ఐపీఎల్ 16వ సీజన్‌కు ఆదివారంతోనే(మే 28న) శుభం కార్డు పడాల్సింది. కానీ వర్షం కారణంగా సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డే అయిన సోమవారానికి(మే 29) వాయిదా పడింది. మ్యాచ్‌కు ఈరోజు కూడా వర్షం ముప్పు ఉన్నప్పటికి అది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.
ఈ విషయం సంతోషం కలిగించేదే అయినా.. సోమవారం వర్కింగ్ డే కావడంతో ఉద్యోగం చేసే కొంతమంది క్రికెట్ ప్రేమికులు మాత్రం తమ బాస్‌కు ఏం కారణం చెప్పి తొందరగా ఆఫీస్ నుంచి బయటపడాలా అని ఆలోచిస్తున్నారు. సోమవారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండడంతో ఆలోగా ఇంటికి చేరుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
అయితే నైట్‌షిఫ్ట్ సహా లేట్‌నైట్ వర్క్ చేసేవాళ్లు హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌కు సిక్‌లీవ్స్ కోసం అప్లై చేసుకుంటున్నారు. ఇక జియో సినిమా కూడా ఐపీఎల్ ఫైనల్ విషయమై ఒక ఫన్నీ మీమ్‌ను షేర్ చేసింది. హెచ్‌ఆర్ ఉద్యోగి ముందు కుప్పలుతెప్పలుగా సిక్ లీవ్ లెటర్స్ ఉండడం.. ఆమె దానిపై సంతకాలు చేస్తుండడం కనిపించింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. వాస్తవానికి మరి ఇంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు కానీ.. ఐపీఎల్ ఫైనల్ కావడంతో సాయంత్రం పనిచేసే ఆఫీసుల్లో మాత్రం ఉద్యోగుల నుంచి ఇలాంటి కారణాలు ఉండే అవకాశం ఉంటుంది.
అయితే ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరిగి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఎప్పటిలాగే ఫుల్ ఎంజాయ్ చేసి సోమవారం కాస్త లేట్ అయినా ఆఫీస్‌కు వెళ్లేవారు. స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూడలేనివాళ్లు ఫైనల్ మ్యాచ్‌ను ఎంజాయ్ చేయాలని తమ ప్రణాళికలు రచించుకున్నారు. కొందరు పబ్‌లు, బార్లకు వెళ్లి మందు తాగుతూ మ్యాచ్ చూస్తూ చిల్ అవుదామనుకున్నారు. ఇంకొందరు ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఐపీఎల్ ఫైనల్ చూస్తూ ఆనందంగా గడిపేయాలనుకున్నారు.
కానీ వరుణుడు వారి ఆశలకు గండికొట్టాడు. దీంతో సోమవారానికి మ్యాచ్ వాయిదా పడింది. కానీ సోమవారం వారంలో మొదటి పని దినం కావడం.. రోజంతా మీటింగ్స్ ఉంటాయన్న కారణంతో ఎక్కడ మ్యాచ్ మిస్ అవుతామేమోనన్న భయం సగటు క్రికెట్ అభిమానికి ఉంటుంది కదా..!
Office HR depts across the country dealing with sick leave requests today...#IPLFinal #IPLonJioCinema pic.twitter.com/A0mmlS14xH
— JioCinema (@JioCinema) May 29, 2023
✌🏽No sick leaves, show this to your manager to wind up your work by 6:30 PM today! 🙏🏽#IPLonJioCinema #IPLFinal #GTvCSK #Dhoni pic.twitter.com/Pfzz3XMI60
— JioCinema (@JioCinema) May 29, 2023
Comments
Please login to add a commentAdd a comment