హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏరోస్పేస్ సబ్‌సిస్టమ్స్, ఎంబెడ్డెడ్ సిస్టమ్స్ డిజైన్, డెవలప్‌మెంట్‌లో ఉన్న అనంత్ టెక్నాలజీస్ హైదరాబాద్ సమీపంలోని ఆదిభట్లలో తయారీ కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఏరోస్పేస్ పార్కులో ఈ కేంద్రం ఆగస్టుకల్లా సిద్ధం కానుంది. 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో యూనిట్ ఏర్పాటవుతోంది. స్పేస్, డిఫెన్స్ రంగానికి అవసరమైన శాటిలైట్ సిస్టమ్స్, శాటిలైట్ లాంచ్ వెహికిల్స్ వంటి ఉత్పాదనలను ఇక్కడ తయారు చేస్తారు.
డిఫెన్స్ రిసెర్చ్ ప్రోగ్రామ్స్ సైతం చేపడతారు. విదేశీ కంపెనీ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టామని అనంత్ టెక్నాలజీస్ ఫౌండర్ డాక్టర్ సుబ్బారావు పావులూరి తెలిపారు. ‘‘ప్లాంటు ప్రారంభం అయిన అయిదారు నెలల్లో తొలి ఉత్పాదన రెడీ కానుంది. రూ.1,000 కోట్లకుపైగా పెట్టుబడి పెడుతున్నాం. ప్లాంటు ద్వారా సుమారు 700 మందికి ఉపాధి లభిస్తుంది’’ అని చెప్పారు. సంస్థలో ప్రస్తుతం 1,500 మంది దాకా ఉద్యోగులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment