ఖర్గే ట్రస్ట్‌కు ఏరో స్పేస్‌ పార్కు భూమి కేటాయింపు.. బీజేపీ విమర్శలు | Fresh row as Mallikarjun Kharge family trust gets plot in Karnataka aerospace park | Sakshi
Sakshi News home page

ఖర్గే కుటుంబ సభ్యులు ఏరో స్పేస్‌ పారిశ్రామికవేత్తలు ఎప్పుడు అయ్యారు?

Published Tue, Aug 27 2024 2:08 PM | Last Updated on Tue, Aug 27 2024 2:08 PM

Fresh row as Mallikarjun Kharge family trust gets plot in Karnataka aerospace park

బెంగళూరు: బెంగళూరు సమీపంలోని డిఫెన్స్‌ ఏరోస్పేస్‌ పార్క్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్టుకు ఐదు ఎకరాల భూమిని కేటాయించడంపై కర్ణాటక రాజకీయాల్లో వివాదం రాజుకుంది. సిద్దార్థ విహార ట్రస్టుకు కర్ణాటక ఇండస్ట్రీయల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ బోర్డు స్థలాన్ని మంజూరు చేయడాన్ని బీజేపీ ఖండించింది.

ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడటమేనని బీజేపీ ఐటీసెల్‌ అధ్యక్షుడు అమిత్‌ మాల్వియా మండిపడ్డారు.  కేవలం బంధుప్రీతి వల్లే భూమి కేటాయించారని దీనిపై ఖర్గే సమాధానం చెప్పాలని  మాల్వియా డిమాండ్‌ చేశారు.

 మరోవైపు కేఐఏడీబీ భూమిని పొందేందుకు ఖర్గే కుటుంబికులు ఏరోస్పేస్‌ రంగంలో ఎప్పుడు పారిశ్రామికవేత్తలు అయ్యారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లెహర్‌సింగ్‌ సిరోయ ప్రశ్నించారు. హైటెక్‌ డిఫెన్స్‌ ఏరోస్పేస్‌ పార్క్‌లో ఐదు ఎకరాలను ఎస్సీ కోటాలో ఈ ట్రస్టుకు ఎలా కేటాయించారని విమర్శించారు. ఈ అక్రమ భూముల కేటాయింపుల వ్యవహారాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

 కాగా ఖర్గే కుటుంబం నిర్వహిస్తున్న సిద్ధార్థ విహార్‌ ట్రస్ట్‌కు 5 ఎకరాల భూమిని షెడ్యూల్‌ కులం (ఎస్సీ) కోటా కింద మంజూరు చేశారు. దీనికి ఖర్గే, ఆయన అల్లుడు, కలబురగి ఎంపీ రాధాకృష్ణ, కుమారుడు రాహుల్ ఖర్గే, ఇతర కుటుంబ సభ్యులు ట్రస్టీలుగా ఉన్నారు.

అయితే.. భూముల కేటాయింపును రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి ఎంబీ పాటిల్‌ సమర్థించుకున్నారు. సిద్దార్థ విహార ట్రస్టుకు నిబంధనలకు అనుగుణంగానే స్థలం కేటాయించామని అన్నారు. అక్కడ పరిశోధనలు, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు భూమి కేటాయించామని తెలిపారు. 

రాహుల్‌ ఖర్గే ఐఐటీ చదివారని, వారి కుటుంబం విద్యారంగంలో ఉందన్నారు. పరిశోధనా కేంద్రాలకు అనుకూలంగా ఉండాలనే ఆ భూమిని కేటాయించామని తెలిపారు. గతంలో బీజేపీ ప్రభుత్వం చాణక్య యూనివర్సిటీకి పారిశ్రామికవాడలో కేవలం రూ.50 కోట్లకు 116 ఎకరాల భూమిని కేటాయించిందని, దీనిని ఏ విధంగా చూడాలని ప్రశ్నించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement