ప్రతి మూడు నెలలకి టిక్కెట్ ధరలు ఛేంజ్
ప్రతి మూడు నెలలకి టిక్కెట్ ధరలు ఛేంజ్
Published Thu, May 11 2017 9:20 AM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM
విమాన టిక్కెట్లు ధరలు ఇక ప్రతి మూడు నెలలకోసారి మారనున్నాయి. విమాన ఛార్జీలను, విమానసంస్థలకు ఇచ్చే ప్రభుత్వ సబ్సిడీలను రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్ కింద ప్రతి మూడు నెలలకోసారి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ద్రవ్యోల్బణ పరిస్థితులకు అనుగుణంగా ఈ ధరల్లో మార్పు రానుంది. ఉడాన్ స్కీమ్ కింద వైబిలిటీ గ్యాఫ్ ఫండింగ్(వైజీఎఫ్), విమాన టిక్కెట్లను క్వార్టర్లీ బేసిస్ లో మార్చనున్నామని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. విమాన ఛార్జీలను ద్రవ్యోల్బణంతో లింక్ చేస్తామని, వీజీఎఫ్ నిర్ణయించడంలో కూడా ద్రవ్యోల్బణం, ఏవియేషన్ టర్బైన్ ప్యూయల్, రూపీ, డాలర్ ఎక్స్చేంజ్ రేటును పరిగణలోకి నిర్ణయిస్తుంటామని పేర్కొంది.
సామాన్యుడికి కూడా విమాన ప్రయాణం అందుబాటులో ఉండేలా ఉడాన్ స్కీమ్ ను ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఉడాన్ తొలి విమానం గత నెల సిమ్లాలో ఆకాశంలోకి ఎగిరింది. ఉడాన్ కింద విమాన టిక్కెట్ ధర గంటకు రూ.2500. ఈ స్కీమ్ కింద ఎంపికచేసిన సీట్లను తక్కువ ధరలకు అందుబాటులో ఉంచుతున్నారు. ఉడాన్ స్కీమ్ కింద మార్గాలు గ్రాంట్ అయ్యే విమాన సంస్థ ఆపరేటర్లు, ఎయిర్ క్రాఫ్ట్ సామర్థ్యంలో 50 శాతం డిస్కౌంట్ ధరలకు పక్కన ఉంచాలని ప్రభుత్వం తెలిపింది.
Advertisement