Civil Aviation Ministry
-
70 విమానాలకు బాంబు బెదిరింపులు.. ఎయిర్‌లైన్స్ సీఈఓలతో భేటీ
భారత్‌కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం తీవ్ర కలకలం రేపుతోంది. అటు దేశీయంగా నడిచే వాటితోపాటు విదేశాలకు వెళ్తున్న అనేక ఎయిర్‌లైన్స్ వరసగా బాంబు బెదిరింపులు వస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. గడిచిన ఆరు రోజుల్లో ఏకంగా 70 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయంటే.. వీటి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు అధికారులు, కపౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ నకిలీ బెదిరింపులపై దర్యాప్తు జరుపుతున్నప్పటికీ పరిస్థితులో మార్పు కనిపించడం లేదు.ఈ క్రమంలో తాజాగా ‘బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ’ (బీసీఏఎస్) అప్రమత్తమైంది. విమానయాన సంస్థల సీఈఓలతో శనివారం సమావేశమైంది. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్‌లోని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో.. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే బెదిరింపులను ఎదుర్కోవడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానాన్ని (ఎస్ఓపీ) అనుసరించాలని సీఈవోలను కోరినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్న వేళ.. ప్రయాణికులకు అసౌకర్యం, క్యారియర్లకు నష్టం కలగకుండా ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలని సూచించింది. బెదిరింపులు, వాటి పట్ల తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేయాలని కోరింది.ఇక గత వారం రోజులుగా 70కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. శనివారం ఒక్కరోజే వివిధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలకు 30కి పైగా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకు జరిపిన విచారణలో బెదిరింపులు వచ్చిన బెదిరింపులు వాటిలో ఐపీ (ఇంటర్నెట్ ప్రోటోకాల్) చిరునామాలు లండన్, జర్మనీ, కెనడా, యూఎస్ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
విమానచార్జీలపై పరిమితి విధించే యోచన లేదు
న్యూఢిల్లీ: విమానయాన చార్జీలపై పరిమితులు విధించడం ద్వారా స్వేచ్ఛాయుత మార్కెట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే యోచనేది ప్రభుత్వానికి లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సల్ స్పష్టం చేశారు. ‘ప్రాథమికంగా చార్జీలపై పరిమితులు విధించడం, మార్కెట్ ఎకానమీ లో జోక్యం చేసుకోవడం అనేవి సరికాదు. ప్రభు త్వం ఈ విషయంపై సానుకూలంగా లేదు. ఇటు కనిష్ట అటు గరిష్ట చార్జీల పరిమితి విధించాలను కోవడం లేదు. స్వేచ్ఛాయుత మార్కెట్ ఎకానమీలో అసలు ప్రభుత్వం జోక్యమే చేసుకోకూడదనేది నా అభిప్రాయం‘ అని ఆయన చెప్పారు. అయితే, ప్రయాణికులపై అత్యంత భారీ చార్జీల భారం పడ కుండా, వారు ఇబ్బంది పడకుండా చూసేందుకు ఎయిర్‌లైన్స్‌తో ప్రభుత్వం చర్చించినట్లు బన్సల్ చెప్పారు. చాలా మటుకు రూట్లలో ప్రస్తుతం కనిష్ట చార్జీలు.. దాదాపు ఏసీ రైలు చార్జీల స్థాయిలోనే ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. చార్జీలపై కనిష్ట, గరిష్ట పరిమితులు విధించాలని, ఆ విషయంలో స్వేచ్ఛా మార్కెట్ ఎకానమీ పేరుతో పోటీ సంస్థలను దెబ్బతీసేలా ఎయిర్‌లైన్స్ వ్యవహరించకుండా చూడాలని పౌర విమానయాన శాఖకు పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు చేసిన నేపథ్యంలో బన్సల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
రూ.400 కోట్లతో పౌర విమానయాన పరిశోధన కేంద్రం
తెలంగాణలో మరో పరిశోధనా సంస్థ రూపుదిద్దుకుంటోంది. పౌర విమానయాన రంగంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన పరిశోధనా సంస్థను హైదరాబాద్‌లో నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.400 కోట్లకుపైగా అంచనా వ్యయంతో బేగంపేట విమానాశ్రయంలో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఏఆర్వో)కు శ్రీకారం చుట్టింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ కేంద్రంలో మున్ముందు విమానయాన రంగంలో చోటుచేసుకోనున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా పరిశోధనలు జరగనున్నాయి. ‘గృహ–5’ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ పరిశోధనా కేంద్రంలో ఈ ఏడాది జూలై నుంచి పరిశోధనలు ప్రారంభించడమే లక్ష్యంగా పనులను వేగవంతం చేశారు. భారతదేశంలో మొదటిసారిగా నిర్మిస్తున్న ఈ కేంద్రంలో విమానాశ్రయాలు, ఎయిర్ నావిగేషన్ సేవలకు సంబంధించిన పరిశోధనా సౌకర్యాలు, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్స్, డొమైన్ సిమ్యులేటర్, నెట్వర్క్ ఎమ్యులేటర్, విజువలైజేషన్ – అనాలసిస్ ల్యాబ్స్, సరై్వలెన్స్(నిఘా) ల్యాబ్స్, నావిగేషన్ సిస్టమ్స్ ఎమ్యులేషన్ – సిమ్యులేషన్ ల్యాబ్స్, సైబర్ సెక్యూరిటీ – థ్రెట్ అనాలసిస్ ల్యాబ్స్, డేటా మేనేజ్మెంట్ సెంటర్, ప్రాజెక్ట్ సపోర్ట్ సెంటర్, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ – టూల్స్ సెంటర్, నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంటర్‌సహా పలు పరిశోధనలు జరగనున్నాయి. -
పంజాబ్ సీఎం నిజంగానే ఫుల్లుగా తాగారా? పౌర విమానయాన శాఖ దర్యాప్తు!
సాక్షి, న్యూఢిల్లీ: ఫుల్లుగా తాగి నడవలేని స్థితిలో ఉన్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను జర్మనీలోని ఎయిర్‌పోర్టులో విమానం నుంచి దించేశారని సోమవారం ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించాయి. తాజాగా పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయం స్పందించారు. పంజాబ్ సీఎంపై వచ్చిన ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని సింధియా తెలిపారు. అయితే ఈ ఘటన విదేశీ గడ్డపై జరిగినందున అసలు నిజానిజాలు ఏంటో తెలుసుకోవాల్సి ఉందన్నారు. లుఫ్తాన్సా విమానయాన సంస్థ వివరాలు వెల్లడించాల్సి ఉందన్నారు. దీనిపై విచారణ జరిపించాలని తనకు విజ్ఞప్తులు అందాయని, కచ్చితంగా దర్యాప్తు చేయిస్తామని స్పష్టం చేశారు. ఏం జరిగింది? జర్మనీ పర్యటన ముగించుకుని సోమవారం ఢిల్లీకి తిరిగివచ్చారు భగవంత్ మాన్. అయినే ఫుల్లుగా తాగి ఉన్న కారణంగా ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్‌పోర్టులో విమానం నుంచి దించేశారని, దీనివల్ల నాలుగు గంటలు ప్రయాణానికి ఆలస్యమైందని మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. భగవంత్ మాన్ పంజాబీల పరువు తీశారని శిరోమణి ఆకాలీదళ్ ధ్వజమెత్తింది. అయితే లుఫ్తాన్సా సంస్థ దీనిపై స్పష్టత ఇచ్చింది. విమానాన్ని మార్చాల్సి రావడం వల్లే ఆలస్యం అయిందని చెప్పింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఆరోపణలను ఖండించించి. పంజాబ్ సీఎంను అప్రతిష్టపాలు చేసేందుకే కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగింది. భగవంత్ మాన్ సోమవారం జర్మనీ నుంచి ఢిల్లీకి చేరుకుని నేరుగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. చదవండి: మాట్లాడింది మమతేనా? మోదీకి సపోర్ట్ చేయడమేంటి? -
29 మంది పైలట్లు దుర్మరణం: ప్రధాన కారణం ఇదే!
సాక్షి:హైదరాబాద్: విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన పైలట్ల సమాచార సమాచారాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)డేటా ప్రకారం 2014 నుండి ఇప్పటివరకు విమాన ప్రమాదాల్లో 29 మంది పైలట్లు మరణించినట్లు వెల్లడించింది. హైదరాబాద్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త రాబిన్ జాకీస్ దాఖలు చేసిన సమాచార హక్కు పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఈ సమాచారం అందించింది. గత ఎనిమిదేళ్లలో జరిగిన మొత్తం 19 ప్రమాదాల్లో ఆరు మహారాష్ట్రలోనే జరిగాయి. ఈ ఆరు ప్రమాదాల్లో 10 మంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర తర్వాత అత్యధిక ప్రమాదాలు మధ్యప్రదేశ్‌లో జరిగాయి. ఈ రాష్ట్రంలో రెండు ప్రమాదాల్లో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ప్రభుత్వ యాజమాన్యంలోని హెలికాప్టర్ సర్వీస్ ప్రొవైడర్ పవన్ హన్స్ మూడు విమాన ప్రమాదాలు జరగ్గా, ఇదే అత్యధికంగా ఆరు మరణాలకు దారితీసింది.ఈ 19 క్రాష్లలో చాలా వరకు ఐదు 2015లో, నాలుగు 2020లో, 2019, 2018 సంవత్సరాల్లో ఒక్కొక్కటి చోటుచేసుకున్నాయి. ఏఏఐబీ వెబ్సైట్లో ఉన్న నివేదికల ప్రకారం ప్రమాదాల వెనుక అత్యంత సాధారణ కారణం పైలట్ లోపం అని పేర్కొంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా విమానం కుప్పకూలిన ఘటనలో పైలట్లిద్దరూ మరణించిన సంగతి తెలిసిందే. -
ఉక్కు శాఖ బాధ్యతలు స్వీకరించిన సింధియా
న్యూఢిల్లీ: కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య మాధవ్‌రావు సింధియా గురువారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సింధియా మోదీ ప్రభుత్వంలో ఉక్కు శాఖను చేపట్టిన మూడో మంత్రి కావడం గమనించాలి. ఢిల్లీలోని ఉద్యోగభవన్‌లో ఉక్కు శాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన తన టేబుల్‌పై వినాయకుడి విగ్రహం ఉంచి, ఈ కార్యక్రమం చేపట్టారు. ‘‘ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు స్టీల్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను. శ్రేయోభిలాషుల దీవెనలతో నూతన బాధ్యతలను సాధ్యమైన మేర మెరుగ్గా నిర్వహిస్తాను. ఆర్సీపీ సింగ్ నుంచి బాధ్యతలు స్వీకరించాను. అగ్ర నాయకత్వం ఇచ్చిన ఈ బాధ్యతలను పూర్తి సామర్థ్యాలతో దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు నిర్వహిస్తాను’’అంటూ సింధియా రెండు వేర్వేరు ట్వీట్లు పెట్టారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉక్కు శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశాలు నిర్వహించారు. అలాగే, ఉక్కు రంగానికి సంబంధించి అన్ని ప్రభుత్వరంగ సంస్థల అధిపతులతోనూ సమావేశమయ్యారు. రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఉక్కు శాఖ మంత్రిగా పనిచేసిన ఆర్సీపీ సింగ్ రాజీనామా చేయడం తెలిసిందే. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టు.. మరో 30 ఏళ్లు జీఎంఆర్‌కే
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వాహాన బాధ్యతలు మరో ముప్పై పాటు జీఎంఆర్ సంస్థకు దక్కాయి. ఈ మేరకు సివిల్ ఏవియేష్ అథారిటీ ఇందుకు సంబంధించిన పత్రాలను జీఎంఆర్‌కు అందచేసింది. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టు ద్వారా ఏడాదికి 21 మిలియన్ మంది ప్రయాణిస్తుండగా 1.50 లక్షల టన్నుల సరుకు రవాణా జరుగుతోంది. గతంలో బేగంపేటలో ఎయిర్‌పోర్టు ఉండగా శంషాబాద్ వద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ)లో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు పనులు 2004లో ప్రారంభించారు. 31 నెలల పాటు నిర్మాణ పనులు పూర్తి చేసుకుని 2008లో ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వచ్చింది. పీపీపీ ఒప్పందంలో భాగంగా అప్పటి నుంచి 2038 వరకు ఎయిర్‌పోర్టు నిర్వాహాణ బాధ్యతలు జీఎంఆర్ సంస్థకు దక్కాయి. తాజాగా మరో ముప్పై ఏళ్ల పాటు ఎయిర్‌పోర్టు నిర్వాహాణ బాధ్యతలు జీఎంఆర్‌కి కట్టబెడుతూ సివిల్ ఏవియేషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు 2068 మార్చి 23 వరకు జీఎంఆర్ ఆధీనంలో ఉండనుంది. ఇటీవల ఎయిర్‌పోర్టు విస్తరణ పనులు భారీ ఎత్తున జీఎంఆర్ సంస్థ చేపట్టింది. ఏడాదికి 35 మిలియన్ మంది ప్రయాణించేలా ఇక్కడ సౌకర్యాలను మెరుగు పరుస్తోంది. చదవండి: విస్తరణ బాటలో ఫనాటిక్స్ -
లాభాలే..లాభాలు: విమనాశ్రయాల ప్రైవేటీకరణ..సమర్ధించుకున్న కేంద్రమంత్రి!
కరోనా ప్రభావాల నుండి విమానయాన రంగం క్రమంగా కోలుకుంటోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. గణాంకాల ప్రకారం గత ఏడు రోజుల్లో రోజువారీగా 3.82 లక్షల మంది ప్రయాణించారని ఆయన పేర్కొన్నారు. 2018–19లో 14.50 కోట్లుగా ఉన్న విమాన ప్రయాణికుల సంఖ్య 2023–24 నాటికి 40 కోట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు లోక్‌సభకు మంత్రి వివరించారు. వచ్చే 2–3 ఏళ్లలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ రంగ సంస్థలు విమానాశ్రయాల ఏర్పాటుపై రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు రానున్నట్లు ఆయన చెప్పారు. విమానాశ్రయాలను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. దీని వల్ల ఏఏఐ లాభదాయకత పెరుగుతుందని పేర్కొన్నారు. 2014 వరకూ దేశీయంగా 74 ఎయిర్‌పోర్టులు ఉండగా గడిచిన ఏడేళ్లలో కొత్తగా 66 విమానాశ్రయాలు వచ్చాయని సింధియా చెప్పారు. దేశ ఎకానమీలో భారీగా ఉద్యోగాల కల్పన ద్వారా ఏవియేషన్ రంగం కీలకంగా మారిందని పేర్కొన్నారు. దేశీయంగా మొత్తం పైలట్లలో 15 శాతం మంది మహిళలే ఉన్నారని.. అంతర్జాతీయంగా ఈ సగటు 5 శాతమేనని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌లైన్ పరిశ్రమ ఒడిదుడుకులు ఎదురు కొంటూ ఉండగా.. భారత్‌లో రెండు కొత్త ఎయిర్‌లైన్స్ (జెట్, ఆకాశ) త్వరలో తమ సర్వీసులు ప్రారంభించనున్నాయని సింధియా వివరించారు. -
ఆ రాష్ట్రానికి విమాన సర్వీసు నడిపించండి.. తెలంగాణ గవర్నర్ తమిళసై రిక్వెస్ట్
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చూపిన చొరవతో హైదరాబాద్ నుంచి ఓ విమాన సర్వీసు పునః ప్రారంభం కానుంది. ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు పెరగడం ద్వారా టూరిజం అభివృద్ధికి జరుతుంది అంటూ గవర్నర్ పలు మార్లు రిక్వెస్ట్ చేయడంతో పౌర విమానయాన శాఖ సానుకూలంగా స్పందించింది. లాక్‌డౌన్‌తో కరోనా సంక్షోభం చుట్టుముట్టగానే లాక్డౌన్ అనివార్యంగా మారింది. అందులో భాగంగా హైదరాబాద్ నగరం నుంచి 2020 మార్చి 24 నుంచి అన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఆ తర్వాత క్రమంగా కొన్ని సర్వీసులు స్టార్ అయ్యాయి. అయితే హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి నడిచే ప్లైట్ పునః ప్రారంభానికి నోచుకోలేదు. ఈ సర్వీసుతో నష్టాలు వస్తుండటంతో ఎయిర్ ఆపరేటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ లేఖ హైదరాబాద్ పుదుచ్చేరిల మధ్య విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తే ఇరు రాష్ట్రాల్లో టూరిజం సెక్టార్ మేలు జరుగుతుందంటూ కేంద్రాన్ని కోరారు గవర్నర్ తమిళసై. పుదుచ్చెరికి సమీపంలో ఉన్న వెలాంగిని చర్చ్, నాగోర్ దర్గా, తిరునల్లార్ శనీశ్వరాలయం, మహాబలిపురం వంటి ప్రాంతాలకు వెళ్లే వారికి అనుకూలంగా ఉంటుందంటూ విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాకు లేఖ రాశారు. వీజీఎఫ్ సర్థుబాటు గవర్నర్ తమిళసై రిక్వెస్ట్‌తో రంగంలోకి దిగిన ఏవియేషన్ శాఖ ఎయిర్ ఆపరేటర్లతో చర్చించింది. హైదరాబాద్ - పుదుచ్చేరి సర్వీసు బ్రేక్ ఈవెన్ సాధించే వరకు వ్యాయబులిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) సర్థుబాటు చేస్తామంటూ హమీ ఇచ్చింది. దీంతో సంక్రాంతి పండగ నుంచి హైదరాబాద్ - పుదుచ్చేరిల మధ్య విమాన సర్వీసులు ప్రారంభించేందుకు స్పైస్‌జెట్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. పుదుచ్చెరీ సైతం మరోవైపు పుదుచ్చేరి సర్కారు సైతం తమ రాష్ట్రం నుంచి బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్, రాజమండ్రి నగరాలకు విమాన సర్వీసులు నడిపించాల్సిందిగా ఇండిగో సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది. వీజీఎఫ్ సర్థుబాటు చేయడంతో పాటు వ్యాట్ ఫ్రీ ఏవియేషన్ ఫ్యూయల్ అందిస్తామంటూ తెలిపింది. అయితే ఇండిగో నుంచి ఇంకా స్పష్టమైన నిర్ణయం రాలేదు. చదవండి: ఆ పది మంది సంపాదన 400 బిలియన్ డాలర్లు! ఈ ఒక్క ఏడాదిలోనే.. -
విదేశాల నుంచి ఇండియా వచ్చే వారికి అలెర్ట్! డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్
India Issues Revised Covid Guidelines for International Travellers Over Omicron Variant: విదేశాల నుంచి ఇండియాకి వచ్చే ఎన్నారైలు, వివిధ దేశాలకు చెందిన పౌరులకు కేంద్ర ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. డిసెంబరు 1 నుంచి ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అరికట్టే లక్ష్యంతో ఈ కొత్త రూల్స్ తెరపైకి వచ్చాయి. ఎయిర్ సువిధా విదేశాల నుంచి ఇండియాకి వచ్చే వారు తమ ప్రయాణ తేదికి కంటే ముందు 14 రోజుల ట్రావెల్ హిస్టరీని ఎయిర్ సువిధా పోర్టల్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్రయాణ తేదికి 72 గంటల ముందు చేయించిన ఆర్టీ పీసీఆర్ నెగటివ్ రిపోర్టును స్వచ్చంధంగా సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాదు అవసరమైతే ప్రభుత్వం నిర్ధేశించినట్టుగా క్వారంటైన్లో ఉంటామని సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించాలి. క్వారంటైన్ తప్పని సరి ఇక భారత ప్రభుత్వం ‘అట్ రిస్క్’గా ప్రకటించిన జాబితాలోని దేశాలకు చెందిన ప్రజలు ఇండియాలోకి ఎంటరైన తర్వాత తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. టెస్టులో నెగటివ్ రిపోర్టు వచ్చినా... ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. ఎనిమిదవ రోజు టెస్ట్ చేసి అప్పుడు కూడా నెగటీవ్‌గా వస్తే.. మరో ఏడు రోజుల పాటు సెల్ఫ్ మానిటరింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత సాధారణంగా అందరితో కలిసిపోవచ్చు. @రిస్క్ జాబితా ఒమేక్రాన్ వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉందని భావిస్తున్న యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోత్స్వానా, చైనా, మారిషస్, న్యూజీల్యాండ్, సింగపూర్, జింబాబ్వే, హాంగ్‌కాంగ్, ఇజ్రాయిల్ దేశాలు కేంద్రం ప్రకటించిన అట్ రిస్క్ జాబితాలో ఉన్నాయి. ఈ దేశాల నుంచి వచ్చే వారు ఎయిర్‌పోర్టులు కోవిడ్ టెస్ట్ చేయించుకోవడంతో పాటు 14 రోజుల క్వారెంటైన్ తప్పనిసరి. పాజిటివ్ వస్తే ఎయిర్‌పోర్టులో జరిపే సెల్ఫ్ పెయిడ్ టెస్టులో పాజిటివ్‌గా తేలిన వ్యక్తులను ఇన్స్టిట్యూషనల్ క్వారెంటైన్ సెంటర్‌కి తరలించి వైద్య సాయం అందిస్తారు. పాజిటివ్‌గా తేలిన వ్యక్తులతో పాటు వాటి కాంటాక్టులుగా తేలిన అందిరినీ హోం క్వారెంటైన్ చేస్తారు. ఇంటర్నేషనల్ ప్రయాణికులు ఇండియాకి వచ్చిన తర్వాత ఆరోగ్య సేపు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం మంచిదని కేంద్రం సూచిస్తోంది. చదవండి:విమానయానంపై ఒమిక్రాన్ ప్రభావం.. జాగ్రత్తగా జర్నీ -
హైదరాబాద్‌లో రెండో ఎయిర్‌పోర్టు ? కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
కోల్‌కతా: వచ్చే దశాబ్ద కాలంలో విమాన ప్రయాణాలకు సంబంధించి ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిల్చే సత్తా భారత్‌కు ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. పరిశ్రమ కొత్త శిఖారాలకు చేరడంలో తోడ్పడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రాంతీయంగాను, సుదీర్ఘ దూరాల్లోని అంతర్జాతీయ రూట్లలోను కనెక్టివిటీని మెరుగుపర్చడంపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి పెడుతోందని ఆయన వివరించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం 136గా ఉన్న ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్యను 2025 నాటికల్లా 220కి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) వర్చువల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. గత ఏడేళ్లలోనే కొత్తగా 62 విమానాశ్రయాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. మెట్రో నగరాల్లో రెండో ఎయిర్పోర్ట్ ఉండాలి ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మెట్రో నగరాల్లో రెండో విమానాశ్రయం కూడా ఉండాలని సింధియా అభిప్రాయపడ్డారు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ఎయిర్‌పోర్టుల్లో రద్దీ గణనీయంగా పెరిగిందన్నారు. ఢిల్లీ, ముంబైలో ఇప్పటికే కొత్త విమానాశ్రయాల నిర్మాణ ప్రక్రియ జరుగుతోందని.. కోల్‌కతా సహా మిగతా నగరాల్లో కూడా రెండో ఎయిర్‌పోర్ట్‌ను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. వచ్చే 100 రోజుల్లో అయిదు కొత్త ఎయిర్‌పోర్టులు, ఆరు హెలీపోర్టులు, 50 ఉడాన్ రూట్లను ప్రారంభించాలని లేదా శంకుస్థాపన అయినా చేయాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. లాభాల్లోకి ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రా: ఇక్రా అంచనా ముంబై: విమానాశ్రయ మౌలిక సదుపాయాల రంగం ఈ ఏడాది(2021–22) నష్టాల నుంచి బయటపడే వీలున్నట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజాగా అంచనా వేసింది. గతేడాది(2020–21) నిర్వహణ నష్టాలు నమోదు చేసిన ఈ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభాల బాట పట్టనున్నట్లు అభిప్రాయపడింది. రూ. 3,250 కోట్ల నిర్వహణ లాభాలు సాధించగలదని పేర్కొంది. ఈ ఏడాది వార్షిక ప్రాతిపదికన విమాన ప్రయాణికుల్లో 82–84 శాతం వృద్ధి నమోదుకాగలదని వేసిన అంచనాలు ఇందుకు సహకరించగలవని తెలియజేసింది. కాగా.. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో ప్రధాన విమానాశ్రయాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న సామర్థ్య విస్తరణ 12–18 నెలలపాటు ఆలస్యంకావచ్చని పేర్కొంది. అయితే భారీ స్థాయిలో జరుగుతున్న వ్యాక్సినేషన్, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, లీజర్ ప్రయాణాలు ఊపందుకోవడం వంటి అంశాలు దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగేందుకు ఊతమివ్వనున్నట్లు ఇక్రా నివేదిక వివరించింది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా విమానాశ్రయ మౌలిక సదుపాయాల రంగం భారీగా దెబ్బతిన్నట్లు ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ గ్రూప్ హెడ్ రాజేశ్వర్ బుర్లా పేర్కొన్నారు. -
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, సివిల్ ఏవియేషన్ మధ్య కీలక ఒప్పందం
దేశంలోని ప్రీమియం బిజినెస్ ఇన్సిస్టిట్యూట్లలో ఒకటిగా ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) హైదరాబాద్, సివిల్ ఏవియేషన్ శాఖల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ జాయింట్ సెక్రటరీ ఉషా పధీ, ఐఎస్బీ డిప్యూటీ డీన్ మిలింద్ సోహానీ ఒప్పంద పత్రాల మీద సంతకం చేశారు. కొత్త సిలబస్ దేశీయంగా ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన ప్రయాణాలను చేరువ చేసే లక్క్ష్యంతో కేంద్రం ఉడాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కొత్తగా ప్రాంతీయ, జిల్లా కేంద్రాలలో ఎయిర్‌పోర్టులు అభివృద్ది చేయనుంది. ఈ రీజనల్ కనెక్టివిటీ పథకం యొక్క ప్రభావం, ప్రయోజనాలు తదితర అంశాలపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లోతైన పరిశోధన చేపట్టి నివేదిక రూపొందించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఈ నివేదికను ఓ కేస్ స్టడీగా ఇతర విద్యాలయాల్లో, అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్స్టిట్యూట్లలో ఉపయోగించుకుంటామని పౌర విమానయాన శాఖ చెబుతోంది. ట్రాఫిక్ పెరిగింది కోవిడ్ సంక్షోభం తర్వాత టూరిజం, భక్తులు ఎక్కుగా వచ్చే ఎయిర్‌పోర్టులో ట్రాఫిక్ పెరిగినట్టు కేంద్ర విమానయాన శాఖ తెలిపింది. -
విమానాల్లో ఆహార సేవలు కొనసాగించొచ్చు
న్యూఢిల్లీ: రెండు గంటల కంటే తక్కువ ప్రయాణ సమయమున్న విమానాల్లో ఆహారం అందించడాన్ని పునరుద్ధరించవచ్చని కేంద్రం ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు నిబంధనలు సవరించవచ్చని తెలుపుతూ పౌర విమానయానశాఖకు సమాచారం అందిం చినట్లు వెల్లడించింది. దీంతోపాటు, విమాన సిబ్బంది ఇకపై శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే రక్షణ దుస్తులు ధరించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే, వారు గ్లవ్స్, ఫేస్‌మాస్క్‌లు, ఫేస్ షీల్డ్‌లను మాత్రం ధరించాలని తెలిపింది. కేంద్రం ఏప్రిల్ 15వ తేదీన విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం..ప్రయాణ సమయం రెండు గంటలుండే విమానాల్లో ప్రయాణికులకు ఆహారం అందించడాన్ని నిలిపివేశారు. -
తెలంగాణలో 6 ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు సన్నాహాలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో మరో ఆరు ఎయిర్‌పోర్టుల ఏర్పా టుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, కొత్తగూడెం జిల్లా పాల్వంచ, మహబూబ్‌నగర్ జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులకు, వరంగల్ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఆదిలాబాద్‌లో బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులకు వచ్చిన ప్రతిపాదనలపై టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ రిపోర్ట్‌ను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పూర్తి చేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. -
నెగిటివ్ రిపోర్టు క్యూఆర్ కోడ్ ఉంటేనే ఎంట్రీ
న్యూఢిల్లీ : భారత్ నుంచి వచ్చే విమాన ప్రయాణికులపై ఆంక్షలు కఠినతరం చేశాయి విదేశాలు. ఇకపై ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్ టెస్ట్ నెగిటివ్ రిపోర్ట్‌కి అనుసంధానంగా ఉన్న క్యూర్‌కోడ్ చూపిస్తేనే ఎంట్రీకి అనుమతి ఇస్తున్నాయి. క్యూఆర్ కోడ్ లేకుండా చూపించే కోవిడ్ 19 నెగటివ్ రిపోర్టులను తిరస్కరిస్తున్నాయి. దీంతో మే 22 అర్థరాత్రి నుంచి విదేశాలకు వెళ్లే విమాన ప్రయాణికులు తమతో పాటు తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్ టెస్ట్ నెగటివ్ రిపోర్టుకి అనుసంధానంగా ఉండే క్యూఆర్ కోడ్‌ను వెంట ఉంచుకోవాలంటూ పౌరవిమానయాణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల భారత్ నుంచి విదేశాలకు వెళ్లిన ప్రయాణికుల్లో కొందరు నకిలీవీ, ఫోటోషాప్ చేసిన ఆర్టీ పీసీఆర్ రిపోర్టులు తీసుకెళ్లారు. విదేశాల్లోని చెక్పాయింట్ల వద్ద వారు పట్టుబడ్డారు. దీంతో పేపర్ రిపోర్టులకు బదులు ఒరిజినల్ కోవిడ్ రిపోర్టుకి అనుబంధంగా ఉండే క్యూఆర్ కోడ్‌ని తప్పనిసరి చేశాయి. -
దేశంలోనే విశిష్ట ప్రాంతం కర్నూలు
సాక్షి, అమరావతి: కర్నూలును రాష్ట్ర న్యాయ రాజధానిగా కేంద్ర పౌరవిమానయాన శాఖ గుర్తించింది. ఉడాన్ పథకం కింద మార్చి 28 నుంచి కర్నూలు నుంచి విమాన సర్వీసులను ప్రారంభించడంతోపాటు రాష్ట్రంలో ఆరో ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రావడంపై కేంద్ర పౌరవిమానయానశాఖ సహాయమంత్రి హరిదీప్‌సింగ్ పురి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కర్నూలును ఆంధ్రప్రదేశ్ న్యాయ రాజధానిగా పేర్కొనడంతోపాటు చారిత్రాత్మకంగా దేశంలో విశిష్టత కలిగిన ప్రాంతంగా అభివరి్ణంచారు. కర్నూలులో గురువారం జరిగిన ప్రారం¿ోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి వర్చువల్ విధానంలో పాల్గొన్నట్లు తెలిపారు. అడవులు, గుహలు, దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన కర్నూలు.. విమానయాన సర్వీసులు అందుబాటులోకి రావడం ద్వారా పర్యాటకంగా అభివృద్ధి చెంది స్థానికులకు ఉపాధి లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒక పక్క తుంగభద్ర నది, మరోపక్క నల్లమల కొండలు సమాంతరంగా ఉండే ఇక్కడ నల్లమల అడవి, అహోబిలం, బెలూం గుహలు, మహానంది, మంత్రాలయం, ఓర్వకల్లు, సంగమేశ్వరం, కేతవరం, కాల్వబుగ్గ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని వివరించారు. ఈ విమానాశ్రయం నుంచి ఉడాన్ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కింద 80:20 నిష్పత్తిలో విశాఖ, బెంగళూరు, చెన్నై నగరాలకు విమాన సరీ్వసులను ఈ నెల 28 నుంచి నడపనున్నట్లు తెలిపారు. దేశంలో మొత్తం 325 విమానాశ్రయాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 56 చోట్ల కొత్తగా విమాన సర్వీసులను అందుబాటులోకి తెచి్చనట్లు ఆయన పేర్కొన్నారు. -
కర్నూలు సిగలో కలికితురాయి
కర్నూలు (సెంట్రల్): కర్నూలు సిగలో మరో కలికితురాయి చేరనుంది. జిల్లా ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న కర్నూలు విమానాశ్రయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రూ.153 కోట్ల వ్యయంతో ఓర్వకల్లు వద్ద నిర్మించిన దీన్ని ఈ నెల 25న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.హర్దీప్సింగ్ జాతికి అంకితం చేస్తారని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎయిర్‌పోర్టును సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటన విజయవంతమయ్యేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28 నుంచి ‘ఇండిగో’ విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర విమానయాన శాఖ ఏర్పాట్లు చేస్తున్నాయి. నాడు అసంపూర్తిగా.. కర్నూలు జిల్లా ప్రజలు దాదాపు 20 ఏళ్ల నుంచి విమాన ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే విమానాశ్రయం నిర్మాణం కోసం భూసేకరణ చేయాలని నిర్ణయించారు. అయితే ఆయన అకాల మరణం తర్వాత వచి్చన ప్రభుత్వాలు దీన్ని గాలికొదిలేశాయి. చివరకు 2014లో కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోని ఓర్వకల్లు వద్ద 1,008 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. నిర్మాణ పనులను టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డికి చెందిన కంపెనీకి అప్పగించడంతో భూసేకరణ, ఇతర పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. 2019 సాధారణ ఎన్నికల నాటికి కేవలం 2.2 కిలోమీటర్ల రన్‌వే మాత్రమే పూర్తయ్యింది. మిగిలిన పనులను అసలు మొదలుపెట్టలేదు. అయినా చంద్రబాబు 2019 జనవరి 18న హడావుడిగా విమానాశ్రయాన్ని ప్రారంభించి.. అదే సంవత్సరం ఏప్రిల్ నుంచి విమానాల రాకపోకలు సాగుతాయని ఆర్భాటంగా ప్రకటించారు. ఇవన్నీ గాలిమాటలుగానే మిగిలిపోయాయి. ఏడాదిన్నరలోనే పనులన్నీ పూర్తి.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు విమానాశ్రయ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. పెండింగ్‌లోని అన్ని పనులను పూర్తి చేయించే బాధ్యతను ఆరి్థక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు అప్పగించారు. ఆయన కలెక్టర్, ఎయిర్‌పోర్టు అథారిటీ, ఇతర అధికారులను సమన్వయం చేసుకుంటూ కేవలం ఏడాదిన్నర కాలంలోనే పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులకు అదనంగా రూ.75 కోట్లను విడుదల చేయించారు. ప్యాసింజర్ టెరి్మనల్ బిల్డింగ్, ఐదు ఫ్లోర్లలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, అడ్మిన్ బిల్డింగ్, పోలీస్ బ్యారక్, ప్యాసింజర్ లాంజ్, వీఐపీ లాంజ్, సబ్‌స్టేషన్, వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకు తదితర పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించారు. ఏటీసీ, డీజీసీఏ అనుమతులు.. కర్నూలు విమానాశ్రయానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతులను రప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పలుమార్లు ఢిల్లీ వెళ్లి అనుమతులు వచ్చేలా చేశారు. 2019లో ఏటీసీ, 2020 జనవరి 16న డీజీసీఏ అనుమతులు లభించాయి. ఏరోడ్రోమ్ లైసెన్స్‌ను మంజూరు చేస్తూ న్యూఢిల్లీలోని డీజీసీఏ కార్యాలయం ఉత్తర్వులిచి్చంది. దీంతో విమానాల రాకపోకలకు లైన్‌క్లియర్ అయ్యింది. కర్నూలు జిల్లా అభివృద్ధిలో కీలకం కర్నూలు ఎయిర్‌పోర్టు జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇక్కడి పారిశ్రామిక రంగానికి ఎంతో ఊతమిస్తుంది. ఇప్పటికే ఓర్వకల్లు ఇండ్రస్టియల్ హబ్‌ను తీర్చిదిద్దుతున్నాం. ఎయిర్‌పోర్టును వేగంగా పూర్తి చేసేందుకు సహకరించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి జిల్లా ప్రజల తరఫున నా కృతజ్ఞతలు. – జి.వీరపాండియన్, జిల్లా కలెక్టర్, కర్నూలు -
80% విమానాలకు ఓకే- షేర్లకు రెక్కలు
ముంబై, సాక్షి: కోవిడ్-19కు ముందున్నస్థాయిలో 80 శాతంవరకూ దేశీ సర్వీసుల నిర్వహణకు ప్రభుత్వం తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎయిర్‌లైన్స్ కంపెనీలు తమ సామర్థ్యంలో 80 శాతం విమానాలను నిర్వహించేందుకు వీలు చిక్కింది. ఇందుకు అనుమతిస్తూ పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ కట్టడికి లాక్‌డవున్ విధించిన తదుపరి మే 25న దేశీయంగా విమాన సర్వీసులకు ప్రభుత్వం అనుమతించింది. రెండు నెలల తరువాత సర్వీసులు ప్రారంభమైనప్పుడు 30,000 మంది ప్రయాణికులు నమోదుకాగా.. నవంబర్ 30కల్లా ఈ సంఖ్య 2.52 లక్షలను తాకినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ వార్తల నేపథ్యంలో ప్రయివేట్ రంగ లిస్టెడ్ కంపెనీలు ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, స్పైస్‌జెట్ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పుట్టింది. దీంతో ఈ కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఇండిగో.. గో ఇండిగో బ్రాండు విమానయాన సర్వీసుల కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 6 శాతం జంప్‌చేసి రూ. 1,744 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,747 వరకూ ఎగసింది. వెరసి 52 వారాల గరిష్టాన్ని తాకింది. దేశీయంగా మే నెలలో 33 శాతం, జూన్‌లో 45 శాతం వరకూ విమానాల నిర్వహణకు అనుమతించిన ప్రభుత్వం తాజాగా 70 శాతం నుంచి 80 శాతానికి పరిమితిని పెంచడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లలో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. స్పైస్‌జెట్ దేశీ సర్వీసులలో 80 శాతం వరకూ విమానాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో స్పైస్‌జెట్ కౌంటర్ జోరందుకుంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 9.3 శాతం దూసుకెళ్లి రూ. 89 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 92 వరకూ ఎగసింది. ఇక రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా కల్రాక్ క్యాపిటిల్ కన్సార్షియం మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన నేపథ్యంలో ఇటీవల జెట్ ఎయిర్వేస్ కౌంటర్ సైతం ర్యాలీ బాటలో సాగుతున్న విషయం విదితమే. వచ్చే(2021) వేసవిలో యూరోపియన్ దేశాలతోపాటు.. పశ్చిమాసియా నగరాలకు జెట్ ఎయిర్వేస్ సర్వీసులను ప్రారంభించే వీలున్నట్లు అంచనాలు వెలువడటంతో జెట్ ఎయిర్వేస్ షేరు నవంబర్ 5న రూ. 79 వద్ద ఏడాది గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షేరు 1.5 శాతం క్షీణించి రూ. 69 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది మార్చి 27న రూ. 13 వద్ద చరిత్రాత్మక కనిష్టాని నమోదు చేసుకున్నజెట్ ఎయిర్వేస్ షేరు 8 నెలల్లో 438 శాతంపైగా దూసుకెళ్లడం గమనార్హం! -
నేటి నుంచి యూఎస్‌కు విమానాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసులను మళ్లీ ప్రారంభించే దిశగా భారత ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. విమాన సర్వీసు లను ప్రారంభించేందుకు వీలుగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీలతో ప్రత్యేక ద్వైపాక్షిక ఒడంబడికలను కుదుర్చుకుంది. త్వరలో యూకేతోనూ ఈ తరహా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఈ వివరాలను విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి గురువారం వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. పారిస్ నుంచి ఢిల్లీ, బెంగళూరు, ముంబైలకు జూలై 18 నుంచి ఆగస్టు 1 వరకు ఎయిర్ ఫ్రాన్స్ సంస్థ 28 విమాన సర్వీసులను నడుపుతుంది. అలాగే, ఈరోజు నుంచి 31 వరకు ఇరుదేశాల మధ్య అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ 18 విమాన సర్వీసులను నడుపుతుంది. ఆ సంస్థ ఢిల్లీ– నెవార్క్‌ల మధ్య ప్రతీరోజు ఒక సర్వీసును, ఢిల్లీ– శాన్‌ఫ్రాన్సిస్కోల మధ్య వారానికి మూడు సర్వీసులను నడుపుతుంది. యూకేతో ఒప్పందం కుదిరిన తరువాత.. ఢిల్లీ, లండన్ల మధ్య రోజుకు రెండు సర్వీసులు ఉంటాయని పురి తెలిపారు. జర్మనీ నుంచి లుఫ్తాన్సా సర్వీసులుంటాయన్నారు. భారత్ నుంచి ఎయిర్ ఇండియా సంస్థ ఆయా దేశాలకు విమాన సర్వీసులను నడుపుతుందని వివరించారు. అంతర్జాతీయ సర్వీసులపై భారత్ ఇప్పటికే యూఏఈతో ఒప్పందం కుదుర్చుకుంది. కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో దీపావళి నాటికి దేశీయ ట్రాఫిక్ కరోనా ముందున్న స్థాయితో పోలిస్తే.. 55 శాతానికి చేరుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపారు. భౌతిక దూరంపై ప్రయాణికుల ఆందోళన కరోనా సమయంలో కొందరు విమాన ప్రయాణికులు భౌతిక దూరం నిబంధనను సరిగ్గా పాటించకపోవడాన్ని మిగతావారు ప్రధాన సమస్యగా భావిస్తున్నారని ఒక సర్వేలో తేలింది. జూన్ 20 నుంచి జూన్ 28 వరకు ఆన్లైన్లో సుమారు 25 వేల మంది ప్రయాణికులను సర్వే చేశామని ఇండిగో ప్రకటించింది. -
ఇక డ్రోన్స్‌తో ఫుడ్ డెలివరీ!
న్యూఢిల్లీ: దేశీయంగా ఫుడ్ డెలివరీ సేవల్లో డ్రోన్లను కూడా ఉపయోగించే దిశగా ప్రయత్నాలు వేగవంతమవుతున్నాయి. ఇందుకు సంబంధించి సంక్లిష్టమైన బీవీఎల్వోఎస్ డ్రోన్లతో ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహించేందుకు 13 సంస్థల కన్సార్షియానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతులిచ్చింది. ఫుడ్ డెలివరీ స్టార్టప్ సంస్థలైన జొమాటో, స్విగ్గీ, డుంజోతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ దన్నుగా ఉన్న డ్రోన్ స్టార్టప్ ఆస్టీరియా ఏరోస్పేస్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. సెప్టెంబర్ 30 నాటికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్దేశించిన నిర్దిష్ట గగనతలంలో ఈ కన్సార్షియం కనీసం 100 గంటల ఫ్లైట్ టైమ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డీజీసీఏకి నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ టెస్టులు జూలై తొలి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. స్థానికంగా డ్రోన్ ఆధారిత సర్వీసులను అభివృద్ధి చేసుకునే దిశగా భారత్‌కు ఇది తొలి అడుగు కానుంది. గతేడాది నుంచే ప్రయత్నాలు .. సుదీర్ఘ దూరాల శ్రేణి డ్రోన్ ఫ్లయిట్స్‌ను ప్రయోగాత్మకంగా అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు భారత్ గతేడాదే ప్రకటించింది. జొమాటో గతేడాదే డ్రోన్లను ఉపయోగించి డెలివరీ చేసే ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. 5 కేజీల పేలోడ్‌తో 10 నిమిషాల వ్యవధిలో 5 కి.మీ. దూరాన్ని డ్రోన్ అధిగమించినట్లు గోయల్ చెప్పారు. ఇది గరిష్టంగా గంటకు 80 కి.మీ. వేగాన్ని అందుకున్నట్లు వివరించారు. 15 నిమిషాల కన్నా తక్కువ వ్యవధిలోనే కస్టమర్‌కు ఫుడ్ డెలివరీ పూర్తి చేసే దిశగా జొమాటో ప్రయత్నాలు చేస్తోంది. ‘ఇంత వేగంగా డెలివరీ చేయాలంటే రహదారి మార్గం ద్వారా కుదరదు. ఆకాశమార్గం ద్వారా మాత్రమే 15 నిమిషాల్లో డెలివరీ వీలవుతుంది‘ అని గోయల్ తెలిపారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా మరింత వేగవంతంగా ఫుడ్ డెలివరీ సేవలు అందించడం కోసం జొమాటో 2018లో స్థానిక డ్రోన్ స్టార్టప్ సంస్థ టెక్‌ఈగిల్‌ను కూడా కొనుగోలు చేసింది. డ్రోన్ ట్రయల్స్‌కు తమకు అనుమతులు లభించినట్లు చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ మే నెలలో వెల్లడించింది. అనుమతి తప్పనిసరి... డ్రోన్ల వినియోగానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో.. వీటి తయారీ, వినియోగానికి సంబంధించి మసాయిదా నిబంధనలను పౌర విమానయాన శాఖ విడుదల చేసింది. డీజీసీఏ నుంచి అనుమతి కలిగిన తయారీ సంస్థ లేదా దిగుమతిదారు.. డీజీసీఏ నుంచి అమోదం పొందిన సంస్థ లేదా వ్యక్తికి డ్రోన్లను విక్రయించొచ్చు. అంటే డ్రోన్ల విక్రయాలకు, కొనుగోలుకు కూడా డీజీసీఏ అనుమతి తప్పనిసరి. డ్రోన్లు వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎదురయ్యే నష్టాలకు థర్డ్ పార్టీ బీమాను తీసుకోవడం కూడా తప్పనిసరి అని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. -
ప్రైవేట్ జెట్లు, చార్టర్ విమానాలకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ : కరోనా లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన విమాన సర్వీసులు సోమవారం నుంచి పున: ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా దేశీయ మార్గాల్లో ప్రైవేట్ జెట్లు, చార్టర్ విమానాల రాకపోకలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాటిలో ప్రయాణించే వారికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది.(చదవండి : ఏపీలో ప్రారంభమైన దేశీయ విమాన సర్వీసులు) చార్టర్ విమానాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు.. ప్రయాణ సమయానికి కనీసం 45 నిమిషాల ముందు ఎయిర్‌పోర్టులో గానీ, హెలీప్యాడ్ వద్ద గానీ రిపోర్టు చేయాలని ఆదేశించింది. వృద్ధులు, గర్భిణిలు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు విమాన ప్రయాణాలకు దూరంగా ఉండాలని కోరింది. విమాన ఆపరేటర్లు, ప్రయాణికుల మధ్య పరస్పరం అంగీకరించిన నిబంధనల ప్రకారం చార్టర్ విమాన ప్రయాణ చార్జీలు ఉండాలని తెలిపింది. కాగా, కరోనా లాక్డౌన్ కారణంగా.. దేశవ్యాప్తంగా కార్గో సేవలు తప్ప మిగిలిన అన్ని రకాల విమాన రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. (చదవండి : 630 విమానాలు రద్దు) -
విమాన టికెట్ల ధరలను నియంత్రిస్తున్నాం
-
