ఏ వస్తువుకైనా దాని బ్రాండ్ గుర్తు చేసే కొన్ని గుర్తులు ఉంటాయి. ఆ గుర్తులే లేకపోతే.. దానిని ఎవరు తయారు చేసారో చెప్పడం కష్టం. కాబట్టి ప్రతి కంపెనీ తమ వస్తువులకు తప్పకుండా కొన్ని గుర్తులను ముద్రిస్తుంది. ఇటీవల ఒక మార్స్ చాక్లెట్ బార్.. సాధారణ చాక్లెట్ మాదిరిగా కాకుండా, స్మూత్‌గా ఉన్నట్లు ఓ వ్యక్తి కనిపెట్టాడు.
బకింగ్‌హామ్ షైర్‌లోని ఐల్స్‌బరీకి చెందిన 32 ఏళ్ల హ్యారీ సీగర్.. తన ఫేస్‌బుక్‌లో స్మూత్ చాక్లెట్ బార్ ఫోటో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో వైరల్ అయింది. అంతే కాకుండా దీనిని కంపెనీకి కూడా మెయిల్ ద్వారా పెంపించాడు. కంపెనీ దీనికి చింతిస్తూ.. క్షమాపణ చెప్పడమే కాకుండా అతనికి పరిహారంగా రూ. 215 చెల్లించింది.
నిజానికి సీగర్ స్నేహితులతో కలిసి బర్మింగ్‌హామ్‌లోని ఒక క్లాసిక్ కార్ షోకు వెళుతుండగా.. ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లోని సర్వీస్ స్టేషన్‌లో ఆగి చాక్లెట్ బార్‌ను కొనుగోలు చేశాడు. అయితే ఆ చాక్లెట్ మీద అలలు లాంటి గుర్తులు ఏమి లేకుండా మృదువుగా కనిపించింది. ఇది అతన్ని చాలా ఆకర్శించింది. దానినే సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అంతే కాకుండా కంపెనీకి మెయిల్ కూడా చేసాడు.
కంపెనీ స్పందించి అతని పరిహారం అందించిన తరువాత, అతడు స్పందిస్తూ.. నేను పరిహారం కోసం కంపెనీకి మెయిల్ చేయలేదు. ఇలాంటి చాక్లెట్ ఎందుకు తయారు చేసారు? కారణం ఏమిటి అనే విషయాన్ని కనుక్కోవడానికి ఇలా చేసాను అని అన్నాడు. అయితే నాకు పరిహారం లభించింది. దీంతో నేను రెండు మార్స్ బార్‌లు కొనేయొచ్చు అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment