Work From Home: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచములోని చాలా దేశాల్లోని కంపెనీలు తమ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' (Work From Home) వెసులుబాటు కల్పించాయి. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత కూడా దీనికే అలవాటుపడిన ఎంప్లాయిస్ ఆఫీసులకు రావడానికి ససేమిరా అంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఉద్యోగులు పనిని సక్రమంగా నిర్వహించడం లేదని కంపెనీలు వాపోతున్నాయి. ఇటీవల ఒక కంపెనీ తమ ఉద్యోగిని ఉద్యోగం నుంచి తీసి వేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, ఇన్సూరెన్స్ ఆస్ట్రేలియా గ్రూప్ (IAG) కన్సల్టెంట్ 'సుజీ చీఖో' వర్క్ ఫ్రమ్ హోమ్‌లో సరిగ్గా విధులు నిర్వహించడం లేదని ఈ కారణంగా ఉద్యోగం నుంచి తొలగించారు. ఇంటి నుంచి పనిచేసే సమయంలో సరిగ్గా టైపింగ్ చేయలేదని, అసలు ఆమెకు టైపింగ్ రాదనీ కంపెనీ వెల్లడించింది.
సుజీ చీఖో పనితీరుని పసిగట్టడానికి 49 రోజుల పాటు కీస్ట్రోక్ టెక్నాలజీని ఉపయోగించింది. దీంతో ఆమె చాలా తక్కువ కీస్ట్రోక్ యాక్టివిటీని కలిగి ఉన్నట్లు కనిపెట్టింది. అంతే కాకుండా 47 రోజులు వర్క్ ఆలస్యంగా ప్రారంభించినట్లు, 29 రోజులు సమయం కంటే త్వరగా లాగవుట్ చేసినట్లు, మొత్తం మీద 44 రోజులు కంపెనీ నిర్దేశించిన పూర్తి సమయం పనిచేయలేదని కనుక్కుంది. మిగిలిన రోజులు అసలు పనే చేయకపోవడం గమనార్హం.
ఇదీ చదవండి: వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన - వరుసగా మూడో సారి..
సుజీ చీఖో పనితీరు సరిగ్గా లేదని కంపెనీ చాలా సార్లు గట్టిగా హెచ్చరించింది. పర్ఫామెన్స్ మెరుగుపరచుకోవాలని మూడు నెలలు సమయం కూడా ఇచ్చింది. అయినప్పటికీ ఆమెలో ఎటువంటి మార్పు కనిపించలేదు. అంతే కాకుండా కంపెనీ ట్రాకింగ్‌ను తప్పుపట్టడమే కాకుండా.. తాను సరైన విధంగా పనిచేస్తున్నట్లు, ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో కాకుండా వేరే డివైజులో పనిచేస్తున్నట్లు వాదించింది. ఆమె వాదనను ఫెయిర్ వర్క్ కమిషన్ (FWC) తిరస్కరించింది. అయితే కొన్ని కంపెనీలు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి మంగళం పాడాయి.
Comments
Please login to add a commentAdd a comment