ముంబై: కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్నిచర్యలు తీసుకున్న ప్రజల అజాగ్రత్త వలన కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా, ముంబైలోని కేఈఎం మెడికల్ కాలేజ్‌లో కరోన కేసులు బయటపడ్డాయి. కాగా, 23 మంది ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు కరోనా సోకినట్లు కళాశాల డీన్ డాక్టర హేమంత్ దేశ్‌ముఖ్ తెలిపారు. 29 మంది విద్యార్థులలో 23 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. అయితే, వారందరికి లక్షణాలు పెద్దగా లేవని వైద్యులు తెలిపారు. మెడికల్ కాలేజ్‌లో ఇటీవల నిర్వహించిన ఒక సాంస్కృతిక కార్యక్రమం వలన వైరస్ వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం.. 29 మంది విద్యార్థులలో 27 మంది విద్యార్థులు రెండు డోసుల వ్యాక్సిన్‌ను వేయించుకున్నారని డీన్ తెలిపారు. వారిలో ఇద్దరు విద్యార్థులు మాత్రం ముంబై లోని సెవన్ హిల్స్ ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతంవారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. దీనిపై మేయర్ కిషోరి ఫడ్నేకర్ స్పందించారు. ప్రస్తుతం.. ఎంబీబీఎస్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment