
న్యూఢిల్లీ: రెండు గంటల కంటే తక్కువ ప్రయాణ సమయమున్న విమానాల్లో ఆహారం అందించడాన్ని పునరుద్ధరించవచ్చని కేంద్రం ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు నిబంధనలు సవరించవచ్చని తెలుపుతూ పౌర విమానయానశాఖకు సమాచారం అందిం చినట్లు వెల్లడించింది. దీంతోపాటు, విమాన సిబ్బంది ఇకపై శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే రక్షణ దుస్తులు ధరించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే, వారు గ్లవ్స్, ఫేస్‌మాస్క్‌లు, ఫేస్ షీల్డ్‌లను మాత్రం ధరించాలని తెలిపింది. కేంద్రం ఏప్రిల్ 15వ తేదీన విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం..ప్రయాణ సమయం రెండు గంటలుండే విమానాల్లో ప్రయాణికులకు ఆహారం అందించడాన్ని నిలిపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment