టెక్నాలజీ విపరీతంగా పెరుగుతోంది. దీనినే అదనుగా తీసుకుని సైబర్ నేరగాళ్లు ప్రజలను మాత్రమే కాకుండా కొన్ని కంపెనీలను కూడా దోచేస్తున్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరిగినప్పటికీ.. ఇటీవల హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లోని అమీర్‌పేటకు చెందిన ఓ ఎక్స్‌పోర్ట్ కంపెనీ సైబర్ దాడికి గురైంది. నేరస్థులు ఏకంగా రూ. 10 కోట్లు కొట్టేయడానికి కంపెనీ ఈమెయిల్ సిస్టమ్ హ్యాక్ చేశారు. దుబాయ్ కంపెనీ నుంచి అమీర్‌పేట కంపెనీకి రూ. 10 కోట్లు రావాల్సి ఉంది. దీనికోసం సంస్థ దుబాయ్ కంపెనీకి మెయిల్ పంపింది.
దుబాయ్ సంస్థ చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. అయితే అందులో అమీర్‌పేట సంస్థకు చెందిన బ్యాంక్ అకౌంట్ కాకూండా.. సిడ్నీలో ఉన్న నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా బ్యాంకు అకౌంట్‍కు డబ్బు పంపాలని సైబర్ నేరగాళ్లు పంపిన మెయిల్‌లో ఉండటం గమనించి వెంటనే స్పందించారు.
వెంటనే గమనించిన అప్రమత్తమవ్వడంతో లావాదేవీలు జరగకుండా ఆపగలిగారు. ఈ సంఘటన జరిగిన తరువాత తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి అమీర్‌పేట కంపెనీ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సెక్షన్ 318, 319 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment