నిబద్ధతతో, నిజాయితీతో పని చేసే ఉద్యోగులే ఒక కంపెనీకి నిజమైన సంపద!. ఇలాంటి డెడికేషన్తోనే ఇక్కడో పెద్దాయన ఒకే కంపెనీలో దాదాపు ఏడు దశాబ్ధాలుగా పని చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు. రిటైర్మెంట్కు కంపెనీ అవకాశం ఇచ్చినా.. ఇంకా కొన్నేళ్లపాటు సర్వీస్‌లోనే కొనసాగాలనుకుంటున్నారు. విశేషం ఏంటంటే.. ఇన్నేళ్లలో జబ్బు చేసిందని ఒక్క సిక్ లీవ్ కూడా పెట్టలేదు ఆయన. అందుకే కంపెనీ సైతం సర్వీస్‌ను ఆయన ఇష్టమైనంత కాలం పొడిగించింది. 83 ఏళ్ల వయసులోనూ హుషారుగా పనిచేస్తున్న బ్రెయిన్ క్రోలే గురించి ఆసక్తికర కథనం..
సౌత వెస్ట్ ఇంగ్లండ్ సోమర్సెట్లో నివాసం ఉండే బ్రియన్ కోర్లే.. 1953లో తన 15 ఏళ్ల వయసులో సీ అండ్ జే క్లార్క్స్ షూ ఫ్యాక్టరీలో పనికి కుదిరాడు. పేదరికం కారణంగా తండ్రి ఆర్మీలో చేరితో.. కుటుంబ పోషణలో భాగం కావాలని చిన్నవయసులో బ్రియన్ ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఏజ్ వల్ల మొదట కంపెనీ అతన్ని తీసుకునేందుకు ఒప్పుకోలేదు. చదువుకుంటూనే పనికి వస్తానని చెప్పడంతో అప్పుడు ఓకే చెప్పింది. అలా ఓవైపు స్కూల్.. మరోవైపు ఫ్యాక్టరీ.. సమ్మర్ హాలీడేస్ పూర్తిస్థాయి పనికే అంకితం అయ్యాడు. వారంలో 45 గంటల పని.. వచ్చిన డబ్బంతా అమ్మకు ఇచ్చేసేవాడు. అలా ఏళ్లు గడిచినా.. క్లార్క్స్ కంపెనీతో అతని బంధం కొనసాగుతూ వస్తోంది.
ఇంతలో కంపెనీ షూ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసి.. అవుట్లెట్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. ఆ సమయానికి బ్రియన్ వయసు 50 ఏళ్లు. అన్నేళ్లపాటు కంపెనీలో కొనసాగినందుకు ప్రతిగా.. అతని అవుట్లెట్ విభాగానికి బదిలీ చేసింది. దీంతో బ్రియన్ సేవలు కొనసాగుతూ వచ్చాయి. ప్రస్తుతం బ్రియన్ వయసు 83 ఏళ్లు. కంపెనీ రికార్డుల్లో ఈయనగారు ఒక్క సిక్ లీవ్ కూడా పెట్టలేదని ఉంది. ఇంకో వందేళ్లైనా ఇదే కంపెనీలో పని చేస్తానంటూ హుషారుగా చెప్తున్నాడు ఈ తాత.
ఇంతకీ ఈ పెద్దాయన ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? ప్రముఖ బ్రాడ్‌కాస్టర్ డేవిడ్ ఫ్రెడెరిక్ అట్టెన్బర్గ్. 95 ఏళ్ల వయసులో హుషారుగా ఈ పెద్దాయన రిటైర్మెంట్ లేకుండా పని చేస్తున్నాడు. ఒకవైపు ప్రకృతి ప్రేమికుడిగా వైల్డ్ లైఫ్ ఫిల్మ్‌మేకింగ్‌తో, మరోవైపు బ్రాడ్‌కాస్టింగ్ ప్రొఫెషనలిజంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు అట్టెన్బర్గ్. అందుకే సర్ డేవిడ్లా తాను సుదీర్ఘకాలం ఇష్టమైన పనిలో కొనసాగాలని నిర్ణయించుకున్నాడట!. పనిలో ఇష్టం.. నిజాయితీ.. దేవుడంటే నమ్మకం.. ఆరోగ్యవంతమైన జీవనం ఇదే తన కెరీర్ రహస్యం అంటున్నారు బ్రియన్ కోర్లే.
Comments
Please login to add a commentAdd a comment