ముంబై: కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్(కేఈఎమ్) ఆస్పత్రిలో జరుగుతున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కేఈఎమ్ ఆస్పత్రి కారిడార్‌లో స్ట్రెచర్లపై మృతదేహాలు పడి ఉన్న ఫోటో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆస్పత్రికి సంబంధించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ రోజువారి కూలికి సెలవు ఇవ్వడానికి ఆస్పత్రి యాజమాన్యం నిరాకరించింది. దాంతో సదరు వ్యక్తి ఆదివారం మరణించాడు. అయితే అతడు కరోనాతో మరణించాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అతడి మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీ వార్డులో ఉంచారు. మృతుని కుటుంబ సభ్యులు తమకు నష్ట పరిహారం ఇవ్వాలని.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
(‘గాలి ఆడక.. చెమటతో చాలా ఇబ్బంది పడ్డాం’)
ముంబైలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ఇప్పటివరకు 52,667 కోవిడ్-19 కేసులు, 1695 మరణాలు నమోదయ్యాయి. వీటిల్లో సుమారు 40 వేలకు పైగా కేసులు ఆర్థిక రాజధాని ముంబైలో నమోదైనవే. వెయ్యికి పైగా మరణాలతో ముంబై దేశంలోనే ప్రథమ సస్థానంలో ఉంది. పెరుగుతున్న కేసులకు సరిపడా వసతులు, వైద్య సిబ్బంది లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. (ఇదీ ముంబై కేఈఎం హాస్పిటల్ : షాకింగ్ ట్వీట్)
Comments
Please login to add a commentAdd a comment