ముంబై: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నెమ్మదిగా తన విమానాలను పునరుద్ధరిస్తోంది. అనారోగ్యంతో సెలవు తీసుకున్న సిబ్బంది అంతా విధుల్లో చేరినట్లు ఓ అధికారి పేర్కొన్నారు.
ప్రతిరోజూ సుమారు 380 విమానాలను నడుపుతున్న టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్‌లైన్ సిబ్బంది సెలవులు తీసుకోవడం వల్ల 20 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసింది. మంగళవారం ఉదయం నాటికి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
మరో వైపు గురువారం ఢిల్లీలో చీఫ్ లేబర్ కమిషనర్ ఏర్పాటు చేసిన సమావేశం తర్వాత క్యాబిన్ సిబ్బంది తమ సమ్మెను విరమించుకున్నారు. దీంతో 25 మంది సిబ్బందికి జారీ చేసిన టెర్మినేషన్ లేఖలను సంస్థ ఉపసంహరించుకుంది. అనారోగ్య సెలవుల్లో ఉన్నవారు కూడా విధుల్లో చేరటం వల్ల మళ్ళీ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సాధారణ స్థితికి వస్తుందని తెలుస్తోంది.
All the cabin crew members who reported sick have joined their duty by 11th May 2024. However, due to a software glitch in the company scheduling software, as it was recently introduced, it is still showing that staff are reported sick. Further, the flights to take off today were… pic.twitter.com/WVqtDCUSf6
— ANI (@ANI) May 12, 2024
Comments
Please login to add a commentAdd a comment