సిక్ లీవ్ పెట్టిన 200 మంది సిబ్బంది
100 విమాన సరీ్వసులు రద్దు
ప్రయాణికుల పడిగాపులు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సిబ్బంది మూకుమ్మడిగా సెలవు పెట్టడం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. యాజమాన్యం వైఖరికి నిరసనగా క్యాబిన్ క్రూలోని 200 మందికి పైగా సిబ్బంది మంగళవారం రాత్రి సిక్ లీవ్ పెట్టారు. హఠాత్తుగా చోటుచేసుకున్న పరిణామంతో ఎయిరిండియా 100 వరకు దేశీయ, అంతర్జాతీయ సరీ్వసులను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
ఫలితంగా, కోచి, కాలికట్, ఢిల్లీ, బెంగళూరు తదితర విమానాశ్రయాల్లో సుమారు 15 వేల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. సరీ్వసుల రద్దు విషయం కొందరికి సెక్యూరిటీ తనిఖీలు కూడా పూర్తయ్యాక ఆఖరి నిమిషంలో తెలిపారు. దీంతో, వారు ఎయిరిండియా తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన కొన్ని సర్వీసులు ఆలస్యంగా నడిచాయి.
వేసవి రద్దీ దృష్ట్యా మార్చి చివరి వారం నుంచి రోజూ 360 సరీ్వసులను నడుపుతోంది. టాటా గ్రూప్‌నకే చెందిన విస్తారాను ఎయిరిండియాతో, అదేవిధంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను ఏఐఎక్స్ కనెక్ట్‌తో విలీనం చేయాలన్న నిర్ణయం క్యాబిన్ క్రూలోని సీనియర్ల అసంతృప్తికి కారణమైందని భావిస్తున్నారు. నిర్వహణ లోపం సీనియర్ ఉద్యోగుల నైతికతను దెబ్బతీసిందని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ తెలిపింది.
విమాన సర్వీసుల రద్దుపై బుధవారం కేంద్ర పౌరవిమాన యాన శాఖ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ నుంచి వివరణ కోరింది. సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు. రద్దయిన సరీ్వసులకు టిక్కెట్ చార్జీలను వాపసు చేస్తామని, కోరిన పక్షంలో మరో తేదీకి ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేస్తామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment