sick leave
-
‘సిక్‌లీవ్’ పెడుతున్నారా..?
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులకు సిక్ లీవ్ (ఎస్ఎల్) అనేది ఒక హక్కు అన్నది తెలిసిందే. ఒక్కోసారి ఎలాంటి అనారోగ్యం లేకపోయినా, సెలవు తీసుకోవాలంటే ‘ఎస్ఎల్’ అనేది ఓ తిరుగులేని ఆయుధంగా మారిన సందర్భాలు కూడా అనేకం. ఎంతటి కఠిన హృదయుడైన కంపెనీ యజమాని లేదా ఉన్నతస్థానంలో ఉన్న మేనేజర్లయినా.. ఉద్యోగుల ‘సిక్‌లీవ్’ను తోసిపుచ్చే అవకాశాలు చాలా తక్కువ. కానీ, ఇక ముందు సిక్‌లీవ్ పెట్టాలంటే.. ఉద్యోగులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జర్మనీలోని బెర్లిన్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఎదుర్కొన్న అనుభవాన్ని చూశాక.. ఇతర ఉద్యోగులు సైతం సిక్‌లీవ్ పెట్టాలంటే ఆలోచించాల్సిందే. ఇక్కడ ఎదురైన అనుభవాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఈ సెలవు పెట్టేందుకు తప్పకుండా ఆలోచించ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు భారత్‌లో కూడా వస్తుందా? అనే విషయం మాత్రం.. వివిధ కార్పొరేట్ కంపెనీల తీరును బట్టి ఉంటుందనే అంచనాలకు ఇక్కడి ఉద్యోగులు వస్తున్నారు. అసలేం జరిగిందంటే..జర్మనీలోని బెర్లిన్‌లో టెస్లా కంపెనీ గిగా ఫ్యాక్టరీలో సిక్‌లీవ్ పెట్టిన ఉద్యోగుల ఇళ్లకు ఆ సంస్థ మేనేజర్లు వెళ్లి.. అసలు వారు నిజంగానే అనారోగ్యంతో ఉన్నారా? లేక ఎస్ఎల్ పెట్టేందుకు ఆ విధంగా అబద్ధం ఆడుతున్నారా? అని పరిశీలించారట.. దీంతో ఈ సంస్థ మేనేజ్మెంట్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తమకు పనిఒత్తిళ్లు పెరగడంతో పాటు అధిక పని గంటలతో తరచూ అనారోగ్యం బారిన పడడంతో సిక్ లీవ్‌లు పెట్టక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయని కార్మిక సంఘాలు గట్టిగా వాదిస్తున్నాయి.సిక్‌లీవ్‌లు తీసుకున్న ఉద్యోగులను తనిఖీ చేసేందుకు మేనేజర్లు వారి ఇళ్ల తలుపులు తట్టినపుడు, అధికారుల మొహాలపైనే తలుపులు మూసేయడమో, తిట్ల దండకం అందుకోవడమో లేదా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించడమో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎస్ఎల్లు తీసుకుంటున్నవారి సంఖ్య ఏకంగా 17 శాతానికి చేరుకోవడంతో.. ఈ పద్ధతికి అడ్డుకట్ట వేసేందుకు ఉద్యోగుల ఇళ్లకు మేనేజర్లు వెళ్లడాన్ని తప్పుపట్టనవసరం లేదని యాజమాన్య ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. మరింత మెరుగైన పని సంస్కృతిని, ఉత్పాదకతను పెంచేందుకు సిక్‌లీవ్‌లు పెట్టే విషయంలో ఉద్యోగుల్లో తగిన మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.లీవు తీసుకోకుంటే వెయ్యి యూరోల బోనస్లీవ్లు తీసుకోని వారికి వెయ్యి యూరోలు బోనస్‌గా చెల్లించేందుకు కూడా టెస్లా సంసిద్ధత వ్యక్తం చేసింది. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సైతం.. సిక్లీవ్లతో తలెత్తిన పరిస్థితిని, అందుకు దారితీసిన పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టుగా ఎక్స్ వేదికగా స్పష్టం చేయడం గమనార్హం. ఉద్యోగులు అత్యంత కఠినమైన పని సంస్కృతిని అలవరుచుకోవాలని, డెడ్లైన్లు, ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు పనిచేసే చోటే కొంతసేపు కునుకేసినా పరవాలేదని మస్క్ గతంలో పేర్కొనడాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఐతే సిక్లీవ్లకు సంబంధించి టెస్లా వివాదాస్పద విధానాలను అవలంబిస్తోందనే విమర్శలు మరోవైపు ఉండనే ఉన్నాయి. జర్మన్ కార్ల ప్లాంట్‌లో ఏటా పదిలక్షల కార్లు ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ సప్లయ్ చెయిన్ సమస్యలు, ఉత్పత్తి నిలిచిపోవడం, డిమాండ్ తగ్గుదల వంటి కారణాలతో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోవడం అక్కడ సమస్యగా మారింది. ఐతే టెస్లా తన విధానాలను గట్టిగా సమర్థిస్తూనే.. సెలవు తీసుకున్న ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి తనిఖీ చేయడం అనేది జవాబుదారీతనం పెంపుదలకు అవసరమని నొక్కి చెబుతోంది. కానీ ఇలాంటి విధానాల వల్ల ఇప్పటికే అధిక పనివత్తిడితో బాధపడుతున్న ఉద్యోగులను మరింత ఆందోళనకు, చిరాకుకు గురిచేయడమే అవుతుందని యూనియన్లు, వర్కర్లు వాదిస్తున్నారు. -
విధుల్లో చేరిన ఎయిర్ ఇండియా సిబ్బంది
ముంబై: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నెమ్మదిగా తన విమానాలను పునరుద్ధరిస్తోంది. అనారోగ్యంతో సెలవు తీసుకున్న సిబ్బంది అంతా విధుల్లో చేరినట్లు ఓ అధికారి పేర్కొన్నారు.ప్రతిరోజూ సుమారు 380 విమానాలను నడుపుతున్న టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్‌లైన్ సిబ్బంది సెలవులు తీసుకోవడం వల్ల 20 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసింది. మంగళవారం ఉదయం నాటికి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.మరో వైపు గురువారం ఢిల్లీలో చీఫ్ లేబర్ కమిషనర్ ఏర్పాటు చేసిన సమావేశం తర్వాత క్యాబిన్ సిబ్బంది తమ సమ్మెను విరమించుకున్నారు. దీంతో 25 మంది సిబ్బందికి జారీ చేసిన టెర్మినేషన్ లేఖలను సంస్థ ఉపసంహరించుకుంది. అనారోగ్య సెలవుల్లో ఉన్నవారు కూడా విధుల్లో చేరటం వల్ల మళ్ళీ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సాధారణ స్థితికి వస్తుందని తెలుస్తోంది.All the cabin crew members who reported sick have joined their duty by 11th May 2024. However, due to a software glitch in the company scheduling software, as it was recently introduced, it is still showing that staff are reported sick. Further, the flights to take off today were… pic.twitter.com/WVqtDCUSf6— ANI (@ANI) May 12, 2024 -
మూకుమ్మడిగా సెలవు పెట్టిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు
-
సిక్ లీవ్ తీసుకున్న ఉద్యోగుల తొలగింపు
టాటా యాజమాన్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఉద్యోగులపై కొరడా ఝుళిపించింది. ముకుమ్మడిగా సిక్ లీవ్ తీసుకున్న ఉద్యోగులను తొలగించింది. సెలవు అనంతరం తిరిగి ఉద్యోగులు సంస్థకు రిపోర్ట్ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి. ఇటీవల ఉద్యోగులు విధులకు రాకపోవడంతో బుధవారం సంస్థ దాదాపు 80కి పైగా విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ చర్యకు కారణమైన 25 మంది క్యాబిన్ సిబ్బందిపై చర్యలు తీసుకుంది.‘సిక్‌లీవ్ అనంతరం 25 మంది ఉద్యోగులు సంస్థకు రిపోర్ట్ చేయడంలో విఫలయ్యారు. వారితీరు వల్ల విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ ఎంప్లాయిస్ సర్వీస్ రూల్స్‌ను పాటించనందుకు వారిపై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అందులో భాగంగానే వారి ఉద్యోగాలు తొలగించాం’ అని టర్మినేషన్ లేటర్లో కంపెనీ తెలిపింది.బుధవారం విమాన సర్వీసుల్లో కలిగిన అంతరాయం తర్వాత సంస్థ సీఈఓ అలోక్ సింగ్ స్పందించారు. ఉద్యోగులకు ఏదైనా సమస్యలుంటే క్యాబిన్ సిబ్బందితో చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎయిర్‌లైన్ రాబోయే కొద్ది రోజుల పాటు విమానాలను తగ్గిస్తుందని తెలిపారు.ఇదీ చదవండి: కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..ఇదిలాఉండగా, ఎయిరిండియా వైఖరిపట్ల సిబ్బంది అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను ఎయిర్ఏషియా ఇండియాతో విలీనం చేయడం వల్ల సిబ్బంది జీతాలు దాదాపు 20 శాతం తగ్గాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ కెకె విజయ్‌కుమార్ మాట్లాడుతూ..ఎయిరేషియాతో విలీనానికి ముందు ఉద్యోగులకు ఇవ్వాల్సిన పరిహారంలో స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ విలీనంతో ఉద్యోగులకు రావాల్సిన అలవెన్సులు పూర్తిగా తొలగించబడ్డాయన్నారు. దాంతో భారీగా జీతాలు తగ్గాయని చెప్పారు. సంస్థ నిర్వహణలో లోపాలున్నాయని, సిబ్బంది పట్ల సమానత్వం కరవైందని యూనియన్ గతంలో దిల్లీలోని రీజినల్ లేబర్ కమిషనర్‌కు, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు లేఖ రాసింది. -
ఎయిరిండియాలో ఆకస్మిక సమ్మె
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సిబ్బంది మూకుమ్మడిగా సెలవు పెట్టడం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. యాజమాన్యం వైఖరికి నిరసనగా క్యాబిన్ క్రూలోని 200 మందికి పైగా సిబ్బంది మంగళవారం రాత్రి సిక్ లీవ్ పెట్టారు. హఠాత్తుగా చోటుచేసుకున్న పరిణామంతో ఎయిరిండియా 100 వరకు దేశీయ, అంతర్జాతీయ సరీ్వసులను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఫలితంగా, కోచి, కాలికట్, ఢిల్లీ, బెంగళూరు తదితర విమానాశ్రయాల్లో సుమారు 15 వేల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. సరీ్వసుల రద్దు విషయం కొందరికి సెక్యూరిటీ తనిఖీలు కూడా పూర్తయ్యాక ఆఖరి నిమిషంలో తెలిపారు. దీంతో, వారు ఎయిరిండియా తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన కొన్ని సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. వేసవి రద్దీ దృష్ట్యా మార్చి చివరి వారం నుంచి రోజూ 360 సరీ్వసులను నడుపుతోంది. టాటా గ్రూప్‌నకే చెందిన విస్తారాను ఎయిరిండియాతో, అదేవిధంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను ఏఐఎక్స్ కనెక్ట్‌తో విలీనం చేయాలన్న నిర్ణయం క్యాబిన్ క్రూలోని సీనియర్ల అసంతృప్తికి కారణమైందని భావిస్తున్నారు. నిర్వహణ లోపం సీనియర్ ఉద్యోగుల నైతికతను దెబ్బతీసిందని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ తెలిపింది. విమాన సర్వీసుల రద్దుపై బుధవారం కేంద్ర పౌరవిమాన యాన శాఖ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ నుంచి వివరణ కోరింది. సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు. రద్దయిన సరీ్వసులకు టిక్కెట్ చార్జీలను వాపసు చేస్తామని, కోరిన పక్షంలో మరో తేదీకి ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేస్తామని వివరించారు. -
ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
విమాన సేవలందిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ 70కి పైగా సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించింది. సిబ్బంది అనారోగ్యంతో ఉండడమే ఇందుకు కారణమని చెప్పింది. రద్దైన విమానాల్లో అంతర్జాతీయ, దేశీయ విమానాలు ఉన్నాయి. దాంతో ఉన్న సర్వీసులు ఆలస్యంగా నడిచినట్లు తెలిసింది. ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని పౌర విమానయాన అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.సిబ్బంది అనారోగ్యంగా ఉన్నారని దాంతో విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత సంస్థ తన ‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్ వేదికగా స్పందించింది. ‘మా క్యాబిన్ సిబ్బందిలోని ఒక విభాగానికి చెందిన ఉద్యోగులు చివరి నిమిషంలో ఏకకాలంలో అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. ఈ మేరకు మూకుమ్మడిగా ‘సిక్‌లీవ్’ దరఖాస్తులు అందాయి. దాంతో మంగళవారం రాత్రి నుంచి కొన్నివిమాన సర్వీసులు ఆలస్యం అయ్యాయి. మరికొన్నింటిని రద్దు చేశాం. ఈ సంఘటనకు గల కారణాలను అర్థం చేసుకోవడానికి మేము సిబ్బందితో మాట్లాడుతున్నాం. ఊహించని పరిణామం వల్ల ప్రయాణికులకు అంతరాయం కలిగిస్తే క్షమాపణలు కోరుతున్నాం. ఇకపై చేసే ప్రయాణాలకు సంబంధించి సదరు సర్వీసు అందుబాటులో ఉందో లేదో సరిచూసుకోవాలి కోరుతున్నాం’ అని తెలిపింది.ఇదీ చదవండి: ట్రేడింగ్ వేళల పెంపునకు నో చెప్పిన సెబీరద్దు అయిన విమానసర్వీసుల టికెట్ డబ్బులు వాపసు చేస్తామని.. లేదంటే మరోతేదీకి రీషెడ్యుల్ చేసుకునే వీలుందని కంపెనీ పేర్కొంది. More than 70 international and domestic flights of Air India Express from Tuesday night till Wednesday morning have been cancelled after the senior crew member of the airline went on mass 'sick leave'. Civil Aviation authorities are looking into the issue: Aviation Sources— ANI (@ANI) May 8, 2024 -
బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. భారీగా వేతనం పెంపు
బ్యాంకు ఉద్యోగుల వార్షిక వేతనం పెంచాలని కొద్దిరోజులుగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)తో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించి శుక్రవారం ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం వెలువడింది. బ్యాంకు ఉద్యోగుల వార్షిక వేతనం 17% పెరగనుంది. ఇందుకు సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంక్ ఉద్యోగుల సంఘాల మధ్య ఒప్పందం కుదిరింది. తాజా నిర్ణయంతో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఏడాదికి అదనంగా రూ.12,449 కోట్లు ఖర్చు అవ్వనున్నట్లు తెలిసింది. ఈ వేతన పెంపు 2022 నవంబరు నుంచి అమలుకానుంది. దీంతో దాదాపు 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. బ్యాంకులు వారానికి 5 రోజులే పనిచేసేలా, అన్ని శనివారాలను సెలవుగా గుర్తించడానికి ఆలిండియా బ్యాంక్స్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఒప్పుకుంది. ఇందుకు ప్రభుత్వ అనుమతి లభించాల్సి ఉంది. ప్రభుత్వం నోటిఫికేషన్ తర్వాత సవరించిన పనిగంటలు అమల్లోకి వస్తాయి. కొత్త డీఏ పాయింట్లను కలిపిన తర్వాత సిబ్బందికి కొత్త వేతన స్కేళ్లను రూపొందించారు. దీని ప్రకారం.. మహిళా ఉద్యోగులు మెడికల్ సర్టిఫికేట్ సమర్పించకుండానే నెలకు ఒక సిక్ లీవ్ తీసుకునే సౌలభ్యం ఉంది. ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో 255 రోజుల వరకు ప్రివిలేజ్డ్ లీవ్‌లను నగదుగా మార్చుకోవచ్చు. విధుల్లో మరణించినా, ఈ మొత్తం సంబంధీకులకు చెల్లిస్తారు. ఇదీ చదవండి: ‘ఆ ప్రయాణం చేస్తే శరీరం కరిగిపోతుంది.. కాళ్లూ చేతులు విడిపోతాయి’ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, పెన్షన్/ఫ్యామిలీ పెన్షన్‌తో పాటు నెలవారీ ఎక్స్‌గ్రేషియా అందిస్తారు. 2022 అక్టోబరు 31న, అంతకుముందు పెన్షన్ అందుకునేందుకు అర్హత ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. -
వర్కింగ్ డే రోజున ఐపీఎల్ ఫైనల్.. ఉద్యోగుల సిక్‌లీవ్స్ కష్టాలు!
ఐపీఎల్ 16వ సీజన్‌కు ఆదివారంతోనే(మే 28న) శుభం కార్డు పడాల్సింది. కానీ వర్షం కారణంగా సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డే అయిన సోమవారానికి(మే 29) వాయిదా పడింది. మ్యాచ్‌కు ఈరోజు కూడా వర్షం ముప్పు ఉన్నప్పటికి అది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఈ విషయం సంతోషం కలిగించేదే అయినా.. సోమవారం వర్కింగ్ డే కావడంతో ఉద్యోగం చేసే కొంతమంది క్రికెట్ ప్రేమికులు మాత్రం తమ బాస్‌కు ఏం కారణం చెప్పి తొందరగా ఆఫీస్ నుంచి బయటపడాలా అని ఆలోచిస్తున్నారు. సోమవారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండడంతో ఆలోగా ఇంటికి చేరుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే నైట్‌షిఫ్ట్ సహా లేట్‌నైట్ వర్క్ చేసేవాళ్లు హెచ్ఆర్ డిపార్ట్మెంట్కు సిక్‌లీవ్స్ కోసం అప్లై చేసుకుంటున్నారు. ఇక జియో సినిమా కూడా ఐపీఎల్ ఫైనల్ విషయమై ఒక ఫన్నీ మీమ్‌ను షేర్ చేసింది. హెచ్ఆర్ ఉద్యోగి ముందు కుప్పలుతెప్పలుగా సిక్ లీవ్ లెటర్స్ ఉండడం.. ఆమె దానిపై సంతకాలు చేస్తుండడం కనిపించింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. వాస్తవానికి మరి ఇంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు కానీ.. ఐపీఎల్ ఫైనల్ కావడంతో సాయంత్రం పనిచేసే ఆఫీసుల్లో మాత్రం ఉద్యోగుల నుంచి ఇలాంటి కారణాలు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరిగి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఎప్పటిలాగే ఫుల్ ఎంజాయ్ చేసి సోమవారం కాస్త లేట్ అయినా ఆఫీస్‌కు వెళ్లేవారు. స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూడలేనివాళ్లు ఫైనల్ మ్యాచ్‌ను ఎంజాయ్ చేయాలని తమ ప్రణాళికలు రచించుకున్నారు. కొందరు పబ్‌లు, బార్లకు వెళ్లి మందు తాగుతూ మ్యాచ్ చూస్తూ చిల్ అవుదామనుకున్నారు. ఇంకొందరు ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఐపీఎల్ ఫైనల్ చూస్తూ ఆనందంగా గడిపేయాలనుకున్నారు. కానీ వరుణుడు వారి ఆశలకు గండికొట్టాడు. దీంతో సోమవారానికి మ్యాచ్ వాయిదా పడింది. కానీ సోమవారం వారంలో మొదటి పని దినం కావడం.. రోజంతా మీటింగ్స్ ఉంటాయన్న కారణంతో ఎక్కడ మ్యాచ్ మిస్ అవుతామేమోనన్న భయం సగటు క్రికెట్ అభిమానికి ఉంటుంది కదా..! Office HR depts across the country dealing with sick leave requests today...#IPLFinal #IPLonJioCinema pic.twitter.com/A0mmlS14xH — JioCinema (@JioCinema) May 29, 2023 ✌🏽No sick leaves, show this to your manager to wind up your work by 6:30 PM today! 🙏🏽#IPLonJioCinema #IPLFinal #GTvCSK #Dhoni pic.twitter.com/Pfzz3XMI60 — JioCinema (@JioCinema) May 29, 2023 చదవండి: పన్నెండులో తొమ్మిదిసార్లు.. క్వాలిఫయర్-1 విజేత #GTvsCSK: ఫైనల్ మ్యాచ్ వాయిదా.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి -
‘నాకు జీతం పెంచడం లేదు సార్’, కోర్టుకెక్కిన ఉద్యోగి..కంగుతిన్న ఐబీఎం!
ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీ ఐబీఎంకు భారీ షాకిచ్చాడో ఓ ఉద్యోగి. పనిచేయకుండా 15 ఏళ్ల నుంచి నెల నెలా ఠంచన్‌గా జీతం తీసుకుంటున్నాడు. పైగా సంస్థ తనకు జీతం పెంచడం లేదని, కంపెనీ తన వైకల్యం పట్ల కంపెనీ వివక్ష చూపుతుందని కోర్టు మెట్లెక్కాడు. మరి చివరికి కోర్టులో ఉద్యోగికి న్యాయం జరిగిందా? లేదంటే ఐబీఎంకు అనుకూలంగా తీర్పిచ్చిందా? ఇయాన్ క్లిఫోర్డ్ సీనియర్ ఐటీ ఉద్యోగి. అనారోగ్యం కారణంగా 2008 సెప్టెంబర్ నుంచి సిక్ లీవ్‌లో ఉన్నాడు. సహృదయంతో నిబంధనలకు అనుగుణంగా ఐబీఎం ప్రతినెల జీతాన్ని ఇయాన్ ఖాతాలో జమ చేసేది. ఈ క్రమంలో 2013లో ఐబీఎంపై ఫిర్యాదు చేశాడు. ఐదేళ్ల నుంచి తన జీతాన్ని ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించాడు. అధికారుల వద్ద మొరపెట్టుకున్నాడు. దీంతో కంగుతిన్న ఐబీఎం యాజమాన్యం అతనితో ఓ ఒప్పొందానికి వచ్చింది. సంస్థపై ఫిర్యాదు చేయకూడదు. అందుకు ప్రతిఫలంగా 8,685 పౌండ్లు (సుమారు రూ.9 లక్షలు) అదనంగా చెల్లించింది. పైగా ఉద్యోగిగానే పరిగణిస్తూ వేతన ప్యాకేజీ (72,037 పౌండ్లు)లో 75 శాతం మేర ఏటా 54,000 పౌండ్లు (సుమారు రూ.55.31 లక్షలు) 65 ఏళ్లు వచ్చే వరకు ఐబీఎం వేతనం అందిస్తూ వచ్చింది. ఈ తరుణంలో ఇయాన్ మరో సారి ఐబీఎం ఉన్నతాధికారుల్ని ఆశ్రయించాడు. పెరిగిన ఖర్చులతో పోల్చితే హెల్త్ ప్లాన్ కింద తనకు అందే వేతనం చాలా తక్కువ. కాబట్టి తన వేతనం పెంచాలని కోరారు. అందుకు సంస్థ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. దీంతో చేసేది లేక 2022 ఫిబ్రవరిలో ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు. తన వైకల్యం పట్ల ఆ కంపెనీ వివక్ష చూపుతున్నదని ఆరోపించాడు. ఇయాన్ క్లిఫోర్డ్ ఆరోపణలను కోర్టు ఖంఢించింది. ‘సంస్థ వైద్యం చేయిస్తుంది, ప్రయోజనం చేకూర్చే ప్యాకేజీనీ అందిస్తుందని న్యాయమూర్తి తెలిపారు. కాకపోతే పెరిగిన నిత్యవసర వస్తుల ధరలతో ఇయాన్కు సంస్థ ఇచ్చే వేతనం సరిపోకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, సంస్థపై అతను చేసిన వివక్ష ఆరోపణల్ని, శాలరీ పెంచాలన్న అభ్యర్థనను సున్నితంగా తిరస్కరిస్తూ తీర్పిచ్చారు. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? -
90 గంటల పని..ఎయిరిండియా పైలట్ల సంచలన ఆరోపణలు, ప్రయాణీకుల ప్రాణాలు!?
సాక్షి, ముంబై: టాటా గ్రూప్ సొంతమైన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా పైలట్లు సంచలన ఆరోపణలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ పనిగంటలతో పాటు,హెల్త్ లీవ్‌లను నిరాకరిస్తోందని ఎయిరిండియా పైలట్ బాడీ, ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ ఆరోపించింది. తాజా పరిణామంతో ప్రయాణీకుల భద్రత ప్రశ్నలను లేవనెత్తుతోంది. సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం పైలట్లు నెలకు 70 గంటలకు బదులుగా అన్ని విమానాలలో నెలకు 90 గంటలకు పైగా ప్రయాణించారని(ఫైయింగ్ అవర్స్) ఐపీజీ-ఐసీపీఏ వాదించింది. అలాగే ఎయిరిండియా యాజమాన్యం పైలట్లకు లీవ్‌లను నిరాకరిస్తోందని ఒక్కోసారి రద్దు చేస్తోందని తద్వారా చాలామంది పైలట్లు అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపించింది. అంతేకాదు సెలవులు పొందిన లేదా శిక్షణ పొందిన నెలల్లో వేతన కోతలతో వేధిస్తున్నారని పైలట్లు ఆరోపించారు. ఇకపై దీన్ని సహించలేమని, తమ జీవన నాణ్యత, పని-జీవిత సమతుల్యత, దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని త్యాగం చేయలేమని పేర్కొన్నారు. (రిలయన్స్ మరో సంచలనం: గుజరాత్లో షురూ) కోవిడ్ తరువాత వేతనాల్లో కోత పెట్టిన సంస్థ ఇపుడు పూర్వ వేతనాలను చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌లైన్ 777 ఫ్లీట్ల కోసం ఎక్స్-ప్యాట్ పైలట్లను ప్రస్తుత దీర్ఘకాలిక పైలట్ల కంటే 80 శాతం ఎక్కువ వేతనంతో రిక్రూట్ చేస్తోందనీ భారతీయ పైలట్లపై చూపిస్తున్న ఈ వివక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఐపీజీ-ఐసీపీఏ తెలిపింది. కాగా సిబ్బంది కొరత నివేదికలను ఎయిరిండియా ఖండించిన కొన్ని రోజుల తరువాత ఈ పరిణామం చోటుసుకుంది. మరి తాజా ఆరోపణలపై ఎయిరిండియా సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి. (బర్సో రే మేఘా మేఘా అంటున్న ఇన్ఫోసిస్ సుధామూర్తి: వీడియో చూస్తే ఫిదా) -
68 ఏళ్ల సర్వీస్‌లో.. ఒక్కరోజు లీవ్ పెట్టలేదు మరి!
నిబద్ధతతో, నిజాయితీతో పని చేసే ఉద్యోగులే ఒక కంపెనీకి నిజమైన సంపద!. ఇలాంటి డెడికేషన్తోనే ఇక్కడో పెద్దాయన ఒకే కంపెనీలో దాదాపు ఏడు దశాబ్ధాలుగా పని చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు. రిటైర్మెంట్కు కంపెనీ అవకాశం ఇచ్చినా.. ఇంకా కొన్నేళ్లపాటు సర్వీస్‌లోనే కొనసాగాలనుకుంటున్నారు. విశేషం ఏంటంటే.. ఇన్నేళ్లలో జబ్బు చేసిందని ఒక్క సిక్ లీవ్ కూడా పెట్టలేదు ఆయన. అందుకే కంపెనీ సైతం సర్వీస్‌ను ఆయన ఇష్టమైనంత కాలం పొడిగించింది. 83 ఏళ్ల వయసులోనూ హుషారుగా పనిచేస్తున్న బ్రెయిన్ క్రోలే గురించి ఆసక్తికర కథనం.. సౌత వెస్ట్ ఇంగ్లండ్ సోమర్సెట్లో నివాసం ఉండే బ్రియన్ కోర్లే.. 1953లో తన 15 ఏళ్ల వయసులో సీ అండ్ జే క్లార్క్స్ షూ ఫ్యాక్టరీలో పనికి కుదిరాడు. పేదరికం కారణంగా తండ్రి ఆర్మీలో చేరితో.. కుటుంబ పోషణలో భాగం కావాలని చిన్నవయసులో బ్రియన్ ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఏజ్ వల్ల మొదట కంపెనీ అతన్ని తీసుకునేందుకు ఒప్పుకోలేదు. చదువుకుంటూనే పనికి వస్తానని చెప్పడంతో అప్పుడు ఓకే చెప్పింది. అలా ఓవైపు స్కూల్.. మరోవైపు ఫ్యాక్టరీ.. సమ్మర్ హాలీడేస్ పూర్తిస్థాయి పనికే అంకితం అయ్యాడు. వారంలో 45 గంటల పని.. వచ్చిన డబ్బంతా అమ్మకు ఇచ్చేసేవాడు. అలా ఏళ్లు గడిచినా.. క్లార్క్స్ కంపెనీతో అతని బంధం కొనసాగుతూ వస్తోంది. ఇంతలో కంపెనీ షూ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసి.. అవుట్లెట్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. ఆ సమయానికి బ్రియన్ వయసు 50 ఏళ్లు. అన్నేళ్లపాటు కంపెనీలో కొనసాగినందుకు ప్రతిగా.. అతని అవుట్లెట్ విభాగానికి బదిలీ చేసింది. దీంతో బ్రియన్ సేవలు కొనసాగుతూ వచ్చాయి. ప్రస్తుతం బ్రియన్ వయసు 83 ఏళ్లు. కంపెనీ రికార్డుల్లో ఈయనగారు ఒక్క సిక్ లీవ్ కూడా పెట్టలేదని ఉంది. ఇంకో వందేళ్లైనా ఇదే కంపెనీలో పని చేస్తానంటూ హుషారుగా చెప్తున్నాడు ఈ తాత. ఇంతకీ ఈ పెద్దాయన ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? ప్రముఖ బ్రాడ్‌కాస్టర్ డేవిడ్ ఫ్రెడెరిక్ అట్టెన్బర్గ్. 95 ఏళ్ల వయసులో హుషారుగా ఈ పెద్దాయన రిటైర్మెంట్ లేకుండా పని చేస్తున్నాడు. ఒకవైపు ప్రకృతి ప్రేమికుడిగా వైల్డ్ లైఫ్ ఫిల్మ్‌మేకింగ్‌తో, మరోవైపు బ్రాడ్‌కాస్టింగ్ ప్రొఫెషనలిజంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు అట్టెన్బర్గ్. అందుకే సర్ డేవిడ్లా తాను సుదీర్ఘకాలం ఇష్టమైన పనిలో కొనసాగాలని నిర్ణయించుకున్నాడట!. పనిలో ఇష్టం.. నిజాయితీ.. దేవుడంటే నమ్మకం.. ఆరోగ్యవంతమైన జీవనం ఇదే తన కెరీర్ రహస్యం అంటున్నారు బ్రియన్ కోర్లే. -
కేఈఎమ్ ఆస్పత్రిలో మరో దారుణం
ముంబై: కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్(కేఈఎమ్) ఆస్పత్రిలో జరుగుతున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కేఈఎమ్ ఆస్పత్రి కారిడార్‌లో స్ట్రెచర్లపై మృతదేహాలు పడి ఉన్న ఫోటో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆస్పత్రికి సంబంధించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ రోజువారి కూలికి సెలవు ఇవ్వడానికి ఆస్పత్రి యాజమాన్యం నిరాకరించింది. దాంతో సదరు వ్యక్తి ఆదివారం మరణించాడు. అయితే అతడు కరోనాతో మరణించాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అతడి మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీ వార్డులో ఉంచారు. మృతుని కుటుంబ సభ్యులు తమకు నష్ట పరిహారం ఇవ్వాలని.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. (‘గాలి ఆడక.. చెమటతో చాలా ఇబ్బంది పడ్డాం’) ముంబైలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ఇప్పటివరకు 52,667 కోవిడ్-19 కేసులు, 1695 మరణాలు నమోదయ్యాయి. వీటిల్లో సుమారు 40 వేలకు పైగా కేసులు ఆర్థిక రాజధాని ముంబైలో నమోదైనవే. వెయ్యికి పైగా మరణాలతో ముంబై దేశంలోనే ప్రథమ సస్థానంలో ఉంది. పెరుగుతున్న కేసులకు సరిపడా వసతులు, వైద్య సిబ్బంది లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. (ఇదీ ముంబై కేఈఎం హాస్పిటల్ : షాకింగ్ ట్వీట్) -
పనంటే బోర్ కొడుతోందా?
ఆఫీసుకెళ్లాలి అంటూ సరదాగా కొందరు బయలుదేరతారు. ఆ సరదా వెనక పనిమీద శ్రద్ధో, కొలీగ్స్‌తో బాతాఖానీ కొట్టచ్చనో... అది వారికే తెలియాలి. పనివేళల్లో పదిసార్లు టీ ఆర్డర్లు ఇస్తూ, కాలుకాలిన పిల్లిలా ఆఫీసులో పచార్లు చేసేవారిని చూస్తూనే ఉంటాం. వీరికి ఆఫీస్ అంటే టైంపాస్. కొంతమంది ఎంపీత్రీలతో ఎంజాయ్ చేస్తుంటే, మరికొందరు టైంపాస్ చేస్తుంటారు. పనిమీద శ్రద్ధ చూపకుండా, చేయవలసిన పనిని విపరీతంగా పెంచుకుని చివరిన ఆపసోపాలు పడుతుంటారు. ఫలితం మెమోలు కావచ్చు, సస్పెన్షన్లకు దారితీయచ్చు. పనిమీద మీ ఇంటరెస్ట్ ఎంత అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. 1. ఎక్కువగా సిక్‌లీవ్‌లు తీసుకుంటారు. ఎ. అవును బి. కాదు 2. పనిచేసినట్లు నటిస్తూ, నెట్‌తో ఎక్కువసేపు గడుపుతారు. ఎ. అవును బి. కాదు 3. అనవసరమైన మెసేజ్‌లు అందరికీ పంపుతారు. ఎ. అవును బి. కాదు 4. ఆఫీస్ టైంలో స్నేహితులతో ఫోన్‌చేసి మాట్లాడుతుంటారు. ఎ. అవును బి. కాదు 5. టీ తాగుతూ చాలా సమయాన్ని గడుపుతారు. ఎ. అవును బి. కాదు 6. అలారాన్ని వాడే సందర్భాలు చాలా తక్కువ. ఎ. అవును బి. కాదు 7. లంచ్ సమయంలో చాలా ఎక్కువసేపు కొలీగ్స్‌తో ఉంటారు. ఎ. అవును బి. కాదు 8. మీరు ఇంటికెళ్లేసరికి చాలా ఆలస్యం అవుతుంది. వర్క్ పూర్తికాలేదని కంగారు పడతారు. ఎ. అవును బి. కాదు 9. పనిలో సహాయం చేయమని మీ సహచరులను అభ్యర్థించే సందర్భాలు తరచూ ఎదురవుతుంటాయి. ఎ. అవును బి. కాదు 10. ఇతరుల పనికి అవరోధం కలిగిస్తూ ఎప్పుడూ మాట్లాడుతుంటారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు ఏడు దాటితే మీరు పనిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఎప్పుడెప్పుడు ఖాళీ దొరుకుతుందా అని చూస్తుంటారే కాని, పనిమీద ధ్యాస ఉంచరు. మీలానే అందరూ ఉండాలని కోరుకుంటారు. పనిని గౌరవించి ప్రేమించటం నేర్చుకోండి. ‘బి’ లు ఆరు దాటితే మీకు çపని పట్ల ఆసక్తి ఎక్కువ. వృత్తిని గౌరవిస్తారు. ఒకరిచేత మాట పడకూడదనుకుంటారు. -
ఆ గొడవల్లో పురుషులు, స్త్రీల స్పందనల్లో తేడా..
లండన్: ఉద్యోగ జీవితంలో బాస్‌తో, సహచరులతో గొడవలు పడే అలవాటు ఉందా. ఒకవేళ ఉంటే.. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. వర్క్ ప్లేస్‌లో గొడవల విషయంలో మహిళా ఉద్యోగులు, పురుష ఉద్యోగుల స్పందించే తీరు వేరు వేరుగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. వర్క్ ప్లేస్‌లో గొడవలు పడే పురుష ఉద్యోగులు ఆ ఉద్యోగాన్నే వదిలేయడానికి మొగ్గుచూపుతారని.. అదే మహిళలు మాత్రం కొన్నాళ్లు సిక్ లీవ్‌లో వెళ్లడం లేదా ఒత్తిడిని తగ్గించుకోవడానికి యాంటీ డిప్రెసెంట్స్‌ను వాడటం చేస్తుంటారని డెన్మార్క్‌కు చెందిన అర్హస్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే సుమారు 3000 మంది అభిప్రాయాలు తీసుకోగా.. వీరిలో ఏడు శాతం మంది తాము వర్క్‌ప్లేస్‌లో గొడవల బాధితులమే అని వెల్లడించారు. ఈ బాధితుల్లో 43 శాతం మంది పురుషులు ఉన్నారు. కాగా.. వర్క్ ప్లేస్‌లో గొడవలు పురుషుల ప్రమోషన్లు, జీతాలపై ప్రభావం చూపుతాయని పరిశోధనలో పాల్గొన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ముంజెర్గ్ ఎరిక్సన్ వెల్లడించారు. గొడవలతో పురుషులు సిక్ లీవ్‌లకు వెళ్లడం మాత్రం జరగదని ఆమె పేర్కొన్నారు. వర్క్‌ప్లేస్‌లో గొడవల మూలంగా కీలకమైన బాధ్యతలు కాకుండా అంతగా ప్రాధాన్యత లేని బాధ్యతలు ఉద్యోగులు పొందుతారని పరిశోధనలో గుర్తించారు.