Aerospace Park
-
ఖర్గే ట్రస్ట్‌కు ఏరో స్పేస్ పార్కు భూమి కేటాయింపు.. బీజేపీ విమర్శలు
బెంగళూరు: బెంగళూరు సమీపంలోని డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్టుకు ఐదు ఎకరాల భూమిని కేటాయించడంపై కర్ణాటక రాజకీయాల్లో వివాదం రాజుకుంది. సిద్దార్థ విహార ట్రస్టుకు కర్ణాటక ఇండస్ట్రీయల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డు స్థలాన్ని మంజూరు చేయడాన్ని బీజేపీ ఖండించింది.ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడటమేనని బీజేపీ ఐటీసెల్ అధ్యక్షుడు అమిత్ మాల్వియా మండిపడ్డారు. కేవలం బంధుప్రీతి వల్లే భూమి కేటాయించారని దీనిపై ఖర్గే సమాధానం చెప్పాలని మాల్వియా డిమాండ్ చేశారు.After Chief Minister Siddaramaiah, now Congress President Mallikarjun Kharge and family are embroiled in a land scam in Karnataka…It has come to light from a news report, backed by documents that a trust (Siddhartha Vihara Trust) run by Mallikarjun Kharge's family, has been… https://t.co/SbhMjcQ8pC— Amit Malviya (@amitmalviya) August 27, 2024 మరోవైపు కేఐఏడీబీ భూమిని పొందేందుకు ఖర్గే కుటుంబికులు ఏరోస్పేస్ రంగంలో ఎప్పుడు పారిశ్రామికవేత్తలు అయ్యారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లెహర్‌సింగ్ సిరోయ ప్రశ్నించారు. హైటెక్ డిఫెన్స్ ఏరోస్పేస్ పార్క్‌లో ఐదు ఎకరాలను ఎస్సీ కోటాలో ఈ ట్రస్టుకు ఎలా కేటాయించారని విమర్శించారు. ఈ అక్రమ భూముల కేటాయింపుల వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.When did the Kharge family become aerospace entrepreneurs to be eligible for KIADB land? Is this about misuse of power, nepotism, and conflict of interest? My statement. 1/6@PMOIndia @AmitShah @JPNadda @BJP4India @BJP4Karnataka @INCIndia @INCKarnataka @RahulGandhi @kharge pic.twitter.com/7lwitXtzuP— Lahar Singh Siroya (@LaharSingh_MP) August 25, 2024 కాగా ఖర్గే కుటుంబం నిర్వహిస్తున్న సిద్ధార్థ విహార్ ట్రస్ట్‌కు 5 ఎకరాల భూమిని షెడ్యూల్ కులం (ఎస్సీ) కోటా కింద మంజూరు చేశారు. దీనికి ఖర్గే, ఆయన అల్లుడు, కలబురగి ఎంపీ రాధాకృష్ణ, కుమారుడు రాహుల్ ఖర్గే, ఇతర కుటుంబ సభ్యులు ట్రస్టీలుగా ఉన్నారు.అయితే.. భూముల కేటాయింపును రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి ఎంబీ పాటిల్ సమర్థించుకున్నారు. సిద్దార్థ విహార ట్రస్టుకు నిబంధనలకు అనుగుణంగానే స్థలం కేటాయించామని అన్నారు. అక్కడ పరిశోధనలు, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు భూమి కేటాయించామని తెలిపారు. రాహుల్ ఖర్గే ఐఐటీ చదివారని, వారి కుటుంబం విద్యారంగంలో ఉందన్నారు. పరిశోధనా కేంద్రాలకు అనుకూలంగా ఉండాలనే ఆ భూమిని కేటాయించామని తెలిపారు. గతంలో బీజేపీ ప్రభుత్వం చాణక్య యూనివర్సిటీకి పారిశ్రామికవాడలో కేవలం రూ.50 కోట్లకు 116 ఎకరాల భూమిని కేటాయించిందని, దీనిని ఏ విధంగా చూడాలని ప్రశ్నించారు. -
ఏరోస్పేస్ వ్యాలీగా హైదరాబాద్
శంషాబాద్: టెక్నాలజీ హబ్‌గా మారిన హైదరాబాద్ ఏరోస్పేస్ వ్యాలీగా కూడా ఎదుగుతోందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. నూతన పారిశ్రామిక విధానంతో పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర సర్కారు పెద్దపీట వేస్తోంద న్నారు. గురువారం జీఎంఆర్ హైదరాబాద్ ఏరోస్పేస్ పార్క్‌లో ఫ్రాన్స్‌కు చెందిన విమాన రంగ ఉత్పత్తుల సంస్థ శాఫ్రాన్ ఎలక్ట్రికల్ అండ్ పవర్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ ఫెసిలిటీ కేంద్రాలను ఆయన ప్రారంభించారు. వైమానిక రంగంలోని నిర్వహణ, మరమ్మతుల రంగంలో కేవలం దేశంలోనే కాకుండా మధ్యప్రాచ్య దేశాలకు హైదరా బాద్ కేంద్ర బిందువుగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. శాఫ్రాన్ సంస్థ ప్రారంభించ బోయే నిర్వహణ, మరమ్మతుల కేంద్రం (ఎంఆర్ఓ) అంతర్జాతీయంగా హైదరాబాద్‌ను మరో స్థానానికి తీసుకెళ్తుందని కేటీఆర్ చెప్పారు. విమాన ఇంజన్లకు వైర్ హార్నెస్‌లను శాఫ్రాన్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తుంది. అలాగే, కీలకమైన లీప్ ఇంజన్ల కోసం క్లిష్టమైన ఏరో ఇంజన్ భాగాలను శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ ఫ్యాక్టరీ తయారు చేస్తుంది. ఫ్రాన్స్‌కు నేరుగా విమానాలు నడవాలి రాష్ట్రంలో ఇప్పటికే పరిశ్రమలు కొనసాగిస్తున్న పెట్టుబడిదారులు మరిన్ని పరిశ్రమలు పెడుతు న్నారంటే వారే తెలంగాణకు బ్రాండ్ అంబాసి డర్ వంటి వారని సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పినట్లు మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. హైదరాబాద్–ఫ్రాన్స్‌కు మధ్య నేరుగా విమా నాలు కూడా నడవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో అంతర్జాతీయ స్థాయి కంపెనీలు అడుగుపెట్టడంతో ఉపాధి కూడా మెరుగవుతోందని చెప్పారు. సర్కారు యువతను టీవర్క్, వీహబ్, స్టార్టప్ కేంద్రాలతో ప్రోత్సహిస్తోందన్నారు. హైదరాబాద్ విమానాశ్ర యం కూడా అనేక అంశాల్లో అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. త్వరలోనే ఎంఆర్ఓ సీఎఫ్ఎం, లీప్ ఇంజిన్ల కోసం అతిపెద్ద నిర్వ హణ మరమ్మతుల కేంద్రాన్ని (ఎంఆర్ఓ) త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు శాఫ్రాన్ గ్రూప్ సీఈఓ ఒలివియర్ ఆండ్రీస్ ప్రకటించారు. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో మరో కొత్త అధ్యాయంగా నిలుస్తుందన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా 2025 నాటికి 200 మిలి యన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సీఈఓ జీన్‌పాల్ అలరీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యరద్శి జయేశ్ రంజన్ తదితరులున్నారు. -
విమానాల గ్యారేజ్! ఇక్కడ విమానాలు రిపేర్ చేయబడును
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైమానిక, అంతరిక్ష, రక్షణ రంగాలకు చెందిన పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఈ రంగాల్లో కొత్తగా వస్తున్న నిర్వహణ, మరమ్మతులు, ఓవర్ హాలింగ్ (ఎంఆర్వో) రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆసక్తి చూపుతోంది. ఎంఆర్వో రంగంలో అంతర్జాతీయంగా అవకాశాలు పెరుగుతుండటంతో కొత్త అవకాశాలతో భారత్‌తో పాటు మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాల అవసరాలు తీర్చొచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జీఎంఆర్ ఏరోటెక్, ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎంఆర్వో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. బేగంపేట విమానాశ్రయంలో ఎంఆర్వో హబ్ ఏర్పాటు చేసేందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సుముఖత చూపుతుండటంతో నిర్వహణ, మరమ్మ తులు, ఓవర్ హాలింగ్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించాలని భావిస్తోంది. భారత్‌లో ఎంఆర్వో రంగం ఏటా 15% వృద్ధి రేటుతో ప్రస్తుతం రూ.10వేల కోట్ల పరిశ్రమగా ఎదుగుతుండటంతో మహారాష్ట్ర, ఢిల్లీ ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకుంటున్నాయి. తెలంగాణ కూడా వీటి బాటలోనే నడవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఓఈఎం కంపెనీల పెట్టుబడులు వైమానిక, రక్షణ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరింగ్ (ఓఈఎం) కంపెనీలు ఇప్పటికే పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చాయి. దీంతో ఐదేళ్లుగా రాష్ట్రం ఏరోస్పేస్ హబ్‌గా మారుతోంది. లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ ఏవియేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు టాటా, అదానీ, కల్యాణి వంటి దేశీయ కంపెనీలు కూడా హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. టాటా గ్రూప్ తమ ఏరోస్పేస్ ఉత్పత్తుల్లో 90 శాతం హైదరాబాద్ నుంచే తయారు చేస్తోంది. జీఈ, సాఫ్రాన్ హైదరాబాద్‌లో ఏరో ఇంజిన్ తయారీ కర్మాగారాలను ఏర్పాటు స్థాపించగా, బోయింగ్ సంస్థ అపాచీ, చినోక్స్ హెలీకాప్టర్లు, యుద్ధ విమానాల విడిభాగాలు, లాక్‌హీడ్ హెలికాప్టర్ క్యాబిన్లు, ఎఫ్–16 రెక్కలను తయారుచేస్తోంది. అంతర్జాతీయ ఏరోస్పేస్ సంస్థలు సీఎఫ్ఎం, ఫ్రాట్ అండ్ విట్నీ రాష్ట్రంలో ఇంజిన్ ట్రైనింగ్ సెంటర్లు కూడా నిర్వహిస్తున్నాయి. మౌలిక వసతులు, శిక్షణపై దృష్టి వైమానిక, రక్షణ రంగాల్లో అంతర్జాతీయ పెట్టుబడులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు నైపుణ్య శిక్షణపై దృష్టి సారించడం ద్వారా ఎంఆర్వో రంగం కూడా వృద్ధి చెందుతుందని పరిశ్రమల శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు డజను వరకు డీఆర్డీఓ పరిశోధనశాలలు, ప్రభుత్వరంగ సంస్థలు ఉండగా, ఏరోస్పేస్ రంగంలో 25కు పైగా పెద్ద కంపెనీలు, సుమారు 1,200 వరకు అనుబంధ పరిశ్రమలు పని చేస్తున్నాయి. ఏరోస్పేస్ రంగం కోసం ఆదిబట్ల, ఎలిమినేడు ఏరోస్పేస్ పార్కులతో పాటు కొత్తగా మరో 3 కొత్త పార్కులను కూడా ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎంఆర్వో రంగంలో నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో కొత్తగా శిక్షణ సంస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. పౌర విమానయాన రంగంలో ఐఎస్బీ ద్వారా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఏరోనాటికల్ సొసైటీ ద్వారా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (భూమిని కేటాయించారు) ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. అంతర్జాతీయ సంస్థలతో కలసి రాష్ట్ర ప్రభుత్వం ఏరోస్పేస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఏరోస్పేస్ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహిచేందుకు ‘టి హబ్’ఇప్పటికే అంతర్జాతీయ ఏరోస్పేస్ సంస్థలు బోయింగ్, ప్రాట్ అండ్ విట్నీ, కాలీన్స్ ఏరోస్పేస్ తదితరాలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. చదవండి: అభివృద్ధిలో ప్రజా కోణం ఏది? -
ఎలిమినేడులో ఏరోస్పేస్ పార్కు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు సమీపంలో ఏరోస్పేస్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. ఇందుకు సంబంధించి భూసేకరణ పనులు వేగవంతం చేశామని, త్వరలోనే ఈ పార్కు ఏర్పాటుకు సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఇక్కడున్న 7 ఏరోస్పేస్ పార్కులకు ఇది అదనమని పేర్కొన్నారు. శాసనమండలి సమావేశాల్లో భాగంగా సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు ప్రభాకర్‌రావు, ఫారుక్‌హుస్సేన్ లేవనెత్తిన అంశాలపై మంత్రి మాట్లాడారు. ‘హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ ఏరోస్పేస్ హబ్‌గా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఆదిభట్లలో ఉన్న ఏరోస్పేస్ సెజ్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. జీఎంఆర్ ఎయిర్‌పోర్టులో ప్రత్యేకంగా ఏరోస్పేస్ పార్కుకు భూమిని నోటిఫై చేశాం. నాదర్గుల్లో కూడా ఏరోస్పేస్ పార్కుకు భూములు కేటాయించాం. ఇబ్రహీంపట్నానికి 3 కిలోమీటర్ల దూరంలో 100 ఎకరాల్లో కాంపొజిట్ పార్కు ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ఇప్పటికే 40 సంస్థలకు భూములు కూడా కేటాయించాం. హైదరాబాద్, సమీప ప్రాంతాల్లో పెట్టుబడులకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. బెంగళూరు–హైదరాబాద్ మధ్య రక్షణ పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాం. దీంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని వెనుకబడ్డ ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయని కేంద్రానికి సూచిస్తే పట్టించుకోకుండా బుందేల్‌ఖండ్‌కు మంజూరు చేసింది’అని వివరించారు. మీటరు బిగించుకునే గడువు పెంపు.. ‘జలమండలి పరిధిలో 20 వేల కిలోలీటర్ల వరకు ఉచితంగా తాగునీరు అందిస్తున్నాం. ఇందుకు ప్రతి ఒక్కరు నల్లాకు మీటరు బిగించుకోవాలి. 9.85 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. మార్చి నెలాఖరు వరకు మీటరు బిగించుకునే గడువు ఉంది. క్షేత్రస్థాయిలో ప్రజల కోరిక మేరకు మరో నెలగడువు పెంచుతున్నాం. నల్లాకు ఆధార్ అనుసంధానం కూడా ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నాం. ఉచిత తాగునీటి పథకంతో జలమండలిపై ఏటా రూ.480 కోట్ల భారం పడుతుంది. ప్రజలకు రక్షిత మంచినీటిని ఉచితంగా అందించాలని సీఎం కేసీఆర్ సంకల్పించడంతో ప్రభుత్వమే ఈ భారాన్ని మోస్తోంది. ప్రస్తుతం జలమండలి పరిధిలో అమలు చేస్తున్న ఉచిత తాగునీటి పథకాన్ని ఇతర మున్సిపాలిటీల్లో అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తాం’అని కేటీఆర్ వివరించారు. -
ఆదిభట్లలో అనంత్ టెక్నాలజీస్ ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏరోస్పేస్ సబ్‌సిస్టమ్స్, ఎంబెడ్డెడ్ సిస్టమ్స్ డిజైన్, డెవలప్మెంట్లో ఉన్న అనంత్ టెక్నాలజీస్ హైదరాబాద్ సమీపంలోని ఆదిభట్లలో తయారీ కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఏరోస్పేస్ పార్కులో ఈ కేంద్రం ఆగస్టుకల్లా సిద్ధం కానుంది. 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో యూనిట్ ఏర్పాటవుతోంది. స్పేస్, డిఫెన్స్ రంగానికి అవసరమైన శాటిలైట్ సిస్టమ్స్, శాటిలైట్ లాంచ్ వెహికిల్స్ వంటి ఉత్పాదనలను ఇక్కడ తయారు చేస్తారు. డిఫెన్స్ రిసెర్చ్ ప్రోగ్రామ్స్ సైతం చేపడతారు. విదేశీ కంపెనీ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టామని అనంత్ టెక్నాలజీస్ ఫౌండర్ డాక్టర్ సుబ్బారావు పావులూరి తెలిపారు. ‘‘ప్లాంటు ప్రారంభం అయిన అయిదారు నెలల్లో తొలి ఉత్పాదన రెడీ కానుంది. రూ.1,000 కోట్లకుపైగా పెట్టుబడి పెడుతున్నాం. ప్లాంటు ద్వారా సుమారు 700 మందికి ఉపాధి లభిస్తుంది’’ అని చెప్పారు. సంస్థలో ప్రస్తుతం 1,500 మంది దాకా ఉద్యోగులు ఉన్నారు. -
ఏరో స్పేస్ హబ్ భారత్
♦ అభివృద్ధికి సువర్ణ అవకాశమున్న రంగం ♦ 2020 నాటికి ప్రపంచంలో మూడో స్థానం ♦ ఏవియేషన్ షోను ప్రారంభించిన రాష్ట్రపతి ♦ విమానాలు, హెలికాప్టర్లను తిలకించిన ప్రణబ్ ♦ దీనికి నగరాన్ని మించిన వేదిక లేదు: కేసీఆర్ ♦ వేడుకలో పాల్గొన్న గవర్నర్ తదితరులు సాక్షి, హైదరాబాద్: దేశంలో పౌర విమానయాన వ్యాపారం శరవేగంగా వృద్ధి చెందుతోందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. ‘‘విదేశీ పెట్టుబడులకు మన విమానయాన రంగం ఆకర్షణీయ గమ్యస్థానంగానిలుస్తోంది.ఓపెన్ స్కై పాలసీతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు ద్వారాలు తెరవడంతో మన దేశం ఏరోస్పేస్ పరిశ్రమల తయారీ కీలక కేంద్రంగా మారనుంది. విమానయాన రంగంలో ప్రస్తుతం ప్రపంచంలో ప్రస్తుతమున్న 9వ స్థానం నుంచి 2020 నాటికి మూడో స్థానానికి ఎదిగే అవకాశముంది’’ అని అభిప్రాయపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ఐదో ‘ఇండియన్ ఏవియేషన్ షో-2016’ ఉత్సవాలను రాష్ట్రపతి ప్రారంభించి ప్రసంగించారు. ‘‘మన దేశం నుంచి 45 దేశాలకు విమానాలు నడుస్తున్నాయి. గతేడాది దాదాపు 19 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందాయి. కానీ ఇప్పటికీ మన దేశంలో విమానయానం ఆశించిన స్థాయిలో విస్తరించలేదు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సేవలందడం లేదు. కొన్ని నగరాలు ఇప్పటికీ జాతీయ గ్రిడ్‌లో లేవు. ఈశాన్య రాష్ట్రాలు ఇప్పటికీ వైమానిక అనుసంధానికి, సదుపాయాలకు దూరంగానే ఉన్నాయి’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘మధ్యతరగతి జనాభా గణనీయంగా పెరగడం, వారి ఆదాయం స్థిరంగా పెరుగుతుండటంతో వ్యాపార, విహారయాత్రలకు విమాన ప్రయాణాలు చేసే స్థాయికి చేరుకున్నారు. పర్యాటకం, వాణిజ్యం విమానయానానికి అండగా నిలిచాయి. 2020 నాటికి దేశంలో విమానయానం చేసే ప్రయాణికుల సంఖ్య 42 కోట్లకు చేరుతుంది. ప్రభుత్వంతో పాటు ఈ రంగంలోని భాగస్వాములంతా దీన్నో సువర్ణ వ్యాపారవకాశంగా గుర్తించాలి. మౌలిక సదుపాయాలను మరింత పెంచడం, కొత్త విమానాశ్రయాలను నెలకొల్పడం, ఉన్నవాటి స్థాయి పెంచడం అత్యవసరం. విమానాశ్రయాల మౌలిక సదుపాయాల అభివృద్ధి, నావిగేషన్ సేవలకు వచ్చే పదేళ్లలో దాదాపు 120 బిలియన్ డాలర్లను కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులుగా పెట్టే ప్రణాళికతో ఉంది’’ అన్నారు. భారత్‌ను ఏరో స్పేస్ తయారీ, నిర్వహణ, కార్యకలాపాల హబ్‌గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సదస్సుకు వచ్చిన ప్రతినిధులకు రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ఈ రంగంలోని భాగస్వామ్యులకు, అంతర్జాతీయ వాణిజ్యవేత్తలకు ఈ షో బృహత్తర వేదికగా నిలుస్తుందన్నారు. కేంద్రం ప్రారంభించిన మేకిన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియాలకూ ఉత్ప్రేరకంగా నిలుస్తుందన్నారు. 25 దేశాల నుంచి 200 మందికిపైగా ప్రతినిధులు హాజరవడం సంతోషించదగ్గ విషయమన్నారు. విమానాల తయారీ, మరమ్మతులు, కార్యకలాపాల నిర్వహణను దేశంలోనే చేపట్టేందుకు అవసరమైన పరిశ్రమలు, శిక్షణా నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు ఈ రంగంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని పౌర విమానయాన మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. ఘనంగా ప్రారంభోత్సవం అంతకుముందు ఏవియేషన్ ఎగ్జిబిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం 3.30కు ప్రణబ్ బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు. రన్‌వేపై కొలువుదీరిన విమానాలను ప్రత్యేక వాహనంపై కూర్చొని తిలకిస్తూ ముందుకు సాగారు. పక్కన అశోక్ గజపతిరాజు, వెనక వాహనంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆ వెనక హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు అనుసరించారు. కార్యక్రమం అనంతరం ప్రదర్శనలోని ఏ380, ఏ350, ఎయిర్‌బస్747, ఎయిర్‌బస్800, బోయింగ్ తదితర విమానాలు, హెలికాప్టర్లు, పలు కంపెనీల స్టాళ్లను ప్రణబ్ తిలకించారు. తర్వాత ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు. ప్రారంభోత్సవంలో పాల్గొనని ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రపతి తిరిగి వెళ్లేటప్పుడు విమానాశ్రయానికి చేరుకొని ఆయనకు వీడ్కోలు పలికారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, స్పీకర్ మధుసూదనాచారి, రాష్ట్ర మంత్రులు, ఫిక్కీ ప్రెసిడెంట్ హర్షవర్ధన్, పలు దేశాలకు చెందిన 200 మంది ప్రతినిధులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. విమానయాన సంస్థలు, ఎమ్ఆర్ఓలు, విమాన తయారీ, ఇంజన్ తయారీ, శిక్షణా సంస్థలు తదితరాలు ప్రదర్శనలో పాలుపంచు కున్నాయి. ఎలిమినేడులో ఏరోస్పేస్ పార్క్: కేసీఆర్ ఏవియేషన్ షో నిర్వహణకు హైదరాబాద్‌కు మించిన వేదిక లేదని సీఎం కేసీఆర్ అన్నారు. వైమానిక రంగంతో పాటు రక్షణ రంగంలో పలు పరికరాల తయారీ సంస్థలుండటం నగరానికి ప్రత్యేకతగా నిలుస్తోందన్నారు. దేశంలోనే అత్యంత వనరులున్న కేంద్రంగా పెట్టుబడులకు గమ్యస్థానంగా నగరం నిలుస్తుందన్నారు. ఇప్పటికే ఆదిభట్ల, నాదర్‌గుల్‌లలో ఏరోస్పేస్ పార్క్‌లు నెలకొల్పామని, ఎలిమనేడులో మరో పార్కును ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇవెంతో ‘స్పెషల్’ గురూ దేశ, విదేశీ లోహ విహంగాలు రాష్ట్ర రాజధానిలో హంగామా చేస్తున్నాయి. బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభమైన ఏవియేషన్ షోలో పలు ప్రత్యేక విమానాలు చూపరులను ఆకట్టుకున్నాయి. పలు ప్రత్యేకతలతో విదేశీ అతిథులనూ కట్టిపడేసిన లోహ విహంగాల్లో కొన్నింటి విశేషాలు... - సాక్షి, హైదరాబాద్ ‘ఖతర్’నాక్ కూల్ జర్నీ... కమర్షియల్ విమానాల్లోకెల్లా అత్యాధునికమైనది ఎయిర్‌క్రాఫ్ట్ ఎయిర్‌బస్ 350-900. 283 సీట్ల సామర్థ్యమున్న ఈ విమానంలో ప్రయాణికులకు కూల్ కూల్ వాతావరణం ఉంటుంది. మిగతా విమానాలతో పోలిస్తే దీని కేబిన్‌లో ఉక్కపోత 20 శాతం మాత్రమే ఉంటుందట. 52 శాతం కార్బన్ ఫైబర్‌తో తయారవడంతో ఇంధనాన్ని కూడా చాలా తక్కువగా వాడుకుంటుంది. మరే విమానంలోనూ లేని విధంగా దాదాపు 3,000 చానళ్లు, కావాల్సినన్ని సినిమాలతో ప్రయాణికులకు కావాల్సినంత వినోదం అందుబాటులో ఉంటుంది. చివరికి కాక్‌పీట్ కూడా అందంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ విమాన సేవలు భారత్‌లో ఇంకా మొదలవలేదు. ప్రస్తుతానికి అమెరికా, జర్మనీ, సింగపూర్‌లకే పరిమితం. ‘థ్రస్ట్’ అదుర్స్ ముంబైకి చెందిన కెప్టెన్ అమోల్ ఎస్.యాదవ్ రూపొందించిన బుల్లి విహంగం ‘థ్రస్ట్’ చూడగానే ఆహా అన్పించేలా ఉంది. ఆరుగురు కూర్చునేలా తీర్చిదిద్దిన ఈ విమానం గంటకు 350 కిలోమీటర్ల వేగంతో 13,000 అడుగుల ఎత్తున ఎగరగలదు. సాధారణ పెట్రోల్‌తోనే నడవడం దీని ప్రత్యేకత! డీజీసీఏ అనుమతులు రాగానే ఈ విమాన సేవలను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తానంటున్నారు యాదవ్. ఎమిరేట్స్ విమానంలో తెలుగు ప్రపంచంలోనే పెద్ద విమానం ఎమిరేట్స్ ఫ్లైట్ ఏ380-800లో ఇక తెలుగువెలుగులను చూడవచ్చు. విమానంలోని రెస్టారెంట్లో లంచ్‌లో వడ్డించే వంటకాలు, వాటిలోనూ స్నాక్స్, కాఫీ, టీ తదితరాల్లోనూ వాడే పదార్థాల దాకా ప్రతి విషయాన్నీ మెనూలో తెలుగు భాషలో కూడా రాసి ఉంచడం విశేషం! రాజహంసగా పిలిచే ఈ రెండంతస్తుల దుబాయ్ విమానంలో సకల సదుపాయాలున్నాయి. బార్ నుంచి భోజనశాల వరకు అన్నీ సూపర్. బీర్లు, కాక్టెయిల్స్, స్పిరిట్స్, విస్కీ, వోడ్కావంటి మద్యంతో కూడిన బార్, తాగేందుకు ప్రత్యేక కేబిన్లు, పడుకునేందుకు బెడ్లు తదితరాలు దీని సొంతం! -
‘సమూహ’కు కంపెనీల రాక..
నిర్మాణం మొదలుపెట్టిన 7 సంస్థలు రెండేళ్లలో సమూహ కంపెనీల ప్లాంట్లు తొలి దశలో రూ.500 కోట్ల పెట్టుబడి సాక్షితో సమూహ ఈడీ శ్రీరామ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిఫెన్స్, ఏరోస్పేస్ రంగానికి అవసరమైన పరికరాల తయారీకై హైదరాబాద్ సమీపంలోని ఆదిభట్ల వద్ద ఉన్న సమూహ ఏరోస్పేస్ పార్కులో కంపెనీల రాక ప్రారంభమైంది. ప్రస్తుతం ఏడు కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించాయి. వీటిలో అనంత్ టెక్నాలజీస్, హెమెయిర్ సిస్టమ్స్, ఎస్కేఎం టెక్నాలజీస్, లాజికల్ సొల్యూషన్స్, మయన్ టెక్నాలజీస్, గౌర టెక్నాలజీస్, మోషన్ డైనమిక్స్ ఉన్నాయి. ఇందులో రెండు కంపెనీలు ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేయనున్నట్టు సమాచారం. వీటితోపాటు ఎస్ఈసీ ఇండస్ట్రీస్, జెటాటెక్ ఇండస్ట్రీస్, స్కార్లెట్ ఇండస్ట్రీస్, ఏరోక్ స్పేస్ టెక్నాలజీస్, కంప్యూ పవర్, అపోలో సిస్టమ్స్ ఒకట్రెండు నెల ల్లో యూనిట్ల నిర్మాణాన్ని మొదలు పెట్టనున్నాయి. పార్కులో రెండేళ్లలో అన్ని సంస్థల ప్లాంట్లు సిద్ధం కానున్నాయి. తొలి దశలో రూ.500 కోట్లు.. డిఫెన్స్, ఏరోస్పేస్, న్యూక్లియర్ రంగాల్లో అంతర్జాతీయంగా వ్యాపార అవకాశాలను దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఎంటీఏఆర్ టెక్నాలజీస్, జెటాటెక్ ఇండస్ట్రీస్, అనంత్ టెక్నాలజీస్, ఎస్ఈసీ ఇండస్ట్రీస్, స్కార్లెట్ ఇండస్ట్రీస్, ఎస్కేఎం టెక్నాలజీస్ ప్రమోటర్లుగా, మరో 21 కంపెనీలు వాటాదారులుగా సమూహ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ ఏర్పాటైంది. ఈ సంస్థ సమూహ ఏరోస్పేస్ పార్కును ప్రమోట్ చేస్తోంది. ఇలా పార్క్ ఏర్పాటవడం దేశంలో ఇదే తొలిసారి. భాగస్వామ్య కంపెనీలన్నీ రెండేళ్లలో తమ ప్లాంట్లను నిర్మిస్తాయని సమూహ ఈడీ, స్కార్లెట్ ఎండీ శ్రీరామ్ ఎంఎం సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కంపెనీలు తొలి దశలో సుమారు రూ.500 కోట్ల పెట్టుబడులు పెడతాయని చెప్పారు. పార్కు పూర్తి రూపాన్ని సంతరించుకుంటే రక్షణ అవసరాలన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ అవుతుందని అన్నారు. దేశంలో తొలిసారిగా.. తెలంగాణ ప్రభుత్వం డిఫెన్స్, ఏరోస్పేస్ పరికరాల తయారీ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ఈ రంగానికి ప్రత్యేక పాలసీని మార్చికల్లా సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయ సంస్థలు ఇక్కడి కంపెనీలతో భాగస్వామ్యానికి ఉత్సాహం కనబరుస్తున్నాయని సమూహ డెరైక్టర్, ఎస్ఈసీ ఎండీ డి.విద్యాసాగర్ తెలిపారు. ఇక్కడ జరుగుతున్న డిఫెన్స్, ఏరోసప్లై సదస్సు ప్రభుత్వ లక్ష్యానికి మరింత విలువను చేకూరుస్తుందన్నారు. 200 ఎకరాల్లో ఏర్పాటవుతున్న సమూహ పార్కులో ప్రత్యక్షంగా 10,000 మందికి, పరోక్షంగా 18,000 మందికి ఉపాధి లభించనుందని అంచనా. 30-40 కంపెనీలకు నేరుగా, 200-300ల చిన్న యూనిట్లకు పరోక్షంగా పనులు లభిస్తాయని సమూహ భావిస్తోంది. -
నాలుగేళ్లలో మరో మూడు డిఫెన్స్, ఏరోస్పేస్ పార్క్‌లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిఫెన్స్, ఏరోస్పేస్ పరికరాల తయారీ కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడంలో తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమైంది. వచ్చే నాలుగేళ్లలో మరో మూడు డిఫెన్స్, ఏరోస్పేస్ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటి ద్వారా కొత్తగా రూ.2,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆదిభట్ల వద్ద తొలి పార్క్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. రెండవది ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు వద్ద 500 ఎకరాల్లో రానుంది. మిగిలిన పార్క్‌లు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఏర్పాటు చేస్తామని పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్‌లో అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు బేగంపేట విమానాశ్రయంలో అకాడమీ ఏర్పాటు కోసం ఫ్రాన్స్‌కు చెందిన బోర్డాక్స్ మెట్రోపోల్‌తో చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. డిఫెన్స్, ఏరోసప్లై రెండవ సదస్సు విశేషాలను వెల్లడించేందుకు టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్ ఇ.వెంకట్ నర్సింహారెడ్డితో కలిసి శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. వైమానిక ప్రదర్శన నాటికి.. బేగంపేట విమానాశ్రయంలో 2016 మార్చిలో వైమానిక ప్రదర్శన జరగనుంది. ఆ సమయానికి తెలంగాణ రాష్ట్ర డిఫెన్స్, ఏరోస్పేస్ పాలసీ రెడీ అవుతుందని అరవింద్ కుమార్ వెల్లడించారు. ‘ పరిశ్రమ ఏమి కోరుతుందో ఆ అంశాల ఆధారంగా పాలసీ రూపుదిద్దుకుంటుంది. ఎంఎస్ఎంఈ కంపెనీలకు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా కూడా ప్రోత్సాహకాలు అందిస్తాం’ అని తెలిపారు. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో కొత్తగా రాష్ట్రంలో కళ్యాణి ఫోర్జ్ రూ.500 కోట్లు, బోయింగ్ రూ.200 కోట్లు, వాయిత్ రూ.100 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు. సమూహ గ్రూప్‌కు చెందిన అయిదు కంపెనీలు ప్లాంట్ల పనులను ప్రారంభించాయన్నారు. నూతన టెక్నాలజీపై.. డిఫెన్స్, ఏరోసప్లై రెండవ ప్రదర్శన, సదస్సు నవంబరు 30 నుంచి డిసెంబరు 2 వరకు ఇక్కడి హెచ్ఐసీసీలో జరుగనుంది. నూతన తరం సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్య అభివృద్ధిపై సదస్సు దృష్టిసారిస్తుంది. అంతర్జాతీయంగా వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ఇక్కడి కంపెనీలకు సదస్సు చక్కని వేదిక అని కీన్స్ ఎగ్జిబిషన్స్ జీఎం ప్రేమ జిల్బర్మన్ తెలిపారు. సికోర్స్కీ, ఎంబ్రార్, థేల్స్ ఇండియా, ఎయిర్‌బస్, యూరోకాప్టర్ వంటి కంపెనీలకు చెందిన సుమారు 60 స్టాళ్లు ఏర్పాటయ్యాయి. -
ఉపాధికి ఢోకా లేదు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘మీరంతా అదృష్టవంతులు.. నాగన్‌పల్లిలో వైట్‌గోల్డ్ స్పింటెక్స్ పార్క్, ఆదిబట్లలోని సమూహ ఏరో స్పేస్ పార్క్‌తో దాదాపు 15వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇందులో అధికభాగం స్థానికులకే ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. స్థానిక యువతకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చేందుకు ఐటీఐ లేదా పాలిటెక్నిక్ కాలేజీని ఏర్పాటు చేస్తాం.’ అని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లిలో వైట్‌గోల్డ్ స్పింటెక్స్ పార్క్‌కు శంకుస్థాపన చేశా రు. అనంతరం ఆదిబట్లలోని సమూహ ఏరోస్పేస్ పార్క్‌కు శిలాఫలకం వేశారు. ఈ సందర్భంగా వేర్వేరుగా ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో సీఎం మాట్లాడారు. హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉండడంతో అభివృద్ధి అంతా జిల్లావైపు మళ్లిందని, దీంతో జిల్లాలోని భూముల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. ఇలాంటి పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలోని కొందరు రైతులు భూములు కోల్పోతున్నారని, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లతోపాటు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు కానుండడంతో నీటి సరఫరా, విద్యుత్ సరఫరాతోపాటు రవాణా సౌకర్యం మెరుగుపర్చేందుకు తగిన ఏర్పాటు చేస్తామన్నారు. -
కలిసుంటేనే అభివృద్ధి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘అంగారకుడు, చంద్రమండలంపైకి ఉపగ్రహాలు పంపిస్తున్నాం. ఇతర గ్రహాల కక్ష్యల్లోకి పంపేందుకు రాకెట్లు నిర్మిస్తున్నాం.. కానీ భూమిపైన మాత్రం గీతలు గీస్తున్నాం. ఇది సమంజసం కాదు’ అంటూ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట విభజనను పరోక్షంగా ప్రస్తావిస్తూ పలువ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని నాగన్‌పల్లి సమీపంలో వైట్‌గోల్డ్ ఇంటిగ్రేటెడ్ సింటెక్స్ పార్క్‌కు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆదిభట్ల గ్రామంలో ‘సమూహ ఏరోస్పేస్ పార్కు’ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి వ్యతిరేకించారు. ‘ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరలకు ఉపగ్రహ విడి భాగాలను హైదరాబాద్‌లో తయారు చేస్తున్నారు. అలాంటి శాస్త్రవేత్తలను, విడి భాగాలను అందిస్తూ దేశాన్ని అగ్రభాగంలో నిలిపేందుకు రాష్ట్రం ఎంతో కృషి చేస్తోంది. కానీ వాళ్లు ఇక్కడి భూమిపై గీతలు గీస్తుండడం బాధ కలిగిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. ‘కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యం. యాజమాన్యం, కార్మికులు కలిసి పనిచేస్తేనే ఆ సంస్థ ముందుకు వెళ్తుంది. రూ.14వేల కోట్ల టర్నోవర్ ఉన్న ఆల్విన్ కంపెనీ యాజమాన్యం, ప్రభుత్వం చేసిన పొరపాట్లతో కుప్పకూలింది. వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు’ అని సీఎం కిరణ్ పేర్కొన్నారు. చేనేత రంగానికి మంచిరోజులు నేత రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నాయని సీఎం చెప్పారు. ‘రాష్ట్రంలో ఏటా సగటున 14లక్షల టన్నుల పత్తి ఉత్పత్తి అవుతోంది. కానీ ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోవడంతో పత్తిని నేరుగా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నాం. దీంతో రైతుకూ న్యాయం జరగట్లేదు. ఆదాయమూ పెరగట్లేదు. అందువల్ల రాష్ట్రంలో మొట్టమొదటగా ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నాం. ఇది అందుబాటులోకి వస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయి’ అని వివరించారు. వృత్తి నైపుణ్యమే కీలకం: కేంద్ర మంత్రి కావూరి ఇటీవలి వర్షాలతో తడిసిన పత్తిని కొనుగోలు చేసేందుకు త్వరలో నల్లగొండ, మహబూబ్‌నగర్, గుంటూరు, ఆదిలాబాద్ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు వెల్లడించారు. ఉద్యోగాలు సాధించాలంటే చదువుతో పాటు వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. అనంతరం కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం రూ.1900కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి జి.ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బిక్షపతియాదవ్, కె.లక్ష్మారెడ్డి, గాదె వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షులు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రికి తెలంగాణ సెగ తగల కుండా పోలీసులు వీలైనన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. -
ఆదిభట్ల ఇక స్పేస్ సిటీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సమూహ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ హైదరాబాద్ సమీపంలో ఆదిభట్ల వద్ద ఏర్పాటు చేసిన సమూహ ఏరోస్పేస్ పార్కుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో ప్రపంచంతో పోటీపడి సత్తా చాటిన కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయని ఆయన కితాబిచ్చారు. ఆదిభట్ల ప్రాంతాన్ని స్పేస్ సిటీగా నామకరణం చేస్తామన్నారు. వచ్చే 15 ఏళ్లలో భారత్‌లో డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో 500 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారావకాశాలు ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్ర సలహాదారు అవినాష్ చందర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ అవకాశాలు 10-15 రెట్లు ఉంటాయని చెప్పారు. ఆఫ్సెట్ పాలసీ కింద భారతీయ కంపెనీలకు ఆర్డర్లు పెరుగుతున్నాయని వివరించారు. కాగా, పార్కు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 30 వేల మందికి ఉపాధి లభించనుంది. బలంగా ఎదిగాం.. ఐదేళ్లలో సమూహ ఇంజనీరింగ్ రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టనుందని ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ జయేష్ రంజన్ తెలిపారు. చిన్న కంపెనీలు క ్లస్టర్గా ఏర్పాటయ్యేదుకు ఏపీఐఐసీ సాయపడుతుందని అన్నారు. టర్నోవర్ తక్కువగా ఉండడంతో పూర్తి అవకాశాలు దక్కడం లేదని సమూహ ఇంజనీరింగ్ చైర్మన్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్ చైర్మన్ రవీంద్రా రెడ్డి అన్నారు. ప్రస్తుతం 27 కంపెనీలతో బలమైన కంపెనీగా సమూహ ఏర్పడిందని తెలిపారు. మరింతమంది సభ్యులతో మరో పార్కును ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మరో 100 కంపెనీలు ఇక్కడికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని, ఇందుకు అదనంగా స్థలం కేటాయించాలని ఏపీఐఐసీని కోరినట్టు సమూహ ఈడీ శ్రీరామ్ ఎంఎం వెల్లడించారు. సమూహ ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఎస్ఈసీ ఇండస్ట్రీస్ ఎండీ డి.విద్యాసాగర్ మాట్లాడుతూ పీఎస్ఎల్వీ-సీ25 తయారీలో సమూహ కంపెనీల పాత్ర కూడా ఉందన్నారు. గీతలు గీసుకుంటున్నాం.. సమైక్యవాదాన్ని వినిపించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్ని వేదికలనూ సద్వినియోగం చేసుకుంటున్నట్టు ఉంది. ‘ఒకపక్క మన రాష్ట్రం నుంచి (నెల్లూరు జిల్లా శ్రీహరికోట) రాకెట్లు నింగికి దూసుకెళ్తున్నాయి. మరోపక్క మనం గీతలు గీసుకుంటున్నాం’ అని అన్నారు. పరోక్షంగా రాష్ట్ర విభజన వద్దని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.