అక్టోపస్‌ మాక్‌డ్రిల్‌ లో ప్రమాదం | accident in octopus mock drill at ranga reddy district | Sakshi
Sakshi News home page

అక్టోపస్‌ మాక్‌డ్రిల్‌ లో ప్రమాదం

Published Tue, Jan 23 2018 2:21 PM | Last Updated on Thu, Aug 30 2018 4:15 PM

accident in octopus mock drill at ranga reddy district

సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఆక్టోపస్‌ సిబ్బంది గాయపడ్డారు. ప్రమాదాలు జరిగినపుడు ఏ విధంగా రక్షించాలో అన్న అంశాలపై ఆదిభట్ల సమీపంలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఈ క్రమంలో రెండు అక్టోపస్‌ బస్సులు ఢీకొన్నాయి.

దీంతో బస్సులోని ఐదుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఎల్‌బీనగర్‌ కామినేని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని సురేష్‌, శేఖర్‌, రఘుపతి, రావు భవాని సింగ్‌, చెన్నకేశవ రెడ్డిగా గుర్తించారు. అయితే ఈ ఘటనపై మీడియాకు వివరాలు తెలియకుండా ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచుతున్నట్టు సమాచారం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement