KEM hospital
-
Mumbai: 23 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు కరోనా
ముంబై: కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్నిచర్యలు తీసుకున్న ప్రజల అజాగ్రత్త వలన కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా, ముంబైలోని కేఈఎం మెడికల్ కాలేజ్‌లో కరోన కేసులు బయటపడ్డాయి. కాగా, 23 మంది ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు కరోనా సోకినట్లు కళాశాల డీన్ డాక్టర హేమంత్ దేశ్‌ముఖ్ తెలిపారు. 29 మంది విద్యార్థులలో 23 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. అయితే, వారందరికి లక్షణాలు పెద్దగా లేవని వైద్యులు తెలిపారు. మెడికల్ కాలేజ్‌లో ఇటీవల నిర్వహించిన ఒక సాంస్కృతిక కార్యక్రమం వలన వైరస్ వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం.. 29 మంది విద్యార్థులలో 27 మంది విద్యార్థులు రెండు డోసుల వ్యాక్సిన్‌ను వేయించుకున్నారని డీన్ తెలిపారు. వారిలో ఇద్దరు విద్యార్థులు మాత్రం ముంబై లోని సెవన్ హిల్స్ ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతంవారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. దీనిపై మేయర్ కిషోరి ఫడ్నేకర్ స్పందించారు. ప్రస్తుతం.. ఎంబీబీఎస్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. చదవండి: Navjot Singh Sidhu: సిద్ధూ ఆప్‌లో చేరబోతున్నాడా? -
కేఈఎమ్ ఆస్పత్రిలో మరో దారుణం
ముంబై: కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్(కేఈఎమ్) ఆస్పత్రిలో జరుగుతున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కేఈఎమ్ ఆస్పత్రి కారిడార్‌లో స్ట్రెచర్లపై మృతదేహాలు పడి ఉన్న ఫోటో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆస్పత్రికి సంబంధించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ రోజువారి కూలికి సెలవు ఇవ్వడానికి ఆస్పత్రి యాజమాన్యం నిరాకరించింది. దాంతో సదరు వ్యక్తి ఆదివారం మరణించాడు. అయితే అతడు కరోనాతో మరణించాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అతడి మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీ వార్డులో ఉంచారు. మృతుని కుటుంబ సభ్యులు తమకు నష్ట పరిహారం ఇవ్వాలని.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. (‘గాలి ఆడక.. చెమటతో చాలా ఇబ్బంది పడ్డాం’) ముంబైలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ఇప్పటివరకు 52,667 కోవిడ్-19 కేసులు, 1695 మరణాలు నమోదయ్యాయి. వీటిల్లో సుమారు 40 వేలకు పైగా కేసులు ఆర్థిక రాజధాని ముంబైలో నమోదైనవే. వెయ్యికి పైగా మరణాలతో ముంబై దేశంలోనే ప్రథమ సస్థానంలో ఉంది. పెరుగుతున్న కేసులకు సరిపడా వసతులు, వైద్య సిబ్బంది లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. (ఇదీ ముంబై కేఈఎం హాస్పిటల్ : షాకింగ్ ట్వీట్) -
ఇదీ ముంబై కేఈఎం హాస్పిటల్ : షాకింగ్ ట్వీట్
సాక్షి, ముంబై: ఒకవైపు దేశంలో కరోనా వైరస్ ప్రకంపనలు కొనసాగుతుండగా మరోవైపు ముంబైలోషాకింగ్ ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ కారిడార్ లో మృతదేహాలు స్ట్రెచర్లపై పడి ఉన్నాయి. ఈ దిగ్భ్రాంతికరమైన ఫోటోను బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఇదీ ముంబైలోని కేఈఎం ఆసుపత్రి అంటూ ట్వీట్ చేశారు. అయితే ఆసుపత్రిలో ఈ కారిడార్ ప్రస్తుతం వినియోగంలో వుందా లేక ఖాళీగా ఉన్న ప్రదేశమా అనేది స్పష్టతలేదు. దీనిపై ఆసుపత్రి వర్గాలు అధికారికంగా స్పందించాల్సి వుంది. (ఉబెర్ : ఇండియాలో 600 మంది తొలగింపు) కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, మహారాష్ట్రలో ఇప్పటివరకు 52,667 కోవిడ్-19 కేసులు, 1695 మరణాలు నమోదయ్యాయి. వీటిల్లో సుమారు 40 వేలకు పైగా కేసులు ఆర్థిక రాజధాని, 'డ్రీమ్స్ సిటీ' ముంబైలో నమోదైనవే. ఇక్కడ వెయ్యికి పైగా మరణాలతో దేశంలోనే భారీగా ప్రభావితమైన నగరంగా ముంబై నిలిస్తే.. రెండవదిగా ఉన్న పూణే నగరంలో 5319 మంది ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారు. (కోవిడ్-19 : పరిశీలనలో అతి చవకైన మందు ) కాగా గతంలో కూడా నితేష్ రాణా ఇలాంటి ఒక షాకింగ్ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. కరోనా మృతదేహాల మధ్య కరోనా ఐసోలేషన్ వార్డును నిర్వహిస్తున్న తీరుపై ఆయన మండిపడిన సంగతి తెలిసిందే. This is KEM hospital Mumbai ! pic.twitter.com/5KQQcCrYCH — nitesh rane (@NiteshNRane) May 26, 2020 -
ఆమె లేదు.. అయినా పుట్టినరోజు వేడుక ఆగలేదు
మర్చిపోవడానికి ఆమె జ్ఞాపకం కాదు.. 42 ఏళ్లు కొనసాగిన అనుబంధం.. అంతకుమించి ప్రాణంపదం. అందుకే దివంగత అరుణా షాన్‌బాగ్ పుట్టినరోజు వేడుకల్ని సోమవారం ఘనంగా నిర్వహిచారు ముంబైలోని కేఈఎం ఆసుపత్రి నర్సులు, డాక్టర్లు. వార్డుబాయ్ చేతిలో తీవ్ర లైంగిక హింసకు గురై, 42 ఏళ్లపాటు ఎలాంటి కదలికలు లేకుండా అరుణ జీవించిన నాలుగో నంబర్ గదిని నర్సులు అందంగా అలంకరించారు. ఉదయం నుంచి వరుసగా ఆ గదికి వచ్చిన నర్సులు.. బెడ్‌పై పూలు ఉంచి నివాళులు అర్పించారు. ఆ తరువాత కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. చికిత్స సమయంలో అరుణను ఉంచిన 4వ నంబర్ గదికి ఆమె పేరు పెట్టాలని నర్సులు కోరుతున్నట్లు, తర్వరలోనే దానిపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు కేఈఎం ఆసుపత్రి డీన్ అవినాష్ సుపే తెలిపారు. థానేలోని నర్సింగ్ కళాశాలకు అరుణ షాన్‌బాగ్ పేరు పెట్టనున్నట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, అరుణ జీవితగాథ ఆధారంగా జర్నలిస్ట్ నేహా పురవ్ రూపొందించిన మరాఠి చిత్రం 'వ్యథ అరుణాచి' ఈ సాయంత్రం విడుదల కానుంది. -
పాఠ్యాంశంగా ‘అరుణ’ జీవితం..?
సాక్షి, ముంబై: 42 ఏళ్లపాటు కోమాలో ఉండి ఇటీవలే మృతి చెందిన కేఈఎం ఆస్పత్రి మాజీ నర్సు అరుణా షాన్‌బాగ్ జీవిత కథను పాఠ్యాంశంగా చేర్చే విషయంపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. నాలుగు దశాబ్దాలపాటు మృత్యువుతో పోరాటం, కేఈఎం ఆసుపత్రి నర్సుల నిస్వార్థ సేవ తదితర విషయాలను నేటి తరానికి ఆదర్శంగా చూపించేందుకు పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి తుది నిర్ణయం తీసుకోకున్నా ఇందుకు సంబంధించిన ప్రయత్నాలైతే జరగుతున్నాయి. 2015-16 విద్యా సంవత్సరం పాఠ్యపుస్తకాలు ఇప్పటికే వెలువడటంతో 2016-17లో చేర్చే అవకాశాలున్నాయి. ఈ విషయంపై ‘శిక్షణ మండలి’ అంగీకరిస్తే ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే ఈ సందర్భంగా స్పష్టం చేశారు.