అనారోగ్య సమస్యల కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేసిన ఉద్యోగిని కంపెనీ బాస్ తొలగించడమే కాకుండా.. మూడు నెలల జీతం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఒక కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేసిన వ్యక్తి సోషల్ మీడియాలో ఇలా వెల్లడించారు. నేను ఎనిమిది నెలలకు పైగా సంస్థలో పనిచేసాను. కంపెనీ నాకు అన్నీ ఇచ్చింది. అయితే క్రమంగా పని భారం పెరిగింది. ఒత్తిడి తీవ్రమైంది. ఒక నెల క్రితం ఫ్యాటీ లివర్ సమస్య వచ్చింది. ఆ తరువాత చికెన్‌పాక్స్ సోకింది.
అనారోగ్యంతో బాధపడుతున్న నేను మూడు రోజులు సెలవు కావాలని సీఈఓకు మెయిల్ చేశాను. కానీ సీఈఓ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని వెల్లడించారు. కానీ నేను వర్క్ ఫ్రమ్ చేయలేనని చెప్పాను. ఆరోగ్యం కుదుటపడాలంటే కొంత విశ్రాంతి తీసుకోవాలని భావించి రాజీనామా చేయాలనీ నిర్ణయించున్నాను. ఆ తరువాత నా రాజీనామాను సీఈఓకు అందించాను. ఒక నెల రోజులు ముందుగా రిలీవ్ చేయాలని అభ్యర్థించాను.
సీఈఓ నా రాజీనామాను తిరస్కరించమే కాకుండా.. తప్పకుండా కంపెనీలో పనిచేయాలని చెప్పారు. ఉద్యోగంలో కొనసాగుతున్న క్రమంలో నాకు ప్రమాదం జరిగి, చేతికి గాయమైంది. ఆ తరువాత మళ్ళీ ఒకసారి నా రాజీనామా గురించి సీఈఓకు గుర్తుచేశాను. అయినా నా మీద సీఈఓ సానుభూతి చూపలేదు. ఆ తరువాత రెండు రోజులు సెలవు తీసుకున్నాను. అయితే నాకు వారు టెర్మినేషన్ ఇమెయిల్‌ను పంపారు.
ఇదీ చదవండి: అప్పుడు జపాన్‌లో కనిపించింది: ఇప్పుడు నోయిడాలో..
వారు టెర్మినేషన్ ఇమెయిల్ పంపిన తరువాత.. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ (BGV)లో తప్పుగా రిపోర్ట్ చేస్తానని పేర్కొన్నారు. అంతే కాకుండా ఎక్స్‌పీరియన్స్ లెటర్ అడిగితే.. మూడు నెలల జీతం డిమాండ్ చేశారని, ఆ వ్యక్తి చెప్పారు. ఇదంతా సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. ఇప్పుడు నేను ఏమి చేయాలి అని అడిగారు. దీనికి చాలామంది స్పందిస్తూ మంచి న్యాయవాదిని సంప్రదించాలని, కార్మిక మంత్రిత్వ శాఖను సంప్రదించమని తమదైన రీతిలో సమాధానాలు ఇస్తూ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment