Spread
-
కేరళలో వెస్ట్ నైల్ ఫీవర్.. ఎంత ప్రమాదకరమంటే?
కేరళలో వెస్ట్ నైల్ ఫీవర్ విస్తరిస్తోంది. దోమలు కుట్టడం ద్వారా ఈ జ్వరం సోకుతుంది. రాష్ట్రంలోని మూడు నగరాల్లో ఈ కేసులు నమోదైన నేపధ్యంలో అన్ని జిల్లాల్లో ప్రీ మాన్సూన్ క్లీనింగ్ క్యాంపెయిన్ నిర్వహించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ జ్వరం లక్షణాలు, ఇది సోకకుండా ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.కోజికోడ్‌లో ఇప్పటివరకు ఐదు వెస్ట్ నైల్ ఫీవర్ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు మీడియాకు తెలిపారు. మలప్పురం, త్రిస్సూర్‌లో కూడా ఈ వ్యాధి బారినపడినవారున్నారని, ఈ వ్యాధి లక్షణాలు త్వరగా కనిపించవని వారు తెలిపారు. అందుకే వ్యాధి సోకిన వారి సంఖ్యను అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో వెల్లడించలేకపోతున్నారని సమాచారం.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ జ్వరం సోకిన ఐదుగురిలో నలుగురు కోలుకున్నారు. ఒకరు ఇప్పటికీ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. వెస్ట్ నైల్ జ్వరం లక్షణాలు డెంగ్యూ మాదిరిగానే ఉంటాయి. 80 శాతం కేసుల్లో లక్షణాలు కనిపించవు.వెస్ట్ నైల్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ దోమల వృద్ధిని అరికట్టడం, నీటి వనరులను శుభ్రపరచడంపై స్థానిక అధికారులకు సూచనలు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో 2011 నుంచి ఈ తరహా కేసులు నమోదవుతున్నాయని, ఈ ఫీవర్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే డ్యెంగ్యూ లక్షణాలు కనిపించినవారు వెంటనే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.వెస్ట్ నైల్ ఫీవర్ దోమ కాటు ద్వారా మనుషులకు సోకుతుంది. యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ వ్యాధి సోకిన ప్రతి 10 మందిలో 8 మందికి లక్షణాలు కనిపించవు. అయితే వాంతులు, విరేచనాలు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకిన అనంతరం తగిన చిక్సిత్స అందకపోతే బాధితులు మృతి చెందే అవకాశం ఉంది. కేరళలో ఈ వ్యాధి సోకి 2019లో ఒకరు, 2022లో ఒకరు మృతి చెందనట్లు నివేదికలు చెబుతున్నాయి. -
Swiss: స్విట్జర్లాండ్‌లో ప్రబలుతున్న ‘తట్టు’
జ్యురిచ్: స్విట్జర్లాండ్‌లో తట్టు(మీజిల్స్) వ్యాధి ప్రబలుతోంది. లుసాన్నే ప్రాంతంలోని ఓ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు తట్టు సోకింది. దీంతో ఆ స్కూల్‌ను ఈ నెల 18 వరకు మూసివేస్తున్నట్లు స్కూల్ యాజమాన్యం ప్రకటించింది. అయితే ఎంతమంది విద్యార్థులకు తట్టు సోకిందో స్కూల్ యాజమాన్యం క్లారిటీ ఇవ్వలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో స్కూల్ మూసివేస్తున్నామని మాత్రమే స్కూల్ యాజమాన్యం ప్రకటించింది. ఈ స్కూల్లో జనవరిలోనే ఆరుగురికి తట్టు సోకినట్లు నిర్ధారణ అయిందని, తాజాగా మరో 20 మందికి వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది. మీజిల్స్ అనే అంటు వ్యాధి వైరస్ కారణంగా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వారు దగ్గినపుడు పడే తుంపర్ల ద్వారా వ్యాధి వ్యాప్తిచెందుతుంది. వ్యాధి సోకిన వారికి జ్వరం, దగ్గు, ముక్కు కారడం, ముక్కు, గొంతులో మంట, ర్యాషెస్ తదితర లక్షణాలు కనిపిస్తాయి. రెండు డోసుల వ్యాక్సిన్లతో మీజిల్స్ రాకుండా నిరోధించవచ్చు. ఇదీ చదవండి.. ఐస్ లాండ్లో అగ్ని పూలు -
కలవరపెడుతున్న 'జాంబీ డీర్ వ్యాధి'! మనుషులకు కూడా వస్తుందా?
మానవ తప్పిదాలతో పర్యావరణాన్ని చేజేతులారా కలుషితం చేశాం. దానికి ప్రతిగా రోజుకో కొత్త వింత వ్యాధులు ప్రకృతి ప్రకోపానికి ఫలితమా! అన్నట్టుగా పుట్టుకొస్తున్నాయి. ఆ వ్యాధులు జంతువులను నుంచి మొదలు పెట్టి మానవులకు సంక్రమిస్తున్నాయి. వాటికి చికిత్స విధానం ఉందో లేదో తెలియని స్థితి. పోనీ రాకుండా నివారించేలా ఏం చేయాలో ఎలా సంక్రమించకుండా చెయ్యాలనేది కూడా చిక్కు ప్రశ్నే. అలాంటి మరో వింత వ్యాధి అగ్రరాజ్యాన్ని ఓ కుదుపు కుదుపేస్తుంది. అక్కడ ఏటా వందలాది జంతువులు ఈ వ్యాధి బారినపడటంతో ఎక్కడ మానవులకు సంక్రమిస్తుందో అని భయాందోళన చెందుతున్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ ఏంటా వ్యాధి? మానువులకు సంక్రమించే అవకాశం ఉందా? అగ్రరాజ్యం అమెరికాలో 'జాంబీ డీర్ వ్యాధి' కలకలం సృష్టిస్తోంది. అక్కడ వందలాది జంతువులు ఈ వ్యాధి బారిన పడి మరణిస్తున్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లోని జంతువుల్లో తొలిసారిగా ఈ వ్యాధిని కనుగొన్నారు. ఆ తర్వాత నుంచి వందల కొద్ది జంతువులు ఈ వ్యాధి బారినే పడటం శాస్త్రవేత్తలను ఒకింత భయాందోళనలకు గురి చేసింది. ఈ వ్యాధి ప్రముఖంగా ఉత్తర అమెరికా, కెనడా, నార్వే, దక్షిణ కొరియా వంటి ప్రాంతాల్లోని జింక, లేళ్లు, దుప్పి వంటి జంతువుల్లో ప్రబలంగా ఉన్నట్లు తెలిపారు. దీని కారణంగా బద్ధకం, ఉన్నటుండి తూలిపోవడం, ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం వంటి నాడీ సంబంధిత లక్షణాలు బహిర్గతమవుతాయి. ప్రధానంగా జంతువులకే సంక్రమించినప్పటికీ అది చివరికి మానవులకు కూడా సంక్రమించే ప్రమాదం లేకపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ 'జాంబీ డీర్ డిసీజ్'ని వైద్య పరిభాషలో (క్రానిక్ వేస్టింగ్ డిసీజ్(సీడబ్ల్యూడీ) అంటారు. అంటే ప్రోటీన్ ముడతల్లో తేడాలతో వచ్చే అరుదైన వ్యాధి. దీన్ని చాలా నెమ్మదిగా చుట్టుముట్టే ప్రమాదకర వ్యాధిగా నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు మానవులకు సోకిన దాఖలాలు లేకపోయినా భవిష్యత్తులో మానవులకు సంక్రమించదన్న గ్యారంటీ లేదని ఎపిడెమియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు బ్రిటన్‌లో వచ్చిన 'మ్యాడ్ కౌ వ్యాధి(పిచ్చి ఆవు వ్యాధి)' గుర్తు చేసుకున్నారు. వందలకొద్ది ఆవులను వధించడంతో వచ్చిన పిచ్చి ఆవు వ్యాధి ఎలా మానువులకు సంక్రమించిందో ఉదహరిస్తూ వార్నింగ్ ఇస్తున్నారు నిపుణులు. It starts. You watch: be walking down the street one day, happy about how things are finally going right, and CHOMP!! zombie deer bites ya in the ass. pic.twitter.com/HOgQuQ5lEp — Ryan (@Ryno_Charger) December 24, 2023 ఈ మేరకు సీడబ్ల్యూడీ పరిశోధకుడు డాక్టర్ కోరి ఆండర్సన్ మాట్లాడుతూ..మానువులకు వస్తుందా? రాదా? అని నిర్థారించి చెప్పకలేకపోయినప్పటికీ.. సంసిద్ధగా ఉండటం మాత్రం ముఖ్యమని నొక్కిచెప్పారు. ఇది ఒక ప్రాంతంలో విజృంభిస్తే..పూర్తి స్థాయిలో తొలగించడం అసాధ్యం అని అన్నారు. ఇది ఆయా భూభాగంలోని మట్టి లేదా ఉపరితలాల్లో ఏళ్లుగా ఆ వ్యాధి కొనసాగుతుందని చెబుతున్నారు. ఇది ఒక రకమైన ప్రోటీయోపతి లేదా నిర్మాణపరంగా అసాధారణమైన ప్రోటీన్ల వ్యాధి. Scientists confirm this is the best approach to combating the zombie deer disease pic.twitter.com/HmQKCF8STO — Hot White Hennessy (@Phillystunna221) December 25, 2023 ఇది సోకిన జంతువులు గానీ మనుషులు గానీ చనిపోతే అక్కడ భూమిలోనే డికంపోజ్ అయితే అలానే ఆ వ్యాధి తాలుకా గ్రాహకాలు ఉండిపోతాయి. దీంతో కొన్నేళ్ల పాటు ఆయా ప్రాంతాల్లో ఆ వ్యాధి కొనసాగుతుంది. ఎలాంటి క్రిమి సంహరకాలు, ఫార్మాల్డిహైడ్, రేడియేషన్ల, అధిక ఉష్ణోగ్రతలకు ఆ వ్యాధి లొంగదని మరింతగా నిరోధకతను చూపిస్తుందని అన్నారు. ఈ విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) 1997 నుంచే సీడబ్ల్యూడీకి సంబంధించిన వ్యాధులు మానవులకు సంక్రమించకుండా నిరోధించే ప్రాముఖ్యత గూర్చి నొక్కి చెబుతుండటం గమనార్హం. Damn, Rudolph caught the zombie deer disease 💀 pic.twitter.com/vdEZr9aHyh — Creepy.org (@CreepyOrg) December 25, 2023 (చదవండి: అనుకోని ప్రమాదంలో చిద్రమైన వ్యక్తి ముఖాన్ని పునర్నిర్మించిన శాస్త్రవేత్తలు!) -
ఓవైపు ఎండల మంటలు.. మరోవైపు మసూచి.. ఒక్క ఊళ్లోనే 100 మందికి
పాట్నా: వడగాల్పులు ఉత్తరాదిని వణికిస్తుండగా.. ప్రస్తుతం మరో సమస్య వచ్చి పడింది. తీవ్రమైన ఎండలతో ఉత్తరప్రదేశ్, బిహార్‌లో రోజురోజుకూ పెరిగిపోతున్న వడదెబ్బ బాధితులకు తోడు స్మాల్ ఫాక్స్(మసూచి) బారిన పడిన వారి సంఖ్య అంతకంతకూ హెచ్చవుతోంది. బిహార్‌లో ఓ గ్రామంలో దాదాపుగా సగం జనాభాకు ఈ వ్యాధి సోకడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. సాపౌల్ జిల్లాలోని త్రివేణిగంజ్ గ్రామంలో 100 మందికి స్మాల్ ఫాక్స్ సోకింది. కేవలం 35 కుటుంబాల నుంచే ఇంత మంది బాధితులు ఉండటం గమనార్హం. అయితే.. గత మూడు నెలల నుంచి వ్యాధి ప్రబలుతున్నప్పటికీ ఇప్పటి వరకు వైద్య అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు. వ్యాధి వ్యాపించిన తొలినాళ్లలోనే ఫిర్యాదు చేసినప్పటికీ తమ విన్నపాలను పెడచెవిన పెట్టారని చెబుతున్నారు. తమకు తెలిసిన వైద్యాన్ని చేస్తున్నట్లు చెప్పారు. కొందరు ప్రైవేట్ ఆస్పత్రులకు వెలుతున్నట్లు పేర్కొన్నారు. తాజాగా మంగళవారం ఆ గ్రామాన్ని వైద్య అధికారులు పరిశీలించారు. రోగులను గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తమకు విషయం తెలియగానే ఆ గ్రామాన్ని సందర్శించామని జిల్లా వైద్య అధికారి మిహిర్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నందున స్మాల్ ఫాక్స్ సోకడానికి అనువైన వాతావరణం ఏర్పడిందని చెప్పారు. వేసవి తీవ్రత తగ్గేవరకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదీ చదవండి: Video: గురుగ్రామ్‌లో కుండపోత వర్షం.. నీట మునిగిన వాహనాలు.. 5 కి.మీ మేర ట్రాఫిక్ -
రోడ్లపై నోట్లు ఇలా చల్లుతున్నాడేంటి?
-
గన్ షాట్ : ఏపీ కంపెనీలపై ఎల్లో మీడియా విషం కక్కుతుందా ..!
-
Vaikuntha Ekadashi: ఉత్తర ద్వార దర్శనం లేదు
సాక్షి, నల్లకుంట (హైదరాబాద్): ఈ నెల 13న (గురువారం) ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు ముక్కోటి ఏకాదశి రోజున న్యూ నల్లకుంటలోని సీతారామాంజనేయ సరస్వతీదేవి ఆలయంలో ఉత్తరద్వార దర్శనం ఉండదని ఆలయ ఈవో శ్రీధర్ తెలిపారు. స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు చేయించాలనుకునే భక్తులు ఆలయ గుమస్తా వద్ద టికెట్టు తీసుకుంటే వారు భక్తుల గోత్ర నామాలపై పూజలు నిర్వహిస్తారని ఈవో తెలిపారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆలయాల్లో తీర్థ, ప్రసాద వితరణ కూడా నిషేధమని చెప్పారు. అలాగే ఆలయ ప్రాంగణంలో భక్తులు కూర్చోవడానికి కూడా అనుమతి లేదని తెలిపారు. వైరస్ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలకు భక్తులు సహకరించాలని సూచించారు. భక్తులకు అనుమతి లేదు.. జగద్గిరిగుట్ట: రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో జగద్గిరిగుట్టలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 13న వైకుంఠ ఏకాదశి, 14న గోదాదేవి కల్యాణం నేపథ్యంలో భక్తులకు దర్శనములు నిలుపుదల చేసినట్లు ఆలయ ఈవో ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ ఆదేశానుసారం శాస్త్రోయుక్తంగా కేవలం వేద పండితులు, సిబ్బంది సమక్షంలో అంతరంగికంగా వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. చదవండి: కరోనా థర్డ్ వేవ్.. వైరస్ పడగలో వీఐపీలు -
కరోనా బీభత్సం.. 1.59 లక్షలు దాటిన కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోంది. కరోనా థర్డ్‌వేవ్ మరింత వేగంగా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటలలో 1,59,632 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో మహమ్మారి బారిన పడి 327 మంది మృతి చెందారు. అదే విధంగా, 40,863 మంది కోలుకున్నారు. ప్రస్తుతం కోవిడ్ పాజిటీవిటీ రేటు 10.21 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 5,90,611 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ను విడుదల చేసింది. ఇక మరోవైపు ఒమిక్రాన్ కూడా బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే 27 రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,623 కు పెరిగింది. ప్రస్తుతం అత్యధికంగా మహరాష్ట్రలో 1,009 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అదే విధంగా 1,490 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ను విడుదల చేసింది. చదవండి: రైల్వేస్టేషన్లలో అదనపు బాదుడుకు ప్లాన్! రైలెక్కినా దిగినా రూ.10 నుంచి 50? -
థర్డ్‌వేవ్ వచ్చేసినట్లే.. హెల్త్ మినిస్టర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): ప్రజలు ఏదైతే జరగకూడదని కోరుకున్నారో అదే జరుగుతోంది. ఆరోగ్యమంత్రి మాటలే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటును గమనిస్తే థర్డ్ వేవ్ వచ్చినట్లు ఖరారైందని ఆరోగ్య శాఖ మంత్రి కే.సుధాకర్ అన్నారు. గత ఆరు నెలల నుంచి పాజిటివ్ రేటు 0.1 శాతం కూడా లేదని, ప్రస్తుతం 1.06 శాతానికి పెరిగిందని, అంటే మూడో దశ ఆరంభమైనట్లు అర్థమని తెలిపారు. మంగళవారం బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒమిక్రాన్ రోజు రోజుకు పెరుగుతోంది, సోమవారం ఒకే రోజు 1.06 శాతానికి చేరింది, బెంగళూరులో అధికంగా సోకితులు ఉన్నారని చెప్పారు. బెంగళూరులో మైక్రో కంటైన్మెంట్లు? బెంగళూరులో కేసులు వచ్చినచోట మైక్రో కంటోన్మెంట్ జోన్ చేయడంపై సీఎంతో చర్చించనున్నట్లు తెలిపారు. బెంగళూరు ఇప్పటికే రెడ్ జోన్లో ఉండగా, కొన్ని కఠిన నిర్ణయాలు అవసరమన్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజల బతుకులను యథాస్థితికి తెచ్చేలా కరోనాను నియంత్రించడం పెద్ద సవాల్‌గా మారిందని వాపోయారు. బెంగళూరుకు అధికంగా విదేశీయులు వస్తున్నారు. అందుచేత వైరస్ అతి వేగంగా విస్తరిస్తోందన్నారు. జనవరి 15 తరువాత మూడో అల రావచ్చని అనుకుంటే అంతకంటే ముందుగానే వచ్చేసిందని మంత్రి అన్నారు. కాంగ్రెస్‌నేతలు మేకెదాటు పాదయాత్రను విరమించుకోవాలని కోరారు. -
ఒమిక్రాన్ ఎఫెక్ట్: నుమాయిష్ మూసివేత
సాక్షి, అబిడ్స్ (హైదరాబాద్): కరోనా కారణంగా ఎగ్జిబిషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. జనవరి 1వ తేదీన గవర్నర్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించగా ఆదివారం రాత్రి పోలీస్ శాఖ అధికారుల ఆదేశాలతో ఎగ్జిబిషన్ సొసైటీ ఈ నెల 10వ తేదీ వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు స్టాళ్ల యజమానులకు తెలిపారు. దేశం నలుమూలలా కరోనా నిబంధనలు పాటించాలని, గుంపులు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎగ్జిబిషన్‌కు బ్రేక్ పడింది. 2021వ సంవత్సరం కూడా ఎగ్జిబిషన్‌ను కరోనా నిబంధనలతో పూర్తిగా మూసివేశారు. కొన్నిరోజులుగా నగరంతో పాటు రాష్ట్ర నలుమూలలా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందళన మొదలైంది. -
Omicron: ‘నాన్ రిస్క్’ నుంచే రిస్క్!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వ్యూహంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విమానాశ్రయాల్లో కేవలం రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఎక్కువగా దృష్టి పెట్టి పరీక్షలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో నమోదైన మూడు ఒమిక్రాన్ కేసులూ నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవే కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రయాణికుల విషయంలో తీసుకోవల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేసింది. రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు చేయాలని, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 2 శాతం మందికి ర్యాండమ్‌గా పరీక్షలు చేయాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల ఒకటో తేదీ నుంచి ఆ మార్గదర్శకాలను అనుసరిస్తున్నాయి. 11 దేశాలను రిస్క్ కేటగిరీ కింద గుర్తించారు. ఇందులో జర్మనీ, ఫ్రాన్స్, కెనడాతో పాటు యూఎస్, యూకే తదితర దేశాలున్నాయి. ఆయా దేశాల నుంచి వచ్చిన అందరు ప్రయాణికులకు, అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి ర్యాండమ్‌గా శంషాబాద్ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రిస్క్ దేశాల నుంచి వచ్చి పాజిటివ్‌గా తేలిన వారి నమూనాల్లో ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు జీనోమ్ స్వీక్వెన్సింగ్‌కు పంపిస్తున్నారు. వారిని విమానాశ్రయం నుంచి నేరుగా టిమ్స్‌కు తరలిస్తున్నారు. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారి నుంచి (2 శాతం) కేవలం నమూనాలు సేకరించి ఆర్టీపీసీఆర్ ఫలితం రాకముందే పంపేస్తున్నారు. ఇలా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 7,018 మందికి కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరిలో నాన్ రిస్క్ దేశాలకు చెందిన వారు 1,622 మంది ఉన్నారు. ఈ విధంగా నిర్దేశించిన 2 శాతం కంటే ఎక్కువగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పరీక్షలు చేసింది. ఈ క్రమంలోనే తొలిసారిగా 3 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. అందరినీ పరీక్షించాలి రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రిస్క్, నాన్ రిస్క్ దేశాలనే దానితో సంబంధం లేకుండా విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడిపైనా దృష్టిపెట్టి పరీక్షలు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా నమోదైన మూడు కేసులు జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయని అంటున్నారు. అలాగే ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహిస్తున్న వారిని ఆర్టీపీసీఆర్ ఫలితం వచ్చేవరకు ఆపకుండా పంపించేయడం కూడా సమంజసం కాదని పేర్కొంటున్నారు. ఇలా పంపించేయ డం వైరస్ వ్యాప్తికి అవకాశం ఇచ్చినట్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో బయట పడిన 3 కేసులు ఇందుకు నిదర్శనమని అంటున్నారు. చదవండి: శిక్షణలో ఉన్న యువతిపై ఇంజినీర్ల అసభ్య ప్రవర్తన -
Mumbai: 23 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు కరోనా
ముంబై: కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్నిచర్యలు తీసుకున్న ప్రజల అజాగ్రత్త వలన కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా, ముంబైలోని కేఈఎం మెడికల్ కాలేజ్‌లో కరోన కేసులు బయటపడ్డాయి. కాగా, 23 మంది ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు కరోనా సోకినట్లు కళాశాల డీన్ డాక్టర హేమంత్ దేశ్‌ముఖ్ తెలిపారు. 29 మంది విద్యార్థులలో 23 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. అయితే, వారందరికి లక్షణాలు పెద్దగా లేవని వైద్యులు తెలిపారు. మెడికల్ కాలేజ్‌లో ఇటీవల నిర్వహించిన ఒక సాంస్కృతిక కార్యక్రమం వలన వైరస్ వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం.. 29 మంది విద్యార్థులలో 27 మంది విద్యార్థులు రెండు డోసుల వ్యాక్సిన్‌ను వేయించుకున్నారని డీన్ తెలిపారు. వారిలో ఇద్దరు విద్యార్థులు మాత్రం ముంబై లోని సెవన్ హిల్స్ ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతంవారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. దీనిపై మేయర్ కిషోరి ఫడ్నేకర్ స్పందించారు. ప్రస్తుతం.. ఎంబీబీఎస్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. చదవండి: Navjot Singh Sidhu: సిద్ధూ ఆప్‌లో చేరబోతున్నాడా? -
విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నాపత్రాలు.. వీసీ సీరియస్
సాక్షి, శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్): శాతవాహనయూనివర్సిటీ డిగ్రీ పరీక్షల 6వ సెమిస్టర్ ప్రశ్నాపత్రం ఓ ప్రయివేటు కళాశాలకు చెందిన విద్యార్థుల వాట్సాప్‌గ్రూపులో చక్కర్లు కొట్టడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని వీసీ మల్లేశ్ సీరియస్‌గా తీసుకున్నారు. డిగ్రీ మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలకు కోవిడ్ కారణంగా సెల్ఫ్సెంటర్లు ఏర్పాటుచేశారు. దీని కారణంగా కొన్ని ప్రయివేటు కళాశాలల్లో విచ్చలవిడిగా మాస్ కాపీయింగ్ జరిగిందని గుర్తించిన వీసీ 12వ తేదీ నుంచి జరుగుతున్న 4, 6వ సెమిస్టర్లకు జంబ్లింగ్ విధానం అమలు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తుండగా.. మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులను పట్టుకొని కేసు నమోదుచేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల సెల్ఫోన్లలో ప్రశ్నాపత్రం ప్రత్యక్షం కావడాన్ని వీసీ సీరియస్‌గా తీసుకున్నారు. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. రెండు, మూడు రోజుల్లో నివేదిక ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై శాతవాహన వీసీ మల్లేశ్ నలుగురితో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదే శించారు. గురువారం కమిటీ తన పనిని ప్రారంభించగా.. శనివారం దీనిపై ప్రత్యేకసమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహా రంలో కొన్ని ప్రముఖ కళాశాలలకు చెందిన వారి హ స్తం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటి నుంచి లీకవుతున్నాయి.. ఎస్సారార్ కళాశాల కేంద్రంలో పరీక్ష రాస్తున్న నగరానికి చెందిన ఓ ప్రయివేటు డిగ్రీ కళాశాల విద్యార్థులకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నాపత్రం రావడం, అప్పుడే వర్సిటీ అధికారులకు సమాచారం చేరడంతో విషయం బయటకు పొక్కింది. కానీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం కొన్ని రోజుల నుంచే జరుగుతోందని చర్చ జరుగుతోంది. కొంతమంది విద్యార్థులు పేపర్ లీక్ విషయం కొత్తేమి కాదని బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. బుధవారం పలువురు విద్యార్థుల సెల్ఫోన్లలో ప్రత్యక్షమైన ప్రశ్నాపత్రం వర్సిటీవ్యాప్తంగా వెళ్లి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ నిఘా శాతవాహనలో ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై పోలీసులు నిఘా పెట్టినట్లు తెలిసింది. వర్సిటీ వేసిన ప్రత్యేక కమిటీతో నిజం తేలిన తర్వాత బాధ్యులపై చర్యలకు యూనివర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారని చర్చజరుగుతోంది. ప్రశ్నాపత్రాలు లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వీసీ వర్సిటీలో గురువారం జరిగిన ఒక సమావేశంలో పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యేవరకు సీజ్చేసిన తొమ్మిదిసెల్ఫోన్లు ఇవ్వమని వీసీ స్పష్టం చేశారు. -
World Mosquito Day: ఫీవర్ సర్వేలో.. డెంగీ కలకలం..
కరీంనగర్‌లోని హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన రమాదేవికి ఈనెల 13న జ్వరం వచ్చింది. మొదటి కోవిడ్‌గా అనుమానించి నిర్ధారణ పరీక్ష చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. జ్వరం తీవ్రంగా ఉండడంతో కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. రక్త పరీక్షలు చేయగా సీజనల్‌గా వచ్చే వైరల్ ఫీవర్‌గా నిర్ధారణ అయింది. దోమ కాటు వల్ల వచ్చిన జ్వరంతో నాలుగు రోజులపాటు ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకోగా.. రూ.10 వేల వరకు ఖర్చఅయింది. హైరిస్క్ ప్రాంతాలు.. నగరంలోని ఖాన్‌పురా, రాంనగర్, కార్ఖానగడ్డ, మార్కండేయనగర్, వావిలాలపల్లి, కట్టరాంపూర్తో పాటు దుర్శేడ్, అన్నారం, ఇందుర్తి, వెలిచాల, గర్శకుర్తి, గద్దపాక, జోగినపల్లి గ్రామాలను సీజనల్ వ్యాధులు సంభవించే హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించారు. జిల్లాలో 11 డెంగీ కేసులు నమోదు కాగా, జిల్లా కేంద్రంలోని రాంనగర్‌కు చెందిన వంగల హన్మండ్లు(60) డెంగీతో జూన్ 30న మృతి చెందారు. మరో 10 డెంగీ కేసుల్లో కరీంనగర్లో 6, గ్రామాల్లో 4 కేసులు గుర్తించారు. సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో విషజ్వరాలు క్రమంగా విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రాణాంతక డెంగీ, మలేరియా కేసులు నమోదుకావడం కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకూ జిల్లాలో మొత్తం 11 కేసులు డెంగీ కేసులు నిర్ధారణ కాగా.. ఒకరు మరణించడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ రెండు విషజ్వరాలతో చిన్న జ్వరం వచ్చినా జనాలు ప్రైవేటు ఆసుపత్రికి పరుగులు పెడుతున్నారు. అక్కడ సాధారణ జ్వరానికి కూడా డెంగీ బూచిచూపి మరోవైపు టెస్టుల పేరుతో వారు దోపిడీకి తెరలేపుతున్నారు. మొత్తానికి చిన్న జ్వరం వచ్చినా.. జనాలు వణికిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలో కరీంనగర్ జిల్లా చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విషజ్వరాలకు ప్రధాన కారణం పారిశుద్ధ్య లోపం, దోమల స్వైరవిహారం. జిల్లాల్లో ఇప్పటికీ పలు మారుమూల గ్రామాల్లో ఓపెన్ డ్రైనేజీ, మురికి కుంటలు, పందుల స్వైర విహారం వల్ల దోమల సంతతి పెరుగుతోంది. దీనికితోడు ఇటీవలి వర్షాలతో కుంటలు నిండి దోమల అమాంతం పెరిగాయి. వాస్తవానికి జిల్లాల్లో దోమల సమస్య ఈనాటిది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సమయంలోనూ కరీంనగర్ జిల్లా డెంగీ కేసుల్లో ముందున్న విషయం తెలిసిందే. కరోనా తరువాత ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో చాలా మార్పులు వచ్చాయి. పదే పదే శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవడం, శుభ్రమైన తాగునీరు తీసుకోవడం, భౌతిక దూరం పాటించడం, జనసంచారం మీద ఆంక్షలతో డయేరియా, జ్వరాలు, చర్మవ్యాధులు గణనీయంగా తగ్గడం గమనార్హం. నెమ్మదిగా సెకండ్ వేవ్ నుంచి నెమ్మదిగా బయటపడుతున్న వేళ విషజ్వరాలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. శుక్రవారం(ఆగస్టు 20) ‘ప్రపంచ మస్కిటో దినోత్సవం’ సందర్భంగా దోమల వల్ల కలుగుతున్న ప్రాణాంతక జ్వరాలు, వాటి వెనక ఉన్న కారణాలను ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. పెరిగిన ఓపీ..! సీజనల్ వ్యాధుల వల్ల వచ్చే జ్వరాలతో ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు నిండిపోతున్నాయి. వారం రోజులుగా జ్వరబాధితుల కేసులు ఎక్కువగా పెరిగిపోయాయి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ఓపీలకు వ్యాధిగ్రస్తులు క్యూ కడుతున్నారు. కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న సమయంలో ప్రతిరోజూ 150 మించి ఉండని ఓపీ సేవలు ప్రస్తుతం 300 వరకు ఓపీ పెరిగింది. జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు ప్రైవేటు ఆసుపత్రులలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే.. ఇందులో ఏది డెంగీ, మలేరియా అన్న ఆందోళనతో జనాలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. కానరాని వైద్య శిబిరాలు.. జ్వర పీడితులు పెరుగుతున్న పట్టణంలోని స్లమ్ ఏరియాల్లో, గ్రామాల్లో జ్వరాలు విజృంభిస్తున్న సమయంలో వైద్య శిభిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు చేయాల్సి ఉండగా, ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇక పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్లు సమయపాలన పాటించడం లేదు. వ్యాక్సినేషన్, కోవిడ్ నిర్ధారణ పరీక్షల పేరుతో వైద్య సేవలను మరిచినట్లు తెలుస్తోంది. కొంత మంది మధ్యాహ్నం లోపే విధులకు డుమ్మాకొట్టి వెళ్తుండగా, మరికొంత మంది వివిధ కారణాల చూపుతూ ఆరోగ్య కేంద్రాల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కొంత మంది వైద్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఫీవర్ సర్వేతో వెలుగుచూస్తున్న వ్యాధులు.. జిల్లాలో ఇప్పటికే కోవిడ్‌తో చాలా మంది ఇబ్బందులు పడుతుండగా తాజాగా.. జిల్లా వ్యాప్తంగా సాధారణ వ్యాధులు పెరుగుతూ మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న ఫీవర్‌సర్వేలో సీజనల్ జ్వరాలు బయటపడుతున్నాయి. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తుండడంతో వ్యాధుల తీవ్రత తెలుస్తోంది. గడిచిన 8 నెలల్లో కరీంనగర్ జిల్లాలో 11 డెంగీ కేసులు బయటపడ్డాయి. ఒకరు డెంగీ మరణించడం కలకలం రేపుతోంది. ఈ కేసులు ఎక్కువగా పట్టణాల పరిధిలోనే నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మలేరియా కేసులు ఈ యేడాది కేవలం 2 మాత్రమే నమోదయ్యాయి. డెంగీ, మలేరియా ఎక్కువగా వచ్చిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అధికారులు దోమల నివారణ చర్యలు చేపట్టడంలో తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
Covid Fourth Wave: ఫ్రాన్స్‌లో కఠిన ఆంక్షలు..
పారిస్: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక దేశాలు కొవిడ్ సెకండ్‌వేవ్, థర్డ్వేవ్ల బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయితే.. వైరస్ ఉధృతిమాత్రం ఇంకా పూర్తిగా తగ్గలేదు. తాజాగా, ఫ్రాన్స్‌లో వైరస్ నాలుగవ దశ ప్రారంభమైందని ఆదేశ ప్రభుత్వ ప్రతినిధి గాబ్రియేల్ అట్టల్ ప్రకటించారు. ఈ మహమ్మారి మెరుపు వేగంతో వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే, మరోసారి తమ దేశంలో కఠినమైన ఆంక్షలను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఫ్రాన్స్‌లో సాంస్కృతిక వేదికలు, ఉద్యానవనాలు, స్విమ్మింగ్ పూల్స్ సందర్శించాలనుకునే వారు తప్పకుండా కోవిడ్ టీకా వేసుకున్నట్లు ధృవీకరణ పత్రం సమర్పించాలని తెలిపారు. అదే విధంగా, కరోనా నెగెటివ్ రిపోర్టు కూడా నివేదించాలని అట్టల్ పేర్కొన్నారు. టీకాలను ప్రజలందరు వేసుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధలను ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. ఆగస్టు ఆరంభం నుంచి, రెస్టారెంట్లు, బార్లలో ప్రవేశించడానికి, రైళ్లలో ప్రయాణించడానికి హెల్త్‌పాస్ ను తప్పినిసరిచేస్తున్నట్లు తెలిపారు. టీకా వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే హెల్త్‌పాస్‌ను జారీచేస్తారని ప్రధాని జీన్ కాస్టెక్స్ తెలిపారు. ఈ సందర్భంగా, టీకావేగాన్ని పెంచాలని.. రెండు వారాల్లో ఐదు మిలియన్ల వ్యాక్సిన్ అందుబాటులో ఉంచనున్నామని అధికారులకు ఆదేశించారు. అదే విధంగా, హెల్త్‌పాస్ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానతోపాటు జైలు శిక్షను కూడా విధిస్తామని జీన్ కాస్టెక్స్ హెచ్చరించారు. ఫ్రాన్స్‌లో మంగళవారానికి గాను 18,000 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. -
దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ రెండో మరణం నమోదు
భోపాల్: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. ఈ మహమ్మారి రోజురోజుకి తన రూపాన్ని మార్చుకుంటూ వ్యాప్తి చేందుతుంది. అయితే, ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా, ఇదే రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా రెండో మరణం సంభవించిందని వైద్యశాఖ అధికారులు ప్రకటించారు. కాగా, గడిచిన వారంలో 6 డెల్టా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మధ్య ప్రదేశ్ నుంచి 1,219 నమునాలను సేకరించి జీనోమ్ సీక్వేన్సింగ్ కోసం నేషనల్ సెంటర్ ఆఫ్ డిసిజ్ కంట్రోల్(ఎన్సీడీసీ)కు పంపించారు. అయితే, దీనిలో 31 శాతం నమునాలు ఆందోళనకరంగా ఉన్నట్లు ఎన్సీడీసీ తెలిపింది. మధ్యప్రదేశ్‌లో నమోదైన 6 డెల్డా వేరియంట్ కేసులలో భూపాల్‌లో 2 కేసులు, ఉజ్జయినిలో 2 కేసులు, శివపూరి సమీపంలోని రైసన్, అశోక్‌నగర్‌ల నుంచి ఒక్కో డెల్టా వేరియంట్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మన దేశంలో ఇప్పటి వరకు, 318 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయట పడ్డాయి. అదే విధంగా, యూకేలోని లండన్‌లో ఆల్ఫా వైరస్ రకానికి చెందిన 56 కేసులు నమోదయ్యాయి. చదవండి: దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం నమోదు -
కరోనా టెర్రర్ : ఆ జిల్లాలో ఒక్కరోజే 304 మందికి కరోనా పాజిటివ్..
సాక్షి, నెట్వర్క్ (నల్లగొండ): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. సోమవారం ఒక్కరోజే 304మంది మహమ్మారి బారిన పడినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. ఆయా మండలాల పరిధిలో నమోదైన కేసుల వివరాలు.. భూదాన్‌పోచంపల్లి మండలంలో 9మందికి, జాజిరెడ్డిగూడెం మండలంలో ముగ్గురికి, కట్టంగూర్‌లో ఆరుగురికి, త్రిపురారం మండలంలో ఐదుగురికి, వలిగొండ మండలంలో 20మందికి, మిర్యాలగూడలో 34మందికి, గుండాల మండలంలో 9మందికి, తిరుమలగిరిలో ఐదుగురికి, చౌటుప్పల్‌లో 17మందికి, భువనగిరిలో 15మందికి, అడవిదేవులపల్లిలో 8మందికి, దేవరకొండలో ఆరుగురికి, కేతేపల్లిలో 9మందికి, ఆలేరులో ఆరుగురికి, యాదగిరిగుట్ట మండలంలో ముగ్గురికి, చిట్యాల మండలంలో నలుగురికి, నడిగూడెం మండలంలో ఒకరికి, శాలిగౌరారం మండలంలో 18మందికి, మోత్కూరులో 9మందికి, నాగార్జునసాగర్‌లో 19మందికి, డిండిలో 11మందికి, రాజాపేటలో నలుగురికి, మోతెలో 10, తుంగతుర్తిలో 8మందికి, బొమ్మలరామారం మండలంలో ఆరుగురికి, నకిరేకల్‌లో 35మందికి, సంస్థాన్‌నారాయణపురంలో ఇద్దరికి, నాంపల్లి మండలంలో నలుగురికి, అడ్డగూడూరులో ఒకరికి, మునుగోడులో 17మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కరోనాతో నలుగురి మృతి అర్వపల్లి: కరోనా మహమ్మారి సోకిన నలుగురు మృతిచెందారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. జాజారెడ్డిగూడెం మండలం కాసర్లపహాడ్ గ్రామంలో కరోనాతో 55 ఏళ్ల వృద్ధురాలు సోమవారం మృతిచెందింది. ఆమె అంతిమ సంస్కారాన్ని స్వేరో సంస్థ ఆధ్వర్యంలో టీజీపీఏ రాష్ట్ర కార్యదర్శి మచ్చ నర్సయ్యతో పాటు మరి కొందరు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ దబ్బేటి జ్యోతిరాణి, డాక్టర్ రాజేష్, సుజాత, ఎల్లమ్మ, సైదులు, శ్రీనివాస్, భిక్షం పాల్గొన్నారు. తిరుమలగిరిలో ఒకరు.. తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మూల రాంరెడ్డి (73)కి ఇటీవల వైరస్ సోకింది. కుటుంబ సభ్యులు అతడిని సికింద్రాబాద్‌లో గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. సోమవారం స్వగ్రామంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. నాగారంలో వృద్ధుడు.. మండల కేంద్రానికి చెందిన తజ్జం కృష్ణమూర్తి(59) మూత్రపిండాల వ్యా«ధితో బాధపడు తూ వారంరోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లాడు. రెండురోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా సోకినట్లుగా నిర్ధారించారు. కృష్ణమూర్తి అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. నకిరేకల్‌లో ఆర్ఎంపీ.. మండలంలోని నోముల గ్రామానికి చెందిన ఆర్ఎంపీ బుడిదపాటి రామిరెడ్డి(57)కి ఐదు రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంటి వద్దే ఉంటూ చికిత్స పొందుతున్నాడు. ఆదివారం ఉదయం అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతిచెందాడు. రామిరెడ్డి మతదేహాన్ని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ సందర్శించి సంతాపం తెలిపి నివాళులర్పించారు. సంతాపం తెలిపిన వారిలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాస కర్ణాకర్‌రెడ్డి, సామ రవీందర్, రాచకొండ లింగయ్య, వెంకట్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. చదవండి: పోస్ట్ కోవిడ్‌లో కొత్తరకం సమస్య.. ‘వైరల్ ఆర్థ్రాల్జియా’ -
Corona Virus: పల్లెల్లోనూ పాగా ..లక్షణాలున్నవారు లక్షల్లోనే..
సాక్షి, నెట్వర్క్ : మొదటి దశలో చాలావరకు నగరాలు, పట్టణాలకు పరిమితమైన కరోనా, సెకండ్ వేవ్‌లో పల్లెలపై ప్రతాపం చూపిస్తోంది. మొదటి దశలో గ్రామాల్లో తీసుకున్న కట్టుదిట్టమైన జాగ్రత్త చర్యలు కొంత సత్ఫలితాలనిచ్చాయి. అదేవిధంగా గ్రామీణుల రోగ నిరోధక శక్తీ వైరస్ సోకకుండా నిలువరించిందని నిపుణులు భావించారు. అయితే ప్రస్తుతం సెకండ్ వేవ్ విజృంభణతో పల్లెలు విలవిల్లాడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ నిర్ధారణ (పాజిటివిటీ) రేటు పట్టణాలతో సమానంగా ఉండగా.. జ్వరం, దగ్గు, జలుబు లాంటి కరోనా అనుమానిత లక్షణాలున్న వారి సంఖ్య పల్లెల్లో ఎక్కువగా ఉన్నట్టు ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో తేలింది. ఈ మేరకు సాక్షి ప్రతినిధులు జిల్లాలవారీగా ఇంటింటి సర్వేలో పాల్గొన్న సిబ్బందితో మాట్లాడి.. వివరాలు సేకరించారు. ప్రభుత్వం చేస్తున్న సర్వే లెక్కలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సరిహద్దు జిల్లాలపై పంజా గతంలో మాదిరి కాకుండా ఈసారి నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సరిహద్దుల్లో కంచెలు వేయక పోవడం, రాకపోకలు నియంత్రించక పోవడం వంటి అజాగ్రత్తలు గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనా పలు రకాలుగా రూపాంతరం చెందడం కూడా పల్లెల్లో వైరస్ వేగంగా విస్తరించడానికి కారణమై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దుల్లోని జిల్లాల్లో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వైరస్ నిర్ధా రణ అయిన వారితో పోలిస్తే, కరోనా లక్షణాలున్న వారు దాదాపు ఐదింతలు (పల్లెలు, పట్టణాల్లో కలిపి) ఎక్కువగా ఉన్నారని గణాంకాలు వెల్లడిస్తు న్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కట్టడి చేయడం ద్వారానే ఈ మహమ్మారిని అరికట్టవచ్చనే ఉద్దేశంతోనే ఫీవర్ సర్వే చేపట్టారు. లక్షణాలు కనిపిస్తే చాలు చికిత్స ప్రారంభించాలన్న మార్గదర్శ కాలకు అనుగుణంగా ఈ సర్వే సాగుతోంది. లక్షణాలున్నాయని తేలిన వెంటనే వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచుతూ మందుల కిట్లు అందజేసే బాధ్యతను వైద్య, ఆరోగ్య శాఖ తీసుకుంటోంది. వరంగల్ జిల్లాలో.... వరంగల్ అర్బన్ జిల్లాలో 2,97,014 ఇళ్లలో ప్రభుత్వం సర్వే నిర్వహించగా 8,035 మంది జ్వర బాధితులుగా తేలారు. వరంగల్ రూరల్ జిల్లాలో 1,52,697 కుటుంబాలలోనే సర్వే నిర్వహిం చినప్పటికీ 8,126 మందికి కరోనా లక్షణాలు కనిపించడం గమనార్హం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,06,560 ఇళ్లకు గాను 3,443 మందికి, ములుగులో 84,318 ఇళ్లకు గాను 2,328, జనగామలో 1,61,287 ఇళ్లకు గాను 6,686, మహబూబాబాద్ జిల్లాలో 2,22,550 ఇళ్లకు గాను 4,732 మందికి జ్వరాలున్నట్టు నిర్ధారణ అయింది. వరంగల్ అర్బన్ జిల్లా రంగశాయిపేట, ఖిలా వరంగల్, పెద్దమ్మగడ్డ, దేశాయ్‌పేట, కీర్తినగర్ అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండగా, రూరల్ ప్రాంతంలోని కమలాపూర్, ఐనవోలు, కడిపికొండలో కూడా అధిక సంఖ్యలో లక్షణాలున్నవారు తేలారు. పాలమూరులో.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో జిల్లాలో 10,84,669 ఇళ్లకు గాను జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్న 25,467 మందికి మెడికల్ కిట్లు అందజేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధి కంగా 10,959 మందికి, నారాయణపేట జిల్లాలో అత్యల్పంగా 3,120 మందికి లక్షణాలు ఉన్నట్టు తేలింది. నాగర్ కర్నూలు జిల్లాలో 4,089, వనపర్తి జిల్లాలో 4,058, జోగులాంబ గద్వాల జిల్లాలో 3,241 మంది లక్షణాలతో బాధపడుతున్నారు. మహబూబ్‌నగర్ పట్టణంతోపాటు జడ్చర్ల, దేవరక ద్ర, గండీడ్, రాజాపూర్, అడ్డాకుల, మూసాపేటలో ఎక్కువగా కేసులు నమోదు కావడం గమనార్హం. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 15,637 మందికి జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలున్నాయని తేలింది. ఖమ్మం జిల్లాలో 4,57,504 ఇళ్లను వైద్య బృందాలు సందర్శించగా, అందులో 8,411 మందికి లక్షణాలున్నాయని తేలింది. జిల్లాలోని పెనుబల్లి మండలంలో అత్యధికంగా 1,290 మందికి లక్షణాలున్నట్టు గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10.91 లక్షల జనాభాకు గాను 3,02,918 ఇళ్లను వైద్య బృందాలు సందర్శించగా, అందులో 7,226 మందికి లక్షణాలున్నాయని గుర్తించారు. పాల్వంచ మున్సిపాలిటీలో అత్య ధికంగా 693 మందికి లక్షణాలు కనిపించాయి. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని 7.46 లక్షలకు పైగా ఇళ్లకు గాను 7,41,571 ఇళ్లలో సర్వే నిర్వహించగా, అందులో 27,613 మందికి జ్వర లక్షణాలను గుర్తించారు. గిరిజన ప్రాంతమైన ఆసిఫాబాద్ జిల్లాలో 9 వేల మందికి జ్వర లక్షణాలు గుర్తించారు. మంచిర్యాల జిల్లా పరిధిలో అత్యధికంగా లక్సెట్టిపేట అర్బన్ పీహెచ్సీలో 616 మందికి లక్షణాలు కనిపించాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 7,56,614 ఇళ్లలో సర్వే నిర్వహించగా, మొత్తం 27,857 మందికి కరోనా లక్షణాలున్నట్టు వైద్యాధికారులు గుర్తించారు. మెదక్ జిల్లాలో 7,453 మందికి , సంగారెడ్డి జిల్లాలో 9,786 మందికి, సిద్దిపేట జిల్లాలో 10,618 మందికి కరోనా లక్షణాలున్నట్టు తేలింది. కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 9,18,285 కుటుంబాల్లో సర్వే నిర్వహించారు. మొత్తం 23,335 మందికి కరోనా లక్షణాలున్నట్టు గుర్తించారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18,548 హోం ఐసోలేషన్‌లో ఉండగా, 1,805 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10,71,439 కుటుంబాలను సర్వే చేయగా 20,178 మంది జ్వరం, జలుబు సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించారు. నల్లగొండ జిల్లాలో 9,663 మందికి, సూర్యాపేట జిల్లాలో 4,260 మందికి, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6,255 మందికి లక్షణాలున్నా యని తేలింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం జనాభా 7.96 లక్షలు కాగా, 2,10,333 ఇళ్లల్లో సర్వే పూర్తయింది. 6,255 మందికి కోవిడ్ లక్షణాలు గుర్తించి కిట్లు అందజేశారు. నిజామాబాద్ జిల్లాలో... ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 12,873 మందికి జ్వర లక్షణాలున్నాయని తేలింది. ప్రస్తుత నిజామా బాద్ జిల్లాలో 4,07,589 ఇళ్లను సర్వే చేయగా, 8,1690 మందికి, కామారెడ్డిలో 2,57,863 ఇళ్లను సర్వే చేయగా 4,713 మందికి జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలు గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 317 ఆస్పత్రుల్లో 1,97,037 మందిని పరీక్షించగా 30,991 మందికి తీవ్ర జ్వరంతోపాటు కోవిడ్ సంబంధిత లక్షణాలున్నాయి. ఇంటింటి సర్వేలో 6,96,366 మందిని పరీక్షించగా 19,671 మందికి కోవిడ్ లక్షణాలున్నాయని తేలింది. లక్షణాలున్నవారు లక్షల్లోనే.. ఈ నెలలో చేపట్టిన ఇంటింటి సర్వేలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబా లను వైద్య బృందాలు సందర్శించాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 48 వేలకు పైగా కరోనా బాధితులుండగా, రాష్ట్ర వ్యాప్తంగా 2,36,982 మందికి కరోనా నిర్ధారణ కాకపోయినా జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు లాంటి కోవిడ్ లక్షణాలున్నాయని తేలింది. గత పదిహేను రోజులుగా జరుగుతున్న ఈ సర్వే ఓ కొలిక్కి వస్తోందని వైద్య అధికారులు చెబుతుండగా, ‘సాక్షి’ క్షేత్రస్థాయి నుంచి సేకరించిన లెక్కల ప్రకారం ప్రతి ఉమ్మడి జిల్లాలో సగటున 20 వేల మంది కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారని తేలింది. ఇలా సర్వే .. అలా ఆసరా రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 3 నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో, ఆ తర్వాత 3 రోజులకు అంటే 6 నుంచి మిగిలిన జిల్లాల్లో ఫీవర్ సర్వే ప్రారం భమయింది. ఈ సర్వేలో ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ సభ్యుల నుంచి ఇంట్లో ఎవరికయినా జ్వరమొచ్చిందా.. దగ్గు ఉందా? అని తెలుసు కుంటున్నారు. లక్షణాలున్న వారి పేర్లు నమో దు చేసుకుంటున్నారు. ఆ తర్వాత మందులు తీసుకువచ్చి ఇస్తున్నారు. ఏ మందు ఎలా వాడాలో చెబుతున్నారు. రోజూ 3 సార్లు బాధి తులకు ఫోన్లు చేసి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ వైద్య బృందాల్లో అంగన్వాడీ కార్యకర్త, ఆశ వర్కర్, ఏఎన్ఎం, ఇతర వైద్య సిబ్బంది ఉంటున్నారు. లక్షణాలు బాగా బయటపడుతున్నాయి రాజాపేట మండల కేంద్రంలో ఎక్కువ శాతం ప్రజలు జలుబు, దగ్గు, ఫీవర్ వంటి లక్షణాలు చెబుతున్నారు. మరి కొంతమంది మాత్రం వీటితోపాటు వంటినొప్పులు ఉన్నాయని చెప్పారు. కొందరు లక్షణాలున్నా లేవని చెబుతున్నారు. వారు మందులు వాడుతున్నట్లు మాకు తెలిసింది. అటువంటి వారిని గుర్తించి కరోనా పరీక్షకు పంపాము. కొందరికి పాజిటివ్‌గా కూడా తేలింది. -కొత్త కృష్ణలీల, ఆశ కార్యకర్త, రాజాపేట, యాదాద్రి భువనగిరి 70% ప్రజలకు ఆరోగ్య సమస్యలున్నాయి దాదాపుగా 70 శాతం ప్రజలు వివిధ అనారోగ్య సమస్యలు చెబుతున్నారు. ముఖ్యంగా ఒంటినొప్పులు, జ్వరం, దగ్గు, జలుబు ఉన్నట్లు తేలింది. కొందరైతే మేము ఊళ్లోకి వెళ్లగానే, అడగకముందే వారి అనారోగ్య సమస్యలను చెబుతున్నారు. వారికి ధైర్యం చెబుతూ కౌన్సెలింగ్ చేస్తున్నాం. -రావుల సంతోష, ఆశ కార్యకర్త, భూదాన్‌పోచంపల్లి, యాదాద్రి భువనగిరి నిజాలు దాస్తున్నారు కొంతమంది నిజాలు దాస్తున్నారు. మేముæ సర్వేకు వెళ్లినప్పుడు కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వారు కూడా బాగానే ఉన్నామం టున్నారు. మాకు ఏ జబ్బులూ లేవంటున్నారు. మీ ద్వారానే మాకు కరోనా వస్తదని, మా ఇళ్లకు రావొద్దని అంటున్నారు. ఇంకొందరు ఇళ్లలోనే ఉండి తలుపులు వేసుకొని తట్టినా తీయడం లేదు. మొత్తం మీద జ్వరంతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉంటున్నారు. -కొమ్ము నాగరాజు, పంచాయతీ కార్యదర్శి, అర్వపల్లి, సూర్యాపేట జిల్లా జ్వరపీడితులే అధికం మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ప్రతి ఇంటిలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి రికార్డు చేశాం. జ్వర పీడితులు ఎక్కువగా ఉన్నట్లుగా తేలింది. 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి మందులు ఇచ్చాం. ప్రతిరోజూ వెళ్లి పల్స్ ఆక్సీమీటర్, ఉష్ణోగ్రతను కొలిచే సాధనంతో పరీక్షలు చేసి తగిన సూచనలు చేస్తున్నాం. -కాళేశ్వరి, ఆశ వర్కర్, కురవి, మహబూబాబాద్ జిల్లా బయట తిరగకుండా చూస్తున్నాం.. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వేలో భాగంగా ఆశ కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతున్నాం. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి వివరాలు సేకరిస్తున్నాం. ఎవరైతే కోవిడ్ లక్షణాలతో బాధ పడుతున్నారో తెలుసుకుని ఆ ఇంటికి మార్కింగ్ చేస్తున్నాం. అత్యవసరమైతే ఆస్పత్రుల్లో జాయిన్ చేస్తున్నాం. లక్షణాలున్న మిగతావారికి మందులు ఇచ్చి ఐసోలేషన్ లో ఉండాలని చెబుతున్నాం. పంచాయతీ సిబ్బంది వారిపై ఎప్పుడూ కన్ను వేసి ఉంచుతున్నారు. వారు బయట తిరగకుండా చూడడంతో పాటు వారి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. -వెంకటయ్యగౌడ్, పంచాయతీ కార్యదర్శి, రాంచంద్రపూర్, మహబూబ్‌నగర్ 10 ఇళ్లు సర్వే చేస్తే.. మూడిళ్లలో లక్షణాలు గ్రామాల్లోనూ కరోనా కేసులు వేగంగా పెరుగు తున్నాయి. 10 ఇళ్లు సర్వే చేస్తే మూడిళ్లలో వైరస్ లక్షణాలున్న వ్యక్తులు కనిపిస్తున్నారు. లక్షణాలు ఉంటే కిట్లు ఇవ్వాలని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో సవాళ్లు ఎదురవుతున్నాయి. పాజిటివ్ వచ్చినవారు కూడా తమ ఇంటికి వస్తే ఇతరులకు తెలుస్తుందని రానివ్వ డం లేదు. ఇదేంటని అడిగితే దూషించిన సందర్భాలూ ఉన్నాయి. మా ప్రాణాలను లెక్కచేయకుండా ఎండలో తిరుగుతూ సర్వే చేస్తున్నాం. ప్రజలు కరోనాపై అవగాహన తెచ్చుకుని, స్వీయ నియంత్రణ పాటిస్తేనే వైరస్ కట్టడి సాధ్యపడుతుంది. – శ్రీలత, ఆశ కార్యకర్త, ఇందుర్తి, కరీంనగర్ ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం మంగళవారం వరకు రాష్ట్రంలో 48,110 కరోనా వైరస్ యాక్టివ్ కేసులున్నాయి. ఇంటింటి సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా 2,36,982 మందికి కరోనా నిర్ధారణ కాకపోయినా జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు లాంటి కోవిడ్ లక్షణాలున్నాయని తేలింది. ఇప్పుడు గ్రామీణ ప్రజలు కూడా వైరస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తన రూపాన్ని కరోనా వైరస్ మార్చుకోవడంతో పట్టణాలతో పాటు పల్లెలు కూడా వణికిపోతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా 12,873 మందికి, అత్యధికంగా జీహెచ్ఎంసీలో 50,662 మందికి జ్వరం తదితర కోవిడ్ లక్షణాలు కనిపించాయి. -
సెకండ్ వేవ్ కల్లోలం: బయట తిరుగుతున్న పాజిటివ్ వ్యక్తులు..
సాక్షి, నేరడిగొండ(ఆదిలాబాద్): జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. పల్లె, పట్టణమనే తేడా లేకుండా వైరస్ విజృంభిస్తోంది. వ్యాధి బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. మరణాల రేటు సైతం పెరుగుతోంది. కనీస జాగ్రత్తలు ప్రజలు పాటించకపోవడంతోనే దీనికి కారణమని క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. కోవిడ్ బారిన పడకుండా కనీస నిబంధనలు పాటించకపోవడం, లక్షణాలున్నా పరీక్షలు చేయించుకోకపోవడం, కోవిడ్ నిర్ధారణ అయినా స్వీయ నిర్బంధ నియమాలను నిర్లక్ష్యం చేయడం కోవిడ్ కేసులు పెరగడానికి కారణమవుతోంది. పరీక్షలకు మొగ్గుచూపని ప్రజానీకం... జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పుల్లాంటి లక్షణాలను చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. వాసన తెలియకపోవడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడం లాంటి తీవ్ర లక్షణాలు కనిపించినప్పుడే కోవిడ్‌గా అనుమానించి పరీక్షలకు వెళ్తున్నారు. సాధారణ లక్షణాలు ఉన్నవారు, ఎలాంటి లక్షణాలు లేని వారిలోనూ ప్రస్తుతం కోవిడ్ నిర్ధారణ అవుతోంది. అనుమానం వచ్చిన వెంటనే పరీక్షలు చేయించుకోనివారు, వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణమవుతున్నారు. ముఖ్యంగా పల్లెల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. పరీక్షలు చేయించుకుని వ్యాధి నిర్ధారణ అయితే రెండు వారాల పాటు ఎక్కడికీ వెళ్లే అవకాశం ఉండదని, ఉపాధి పోతుందని, ఎవరూ దగ్గరకు రారని, ఇతర వ్యక్తిగత కారణాలతో చాలా మంది పరీక్షలకు ముందుకు రావడం లేదు. బయటకు వస్తున్న పాజిటివ్ వ్యక్తులు... లక్షణాలు ఉన్నవారు సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రులకు పరీక్షల కోసం వెళ్తున్నారు. కోవిడ్ ఉందని నిర్ధారణ అయితే అక్కడే వైద్యులు అందించే ఐసోలేషన్ కిట్‌ను తీసుకుని బస్సుల్లోనో.. ఆటోల్లో ఇంటికి వెళ్లి స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. ఆసుపత్రి నుంచి ఇంటికి చేరే సమయంలో కలిసిన వారందరికీ వైరస్ సోకే ప్రమాదం ఉన్నా కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. వాహనాలపై ఒంటరిగా వచ్చిన వారు అదే వాహనంపై ఒంటరిగా తిరిగి వెళ్తున్నారు. బస్సుల్లో, ఆటోల్లో వచ్చిన వారు తిరిగి ఇంటికి చేరే వరకూ వారికి వ్యాధి సోకిందనే విషయాన్ని ఎవరికీ తెలియనివ్వడం లేదు. ఇంటి వద్దే రక్షణ.. కోవిడ్ బారిన పడిన వారు 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలి. కుటుంబ సభ్యులను సైతం కలవకూడదు. కానీ అయిదారు రోజులు ఇంట్లో గడిపి లక్షణాలు తగ్గగానే బయటకు తిరుగుతున్నారు. కానీ కచ్చితంగా 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలని, తర్వాత కోవిడ్ పరీక్ష చేయించుకుని నెగిటివ్ వస్తేనే బయట తిరగాలని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. సభలు, సమావేశాలు, శుభకార్యాలు, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలు, రద్దీ అధికంగా ఉండే ప్రదేశాలకు వెళ్లొద్దని విస్తృత ప్రచారం చేసినా కనీసం పట్టించుకోడం లేదు. సమూహాల్లో కలిసి, ఎక్కువ సమయం గడిపి తిరిగి వచ్చిన వారిలోనే పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని వైద్యారోగ్య శాఖాధికారులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ తప్పనిసరై వెళ్లాల్సి వస్తే మాస్కు, భౌతిక దూరం, శానిటైజర్లు వినియోగించాలని సూచిస్తున్నారు. -
ఏజెన్సీలలో కరోనా వ్యాప్తి.. కిట్లు లేవు.. పరీక్షలు లేవు
సాక్షి, ఉట్నూర్(ఆదిలాబాద్): కరోనా వైరస్ వ్యాప్తి మొదట్లో రోజుకు ఉట్నూర్ సీహెచ్‌సీల్లో వంద మందికి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాభై చొప్పున కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేవారు. రానురాను కిట్ల కొరతతో పరీక్షల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఆరోగ్య కేంద్రాలకు సరిపడా కిట్లు రావడం లేదు. దీంతో పరీక్షల కోసం వచ్చిన వారు వెనుదిరుగుతున్నారు. అందులో వైరస్ ఉన్న వారితో మరింతగా వ్యాప్తి చెందుతోంది. గిరి గ్రామాల్లో వైరస్ ఉధృతి.. ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. సాధారణంగా గిరిజన గ్రామాల్లో వ్యాధులు, జ్వరాలు వస్తే వైద్యం కంటే మూఢనమ్మకాలు, ఆరాధ్యాదైవాలను ఎక్కువగా నమ్ముతారు. ఇప్పటికీ ఆదివాసీ గిరిజనుల్లో కరోనా వైరస్‌పై పూర్తిస్థాయిలో అవగాహన లేక వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఫలితంగా ఏజెన్సీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే పదుల సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో వైద్యశాల ప్రతి గిరిజన గ్రామాల్లో నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వైరస్ సోకిన వారికి హోం క్వారంటైన్లో ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం కరోనా నిర్ధారణ ర్యాపిడ్ అంటిజెన్ కిట్ల కొరత ఏర్పడడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఒక్కప్పుడు యాభై చొప్పున వచ్చే కిట్లు ఇప్పుడు ఎన్ని వస్తాయో తెలియని పరిస్థితి. వచ్చే అరకొర కిట్లతో సిబ్బంది నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే ఆరోగ్య కేంద్రాలకు... ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఉదయం నుంచే గిరిజనులు కరోనా నిర్ధారణ పరీక్షల కోసం బారులు తీరుతున్నారు. కిట్ల కొరతతో వైద్యాధికారులు వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహించలేకపోతున్నారు. ఇలా ప్రతి రోజు వైరస్ సోకినవారు, అనుమానిత బాధితులు పరీక్షల కోసం ఆరోగ్య కేంద్రాలకు బారులు తీరుతుండడంతో అనుమానితులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. అప్పటికే ఒక్కటి రెండు రోజులు పరీక్షలకు వెళ్లి వెనుదిరిగి ఇంటికి రావడం, అప్పటికీ పరీక్ష నిర్ధారణ కాకపోవడంతో అలాంటి వారు బయట విచ్చలవిడిగా తిరగడం, కుటుంబ సభ్యులతో కలిసి ఉండడంతో కుటుంబ సభ్యులు వైరస్ బారిన పడుతున్నారు. ఏజెన్సీ తట్టుకోగలదా...? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6138.50 స్కేర్ కిలో మీటర్ల పరిధిలో ఏజెన్సీ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతాల్లో 4,95,794 గిరిజన జనాభా నివసిస్తోంది. వీరందరికీ వైద్య సౌకర్యాల కోసం ఏజెన్సీలో మూడు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 186 ఉప ఆరోగ్య కేంద్రాలున్నాయి. ప్రతి ఏటా ఏజెన్సీలో గిరిజనులు జ్వరాలు, వ్యాధుల బారిన పడుతూ మృత్యువాతపడుతుంటారు. దీనికి తోడు ఇప్పటికే సికెల్‌సెల్, తలసేమియా లాంటి ప్రాణాంతక వ్యాధులు గిరిజనుల పాలిట శాపంగా మారాయి. సహజంగా మహిళల్లో హీమోగ్లోబిన్ 12నుంచి 15 శాతం, పరుషుల్లో 14 నుంచి 16శాతం ఉంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వైద్యులు చెబుతుంటారు. ఏజెన్సీలో ఏళ్ల తరబడి నెలకొన్న పోషకాహార లోపంతో మహిళల్లో హీమోగ్లోబిన్ 6 నుంచి 9శాతం, పురుషుల్లో 12శాతం వరకు, చిన్నారుల్లో 5 నుంచి 10శాతం వరకే ఉంటోంది. వీరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడంతో చిన్న సమస్యలకే అనారోగ్యం పాలు అవుతుంటారని పలు సందర్భాల్లో వైద్య బృందాలు తేల్చాయి. గిరి గ్రామాల్లో పరిస్థితులు అదుపు తప్పకముందే చర్యలు తీసుకుంటే మేలు. అవగాహన కల్పిస్తున్నాం ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్ సోకినవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి గ్రామంలోని ఆశ కార్యకర్తలు గ్రామాల్లోని గిరిజనుల ఆరోగ్య స్థితిగతులపై అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పైఅధికారులకు సమాచారం అందించాలని ఆదేశాలు జారీ చేశాం. వైరస్ నిర్ధారణ కోసం జిల్లా కేంద్రం నుంచి వస్తున్న కిట్ల సంఖ్యను బట్టి పీహెచ్‌సీలకు పంపిణీ చేస్తున్నాం. – మనోహర్, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి -
కరోనా టెర్రర్.. ముట్టుకోకుండానే అంటుకుంటోంది..!
సాక్షి, సిరిసిల్లటౌన్: కరోనా రోగిని నేరుగా కలువడం, వారితో దగ్గరగా మాట్లాడటం, ఒకే గదిలో, దగ్గరదగ్గరగా మెదలడం, తుంపర్లు ఇతరుల లాలాజలంతో కలువడం, లేదా ముక్కునీరుతో కలువడంతో కరోనా వచ్చేది. ఇది మొదటి వేవ్‌లో అందరం చూశాం. లక్షణాలున్న వారికి దూరంగా మెదిలి తప్పించుకున్నాం. కానీ ప్రస్తుతం రెండో దశ కరోనా వైరస్ వ్యాప్తి గతానికి భిన్నంగా ఉంది. మొదటి వేవ్‌లో కనిపించని లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రోగిని ముట్టుకోకుండానే అంటుకుంటుంది. గాలి ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తున్నట్లు వైద్యశాస్త్ర మేధావులు చెబుతున్నారు. ఫలితంగా వైరస్ ఉధృతి ఎక్కువై సామాజిక వ్యాప్తి జరుగుతుంది. జిల్లాలో ప్రజలు సామాజిక బాధ్యతను విస్మరిస్తూ...కరోనా వ్యాప్తికి కారకులైతున్న వైనంపై కథనం.. కరోనా సామాజిక వ్యాప్తి..? కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి జరుగుతుందన్న అంశం చర్చనీయాంశమైంది. రోజురోజుకు జిల్లాలో వందలాది సంఖ్యలో కేసులు నమోదవడం ఇందుకు బలం చేకూర్చుతుంది. అయితే కరోనా బారిన పడినవారు సరైన చికిత్స పొందుతూ బహిరంగ ప్రదేశాలకు రాకుండా ఉండటం లేదు. కొందరైతే సాధారణ వ్యక్తుల్లాగే వివిధ ఫంక్షన్లు, సమావేశాలు, ఇతర వేడుకల్లో పాల్గొంటున్నారు. పండుగల సందర్భాల్లో వేలాది జనం మార్కెట్లు, షాపింగ్‌ల కోసం భయం లేకుండా తిరగడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. రాజకీయ ఫంక్షన్లు, సంతలు, షాపింగ్‌లకు జనాలు వేలాది సంఖ్యలో పాల్గొనడం మరో కారణమైతున్నట్లు వైద్యశాఖ మేధావులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన పలు కార్యక్రమాల్లో లెక్కకు మించిన జనాలు హాజరవడంతో వైరస్ అంటుకున్నట్లు తెలుస్తోంది. మొదటి వేవ్‌లో రోగినుంచి సాధారణ వ్యక్తికి సోకడంలో లక్షణాలు బయట పడటానికి మూడు నుంచి వారం రోజులు పట్టేది. ఇప్పుడా పరిస్థితి లేదు. కేవలం నిమిషాల వ్యవధిలోనే అంటుకుని రెండు మూడు రోజుల్లోనే రోగి పరిస్థితి చేయిదాటే దాఖలాలు కనిపిస్తున్నాయి. కొందరిలో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించినా..వైరస్ జాడలు కనిపించడం లేదు. కొత్త వైరస్ ప్రభావానికి లోనైన వారికి విరేచనాలు, ఒళ్లునొప్పులు, తలనొప్పి వగైరా కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. సాధారణ ప్రజలు ఇలా.. ►మాస్కులు లేకుండా ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావొద్దు ► అన్ని దుకాణాలు, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో భౌతికదూరం పాటించాలి ►బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ శానిటైజర్ బాటిల్ తీసుకుపోవాలి ► అన్ని షాపుల్లోనూ యజమానులు శానిటైజర్లు అందుబాటులో ఉంచి, మాస్కులు ధరించాలి ► కరోనా రోగులపై వివక్ష చూపరాదు. ► నాకేం కాదని అశ్రద్ధ చేయొద్దు. కరోనా వచ్చిందని భయపడాల్సిన పనిలేదు ► పోలీసులు అమలు చేస్తున్న కర్ఫ్యూ నిబంధనలు, పలు గ్రామాల్లో అమలు చేస్తున్న లాక్డౌన్ నియమాలను ప్రజలు పాటించాలి కోవిడ్–19 పాజిటివ్ వారు.. ► కరోనా లక్షణాలు కనపడగానే ప్రాథమిక దశలోనే టెస్టులు చేయించుకోవాలి ► ఇంట్లోనే ఉంటూ..ఐసోలేషన్ నిబంధనలు పాటించాలి. బయట తిరుగొద్దు ► కరోనా సోకినవారు తప్పకుండా హోం ఐసోలేషన్ పాటించాలి. డాక్టర్ సూచలను పాటిస్తూ చికిత్స పొందవచ్చు. రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. ► మాననికంగా ధైర్యాన్ని కోల్పోకుండా, భయానికి లోను కాకుండా ఉండాలి ►లక్షణాలు పెచ్చుమీరితే ఆస్పత్రిలో వైద్యుల పరిరక్షనలో చికిత్స పొందాలి -
లాన్సెట్ సంచలన నివేదిక: గాలి ద్వారానే కోవిడ్ అధిక వ్యాప్తి
వాషింగ్టన్: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి గాలి ద్వారానే చాలా తీవ్రంగా వ్యాపిస్తోందట. వస్తువులను ముట్టుకోవడం కంటే.. వైరస్ నిండి ఉన్న గాలిని పీల్చుకోవడం వల్లే వైరస్ క్రిములు ఒకరి నుంచి మరొకరికి చేరుతున్నాయని బ్రిటన్, అమెరికా, కెనడా సైంటిస్టులు సంయుక్తంగా చేసిన అధ్యయంనలో వెల్లడైంది. అందుకే కరోనాను గాలి ద్వారా వ్యాపించే వైరస్ (ఎయిర్ బోర్న్) అని ప్రకటించాలని వారు సూచిస్తున్నారు. గాలి ద్వారా కరోనా వ్యాప్తి అధికంగా ఉందనేందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నట్లు వారు స్పష్టం తెలిపారు. యుద్ధ ప్రాదికన చర్యలు చేపట్టి కరోనా వ్యాప్తిని అడ్డుకోకపోతే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఇతర వైరస్ పీడిత దేశాలకు వారు సూచనలు చేశారు. రీసెర్చ్‌లో భాగంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ట్రిష్ గ్రీన్ హాల్గ్ ఆధ్వర్యంలోని ఆరుగురు సైంటిస్టుల బృందం వైరస్ వ్యాప్తికి సంబంధించిన పలు జర్నల్స్‌ను సమీక్షించారు. గాలి ద్వారానే కోవిడ్ అధిక మొత్తంలో వ్యాప్తి చెందుతున్నట్టు బలమైన ఆధారాలు ఉన్నాయని లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన తమ అధ్యయన నివేదికలో పేర్కొన్నారు. సైంటిస్టుల నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. కరోనా గాలి ద్వారానే వేగంగా వ్యాప్తి ►మనుషుల ప్రవర్తన, ఇంటరాక్షన్, గది సైజు వెంటిలేషన్ వంటి అంశాలు వైరస్ వ్యాప్తిలో కీలకం. ►మనుషులు ఒకరినొకరు కలుసుకోకుండా క్వారంటైన్లో ఉన్నా కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది. ►ఎవరైతే దగ్గకుండా, తుమ్మకుండా ఉన్నారో వాళ్ళలో కూడా ఎటువంటి సింప్టమ్స్ లేకపోయినా, 33 నుంచి 59 శాతం ఈ వైరస్ వ్యాప్తి చెందింది. ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది అనడానికి ఇదో కారణం. ►బయట కంటే కూడా ఇంట్లో నాలుగు గోడల మధ్య లో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. ►కరోనా రాకుండా ఉండడానికి చాలా చోట్ల పీపీఈ కిట్స్ ని ధరించారు. అలా ధరించిన ప్రదేశాలలో కూడా ఇన్ఫెక్షన్లు ఉంటాయి. ►నిపుణులు కనుగొన్న దాని ప్రకారం గాలిలో మూడు గంటల పాటు ఈ వైరస్ ఉంటుంది. ►కరోనా వైరస్ ఎయిర్ ఫిల్టర్ లలో, శుభ్రం చేసినప్పటికీ ఆసుపత్రుల బిల్డింగ్ మూలల్లో వైరస్ తిష్ట వేసుకుని ఉంటుంది. ►పెంపుడు జంతువుల ఆవాసాల్లో కూడా కరోనా వైరస్ గుర్తింపు. ►ఇది గాలి ద్వారా వ్యాపించే వైరస్ కాదని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు ( చదవండి: గడ్డకడుతున్న రక్తం.. అమెరికాలో జాన్సన్ టీకా నిలిపివేత ) -
గాలి ద్వారా కరోనా.. !?
జెనీవా/ న్యూయార్క్: గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని ఇప్పటివరకు ఎన్నో అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కొట్టిపారేస్తూ వచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన స్వరం మార్చింది. వైరస్ గాలి ద్వారా వ్యాపించే అవకాశాలున్నాయనే వాదనల్ని పూర్తిగా కొట్టిపారేయలేమని స్పష్టం చేసింది. జనం రద్దీ ఉన్న ప్రాంతాల్లో, గాలి వెలుతురు లేని ప్రదేశాల్లో, ఇరుగ్గా ఉండే గదుల్లో గాలి ద్వారా వైరస్ వ్యాపించదని కచ్చితంగా చెప్పలేమని అంటోంది. దీనిపై మరిన్ని బలమైన ఆధారాలను సేకరించి విశ్లేషించాల్సిన అవసరం ఉందంది. ఇటీవల 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తల బృందం కరోనా సూక్షా్మతి సూక్ష్మ క్రిములు (5 మైక్రాన్ల కంటే చిన్నవి) గాలిలో ఒక మీటర్ పరిధిలో విస్తరించి చాలా ఎక్కువ సేపు ఉంటాయని, ఆ గాలి పీల్చే వారికి వైరస్ సోకుతుందని డబ్ల్యూహెచ్ఓకి ఒక లేఖ రాశారు. ఈ మేరకు మార్గదర్శకాలను సవరించాలని వారు కోరారు. దీనిపై స్పందించిన ఆ సంస్థ టెక్నికల్ లీడ్ బెనెడెట్టా అలెగ్రాంజి గాలి ద్వారా వైరస్ వ్యాపించదని కచ్చితంగా చెప్పలేమని అన్నారు. అయితే ఇవన్నీ ప్రాథమిక ఆధారాలు మాత్రమేనన్నారు. వైరస్ గాలిలో ఎంతసేపు ఉంటుందో, ఆ సమయంలో మరొకరికి సోకే అవకాశం ఎంతవరకు ఉందో ఇంకా స్పష్టంగా తెలియవలసి ఉందని చెప్పారు. ఒకవేళ గాలి ద్వారా వైరస్ వ్యాపించే అవకాశమే ఉంటే డబ్ల్యూహెచ్ఓ తన మార్గదర్శకాలను సవరించుకోవాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా అన్ని దేశాల ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటివరకు కోవిడ్ రోగి మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మి నప్పుడు నోటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్ఒ చెబుతున్న విషయం తెలిసిందే. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రపంచ దేశాలు, మరీ ముఖ్యంగా భారత్‌లో కోవిడ్ విజృంభిస్తున్న వేళ గాలి ద్వారా వైరస్ వ్యాపించే అవకాశాలను తోసిపుచ్చలేమని డబ్ల్యూహెచ్ఒ చేసిన ప్రకటన ప్రభుత్వం, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని చెబుతోంది. గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందని రుజువైతే మాస్కులు ధరించడం అత్యంత కీలకంగా మారుతుంది. ఇప్పటివరకు ఆస్పత్రిలో వైద్య సిబ్బంది ధరించే ఎన్–95 మాస్కులు సాధారణ ప్రజలు కూడా వాడాల్సిన అవసరం రావచ్చునని, జనం గుమిగూడే కార్యక్రమాల్ని పూర్తిగా రద్దు చేయాలని ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు. గాలి ద్వారా వ్యాపిస్తుందన్న అధ్యయనాలివే.. ► వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందని మొదటిసారిగా నేచర్ పత్రిక ప్రచురించింది. ఆస్పత్రిలో కారిడార్లలో కంటే చిన్న గదుల్లో, టాయిలెట్లలో గాల్లో వైరస్ ఎక్కువగా ఉన్నట్టు ఓ అధ్యయనంలో తేలిందని పేర్కొంది. ► అమెరికాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్‌ఈజేఎం) ఏప్రిల్‌లో నిర్వహించిన అధ్యయనంలో వైరస్ గాలిలో మూడు గంటల వరకు ఉంటుందని తేలింది. ► రోగులు మాట్లాడేటప్పుడు అత్యధికంగా తుంపర్లు బయటకు వస్తే గాల్లో ఎక్కువ సేపు వైరస్ ఉంటోందని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మేలో చేసిన అధ్యయనంలో తేలింది. -
కోటికి చేరుకున్న కరోనా కేసులు
కంటికి కనిపించని సూక్ష్మ క్రిమి చైనాలో వూహాన్లో పుట్టి యూరప్ దేశాల మీదుగా విస్తరించి అమెరికాలో ఉగ్రరూపం దాల్చి భారత్‌ని కూడా భయపెడుతోంది. 6 నెలలు, 213 దేశాలు.. కోటి కేసులు, దాదాపు 5 లక్షల మృతులు.. ఇదీ కోవిడ్19 సృష్టిస్తున్న అల్లకల్లోలం. వాషింగ్టన్/న్యూఢిల్లీ: ఒక వైరస్ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఒక వైరస్ అందరికీ కొత్త పాఠాలు నేర్పిస్తోంది. ప్రపంచానికి తాళం వేసి ఆర్థికంగా అతలాకుతలం చేస్తోంది. 2019 డిసెంబర్ 31న సార్స్ తరహా వైరస్ కేసులు చైనాలోని వూహాన్లో వెలుగులోకి వస్తున్నాయని అందరికీ తెలిసినప్పుడు ఇదేదో మామూలు వైరస్ అనుకున్నారు. అంతకంతకూ ఆ వైరస్ శరవేగంగా విస్తరించింది. అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికింది. తొలి రెండు, మూడు నెలలు చైనాలోని వూహాన్‌తో పాటుగా అమెరికా, ఇటలీ, స్పెయిన్, యూకే దేశాలు అల్లాడిపోయాయి. ఆ తర్వాత యూరప్‌లో కొన్ని దేశాలు కోలుకున్నప్పటికీ అమెరికాను కేసుల భయం వెంటాడుతూనే ఉంది. శనివారం రాత్రికి ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,00,418కు, బాధితుల మరణాల సంఖ్య 4,98,952కు చేరాయి. కరోనాతో వణుకుతున్న దేశాలు అగ్రరాజ్యం అమెరికాని కరోనా అసాధారణ రీతిలో కాటేసింది. 25 లక్షలకు పైగా కేసులు లక్షా 25 వేలకు పైగా మృతులతో ఆ దేశం అగ్రభాగంలో ఉంది. ఇప్పటికీ అమెరికాలో రోజుకి సగటున 40 వేల మందికి కోవిడ్ –19 సోకుతోంది. బ్రెజిల్, రష్యా, భారత్, ఇరాన్, మెక్సికో, చిలీ, పెరూ, పాకిస్తాన్, బంగ్లాదేశ్ , ఇండోనేసియా దేశాల్లోనూ కరోనా కేసులు అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. న్యూజిలాండ్ సహా 15 దేశాలు ఇప్పటివరకు కరోనాని జయించామని చెప్పుకుంటున్నప్పటికీ మళ్లీ ఆయా దేశాల్లో రాదని చెప్పలేని పరిస్థితి. చైనాని కూడా కరోనా సెకండ్ వేవ్ భయపెడుతోంది. ప్రాణాపాయం లేదు కరోనా వైరస్ విస్తరణ దడ పుట్టించేలా ఉన్నప్పటికీ, వేరే ఇతర వ్యాధులు ఉన్నవారికే ఇది అత్యంత ప్రమాదకరం. మిగిలిన వారికి కేవలం ఇదొక ఫ్లూ లాంటి జ్వరం మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. కొన్ని ముందు జాగ్రత్త చర్యలతో ఈ వైరస్‌ను అరికట్టవచ్చునని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డబ్ల్యూహెచ్ఓ అంచనాల ప్రకారం మొత్తం కేసుల్లో ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండానే వ్యాధి అదుపులోకి వచ్చే కేసులు 80% వరకు ఉన్నాయి. ఆస్పత్రిలో చేరినా కోలుకున్న కేసులు 15 శాతం ఉంటే, వాటిలో విషమంగా మారిన కేసులు 5శాతం. ఆ 5శాతం కేసుల్లోనూ సగం మందికే ప్రాణాలకు ముప్పు ఉంటోంది. -
కరోనా : లాక్డౌన్ సడలింపుల వేళ గుడ్ న్యూస్!
సాక్షి, న్యూఢిల్లీ / సియోల్: దక్షిణ కొరియాలోని కొరియన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పరిశోధన కీలక విషయాన్ని వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న రోగుల నుంచి వైరస్ వ్యాప్తి చెందదని వెల్లడించింది. వైరస్ నుంచి కోలుకున్న రోగులకు తిరిగి వైరస్పాజిటివ్ రావడం, వారినించి కూడా విస్తరిస్తోందన్న ఆందోళనపై నిర్వహించిన పరిశోధనలో ఈ విషయాన్ని తేల్చింది. దీనికి ప్రకారం కరోనావైరస్ నుండి కోలుకున్న వారంలోనే పాజిటివ్ వచ్చిన వ్యక్తులు (రీపాజిటివ్ రోగులు) ఈ వైరస్‌ను వ్యాప్తి చేయలేరని తెలిపింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చాలా దేశాలు లాక్డౌన్ నిబంధనలను సడలించి, ఆర్థిక కార్యలాకాలను ప్రారంభించాలని చూస్తున్న తరుణంలో ఈ ఫలితాలు సానుకూల సంకేతంగా నిలుస్తున్నాయి. కోలుకున్న తర్వాత మళ్లీ వైరస్ బారిన పడిన 285 కోవిడ్-19 రోగులపై దక్షిణ కొరియా పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. వీరు వ్యాప్తి చెసే వైరస్ కణాల్లో జీవం వుండదని, చనిపోయిన కణాలతో వైరస్‌ను వ్యాప్తి కాదని నివేదించింది. ఈ నేపథ్యంలో కోలుకునే వ్యక్తులు తిరిగి వైరస్‌ను వ్యాప్తి చేస్తారనే అందోళన అససరం లేదని స్పష్టం చేసింది. దీంతో దక్షిణ కొరియా వైరస్‌కు సంబంధించిన ప్రోటోకాల్స్ నిబంధనలను సవరించింది. ఒకసారి కోలుకొని, ఐసోలేషన్ పూర్తి చేసిన రోగులకు పనికి లేదా పాఠశాలలకు వెళ్లేందుకు వైరస్ పరీక్షలు చేయవలసిన అవసరం లేదని దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. కాగా ఆంక్షలున్నప్పటికీ, కొన్ని సడలింపులతో దేశవ్యాప్తంగా మే 18 నుండి నాలుగవ లాక్డౌన్ అమల్లో వుంది. దీంతో దేశమంతా వ్యాపార కార్యకాలాపాలు తిరిగి ప్రారంభ మైనాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4,895,033 మంది కరోనా బారినపడగా, 320,192 మరణాలు సంభవించాయి. దేశంలో కరోనా వైరస్ కారణంగా 3,164 మంది మరణించగా కేసులు సంఖ్య లక్ష మార్క్(101,261)ను దాటేసింది. దక్షిణ కొరియాలో 263 మరణాలు 11,078 కేసులు నమోదయ్యాయి.