు. ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఎయిర్ ఇండియా.దేశీయ విమాన ప్రయాణికులకు కొత్త ఏడాదిలో సరికొత్త కానుక అందిస్తోంది ఎయిర్ ఇండియా. దేశంలోనే మొట్టమొదటిసారిగా.. తమ విమానాల్లో ప్రయాణించే దేశీయ ప్రయాణికులకు వైఫై ద్వారా జనవరి 1 నుంచి ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ప్రారంభ ఆఫర్లా ఈ సదుపాయాన్ని కొంతకాలం ఉచితంగా అందిస్తోంది. ప్రస్తుతానికి కొన్ని సర్వీసులకే పరిమితమైన ఈ సౌకర్యం త్వరలో ఎయిర్ ఇండియాలోని అన్ని విమానాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తారట. ఒకరు ఒకే సమయంలో ఒకటికంటే ఎక్కువ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటివాటితోనూ కనెక్ట్ కావొచ్చు. ఇప్పటికే ఎయిర్ఇండియా న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వెళ్లే విదేశీ విమానాల్లో పైలట్ ప్రోగ్రామ్‌గా ఈ సదుపాయం అందిస్తోంది.ఎయిర్ ఇండియా వైఫై ఇలా..ఈ సౌకర్యం వినియోగించుకోవాలంటే ప్రయాణికులు వైఫై ఆన్ చేసి, సెటింగ్స్‌లో ‘ఎయిర్ ఇండియా వైఫై నెట్వర్క్’ ఎంపిక చేసుకోవాలి. ఎయిర్ ఇండియా పోర్టల్‌కు వెళ్లాక పీఎన్ఆర్ వంటి వివరాలు ఇవ్వాలి. ఆ తరవాత ఇంటర్నెట్ సేవలు వాడుకోవచ్చు.ఏయే విమానాల్లో..?అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఎయిర్‌బస్ ఎ350, బోయింగ్ 787–9, ఎంపికచేసిన ఎ321 నియో నియో విమానాలువిమానంలో నెట్ ఎలా?భూమ్మీద నెట్ వాడాలంటే మన చేతిలో ఒక ఫోనో ల్యాప్‌టాపో ఉండి.. సమీపంలో సెల్ టవర్ ఉంటే సరిపోతుంది. కానీ విమానం అలా కాదు కదా. విమానాల్లో వైఫై ద్వారా ఇంటర్నెట్ రావాలంటే 2 రకాల పద్ధతులు ఉన్నాయి. మొదటిది.. భూమిపై ఉండే సెల్ టవర్లు. దీన్నే ఎయిర్ టు గ్రౌండ్ (ఏటీజీ) టెక్నాలజీ అంటారు. ఇక రెండోది శాటిలైట్ ఆధారిత కనెక్షన్. ఈ రెండూ పనిచేయాలంటే విమానం లోపలా, బయటా ప్రత్యేక యాంటెనాల వంటి కొన్ని పరికరాలు అమర్చాలి. వైఫై లేనప్పుడు మన సమీపంలో ఎవరికైనా నెట్ కావాలంటే ఏం చేస్తాం? మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లో హాట్‌స్పాట్ ఆప్షన్ ఆన్ చేసి నెట్ ఇస్తాం. మన ఫోన్ మరొకరికి హాట్ స్పాట్‌లా ఎలా మారుతుందో.. యాంటెనాలూ, సర్వర్లు, రౌటర్ల వంటి వాటితో ఉన్న విమానం వందలాది మంది ప్రయాణికులకు ఒక హాట్ స్పాట్‌లా మారిపోతుంది.సెల్ టవర్ సిగ్నల్స్ఈ సిగ్నళ్లు అందుకోడానికి విమానం కింది లేదా అడుగు భాగంలో యాంటెనాలు ఏర్పాటు చేస్తారు. విమానం భూమి మీద బయలుదేరగానే ఆ యాంటెనాలు.. సమీపంలోని సెల్ టవర్ల నుంచి సిగ్నళ్లు అందుకుంటాయి. ఆ సిగ్నళ్లు క్యాబిన్ సర్వర్‌కు, అక్కడి నుంచి రౌటర్‌కు వెళ్తాయి. అక్కడి నుంచి ప్రయాణికులకు వెళ్లి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తాయి.శాటిలైట్ సిగ్నల్స్సెల్ టవర్ల ద్వారా సిగ్నల్ అందు తున్నంతసేపూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. సముద్రాలు, ఎడారి ప్రాంతాల వంటి వాటి పైనుంచి వెళ్లేటప్పుడు సెల్ టవర్ సిగ్నళ్లు అందవు. శాటిలైట్ సిగ్నళ్ల సాయం కావాల్సిందే. ఇందుకోసం విమానం పై భాగంలో యాంటెనా లు ఏర్పాటుచేస్తారు. అవి తమకు అత్యంత సమీపంలోని శాటిలైట్‌తో అనుసంధానమవుతాయి. ప్రయాణికుల ఫోన్లు, ల్యాప్‌టాపుల వంటివి విమాన క్యాబిన్లో ఉండే వైఫై యాంటెనాకు కనెక్ట్ అవుతాయి.ఆ పరికరాల నుంచి ఈ యాంటెనాలకు వచ్చే సిగ్నళ్లు విమానంలోని సర్వర్‌కు వెళ్తాయి. విమానం పైన ఉండే యాంటెనా ద్వారా ఆ సిగ్నళ్లు శాటిలైట్‌కు వెళతాయి. శాటిలైట్ వాటిని భూమిపై ఉండే స్టేషన్ లేదా టెలిపోర్టుకు పంపితే అక్కడి నుంచి తిరిగి సిగ్నళ్లు శాటిలైట్‌కు అందుతాయి. వాటిని విమానానికి పంపుతుంది శాటిలైట్. శాటిలైట్ సిగ్నళ్లు విమానంలోకి క్యాబిన్ సర్వర్‌కు, అక్కడి నుంచి రౌటర్‌కు వెళ్తాయి. అలా ప్రయాణికులు నెట్ వాడుకోవచ్చు.ఏటీజీ – శాటిలైట్ఏటీజీ ద్వారా ఇంటర్నెట్ అంటే చాలా పరిమితులు ఉంటాయి. అంతరాయాలు ఎక్కువ, స్పీడు కూడా తక్కువ ఉండొచ్చు. కానీ, శాటిలైట్ కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్లో అంతరాయాలు తక్కువని, స్పీడు కూడా ఎక్కువని అంతర్జాతీయ విదేశీ ప్రయాణికుల అనుభవాలు చెప్తున్నాయి.2003లో మొదటిసారిగా...⇒ 2003 జనవరి 15న జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ మొట్టమొదటగా తమ అంతర్జాతీయ విమానంలో ప్రయాణికులకు ఇంటర్నెట్ అందించింది.⇒ దేశీయ విమాన ప్రయాణికులకు (2013లో) ఇంటర్నెట్ అందించిన మొదటి సంస్థ అమెరికాకు చెందిన జెట్ బ్లూ.⇒ ప్రపంచంలో ప్రస్తుతంవైఫై ద్వారా ఇంటర్నెట్ అందిస్తున్న కొన్ని విమానయాన సంస్థలు నార్వేజియన్ ఎయిర్‌లైన్స్, ఫిలిప్పీన్స్ ఎయిర్‌లైన్స్, ఫిజి ఎయిర్వేస్, జెట్ బ్లూ, ఎమిరేట్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఖతార్ ఎయిర్వేస్, డెల్టా ఎయిర్వేస్, మొదలైనవి.‘ప్రయాణాల్లో ఇప్పుడు ‘కనెక్టివిటీ’ తప్పనిసరి అవసరమైపోయింది. కొంతమంది సరదాకోసం, షేరింగ్ కోసం ఇంటర్నెట్ వాడితే, మరికొందరు తమ వృత్తి, వ్యాపార అవసరాల కోసం వాడుతుంటారు. ఎయిర్ ఇండియా ఈ సదుపాయం తీసుకొచ్చి విమానాల్లో సరికొత్త ప్రయాణ అనుభూతి అందిస్తోంది. – ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అధికారి రాజేష్ డోగ్రా -
విమాన రంగం ఆశావహం
భారత మార్కెట్లో ఏవియేషన్ రంగ వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ తెలిపారు. దేశీ విమానయాన సంస్థలు పెద్ద ఎత్తున ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డర్లు ఇస్తున్న నేపథ్యంలో పైలట్ కావాలనుకునే ఔత్సాహికులు భారత్ వైపు చూడొచ్చని ఆయన సూచించారు.ఎయిర్ కనెక్టివిటీని పెంచుకోవడం ద్వారా ఆర్థిక పురోగతి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని గుర్తించిన భారత్.. విమానాశ్రయాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై ఇన్వెస్ట్ చేస్తోందని వాల్ష్ చెప్పారు. మరోవైపు, దేశీయంగా ఎయిర్పోర్ట్ చార్జీలపై స్పందిస్తూ.. పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుండటం సానుకూలాంశమని ఆయన వివరించారు. పరిశ్రమపై చార్జీల ప్రభావాన్ని గుర్తెరిగిన నియంత్రణ సంస్థ .. విమానయాన సంస్థలు, పరిశ్రమ అభిప్రాయాలు కూడా తెలుసుకోవడంపై సానుకూలంగా వ్యవహరిస్తోందని వాల్ష్ చెప్పారు.ఇదీ చదవండి: రూ.5 కోట్ల వాచ్‌తో జుకర్‌బర్గ్.. ప్రత్యేకతలివే..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 16.4–17 కోట్లకు చేరుకోవచ్చని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. 2023–24తో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 7–10 శాతం పెరిగే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఇటీవల నివేదిక విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో దేశీయంగా 7.93 కోట్ల మంది విమానాల్లో రాకపోకలు సాగించినట్లు తెలిపింది. 2023–24 ఏప్రిల్–సెప్టెంబర్‌తో పోలిస్తే 5.3 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. -
Video: విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు
సాఫీగా వెళుతున్న విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు. స్వీడన్ నుంచి అమెరికాలోని మియామి వెళుతున్న విమానంలో ఈ ఘటన జరిగింది. దీంతో విమానాన్ని యూటర్న్ చేసుకొని తిరిగి యూరప్‌లో ల్యాండ్ చేశారు. విమానం కుదుపులకు లోనైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.స్కాండినేవియన్ ఎయిర్ లైనస్‌కు చెందిన విమానం 254 మంది ప్రయాణికులు, సిబ్బందితో కలిసి గురువారం మధ్యాహ్నం స్వీడన్ లోని స్టాక్ హోం నుంచి మధ్యాహ్నం 12:55 గంటలకు ఫ్లోరిడాలోని మయామీకి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5:45 గంటలకు ఈ విమానం మయామీలో దిగాల్సి ఉంది. ఇంతలో మార్గమధ్యంలో ఎయిర్ టర్బులెన్స్ కారణంగా భారీ కుదుపులకు లోనైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గట్టిగా కేకలు వేశారు. సీట్లలో నుంచి కొందరు ఎగిరిపడగా.. మరికొందరైతే ఏకంగా ఫ్లైట్ పైకప్పుకు గుద్దుకున్నారు.చేతుల్లో ఉన్న వస్తువులు, పైన పెట్టిన బ్యాగులు, ఎయిర్ హోస్టెస్‌లు తీసుకొస్తున్న ఆహార పదార్థాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. ఉన్నట్టుండి విమానం కుదుపులకు లోనవడంతో ఏదో ప్రమాదం జరుగుతోందని భావించి, తాము చనిపోబోతున్నామని ప్రయాణికులు ఆందోళన చెందారు. గమనించిన పైలట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి తిరిగి స్టాక్ హోమ్‌లో ల్యాండ్ చేశాడు. అయితే అదృష్టవశాత్తు ప్రయాణికులు, సిబ్బందిలో ఎవరికి ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని సంబంధిత స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి తెలిపారు. కాగా ప్రయాణీకులకు రాత్రిపూట హోటల్లో వసతి కల్పించామని, శుక్రవారం ఉదయం ఇతర విమానాలలో వియామికి వెళ్లేందుకు షెడ్యూల్ చేసినట్లు పేర్కొన్నారు.🚨 #BreakingNow A video from #SK957 cabin as extreme turbulence hit a SAS A330 over Greenland,throwing unbuckled passengers into the ceiling.This incident highlights how turbulence can occur without warning,making seatbelts essential for passenger safety. https://t.co/iYVA4IIUER pic.twitter.com/S4kCaKwnn0— Antony Ochieng,KE✈️ (@Turbinetraveler) November 15, 2024 -
ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక సమస్య
రాంచీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. జార్ఖండ్‌లోని డియోఘర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తరువాత ఆ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో విమానాన్ని విమానాశ్రయంలోనే ఉంచారు. విమానంలో సమస్యను చక్కదిద్దేందుకు నిపుణులు పనిచేస్తున్నారు. ఈ లోపు మోదీ వెళ్లేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యామ్నాయ విమానాన్ని డియోఘర్‌కు పంపారు. దీంతో మోదీ ఢిల్లీ తిరుగు ప్రయాణం ఆలస్యం కానుంది.జార్ఖండ్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతి (జనజాతీయ గౌరవ్ దివస్) కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం డియోఘర్ పట్టణానికి వచ్చారు. అదే విధంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీ అక్కడ ప్రచారాన్ని కూడా నిర్వహించారు. రెండు చోట్ల బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. కాగా నవంబర్ 20వ తేదీన జార్ఖండ్‌లో రెండో దశ ఎన్నికలు జరగాల్సి ఉంది.మరోవైపు డియోఘర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో గొడ్డాలో రాహుల్ గాంధీ హెలికాప్టర్ టేకాఫ్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమంతి ఆలస్యమైంది. దీంతో క్లియరెన్స్ కోసం 45 నిమిషాలు గ్రౌండ్పైనే ఉండిపోయింది. అయితే ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష నాయకుడి ప్రచార షెడ్యూల్‌కు అంతరాయం కలిగించారని కాంగ్రెస్ ఆరోపించింది. -
60 విమానాలు రద్దు చేసిన ఎయిరిండియా! కారణం ఏంటంటే..
టాటా యాజమాన్యంలోని ఎయిరిండియా సంస్థ కొన్ని రూట్లలో తన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 60 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. నిర్వహణ సమస్యల కారణంగా ఎయిర్‌క్రాఫ్ట్‌లు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది.ఎయిరిండియా తాజా ప్రకటన వల్ల యూఎస్ సర్వీసులపై ప్రభావం పడనుందని అధికారులు తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ల నిర్వహణ, సప్లై చెయిన్ పరిమితుల వల్ల కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఇతర ప్రత్యామ్నాయాలు చూపుతున్నామని వివరించారు. ఈమేరకు ప్యాసింజర్లకు సమాచారం అందించామని చెప్పారు.వైడ్ బాడీ విమానాలు లేవు..‘ఎయిరిండియా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 మధ్య శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, చికాగో, న్యూయార్క్ వంటి నగరాలకు నడిపే 60 విమానాలను రద్దు చేసింది. ఈ రూట్లలో నడపడానికి తగినన్ని వైడ్ బాడీ విమానాలు అందుబాటులో లేవు. దాంతోపాటు కొన్ని నిర్వహణ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రయాణికులు అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం’ అని ఒక సీనియర్ అధికారి చెప్పారు.ఇదీ చదవండి: టపాసులా పేలుతున్న బంగారం ధర!ఈ ప్రాంతాల నుంచి యూఎస్‌కు విమానాలుఎయిరిండియా దిల్లీ-వాషింగ్టన్ మధ్య ఐదు విమానాలను నడుపుతుండగా, దిల్లీ నుంచి న్యూయార్క్, ముంబై నుంచి న్యూయార్క్ వరకు వారానికి ఏడు విమానాలు నడుపుతోంది. దిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి నేరుగా ఫ్రాన్సిస్కోకు విమానాలున్నాయి. దిల్లీ నుంచి చికాగో మార్గంలో ప్రతి వారం ఏడు విమానాలను నడుపుతోంది. -
బ్లూజే ఏరో లాజిస్టిక్స్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆవిష్కరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్లీన్ టెక్నాలజీ సంస్థ బ్లూజే ఏరో తాజాగా లాజిస్టిక్స్ కోసం ఉపయోగించే మానవరహిత వీటీవోఎల్ (వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్) ఎయిర్‌క్రాఫ్ట్ ’రీచ్’ను లైవ్‌లో ప్రదర్శించింది. ఇది దేశీయంగా రూపొందించిన తొలి హైడ్రోజన్–ఎలక్ట్రిక్ వీటీవోఎల్ అని సంస్థ సహ వ్యవస్థాపకుడు ఉత్తమ్ కుమార్ తెలిపారు. 100 కేజీల పేలోడ్ సామర్ధ్యంతో ఒక్కసారి చార్జ్ చేస్తే 300 కి.మీ. ప్రయాణించగలదని వివరించారు. అంతగా కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో కూడా సత్వరంగా డెలివరీ చేసేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. తమ టెక్నాలజీతో సంప్రదాయ ఎయిర్పోర్ట్ మౌలిక సదుపాయాల అవసరం లేకుండా హైదరాబాద్–వరంగల్, ముంబై–పుణె వంటి కీలక రూట్లలో 30 నిమిషాల్లోపే వాయుమార్గంలో రవాణా సాధ్యపడుతుందని చెప్పారు. ఇప్పటివరకు రూ. 18 కోట్లు సమీకరించామని, మరో రూ. 250 కోట్లు సమీకరించే యత్నాల్లో ఉన్నామని ఉత్తమ్ కుమార్ వివరించారు. జిరోధాకు చెందిన రెయిన్‌మ్యాటర్ క్యాపిటల్, ఎండియా పార్ట్నర్స్ తదితర సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. -
బొంబార్డియర్ సీఈవోతో గౌతమ్ అదానీ భేటీ
న్యూఢిల్లీ: కెనడాకు చెందిన బిజినెస్ జెట్స్ తయారీ దిగ్గజం బొంబార్డియర్ సీఈవో ఎరిక్ మార్టెల్తో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. ఎయిర్‌క్రాఫ్ట్ సరీ్వసులు, రక్షణ రంగ కార్యకలాపాల్లో భాగస్వామ్యం తదితర అంశాలపై ఇందులో చర్చించినట్లు మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో అదానీ పోస్ట్ చేశారు. అదానీ గ్రూప్ దేశీయంగా ఏడు విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. -
విమాన తయారీకి ప్రభుత్వ దన్ను
న్యూఢిల్లీ: దేశీయంగా వాణిజ్య విమానాల తయారీకి బూస్ట్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక సంస్థ(ఎస్పీవీ)ను ఏర్పాటు చేయనుంది. తద్వారా విమాన తయారీ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లనున్నట్లు పౌరవిమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశీయంగా వేగవంత వృద్ధిలో ఉన్న వైమానిక రంగానికి పలు అవకాశాలున్నట్లు తెలియజేశారు. భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు 2024ను లోక్‌సభ ఆగస్ట్‌లో ఆమోదించింది. ఈ బిల్లులో విమాన తయారీ, డిజైన్లను నియంత్రించే ప్రొవిజన్లను చేర్చింది. తద్వారా ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి వత్తాసు పలకడం ద్వారా సొంత తయారీకి దారి ఏర్పాటు చేసింది. వెరసి సొంత విమానాలను భారత్ తయారు చేసుకునేందుకు ప్రభుత్వం పటిష్ట కార్యాచరణకు తెరతీసిందని నాయుడు తెలియజేశారు. ఇందుకు ఏర్పాటు చేయనున్న ఎస్పీవీలో పరిశ్రమ సంబంధిత నిపుణులు తదితరులను భాగస్వాములను చేయనున్నట్లు వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో సొంత విమానాల తయారీ కార్యకలాపాలు ప్రారంభంకాగలవని హామీనిచ్చారు. విమాన తయారీలో ప్రధాన పాత్ర పోషించడంతోపాటు.. వీటిని భారత్ ఎగుమతి చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. విమాన తయారీ దిగ్గజాలు బోయింగ్, ఎయిర్‌బస్‌లకు భారత్ కీలక మార్కెట్‌గా నిలుస్తున్నట్లు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ దిగ్గజం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఇప్పటికే చిన్నతరహా పౌర విమానాలను రూపొందిస్తున్న అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రపంచంలోనే వేగవంతంగా విస్తరిస్తున్న వైమానిక మార్కెట్లలో భారత్ ఒకటని పేర్కొన్నారు. పీహెచ్డీ సీసీఐ ఏర్పాటు చేసిన సదస్సులో నాయుడు వైమానిక తయారీ అంశాలపై ప్రసంగించారు. విమానాల నిర్వహణ, పూర్తిస్థాయి తనిఖీలు, మరమ్మతుల(ఎంఆర్వో) కార్యకలాపాలలో సైతం భారత్‌కు అపార అవకాశాలున్నట్లు అభిప్రాయపడ్డారు. దేశాన్ని వైమానిక, ఎయిర్ కార్గో, ఎంఆర్వో కార్యకలాపాలకు కేంద్రంగా మలచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రస్తావించారు. -
ఎయిరిండియాలో కొత్తగా నారోబాడీ ఎయిర్‌క్రాఫ్ట్
ప్రీమియం ఎకానమీ సీట్లు కలిగిన ‘ఏ320 నియో’ నారోబాడీ(వెడల్పు తక్కువగా ఉండే) విమానం ఎయిరిండియా ఎయిర్క్రాఫ్ట్ల్లోకి చేరింది. ఫ్రాన్స్‌లోని ఎయిర్‌బస్ సంస్థ దీన్ని రూపొందించినట్లు ఎయిరిండియా తెలిపింది. ఇటీవలే ఇది దిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి.ఎయిరిండియా తెలిపిన వివరాల ప్రకారం..ఈ విమానంలో 8 విలాసవంత బిజినెస్ తరగతి సీట్లు, అదనపు లెగ్‌రూం ఉండే 24 ప్రీమియం ఎకానమీ సీట్లు, సౌకర్యవంతమైన 132 ఎకానమీ తరగతి సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత విమానాల డిజైన్‌కు భిన్నంగా, సరికొత్త లివరీ(ఇంటెరియర్ డిజైన్)తో ఈ విమానాన్ని తయారుచేశారు.ఇదీ చదవండి: ‘అనంత్-రాధికల పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి’ఎయిరిండియా సంస్థ తిరిగి టాటా గ్రూప్ అధీనంలోకి వచ్చాక కీలక మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది. విమానాల ఆధునికీకరణ ప్రారంభమైంది. కొత్త విమానాలను కొనుగోలు చేస్తామని, ఉన్నవాటిలో సదుపాయాలను మెరుగుపరుస్తామని సంస్థ ఇప్పటికే ప్రకటించింది. దేశీయంగా టైర్ 2, టైర్ 3 నగరాలకు విమాన సర్వీసులు అందించాలని ప్రభుత్వం విధానాలు రూపొందిస్తుంది. దాంతో విమానయాన కంపెనీలు అందుకు అవసరమయ్యే ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకుంటున్నాయి. దేశీయ మార్గాల్లో ఎయిరిండియా కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఏ320 నియో’ నారోబాడీ విమానాన్ని వచ్చే నెల నుంచి నడపనుంది. -
ఎలక్ట్రిక్ వాహనాలకి ధీటుగా.. లిక్విడ్ హైడ్రోజన్ మోటార్స్ పోటీ!
ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే రీచార్జబుల్ బ్యాటరీలతో పనిచేసే ఎలక్ట్రిక్ విమానాల తయారీకి కొన్ని కంపెనీలు ప్రయత్నాలు సాగిస్తుంటే, స్విట్జర్లాండ్‌కు చెందిన ఒక కంపెనీ ఏకంగా లిక్విడ్ హైడ్రోజన్ ఇంధనంతో ఎగిరే విమానానికి రూపకల్పన చేసింది.‘ఈవీటాల్’ పేరుతో రూపొందించిన ఈ బుల్లి విమానం పూర్తిగా ద్రవరూపంలో ఉన్న హైడ్రోజన్‌ను ఇంధనంగా ఉపయోగించుకుని పనిచేస్తుంది. ఇందులో పైలట్‌తో పాటు మరో నలుగురు ప్రయాణికులు ప్రయాణించడానికి వీలవుతుంది. తక్కువ దూరంలోని విమాన ప్రయాణాలకు అనుగుణంగా సైరస్జెట్ అనే స్విస్ కంపెనీ దీనిని రూపొందించింది.ఇందులో ఒకసారి పూర్తిగా ఇంధనం నింపితే, 1850 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. దీని గరిష్ఠవేగం గంటకు 520 కిలోమీటర్లు. ఈ విమానానికి పొడవాటి రన్‌వే కూడా అవసరం లేదు. హెలికాప్టర్ మాదిరిగా ఇది నిలువునా టేకాఫ్ చేసుకుని, ఆకాశంలోకి ఎగిరిపోగలదు. ఈ విమాన సేవలను త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు సైరస్జెట్ కంపెనీ సన్నాహాలు చేస్తోంది.హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కారు..ఇప్పటికే లిథియం అయాన్ బ్యాటరీలతో పనిచేసే ఎలక్ట్రిక్ కార్లు బాగా వినియోగంలోకి వచ్చాయి. తాజాగా జపానీస్ కార్ల తయారీ కంపెనీ హోండా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో పనిచేసే కారును రూపొందించింది.హోండా ‘సీఆర్–వీ ఈ:ఎఫ్‌సీఈవీ’ పేరుతో రూపొందించిన ఈ కారు నిరంతారయంగా 430 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. జనరల్ మోటార్స్ సహకారంతో హోండా కంపెనీ ఈ కారులో ఉపయోగించే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌ను రూపొందించింది. 92.2 కిలోవాట్ల సామర్థ్యం గల ఈ ఫ్యూయల్ సెల్ మాడ్యూల్ నుంచి ఇంజిన్‌కు 174 హార్స్ పవర్ విద్యుత్తు సరఫరా అవుతుంది.ఇందులో తొమ్మిది అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే సహా పలు అధునాతన సాంకేతిక ఏర్పాట్లు చేయడం విశేషం. హోండా కంపెనీ వచ్చే ఏడాది దీనిని మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తోంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.ఇవి చదవండి: ఆశ్చర్యపోయాను!.. భారతీయ విద్యార్థిపై 'టిమ్ కుక్' ప్రశంసలు -
విమాన ఖర్చులు ప్రధాని నుంచి వసూలు చేయాలి: సంజయ్ రౌత్
ముంబై: తన పదవిని ఎన్నికల ప్రచారానికి వాడుకొని ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్‌సింగ్ ఆరోపించారు. ప్రధాని ప్రజల సొమ్మును ఎన్నికల ప్రచారానికి వాడుకుని ఉంటే దానిని వెంటనే రికవర్ చేయాలని రౌత్ డిమాండ్ చేశారు. ‘ప్రధాని ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు ప్రభుత్వ విమానాన్ని వాడితే దానికి అయిన ఖర్చు బిల్లులను బీజేపీయే చెల్లించాలి. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కూడా ప్రధాని ప్రభుత్వ విమానాలు, హెలికాప్టర్లలోనే ప్రచారానికి వెళుతున్నారు. ఇటీవల ప్రధాని ముంబైలో పర్యటించి అదానీకి ఇచ్చేందుకుగాను భూమి ఎక్కడుందో వెతికారు. దారావీ స్లమ్ ఏరియా రీ డెవలప్మెంట్ ప్రాజెక్టును అదానీకి కట్టబెట్టారు. బీజేపీని తరిమికొట్టేందుకు ముంబై ఎప్పుడో డిసైడైంది’అని రౌత్ చెప్పారు. ఇదీ చదవండి.. ఎన్నికల బరిలో యువరాజులు, యువరాణులు -
బీహార్: పొలాల్లో కూలిన ఎయిర్‌క్రాఫ్ట్.. ఇద్దరు పైలట్లకు గాయాలు!
బీహార్‌లోని గయ జిల్లాలోని బుద్ధగయలో ఆర్మీ ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయింది. బాగ్దాహాలోని కంచన్‌పూర్ గ్రామంలో శిక్షణ సమయంలో ఆర్మీ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు శిక్షణ పైలట్లకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన ఎయిర్‌క్రాఫ్ట్‌లో లేడీస్ పైలట్, జెంట్స్ ఆర్మీ పైలట్ ఉన్నట్లు సమాచారం. సాంకేతిక లోపం కారణంగా బాగ్దాహా, బోధ్ గయ సమీపంలోని కంచన్‌పూర్ పొలాల్లో ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యాన్ అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో అది మైదాన ప్రాంతంలో పడిపోయింది. శిక్షణలో ఉన్న పైలట్లిద్దరూ సురక్షితంగా ఉన్నారు. సమాచారం అందుకున్న ఆర్మీ సైనికులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఎయిర్‌క్రాఫ్ట్‌ను తమ వెంట తీసుకెళ్లారు. గయలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో ఆర్మీ సైనికులకు శిక్షణ అందిస్తుంటారు. శిక్షణ విమానం 200 నుంచి 400 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. అంతకుముందు 2022లో కూడా శిక్షణ సమయంలో సాంకేతిక లోపం కారణంగా ఒక ఎయిర్‌క్రాఫ్ట్ పొలంలో కూలిపోయింది. -
మహీంద్రాతో ఎంబ్రేయర్ భాగస్వామ్యం
ముంబై: భారత వైమానిక దళం కోసం సీ–390 మిలీనియం మల్టీ మిషన్ రవాణా విమానాల కొనుగోళ్లకు సంబంధించిన మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంటీఏ) ప్రాజెక్ట్ కోసం ఎంబ్రేయర్ డిఫెన్స్, సెక్యూరిటీ తాజాగా మహీంద్రా గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలోని బ్రెజి ల్ దౌత్య కార్యాలయంలో ఈ మేరకు ఒప్పందంపై ఇరు సంస్థలు శుక్రవారం సంతకాలు చేశాయి. ఎంటీఏ ప్రాజెక్టులో భాగంగా తయారీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి దేశీయంగా ఉన్న ఏరోస్పేస్ పరిశ్రమతో ఎంబ్రేయర్, మహీంద్రా సంప్రదింపులు జరుపనుంది. సీ–390 విమానాల విషయంలో భవిష్యత్తు కేంద్రంగా భారత్‌ను మార్చగల సామర్థ్యాన్ని ఇరు సంస్థలు అన్వేషిస్తాయి. ‘సీ–390 మిలీనియం మార్కెట్లో అత్యంత అధునాతన మిలిటరీ ఎయిర్‌లిఫ్టర్. ఈ భాగస్వామ్యం ఐఏఎఫ్ కార్యాచరణ నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలతో సజావుగా సరిపోయే సమర్థవంత పారిశ్రామికీకరణ పరిష్కారాన్ని కూడా అందిస్తుందని నమ్ముతున్నాము’ అని మహీంద్రా ఏరోస్పేస్, డిఫెన్స్ బిజినెస్ ప్రెసిడెంట్ వినోద్ సహాయ్ ఈ సందర్భంగా తెలిపారు. కాగా, మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంటీఏ) కొనుగోలు ప్రాజెక్టులో భాగంగా భారత వైమానిక దళం (ఐఏఎఫ్) 40 నుంచి 80 విమానాలను కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం భారత్‌కు సాంకేతిక బదిలీతోపాటు తయారీ వ్యవస్థ ఏర్పాటు కానుంది. 18 నుంచి 30 టన్నుల వరకు బరువు మోయగల విమానాలను ఐఏఎఫ్ సేకరించనుంది. -
ముయిజ్జూ భారత వ్యతిరేక వైఖరి.. బాలున్ని చంపేసింది!
మాలే: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారత వ్యతిరేక విధానాల వల్ల ఓ 14 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. భారత్ అందించిన ఎయిర్‌క్రాఫ్ట్ వినియోగాన్ని నిరాకరించిన కారణంగా బ్రెయిన్ స్ట్రోక్‌తో బాలుడు మరణించాడు. బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్న అబ్బాయిని వేగంగా ఆస్పత్రికి తరలించడానికి ఎయిర్‌క్రాఫ్ట్ కోసం బాధితులు అభ్యర్థించారు. కానీ అనుమతి లభించకపోవడంతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు బ్రెయిన్ ట్యూమర్ స్ట్రోక్‌తో బాధపడుతున్న బాలుడి పరిస్థితి విషమించడంతో బాధిత కుటుంబం అతన్ని గాఫ్ అలీఫ్ విల్లింగిలిలోని వారి ఇంటి నుండి రాజధాని మాలేకి తరలించడానికి ఎయిర్‌క్రాఫ్ట్ అంబులెన్స్‌ను అభ్యర్థించింది. కానీ సమాధానం రాలేదు. 16 గంటల తర్వాత బాలున్ని మాలేకి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. "స్ట్రోక్ వచ్చిన వెంటనే బాలున్ని మాలేకి తీసుకురావడానికి ఐలాండ్ ఏవియేషన్‌కు కాల్ చేశాం. కానీ మా కాల్‌కు సమాధానం అందలేదు. ఉదయం 8:30 గంటలకు ఫోన్‌కు సమాధానం ఇచ్చారు. సాధారణంగా అలాంటి కేసులకు ఎయిర్ అంబులెన్స్ ఇస్తారు. అది ఉండటమే పరిష్కారం" అని బాలుని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యల అనంతరం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభణ కొనసాగుతోంది. భారత్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఈ ఘటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాలుడి మరణంపై వ్యాఖ్యానించిన మాల్దీవుల ఎంపీ మీకైల్ నసీమ్.. “భారతదేశం పట్ల అధ్యక్షుడి వ్యతిరేక వైఖరి కారణంగా ప్రజలు తమ ప్రాణాలను కోల్పోవాల్సిన అవసరం లేదు.” అని అన్నారు. ఇదీ చదవండి: అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిగా ట్రంప్ మానసిక స్థితి సరిపోతుందా? -
భారత్‌కు మరో 2,500 విమానాలు అవసరం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత విమానయాన రంగానికి 2042 నాటికి మరో 2,500కు పైగా విమానాలు అవసరం అవుతాయని బోయింగ్ అంచనా వేస్తోంది. ‘పెరుగుతున్న ప్రయాణికులు, సరుకు రవాణా డిమాండ్‌ను తీర్చడానికి దక్షిణాసియాకు చెందిన విమానయాన సంస్థలు రాబోయే రెండు దశాబ్దాలలో తమ విమానాల పరిమాణాన్ని నాలుగు రెట్లు పెంచుతాయని అంచనా. వృద్ధి, విమానాల భర్తీని పరిష్కరించడానికి ఈ కంపెనీలకు 2,705 కంటే ఎక్కువ కొత్త విమానాలు అవసరమవుతాయి. ఇందులో 92 శాతం భారత్ కైవసం చేసుకుంటుంది’ అని బోయింగ్ కమర్షియల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ డేరిన్ హస్ట్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. అంచనా వేసిన మొత్తం విమానాల్లో.. తక్కువ దూరం ప్రయాణించడానికి అనువైన చిన్న విమానాలు 2,300లకుపైగా, సుదూర ప్రాంతాల కోసం సుమారు 400 విమానాలు అవసరం అవుతాయని చెప్పారు. ఆసియాలో దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ పరంగా మహమ్మారి ముందస్తు స్థాయికి పుంజుకున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ, పెద్ద మార్కెట్ భారత్ మాత్రమేనని ఆయన అన్నారు. -
జెట్‌సెట్‌గో భారీ డీల్...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ విమాన సర్వీసుల రంగంలో ఉన్న జెట్‌సెట్‌గో భారీ డీల్‌కు తెరలేపింది. ఇందులో భాగంగా 280 హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకుంటోంది. హైదరాబాద్ బేగంపేటలో జరుగుతున్న వింగ్స్ ఇండియా 2024 వేదికగా ఎలెక్ట్రా, ఏరో, హారిజన్ ఎయిర్‌క్రాఫ్ట్, ఓవర్‌ఎయిర్‌తో జెట్‌సెట్‌గో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. డీల్ విలువ సుమారు రూ.10,790 కోట్లు. హారిజన్ తయారీ 50 కెవోరైట్ ఎక్స్7 ఎలక్ట్రిక్ వెర్టికల్ టేక్–ఆఫ్ అండ్ ల్యాండింగ్ (ఈవీటోల్) ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకుంటున్నట్టు సమాచారం. మరో 50 ఎక్స్7 ఈవీటోల్స్ తీసుకునే అవకాశమూ ఉంది. నగరాల్లో ఎయిర్ట్యాక్సీలుగా, విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతాలకు, వివిధ ప్రదేశాలకు, నగరాల మధ్య, నగరంలో ఒకచోటు నుంచి మరోచోటుకు వెళ్లేందుకు హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను వినియోగించవచ్చని జెట్‌సెట్‌గో శుక్రవారం వెల్లడించింది. ‘ఈ మూడు కంపెనీలతో భాగస్వామ్యం భారత్‌కు బ్లోన్ లిఫ్ట్, ఫ్యాన్ ఇన్ వింగ్ లిఫ్ట్ సిస్టమ్స్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ ప్రొపల్షన్, సూపర్–క్వైట్ ఆప్టిమల్ స్పీడ్ టిల్ట్ రోటర్స్ వంటి ప్రత్యేక సాంకేతికతలను పరిచయం చేస్తుంది’ అని జెట్‌సెట్‌గో ఫౌండర్, సీఈవో కనిక టేక్రివాల్ తెలిపారు. -
మారుత్ డ్రోన్స్, స్కైడ్రైవ్ ఎంవోయూ
హైదరాబాద్: మారుత్ డ్రోన్స్, స్కైడ్రైవ్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. వ్యాపారాభివృద్ధితోపాటు, ఎలక్ట్రిక్ వెరి్టక్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (ఈవీటాల్) ఎయిర్‌క్రాఫ్ట్ (ఎయిర్ ట్యాక్సీ/ఫ్లయింగ్ ట్యాక్సీ) విభాగంలో అవకాశాల అన్వేషణకు ఇది వీలు కల్పించనుంది. తప్పనిసరి మినహాయింపులు, సరి్టఫికెట్లను సొంతం చేసుకోవడంతోపాటు, ప్రభుత్వ మద్దతు పొందడం, పైలట్, మెకానిక్‌లకు శిక్షణ, కీలక భాగస్వాముల గుర్తింపు విషయంలో మారుత్ డ్రోన్స్‌కు ఈ సహకారం తోడ్పడనుంది. మారుత్ డ్రోన్స్ ఇప్పటికే డ్రోన్ల కోసం అన్మ్యాన్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ను అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఈ ఎంఎవోయూతో ఎయిర్‌ట్యాక్సీ కార్యకలాపాల్లోకీ విస్తరించనుంది. -
చిన్నసైజు హెలికాప్టర్ కనిపిస్తుంది..తుఫాన్ బాధితుల్ని కాపాడటంలో
తుఫానులనూ తట్టుకోగల డ్రోన్ చిన్నసైజు హెలికాప్టర్లా కనిపించే ఈ డ్రోన్ వాతావరణంలోని ఎలాంటి మార్పులనైనా తట్టుకుంటూ ఇట్టే దూసుకుపోగలదు. చెక్ కంపెనీ ‘థండర్ ఫ్లై’ ఈ డ్రోన్‌ను ‘టీఎఫ్–జీ1’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. అత్యవసర వస్తువులను గమ్యానికి చేరవేయడానికి వీలుగా ‘థండర్ ఫ్లై’ ఇంజినీర్లు దీనిని రూపొందించారు. తుఫానుల్లో సైతం ఈ డ్రోన్ చెక్కుచెదరకుండా ప్రయాణించగలదు. రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ డ్రోన్‌ను ఒకసారి పూర్తిగా చార్జ్ చేసుకుంటే, గంటకు పైగా నిరంతరాయంగా ప్రయాణించగలదు. ఇది ఐదు కిలోల వరకు బరువున్న వస్తువులను ఒక చోటు నుంచి మరొక చోటుకు సురక్షితంగా తీసుకుపోగలదు. తుఫానుల్లో చిక్కుకు పోయిన వారికి ఆహారం, ఔషధాలు వంటి అత్యవసర వస్తువులను చేరవేయడానికి ఇది బాగా ఉపయోగపడగలదు. థండర్ ఫ్లై వెబ్సైట్ ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు. దీని ధర 9,999 డాలర్లు (రూ.8.33 లక్షలు). రోటరీ బ్లేడ్లు అదనంగా కావాలను కుంటే, మరో 499 డాలర్లు (రూ.41,611) చెల్లించాల్సి ఉంటుంది. -
మరిన్ని యుద్ధ విమానాలు భారత్‌కు.. రక్షణ శాఖ అనుమతి
భారత రక్షణ దళంలోని వాయుసేన విభాగం పటిష్టం చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రక్షణ దళ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు తేలికపాటి యుద్ద విమానాలను కొనుగోలు చేయనుంది. ఇందులో భాగంగా మరో 97 తేజస్ యుద్ధ విమానాలను, 156 ప్రచండ హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వశాఖ అనుమతినిచ్చింది. ఈ రెండు రకాల విమానాలు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయనున్నారు. దేశీయ కంపెనీల నుంచి రూ.1.5 లక్షల కోట్ల విలువైన రక్షణ పరికరాల కొనుగోలు ప్రతిపాదనకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) గురువారం ఆమోదం తెలిపింది. వీటి ఒప్పందాల విలువ సుమారు రూ. 1.1 లక్షల కోట్లు ఉండనుంది. అదనంగా భారత వైమానిక దళం కోసం తేజస్ మార్క్ 1-ఏ యుద్ధ విమానాలు.. వైమానిక దళం, సైన్యం కోసం హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. వీటి మొత్తం విలువ సుమారు రూ. 2 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. వీటిని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించనుంది. రాబోయే కొన్నేళ్లలో భారత వైమానిక దళంలో అమ్ముల పొదలో కొత్త యుద్ధ విమానాలు చేరనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయితే.. భారత్ చరిత్రలోనే స్వదేశీ సంస్థ తయారుచేయనున్న అతిపెద్ద ఆర్డర్ కానుంది. ఇప్పుడే అనుమతి లభించిన నేపథ్యంలో విమానాలు రూపుదిద్దుకునే వరకు సమయం పట్టనుంది. అయితే విదేశీ తయారీదారులు భాగస్వామ్యం అయితే తక్కువ కాలంలో పూర్తిచేసే అవకాశం ఉంది. -
జపాన్ సముద్రంలో కూలిన అమెరికా సైనిక విమానం
అమెరికా సైనిక విమానం కుప్పకూలిపోయింది. జపాన్ సమీపంలోని యకుషిమా ద్వీప సమీపంలోని సముద్రంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ఎనిమిదిమంది సభ్యులు ప్రయాణిస్తున్నారు. ఈ విషయాన్ని జపాన్ తీరప్రాంత అధికారి వెల్లడించారు. అయితే విమానంలోని వారి పరిస్థితి, భద్రతపై సమాచారం తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు. యూఎస్‌కు చెందిన మిలిటరీకి చెందిన వి-22 ఓస్ప్రే విమానం ఎనిమిది మధ్య వ్యక్తులతో వెళ్తుంది. జపాన్‌లోని యకుషిమా ద్వీపం సమీపంలో సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదం జపాన్ సమయం ప్రకారం( భారత కాలమాన ప్రకారం ఉదయం 11:17 గంటలు) బుధవారం మధ్యాహ్నం 2.47 గంటలకు జరిగింది. యుఎస్ మిలిటరీ విమానం సముద్రంలో పడిపోవడంతో దాని ఇంజిన్ నుంచి మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరిస్తున్నామని జపాన్‌లోని యూఎస్ బలగాల ప్రతినిధి పేర్కొన్నారు. కాగా అమెరికాకు చెందిన ఎస్ప్రే సంస్థ విస్తరణ జపాన్‌లో వివాదాస్పందగా మారింది. ఈ హైబ్రిడ్ విమానం ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ విమర్శలను అమెరికా సైన్యం, జపాన్ కొట్టిపారేస్తున్నాయి. ఇది పూర్తి సురక్షితమని చెబుతున్నాయి. ఇదిలా ఉండగా గత ఆగస్టులో ఇదే యూఎస్ ఎస్ప్రే విమానం ఉత్తర ఆస్ట్రేలియా తీరంలో కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు యూఎస్ ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 2016 డిసెంబర్లో కూడా జపాన్ దక్షిణ ద్వీపం ఒకినావా సముద్రంలో మరో విమానం ప్రమాదానికి గురైంది. -
భారత్‌లో విమానాల సర్వీసింగ్.. హాల్‌తో ఎయిర్‌బస్ జట్టు!
యూరోపియన్ మల్టీనేషనల్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ భారత్‌లో వాణిజ్య విమానాల సర్వీసింగ్లోకి ప్రవేశిస్తోంది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) భాగస్వామ్యంతో దేశంలో ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ , మరమ్మతులు, నవీకరణ (ఎంఆర్ఓ) పరిశ్రమను బలోపేతం చేయడానికి ముందుకొచ్చింది. దేశంలో విస్తరిస్తున్న వాణిజ్య విమానాలు, ముఖ్యంగా విమాన ప్రయాణాన్ని సరళతరం చేసిన A320 రకానికి చెందిన విమానాల కోసం ఎంఆర్ఓ సేవల డిమాండ్ పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా సేవలందించేందుకు ఎయిర్‌బస్ ఈ భాగస్వామ్యం ద్వారా హాల్‌కు మద్దతు ఇస్తుంది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ దేశంలో ఇంటిగ్రేటెడ్ ఎంఆర్ఓ హబ్‌ని స్థాపించి, విమానయాన సంస్థలకు సమర్థవంతమైన సేవలలు అందించాలనే దృక్పథంతో ఉందని, హాల్ నాసిక్ కేంద్రం చేస్తున్న ఈ ప్రయత్నం భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా మిషన్‌కు అనుగుణంగా ఉంటుందని హాల్ సీఈవో (MiG కాంప్లెక్స్) సాకేత్ చతుర్వేది పేర్కొన్నారు. భారతదేశంలో విమానయాన వ్యవస్థ బలోపేతానికి, అందుకు అత్యంత ఆవశ్యకమైన ఎంఆర్ఓ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎయిర్‌బస్ కట్టుబడి ఉందని ఎయిర్‌బస్ ఇండియా అండ్ దక్షిణాసియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రెమి మైలార్డ్ తెలిపారు. ఒప్పందం ప్రకారం, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ ఎయిర్‌బస్ A320 ఫ్యామిలీ టూల్ ప్యాకేజీని, ఎంఆర్ఓని సెటప్ చేయడానికి ప్రత్యేక కన్సల్టింగ్ సేవలను అందిస్తుంది. దీంతోపాటు ఎయిర్‌బస్ సపోర్ట్, టెక్నికల్ డేటాతోపాటు ట్రైనింగ్ సొల్యూషన్స్ అందించే డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన ‘ఎయిర్‌బస్ వరల్డ్’కి యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆమోదించిన మూడు హ్యాంగర్లు, నైపుణ్యం కలిగిన మానవవనరులతో కూడిన పౌర విమాన ఎంఆర్ఓ సదుపాయాలు ఇప్పటికే హిందూస్తాన్ ఏరోనాటిక్స్ నాసిక్ విభాగంలో ఉన్నాయి. -
పర్సనల్ జెట్‌ప్యాక్‌లు వచ్చేస్తున్నాయి..
ప్రస్తుతం కారు ఉండటం అనేది చాలా సాధరణం అయిపోయింది. అదే కారు లాగే ‘పర్సనల్ ఫ్లైట్’ ఉంటే... అమ్మో అది రూ. కోట్లతో కూడుకున్న వ్యవహారం. అంబానీ వంటి అపర కుబేరులకే అది సాధ్యమవుతుంది కానీ ఇతరులకెలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? పర్సనల్ వాహన రంగంలో సరికొత్త శకం రాబోతోంది. కారు కొన్నంత సులువుగా, కారు ధరకే ‘పర్సనల్ ఫ్లైట్’లు కొనుక్కునే కాలం ఎంతో దూరంలో లేదు. ఇదేదో సైన్స్ ఫిక్షన్ కాదు. ఇలాంటి ప్రయత్నం ఇప్పటికే మొదలుపెట్టేసింది ఓ విదేశీ ఏవియేషన్ స్టార్టప్ కంపెనీ. కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న జెట్సన్ అనే కంపెనీ జెట్సన్ వన్ పేరుతో ఈ ప్రత్యేక ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ లాండింగ్ (eVTOL) ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారు చేస్తోంది. అంటే ఇది విద్యుత్‌శక్తి సాయంతో ఎగురుతుంది. ఇందు కోసం ప్రముఖ సెలబ్రిటీ ఆర్టిస్ట్, టెక్ విజనరీ విలియమ్ నుంచి 15 మిలియన్ డాలర్ల నిధులను సైతం పొందింది. కారు కంటే వేగంగా.. జెట్సన్ వన్ వాహనం కారు కంటే వేగంగా పయనించగలదు. గంటకు 63 మైళ్లు అంటే 101 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అలాగే 15,00 అడుగుల ఎత్తు వరకూ ఎగరగలదు. ఇది ఆకాశ ఫార్ములా వన్ రేసింగ్ కారు. అల్యూమినియం, కార్బన్ ఫైబర్‌తో దీన్ని తయారు చేశారు. ఇందులో ఎనిమిది శక్తివంతమైన మోటర్లు ఉంటాయి. ఇవి సమాన మొత్తంలో ప్రొపెల్లర్లను నడుపుతాయి. చూడటానికి డ్రోన్లాగా ఉండే ఈ వాహనాలను ఇటీవల అమెరికాలో పరీక్షించారు. అక్కడ వీటిని నడపడానికి పైలట్ లైసెన్స్ కూడా అక్కర్లేదు. ఆర్డర్ల స్వీకరణ జెట్సన్ వన్ పర్సనల్ జెట్ప్యాక్లకు ఈ కంపెనీ ఆర్డర్లు స్వీకరిస్తోంది. వీటి కోసం ఇప్పటికే 300 మంది ఆర్డర్ చేశారు. ఇందు కోసం ఒక్కొక్కదానికి 98,000 డాలర్లు (సుమారు రూ.81.5 లక్షలు) చెల్లించారు. అంటే ఒక ప్రీమియం కారు ధర కంటే తక్కువే. -
విమానాల లీజింగ్ వ్యాపారంలోకి అదానీ పోర్ట్స్
ముంబై: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీ సెజ్) తాజాగా విమానాల లీజింగ్ వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇందుకోసం సొంతంగా ఉడాన్‌వత్ లీజింగ్ ఐఎఫ్ఎస్సీ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసింది. రూ. 2.5 కోట్లు అదీకృత మూలధనంతో దీన్ని ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. టాటా గ్రూప్‌లో భాగమైన ఎయిరిండియా కూడా ఇటీవలే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ) గిఫ్ట్ సిటీలో సొంత ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. మరో విమానయాన సంస్థ ఇండిగో కూడా అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నట్లు సమాచారం. -
భారత కాంప్లియన్స్ రేటింగ్‌కు కోత
న్యూఢిల్లీ: విమానాల లీజుకు సంబంధించి అంతర్జాతీయ చట్టం నింధనల అమలులో భారత్ రేటింగ్‌కు ‘ది ఏవియేషన్ వర్కింగ్ గ్రూప్ (ఏడబ్ల్యూజీ)’ కోత పెట్టింది. భారత్‌కు నెగెటివ్ అవుట్‌లుక్ ఇచి్చంది. సీటీసీ కాంప్లియెన్స్ ఇండెక్స్‌లో భారత్ స్కోరును 3.5 నుంచి 2కు తగ్గించింది. సంక్షోభంలో పడిన గోఫస్ట్ ఎయిర్‌లైన్ నుంచి లీజుదారులు విమానాలను వెనక్కి తీసుకునే విషయంలో న్యాయ సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఏడబ్ల్యూజీ అనేది లాభాపేక్ష రహిత చట్టబద్ధ సంస్థ. ఇందులో విమానాల తయారీదారులు, లీజింగ్ కంపెనీలు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సభ్యులుగా ఉన్నాయి. కేప్‌టౌన్ కన్వెన్షన్ కింద విమానయాన సంస్థలకు లీజుకు ఇచి్చన విమానాలను అద్దెదారులు వెనక్కి తీసుకోవచ్చు. కానీ, గోఫస్ట్ విషయంలో లీజుదారులు విమానాలను వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దివాల పరిష్కార ప్రక్రియ కిందకు వెళ్లడంతో మారటోరియం అమలవుతోంది. లీజుదారులకు సీటీసీ పరిష్కారాలు అందుబాటులో లేవని లేదా లీజుకు ఇచి్చన ఎయిర్‌క్రాఫ్ట్‌లను వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఉన్నట్టు ఏడబ్ల్యూజీ పేర్కొంది. ‘‘గోఫస్ట్ దివాలా పరిష్కార చర్యలు ఆరంభించి 130 రోజులు అవుతోంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్ అమలు చేయాల్సిన గడువు కంటే ఇది రెట్టింపు’’అని ఏడబ్ల్యూజీ తన ప్రకటనలో పేర్కొంది. భారత్ సీటీసీపై సంతకం చేసినప్పటికీ ఇంకా అమలు చేయకపోవడం గమనార్హం. -
ఐఏఎఫ్‌లోకి సీ–295 విమానం
ఘజియాబాద్: భారత వైమానిక దళం(ఐఏఎఫ్)లోకి మొదటి సీ–295 రకం రవాణా విమానం చేరింది. ఈ విమానాలు ఐఏఎఫ్ వ్యూహాత్మక రవాణా సామర్థ్యం పెంపులో కీలకంగా మారనున్నాయి. ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో సీ–295 విమానాన్ని ఐఏఎఫ్‌లోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజ్‌నాథ్ సర్వ ధర్మపూజ నిర్వహించారు. వైమానిక దళ చీఫ్ వీఆర్ చౌధరితోపాటు సీనియర్ అధికారులు, విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్ ప్రతినిధులు పాల్గొన్నారు. వడోదర ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి పనిచేసే స్క్వాడ్రన్ నంబర్ 11కు సీ–295ను అందజేయనున్నారు. కేంద్రం 56 సీ–295 రవాణా విమానాల్ని కొనుగోలు చేసేందుకు ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థతో రూ.21,935 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మొదటి సీ–295 విమానాన్ని ఈ నెల 13న ఐఏఎఫ్ చీఫ్ అందుకున్నారు. ఈ విమానాలను ప్రస్తుతమున్న పాతకాలం ఆవ్రో– 748ల బదులు వినియోగించుకుంటారు. ఒప్పందంలో భాగంగా 16 విమానాల్ని ఎయిర్‌బస్ సంస్థ అందజేస్తుంది. మిగతా 40 విమానాల్ని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌తో కలిసి భారత్‌లోనే ఉత్పత్తి చేస్తుంది. వి డి భాగాల తయారీ పనులు హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. -
ఎట్టకేలకు భారత్ వీడిన కెనడా ప్రధాని.. రెండు రోజులు ఆలస్యంగా
న్యూఢిల్లీ: విచ్చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎట్టకేలకు భారత్‌ను వీడారు. జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్‌కి వచ్చిన ఆయన.. మంగళవారం కెనడాకు బయల్దేరి వెళ్లారు. వాస్తవాడానికి ట్రూడో సమ్మిట్‌లో పాల్గొన్న తర్వాత సెప్టెంబర్ 10న (ఆదివారం) సాయంత్రం తిరిగి స్వదేశానికి వెళ్లాల్సి ఉంది. కానీ ముందస్తు తనిఖీ సమయంలో ఆయన అధికారిక విమానంలో(ఎయిర్‌బస్ CFC001) సాంకేతిక సమస్య తలెత్తడంతో రెండు రోజులుగా భారత్‌లోనే చిక్కుకుపోయారు. దీంతో 36 గంటలపాటు ట్రూడో, ఆయన బృందం ఢిల్లీలోనే స్టే చేయాల్సి వచ్చింది. రెండు రోజుల అనిశ్చితి అనంతరం కెనడా ప్రధాని చివరకు నేడు(మంగళవారం) మధ్యాహ్నం 1.10 గంటలకు స్వదేశానికి బయలుదేరారు. ఆయన విమానంలో సాంకేతిక లోపాన్ని సరిదిద్దినట్లు, ఇప్పుడు ఇది ఎగరడానికి సిద్ధంగా ఉందని కెనడా ప్రధాన మంత్రి కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వీడ్కోలు పలికారు. ట్రూడో క్షేమంగా కెనాడాకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఒకవైపు ట్రూడోను తీసుకెళ్లడానికి కెనడా ఎయిర్‌ఫోర్స్ మరో విమానం భారత్‌కు తరలిస్తున్న సమయంలో ఈ సమస్య కొలిక్కి రావడం గమనార్హం. ఇక కెనడా అధికారిక విమానాలు ఆ దేశ ప్రధానిని ఇబ్బంది పెట్టడం ఇదే మొదటిసారి కాదు. 2016లో యూరోపియన్ యూనియన్‌తో చర్చల కోసం బెల్జియం బయల్దేరిన కెనడా ప్రధాని విమానంలో సాకేంతిక సమస్య తలెత్తడంతో టేకాఫ్ అయిన అరగంటలోనే తిరిగి కెనడాకే రావాల్సి వచ్చింది. ఇక 2019 అక్టోబర్‌లోనూ ట్రూడో వీఐపీ విమానం ఓ గోడను పొరబాటున ఢీకొంది. అప్పట్లో దీని ముక్కుభాగం, కుడిభాగం ఇంజిన్ దెబ్బతింది. దీంతో ఆ విమానాన్ని పలు నెలలపాటు వాడకుండా పక్కకు పడేశారు. చదవండి: Monu Manesar: గోసంరక్షకుడు మోను మనేసర్ అరెస్ట్ అదే ఏడాది డిసెంబర్లో ట్రూడో నాటో సమ్మిట్‌కు హాజరు కావడానికి బ్యాకప్ విమానాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. అయితే రాయల్ కెనడియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో లోపం ఉన్నట్లు గుర్తించినందున ఆ జెట్ కూడా లండన్‌లో నిలిచిపోయింది. వరుస షాక్‌లు ఇదిలా ఉండగా.. ట్రూడో భారత్ పర్యటన మొత్తం గందరగోళంగానే గడించింది. ఇందుకు ఆయన అందరితోనూ అంటీ ముట్టన్నట్లుగా వ్యవహరించడమే కారణం. అమెరికా, బ్రిటన్, భారత్, యూఏఈ దేశాల అధినేతలతో జస్టిన్ ట్రూడో కలవలేదు. ప్రధాన వేదికపై కూడా ఆయన కనిపించలేదు. చివరికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించిన విందులోనూ కూడా ఆయన కనిపించలేదు. ప్రపంచ దేశాధినేతలు రాజ్‌ఘాట్‌లో నివాళులు అర్పించే సమయంలో కూడా ట్రూడో ఎవరితో పెద్దగా కలవకుండా ఉన్నారు. ట్రూడో జీ20 పర్యటనపై స్వదేశంలో కూడా విమర్శలు వస్తున్నాయి. సదస్సులో మిగిలిన దేశాధినేతలతో సరిగా కలవలేదని, ట్రూడోను ఎవరూ పట్టించుకోలేదని.. ఆయన్ను పక్కకు పెట్టారని అక్కడి పత్రికలు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. చదవండి: LIbiya: లిబియాలో పెను విపత్తు.. 2000 మందికిపైగా మృతి కాగా జీ20 సదస్సు నేపథ్యంలో మోదీ ట్రూడో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే. భారత వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా అడ్డాగా మారుతుందనే విషయాన్ని ఏకంగా కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ట్రూడో దృష్టికి మోదీ తీసుకెళ్లారు. ఇది కెనడాకు కూడా ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. తీవ్రవాద శక్తులు కెనడా కేంద్రంగా భారత్‌పై విషం చిమ్ముతున్నాయని, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. కెనడాలో నివసిస్తున్న భారతీయులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, భారత దౌత్యవేత్తలకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపిస్తున్నాయని వెల్లడించారు.. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలంటే పరస్పర గౌరవం, విశ్వాసం చాలా ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు. -
ఎయిర్‌క్రాఫ్ట్ నడుపుతూ 11 ఏళ్ల చిన్నారి.. పక్కనే మద్యం తాగుతూ తండ్రి.. మరుక్షణంలో..
కొంతమంది వినోదం పేరుతో చేసే పనులు వారి ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడతాయి. తాజాగా ఇటువంటి సంఘటనే చోటుచేసుకుంది. 42 ఏళ్ల పరిశోధకుడు గారాన్ మైయా, అతని కుమారుడు ఫ్రాన్సిస్కో మైయా నిర్లక్ష్యపు వినోదానికి పోయి మృత్యువు పాలయ్యారు. వీరు ప్రయాణిస్తున్న ట్విన్ ఇంజిన్ బీచ్‌క్రాఫ్ట్ బారన్- 58 ఒక అడవిలో ప్రమాదానికి గురయ్యింది. ఈ దుర్ఘటనకు జరగడానికి కొన్ని నిముషాల ముందు రికార్డయిన వీడియో అందరినీ ఆలోచింపజేస్తోంది. దీనిని చూస్తే ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో ఇట్టే తెలిసిపోతుంది. వీడియోలో మద్యం తాగుతున్న తండ్రి గారోన్ మైయా, ఎయిర్‌క్రాఫ్ట్‌ను కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఉన్న 11 ఏళ్ల కుమారుడు ఫ్రాన్సిస్కో మైయా కనిపిస్తారు. Express.co.uk తెలిపిన వివరాల ప్రకారం ఈ వీడియో దుర్ఘటన జరగడానికి ముందు షూట్ చేసినది. ఈ కేసు విచారణ చేపట్టిన అధికారులు ఈ వీడియో ఈ ఘటనకు ముందు సమయానిదా? కాదా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే ఎయిర్‌క్రాఫ్ట్‌లోని తండ్రీకొడుకులు తమ రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. బ్రెజిల్‌కు చెందిన మీడియా రిపోర్టు ప్రకారం గారాన్ నోవా కాంక్విస్టాలోని రోండోనియా పట్టణంలోని తమ పొలం నుండి ఎయిర్ క్రాఫ్ట్‌లో బయలుదేరాడు. ఇంధనం నింపడానికి విల్హేనాలోని విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు. తన కుమారుడిని కాంపో గ్రాండే నుంచి వేరే ప్రాంతానికి తీసుకు వెళ్లాలని అతను అనుకున్నాడు. వారి కుమారుడు అక్కడ తల్లితో పాటు ఉంటూ స్కూలులో చదువుకుంటున్నాడు. కాగా ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదంలో భర్త, కుమారుడు మృతిచెందారని తెలియగానే అతని భార్య ఎనాఫ్రిడోనిక్ ఆత్మహత్య చేసుకుంది. భర్త, కుమారుని అంత్యక్రియలకు ముందే ఆమె ఆత్మహత్య చేసుకుంది. కాగా బ్రెజిల్ చట్టాల ప్రకారం 18 ఏళ్ల వయసుదాటిన వారే అధికారికంగా ఎయిర్ క్రాఫ్ట్ నడిపేందుకు అర్హులు. ఇది కూడా చదవండి: అలస్కాలో పగిలిన హిమానీనదం.. కేదార్నాథ్ విపత్తును తలపించేలా.. Avião bimotor Beechcraft Baron 58, de matrícula PR-IDE, "caiu matando pai e filho" a Aeronave cair em uma região de mata fechada, na divisa de Rondônia e Mato Grosso. Os destroços da aeronave foram localizados na manhã deste domingo (30) o pecuarista Garon Maia e o filho.🇧🇷 pic.twitter.com/nOEBpVZJup — D' AVIATION 🇧🇷 (@pgomes7973) August 1, 2023 -
బెలుగా భలేగా.. సరుకు రవాణాలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానం
శంషాబాద్: సరుకు రవాణాలో ప్రపంచంలోనే అతిపెద్దదైన బెలుగా విమానం మరోసారి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. వియత్నాం నుంచి ఈజిప్ట్ వెళ్తున్న ఈ విమానంలో ఇంధనం నింపడంతో పాటు పైలట్ల విశ్రాంతి కోసం సోమవారం అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. తిరిగి బుధవారం రాత్రి ఇక్కడి నుంచి ఈజిప్ట్‌కి బయలుదేరింది. గతేడాది డిసెంబర్ 4 రాత్రి దుబాయ్ నుంచి భారీ సరుకుతో థాయ్‌లాండ్‌లోని పటాయా వెళుతూ ఇంధనం, విశ్రాంతి కోసం బెలుగా శంషాబాద్‌లో ల్యాండ్ అయింది. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద సరుకు రవాణా విమానాల్లో ఈ ఎయిర్‌బస్ బెలుగా విమానం(ఏ300–600 సూపర్ ట్రాన్స్పోర్టర్) ఒకటి. విమాన ఆకారం ఉబ్బెత్తు తలతో ఉండే బెలుగా రకం తిమింగలాలను పోలి ఉండటంతో ఆ పేరుతో ఖ్యాతిగాంచింది. రష్యన్ భాషలో బెలుగా అంటే తెల్లని అని అర్థం. ప్రపంచంలో ఇవి ఐదు మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో.. బెలుగా విమానం పొడవు 56.15 మీటర్లు, ఎత్తు 17.24 మీటర్లు, బరువు మోసుకెళ్లే సామర్థ్యం 47 వేల కేజీలు, బెలుగా విమానాల తయారీలో యూకే, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ ఏరోస్పేస్ కంపెనీలు పాలుపంచుకున్నాయి. కాగా, అతి పెద్ద కార్గో విమానాల్లో ఒకటైన అంటోనోవ్ ఏఎస్–225 మ్రియా కూడా ఇంధనం, విశ్రాంతి కోసం 2016, మే 13న శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అయితే రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మ్రియా విమానం ధ్వంసమైంది. మ్రియా అంటే రష్యన్ భాషలో కల అని అర్థం. ప్రస్తుతం మ్రియా లేకపోవడంతో కార్గోలో బెలుగానే అతిపెద్ద విమానంగా గుర్తిస్తున్నారు. -
ప్రపంచంలోనే తొలిసారిగా విద్యుత్‌తో నడిచే విమానం
ప్రపంచంలోనే తొలి విద్యుత్ విమాన సేవలు మరో రెండేళ్లలో ప్రారంభం కానున్నాయి. తొలి విడతలో ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ నుంచి ఎడిన్బర్గ్ వరకు ఈ విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. కాలుష్యానికి దారితీసే పెట్రో ఇంధనాల వాడుకను పూర్తిగా నిలిపివేయాలనే లక్ష్యంతోనే పూర్తి విద్యుత్ విమాన సేవలను ప్రారంభించేందుకు ‘ఎకోజెట్’ సంస్థ సన్నాహాలు చేస్తోంది. బ్రిటిష్ సంపన్నుడు డేల్ విన్స్ ఈ కంపెనీని నెలకొల్పారు. ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ వంటి పర్యావరణ అనుకూల కార్యక్రమాలకు భూరి విరాళాలు అందిస్తూ వస్తున్న డేల్ విన్స్, కర్బన ఉద్గారాలను విడుదల చేయని విమాన సేవలను అందించడానికి స్వయంగా రంగంలోకి దిగారు. ఈ విమాన సేవలు సౌతాంప్టన్–ఎడిన్‌బర్గ్‌ల మధ్య 2025 నుంచి ప్రారంభం కానున్నాయని విన్స్ ప్రకటించారు. ‘ఎకోజెట్’ రెండు రకాల విమానాల ద్వారా ఈ సేవలను అందించనుంది. పంతొమ్మిది సీట్ల సామర్థ్యం గల విమానాలు, డెబ్బయి సీట్ల సామర్థ్యం గల విమానాలు ఈ సేవల కోసం ‘ఎకోజెట్’ వాహనశ్రేణిలో కొలువుదీరనున్నాయి. ఈ విమానాల్లోని హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తవుతుంది. ఈ విద్యుత్తుతోనే విమానాలు నిరాటంకంగా రాకపోకలు సాగించగలుగుతాయి. ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా పాత విమానాలకు మరమ్మతులు చేసి, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్‌ను అమర్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నామని ‘ఎకోజెట్’ అధికారులు చెబుతున్నారు. ఈ విమానాల వల్ల పర్యావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాల పరిమాణం ఏడాదికి 90వేల టన్నుల వరకు తగ్గుతుందని వారు అంటున్నారు. -
సోనియా, రాహుల్ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రయాణిస్తున్న విమానం మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఎయిర్ పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. వారి విమానం భోపాల్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణ్ చారీ మిశ్రా పీటీఐ వార్తా సంస్థకు తెలియజేశారు. అయితే ఎయిర్‌ప్లేన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రతికూల వాతావరణమే కారణంగా తెలుస్తోంది. కాగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు బెంగళూరులో జరిగిన విపక్ష నేతల సమావేశంలో పాల్గొని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు తెలిసింది. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ విషయమై వివరాలు తెలుసుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శోభ ఓజా తెలిపారు. -
టేకాఫ్ కష్టమని 19 మంది ప్రయాణికులను దింపేసిన విమాన సిబ్బంది
మాడ్రిడ్: టేకాఫ్ తీసుకోవడానికి వీల్లేనంత ఎక్కువ బరువుందని 19 మంది ప్రయాణికులను విమానం నుంచి దించేశారు..! ఈ ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. స్పెయిన్‌లోని లాంజారోట్ నుంచి యూకేలోని లివర్‌పూల్‌కు ఈజీ జెట్‌కు చెందిన విమానం బుధవారం రాత్రి 9.45కు బయలుదేరాల్సి ఉంది. విమానంలో బరువు ఎక్కువగా ఉండటానికి తోడుగా రన్‌వే పొడవు తక్కువగా ఉండటం, అననుకూల వాతావరణ పరిస్థితులతో టేకాఫ్ కష్టంగా ఉందంటూ పైలట్ ప్రకటించారు. టేకాఫ్ తీసుకోవడం ప్రమాదకరమంటూ వారికి తెలిపారు. దీనికి ఏకైక పరిష్కారం బరువు కొద్దిగా తగ్గడమేనని వివరించారు. సుమారు 20 మంది ప్రయాణికులు స్వచ్ఛందంగా దిగిపోతే వారికి బహుమానంగా 500 పౌండ్లు ఇస్తామని ప్రకటించారు. తర్వాత విమానంలో పంపిస్తామని సర్దిచెప్పి 19 మంది ప్రయాణికులను విమాన సిబ్బంది కిందికి దించారు. దీంతో, రెండు గంటల ఆలస్యంగా విమానం బయలుదేరింది. చదవండి: వీడు హీరో అయితే.. ఏ మిషనైనా పాజిబుల్! -
సడెన్‌గా విమానం డోర్ ఓపెన్.. ప్రముఖ సింగర్ టీమ్‌కు తప్పిన ప్రమాదం
బ్రెసీలియా: ఇటీవలి కాలంలో విమానం గాల్లో ఉన్న సమయాల్లో ఎమర్జెన్సీ డోర్లు ఓపెన్ అవడం తరచుగా చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే బ్రెజిల్లో చోటుచేసుకుంది. ఇక, ఈ విమానంలో ఉన్న బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ సింగర్, సాంగ్ రైటర్‌తో పాటు వారి బ్యాండ్ బృందానికి ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఎన్హెచ్ఆర్ టాక్సీ ఏరియోకు చెందిన ఎంబ్రేయర్ -110 విమానం గాల్లో ఉన్న సమయంలో డోర్(కార్గో డోర్) తెరుచుకుంది. దీంతో, విమానంలో ఉన్న ప్రయాణికులందరూ ప్రాణాలను అర చేతుల్లో పెట్టుకుని ఎప్పుడేం జరుగుతుందో తెలియక భయంభయంగా కూర్చున్నారు. కాగా, ఈ విమానంలో బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ గాయకుడు, పాటల రచయిత టియెర్రీ తన బృందంతో కలిసి ఈ విమానంలో ప్రయాణించారు. అయితే, మారన్ హావోలోని సావో లూయిస్‌లో ప్రదర్శన అనంతరం టియెర్రీ, అతని బ్యాండ్ సభ్యులు ఈ విమానంలో ప్రయాణించారు. ఈ సమయంలో డోర్ ఓపెన్ కావడంతో వారంతా కంగారు పడ్డారు. వారి మ్యూజిక్ పరికరాలు చెడిపోతాయేమోనని టెన్షన్‌కు గురయ్యారు. అయితే, విమానం విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం, విమాన సంస్థకు చెందిన అధికారులు స్పందిస్తూ.. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పేర్నొన్నాడు అలాగే, ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టు స్పష్టం చేశారు. మరోవైపు.. ప్రయాణికులు, బ్యాండ్ సభ్యులందరూ సురక్షితంగా ఉన్నారని స్థానిక మీడియా పేర్కొంది. ఇక, డోర్ తెరుచుకున్న సమయంలో విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు దీన్నంతా వీడియో తీశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీగా ఉందని ఒకరు కామెంట్స్ చేయగా, భయకరంగా ఉందని మరో వ్యక్తి కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: విదేశీయులకు షాకిచ్చిన కువైట్.. 66 వేల డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు -
గాల్లో డబుల్ డెక్కర్: భలే డిజైన్ చేశారు.. ఫొటో వైరల్
డబుల్ డెక్కర్ బస్సులు, రైళ్లు చూశాం. కానీ డబుల్ డెక్కర్ విమానాల గురించి ఎప్పుడైనా విన్నారా? తాజాగా విమానంలో డబుల్ డెక్కర్ సీటు ఫొటో ఒకటి వైరల్ అయ్యింది. ఈ సరికొత్త సీటు డిజైన్‌పై ప్రయాణికుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అలెజాండ్రో నూనెజ్ విసెంట్ అనే 23 ఏళ్ల డిజైనర్ ఈ డబుల్ డెక్కర్ సీట్లను రూపొందించారు. ‘చైస్ లాంజ్’ ఎయిర్‌ప్లేన్ సీట్ ప్రోటోటైప్ ఫొటో మొదటగా 2022లో విడుదలైంది. జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగిన ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటీరియర్స్ ఎక్స్‌పోలో దీన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఈ డబుల్ డెక్కర్ సీట్లపై రెడిట్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒక్కో యూజర్ ఒక్కోలా స్పందించారు. ఈ మిశ్రమ స్పందనలపై డిజైనర్ నూనెజ్ విసెంట్ మాట్లాడుతూ డబుల్ డెక్కర్ సీటు స్థలాన్ని ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడుతుందని, విమానంలో ఖాళీ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని సీఎన్ఎన్ వార్తా సంస్థతో ఆయన పేర్కొన్నారు. The double-decker airplane seat is back https://t.co/CK2nnh12kC pic.twitter.com/OKqgpmxiCn — CNN (@CNN) June 9, 2023 -
కొత్త విమానాలకు కీలక మార్కెట్‌గా భారత్..
న్యూఢిల్లీ: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లకు భారత్ అత్యంత కీలక మార్కెట్‌గా మారనుందని బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ ఒక నివేదికలో పేర్కొంది. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రాంతీయ కనెక్టివిటీ స్కీము ఉడాన్‌తో విమాన ప్రయాణాలు చేసే మధ్య తరగతి వర్గాల సంఖ్య పెరుగుతోందని వివరించింది. దీనితో పాటు మరికొన్ని సానుకూల అంశాలు భారత్‌ను కొత్త విమానాలకు కీలక కేంద్రంగా మారుస్తున్నాయని పేర్కొంది. దేశీయంగా విమాన ప్రయాణాలకు సంబంధించి ప్రస్తుతం అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడో అతి పెద్ద ఏవియేషన్ మార్కెట్‌గా ఉంది. ప్యాసింజర్ ట్రాఫిక్ విషయంలో ప్రపంచంలోనే అత్యధికంగా వృద్ధి రేటు నమోదు చేస్తోంది. కొత్త విమానాలకు ఆర్డర్లివ్వడంలో అమెరికా తర్వాత భారతీయ విమానయాన సంస్థలు రెండో స్థానంలో ఉన్నాయి. బోయింగ్, ఎయిర్‌బస్ డెలివరీ చేసే వాటిల్లో 7 శాతం విమానాలను భారతీయ ఎయిర్‌లైన్స్ దక్కించుకుంటున్నాయి. మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ఇండిగో, ఆకాశ ఎయిర్ తదితర సంస్థలు పోటీపడనున్న నేపథ్యంలో విమానాల కొనుగోళ్ల నిర్ణయాలు ప్రాధాన్యతాంశంగా ఉండనున్నాయని బార్క్లేస్ తెలిపింది. దేశీయంగా తయారు చేసుకున్న కొమాక్ సీ919 విమానాలను చైనా పూర్తి స్థాయిలో వాడటం మొదలుపెడితే అక్కడి నుంచి ఆర్డర్లు తగ్గగలవని పేర్కొంది. అదే సమయంలో భారత మార్కెట్లో ఆర్డర్లు దక్కించుకుంటే సుదీర్ఘకాలం పాటు పని లభించగలదని వివరించింది. ఏటా 11 శాతం ట్రాఫిక్ వృద్ధి.. ‘అంతర్జాతీయ ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమ భారత మార్కెట్‌పై ప్రధానంగా దృష్టి పెట్టనున్నాయి. 2006–2019 మధ్య కాలంలో భారత్‌లో దేశీ ట్రాఫిక్ వార్షికంగా 11 శాతం వృద్ధి చెందింది. దీర్ఘకాలంలో అంతర్జాతీయ సగటుకన్నా 200 బేసిస్ పాయింట్లు అధికంగా ఉండవచ్చని అంచనా. 2009–22 మధ్య కాలంలో భారత ఎయిర్‌లైన్స్ 1,400 పైచిలుకు ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డర్లు ఇచ్చాయి‘ అని బార్క్లేస్ వివరించింది. జీటీఎఫ్, లీప్ ఇంజిన్లు బిగించిన వాటిల్లో (ఏ320నియో, మ్యాక్స్ ఏరోప్లేన్లు) 10 శాతం విమానాలకు భారత్ కేంద్రంగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ ఏరోస్పేస్ పరిశ్రమ ఆర్థిక పనితీరుకు కూడా భారత్ కీలకంగా ఉండనుందని వివరించింది. ఎయిర్‌బస్‌కు సానుకూలం.. భారత ఎయిర్‌లైన్స్ ఎక్కువగా చిన్న (నారో బాడీ) విమానాల వైపు మొగ్గు చూపుతున్నాయి కనుక బోయింగ్‌తో పోలిస్తే ఎయిర్‌బస్‌కు పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తోందని బార్క్లేస్ తెలిపింది. 2009 నుంచి చూస్తే దేశీ విమానయాన సంస్థలు ఇచ్చిన ఆర్డర్లలో 65 శాతం వాటా ఎయిర్‌బస్‌దే ఉన్నట్లు వివరించింది. మరోవైపు, డిఫెన్స్ విషయానికొస్తే 81.4 బిలియన్ డాలర్ల కేటాయింపులతో అమెరికా, చైనా, రష్యా తర్వాత భారత్ నాలుగో స్థానంలో ఉంది. సౌదీ అరేబియా తర్వాత అత్యధికంగా రక్షణ పరికరాలను దిగుమతి చేసుకుంటోంది.2018–22 మధ్య కాలంలో ప్రపంచ దేశాల మిలిటరీ పరికరాల దిగుమతుల్లో భారత్ వాటా 11 శాతంగా ఉంది. అటు చైనా తమ మిలిటరీపై వ్యయాలను పెంచుకుంటున్నందున డిఫెన్స్‌కు భారత్ కేటాయింపులు కూడా అధిక స్థాయుల్లోనే కొనసాగవచ్చని బార్క్లేస్ తెలిపింది. భారతీయ మిలిటరీ పరికరాల విశ్లేషణ బట్టి చూస్తే భారతీయ వైమానిక దళానికి మరిన్ని ఫైటర్ జెట్ల అవసరం ఉన్నట్లుగా తెలుస్తోందని వివరించింది. -
షాకింగ్.. భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్తాన్ విమానం.. 10 నిమిషాల పాటు..
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) విమానం భారత గగనతలంలోకి ప్రవేశించడం కలకలం రేపింది. ఈ విమానం భారత్‌లో దాదాపు 10 నిమిషాల పాటు ప్రయాణించి 141 కిలోమీటర్లు చక్కర్లు కొట్టినట్లు తెలుస్తోంది. మే 4న రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఓ మీడియా సంస్థ నివేదికలో వెల్లడించింది. పీకే248 అనే పీఐఏ విమానం మస్కట్ నుంచి తిరిగి పాకిస్తాన్‌కు మే4న రాత్రి 8 గంటల సమయంలో చేరుకుంది. అలామా ఇక్బాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే భారీ వర్షం కారణంగా విమానం ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదు. పైలట్ ల్యాండ్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో విమానాన్ని కొద్దిసేపు గాల్లో తిప్పాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పైలట్‌కు సూచించారు. అయితే భారీ వర్షం కారణంగా దారితప్పిన పైలట్ విమానాన్ని భారత గగనతలంలోకి తీసుకొచ్చాడు. ఈ సమయంలో గంటలకు 292 కిలీమీటర్ల వేగం, 13,500 అడుగల ఎత్తులో అది ప్రయాణించింది. బధానా పోలీస్ స్టేషన్ పరిధి గగనతలం మీదుగా భారత్‌లోకి వచ్చింది. భారత పంజాబ్‌లోని తరన్ సాహిబ్ , రసూల్పూర్ ప్రాంతాల్లో దాదాపు 140 కిలోమీటర్లు గాల్లో చక్కర్లు కొట్టింది. ఈ సమయంలో విమానాన్ని 20వేల అడుగులకుపైగా ఎత్తులో ఉంచాడు పైలట్. ఏడు నిమిషాల పాటు అటు ఇటు తిప్పాడు. ఆ తర్వాత భారత పంజాబ్‌లోని జాగియాన్ నూర్ మహమ్మద్ గ్రామం మీదుగా విమానం తిరిగి పాకిస్తాన్ చేరుకుంది. ఆ తర్వాత పాక్ పంజాబ్‌లోని డొనా మబ్బోకి, ఛాంట్, ధుప్సారి కాసుర్, ఘఠి కలంజార్ ప్రాంతాల్లో ప్రయాణించి తిరిగి మళ్లీ భారత గగనతలంలోకి వచ్చింది. మళ్లీ మూడు నిమిషాలు చక్కర్లు కొట్టిన అనంతరం భారత పంజాబ్‌లోని లఖా సింఘ్వాలా హిథార్ గ్రామం మీదుగా తిరిగి పాక్ చేరుకుంది. ఈ సమయంలో విమానం 23,000 ఎత్తులో ప్రయాణించింది. అయితే ఈ ఘటనకు భారత అధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. చదవండి: టెక్సాస్ కాల్పుల ఘటన.. హైదరాబాద్ యువతి మృతి -
నారీ శక్తితో గణతంత్రం వచ్చే ఏడాది మహిళలతోనే రిపబ్లిక్ డే పరేడ్
న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవ పరేడ్ అంటే మన దేశ త్రివిధ బలగాల శక్తిని ప్రపంచానికి చాటడమే. యుద్ధ శకటాలు, విమానాల విన్యాసాలు, కొత్త ఆయుధాల ప్రదర్శన ఇలా పరేడ్ అంటే కదనరంగంలో మన సత్తా ఎంతో ప్రదర్శించడమే. అలాంటి పరేడ్‌ను వచ్చే ఏడాది మహిళా శక్తితో నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నింగి నేలా నీరు అంతా మాదే అంటూ నినదిస్తున్న మహిళల భాగస్వామ్యం ఇటీవల కాలంలో త్రివిధ బలగాల్లో పెరుగుతోంది. యుద్ధభూమిలోకి అడుగు పెట్టడానికి కూడా మహిళలు సై అంటున్నారు. కేంద్ర బలగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని మరింతగా ప్రోత్సహించడం కోసం 2024 జనవరి 26న కర్తవ్యపథ్‌లో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్‌ను కేవలం మహిళలతో నిర్వహించాలని రక్షణ శాఖ ఫిబ్రవరిలో ప్రతిపాదించింది. దీనిపై ఫిబ్రవరిలో రక్షణ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో త్రివిధ బలగాల అధిపతులతో ఒక సమావేశం కూడా జరిగిందని ఆదివారం రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. త్రివిధ బలగాల్లోని మహిళా అధికారులే రిపబ్లిక్ డే కవాతుని నడిపిస్తారని ఆ సమావేశం నిర్ణయించింది. ఈ విషయాన్ని వివిధ ప్రభుత్వ శాఖలకి కూడా సమాచారం అందించారు. రక్షణ , హోం సంస్కృతి పట్టణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా దీనిని ఎలా అమలు చేయాలో చర్చిస్తున్నట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది రిపబ్లిక్ డేలో నారీ శక్తి థీమ్‌ను ప్రధానంగా చేశారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట, త్రిపుర రాష్ట్రాలు నారీశక్తి థీమ్‌తో శకటాలు రూపొందించాయి. ఇక వచ్చే ఏడాది అందరూ మహిళలతోనే పరేడ్ సాగనుంది. -
యుద్ధ విమానం స్వదేశీ గర్జన!
సాక్షి, విశాఖపట్నం: రక్షణ పరిశోధన సాంకేతిక రంగంలోకి ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు డీఆర్డీవో చైర్మన్ సమీర్ వి.కామత్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పేస్ పాలసీలో భాగంగా రక్షణ రంగంలో ప్రధానంగా స్పేస్ టెక్‌లో ప్రైవేట్ పరిశ్రమలు, పరిశోధన సంస్థలకు అవకాశాలు కల్పించినట్లు వివరించారు. విశాఖలో ని నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లేబొరేటరీ (ఎన్ఎస్టీఎల్)లో గురువారం ప్రారంభమైన కండిషన్ మానిటరింగ్ జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో పలు అంశాలపై మాట్లాడారు. అంతరిక్ష పరిశోధనలపై దృష్టి స్పేస్ పాలసీలో భాగంగా పరిశోధనలపై దృష్టి సారించాం. ముఖ్యంగా రక్షణ శాఖతో పాటు అంతరిక్ష పరిశోధనలపై దృష్టి పెట్టాం. రాకెట్ లాంచింగ్, శాటిలైట్స్ అభివృద్ధి.. ఇలా ఎలాంటి హద్దులు లేకుండా ప్రైవేట్ సంస్థలు ముందుకు రావచ్చు. దీనిద్వారా అగ్రదేశాలతో పోటీ పడే స్థాయికి వేగంగా చేరుకుంటాం. అంతరిక్ష ఆధారిత నిఘా, అంతరిక్ష పరిస్థితులపై మన అవగాహన సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయి. అంకుర సంస్థలకు ప్రోత్సాహం రక్షణ రంగంలో స్టార్టప్స్‌ని ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్ సిస్టమ్, టెక్నాలజీపై పని చేస్తున్న స్టార్టప్స్‌కు ప్రాధాన్యమిస్తున్నాం. పరిశోధన అభివృద్ధి(ఆర్ అండ్ డీ) బడ్జెట్లో 25 శాతం వరకూ పరిశ్రమలు, స్టార్టప్స్, విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం శుభ పరిణామం. అందుకే స్టార్టప్స్, ఎంఎస్ఎంఈలకు అవకాశాలు కల్పిస్తున్నాం. 17 వేల అడుగుల ఎత్తు వరకు ‘యూఏవీ’ మానవ రహిత వైమానిక వాహనం (యూఏవీ)పై ప్రధానంగా దృష్టి సారించాం. ఇందుకోసం గైడెన్స్ కిట్, సీట్ ఎజెక్షన్ సిస్టమ్, పైరోటెక్నిక్ కాట్రిడ్స్ అభివృద్ధి చేసే పనిలో ఉన్నాం. ‘యూఏవీ తపస్’ కోసం 180 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన ఇంజన్‌ను దేశీయంగా అభివృద్ధి చేశాం. దీని ద్వారా యూఏవీ 17 వేల అడుగుల ఎత్తువరకూ ఎగరగలదు. 2028లో తొలి దేశీయ యుద్ధ విమానం ఎగరనుంది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన సాయుధ బలగాల్లో చాలా వ్యవస్థలు స్వదేశీ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోనున్నాయి. ఇందులో భాగంగా ఎల్సీఏ ఎంకే–2 ఇండక్షన్కు సిద్ధమవుతున్నాం. జీఈఎఫ్ 414 ఇంజన్‌తో కూడిన ఏఎంసీఏ (అడ్వాన్స్డ్ మీడియమ్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) ఫేజ్–1 యుద్ధ విమానాన్ని 2028లో ఎగురవేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నాం. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతోంది. దీనికి సంబంధించి అనుమతుల కోసం వేచి చూస్తున్నాం. ఎలైట్ క్లబ్లో చేరడం గర్వకారణం ఇటీవల ‘సీ బేస్డ్ ఎండో అట్మాస్ఫియరిక్ ఇంటర్‌సెప్టర్ మిసైల్’ తొలి వి మాన ప్రయోగం విజయవంతం కావడంతో రక్షణ సామర్థ్యాల విషయంలో మన దేశం చరిత్రాత్మక మైలురాయిని అధిగవిుంచింది. నేవల్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ (బీఎండీ) సామర్థ్యంలో అగ్రదేశాల సరసన నిలిచి ఎలైట్ క్లబ్ ఆఫ్ నేషన్స్‌లో చేరడం గర్వకారణం. యుద్ధనౌకలు, ఉపరితలం నుంచి బాలిస్టిక్ క్షిపణులను నిలువరించే సామర్థ్యాన్ని భారత్ అభివృద్ధి చేసింది. అంతకుముందే భూ ఆధారిత క్షిపణి ప్రయోగాన్ని విజ యవంతంగా నిర్వహించాం. ఈ జంట విజయాలతో సుదూర అణు క్షిపణులు, హైపర్ సోనిక్ మిసైల్స్, గ్లైడర్స్, శత్రు విమానాల్ని అడ్డుకోగల సామర్థ్యాన్ని మన దేశం సొంతం చేసుకుంది. -
గాల్లో విమానంలో అనూహ్య ఘటన
బెంగళూరు: మద్యం మత్తులో విమానం అత్యవసర ద్వారం తెరిచేందుకు యత్నించిన ఓ ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ నుంచి బెంగళూరు వస్తున్న ఇండిగో విమానంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. యూపీలోని కాన్పూర్‌కు చెందిన ప్రతీక్(30) ఇండిగోకు చెందిన 6ఈ308 ఢిల్లీ–బెంగళూరు విమానం 18ఎఫ్ సీట్లో కూర్చున్నాడు. విమానం బయలుదేరిన కొద్దిసేపటికి మత్తులో ఉన్న ప్రతీక్ తోటి ప్రయాణికుల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగక అత్యవసర ద్వారం తెరిచేందుకు రాగా సిబ్బంది అతడిని వారించారు. వినిపించుకోకపోవడంతో అతడ్ని బలవంతంగా కూర్చోబెట్టారు. విమానం బెంగళూరుకు చేరుకున్నాక పైలట్ అతడిని సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించారని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతీక్‌పై ఐపీసీ సెక్షన్లు 290, 336లతోపాటు ఎయిర్‌క్రాఫ్ట్ చట్టంలోని 11(ఏ) కింద కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రూ.6,828 కోట్లతో 70 శిక్షణ విమానాలు
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం(ఐఏఎఫ్) కోసం రూ.6,828 కోట్లతో 70 హెచ్‌టీటీ–40 బేసిక్ శిక్షణ విమానాల కోనుగోలుకు రంగం సిద్ధమైంది. ఈ విమానాలను కొనుగోలు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్) బుధవారం ఆమోదం తెలియజేసింది. రానున్న ఆరేళ్లలో ఈ విమానాలు ఐఏఎఫ్‌కు అందనున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విట్టర్లో వెల్లడించారు. హెచ్‌టీటీ–40 విమానాలను ప్రభుత్వ రంగంలోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఉత్పత్తి చేయనుందని భారత రక్షణ శాఖ తెలియజేసింది. తక్కువ వేగంతో నడిచే ఈ విమానాలతో వైమానిక దళం సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇవ్వొచ్చని పేర్కొంది. హెచ్‌టీటీ–40 విమానాల తయారీలో హెచ్ఏఎల్ సంస్థ ప్రైవేట్ పరిశ్రమలను కూడా భాగస్వాములను చేయనుంది. దీనివల్ల 100కుపైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో 1,500 మందికి ప్రత్యక్షంగా, 3,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. -
ఆకాశాన్ని ఖాళీ చేయిస్తున్న రష్యా.. విమానాలన్నీ వెనక్కి.. ఏం జరుగుతోంది?
మాస్కో: రష్యా ఆకాశమార్గాన్ని ఖాళీ చేయిస్తోంది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని పుల్కోవో విమానాశ్రాయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. ఇక్కడకు చేరుకోవాల్సిన విమానాలన్నింటినీ తిరిగి వెనక్కి పంపింది. ఫ్లైట్ రాడార్ వెబ్సైట్ దీన్ని వెల్లడించింది. దీంతో రష్యా ఏం చేయబోతుందని సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే సెయింట్‌పీటర్స్‌బర్గ్ గగనతలంలో గుర్తు తెలియని వస్తువు (అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్- UFO)ను గుర్తించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీన్ని గమనించిన తర్వాతే ప్రభుత్వం అప్రమత్తమై ఆకాశమార్గాన్ని ఖాళీ చేయించినట్లు సమాచారం. ఈ విమానాశ్రాయానికి చేరుకోవాల్సిన విమానాలనకు వెనక్కి పంపించి.. యుద్ధ విమానాలకు రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వస్తువు గురించి తెలుసుకునేందుకు రెండు యుద్ధ విమానాలను రష్యా గగనతలంలోకి పంపినట్లు అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి. ఆ వస్తువు ఏంటో కనిపెట్టేందుకు దాదాపు 100 యుద్ధవిమానాలను సెయింట్‌పీటర్స్‌బర్గ్ విమానాశ్రయంలో మోహరించినట్ల సమాచారం. అయితే ఇటీవలి కాలంలో గుర్తు తెలియని వస్తువులు గగనతలంలో కన్పించడం కలకలం రేపడం తెలిసిందే. చైనాకు చెందిన భారీ బెలూన్లు అమెరికా ఆకాశంలో నిఘా వహించడం చర్చనీయాంశమైంది. వీటిని అగ్రరాజ్యం కూల్చివేసింది. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా ఆకాశంలో ఇప్పుడు యూఎఫ్ఓ కన్పించడం అనుమానాలకు తావిస్తోంది. ఇది ఏలియన్ల పనా? లేక ఇతర దేశాల పనా? అనే చర్చ కూడా మొదలైంది. పుతిన్ సొంత నగరం.. అయితే రష్యా గగనతలంలో కన్పించింది ఓ భారీ డ్రోన్ అని అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇది నాటో దేశాల పని అయ్యి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ సొంతనగరం అయిన సెయింట్ పీటర్స్బర్గ్కు ఈ డ్రోన్ దగ్గరగా ఉండటంతో అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యగా యుద్ధ విమానాలను మోహరించారు. ఈ ఎయిర్‌పోర్టుకు 180 కిలోమీటర్ల దూరంలోనే భారీ డ్రోన్ కన్పించింది. చదవండి: అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి! -
నాసా విద్యుత్ విమానం వచ్చేస్తోంది
కేంబ్రిడ్జ్: గగనతలంలో భారీ స్థాయిలో కర్భన ఉద్గారాలను వెదజల్లే చిన్న విమానాలకు చరమగీతం పాడేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా నడుం బిగించింది. వాయుకాలుష్యం లేని అధునాతన విద్యుత్ విమానాన్ని సిద్ధంచేస్తోంది. ఈ ప్రయోగాత్మక విమానానికి ఎక్స్–57 అని నామకరణం చేసింది. ఈ ఏడాదే ఈ బుల్లి విమానం గగనతల అరంగేట్రం చేయనుంది. దీనిని 14 ప్రొపెల్లర్లను అమర్చారు. ఇటలీ తయారీ టెక్నామ్ పీ2006టీ నాలుగు సీట్ల విమానానికి ఆధునికత జోడించి లిథియం అయాన్ బ్యాటరీలతో పనిచేసేలా కొత్త ఎలక్ట్రిక్ ఏరోప్లేన్‌ను సిద్ధంచేస్తున్నారు. సాధారణంగా ఉండే రెండు రెక్కలకే అటు నుంచి ఇటు చివరిదాకా సమ దూరంలో ఎక్కువ బ్యాటరీలు, చిన్న మోటార్ల కలయితో ప్రొపెల్లర్లను ప్రయోగాత్మక డిజైన్‌లో అమర్చడం విశేషం. ప్రయాణసమయంలో ప్రొపెల్లర్‌తో పనిలేనపుడు వెంటనే దాని బ్లేడ్లు వెనక్కి ముడుచుకుంటాయి. దీంతో వేగం తగ్గే ప్రసక్తే లేదు. కొత్త డిజైన్ ప్రొపెల్లర్లతో శబ్దకాలుష్యం తక్కువ. ఎక్కువ సాంద్రత ఉండే గాలిలోనూ అత్యంత వేగంగా దూసుకెళ్లేలా 11 బ్లేడ్లతో ప్రొపెలర్లను రీడిజైన్ చేశారు. ప్రొపెల్లర్లతో జనించే అత్యంత అధిక శక్తి కారణంగా ఈ విమానాలకు పొడవాటి రన్‌వేలతో పనిలేదు. అత్యల్ప దూరాలకు వెళ్లగానే గాల్లోకి దూసుకెళ్లగలవు. ప్రస్తుతానికి 200 కిలోమీటర్లలోపు, గంటలోపు ప్రయాణాల కేటగిరీలో దీనిని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. -
ఫూల్స్‌ని చేయడం ఆపేయండి! వీడియో కాల్లో పుతిన్ ఫైర్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వీడియో కాల్లో ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్‌పై సీరియస్ అయ్యారు. దేశ పౌర సైనిక విమాన ఒప్పందం విషయంలో జాప్యం చేస్తున్నందుకు మంటురోవ్‌పై పుతిన్ మాటల తుటాలు పేల్చారు. ఈ మేరకు బుధవారం రష్యా ప్రభుత్వ టెలివిజన్ ప్రసారంలో.. ప్రభుత్వాధికారల సమావేశంలో జరిగిన ఒక వీడియో కాల్లో పుతిన్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి, ఉప ప్రధాని మంటురోవ్‌పై విరుచుకుపడ్డారు. 2023 ఏడాదికి సంబంధించి పౌర సైనిక విమాన ఒప్పందాలను ఒక నెలలోపు పూర్తి చేయాలని గట్టిగా హెచ్చరించారు. వాస్తవానికి రష్యా విమానాయన సంస్థ ఏరోప్లాట్తో దాదాపు 175 బిలియన్ల రూబిళ్లు(రూ. 21 వేల కోట్లు) విలువైన ఒప్పందాలు ఏర్పాటు చేసే బాధ్యత మంటురోవ్‌పై ఉంది. ఐతే సైనిక విమాన కాంట్రాక్ట్‌లు ఏవి సిద్ధంగా లేకపోవడంతోనే పుతిన్ తీవ్ర అసహనానికి గురైనట్లు అధికారికి వర్గాల సమాచారం. దీనికి మీరు చాలా వ్యవధి తీసుకుంటున్నారంటూ తిట్టిపోశారు. సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని గట్టిగా నొక్కిచెప్పారు. అయినా మీరు ఇప్పటివరకు ఏ ఎంటర్‌ప్రైజెస్‌తో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదన్న విషయం తనకు తెలసునంటూ సీరియస్ అయ్యారు. ఒకవేళ ఒప్పందాలు పూర్తి అయితే గనుక ఎప్పుడూ సంతకాలు చేశారో చెప్పగలరా! అని గట్టిగా నిలదీశారు. ముందు మీరు అందర్నీ ఫూల్స్‌ని చేయడం ఆపేయండి అంటూ ఉపప్రధాని మంటురోవ్కి గట్టిగా చురకలంటించారు. బాగా ఉత్తమంగా ప్రయత్నించాలని చూడొద్దు, ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని సాధ్యమైనంత తొందరగా.. కేవలం ఒకనెలలోపే ఈ ఒప్పందాలను పూర్తి చేసేలా ప్రయత్నించండి అంటూ పుతిన్ డిప్యూటి ప్రధాన మంత్రి మంటురోవ్కి గడువు కూడా ఇచ్చారు. దీనికి ఉప ప్రధాని మంటూరోవ్ పుతిన్‌కి సమాధానం ఇస్తూ..అందుకు సంబంధించిన ఆర్డర్లు సిద్ధంగానే ఉన్నాయని, తొందరగా పూర్తి చేసేందుకు తనవంతుగా ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఐతే రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాత్రం అధ్యక్షుడి పుతిన్‌కి మంటురోవ్ పనితీరుపై ఎలాంటి ఫిర్యాదుల లేవని క్రెమ్లిన్ మీడియాకి చెప్పాడం గమనార్హం. Russian aviation industry didn't receive a single contract to produce a passenger plane in 2022. pic.twitter.com/9xwHYTBC3X — Anton Gerashchenko (@Gerashchenko_en) January 11, 2023 (చదవండి: క్రిమియాకు ఎందుకంత క్రేజ్? ) -
అమెరికా విమానాన్ని ఢీ కొట్టబోయిన చైనా యుద్ధ విమానం
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంపై అమెరికా, చైనా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. అమెరికా నిఘా విమానాన్ని చైనాకు చెందిన యుద్ధ విమానం దక్షిణ చైనా సముద్ర జలాలపై దాదాపుగా ఢీ కొట్టబోయింది. చైనా జెట్ అత్యంత ప్రమాదకరంగా దూసుకు రావడంతో అమెరికా నిఘా విమానం పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ముప్పుని తప్పించారు. ఇది డిసెంబర్ 21న జరిగిందని అమెరికా ఇండో ఫసిఫిక్ కమాండ్ వెల్లడించింది. ‘‘అమెరికా వైమానిక దళానికి చెందిన ఆర్సీ–135 దక్షిణ చైనా సముద్రంపై ప్రయాణిస్తుండగా చైనా జే–11 ఫైటర్ జెట్ కేవలం 6 మీటర్ల (20 అడుగులు) దూరంలోకి వచ్చింది. దాదాపుగా ఢీకొట్టినంత పనయింది. దక్షిణ చైనా సముద్రంపై అంతర్జాతీయ గగనతలంలో మేం యథావిధిగా చట్టబద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటే చైనా ఇలా యుద్ధ విమానాలతో సవాల్ విసురుతోంది’’ అంటూ నిందించింది. 2001లో చైనా చేసిన ఇలాంటి పని వల్ల ఆ దేశ విమానం కుప్పకూలి పైలట్ దుర్మరణం పాలయ్యాడని గుర్తు చేసింది. దక్షిణ చైనా సముద్రంపై చైనాకు ఎలాంటి హక్కు లేదని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చినా డ్రాగన్ దేశం వెనక్కి తగ్గడం లేదు. అక్కడ అమెరికా యుద్ధ విమానాలను, నౌకలను మోహరిస్తూ విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహించడం దానికి మింగుడు పడడం లేదు. అమెరికా తన నిఘా కార్యకలాపాలతో చైనాకు పెనుముప్పుగా మారిందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ ఆరోపించారు. దక్షిణ చైనా సముద్రం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి చర్యలైనా చేపడతామని స్పష్టం చేశారు. -
ఎయిర్ ఇండియా మరో భారీ కొనుగోళ్లు..200 బోయింగ్ విమానాలకు ఆర్డర్?
ప్రముఖ దేశీయ ఏవియేషన్ దిగ్గజం ఎయిర్ ఇండియా..అమెరికా విమానాల తయారీ సంస్థ బోయింగ్ నుంచి 200 విమానాలు కొనుగోలు చేసేలా ఆర్డర్ పెట్టినట్లు సమాచారం. వాటిలో బోయింగ్ 737 మాక్స్ జెట్ విమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరు సంస్థల మధ్య కొనుగోలు చర్చలు జరుగుతుండగా..త్వరలో వాటికి ముగింపు పలకునున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఎయిర్ ఇండియాతో విమానాల కొనుగోలు ఒప్పందంపై బోయింగ్ అధికార ప్రతినిధి నిరాకరించారు. టాటా సన్స్ ఎయిరిండియా ప్రతినిధులు స్పందించలేదు. కాగా, అంతర్జాతీయ రూట్లలో బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ జెట్ విమానాలు, ఎయిర్ బస్ ఎస్ఈ ఏ350 విమానాల కొనుగోలుపై ఎయిర్ ఇండియా దృష్టి సారించింది. బోయింగ్ 777 విమానాలను లీజ్‌కు తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. -
ఎలక్ట్రిక్ విమానం వచ్చేసింది
-
Alice: ప్రపంచంలో తొలి ఎలక్ట్రిక్ విమానం ఎగిరింది
ఎలక్ట్రిక్ విమానాల విభాగంలో సంచలనం నమోదైంది. ‘ఆలిస్’ అనే తొలి ఎలక్ట్రిక్ విమానం గగన వీధుల్లో విహరించింది. కొన్ని నిమిషాల తర్వాత నిర్ధేశించిన ప్రదేశానికి చేరింది. ప్రపంచ దేశాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ విప్లవం జోరందుకుంది. పర్యావరణ పరిరక్షణ, ఖర్చు తగ్గించుకోవడం, మారుతున్న కొనుగోలు దారులు, ప్రయాణికుల అభిరుచులకు అనుగుణంగా ఆటోమొబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లు, బైకులను తయారు చేస్తున్నాయి. ఇప్పుడు ఆటోమొబైల్ రంగంతో పాటు ఏవియేషన్ రంగానికి చెందిన సంస్థలు సైతం ఎలక్ట్రిక్ విమానాల్ని తయారు చేసేందుకు మొగ్గుచూపుతున్నాయి. తాజాగా ఇజ్రాయిల్‌కు చెందిన ఏవియేషన్ క్ట్రాఫ్ట్ సంస్థ ప్రపంచంలోని తొలి ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ‘ఆలిస్’ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ విమానానికి ట్రయల్స్ నిర్వహించింది. టెస్ట్ రన్లో 8 నిమిషాల పాటు ప్రయాణించింది. ఆ తర్వాత అమెరికా, వాషింగ్టన్‌లోని గ్రాంట్ కౌంటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (MWH)లో సక్సెస్ ఫుల్‌గా ల్యాండ్ అవ్వడంపై ఏవియేషన్ రంగానికి చెందిన నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆలిస్ ప్రత్యేకతలు ఎలక్ట్రిక్ విమానం ఆలిస్‌లో 9 మంది ప్రయాణించవచ్చు. కనిష్ట వేగం 260 kats (Knots True Airspeed) తో గంటకు 480 కేఎంపీఎహెచ్ వేగాన్ని చేరుకోగలదు. ఇది 250 నాటికల్ మైళ్ళు (400 కి.మీ) వరకు పరిధిని కలిగి ఉండి..సుమారు రెండు గంటల వరకు గాలిలో ఉండగలదు. ఈ విమానం గరిష్టంగా 2,500 పౌండ్ల (సుమారు 1,100 కిలోలు) పేలోడ్ తో ఎగరగలదు. కాస్త భిన్నంగా సాధారణ విమానాల కంటే ఆలిస్‌ను భిన్నంగా తయారు చేశారు. విమానం ముందుకు వెళ్లడానికి ఉపయోగపడే ప్రొపెల్లర్స్ ఇందులో మూడు ఉంటాయి. ఒక ప్రొపెల్లర్ విమానం వెనక భాగంలో ఉంటే, మిగతా రెండు, చెరో రెక్కకు అమరి, విమానం ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి. ఇదో చరిత్ర ఈ సందర్భంగా ఏవియేషన్ ఎయిర్ క్ట్రాఫ్ట్ ప్రెసిండెంట్, సీఈవో గ్రెగరీ డేవిస్ మాట్లాడుతూ.. ఏవియేషన్ రంగంలోనే ఇదొక హిస్టరీ. మేం పిస్టన్ ఇంజిన్ నుండి టర్బైన్ ఇంజిన్ కు వెళ్ళినప్పటి నుండి విమానంలో ప్రొపల్షన్ టెక్నాలజీ మార్పును చూడలేదు. 1950వ దశకంలో ఇలాంటి కొత్త టెక్నాలజీని మీరు చివరిసారిగా చూశారు' అని పేర్కొన్నారు. -
చినూక్ హెలికాప్టర్లను అర్థాంతరంగా నిలిపేసిన అమెరికా.. భారత్ ఆందోళన
వాషింగ్టన్: చినూక్ హెలికాప్టర్ల సేవలను అర్థాంతరంగా నిలిపివేసింది అమెరికా సైన్యం. ఇంజిన్‌లో మంటలు చెలరేగే ప్రమాదముందని ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్క చినూక్ హెలికాప్టర్ కూడా నింగిలోకి ఎగరకుండా నేలకే పరిమితమయ్యాయి. అయితే అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న చినూక్ విమానాలను భారత వాయుసేన విరివిగా వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో వీటి సేవలను నిలిపివేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీని గురించి వివరణ ఇవ్వాలని అమెరికాకు లేఖ రాసింది. 70 చినూక్ హెలికాప్టర్లను పరిశీలించిన తర్వాత అందులోని ఓ భాగం వల్ల ఇంజిన్‌లో మంటలు సంభవించే ముప్పు ఉందని అమెరికా ఆర్మీ మెటిరీయల్ కమాండ్ సూచించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా వీటి సేవలను నిలిపివేశారు అధికారులు. గతంలో పలుమార్లు ఈ హెలికాప్టర్ ఇంజిన్ నుంచి మంటలు వచ్చి చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి. కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. చినూక్ హెలికాప్టర్లను లాజిస్టిక్ సేవలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వందల టన్నుల బరువును ఇవి మోయగలవు. వీటిని తాత్కాలికంగా నిలిపివేసిన తరుణంతో అమెరికా సైన్యానికి వస్తు రవాణాలో సవాళ్లు ఎదరుయ్యే పరిస్థితి కన్పిస్తోంది. ఈ ఆంక్షలు ఎప్పటివరకు అమలులో ఉంటాయి అనే విషయంపై కూడా స్పష్టత లేదు. చదవండి: ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలికిన సోవియట్ యూనియన్ నేత మృతి -
అలారంలోనే సాంకేతిక లోపం.. హడలిపోయిన ప్రయాణికులు
కొయంబత్తూర్: విమానంలో ఏదైనా సాంకేతిక లోపం ఉంటే ముందుగా అలారం మ్రోగడం సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అటువంటిది అలారంలోనే సాంకేతిక సమస్య తలెత్తి అది మ్రోగితే ఇక అంతే విమాన సిబ్బందిలో, ప్రయాణికుల్లో ఒకటే టెన్షన్ మొదలవుతుంది. విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యే వరకూ ఏం జరుగుతుందో అనే ఒకటే భయం ఉంటుంది. అలారంలో సాంకేతిక సమస్య తలెత్తి అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేయాల్సిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి 92 మంది ప్రయాణికులతో బయల్దేరిన గో ఫస్ట్ విమానాన్ని తమిళనాడులోని కొయంబత్తూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. కొయంబత్తూర్‌లో ఎయిర్పోర్ట్ అధికారులు పర్మిషన్ తీసుకుని ల్యాండ్ చేయాల్సి వచ్చింది. విమానం ల్యాండ్ అయ్యే క్రమంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. అప్పటికే ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకుని ఉన్నారు. ఆ తర్వాత విమానాన్ని ఇంజనీర్లు తనిఖీ చేయగా ఎటువంటి సమస్య లేదని తేల్చారు. కాగా, అలారం ఎందుకు మోగింది అంటే అందులో ఏదో సాంకేతిక సమస్య రావడంతో అలా జరిగిందని ఇంజనీర్లు స్పష్టం చేశారు. విమానంలో ఎటువంటి ఇబ్బంది లేదని, అలారంలో ప్రాబ్లం వల్లే ల్యాండ్ చేయాల్సిన అవసరం వచ్చిందని ఎయిర్పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు. విమానంలో ఉండే ట్విన్ ఇంజన్స్ ఓవర్ హీట్‌కు గురైనప్పుడు అలారం మ్రోగడంతో అలర్ట్ అవుతారు విమాన సిబ్బంది. కానీ ఇక్కడ విమానంలో ఎటువంటి సమస్య లేకుండానే అలారం మ్రోగడం ఏంటా అనేది సదరు ఇంజనీర్లకే తెలియాలి. గతవారం గో ఫస్ట్ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే పక్షి తాకడంతో విమానాన్ని తిరిగి అహ్మదాబాద్‌కు రప్పించిన సంగతి తెలిసిందే. -
‘చైనా పదే పదే ఇలా ఎందుకు చేస్తుందో చెప్పలేను’
Chinese aircraft breached the Indian perceived LAC: భారత్-చైనా మధ్య 16వ రౌండ్ అత్యున్నత స్థాయి సైనిక చర్చలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి మాట్లాడుతూ....వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) అంతటా గగనతలంలో వైమానిక దళాలు నిరంతరం పర్యవేక్షిస్తాయని చెప్పారు. ఏదైనా చైనా విమానం భారత గగనతలానికి కొంచెం దగ్గరగా వచ్చినట్లు గుర్తించిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఐతే జూన్ చివరి వారంలో ఒక చైనీస్ విమానం భారత్ వాస్తవ నియంత్రణ రేఖను దాటి కొన్ని నిమిషాలపాటు ఘర్షణ ప్రాంతాల మీదుగా ఎగిరిందని తెలిపారు. భారత్ రాడార్ సాయంతో ఆ యుద్ధ విమానాన్ని గుర్తించామని ఆ విమానాన్ని అడ్డుకున్నట్లు కూడా వివరించారు. చైనా విమానాలు వాస్తవ నియంత్రణ రేఖ వద్దకు వచ్చినప్పుడల్లా.. తమ వైమానిక కార్యకలాపాలను అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఐతే చైనీయుల ఇలా పదేపదే ఎందుకు చేస్తున్నారనే విషయంపై సరైన వివరణను ఇవ్వలేనని చౌదరి అన్నారు. ఈ క్రమంలోనే తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఘర్షణ ప్రాంతాల్లో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించే రీత్యా ఈ 16వ రౌండ్ అత్యున్నత స్థాయి సైనిక చర్చలు జరుగుతున్నాయి అని చెప్పారు. ఈ చర్చలు భారత్ వాస్తవాధీన రేఖ వైపున ఉన్న చుషుల్ మోల్డో ప్రాంతంలో ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యాయని తెలిపారు. గతంలో భారత సైన్యం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) మధ్య 15వ రౌండ్ చర్చలు మార్చి 11న దాదాపు 13 గంటల పాటు జరిగింది. ఐతే ఈ చర్చలు ఫలించలేదు. ఈ మేరకు ప్రభుత్వం చేపట్టిన అగ్నిపథ్ పథకం గురించి కూడా ఐఎఎఫ్ చీఫ్ మాట్లాడారు. దీనికి సంబంధించి దాదాపు 7.5 లక్షల దరఖాస్తులను స్వీకరించామన్నారు. ఇది సాయుధ దళాల్లో చేరేందుకు యువతలో ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది. డిసెంబర్లో శిక్షణ ప్రారంభించేలా.. ఎంపిక ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడం ఒక పెద్ద సవాలు అని చెప్పారు. పైగా ఈ ఏడాది ఎయిర్‌ఫోర్స్ డే పరేడ్‌ను చండీగఢ్‌లో నిర్వహించనున్నట్లు చౌదరి తెలిపారు. (చదవండి: ప్రజలకు తక్షణ ఉపశమన కార్యక్రమాలు అందించాలి) -
ఏరోస్పేస్ వ్యాలీగా హైదరాబాద్
శంషాబాద్: టెక్నాలజీ హబ్‌గా మారిన హైదరాబాద్ ఏరోస్పేస్ వ్యాలీగా కూడా ఎదుగుతోందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. నూతన పారిశ్రామిక విధానంతో పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర సర్కారు పెద్దపీట వేస్తోంద న్నారు. గురువారం జీఎంఆర్ హైదరాబాద్ ఏరోస్పేస్ పార్క్‌లో ఫ్రాన్స్‌కు చెందిన విమాన రంగ ఉత్పత్తుల సంస్థ శాఫ్రాన్ ఎలక్ట్రికల్ అండ్ పవర్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ ఫెసిలిటీ కేంద్రాలను ఆయన ప్రారంభించారు. వైమానిక రంగంలోని నిర్వహణ, మరమ్మతుల రంగంలో కేవలం దేశంలోనే కాకుండా మధ్యప్రాచ్య దేశాలకు హైదరా బాద్ కేంద్ర బిందువుగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. శాఫ్రాన్ సంస్థ ప్రారంభించ బోయే నిర్వహణ, మరమ్మతుల కేంద్రం (ఎంఆర్ఓ) అంతర్జాతీయంగా హైదరాబాద్‌ను మరో స్థానానికి తీసుకెళ్తుందని కేటీఆర్ చెప్పారు. విమాన ఇంజన్లకు వైర్ హార్నెస్‌లను శాఫ్రాన్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తుంది. అలాగే, కీలకమైన లీప్ ఇంజన్ల కోసం క్లిష్టమైన ఏరో ఇంజన్ భాగాలను శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ ఫ్యాక్టరీ తయారు చేస్తుంది. ఫ్రాన్స్‌కు నేరుగా విమానాలు నడవాలి రాష్ట్రంలో ఇప్పటికే పరిశ్రమలు కొనసాగిస్తున్న పెట్టుబడిదారులు మరిన్ని పరిశ్రమలు పెడుతు న్నారంటే వారే తెలంగాణకు బ్రాండ్ అంబాసి డర్ వంటి వారని సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పినట్లు మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. హైదరాబాద్–ఫ్రాన్స్‌కు మధ్య నేరుగా విమా నాలు కూడా నడవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో అంతర్జాతీయ స్థాయి కంపెనీలు అడుగుపెట్టడంతో ఉపాధి కూడా మెరుగవుతోందని చెప్పారు. సర్కారు యువతను టీవర్క్, వీహబ్, స్టార్టప్ కేంద్రాలతో ప్రోత్సహిస్తోందన్నారు. హైదరాబాద్ విమానాశ్ర యం కూడా అనేక అంశాల్లో అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. త్వరలోనే ఎంఆర్ఓ సీఎఫ్ఎం, లీప్ ఇంజిన్ల కోసం అతిపెద్ద నిర్వ హణ మరమ్మతుల కేంద్రాన్ని (ఎంఆర్ఓ) త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు శాఫ్రాన్ గ్రూప్ సీఈఓ ఒలివియర్ ఆండ్రీస్ ప్రకటించారు. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో మరో కొత్త అధ్యాయంగా నిలుస్తుందన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా 2025 నాటికి 200 మిలి యన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సీఈఓ జీన్‌పాల్ అలరీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యరద్శి జయేశ్ రంజన్ తదితరులున్నారు. -
గురి కుదిరేనా! మరో రంగంపై ముఖేష్ అంబానీ కన్ను!
ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ ఏవియేషన్ రంగంపై కన్నేశారు. బెంగళూరు కేంద్రంగా రిలయన్స్ సబ్సిడరీ సంస్థ 'సాంఖ్యసూత్ర ల్యాబ్స్' ఆధ్వర్యంలో విమానాల డిజైన్లను తయారు చేస్తున్నారు. 2019లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.216కోట్ల పెట్టుబడితో సాంఖ్యసూత్ర ల్యాబ్స్ సంస్థకు చెందిన 83శాతం వాటాను సొంతం చేసుకున్నారు. ఈ కంపెనీ హై ఫిడిలిటీ ఏరోడైనమిక్స్, మల్టీఫిజిక్స్ సిమ్యులేషన్ సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేస్తోంది. అంటే సులభంగా తక్కువ బడ్జెట్లో ఎయిర్ క్ట్రాఫ్ట్లను డిజైన్ చేస్తుంది. డిజైన్లు రక్షణ రంగానికి ఉపయోగపడనున్నాయి. ఈనేపథ్యంలో బెంగళూరులో హాల్ మేనేజ్మెంట్ అకాడమీ ఆధ్వర్యంలో ఏరో కాన్-2022 జరిగిన సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఏరో స్పేస్ కాన్ఫరెన్స్ జరిగింది. కాన్ఫిరెన్స్‌లో పైలెట్ల అవసరం లేకుండా ఆటోమెటిక్ సిస్టమ్ (అటానమస్ ఎయిర్ బర్న్ సిస్టమ్) ద్వారా విమానాల్ని ఎలా నియంత్రించాలి. ఆ రంగానికి ఎదురయ్యే సవాళ్లు, అందులో అవకాశాల వంటి అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌ను ప్రదర్శించింది. అదే సమయంలో ఈ ఏడాది అక్టోబర్ నెలలో సాంఖ్యసూత్ర ల్యాబ్స్ నుంచి ఓ కొత్త ప్రొడక్ట్ విడుదల కానున్నట్లు సంకేతాలిచ్చింది. అయితే ఆ ప్రొడక్ట్ ఏంటనేది బహిర్గతం కాలేదు. "ఖచ్చితమైన, నమ్మకమైన విమాన డిజైన్ల రూప కల్పన కోసం ఉపయోగించే విండ్ టన్నెల్ వంటి ఖరీదైన ప్రయోగాలు ఎక్కువ సమయం తీసుకునే ప్రయోగాల అవసరాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి. అంతేకాదు తాము డిజైనింగ్ టూల్స్ కోసం ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్‌లను ఉపయోగిస్తున్నట్లు కాన్ఫరెన్స్‌లో సాంఖ్యసూత్ర ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వినయ్ కరివాలా అన్నారు. -
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా టార్గెట్ ఇదే: 'ఆకాశ'..ఫస్ట్ లుక్!
సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా అతి తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్ వాలా ఆకాశ ఎయిర్ పేరుతో విమాన సంస్థను ప్రారంభించారు. తాజాగా ఆ సంస్థకు చెందిన విమానాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాకేష్ ఝున్‌ఝున్ వాలాకు చెందిన ఆకాశ ఎయిర్ విమాన సేవలు ఈ ఏడాది జులై నుంచి అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇప్పుటి వరకు ఆకాశ ఎయిర్ విమానాలు ఎలా ఉండబోతున్నాయి. వాటి కోడ్ ఏంటనే విషయాలో వెలుగులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఆకాశ ఎయిర్ తన సంస్థకు చెందిన విమాన రూపు రేఖల్ని ప్రజలకు పరిచయం చేసింది. విమానం ఆకారం, కలర్స్‌తో పాటు కోడ్లను వివరిస్తూ కొన్ని ఫోటోల్ని ట్వీట్ చేసింది. విమానాలకు కోడ్ ఏంటీ! దేశాన్ని బట్టి ఆయా సంస్థలకు చెందిన విమానాలకు కొన్ని కోడ్లు ఉంటాయి. ఉదాహరణకు..ఎయిర్‌లైన్‌కు 'క్యూపీ', ఇండిగో కోడ్ '6ఈ',గో ఫస్ట్ 'జీ8',ఎయిర్ ఇండియాకు 'ఏఐ' అని ఉంది. ఆకాశ ఎయిర్ సైతం తమ విమానాల కోడ్ ఏంటనేదీ రివిల్ చేసింది. కాంట్ కీప్ క్లైమ్! సే టూ హాయ్ అంటూ ఆకాశ ఎయిర్ విమానం కోడ్ 'క్యూపీ- పీఐఈ'! ట్వీట్లో పేర్కొంది. Coming soon to Your Sky! ✈️#AvGeek pic.twitter.com/nPpR3FMpvg — Akasa Air (@AkasaAir) May 23, 2022 ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దుబే తాము ముందుగా ప్రకటించిన సమయానికే ఆకాశ ఎయిర్ విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయి. జున్ 2022కంటే ముందుగా ఫస్ట్ ఎయిర్ క్రాప్ట్ డెలివరీ అవుతుంది. జులై 2022 నాటికి ఆకాశ ఎయిర్ కమర్షియల్ ఆపరేషన్‌ను ప్రారంభింస్తామని ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దుబే తెలిపారు. బోయింగ్‌తో ఒప్పందం రాకేష్ ఝున్‌ఝున్ వాలా ఆకాశ ఎయిర్ విమానాల్ని తయారు చేసేందుకు అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఝున్‌ఝున్ వాలా గతేడాది నవంబర్ 26,2021న బోయింగ్ సంస్థతో 72 మ్యాక్స్ విమానాల్ని కొనుగోలు చేశారు. వీటితో పాటు 72బోయింగ్ 737మ్యాక్స్ ఎయిర్ క్రాప్ట్‌లు కూడా ఉన్నాయి. ఆ సంస్థ మొత్తం విమానాల్ని తయారు చేసి ఆకాశ ఎయిర్‌కు అప్పగించనుంది. ఇందులో భాగంగా బోయింగ్ కంపెనీ తొలి ఎయిర్ క్రాప్ట్ ను ఏ ఏడాది జున్ నాటికి ఆకాశ ఎయిర్‌కు అందించనుంది. Can’t keep calm! Say hi to our QP-pie! 😍#AvGeek pic.twitter.com/sT8YkxcDCV — Akasa Air (@AkasaAir) May 23, 2022 సాధ్యమేనా! కాంపిటీషన్, ఫ్లైట్ల నిర్వహణతో పాటు పెరిగిపోతున్న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో పాటు ఇతర కారణాల వల్ల గడిచిన 10ఏళ్లలో పెద్ద సంఖ్యలో ఆయా విమాన సంస్థలు తమ సర్వీసుల్ని పూర్తిగా రద్దు చేశాయి. పదుల సంఖ్యలో విమానాలు ప్రభుత్వం ఆధీనంలో సేవలందిస్తున్న ఎయిర్ ఇండియా సైతం నష్టాలకు తట్టుకోలేక టాటా కంపెనీకి అమ్మేసింది. రతన్ టాటా ఎయిర్ ఇండియా కొనుగోలు చేయడంతో కష్టాల నుంచి గట్టెక్కితే మిగిలిన సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయి.. కార్యకాలాపాల్ని నిలిపివేశాయి. వాటిలో వాయిదూత్ ఎయిర్ లైన్స్, సహార ఎయిర్ లైన్స్, ఎండీఎల్ ఆర్ ఎయిర్‌లైన్స్, డక్కన్ ఎయిర్ వేస్ లిమిటెడ్, దర్బంగా ఏవియేషన్, దమానియా ఎయిర్ వేస్, గుజరాత్ ఎయిర్ వేస్, ఎయిర్ కోస్టా, ఎయిర్ కార్నివాల్, జెట్ ఎయిర్ వేస్, ఎయిర్ మంత్రా, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్‌లు ఉన్నాయి. సుమారు రూ.66వేల కోట్లు ఈ క్రమంలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 'ఆకాశ ఎయిర్' బ్రాండ్ కింద ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేశారు. నవంబర్ 16న ఆ కంపెనీ 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్ని ఆర్డర్ చేసింది. ఈ ఒప్పందం విలువ దాదాపు 9 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 66 వేల కోట్లు) గా ఉంది. అయితే ఇండస్ట్రీలో నిలదొక్కుకొని అప్పుల్లో కూరుకుపోవడంతో పెద్ద సంఖ్యలో ఏవియేషన్ సంస్థలు సర్వీసుల్ని నిలిపివేస్తే..ఇప్పుడు ఆకాశ ఎయిర్‌తో కొత్త విమాన సర్వీసుల్ని ప్రారంభించడం కత్తి మీద సామేనని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉రాకేష్ ఝున్‌ఝున్‌వాలా టార్గెట్ అదే, రూ.66వేల కోట్లతో..! -
‘మాక్స్‌డోమ్’ మళ్లొచ్చింది
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సంబంధించిన విమానం ‘ఇల్యుమిష్ ఐఎల్–80 మాక్స్‌డోమ్’(విపత్తు సమయంలో వాడేది) తాజాగా వార్తల్లోకి వచ్చింది. తాజాగా మాస్కో చుట్టూ ఈ విమానం చక్కర్లు కొట్టడంతో అందరి దృష్టి దీనిపై పడింది. ఆకాశంలో ఎగిరే ‘క్రెమ్లిన్’(రష్యా అధ్యక్ష భవనం) అంటుంటారీ విమానాన్ని. అణు యుద్ధం లాంటివి సంభవించినప్పుడు రష్యాను పాలించడం దగ్గర్నుంచి విమానం నుంచే అణు దాడికి ఆదేశాలిచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఇందులో ఉన్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధ సమయంలో ఈ విమానం కనబడటంతో ఉత్కంఠ నెలకొంది. అసలీ విమానం విశేషాలేంటో తెలుసుకుందామా.. ►సోవియట్ కాలానికి చెందిన ఈ విమానానికి అవసరమైన ఇంధనాన్ని ఆకాశంలోనే నింపుకోవచ్చు. ఇందుకోసం కాక్‌పిట్ కింద ఏర్పాటు ఉంది. ►విమానంలో నుంచే రష్యాను పరిపాలించేందుకు, ఏదైనా యుద్ధం జరుగుతున్నప్పుడు ఆకాశంలో నుంచే మిలిటరీకి ఆదేశాలు జారీ చేయొచ్చు..అంతేకాదు.. అణు దాడికి ఆదేశాలిచ్చేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి. ►కాక్‌పిట్‌కు తప్ప విమానానికి ఇంకెక్కడా కిటికీలు ఉండవు. ►విమానంలో ముఖ్యమైన భాగం జ్వెనో–ఎస్. ఇందులో అత్యాధునిక కమ్యూనికేషన్ గది ఉంది. విమానంపైన ముందు భాగంలో ఏర్పాటు చేసిన శాటిలైట్ యాంటెన్నాల సాయంతో ఇది పని చేస్తుంది. ►సముద్రంలోని సబ్మెరైన్లలో (బాలిస్టిక్ క్షిపణులను కలిగి ఉండేవి) ఉన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చేందుకు వెరీలో ఫ్రీక్వెన్సీ యాంటెన్నా వ్యవస్థ కూడా ఉంది. ►1987లో తొలి విమానం తయారైంది. మొత్తం 4 తయారు చేశారు. 2008లో ఈ విమానాలను ఆధునీకరించారు. జ్వెనో–ఎస్ రెండో వెర్షన్‌ను తయారు చేశారు. దీన్ని రెండు విమానాల్లో ఏర్పాటు చేశారు. ►విమానం పొడవు 60 మీటర్లు, రెక్కల పొడవు 48 మీటర్లు ఉంటుంది. ►గంటకు 850 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ఒకసారి ఇంధనం నింపాక 3,600 కిలోమీటర్లు వెళ్లగలదు. 2010 నుంచి కనిపించలే రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక ఆ విజయానికి గుర్తుగా ఏటా జరిగే కార్యక్రమంలో ఈ విమానం కనిపిస్తుండేది. అయితే 2010 నుంచి కనిపించకుండాపోయింది. తాజాగా మళ్లీ కనిపించి వార్తల్లో నిలిచింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలకు హెచ్చరికలు పంపేందుకే ఈ విమానాన్ని పుతిన్ మళ్లీ బయటకు తెచ్చారని అనుకుంటున్నారు. అయితే దీనిపై రష్యా రక్షణ శాఖ స్పందించింది. మే 9న విక్టరీ డే పరేడ్‌లో విమానం కనిపించనుందని, అందులో భాగంగా రిహార్సల్స్ చేసేందుకే మాస్కో చుట్టూ చక్కర్లు కొట్టిందని వెల్లడించింది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
Russia-Ukraine War: ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు
కీవ్: ఉక్రెయిన్‌పై దాడిలో రష్యా అమానవీయంగా ప్రవర్తిస్తుందన్న నివేదికల నేపథ్యంలో ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలివ్వాలని నాటో కూటమి దేశాలు గురువారం నిర్ణయించాయి. రష్యా దారుణాలు నిజమేనని జర్మనీ నిఘా సంస్థ ధృవీకరించినట్లు కథనాలు వచ్చాయి. అయితే ఒక కూటమిలాగా ఉక్రెయిన్‌కి సాయం చేయడానికి నాటో నిరాకరించింది. సభ్యదేశాలు విడిగా యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్, యాంటీ ట్యాంక్ తదితర ఆయుధాలు, ఔషధాలు ఇచ్చేందుకు అంగీకరించాయి. కూటమిలో ఏ దేశం ఎలాంటి సాయం చేయనుందనే వివరాలు తెలిపేందుకు సెక్రటరీ జనరల్ స్టోల్టెన్‌బర్గ్ నిరాకరించారు. ఉక్రెయిన్‌కు ఆధునిక ఆయుధాలు అందిస్తామని, అక్కడ యుద్ధం కొత్త దశకు చేరుతోందని బిట్రన్ వ్యాఖ్యానించింది. అంతకుముందు రష్యా దాడిని ఎదుర్కొనేందుకు తమకు ఆయుధ సహకారం అందించాలని పాశ్చాత్య దేశాలను, నాటోను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రో కులెబా కోరారు. నాటో విదేశాంగ మంత్రులతో చర్చలకు ఆయన బ్రసెల్స్ వచ్చారు. ఆయుధాలందిస్తే రష్యా తదుపరి లక్ష్యంగా మారతామని నాటో దేశాల్లో కొన్ని భయపడుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు ఉక్రెయిన్‌కు అనేక ఆయుధాలను అందించాయి. అయితే విమానాలు, ట్యాంకుల్లాంటి ఆయుధాలను ఇవ్వలేదు. తమకు మిస్సైల్స్, సాయుధవాహనాలు, డిఫెన్స్ సిస్టమ్స్ కావాలని కులెబా కోరుతున్నారు. జర్మనీ లాంటి దేశాలు తమకు మరింత వేగంగా సాయం అందించాలన్నారు. కీవ్, చెర్నిహివ్ ప్రాంతాల నుంచి రష్యా 24 వేల మంది సైనికులను ఉపసంహరించుకుందని, వీరిని తూర్పు ప్రాంతంలో యుద్ధానికి సన్నద్ధం చేస్తోందని అమెరికా అధికారి ఒకరు చెప్పారు. లుహాన్స్క్, డొనెట్సెక్ ప్రాంతాల్లాగే డోన్బాస్లో కూడా కొన్ని ప్రాంతాలను ఉక్రెయిన్ నుంచి విడగొట్టాలన్నది పుతిన్ యత్నంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. తూర్పు ప్రాంతంపై రష్యా సేనలు దృష్టి పెడుతున్న వేళ అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోవాలని స్థానికులను ఉక్రెయిన్ ప్రభుత్వం కోరింది. రష్యాపై ఆంక్షల రూపంలో ఒత్తిడి పెంచుతామని జీ7 దేశాలు ప్రకటించాయి. హక్కుల మండలి నుంచి రష్యా సస్పెన్షన్ మానవహక్కుల సమాఖ్య నుంచి రష్యాను సస్పెండ్ చేసే తీర్మానానికి ఐరాస ఆమోదం లభించింది. ఈ తీర్మానంపై ఐరాస జనరల్ అసెంబ్లీలో గురువారం ఓటింగ్ జరిగింది. రష్యా సస్పెన్షన్‌కు అనుకూలంగా 93 ఓట్లు, వ్యతిరేకంగా 24 ఓట్లు వచ్చాయి. ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. ఐరాస శాశ్వత సభ్యదేశాల్లో ఇంతవరకు ఏ దేశం కూడా ఐరాస అనుబంధ విభాగాల నుంచి సస్పెండ్ కాలేదు. -
వంటనూనెతో నింగిలోకి..
వంట నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ... ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ విమానం జెట్‌ఇంధనంతోకాకుండా వంటనూనెతో నింగిలోకి ఎగిరింది. అది ఎప్పుడు ఎక్కడ టేకాఫ్ అయింది... ఇదెలా సాధ్యమనే ఆసక్తికర విషయాలేంటో తెలుసుకుందాం... –సాక్షి, సెంట్రల్ డెస్క్ సూపర్ జంబో విమానం ఎయిర్‌బస్ ఏ–380 వంటనూనెతో ఆకాశంలోకి ఎగిరి మూడు గంటలపాటు చక్కర్లు కొట్టింది. ఈ విమానం ఇటీవల ఫ్రాన్స్‌లోని టౌలూస్ బ్లాగ్నక్ విమానాశ్రయంలో వంటనూనెతో తయారుచేసిన సస్టెయినబుల్ విమాన ఇంధనాన్ని (ఎస్ఏఎఫ్) 27 టన్నుల వరకు నింపుకుని టేకాఫ్ అయింది. మూడు గంటల తర్వాత నైస్ విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండయింది. ఈ విమానం 100 శాతం ఎస్ఏఎఫ్తో నింగిలోకి ఎగరడం ఇదే తొలిసారి కావడం విశేషం. కొవ్వులు, ఇతర వ్యర్థాలతో.. హరిత, మునిసిపల్ వ్యర్థాలు,కొవ్వులతో తయార య్యే ఈ ఎస్ఏఎఫ్ ఇంధనం దాదాపు 80 శాతం కా ర్బన్‌డయాక్సైడ్‌ను తగ్గిస్తుంది. ఏవియేషన్ పరిశ్రమ 2050 నాటికల్లా కర్భన ఉద్గారాలను జీరో లక్ష్యంగా పెట్టుకోగా,యూకే ప్రభుత్వం 2030 నాటికి 10 శా తం ఎస్ఏఎఫ్ను వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాదికాలంలో ఏ380తోపాటు మూడు విమానాలు 100 శాతం వంటనూనెతో నింగిలోకి ఎగిరాయి. 2021 మార్చిలో ఏ350, అక్టోబర్‌లో ఏ319నియో విమానాలు ఇలా ఎఫ్‌ఏఎఫ్‌తో చక్కర్లు కొట్టాయి. ధర ఐదు రెట్లు ఎక్కువ... సంప్రదాయ విమాన ఇంధనంతో పోలిస్తే ఈ హరిత జెట్ ఇంధనం ధర ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ ఇంధనాన్ని వాడితే విమాన టికెట్ల ధరలు కూడా ఎక్కువ అవుతాయని, అయితే ప్రభుత్వాలు సబ్సిడీలిచ్చి ఆదుకుంటే ధరలు పెంచాల్సిన అవసరం ఉండదని విశ్లేషకులు అంటున్నారు. 2030 నాటికి 13 హరిత విమాన ఇంధనం ప్లాంట్లను నెలకొల్పాలని యూకే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో ప్లాంట్‌కు సుమారు రూ.2,280 కోట్లు వ్యయమవుతుంది. ఎస్ఏఎఫ్ వినియోగం పెరిగిందంటే జీరో కర్భన ఉద్గారాల లక్ష్యానికి చేరువవుతున్నట్లే అని ఎయిర్‌బస్ సంస్థ పేర్కొంది. తమ విమానాలన్నింటిని 50శాతం ఎస్ఏఎఫ్–కిరోసిన్ మిశ్రమంతో నడిపేందుకు అనుమతి ఉందని చెప్పింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 200 బిలియన్ లీటర్ల విమాన ఇంధనం అవసరం అవుతుండగా, గత ఏడాది 10–12 కోట్ల లీటర్ల ఎస్ఏఎఫ్ మాత్రమే ఉత్పత్తి అయిందని అంతర్జాతీయ వైమానిక సంస్థ ఐఏటీఏ అంచనావేసింది. ఇది మొత్తం డిమాండ్‌లో 0.05 శాతం మాత్రమేనని చెప్పింది. శిలాజ ఇంధనాలతో పోలిస్తే ఇలాంటి జీవఇంధనాలతో కాలుష్యం తక్కువగా ఉంటుంది. అందుకే ఎస్ఏఎఫ్ వాడకాన్ని పెంచాలని వైమానిక సంస్థలు ప్రణాళికలు వేస్తున్నాయి. ఎలా మారుస్తారు? మనం వాడుతున్న వంటనూనెను అలాగే విమాన ఇంధనంగా వాడలేం. వాడిన వంటనూనెకు కొన్నిరకాల మిశ్రమాలు కలిపి కొంత ప్రాసెస్ చేసి జీవఇంధనంగా మారుస్తారు. జీఎఫ్ కమ్యూనికేషన్స్ సంస్థ ప్రకారం వాడిన ఆలివ్, కనోలా నూనెలు దీనికి బాగా పనికొస్తాయి. ఎందుకంటే అవి తాజా నూనె కన్నా కూడా బాగా చిక్కగా ఉంటాయి. విమాన ఇంధనంగా మార్చేందుకు ముందుగా వాడిన నూనెను వడబోసి అందులో ఉన్న వ్యర్థాలను తొలగిస్తారు. తర్వాత దాన్ని 70ఫారన్‌హీట్ వరకు వేడిచేస్తారు. తర్వాత కొంచెం ఆల్కహాల్, సోడియం క్లోరైడ్ తదితరాలను జతచేస్తారు. ఈ మిశ్రమంతో రెండు రకాల ఉత్పత్తులు అంటే మీథైల్ ఈస్టర్, గ్లిసరిన్ తయారవుతాయి. బయోడీజిల్ (జీవఇంధనం) రసాయన నామం మీథైల్ ఈస్టర్. గ్లిసరిన్ను సబ్బులతోపాటు చాలారకాల ఉత్పత్తుల తయారీకి వాడతారు. -
సంచలనం, వంట నూనెతో అద్భుతం..కుకింగ్ ఆయిల్‌తో కాస్ట్లీ విమానం నడిపారు!
సీట్లు నిండినా..గల్లా ఖాళీ అవుతుంది ఇదీ ప్రస్తుతం విమానయాన పరిస్థితి. అందుకే విమానాయన సంస్థలు ఆవ నూనె, వంట నూనెతో విమానాల్ని నడిపేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. మంచి ఫలితాల్ని రాబడుతున్నాయి. తాజాగా 496 మంది ప్రయాణించే కాస్ట్లీ విమానం 'ఎయిర్ బస్ ఏ380'లో వంటింట్లో వాడే వంట నూనె ఫ్యూయల్‌గా ఉపయోగించారు. ఎలాంటి ప్రమాదం లేకుండానే విమానం నిర్దేశించిన ఎయిర్‌పోర్ట్‌లో విజయవంతంగా టేకాఫ్ అయ్యింది. ప్రస్తుతం ఈ అంశం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. గాలి నుంచి కాదు ఆవ మొక్క నుంచి ఇంధనం ఐదేళ్ల క్రితం గాలి నుంచి విమానం ఇంధనం తయారవుతుందని అనడంతో విమానయానం కష్టాలు ఇక తీరిపోయినట్లేనని భావించారు. ఎందుకంటే అసలు విమానయానం కష్టాలన్నీ ఇంధనం వల్లనే జరుగుతున్నాయి. నానాటికి పెరిగిపోతున్న చమురు ధరలతో..వాటి ఖర్చు ఆకాశం నుంచి అంతరిక్షం దాటుతోంది. దాంతో ఆల్ట్రనేటీవ్ ఫ్యూయల్ వైపు అందరూ ఆశగా ఎదురు చూశారు. కానీ అదెందుకో కార్యచరణకు నోచుకోలేదు. కానీ గతేడాది భారత శాస్త్రవేత్త,జార్జియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పునీత్ ద్వివేదీ బృందం ఆవాల మొక్క ద్వారా విమానం ఇంధనం తయారవుతుందనగానే ఆశలు చిగురించాయి. బ్రాసికా కేరినాటా రకం ఆవాల మొక్కల నుంచి తీసే నూనెతో విమానం ఇంధనం తయారు చేయోచ్చని పునీత్ ద్వివేది తెలిపారు. ద్వివేదీ గత 4 సంవత్సరాలుగా దీనిపై పరిశోధనలు చేస్తుండగా..ఈ ప్రాజెక్టును15 మిలియన్ల డాలర్లతో అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చేపట్టింది. వంట నూనెతో అద్భుతాలు ఈ నేపథ్యంలో సీఎన్ఎన్ కథనం ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమాన ప్రయాణాన్ని ఎతిహాద్ ఎయిర్వేస్కు చెందిన ఎయిర్ బస్ ఏ380 ఫ్లైట్‌ను ఫ్రాన్స్‌లో ట్రయల్స్ నిర్వహించారు. సంచలనం ఏంటంటే ఈ విమానంలో వంటింట్లో వాడే వంటనూనె ( ఇది సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్(saf అని కూడా పిలుస్తారు)ను ఉపయోగించడం. ఈ విమానం రోల్స్ రాయిస్ ట్రెంట్ 900 ఇంజన్ సాయంతో మార్చి 25న టౌలౌస్‌లోని బ్లాగ్నాక్ విమానాశ్రయం నుండి బయలుదేరింది. మార్చి 29న టౌలౌస్ నుండి నైస్‌కు వెళ్లేందుకు అదే నూనెను ఉపయోగించి ఏ380 ప్లైట్‌ను మరో ట్రైల్ నిర్వహించారు. ఈ టెస్ట్‌లో విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఇంధన పనితీరు బాగున్నట్లు గుర్తించారు. ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ ఎనర్జీస్ సంస్థ ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ ఎనర్జీస్ సంస్థ 'హైడ్రోప్రాసెస్డ్ ఎస్టర్స్, ఫ్యాటీ యాసిడ్స్' లేదా హెచ్ఈఎఫ్ఏ నుండి ఈ ప్రత్యేకమైన కుకింగ్ ఆయిల్‌ను తయారు చేసింది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే ఈ ఆయిల్‌ను విమానాల్లో ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. మార్చి2021లో వైడ్ బాడీ ఏ 350 ఫ్లైట్‌లో, గత అక్టోబర్‌లో ఏ319 నియో అనే విమానంలో ఈ ఆయిల్‌ను ఫ్యూయల్‌గా ఉపయోగించారు. తాజాగా కాస్ట్లీ విమానం ఏ380 లో ఉపయోగించి టెస్ట్ ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తించారు. కాగా ఎయిర్‌బస్ యాజమాన్యం తన విమానాలన్నింటిలో ఈ కుకింగ్ ఆయిల్‌ను ఉపయోగించేందుకు సర్టిఫికేట్ పొందాలని చూస్తుంది. అప్పటి వరకు ప్రయోగాలు కొనసాగిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. చదవండి: ఈ విమానంలో జర్నీ బాగా కాస్ట్లీ గురూ! -
ఆకాశంలో లివింగ్ రూమ్
విమానాల్లో బిజినెస్ క్లాస్ అంటేనే కాస్త పర్సనల్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఇబ్బంది లేకుండా, సౌకర్యవంతంగా, ప్రశాంతంగా ప్రయాణించేలా సీట్లు, ఇతర సౌకర్యాలుంటాయి. కానీ అచ్చం ఇంట్లో లివింగ్ రూమ్‌లోనే ఉన్నామా అనిపించేలా క్యాబిన్ డిజైన్ చేస్తే! టీవీ, కర్టెన్లు, కార్పెట్లు, ఇతరత్రా ప్రత్యేక సౌకర్యాలుంటే! ఇలాంటి అద్భుతమైన క్యాబిన్లను సియాటెల్‌కు చెందిన డిజైన్ కంపెనీ టియాగ్యు, టెస్లా, ఒక్లహోమాకు చెందిన ఎయిరోస్పేస్ కంపెనీ నోర్డామ్ కలిసి రూపొందించాయి. ఈ డిజైన్‌కు‘ఎలివేట్’ అని పేరు పెట్టాయి. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా విడుదల చేశాయి. జర్మనీలోని హాంబర్గ్‌లో ఈ ఏడాది జూన్‌లో జరిగే ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటీరియర్స్ ఎక్స్‌పోలో ఈ డిజైన్లను ప్రదర్శించనున్నాయి. తక్కువలో ఎక్కువగా.. అద్భుతమైన వాల్ అటాచ్మెంట్స్, పెద్ద బెడ్ సైజు, లివింగ్ స్పేస్, వస్తువులు పెట్టుకునేందుకు స్థలం లాంటివి ప్రతి ప్రయాణికుడికి ఉండేలా డిజైన్ చేయడం ఇదే తొలిసారని ‘ఎలివేట్’ డిజైనర్లు తెలిపారు. ఈ ఇంటీరియర్‌కు విమానంలో ఎక్కువ స్థలం అవసరం ఏమీ ఉండదని, సీట్లు తగ్గించుకోవాల్సిన అవసరమూ రాదని చెప్పారు. పైగా డిజైన్‌లో వాడినవన్నీ తక్కువ బరువున్నవేనని వివరించారు. దీని వల్ల విమానంపై భారంపడదని, ఎక్కువ ఇంధనం ఖర్చవదని తెలిపారు. చిన్న విమానాల్లో కూడా ఎలివేట్ క్యాబిన్లను సులువుగా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. అందమైన క్యాబిన్లతో ప్రయాణికులకు అద్భుతమైన అనుభూతిని అందించడానికి.. ఎక్కువ స్థలం ఉండేలా, సౌకర్యవంతంగా అనిపించేలా, ప్రైవసీ ఉండేలా ఎలివేట్‌ను డిజైన్ చేశామని చెప్పారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఉక్రెయిన్ నుంచి మరో 14 మంది తెలుగు విద్యార్థుల రాక
సాక్షి ముంబై: ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న విద్యార్థులను తీసుకువస్తున్న మరో ప్రత్యేక విమానం గురువారం ఉదయం ముంబైకి చేరుకుంది. వందకుపైగా విద్యార్థులు ఈ ప్రత్యేక విమానంలో ముంబైకి చేరుకోగా వీరిలో తెలంగాణకు చెందిన తొమ్మిది మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయిదుగురు విద్యార్థులు ఉన్నారు. వీరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నోడల్ అధికారి వి.రామకృష్ణ, తెలంగాణ ప్రభుత్వ అధికారులు డాక్టర్ ఎ.శరత్ (పంచాయితీ రాజ్ కమిషనర్), లాల్శంకర్ చవాన్ (ఐపీఎస్)తోపాటు ముంబై కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ ఎం.నాగరాజ్ అన్నివిధాలా సహకారమందించారు. నవీముంబైలోని తెలుగు కళాసమితి ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి కొండారెడి, ఎన్జీఓ సంస్థ పదాధికారులు కూరపాటి నరేష్, దోర్నాల రాజు, సురేష్‌కూడా విమానాశ్రయానికి వచ్చి విద్యార్థులను కలిశారు. ముంబైకి వచ్చిన తెలంగాణ విద్యార్థులు: అభిజిత్‌సింగ్ నేగి (హైదరాబాద్), గోపగల్ల ప్రణయ్ (హైదరాబాద్), ఎం.ఈసాద్‌అలీ బేగ్ (హైదరాబాద్), పాటిల్ అక్షయ్ విజయ్‌కుమార్ (హైదరాబాద్), డి.పవన్‌కళ్యాణ్ (హైదరాబాద్), కె.సిద్దువినాయక్ (హైదరాబాద్), బి.కార్తీక్ నాయక్ (నిజామాబాద్), కె.సొలొమొన్∙రాజ్ (కరీంనగర్), ఐ.కార్తికేయ (హైదరాబాద్) -
శిక్షణ విమానం శకలాల తరలింపు
పెద్దవూర: శిక్షణ విమానం కూలి ట్రైనీ మహిళా పైలట్ దుర్మరణం చెందిన ప్రదేశాన్ని ఆదివారం ఢిల్లీ నుంచి వచ్చిన ఏఏఐబీ(ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో) టీం అధికారులు అమిత్‌కుమార్, దినేష్‌కుమార్, కెప్టెన్ భవానీశంకర్లతో పాటు, హైదరాబాద్ నుంచి వచ్చిన డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అధికారులు పరిశీలించారు. ఉదయం 8.15కు వచ్చిన ప్రత్యేక బృందం మధ్యాహ్నం 2 గంటల వరకు విచారణ చేపట్టింది. ఎయిర్‌క్రాఫ్ట్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. శకలాలను ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రైట్బ్యాంకులోని ఫ్లైటెక్ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి తరలించారు. డీజీసీఏ బృందంలో డీజీసీఏ డైరెక్టర్ సురేందర్ టోపో, అసిస్టెంట్ డైరెక్టర్ శివ ఉన్నారు. రిపోర్ట్ ఆధారంగా కేసు విచారణ –వై. వెంకటేశ్వరరావు, డీఎస్పీ మిర్యాలగూడ తుంగతుర్తి గ్రామ సమీపంలో ఫ్టైటెక్ ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ చాపర్ శనివారం కూలిపోయి ట్రైనీ మహిళా పైలట్ మృతి చెందిన ఘటనలో ఢిల్లీలోని ఏఏఐబీ, హైదరాబాద్‌కు చెందిన డీజీసీఏ అధికారుల బృందాలు ఆదివారం విచారణ చేశాయి. శకలాలను స్వాధీనం చేసుకుని వాటిని విశ్లేషించి రిపోర్ట్ తయారు చేసి ఇస్తామన్నారు. వారిచ్చే రిపోర్ట్ ఆధారంగా తర్వాత విచారణ చేస్తాం. -
ఈ నిర్లక్ష్యం సహించరానిది
నిరంతర అప్రమత్తత ఎంతటి ప్రమాదాన్నయినా నివారిస్తుంది. తెలిసో, తెలియకో చేసే చిన్న పొర పాటు ఒక్కొక్కప్పుడు అపారమైన నష్టానికి దారితీస్తుంది. ఈ నెల 7న బెంగళూరు గగనతలంలో రెండు విమానాలు ఒకదానికొకటి చేరువగా రాబోయి, రెప్పపాటులో ప్రమాదంనుంచి బయట పడ్డాయని వెలువడిన కథనాలు దిగ్భ్రాంతి కలిగించాయి. ఇండిగో సంస్థకు చెందిన ఈ రెండు విమానాల్లో ఒకటి బెంగళూరు నుంచి కోల్‌కతా వెళ్లడానికి టేకాఫ్ కాగా, మరొకటి భువనేశ్వర్ వెళ్లడా నికి గాల్లోకి లేచింది. అయిదు నిమిషాల తేడాతో టేకాఫ్ అయిన ఈ రెండు విమానాల పైలట్లనూ రాడార్ కంట్రోలర్ ఒకరు అప్రమత్తం చేసి ప్రమాదాన్ని నివారించారు. పెను ముప్పు తప్పినందుకు సంతోషించాలో, ఈ ఉదంతాన్ని గుట్టు చప్పుడు కాకుండా కప్పెట్టేందుకు ప్రయత్నించిన అధికారుల తీరును చూసి ఆందోళనపడాలో తెలియని స్థితి. ఈ నెల 9న దుబాయ్‌లో కూడా ఇదే తరహాలో పెను ప్రమాదాన్ని నివారించారు. దుబాయ్నుంచి హైదరాబాద్ రావాల్సిన ఈకే–524 విమానం, దుబాయ్ నుంచి బెంగళూరు వెళ్లే ఈకే–568 విమానం టేకాఫ్ సమయంలో ఢీకొట్టుకోబోయాయి. దుబాయ్–హైదరాబాద్ పైలట్ టేకాఫ్ కోసం విమానాన్ని పరుగెత్తిస్తుండగా తనకెదురుగా శర వేగంతో వస్తున్న దుబాయ్–బెంగళూరు విమానాన్ని గమనించాడు. ఈలోగా హైదరాబాద్ విమా నాన్ని వెంటనే టాక్సీ బే వైపు వెళ్లి, రన్‌వేను ఖాళీ చేయాలని ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) ఆదేశా లిచ్చారు. దాంతో ముప్పు తప్పింది. హైదరాబాద్ విమానం పైలట్ ఏటీసీ అనుమతి ఇవ్వకుండానే బయల్దేరేందుకు ప్రయత్నించాడని ప్రాథమిక దర్యాప్తులో తేలిందంటున్నారు. ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త సాంకేతికతల పుణ్యమా అని ప్రస్తుతం విమానాలే అత్యంత సురక్షిత ప్రయాణ సాధనాలని నిపుణులు చెబుతున్న మాట. ప్రతి వందకోట్ల కిలోమీటర్ల ప్రయా ణానికీ విమానాలద్వారా సంభవించే సగటు మరణాల రేటు రైళ్లు, కార్ల కారణంగా జరిగే మరణా లతో పోలిస్తే అత్యంత తక్కువని గణాంకాలు వివరిస్తున్నాయి. 1950 నుంచి జరిగిన విమానయాన ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రతి దశాబ్దానికీ వాటి సంఖ్య తగ్గుతూ వస్తోంది. అప్ప టితో పోలిస్తే విమానాల సంఖ్య, ప్రయాణాల సంఖ్య లక్షల్లో పెరిగినా ప్రమాదాలు పెద్దగా లేక పోవడం ఆ రంగంలో వచ్చిన సాంకేతికతల పర్యవసానమే. 70వ దశకంలో వచ్చిన డిజిటల్ పరికరాలతో విమానాల పోకడే మారింది. ఆ తర్వాత కాలంలో సెన్సర్ల మెరుగుదల, ఆధునిక సాంకే తికతలతో వచ్చిన నావిగేషన్ పరికరాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తదితరాలు విమానయానాన్ని మరింత సురక్షితంగా మార్చాయి. అయితే సాంకేతికత ఎంతగా విస్తరించినా ఎప్పటికప్పుడు సిబ్బంది అప్రమత్తంగా ఉంటేనే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది. చాలా ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమని, సాంకేతిక వైఫల్యం శాతం అతి తక్కువగా ఉంటున్నదని తేలింది. అయితే ఇందులోనూ సమస్య పొంచివుంది. అత్యాధునిక సాంకేతికత తనంత తానే అవసరానికి తగ్గట్టు సర్దుబాటు చేసుకుని ప్రయాణం సాఫీగా పూర్తయ్యేందుకు దోహదపడుతున్నమాట వాస్త వమేగానీ... అది పైలట్లలో అలసత్వాన్ని పెంచుతున్నదని, అనుకోని పరిస్థితులు తలెత్తినప్పుడు సొంతంగా నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్నీ, చొరవనూ వారు కోల్పోతున్నారని నిపుణులు హెచ్చరి స్తున్నారు. ఇందుకు 2013లో దక్షిణకొరియా విమానానికి శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ప్రమాదాన్ని ఉదహరిస్తున్నారు. అందులో 304 మంది ప్రయాణిస్తుండగా విమానం కిందకు దిగుతున్న సమ యంలో సాంకేతికత మొరాయించడం, పైలట్ అయోమయంలో పడటం కారణంగా ప్రమాదం చోటుచేసుకుని ముగ్గురు మరణించారు. అలాగే 2019లో కేవలం అయిదు నెలల వ్యవధిలో బోయింగ్‌కు చెందిన రెండు విమానాలు వైఫల్యం చెంది, ప్రమాదాల్లో 350 మంది మరణించారు. ఆ రెండు విమానాలూ ఒకే మోడల్‌వి కావడంతో 180 దేశాలు వాటి వాడకాన్ని నిలిపేశాయి. ఆ విమా నాల సాంకేతికతల్లో తగిన మార్పులు చేశారని నిర్ధారించుకున్నాకే ఇటీవల వాటి వినియోగం మొదలైంది. సాంకేతికత అద్భుతమైనదైనా, చాకచక్యంతో వ్యవహరించగల నేర్పు పైలట్‌కు ఉన్నా ఏటీసీ పరంగా లోపాలుంటే సమస్యలు ఏర్పడతాయి. బెంగళూరులోనూ, దుబాయ్‌లోనూ జరిగింది అదే. దుబాయ్‌లో అయితే కనీసం ఆ ఉదంతం ఉన్నతస్థాయి అధికారుల దృష్టికొచ్చింది. అక్కడ ఏ మాదిరి తప్పు జరిగిందో నిర్ధారించి, ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగంలో పనిచేస్తున్న వారందరినీ అప్రమత్తం చేయడానికి... మరెక్కడా అలాంటి సమస్య తలెత్తకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. కానీ బెంగళూరు ఏటీసీలో జరిగింది వేరు. దక్షిణంవైపున్న రన్‌వేను మరమ్మ తుల కోసం మూసివేశారు. కేవలం ఉత్తరంవైపున్న రన్‌వేను మాత్రమే వినియోగించాలని నిర్ణయిం చారు. ఆ వర్తమానం దక్షిణంలో ఉన్న కంట్రోలర్‌కి చేరలేదు. దాంతో హైదరాబాద్ విమానం కదలడానికి అనుమతించారు. ఉత్తరంవైపున్న కంట్రోలర్ సకాలంలో ఈ పొరపాటును గుర్తించక పోతే 430 మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. ఆ సంగతిని తగిన రికార్డుల్లో నమోదు చేసి, పౌరవిమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ)కు సమాచారం అందించాల్సి ఉండగా, తొక్కిపెట్టేం దుకు ప్రయత్నించారు. ఈ తప్పిదాన్ని తీవ్రంగా పరిగణించడంతోపాటు, సమాచార లోపం ఎవరి వల్ల చోటుచేసుకున్నదో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
నింగీ.. నేలా చూద్దామిలా!
కాకినాడ రూరల్: సాగరతీర సందర్శకులకు విజ్ఞానం, వినోదం పంచేందుకు సమయం సమీపిస్తోంది. కాకినాడ సూర్యారావుపేట బీచ్‌లో యుద్ధ విమాన మ్యూజియం ఇందుకోసం ముస్తాబవుతోంది. సుదీర్ఘ సముద్ర తీరం కలిగిన మన రాష్టంలో విశాఖ తరువాత కాకినాడ తీరం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడి బీచ్‌కు నిత్యం వేలాదిగా ప్రజల తాకిడి ఉంటుంది. కోవిడ్ కొంత ప్రభావం చూపినా బీచ్ పూర్వ వైభవం మళ్లీ పొందుతోంది. భవిష్యత్తులో ఇది పర్యాటక కేంద్రంగా వెలుగొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాకినాడ నుంచి ఉప్పాడ వరకూ తీరాన్ని మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దేందుకు ఇక్కడ యుద్ధ విమాన ప్రదర్శన శాల ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. టీయూ–142ఎం యుద్ధ విమానంతో.. బీచ్‌లో థీమ్ పార్కు ఇప్పటికే ఆకట్టుకుంటుండగా యుద్ధ విమానాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. తొలుత ట్రైనీ యుద్ధ విమానం ఏర్పాటు చేసి ప్రదర్శనకు అనుమతించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవ తీసుకుని మరో యుద్ధ విమానం ఏర్పాటుకు కృషి చేసింది. దేశ రక్షణ రంగంలో దాదాపు 28 ఏళ్ల పాటు సేవలందించి 2017లో వైదొలగిన టీయూ–142ఎం విమానాన్ని ఇక్కడ నిలపాలని సంకల్పించి సఫలీకృతమైంది. ప్రపంచంలోనే అతి భారీ, పురాతన యుద్ధ విమానాల్లో ఇది ఒకటి కావడం విశేషం. 53 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 12 మీటర్ల ఎత్తు, 100 టన్నుల బరువు (ఇంధనంతో కలిపితే 185 టన్నులు) కలిగిన ఈ యుద్ధ విమానాన్ని చెన్నై నుంచి ఇక్కడికి తీసుకువచ్చారు. బయటి నుంచి చూడటమే కాకుండా లోపలికి వెళ్లి అన్నీ చూసేందుకు వీలుగా దీనిని రూపుదిద్దారు. త్వరలోనే ఈ విమానం మ్యూజియం సందర్శకులకు అందుబాటులోకి రానుంది. యుద్ధ విమానం సేవలు, ఆయుధాలు, శత్రువులపై దాడి, స్వీయరక్షణ వంటి అంశాలను ఇందులో ప్రదర్శిస్తున్నారు. విడి భాగాలను రోడ్డు మార్గంలో తీసుకువచ్చి బిగించారు. సందర్శకులు లోపలకు వచ్చి, బయటకు వెళ్లే మార్గాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. పనుల్లో కొంత జాప్యం నేవీ డే సందర్భంగా డిసెంబర్ 4న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో దీనిని ప్రారంభింపజేయాలని అధికారులు తొలుత భావించారు. ఇందులో భాగంగా తూర్పు నావికాదళం ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ సెప్టెంబర్‌లో వచ్చి పరిశీలించారు. ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న పార్కులో కాకినాడ నగరాభివృద్ధి సంస్థ (కుడా) (గతంలో గుడా) రూ.5.89 కోట్లతో చేపట్టిన విమాన మ్యూజియం పనుల వివరాలను కలెక్టర్ సి.హరికిరణ్, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైస్ చైర్మన్ కె.సుబ్బారావు, వైస్ అడ్మిరల్‌కు వివరించారు. డిసెంబర్ 4న ప్రారంభోత్సవం జరిగేలా చూడాలని పనులు చేపడుతున్న తనేజా ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ సంస్థ (విశాఖ) ప్రతినిధి శ్రీనివాస్‌కు సూచించారు. అయితే పనుల్లో కొంత జాప్యం జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సదరు కాంట్రాక్టు సంస్థకు మొదటి విడత బిల్లు సుమారు రూ.2 కోట్లు గురువారం చెల్లించింది. దీంతో పనులకు అడ్డంకులు తొలగాయి. జనవరి నాటికి ఇది అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు. -
రోల్స్‌రాయ్స్: గంటకు 623 కిలోమీటర్లు..
భూమిలో ఇంధనాలు అడుగంటిపోతుండటం, కర్బన ఉద్గారాలు పెరిగిపోతుండటంతో.. వాహనాల తయారీదారులు ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నారు. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. బైక్‌లు, కార్ల నుండి విమానాలకు చేరుకుంది. రోల్స్‌రాయ్స్... అందరికీ అత్యంత ఖరీదైన కార్ల కంపెనీగానే తెలుసు. అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ విమానాన్ని ఇటీవల పరీక్షించింది. ఈ సంస్థ తయారు చేసిన ‘స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్’ఆల్–ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ వేగంలో మూడు కొత్త ప్రపంచ రికార్డులను సృష్టించింది. యూకే రక్షణ మంత్రిత్వ శాఖ బోస్కోంబ్డౌన్ టెస్టింగ్ సైట్లో దీనిని పరీక్షించారు. టెస్ట్ ఫ్లైట్‌ను రోల్స్‌రాయ్స్ కంపెనీ ఫ్లైట్ ఆపరేషన్ డైరెక్టర్ ఫిల్ ఓడెల్ నడిపారు. ఫ్లయింగ్ ట్యాక్సీస్ తమ భవిష్యత్ ప్రణాళిక అని చెబుతోంది రోల్స్‌రాయ్స్. ‘రోడ్డు, సముద్ర, ఆకాశయాన మార్గాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాల్లో భాగమే ఈ ఎలక్ట్రిక్ ప్లేన్’అని రోల్స్‌రాయ్స్ సీఈఓ వారెన్ ఈస్ట్ చెబుతున్నారు. డిపార్ట్మెంట్ ఫర్ బిజినెస్, ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ స్ట్రాటజీ మరియు ఇన్నోవేట్ యూకే భాగస్వామ్యంతో రూపొందించిన ఈ ప్రాజెక్టుకు సగం నిధులను బ్రిటీష్ ఏరోస్పేస్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అందించింది. ప్రత్యేకతలు.. ఇది పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ విమానం. గంటకు 387.4 మైళ్ల (గంటకు 623 కి.మీ) వేగంతో దూసుకెళ్తుంది. ఈ వేగం పాత రికార్డుకంటే... 132 మైళ్లు (212.5 కిలోమీటర్లు) ఎక్కువ. 60 సెకన్లలోనే మూడు వేల మీటర్ల ఎత్తు ఎగరడం ఈ విమానం ప్రత్యేకత. గతంలో ఉన్న రికార్డులు... గతంలో విమానం 3 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 345 మైళ్లు (555.9 కిలోమీటర్ల), 15 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 331 మైళ్లు (531.1 కిలోమీటర్లు), 202 సెకన్లలో మూడువేలమీటర్ల ఎత్తుకు ఎగిరిన రికార్డులున్నాయి. ఈ మూడు రికార్డులను ‘స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్’బ్రేక్ చేసింది. బ్యాటరీ పనితీరు.. 400 కిలోవాట్ల పవర్ బ్యాటరీ దీని సొంతం. దీని సామర్థ్యం 7,500 స్మార్ట్ఫోన్లు పూర్తిగా చార్జ్ చేసేంత. సాధారణంగా వాషింగ్ మెషీన్స్‌లో ఉండే స్పిన్ 1000 ఆర్పీఎం ఉంటుంది. దానికి రెట్టింపు సామర్థ్యంతో ఈ విమానం ప్రొఫెల్లర్స్ తిరుగుతాయి. బ్యాటరీని కూల్‌గా ఉంచడం కోసం పోర్చుగీస్ కార్క్‌తో థెర్మల్ రక్షణ కవచం ఏర్పాటు చేశారు. -
విమానాల్లో ఆహార సేవలు కొనసాగించొచ్చు
న్యూఢిల్లీ: రెండు గంటల కంటే తక్కువ ప్రయాణ సమయమున్న విమానాల్లో ఆహారం అందించడాన్ని పునరుద్ధరించవచ్చని కేంద్రం ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు నిబంధనలు సవరించవచ్చని తెలుపుతూ పౌర విమానయానశాఖకు సమాచారం అందిం చినట్లు వెల్లడించింది. దీంతోపాటు, విమాన సిబ్బంది ఇకపై శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే రక్షణ దుస్తులు ధరించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే, వారు గ్లవ్స్, ఫేస్‌మాస్క్‌లు, ఫేస్ షీల్డ్‌లను మాత్రం ధరించాలని తెలిపింది. కేంద్రం ఏప్రిల్ 15వ తేదీన విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం..ప్రయాణ సమయం రెండు గంటలుండే విమానాల్లో ప్రయాణికులకు ఆహారం అందించడాన్ని నిలిపివేశారు. -
ఎలక్ట్రికల్ ఎయిర్ టాక్సీలపై నాసా ప్రయోగాలు
ఆల్ ఎలక్ట్రిక్ వెర్టికల్ టేక్ఆఫ్ అండ్ లాండింగ్(ఇవీటీఓఎల్) ఎయిర్‌క్రాఫ్ట్.. పేరు వినగానే ఏదో భారీ యుద్ధ విమానం అనుకుంటున్నారా! అదేం కాదు. టేకాఫ్ అవసరం లేకుండా గాల్లోకి నేరుగా ఎగరే, లాండయ్యే విమానం, అది కూడా కరెంటుతో నడిచేదాన్ని ఇవీటీఓఎల్ అంటారు. తాజాగా అమెరికాకు చెందిన నాసా ఈ వాహనాలపై జోబీ ఏవియేషన్‌తో కలిసి ప్రయోగాలు ఆరంభించింది. ప్రయోగాలు సఫలమైతే త్వరలో ఎయిర్‌టాక్సీలు అమెరికన్లకు అందుబాటులోకి వస్తాయి. ఇలాంటి వాహనాలపై నాసా ప్రయోగాలు చేయడం ఇదే తొలిసారి. ఏఏఎం(అడ్వాన్డ్స్ ఎయిర్ మొబిలిటీ) నేషనల్ కాంపైన్లో భాగంగా ఈ వాహనాలపై నాసా5 ప్రయోగాలు ఆరంభించింది. జోబీకి చెందిన ఎలక్ట్రిక్ ఎయిర్‌బేస్ కాలిఫోర్నియాలో ఉంది. దీనిలో నాసా ప్రయోగాలు జరుపుతోంది. వేగవంతమైన రవాణాకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. ఇప్పటికే జోబీ తయారుచేసిన ఇవీటీఓఎల్ ఎయిర్‌క్రాఫ్ట్ పనితీరును ప్రస్తుతం నాసా మదింపు చేస్తోంది. డేటా పరిశీలనతో వచ్చే ఏడాది పలు పరీక్షలు నిర్వహిస్తారు. రాబోయే సంవత్సరాల్లో అమెరికాలోని అనేక ప్రాంతాల్లో ఎయిర్ మొబిలిటీ ప్రయోగాలు జరగనున్నాయని నాసా వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ప్రయోగాల్లో భాగంగా ఎయిర్టాక్సీకి 50కి పైగా మైక్రోఫోన్లు అమరుస్తారు. అనంతరం విమానం ఎగురుతున్నప్పటి దశల్లో జరిగే మార్పులను రికార్డు చేస్తారు. నాసా చేపట్టిన కార్యక్రమం భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ వాహనాలకు కీలకమని జోబీ ఏవియేషన్ సీఈఓ జోబెన్ చెప్పారు. నాసాతో కలిసి పనిచేయడం గర్వంగా ఉందన్నారు. చదవండి: స్పేస్‌లో మనిషి: మనుగడకోసం ఇస్రో మరో ముందడుగు -
కాబూల్ నుంచి భారతీయ సిబ్బంది వెనక్కి
న్యూఢిల్లీ: తాలిబన్ల వశమైన అఫ్గాన్‌లో పరిస్థితులు దారుణంగా మారడంతో కాబూల్‌లో భారత రాయబారిని, ఇతర దౌత్య సిబ్బందిని కేంద్రం సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చింది. దౌత్య సిబ్బందిని తీసుకువచ్చిన భారత వైమానిక దళానికి చెందిన సి–17 రవాణా విమానంలో మొత్తం 150 మంది దౌత్యవేత్తలు, అధికారులు, భద్రతా సిబ్బందిని తీసుకువచ్చారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని హిండెన్ విమానాశ్రయంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఈ విమానం ల్యాండయింది. అంతకు ముందే మరో విమానంలో 40 మంది భారత్‌కి చేరుకున్నారు. (చదవండి: తాలిబన్లు సంచలన ప్రకటన) దీంతో అఫ్గాన్ నుంచి దౌత్య సిబ్బంది తరలింపు పూర్తయిందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇప్పుడు తమ దృష్టి అంతా అక్కడున్న భారతీయుల్ని తీసుకురావడంపైనే ఉందని స్పష్టం చేసింది. ఢిల్లీకి చేరుకోవడానికి ముందు ఉదయం ఇంధనం నింపుకోవడానికి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో విమానం కాసేపు ఆగింది. అఫ్గానిస్తాన్‌లో భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ జామ్‌నగర్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కాబూల్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అన్నారు. అఫ్గాన్‌లో ఇంకా చాలా మంది భారతీయులు ఉన్నారని వారిని వెనక్కి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా తప్పనిసరిగా విమానాలు నడపాలన్నారు. అయితే తాము అఫ్గాన్ ప్రజల నుంచి దూరమయ్యేమని భావించడం లేదని , వారి సంక్షేమం కోసం ఏదైనా చేస్తామని అన్నారు. వారితో ఏర్పడిన బంధం విడదీయలేదని చెప్పారు. అందుకే వారితో నిరంతరం టచ్‌లో ఉంటామని, పరిస్థితులు ఎలా రూపాంతరం చెందుతాయో చెప్పలేమని టాండన్ పేర్కొన్నారు. ఎదురైన ఎన్నో సవాళ్లు భారతీయ దౌత్య సిబ్బందిని వెనక్కి తీసుకురావడంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయానికి ఇన్నాళ్లూ రక్షణ కల్పించిన ఇండో–టిబెట్ సరిహద్దు భద్రతా సిబ్బంది (ఐటీబీపీ) భద్రత మధ్య వీరు విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత్‌కు రావాలనుకునే ప్రయాణికులకు వీసాలు ఇచ్చే కార్యాలయం షహీర్ వీసా ఏజెన్సీపై తాలిబన్లు దాడికి దిగడంతో రెండు విమానాల్లో సిబ్బందిని తీసుకువచ్చారు. తొలివిడతలో ప్రయాణించాల్సిన భారతీయులు కాబూల్ విమానాశ్రయానికి వస్తుండగా తాలిబన్లు అడ్డగించారు. వారి దగ్గరున్న వస్తువులన్నీ లాక్కున్నారు. ఇక రెండో విడత వచ్చిన విమానంలో రాయబారి టాండన్ సహా 30 మంది దౌత్య సిబ్బంది, 99 ఐటీబీపీ కమాండోలు, నలుగురు జర్నలిస్టులతో సహా మొత్తం 21 మంది సాధారణ పౌరులు ఉన్నారు. కాబూల్‌లో పరిస్థితుల్ని సమీక్షిస్తున్నాం: జై శంకర్ మరోవైపు కాబూల్‌లో ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నామని విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. ç21 మంది భారత పౌరులను కాబూల్ నుంచి పారిస్‌కు తరలించినందుకు ఫ్రాన్స్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మన పౌరులను క్షేమంగా తీసుకురండి: ప్రధాని మోదీ అఫ్గానిస్తాన్‌లోని భారత పౌరులందరినీ క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంబంధిత అధికారులను ఆదేశించారు. భారత్‌కు రావాలని కోరుకుంటున్న అఫ్గాన్‌లోని హిందువులు, సిక్కులకు మన దేశంలో ఆశ్రయం కల్పించాలని చెప్పారు. అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన నేపథ్యంలో భారత్‌లో భద్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మంగళవారం కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్) సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల, జాతీయ భద్రతా సలహాదారు దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ల్, అఫ్గానిస్తాన్‌లో భారత రాయబారి రుద్రేంద్ర టాండన్‌లు హాజరయ్యారు. ఎంతో మంది అఫ్గాన్ పౌరులు భారత్ నుంచి సాయం అర్థిస్తున్నారని మోదీ చెప్పారు. వారందరికీ తగిన సాయం అందించాలని సూచించారు. (చదవండి: తాలిబన్ల తొలి మీడియా సమావేశం.. కీలక వ్యాఖ్యలు) -
కూలిన అగ్నిమాపక విమానం, 8 మంది దుర్మరణం
ఇస్తాంబుల్: టర్కీ అడవుల్లో చెలరేగిన మంటలను అర్పేందుకు రష్యా నుంచి వచ్చిన యాంఫిబియస్ బెరివ్ బీఈ–200 అగ్నిమాపక విమానం కుప్పకూలిన ఘటనలో 8 మంది మరణించారు. ఈ ఘటన దక్షిణ టర్కీలోని అదానా ప్రావిన్సులో చోటు చేసుకుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రమాదాన్ని పరిశీలించేందుకు దర్యాప్తు బృందం ఘటనా స్థలానికి బయలుదేరిందని టర్కీ ప్రభుత్వ మీడియా తెలిపింది. ప్రమాదం పట్ల టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లుత్ కావుసోగ్లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి త్యాగాలను టర్కీ మరచిపోదని వ్యాఖ్యానించారు. ప్రమాదానికి ముందు విమానంతో కమ్యూనికేషన్ తెగిపోయిందని, ఆ తర్వాత విమానం కూలినట్లు తెలిసిందని స్థానిక గవర్నర్ ఒమర్ ఫరూక్ కోస్కున్ తెలిపారు. ఈ ప్రమాదం పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతాపం వ్యక్తం చేశారు. ఇందులో టర్కీ పౌరులు మరణించడంపై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌కు పుతిన్ తన సంతాపం తెలిపారు. ఈ రెండు ఇంజిన్లు కలిగిన యాంఫిబియస్ అగ్నిమాపక విమానం 270 మెట్రిక్ టన్నుల నీటిని మోసుకెళ్లగలదు. చదవండి : చూపుడు వేలుపై 3 గంటలకు పైగా -
ముక్కలైన మిగ్-21.. పైలెట్ దుర్మరణం
చండీగఢ్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మిగ్-21 యుద్ధ విమానం ఒకటి ప్రమాదానికి గురైంది. గురువారం అర్ధరాత్రి దాటాక పంజాబ్ రాష్ట్రంలోని మోగా వద్ద విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలెట్, స్క్వాడ్రోన్ లీడర్ అభివన్ చౌదరి మృతిచెందినట్లు ఎయిర్‌ఫోర్స్ ట్విట్టర్లో ప్రకటించింది. సుమారు రాత్రి ఒంటి గంట సమయంలో వెస్ట్రన్ సెక్టార్లో లాంగియానా ఖుర్ద్ గ్రామంలో మిగ్ బైసన్ విమానం కూలిపోయినట్లు సమాచారం. కాగా, ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు భారత వైమానిక దళం అధికారులు చెప్పారు. కాగా, అభినవ్ కుటుంబానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సంతాపం తెలిపింది. మూడోది ఈ ఏడాది మిగ్ యుద్ధ విమానాల ప్రమాదాల్లో ఇది మూడవది. జనవరి నెలలో రాజస్థాన్ రాష్ట్రంలోని సూరత్ ఘడ్ వద్ద విమానం కూలిపోగా, పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. మార్చి నెలలో ఎయిర్ బేస్ వద్ద మిగ్ బైసన్ విమాన ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ గుప్తా చనిపోయారు. ట్రైనింగ్ కోసం విమానం బయలుదేరినపుడు ఈ ప్రమాదం జరగ్గా.. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. -
ఆక్సిజన్ కోసం సీ-17 ఎయిర్‌క్రాఫ్ట్ ఒడిశాకు పంపిన తెలంగాణ ప్రభుత్వం
-
మళ్లీ ‘మహా’ రగడ
సాక్షి ముంబై: మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం, గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ మధ్య మరో వివాదం రాజుకుంది. ప్రభుత్వ విమానంలో గవర్నర్ ప్రయాణించేందుకు రాష్ట్ర సర్కారు గురువారం అనుమతి నిరాకరించింది. అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు డెహ్రాడూన్‌కు వెళ్లడానికి సిద్ధమైన గవర్నర్ ముంబై ఎయిర్‌పోర్టులో విమానంలో కూర్చున్న అనంతరం అనుమతి లేదని అధికారులు తేల్చిచెప్పారు. దాదాపు రెండు గంటల తర్వాత ప్రైవేట్ విమానంలో గవర్నర్ డెహ్రాడూన్‌కు బయల్దేరారు. ప్రభుత్వ అధికారిక విమానంలో గవర్నర్ ప్రయాణానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనతో రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. గవర్నర్ పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. మా తప్పేమీ లేదు: సీఎం ఆఫీస్ ప్రభుత్వ విమానంలో గవర్నర్ ప్రయాణించేందుకు ఇంకా అనుమతి లభించలేదని, ఈ విషయాన్ని రాజ్‌భవన్‌కు ముందే తెలియజేశామని సీఎం కార్యాలయం స్పష్టం చేసింది. గవర్నర్‌కు ఇబ్బంది కలిగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని పేర్కొంది. ప్రయాణంపై 10 రోజుల క్రితమే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని గవర్నర్ కార్యాలయం తెలియజేసింది. -
'టాటా' యుద్ద విమానాలు వచ్చేస్తున్నాయి!
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఒకటైన టాటా గ్రూపు.. యద్ధ విమానాల తయారీలోనూ తన సత్తా చాటనుంది. ఖరీదైన రక్షణ దిగుమతులకు ప్రత్యామ్నాయంగా... స్థానికంగానే వాటి ఉత్పత్తిని ప్రోత్సహించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ "ఆత్మనిర్భర్ భారత్" కార్యక్రమంలో టాటా గ్రూపు పాలుపంచుకోనుంది. అత్యంత ఎత్తులో విహరించగల ట్విన్ ఇంజన్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీలో తన సామర్ధ్యాలను టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్ లిమిటెడ్. బుధవారం నుంచి(ఈ నెల 3 నుంచి 5 వరకు) బెంగళూరులో జరిగే 'ఏరో ఇండియా 2021" కార్యక్రమంలో ప్రదర్శించనుంది. కంపెనీ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు. రెండేళ్ళకొకసారి బెంగళూరులో ఏరో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. యుద్ధ విమానాల తయారీకి సంబంధించి మేధోపరమైన హక్కులను టాటా అడ్వాన్స్డ్ సి ఇప్పటికే సొంతం చేసుకుంది. టాటా సంస్థ రూపొందించిన మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ విజయం సాధిస్తే... ప్రైవేటు రంగంలో యుద్ధ విమానాలను తయారు చేయగల తొలి దేశీయ సంస్థగా అవతరించనుంది. ప్రభుత్వ రంగంలోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లీమిటెడ్ ఒక్కటే ఇప్పటి వరకు ఈ సామర్థ్యాలను నిరూపించుకున్న సంస్థ కావడం గమనార్హం. అంతేకాదు, భారత్‌లో తయారీ కార్యక్రమానికి మరింత మద్దతు కూడా లభించనుంది. టాటా నూతన యుద్ద విమానాన్ని సరిహద్దుల్లో నిఘా, సైనిక అవసరాలకు వినియోగించే అవకాశం ఉంటుందని కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. -
ప్రధాని కోసం కొత్త విమానం
-
ఎయిర్ ఇండియా వన్ వచ్చేసింది
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం తరహాలోనే మన దేశంలో వీవీఐపీలు ప్రయాణించడం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎయిర్ ఇండియా వన్ అమెరికా నుంచి భారత్‌కి చేరుకుంది. అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థ కలిగిన బోయింగ్–777 విమానం అమెరికాలోని టెక్సాస్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ విమానం చేరుకున్నట్టు పౌర విమానయాన శాఖ అధికారులు వెల్లడించారు. ఈ విమానంలో ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య మాత్రమే ప్రయాణిస్తారు. వీవీఐపీలు ప్రయాణించడానికి వీలుగా డిజైన్ చేసి , క్షిపణి దాడుల్ని తట్టుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసి ఆధునీకరించడం కోసం రెండు విమానాల్ని డల్లాస్‌లో బోయింగ్ సంస్థకి పంపారు. వీటిలో ఒకటి భారత్‌కు వచ్చింది. రెండో విమానం మరో రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఈ విమానంపై భారత్ అనే అక్షరాలు, అశోక చక్రం ఉన్నాయి. గత జూలైలోనే ఈ విమానాలు భారత్‌కు చేరుకోవాల్సి ఉండగా కరోనా వైరస్, సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైంది. గడిచిన 25 సంవత్సరాలుగా ప్రధానమంత్రి ఎయిర్ఇండియా వన్ కాల్ సైన్‌తో బోయింగ్ 747 విమానాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రత్యేకతలివీ ► ఎయిర్ ఇండియా వన్ విమానంలో భద్రతా వ్యవస్థ అమెరికా అధ్యక్షుడి విమానం ఎయిర్ ఫోర్స్ వన్‌కి ఏ మాత్రం తీసిపోదు. ఈ విమానానికి క్షిపణి దాడుల్ని ఎదుర్కొనే రక్షణ వ్యవస్థ ఉంది. లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్‌ఫ్రేర్డ్ కౌంటర్‌మెజర్స్ (ఎల్ఏఐఆర్సీఎం), సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ (ఎస్పీఎస్)ను అమర్చారు. ► అమెరికా అధ్యక్ష విమానం తర్వాత మన ఎయిర్ ఇండియా వన్‌లోనే ఎస్‌పీఎస్‌ను అమర్చారు. ఈ రక్షణ వ్యవస్థతో శత్రువుల రాడార్ ఫ్రీక్వెన్సీని జామ్ చెయ్యగలదు. క్షిపణుల్ని దారి మళ్లించగలదు. ► అమెరికా నుంచి భారత్ మధ్య ప్రయాణం ఎక్కడా ఆగకుండా చేయవచ్చు. ఇంధనం నింపడానికి కూడా ఆగాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుతం వాడుతున్న విమానంలో పది గంటల తరువాత మళ్లీ ఇంధనం నింపవలసివస్తుంది. కొత్త విమానం గంటకు 900 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ► విమానంలో ప్రధాని కార్యాలయం, సమావేశాల నిర్వహణకు పెద్ద హాలు ఉన్నాయి. ఈ లోహ విహంగం ఫూర్తి స్థాయి ఫ్లయింగ్ కమాండ్ సెంటర్ మాదిరి పనిచేస్తుంది. ► ఈ విమానాల తయారీకి రూ.8,400 కోట్లు ఖర్చు అయింది. ► ఈ విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు నడపరు. భారత వాయుసేనకి చెందిన పైలట్లు నడుపుతారు. ► ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్ఎల్)కు ఈ రెండు విమానాల నిర్వహణ బాధ్యతల్ని అప్పగించారు. -
నావికా నాయికలు
త్రివిధ దళాలు నిన్న ఒకేసారి.. మహిళలు ఎగరేసిన త్రివర్ణ పతాకాలు అయ్యాయి! నేవీ హెలికాప్టర్లు తొలిసారి మహిళల చేతికి వచ్చాయి! ఆర్మీ ‘పర్మినెంట్’ సర్వీస్‌లలోకి మహిళలు రావడం మొదలైంది! ఎయిర్‌ఫోర్స్‌లో రఫేల్‌ను ఒక మహిళ నడపబోతోంది! రితిసింగ్, కుముదిని త్యాగి.. నావికా నాయికలుగా నిలవడం పతాక సన్నివేశం అయింది! పంచభూతాలతో చెలిమి కలుపుకొని శత్రువు తో తలపడవలసిన పరిస్థితి నేవీలో ఉంటుంది. నింగి, నేల, నీరు అని చూడ్డానికి ఉండదు. ఎగరడమే, దూకడమే, ఈదడమే! ‘సమరమే..’ అంటూ యుద్ధనౌక నుంచి విమానాన్నైనా హెలికాప్టర్నైనా పైకి లేపాలి. సరిహద్దుల వైరి స్థావరాల్లో ప్రకంపనలు రేపాలి. దుద్భేద్యాలను బీటలు వార్చేంత మెరుపు వేగంతో గగనం నుంచి నిప్పులు కురిపించాలి. ఇంతటి అరివీరభయంకర విధి నిర్వహణ అవకాశం నేవీ చరిత్రలోనే తొలిసారిగా ఇద్దరు మహిళల చేతికి అంది వచ్చింది! అంది రావడం కాదు, అంది పుచ్చుకున్నారు! ఇప్పటివరకు పురుషులకు మాత్రమే పరిమితమై ఉన్న ఈ సవాలును కష్టపడి చేజిక్కించుకున్నారు. నౌకాదళంలో ఇప్పటికే సబ్ లెఫ్ట్నెంట్లుగా ఉన్న రితీసింగ్, కుముదినీ త్యాగి నేవీలోని ‘అబ్జర్వర్’ కోర్సును విజయవంతంగా పూర్తి చేసి ఈ ఘనతను సాధించారు. భారతీయ నౌకాదళానికీ గౌరవం, గర్వం తెచ్చిపెట్టారు. సోమవారం కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్ నుంచి కదనోత్సాహంతో కొత్త పాత్రను పోషించడానికి బయటికి వచ్చిన రితి, కుముదినిలకు అక్కడి ఐ.ఎన్.ఎస్. గరుడ భారతీయ నౌకా స్థావరం ‘వింగ్స్’ని తొడిగి అభినందించింది. బాధ్యతల పూలగుచ్చాన్ని చేతికి అందించింది. యుద్ధనౌకల్లోని ఫైటర్ హెలికాప్టర్ల పైలట్లు ఇప్పుడు.. రితి, కుముదిని. యుద్ధనౌకల్లో ఆకస్మిక, అత్యవసర విధుల నిర్వహణ మహిళలకు అనువుగా ఉండదు. గంటల పాటు సుదీర్ఘంగా సముద్రంపై గస్తీ కాస్తుండాలి. సిబ్బంది గదుల్లో మరుగు, మాటు ఉండవు. మహిళలకు అవసరం అయ్యే ప్రత్యేకమైన సదుపాయాలు, సౌకర్యాలు కనిపించవు. నీటిలో నీటిలా, గాలిలో గాలిలా ఉండిపోవలసిందే. అందుకే నేవీలో వైద్యాధికారులు, వ్యూహకర్తలుగా మాత్రమే మహిళలు కనిపిస్తారు. ఈ పరిస్థితి రితి, కుముదినిలతో మారబోతోంది. అంటే వీళ్ల కోసం నేవీ తనను తాను మార్చుకుంటుందని కాదు. నేవీకి అవసరమైన పోరాట పటిమను.. అన్ని ప్రతికూలతలకూ అతీతంగా వీళ్లు కనబరుస్తారు. శత్రువుపై ఒక కన్నేసి ఉంచుతారు. దాడులను ఊహిస్తారు. దళాలను అప్రమత్తం చేస్తారు. అప్పటికప్పుడు హెలీకాప్టర్లలో రివ్వున లేచి యుద్ధ సన్నద్ధ సంకేతాలను అందజేస్తారు. వీరి ఆగమనం కోసం ఇప్పుడు నౌకాదళంలోని ఎం.హెచ్.–60 ఆర్ హెలికాప్టర్లు ఎదురు చూస్తున్నాయి. రితి సింగ్ హైదరాబాద్ అమ్మాయి. మూడు తరాలుగా వాళ్లది ‘రక్షణ దళాల కుటుంబం’. రితి తాతగారు ఆర్మీ ఆఫీసర్. రితి తండ్రి నేవల్ ఆఫీసర్. రితి ఇప్పుడు ‘వింగ్’ ఫైటర్ పైలట్. ‘వైట్ యూనిఫాం వేసుకోవడం నా కల’’ అంటారు రితి. ఇక కుముదిని యు.పి.లోని ఘజియాబాద్ నుంచి వచ్చారు. 2015లో ఒక నౌకాదళ విమాన ప్రమాదంలో లెఫ్ట్‌నెంట్ కిరణ్ షెకావత్ మరణించిన దుర్ఘటన కుముదిని నేవీలోకి వచ్చేందుకు ప్రేరణ అయింది. ఇక ఇటీవలే ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలను నడిపేందుకు శిక్షణ పొందే బృందంలో సభ్యురాలిగా ఒక మహిళను కూడా ఎంపిక చేసినట్లు యాదృచ్ఛికంగా సోమవారమే భారత వైమానిక దళం ప్రకటించింది. హర్యానాలోని అంబాలాలో ఉన్న ‘గోల్డెన్ యారో’ స్థావరంలో ప్రస్తుతం ఆమె శిక్షణ పొందుతున్నారు. రఫేల్ వంటి ఒక ‘మల్టీ రోల్’ యుద్ధ విమానాన్ని ఒక మహిళ ఆపరేట్ చేయబోవడం అన్నది కూడా రితి, కుముదిని సాధించిన ఘనతకు, సృష్టించిన చరిత్రకు సమానమైనదే. అయితే ఆ మహిళ ఎవరు? ఆ మహిళకు మిగ్–21 ఫైటర్ జెట్‌ను నడిపించిన అనుభవం ఉందన్న ఒక విషయాన్ని మాత్రమే ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. 2018లో ఫ్లయింగ్ ఆఫీసర్ అవని చతుర్వేది సోలోగా యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలట్‌గా గుర్తింపు పొందారు. అప్పుడు ఆమె నడిపింది మిగ్–21 నే. వైమానిక దళంలోని యుద్ధ విధుల్లోకి ప్రయోగాత్మకంగా మహిళల్ని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన ఏడాదికే 2016 జూలైలో ‘ఫ్లయింగ్ ఆఫీసర్’ కోర్సు పూర్తి చేసుకున్న ముగ్గురు యువతులలో అవని ఒకరు. మిగతా ఇద్దరు పైలట్లు భావనా కాంత్, మోహనా సింగ్. ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్‌లో 10 మంది మహిళా ఫైటర్లు, 18 మంది మహిళా నేవిగేటర్లు ఉన్నారు. మొత్తంగా 1875 మహిళా అధికారులు ఉన్నారు. -
కొచ్చిన్ షిప్‌యార్డు కేసు నిందితుల అరెస్ట్
న్యూఢిల్లీ: గత ఏడాది జూన్, సెప్టెంబర్ మధ్య కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో నిర్మిస్తున్న స్వదేశీ విమాన వాహక నౌక నుంచి క్లిష్టమైన ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్‌ను దొంగిలించినందుకుగాను బిహార్, రాజస్తాన్‌లకు చెందిన ఇద్దరు వ్యక్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. గత ఏడాది అక్టోబర్‌లో కేరళ పోలీసుల నుంచి దర్యాప్తు స్వీకరించిన ఉగ్రవాద నిరోధక సంస్థ అనేక రాష్ట్రాల్లో దాదాపు తొమ్మిది నెలల పాటు విస్తృతమైన దర్యాప్తు జరిపిన తరువాత నిందితులు సుమిత్ కుమార్ సింగ్ (23), దయా రామ్(22)లను బుధవారం అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. నిందితుల వద్ద నుంచి ‘దేశ భద్రతకు సంబంధించిన’ డాటాతో పాటు ప్రాసెసర్లు, ర్యామ్‌లు, సాలిడ్ స్టేట్ డ్రైవ్‌లతో సహా దొంగిలించిన ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. సుమిత్ కుమార్ సింగ్ బిహార్‌లోని ముంగేర్ జిల్లాకు చెందిన వాడు కాగా.. దయా రామ్ రాజస్తాన్‌కు చెందిన హనుమన్‌గఢ్‌కు చెందినవారు. ఎన్ఐఏ దర్యాప్తులో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. దొంగిలించబడిన కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: తిరుచ్చిలో ఎన్ఐఏ దూకుడు) (నిందితులు దయారమ్, సుమిత్ కుమార్ సింగ్(ఎడమ నుంచి)) ఈ సందర్భంగా ఎన్ఐఏ అధికారులు మాట్లాడుతూ.. ‘వీరిద్దరు నిర్మాణంలో ఉన్న విమాన వాహక నౌకలో పెయింటింగ్ పనిలో కాంట్రాక్టు కార్మికులుగా చేరారు. డబ్బుకు ఆశపడి ఎలక్ట్రానిక్ పరికరాలను దొంగిలించారు. వాటిలో ఐదు మైక్రో ప్రాసెసర్లు, 10 ర్యామ్‌లు, ఓడలోని మల్టీ-ఫంక్షనల్ కన్సోల్‌ల నుంచి ఐదు సాలిడ్ స్టేట్ డ్రైవ్‌లు ఉన్నాయి. ఆ తర్వాత సెప్టెంబరులో నిందితులు తమ స్వగ్రామాలకు బయలుదేరారు. విషయం తెలియడంతో కేరళ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎన్ఐఏ సెప్టెంబర్ 26 న కేసును రీ రిజస్టర్ చేసి అక్టోబర్ 16 న కేరళ పోలీసుల నుంచి దర్యాప్తు బదిలీ చేయించుకున్నాము. నిందితుల కోసం ఈ తొమ్మది నెలల కాలంలో ఓడలో పనిచేసిన 5,000 మందికి పైగా వేలు, అరచేతి ముద్రలను ఏజెన్సీ విశ్లేషించింది. పెద్ద సంఖ్యలో సాక్షులను విచారించాము. అంతేకాక ఈ "బ్లైండ్ కేసు" నిందితులను పట్టుకోవడం కోసం 5 లక్షల రివార్డును ప్రకటించాము’ అని తెలిపారు. -
విమానాలకు తప్పని మిడతల ముప్పు
న్యూఢిల్లీ: మిడతల దండు పచ్చని పైర్లకు, చెట్లకు మాత్రమే ప్రమాదంగా పరిణమించగా వీటివల్ల విమానాలకూ ముప్పు వాటిల్లే అవకాశముందని డీజీసీఏ(వైమానిక నియంత్రణ సంస్థ) హెచ్చరించింది. విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ అయ్యే సమయాల్లో ఈ ప్రమాదం పొంచి ఉందని తెలిపింది. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై డీజీసీఏ శుక్రవారం పైలట్లకు, ఇంజనీర్లకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల్లో.. మిడతలు సాధారణంగా తక్కువ ఎత్తులోనే విహరిస్తాయని తెలిపింది. (రాకాసి పురుగుపై టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు) విమానం ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో విమానంలోని ప్రవేశ మార్గాల(ఇంజిన్ ఇన్లెట్, ఎయిర్ కండిషనింగ్ ప్యాక్ ఇన్లెట్, తదితర మార్గాలు) ద్వారా మిడతల దండు లోనికే ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది. తద్వారా విమానాలు ఎగురుతున్నప్పుడు ఆ ద్వారాలు పాక్షికంగా లేదా పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పిటోట్, స్టాటిక్ సోర్స్(గాలి ప్రవాహ వేగాన్ని కొలిచే సాధనాలు) మూసుకుపోవడం వల్ల గాలివేగం, అల్టీమీటర్ సూచీలు తప్పుడు సంకేతాలిస్తాయని తెలిపింది. కాగా ఖండాలను దాటుతూ పయనిస్తోన్న మిడతల దండు భారత్‌లో తొలిసారిగా రాజస్థాన్‌లోకి ప్రవేశించింది. అనంతరం పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరిస్తూ విధ్వంసం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. (మిడతల దండుపై దండయాత్ర)