ఎయిర్‌పోర్టుల్లో పాటించాల్సిన నిబంధనలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ కారణంగా రద్దయిన దేశీయ ప్రయాణికుల విమాన సర్వీసులు సరిగ్గా రెండునెలల తర్వాత తిరిగి ప్రారంభం కానున్నాయి. లాక్డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో మే 25 నుంచి ఆయా సర్వీసులు మళ్లీ మొదలవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ ట్విటర్ ద్వారా తెలిపిన విషయం విదితమే. ఈ క్రమంలో రాకపోకల విషయంలో ప్రయాణికులు పాటించాల్సిన విధివిధానాలను ప్రభుత్వం గురువారం జారీ చేసింది.(25 నుంచి దేశీయ విమానయానం) ఎయిర్‌పోర్టులు, విమానాల్లో పాటించాల్సిన నిబంధనలు ప్రయాణీకులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. ఆరోగ్య సేతు యాప్ ప్రతీ ఒక్కరూ విధిగా డౌన్లోడ్ చేసుకోవాలి(14 ఏళ్ల లోపు పిల్లలు ఇందుకు మినహాయింపు). లేనిపక్షంలో వారిని లోపలికి అనుమతించరు. రెండు గంటలకు ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం విమాన ప్రయాణికుల సౌకర్యార్థం ప్రజా రవాణా, ప్రైవేటు టాక్సీలను అందుబాటులో ఉంచాలి. ప్రయాణీకులు, సిబ్బంది బయటకు వెళ్లేందుకు వ్యక్తిగత, ఎంపిక చేసిన క్యాబ్ సర్వీసులకు మాత్రమే అనుమతి ప్రయాణీకులంతా తప్పనిసరిగా మాస్కులు, గ్లోవ్స్ ధరించాలి సీటింగ్ విషయంలో భౌతిక నిబంధనలు తప్పక పాటించాలి.(మార్కింగ్‌ను అనుసరించి) సిబ్బంది పీపీఈ కిట్లు ధరించాలి. శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలి. అరైవల్, డిపార్చర్ సెక్షన్ల వద్ద ట్రాలీలకు అనుమతి లేదు. ప్రత్యేక పరిస్థితుల్లో రసాయనాల పిచికారీ అనంతరం మాత్రమే వాటిని వాడాల్సి ఉంటుంది ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించే ముందే బ్యాగేజీని శానిటైజ్ చేసేందుకు ఆపరేటర్లు ఏర్పాట్లు చేయాలి. గుంపులు గుంపులుగా లోపలకు రావడం నిషిద్ధం ప్రవేశ ద్వారాలు, స్క్రీనింగ్ జోన్లు, టెర్మినల్స్ వద్ద కనీసం మీటరు దూరం పాటించాలి ప్రవేశద్వారాల వద్ద బ్లీచులో నానబెట్టిన మ్యాట్లు, కార్పెట్లు పరచాలి. కౌంటర్ల వద్ద ఫేస్‌షీల్డులు లేదా ప్లెక్సీగ్లాసు ఉపయోగించాలి. లాంజ్‌లు, టర్మినల్ బిల్డింగుల వద్ద న్యూస్ పేపర్లు, మ్యాగజీన్లు అందుబాటులో ఉండవు జ్వరం, శ్వాసకోశ సమస్యలు, దగ్గుతో బాధపడుతున్న ఉద్యోగులను ఎయిర్‌పోర్టులోకి అనుమతించరు. విమానం దిగిన తర్వాత బ్యాచ్‌ల వారీగా క్రమపద్ధతిని అనుసరించి ప్రయాణీకులు ఎయిర్‌పోర్టులోపలికి వెళ్లాలి. -
25 నుంచి దేశీయ విమానయానం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో మార్చి 25వ తేదీ నుంచి రద్దయిన దేశీయ ప్రయాణికుల విమాన సర్వీసులు సరిగ్గా రెండునెలల తర్వాత పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 25వ తేదీ(సోమవారం) నుంచి ఆయా సర్వీసులు మళ్లీ మొదలవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. కార్యకలాపాలు సాగించేందుకు సన్నద్ధం కావాలని అన్ని ఎయిర్‌పోర్టులకు, విమానయాన సంస్థలకు సమాచారం ఇచ్చామని తెలిపారు.(నేటి నుంచే రైల్వే బుకింగ్స్) ప్రయాణికుల రాకపోకల విషయంలో పాటించాల్సిన విధివిధానాలను పౌర విమానయాన శాఖ జారీ చేస్తుందని వివరించారు. అయితే, అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయో మంత్రి ప్రకటించలేదు. దేశీయ విమాన సర్వీసులను ప్రారంభించాలన్న కేంద్ర సర్కారు నిర్ణయాన్ని స్పైస్‌జెట్ సంస్థ చైర్మన్, ఎండీ అజయ్‌సింగ్ స్వాగతించారు. దీనివల్ల ఆర్థిక రంగానికి ఊపు వస్తుందని అభిప్రాయపడ్డారు. విధివిధానాల కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు.(కొత్త కేసులు 5,611) విమానయాన రంగంలో కరోనా కుదుపు కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా కీలక రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. భారత్‌లోనూ ఈ రంగం కుదేలైంది. చాలా సంస్థలు పైలట్లను విధుల నుంచి తొలగించాయి. సిబ్బంది జీతాల్లో కోత విధించాయి. కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను సెలవుపై పంపాయి. సెలవు కాలంలో జీతాలిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాయి. ఇప్పుడు దేశీయ ప్రయాణికుల సర్వీసులను పునఃప్రారంభించడం వల్ల విమానయాన రంగం కొంత కుదుట పడేందుకు ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
విదేశాల్లోని భారతీయులకు శుభవార్త
న్యూఢిల్లీ: విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కు తీసుకువచ్చే ప్రక్రియను 7వ తేదీ నుంచి ప్రారంభిస్తామని కేంద్రం తెలిపింది. విమానాలు, నౌకల ద్వారా దశలవారీగా వారిని తీసుకువస్తామని, డబ్బులు చెల్లించి ఈ సౌకర్యాన్ని పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా లక్షణాలు లేని వారినే అనుమతిస్తామని, భారత్ వచ్చాకా వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని సోమవారం హోం శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. పరీక్షల తర్వాత 2 వారాల పాటు వారు ఆసుపత్రిలోగానీ క్వారంటైన్‌లోగానీ డబ్బులు చెల్లించి ఉండాలి. 14 రోజుల తర్వాత మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించి ఫలితాలకనుగుణంగా చర్యలు తీసుకుంటారు. ఆయా దేశాల్లోని భారతీయ ఎంబసీలు భారత్‌కు వచ్చేవారి జాబితాను రూపొందిస్తాయి. భారత్‌కొచ్చాక ఆరోగ్య సేతు యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలను విదేశాంగ శాఖ, పౌర విమానయాన శాఖ వెబ్సైట్లలో త్వరలో పొందుపరుస్తారు. మార్చి 23న అన్ని అంతర్జాతీయ ప్రయాణాలను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే.