adibhatla
-
పోలీసులకు సవాల్‌గా మారిన ఆదిభట్ల హత్య కేసు
సాక్షి, హైదరాబాద్: ఆదిభట్ల ఠాణా పరిధిలో జరిగిన హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హతుడు బతికుండగానే నోటికి ప్లాస్టర్ వేసి, కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి బలవంతంగా గోనె సంచిలో కుక్కారని, గాలి కూడా చొరబడకుండా మూట గట్టిగా కట్టేయడంతో లోపల ఊపిరాడక మరణించి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈనెల 16న బొంగుళూరు టోల్గేట్ నుంచి 1.5 కి.మీల దూరంలో బ్రాహ్మణపల్లి సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. తెలిసిన వాళ్ల పనే.. హత్య అనంతరం మృతదేహాన్ని ఎక్కడ పారేయాలో కూడా దుండగులు ముందుగానే ప్లాన్ చేశారని, ఈ క్రమంలోనే సంక్రాంతి సెలవుల్లో జాతీయ రహదారులలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఎవరూ గుర్తించలేరని నిందితులు భావించి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు. హతుడికి తెలిసిన వాళ్లే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై సంచిలో మూటకట్టిన మృతదేహాన్ని తీసుకొచ్చి ఓఆర్ఆర్ సరీ్వస్ రోడ్డులో పడేసి ఉంటారని వివరించారు. అయితే ఆ ప్రాంతంలో ఎలాంటి వాహన టైర్ల గుర్తులు లభించలేదని, రోడ్డు పైన ఎర్రటి మరకలు ఉండడంతో రక్తం కావచ్చని అనుమానించి..నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని చెప్పారు. సాంకేతిక ఆధారాలతోనే ముందుకు.. హతుడి ఎవరనేది తేలితేనే కేసు దర్యాప్తు సులువవుతుందని భావించిన పోలీసులు.. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వందలాది అదృశ్యం కేసుల వివరాలను సేకరించారు. ఘటనాస్థలంలో మృతదేహంపై లభ్యమైన వస్తువులు, హతుడి వయసు, పోలికలతో యువకుల అదృశ్యం కేసుల వివరాలను పోలుస్తున్నారు. ఘటనాస్థలం, పరిసర ప్రాంతాలలో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో పాటు మృతదేహంపై ఎలాంటి కత్తిపోట్లు, గాయాలను పోలీసులు గుర్తించలేదు. శరీరంలో విష ప్రయోగం ఆనవాళ్లు సైతం ఫోరెన్సిక్ పరీక్షలలో వెల్లడికాలేదు. దీంతో కేసు దర్యాప్తు పూర్తిగా సాంకేతిక ఆధారాల పైనే ఆధారపడి ఉందని ఓ పోలీసు అధికారి తెలిపారు. మృతదేహం కుళ్లిన స్థితిని బట్టి హత్య ఈనెల 8–10 తేదీలలో జరిగి ఉండొచ్చని, దీంతో ఆయా తేదీలలో ఓఆర్ఆర్ మీద ప్రయాణించిన సుమారు 12 లక్షల వాహనాలను, లక్షల కొద్ది ఫోన్ కాల్స్‌ను జల్లెడ పడుతున్నామని తెలిపారు. లక్షల్లో ఉన్న డేటా వందల్లోకి వస్తేనే దర్యాప్తు కొలిక్కి వస్తుందని చెప్పారు. -
తమిళిసై వద్ద పెండింగ్‌లో ఫైల్.. పురసారథులకు ‘పరీక్ష’
సాక్షి, రంగారెడ్డిజిల్లా/ మేడ్చల్‌జిల్లా: నగర/పురపాలికల్లో క్యాంపు రాజకీయాలకు తెరలేస్తోంది. మూడేళ్ల పదవీకాలం ముగియనుండటంతో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టే దిశగా పావులు కదులుతున్నాయి. ఇందుకు వ్యూహరచన చేస్తుండటంతో ప్రస్తుత పాలక వర్గాలు పదవిని కాపాడుకునేందుకు.. వైరి వర్గం కుర్చీ దక్కించుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. నగర, పురపాలక సంఘాల్లో అవిశ్వాస పరీక్షలకు మూడేళ్ల కాల పరిమితిని విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక చట్టంలో పొందుపర్చింది. దీన్ని నాలుగేళ్లకు సవరిస్తూ గత ఏడాది అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. గవర్నర్ తమిళిసై పరిశీలనకు వెళ్లిన ఈ బిల్లుకు ఇప్పటికీ మోక్షం లభించలేదు. దీంతో పాత చట్టమే మనుగడలో ఉందని భావిస్తున్న అసంతృప్తి నేతలు, అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు పావులు కదుపుతున్నారు. నగర/పురపాలక సంఘాలు పగ్గాలు చేపట్టి ఈ నెల 26 నాటికి మూడేళ్లు ముగుస్తున్నందున ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పురపాలికలపై కన్నేసిన ఆశావహులు ఎత్తులు వేస్తున్నారు. గడువు సమీపిస్తుండటంతో కొంతకాలంగా విందు, విహార యాత్రలతో బిజీగా ఉన్న ఈ నేతలు మరిన్ని వ్యూహాలు రచిస్తున్నారు. నగర శివారులోని దాదాపు మెజారిటీ మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో.. ► మేడ్చల్ జిల్లాలో నిజాంపేట్, బోడుప్పల్, జవహర్‌నగర్, పీర్జాదిగూడ, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార పార్టీ సభ్యులే వైరి వర్గాలుగా విడిపోయారు. ప్రస్తుత పాలక వర్గాలకు మూడేళ్లు పూర్తి కావడంతో పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నిజాంపేట్ కార్పొరేటర్లు ఇటీవల శ్రీశైలం వేదికగా, జవహర్‌నగర్ నగరపాలక సంస్థ పాలక సభ్యులు ఉభయ గోదావరి జిల్లాలు వేదికగా క్యాంపు రాజకీయాలు నెరిపారు. ► బోడుప్పల్ కార్పొరేషన్‌లోనూ గ్రూపు రాజకీయాలు అధికమయ్యాయి. ఇక్కడ కూడా అవిశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మేడ్చల్ మున్సిపాలిటీలో కొంత కాలంగా మున్సిపల్ చైర్పర్సన్ తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. ఇదే విషయమై మంత్రి సమక్షంలో పలుమార్లు అసంతృప్తి వెళ్లబుచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోనూ అధికార పార్టీలోని ఇరు వర్గాలు నువ్వా నేనా అన్నట్లుగా అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నాగారం మున్సిపాలిటీలో చైర్మన్‌పై అవిశ్వాసానికి అంతర్గంగా పావులు కదుపుతున్నట్లు అధికార టీఆర్ఎస్ కౌన్సిర్లలోనే చర్చ జరుగుతోంది. దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దుండిగల్, కొంపెల్లి మున్సిపాలిటీల్లోని అధికార పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. రంగారెడ్డి జిల్లాలో.. ► ఆదిబట్ల, తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టేందుకు అసంతృప్తి నేతలు పావులు కదుపుతున్నారు. గతంలో పదవీ కాలం ఒప్పందాలు కుదుర్చుకున్న సభ్యులు కూడా పట్టు వీడకపోవడంతో కొన్ని చోట్ల విశ్వాస పరీక్షలకు దారితీస్తోంది. ఇంకొన్ని చోట్ల పదవీ నుంచి దిగేందుకు ససేమిరా అనడం కూడా ఈ పరిస్థితులకు కారణంగా మారుతోంది. ► తుర్కయంజాల్‌లో మెజార్టీ కౌన్సిలర్లను గెలుచుకున్న కాంగ్రెస్.. రెండు వర్గాలుగా విడిపోయింది. పదవుల పంపకంపై ఇరుపక్షాలు బెట్టు దిగకపోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదే సీను ఇబ్రహీంపట్నం పురపాలికలోనూ కనిపిస్తోంది. గులాబీ శిబిరంలో కీచులాటలతో చైర్‌పర్సన్‌పై కౌన్సిలర్లు ఏకంగా కలెక్టర్‌కే ఫిర్యాదు చేశారు. అవినీతి ఆరోపణలు సంధిస్తూ ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా మూడేళ్ల కాలపరిమితి ముగియడంతో ఇదే అదనుగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై మంతనాలు సాగిస్తున్నారు. ► మరోవైపు ఆదిబట్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్లో చేరి చైర్పర్సన్ పదవిని కాంగ్రెస్ కౌన్సిలర్ దక్కించుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాలతో స్థానిక ఎమ్మెల్యేలతో చైర్‌పర్సన్‌కు పొసగడం లేదు. దీంతో ఆమెను గద్దె దింపే దిశగా ఎమ్మెల్యే వర్గీయులు చక్రం తిప్పుతున్నారు. నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలు.. బండ్లగూడ నగర పాలక సంస్థలోనూ చైర్మన్‌గిరీ విషయంలో మడతపేచీ నెలకొంది. ఇక్కడ కూడా రెండున్నరేళ్ల చొప్పున పదవిని పంచుకోవాలనే ఒప్పందానికి వచ్చారు. తాజా పరిణామాలతో పోస్టు నుంచి తప్పుకొనేందుకు నో చెబుతుండడంతో రాజకీయం ఉత్కంఠగా మారింది. (క్లిక్ చేయండి: కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ అసంతృప్తి) -
ఆక్టోపస్ పోలీసుల వీరంగం, ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ :ఆదిభట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆక్టోపస్ పోలీసులు మద్యం మత్తులో గతరాత్రి వీరంగం సృష్టించారు. తినేందుకు హోటల్‌కు వచ్చిన కానిస్టేబుల్స్.. పక్క టేబుల్‌పై ఉన్న రాము అనే యువకుడిపై అకారణంగా దాడికి పాల్పడ్డారు. తనను ఎందుకు వేధిస్తున్నారంటూ ఆ యువకుడు ప్రశ్నించగా, తమనే ప్రశ్నిస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతాపం చూపించారు. అంతేకాకుండా అడ్డు వచ్చినవారిని కూడా... కానిస్టేబుల్స్ చితకబాదారు. ఈ ఘటనపై బాధితుడు ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే ఇప్పటివరకూ పోలీసులు వారిపై కేసు నమోదు చేయలేదని రాము ఆరోపిస్తున్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆదిభట్లలో అనంత్ టెక్నాలజీస్ ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏరోస్పేస్ సబ్‌సిస్టమ్స్, ఎంబెడ్డెడ్ సిస్టమ్స్ డిజైన్, డెవలప్మెంట్లో ఉన్న అనంత్ టెక్నాలజీస్ హైదరాబాద్ సమీపంలోని ఆదిభట్లలో తయారీ కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఏరోస్పేస్ పార్కులో ఈ కేంద్రం ఆగస్టుకల్లా సిద్ధం కానుంది. 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో యూనిట్ ఏర్పాటవుతోంది. స్పేస్, డిఫెన్స్ రంగానికి అవసరమైన శాటిలైట్ సిస్టమ్స్, శాటిలైట్ లాంచ్ వెహికిల్స్ వంటి ఉత్పాదనలను ఇక్కడ తయారు చేస్తారు. డిఫెన్స్ రిసెర్చ్ ప్రోగ్రామ్స్ సైతం చేపడతారు. విదేశీ కంపెనీ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టామని అనంత్ టెక్నాలజీస్ ఫౌండర్ డాక్టర్ సుబ్బారావు పావులూరి తెలిపారు. ‘‘ప్లాంటు ప్రారంభం అయిన అయిదారు నెలల్లో తొలి ఉత్పాదన రెడీ కానుంది. రూ.1,000 కోట్లకుపైగా పెట్టుబడి పెడుతున్నాం. ప్లాంటు ద్వారా సుమారు 700 మందికి ఉపాధి లభిస్తుంది’’ అని చెప్పారు. సంస్థలో ప్రస్తుతం 1,500 మంది దాకా ఉద్యోగులు ఉన్నారు. -
అక్టోపస్ మాక్‌డ్రిల్ లో ప్రమాదం
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఆక్టోపస్ సిబ్బంది గాయపడ్డారు. ప్రమాదాలు జరిగినపుడు ఏ విధంగా రక్షించాలో అన్న అంశాలపై ఆదిభట్ల సమీపంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ క్రమంలో రెండు అక్టోపస్ బస్సులు ఢీకొన్నాయి. దీంతో బస్సులోని ఐదుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని సురేష్, శేఖర్, రఘుపతి, రావు భవాని సింగ్, చెన్నకేశవ రెడ్డిగా గుర్తించారు. అయితే ఈ ఘటనపై మీడియాకు వివరాలు తెలియకుండా ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచుతున్నట్టు సమాచారం. -
28 నుంచి ఆదిభట్ల జయంత్యుత్సవాలు
విజయవాడ కల్చరల్ : హరికథ పతామహుడు ఆదిభట్ల నారాయణదాసు 153వ జయంత్యుత్సవాలు ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు సత్యనారాయణపురంలోని కాశీ విశేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించనున్నట్లు ఆదిభట్ల శిష్యప్రశిష్య సంఘం కన్వీనర్ బుర్రా పద్మనాభ శర్మ తెలిపారు. సత్యనారాయణపురంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 28వ తేదీ ఉదయం 9 గంటలకు నారాయణ దాసు విగ్రహానికి పూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. మూడు రోజులపాటు హరికథా గానం ఉంటుందని తెలిపారు. 29న నేతి లక్ష్మీనారాయణ భాగవతుల జయంతి కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. అదే సభలో ధర్మారావు భాగవతార్‌ను నేతి లక్ష్మీనారాయణ స్మారక పురస్కారంతో సత్కరిస్తామన్నారు. -
దేశానికే తలమానికం
‘టాటా-బోయింగ్ ఏరోస్పేస్’ యూనిట్‌పై రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ఆదిబట్లలో వైమానిక విడిభాగాల తయారీ సంస్థకు శంకుస్థాపన రక్షణ రంగంలో దశల వారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తెలంగాణ ప్రభుత్వ విధానాలు బాగున్నాయని ప్రశంస ‘ఏరోస్పేస్’ యూనిట్‌తో తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం పెట్టుబడులకు రాష్ట్రం ఆకర్షణీయ గమ్యస్థానంగా మారింది: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: దేశ వైమానిక రంగానికి ‘టాటా-బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్’ తలమానికంగా నిలుస్తుందని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ పేర్కొన్నారు. దేశ రక్షణ రంగంలో దశల వారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రవేశపెడుతున్నామని.. ఏరోస్పేస్ యూనిట్‌తో దానికి తొలి అడుగు పడుతోందని చెప్పారు. సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.200 కోట్లతో ఏర్పాటవుతున్న ఈ యూనిట్‌ను మూడు నెలల్లో పూర్తిచేసి విడిభాగాల ఉత్పత్తి ప్రారంభించేలా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ చర్యలు చేపడుతోందన్నారు. శనివారం హైదరాబాద్ శివార్లలోని ఆదిబట్లలో ఉన్న టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) ప్రాంగణంలో ‘టాటా-బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్’ యూనిట్‌కు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్ల ప్రధాన భాగాలను తయారు చేయడానికి బోయింగ్, టీఎఎస్ఎల్ల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరిందని పరీకర్ చెప్పారు. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను దశల వారీగా ప్రవేశపెడుతున్నామని... టాటా బోయింగ్ యూనిట్‌తో ఈ ప్రక్రియకు తొలి అడుగు పడినట్లయిందని పేర్కొన్నారు. దీనితో ప్రపంచవ్యాప్తంగా అపాచీ హెలికాప్టర్లకు విడిభాగాలను అందించే 15 దేశాల్లో భారత్ ఒకటిగా నిలవనుందని వెల్లడించారు. విదేశీ పెట్టుబడుల విషయంలో కేంద్రం సరళీకృత విధానాలను అవలంబిస్తోం దని..ఆ విధానాలకు న్యాయశాఖ ఆమోదం లభించిందని చెప్పారు. రక్షణ రంగంలో ప్రైవేటు పెట్టుబడులపై సహజంగానే ఏదో ఒక చర్చ జరుగుతుందని.. భారత మీడియాకు సృజనాత్మకత (క్రియేటివిటీ) ఎక్కువగా ఉండడం వల్లే ఇలా జరుగుతోందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రం చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం ఫలితాలు త్వరలోనే చూడబోతున్నామని పేర్కొన్నారు. టీఎస్ఐపాస్, ఐటీ పాలసీ భేష్.. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్, ఐటీ పాలసీలు బాగున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి పరీకర్ ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆలోచనలకు అనుగుణంగా ఆకర్షణీయ పాలసీలను ప్రకటి స్తుంటాయని, అవన్నీ ఆచరణలో విజయవంతం కావని పేర్కొన్నారు. కానీ తెలంగాణ ప్రకటించిన విధానాలు పెట్టుబడులను ఆకర్షించేవిగా ఉన్నాయని.. తెలంగాణకు వస్తున్న పెట్టుబడులు చూస్తే అవి విజయవంతమైనట్లు స్పష్టమవుతోందని అభినందించారు. పెట్టుబడుల విషయంలో స్పష్టమైన విధానాలు అవసరమని, ఆ దిశగా తెలంగాణ ముందుకు సాగుతోందని కితాబిచ్చారు. టీ-హబ్‌పై ప్రశంసల జల్లు సార్టప్‌లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీ-హబ్‌పై పరీకర్ ప్రశంసల జల్లు కురిపించారు. శనివారం టీ-హబ్‌ను సంద ర్శించిన కేంద్రమంత్రికి మంత్రి కేటీఆర్ స్వాగతం పలికారు. టీ-హబ్‌లోని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలనుద్దేశించి పరీకర్ మాట్లాడారు. కేటీఆర్ టీ-హబ్‌కు రూపకల్పన చేయడం ఆయన నాయకత్వ ప్రతిభకు అద్దం పడుతోందన్నారు. ప్రతి ఒక్కరూ కలలు కంటారని, ఆ కలలను నిజం చేసుకునేందుకు పనిచేసేవారు తక్కువగా ఉంటారని... కేటీఆర్ బృం దంలో పనిచేసే వ్యక్తులు ఎక్కువగా ఉన్నారని అభినందించారు. టెక్నాలజీ ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయని, ఆ మేరకు టెక్నాలజీని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో క్లీన్టెక్, శానిటేషన్ రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని, ఆ దిశగా కృషి చేయాలని స్టార్టప్‌లకు పరీకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, టీ-హబ్ సీఈవో క్రిష్ణన్ తదితరులు పాల్గొన్నారు. విశ్వవ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతి: కేటీఆర్ టాటా-బోయింగ్ వైమానిక విడిభాగాల ఉత్పత్తి సంస్థ రాష్ట్రానికి రావడం సంతోషకరమని... దీనితో తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందని మం త్రి కేటీఆర్ పేర్కొన్నారు. పెట్టుబడులకు తెలంగాణ ఆకర్షణీయ గమ్యంగా మారినందునే అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేం దుకు ముందుకు వస్తున్నాయన్నారు. టీఎస్ఐపాస్ ద్వారా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని, గత 10నెలల్లో 2,130 పరిశ్రమలకు అనుమతులివ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ చైర్మన్ ఎస్.రమదొరై, సీఈవో సుకరాన్సింగ్, ఏరోస్ట్రక్చర్స్ హెడ్ మసూద్ హుస్సేనీ, బోయింగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ప్రత్యూష్ కుమార్, బోయింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ దేవ్ కూపర్స్మిత్, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలు పాల్గొన్నారు. -
టాగూర్ మెచ్చిన హరికథకుడు
ఆగస్టు 31న ఆదిభట్ల నారాయణదాసు జయంతి ఒక్కొక్క ప్రక్రియ ఒక్కొక్కరి చేతిలో పడి ప్రసిద్ధి పొందుతుంది. అందరూ ఆ ప్రక్రియను అనుసరించవచ్చు. కానీ ఒక్కరికే పేరు వస్తుంది. సంస్కృతంలో అనుష్టుప్ శ్లోకానికి వాల్మీకి తరువాత వ్యాసుడూ ప్రతినిధిగా నిలిచేరు. మందాక్రాంత అనగానే కాళిదాసే ఎదురవుతాడు. తెలుగులో వృత్తానికి నన్నయ, కందానికి తిక్కన, సీసానికి శ్రీనాథుడు, ఆటవెలదికి వేమన హక్కుదార్లుగా కనబడతారు. ఇలా హరికథకు ఆదిభట్ల నారాయణదాసు పేరుగాంచారు. హరికథకు ఆయన సృష్టికర్త, ఆద్యుడు కాకపోవచ్చు. విజయనగరం కానుకుర్తివారింట్లో మద్రాసునించి వచ్చిన కుప్పుస్వామినాయుడిగారి హరికథను విని ఆ రాత్రికి రాత్రే తన 18వ ఏట ధ్రువచరిత్రను హరికథగా రచించేరు. మహారాష్ట్రుల హరికథలో తమిళులు సంగీతాన్ని జోడిస్తే దాసుగారు హరికథలో నృత్యం ప్రవేశపెట్టారనవచ్చు. ఆయన ప్రవేశపెట్టిన మరొకటి 'మట్లు' ఇవి నృత్యానికి అనుగుణంగా రూపొందించబడ్డాయి. దాసుగారి సంగీత రచనకు జనసామాన్యాల్లో అధిక ప్రచారాన్ని తెచ్చింది ఈ మట్లే! అవధాన సరస్వతిని అటు గద్వాలిటు చెన్నపట్నం అంటూ తిరుపతి వేంకట కవులు ఊరేగిస్తే, హరికథా సరస్వతిని దాసుగారు అటు కలకత్తా ఇటు మైసూరు అంటూ ఊరేగించారు. కలకత్తాలో దాసుగారు పాడిన బేహాగ్ రాగం విన్న రవీంద్రనాథ్ టాగూర్ విజయనగరం వచ్చినప్పుడు దాసుగారితో 'మీరు పాడిన బేహాగ్ ఇంకా నా చెవుల్లో మార్మోగుతోంది' అని ప్రశంసించేరు. తరువాతి రోజుల్లో- ఈ రోజుకూ హరికథకులెవరైనా సరే దాసుగారి శిష్యప్రశిష్యులు కావలసిందే. అందుకే చెళ్లపిళ్లవారన్నారు: 'దాసు నారాయణునకు నీతండు వీని దాసు లెల్లడ గల హరిదాసు లెల్ల' వాగ్గేయకారునిగా దాసుగారు 14 హరికథలను సంస్కృతంలో, ఆంధ్రంలో రచించేరు. అంతకుమించి (నా యెఱుక, నూఱుగంటి, నవరస తరంగిణి, మన్కి మిన్కు, జగజ్జ్యోతి లాంటి) 32 గ్రంథాలను సాహితీమూర్తిగా దేశానికందించేరు. అసాధ్య అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు చేసేరు. విజయనగరం రాజులతో షికార్లకు వెళ్లేరు, పేకాట ఆడేరు. మైసూరు మహారాజావారు 'మా కొలువులో వుందురా!' అంటే 'మర్త్యుల గొల్వను' అని నిర్భయంగా ప్రకటించేరు. ప్రస్తుతానికి వస్తే- దాసుగారు విజయనగరంలో 1919లో ప్రారంభింపబడిన సంగీత కళాశాలకు (విజయరామ గాన పాఠశాల) పాటబడి పెద్దగా (ప్రిన్సిపాల్) తన 55వ ఏట నియమింపబడి, 16 సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు. కానీ ఇవ్వాళ్టివరకు ఆ పాఠశాలలో హరికథకు స్థానం లేదు. గాత్రం, వయోలిన్, మృదంగం, నృత్యం, సన్నాయి, డోలు వీటన్నిటికీ అధ్యాపకులున్నారు. కపిలేశ్వరపురంలో సర్వారాయ హరికథా పాఠశాలలో ఆడపిల్లలు చక్కగా శిక్షణ పొందుతున్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలోనూ, శ్రీ వేంకటేశ్వర సంగీత కళాశాలలోనూ హరికథా పీఠాలున్నాయి. కానీ విజయనగరంలో- హరికథాపితామహుని పాదముద్రలతో పునీతమైన నగరంలో, ఆ మహనీయుడు మొదటి ప్రిన్సిపాల్‌గా సేవలందించిన నగరంలో హరికథకు స్థానం లేకపోవడం మాత్రం విచారకరం! డాక్టర్ అయల సోమయాజుల గోపాలరావు 9440435262 (ప్రధాన కార్యదర్శి, శ్రీ ఆధిభట్ల నారాయణదాస ఆరాధనోత్సవ సంఘం) -
ఆదిభట్ల మరో హైటెక్ సిటీ!
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల క్రితం అక్కడ గజం స్థలం ధర రూ.2 వేలు కూడా కష్టమే. కానీ, నేడు రూ.8 వేలకు పైగానే పలుకుతోంది! ఒకప్పుడు షేర్ ఆటోలు కూడా తిరగని ఆ ప్రాంతంలో ఇప్పుడు లగ్జరీ కార్లు దూసుకెళ్తున్నాయ్!! ఒకప్పుడు సినిమా చూడాలంటే సిటీకీ రావాల్సిందే. కానీ నేడక్కడే మల్టీప్లెక్స్‌లు రూపుదిద్దుకుంటున్నాయ్!!! ఇంతకీ ఆ ప్రాంతమేంటంటే ఆదిభట్ల గ్రామం. ఐటీ సెజ్ రాకతో ఇప్పటికే రియల్ దూకుడు మీదున్న ఆదిభట్లలో ఇప్పుడు ఏరోస్పేస్ కంపెనీలూ క్యూ కడుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఆదిభట్ల గ్రామం మరో హైటెక్ సిటీగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. స్థిరాస్తి వ్యాపారానికి సెలైన్ ఎక్కించేవి ఐటీ కంపెనీలు. ఇది చాలదన్నట్లు ఆదిభట్లలో ఏరోస్పెస్ కంపెనీలూ కొలువుదీరాయి. గతంలోనే ఆదిభట్లలో 250 ఎకరాల్లో వైమానిక సెజ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సెజ్‌లో టాటా సికోర్ స్కై, టాటా అడ్వాన్స్డ సిస్టమ్, టాటా లాక్హిడ్ మార్టిన్ సిస్టమ్, సముహా ఏరోస్పేస్ సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఇటీవలే టాటా అడ్వాన్డ్స్ సిస్టమ్స్ సంస్థ జర్మనీకి చెందిన రుమాగా సంస్థతో కలసి డార్నియర్ విమాన పరికరాల తయారీ పరిశ్రమనూ స్థాపించింది. డార్నియర్-228 విమాన ప్రధాన భాగంతో పాటు విమాన రెక్కలను కూడా ఇక్కడ తయారు చేయనున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరం చుట్టూ మూడు క్లస్టర్లుగా ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రానుంది. ఇందులో క్లస్టర్-3లో భాగంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టు డెవలప్మెంట్ అథారిటీలో ఆదిభట్ల, మహేశ్వరం, రావిరాల, మామిడిపల్లిలో 79.2 చ.కి.మీ. పరిధిలో ఐటీఐఆర్ విస్తరించి ఉంటుంది. అంతేకాకుండా ఔటర్ రింగ్‌రోడ్డు గ్రోత్ కారిడార్-1కు 11.5 చ.కి.మీ., కారిడార్-2కు 14.3 చ.కి.మీ. కేటాయించి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బొంగ్లూరు ఔటర్ రింగ్‌రోడ్డు వరకు దీన్ని అనుసంధానం చేస్తారు. మరోవైపు ఆదిభట్ల ప్రాంతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 10 కి.మీ., ఎల్బీనగర్కు 12 కి.మీ., ఔటర్ రింగ్ రోడ్డుకు 1.5 కి.మీ. దూరంలో ఉండటమూ మరింత కలిసొస్తుందని నిపుణులు చెబుతున్నారు. జనవరిలో టీసీఎస్ ప్రారంభం.. ఆదిభట్లలో ఇప్పటికే ఉన్న ఐటీ కంపెనీల్లో వేల సంఖ్యలో ఉద్యోగులున్నారు. వచ్చే జనవరిలో టీసీఎస్‌లో కొత్తగా 28 వేల ఉద్యోగులు రానున్నట్లు సమాచారం. దీంతో ఆదిభట్ల చుట్టుపక్కల ప్రాంతాలు హైటెక్ సిటీని తలపించనున్నాయన్నమాట. గతంలో ఇండిపెండెంట్ హౌస్‌లకే పరిమితమైన ఈ ప్రాంతానికి ఇప్పుడు అపార్ట్మెంట్ సంస్కృతికి చేరింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆదిభట్లపై రియల్టర్లు, ఎన్నారైలు, ఐటీ ఉద్యోగులు ఇలా అందరి చూపు పడింది. భారీ నివాస, వాణిజ్య సముదాయాలు నిర్మించేందుకు 6 బడా సంస్థలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ధరలు కూడా అందుబాటులో ఉండటం, మెరుగైన రవాణా, మౌలిక వసతులు పుష్కల్కంగా ఉండటంతో ఐటీ ఉద్యోగులు, మదుపుదారులు, ఎన్నారైలు ఈ ప్రాంతంలో స్థలాలు కొనేందుకు ఎగబాకుతున్నారు. రెండు మూడేళ్ల కిత్రం ఆదిభట్లలో గజం స్థలం ధర రూ.2 వేలుగా ఉండేది. కానీ, ప్రస్తుతం రూ. 8 వేల నుంచి రూ. 10 వేలకు పైగానే పలుకుతోంది. ఆదిభట్లలోని పలు ప్రాజెక్ట్‌లివే.. బొంగ్లూరు ఓఆర్ఆర్ వద్ద 20 ఎకరాల్లో మెట్రోసిటీ ఇన్ఫ్రాటెక్ ఫేజ్-2ను ప్రారంభించినట్లు మెట్రో సిటీ ఇన్ఫ్రా డెవలపర్స చైర్మన్ కే మనోహర్‌రెడ్డి చెప్పారు. ఇప్పటికే 36 ఎకరాల్లో ఫేజ్-1ను పూర్తి చేశాం. గజం ధ ర రూ.5,500లుగా నిర్ణయించాం. ఆదిభట్ల టీసీఎస్ వెనుక ప్రాంతంలో 20 ఎకరాల్లో మరో కొత్త వెంచర్‌ను ప్రారంభించాం. గజం ధర రూ.18-20 వేలుగా చెబుతున్నాం. రానున్న రోజుల్లో ఆదిభట్లలో మల్టీప్లెక్స్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సామాన్యులకు సైతం సొంతిల్లు అందించేందుకు గాను గున్‌గల్‌లో 30 ఎకరాల్లో శ్రీ బాలాజీ నగర్‌ను నిర్మిస్తున్నట్లు శ్రీసాయి బాలాజీ ఎస్టేట్స్ అధినేత ఎన్. కృష్ణ గౌడ్ చెప్పారు. ముందుగా 25 శాతం సొమ్ము చెల్లిస్తే సరి.. మిగతా డబ్బును 24 సులభ వాయిదా పద్ధతుల్లో చెల్లించేలా ఆఫర్‌ను ప్రకటించినట్లు పేర్కొన్నారు. గజం ధర రూ.4 వేలుగా నిర్ణయించామన్నారు. -
చిదంబరంతో సమావేశమైన ముఖ్యమంత్రి
హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సోమవారం భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన చిదంబరంతో శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిణమాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా చిదంబరం నగర శివారులోని ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలో టాటా లాకిడ్ మార్టిన్ కంపెనీలను సందర్శించనున్నట్లు సమాచారం. టాటా సెజ్ లో ఏర్పాటు చేసిన టాటా అడ్వాన్స్ డ్ సిస్టం లిమిటెడ్ , లాకిన్ మార్టిన్ సంస్థలో తయారయ్యే హెలికాప్టర్ విడిభాగాలను పరిశీలించనున్నారు. చిదంబరం వెంట రతన్ టాటా కూడా వెళ్లనున్నారు. అలాగే నగరంలో సినీ ఉత్సవాలకు హాజరుకానున్న చిదంబరం ఆదిభట్లనూ సందర్శించనున్నారని తెలుస్తోంది. ...........