mass leave
-
ఎయిరిండియాలో ఆకస్మిక సమ్మె
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సిబ్బంది మూకుమ్మడిగా సెలవు పెట్టడం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. యాజమాన్యం వైఖరికి నిరసనగా క్యాబిన్ క్రూలోని 200 మందికి పైగా సిబ్బంది మంగళవారం రాత్రి సిక్ లీవ్ పెట్టారు. హఠాత్తుగా చోటుచేసుకున్న పరిణామంతో ఎయిరిండియా 100 వరకు దేశీయ, అంతర్జాతీయ సరీ్వసులను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఫలితంగా, కోచి, కాలికట్, ఢిల్లీ, బెంగళూరు తదితర విమానాశ్రయాల్లో సుమారు 15 వేల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. సరీ్వసుల రద్దు విషయం కొందరికి సెక్యూరిటీ తనిఖీలు కూడా పూర్తయ్యాక ఆఖరి నిమిషంలో తెలిపారు. దీంతో, వారు ఎయిరిండియా తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన కొన్ని సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. వేసవి రద్దీ దృష్ట్యా మార్చి చివరి వారం నుంచి రోజూ 360 సరీ్వసులను నడుపుతోంది. టాటా గ్రూప్‌నకే చెందిన విస్తారాను ఎయిరిండియాతో, అదేవిధంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను ఏఐఎక్స్ కనెక్ట్‌తో విలీనం చేయాలన్న నిర్ణయం క్యాబిన్ క్రూలోని సీనియర్ల అసంతృప్తికి కారణమైందని భావిస్తున్నారు. నిర్వహణ లోపం సీనియర్ ఉద్యోగుల నైతికతను దెబ్బతీసిందని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ తెలిపింది. విమాన సర్వీసుల రద్దుపై బుధవారం కేంద్ర పౌరవిమాన యాన శాఖ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ నుంచి వివరణ కోరింది. సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు. రద్దయిన సరీ్వసులకు టిక్కెట్ చార్జీలను వాపసు చేస్తామని, కోరిన పక్షంలో మరో తేదీకి ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేస్తామని వివరించారు. -
ప్రభుత్వోద్యోగుల మూకుమ్మడి సెలవు
డెహ్రాడూన్ : సకాలంలో ప్రమోషన్లు, అలవెన్సులతో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఉద్యోగులు గురువారం మూకుమ్మడి సమ్మె చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఫిబ్రవరి 4న రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహిస్తామని, రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపిస్తామని సెక్రటేరియట్ యూనియన్ కార్యదర్శి వెల్లడించారు. మరోవైపు ప్రభుత్వోద్యోగులు మూకుమ్మడి సెలవుపై వెళ్లడాన్ని ప్రభుత్వం అనుమతించందని అంతకుముందు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు ఇచ్చిన మాస్ లీవ్ పిలుపులో పాల్గొనకుండా విధులకు హాజరయ్యే సిబ్బందికి పూర్తి భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. కాగా,ఈనెల 31, ఫిబ్రవరి 4న సెలవు తీసుకునే ఉద్యోగులను సచివాలయ ప్రాంగణంలోకి అనుమతించరని, నిరసనల సీసీటీవీ ఫుటేజ్‌ను ప్రభుత్వం సేకరిస్తుందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. -
మాస్‌లీవ్‌పై ట్రాన్స్‌కో ఏఈలు
ఆదోని రూరల్ : ఆదోని డివిజన్ పరిధిలోని 17మండలాల ట్రాన్స్‌కో ఏఈలు, ఏఏఈలు 18మంది శుక్రవారం మాస్ లీవ్ ప్రకటించారు. డీఈ అంజన్ కుమార్ డివిజన్ పరిధిలోని ఏడీఈలు, ఏఈలు, ఏఏఈలకు సమావేశం నిర్వహించేందుకు పిలిపించారు. తమకు పనిభారం పెరిగిందని, అందువల్ల తమ సమస్యను విన్నవిస్తామని అందుకు సమయం కేటాయించాలని డీఈని కోరగా అందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన చేతనైతే పనిచేయండి..లేకపోతే సెలవులో వెళ్లండని ఏఈలపై విరుచుకుపడుతూ చులకనగా వ్యవహరించడంతో డివిజన్లోని 18మంది ఏఈలు మనస్థాపం చెందినట్లు తెలిపారు. దీంతో మూకుమ్మడిగా మాస్ లీవ్ తీసుకొని వెళ్తున్నామని ఏఈలు, ఏఏఈలు సమావేశాన్ని బాయ్‌కట్ చేశారు. డీఈ కార్యాలయ ఆవరణలో సమావేశమై ఆందోళన చేపట్టారు. అనంతరం వారు సమావేశం నిర్వహించి మాస్ లీవ్‌లో వెళ్లాలని తీర్మానించారు. ప్రభుత్వం ఇచ్చిన సిమ్‌లతో పాటు డీఈకి వినతి పత్రాన్ని సమర్పించారు. ఆయా మండలాల్లో సిబ్బంది ఏఎల్ఎంలు, జేఎల్ఎంలు, లైన్మెన్లు లేకపోవడం వల్ల చిన్న పని నుంచి పెద్ద పని వరకు ఏఈలే చూడాల్సి వస్తోందని, దీంతో పనిభారం పెరిగి డ్యూటీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని తెలిపారు. డీఈకి విన్నవించుకున్నామంటే ముందుగానే డీఈ కించపరుస్తూ మాట్లాడారని ఏఈలు ఆరోపించారు. కార్యక్రమంలో ఏఈలు మద్దిలేటి, నాగభూషణం, నాగరాజు, చెన్నయ్య, సంతోష్, సురేష్ రెడ్డి, నర్సన్న, మోహన్ రావు, రామాంజినేయులు, నారాయణ స్వామినాయక్, రేఖ, శేఖర్ బాబు, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
50 వేల మంది పోలీసులు.. ఒకేరోజు సెలవు!
పోలీసులకు కోపం వస్తే ఏం చేస్తారు.. లాఠీలు గట్టిగా ఝళిపిస్తారు కదూ. కానీ, కర్ణాటక పోలీసులు మాత్రం ఆ లాఠీలు పక్కన పారేస్తామంటున్నారు. క్రమశిక్షణ పేరుతో సీనియర్ అధికారుల వేధింపులు, అరకొర జీతాలు, తగిన సెలవులు లేకపోవడం, ఇతర సమస్యల కారణంగా జూన్ 4వ తేదీన ఒకరోజు సామూహిక సెలవు పెట్టాలని భావిస్తున్నారు. దాదాపు 50వేల మంది పోలీసులు ఇప్పటికే 'వేధింపుల సెలవు' కావాలని అప్లై చేశారట. అయితే ఆరోజు అసలు ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని పోలీసు బాస్‌లు అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆందోళనకు అఖిల కర్ణాటక పోలీస్ మహాసంఘ నాయకత్వం వహిస్తోంది. కొంతమంది పోలీసులు ముందుగా తమవద్దకు వచ్చి నిరసన తెలపాల్సిందేనని పట్టుబట్టడంతో అంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని, తర్వాత క్రమంగా ఉద్యమం ఊపందుకుందని ఈ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వి.శశిధర్ తెలిపారు. ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక పంపాలంటే.. పెద్దసంఖ్యలో అందరూ సెలవులో వెళ్లాల్సిందేనని, అసలు ఇప్పటివరకు పోలీసుల హక్కుల గురించి పోరాడేందుకు తమకు తగిన వేదిక లేదని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. రాష్ట్రంలో దాదాపు 85వేల మంది పోలీసులు ఉండగా అందులో 65వేల మంది కానిస్టేబుళ్లేనని, వీళ్లనే ఎక్కువగా వేధిస్తున్నారని చెప్పారు. మంచి జీతాలు కాదు కదా, కనీసం కుటుంబంతో కాలం గడిపేందుకు కూడా కుదరడం లేదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా సెలవులు ఇవ్వరని, చిన్న చిన్న విషయాలకు కూడా క్రమశిక్షణ పేరుతో సస్పెండ్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస సదుపాయాలు కూడా లేకుండా రోజుకు 15 గంటలు పనిచేయాలని అన్నారు. ప్రభుత్వాలు తమ దుస్థితిని గత 25-30 ఏళ్లుగా పట్టించుకోవడం లేదని, అందుకే నిరసన తెలియజేస్తున్నామని శశిధర్ వివరించారు. -
చిన్న తిరుపతిలో ఉద్యోగుల సామూహిక సెలవు