శంషాబాద్: టెక్నాలజీ హబ్‌గా మారిన హైదరాబాద్ ఏరోస్పేస్ వ్యాలీగా కూడా ఎదుగుతోందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. నూతన పారిశ్రామిక విధానంతో పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర సర్కారు పెద్దపీట వేస్తోంద న్నారు. గురువారం జీఎంఆర్ హైదరాబాద్ ఏరోస్పేస్ పార్క్‌లో ఫ్రాన్స్‌కు చెందిన విమాన రంగ ఉత్పత్తుల సంస్థ శాఫ్రాన్ ఎలక్ట్రికల్ అండ్ పవర్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ ఫెసిలిటీ కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
వైమానిక రంగంలోని నిర్వహణ, మరమ్మతుల రంగంలో కేవలం దేశంలోనే కాకుండా మధ్యప్రాచ్య దేశాలకు హైదరా బాద్ కేంద్ర బిందువుగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. శాఫ్రాన్ సంస్థ ప్రారంభించ బోయే నిర్వహణ, మరమ్మతుల కేంద్రం (ఎంఆర్‌ఓ) అంతర్జాతీయంగా హైదరాబాద్‌ను మరో స్థానానికి తీసుకెళ్తుందని కేటీఆర్ చెప్పారు.
విమాన ఇంజన్‌లకు వైర్ హార్నెస్‌లను శాఫ్రాన్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తుంది. అలాగే, కీలకమైన లీప్ ఇంజన్ల కోసం క్లిష్టమైన ఏరో ఇంజన్ భాగాలను శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ ఫ్యాక్టరీ తయారు చేస్తుంది.
ఫ్రాన్స్‌కు నేరుగా విమానాలు నడవాలి
రాష్ట్రంలో ఇప్పటికే పరిశ్రమలు కొనసాగిస్తున్న పెట్టుబడిదారులు మరిన్ని పరిశ్రమలు పెడుతు న్నారంటే వారే తెలంగాణకు బ్రాండ్ అంబాసి డర్ వంటి వారని సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పినట్లు మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. హైదరాబాద్–ఫ్రాన్స్‌కు మధ్య నేరుగా విమా నాలు కూడా నడవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో అంతర్జాతీయ స్థాయి కంపెనీలు అడుగుపెట్టడంతో ఉపాధి కూడా మెరుగవుతోందని చెప్పారు. సర్కారు యువతను టీవర్క్, వీహబ్, స్టార్టప్ కేంద్రాలతో ప్రోత్సహిస్తోందన్నారు. హైదరాబాద్ విమానాశ్ర యం కూడా అనేక అంశాల్లో అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
త్వరలోనే ఎంఆర్‌ఓ
సీఎఫ్‌ఎం, లీప్ ఇంజిన్ల కోసం అతిపెద్ద నిర్వ హణ మరమ్మతుల కేంద్రాన్ని (ఎంఆర్‌ఓ) త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు శాఫ్రాన్ గ్రూప్ సీఈఓ ఒలివియర్ ఆండ్రీస్ ప్రకటించారు. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో మరో కొత్త అధ్యాయంగా నిలుస్తుందన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా 2025 నాటికి 200 మిలి యన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సీఈఓ జీన్‌పాల్ అలరీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యరద్శి జయేశ్ రంజన్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment