కేరళలో వెస్ట్ నైల్ ఫీవర్ విస్తరిస్తోంది. దోమలు కుట్టడం ద్వారా ఈ జ్వరం సోకుతుంది. రాష్ట్రంలోని మూడు నగరాల్లో ఈ కేసులు నమోదైన నేపధ్యంలో అన్ని జిల్లాల్లో ప్రీ మాన్సూన్ క్లీనింగ్ క్యాంపెయిన్ నిర్వహించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ జ్వరం లక్షణాలు, ఇది సోకకుండా ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కోజికోడ్‌లో ఇప్పటివరకు ఐదు వెస్ట్ నైల్ ఫీవర్ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు మీడియాకు తెలిపారు. మలప్పురం, త్రిస్సూర్‌లో కూడా ఈ వ్యాధి బారినపడినవారున్నారని, ఈ వ్యాధి లక్షణాలు త్వరగా కనిపించవని వారు తెలిపారు. అందుకే వ్యాధి సోకిన వారి సంఖ్యను అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో వెల్లడించలేకపోతున్నారని సమాచారం.
మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ జ్వరం సోకిన ఐదుగురిలో నలుగురు కోలుకున్నారు. ఒకరు ఇప్పటికీ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. వెస్ట్ నైల్ జ్వరం లక్షణాలు డెంగ్యూ మాదిరిగానే ఉంటాయి. 80 శాతం కేసుల్లో లక్షణాలు కనిపించవు.
వెస్ట్ నైల్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ దోమల వృద్ధిని అరికట్టడం, నీటి వనరులను శుభ్రపరచడంపై స్థానిక అధికారులకు సూచనలు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో 2011 నుంచి ఈ తరహా కేసులు నమోదవుతున్నాయని, ఈ ఫీవర్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే డ్యెంగ్యూ లక్షణాలు కనిపించినవారు వెంటనే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
వెస్ట్ నైల్ ఫీవర్ దోమ కాటు ద్వారా మనుషులకు సోకుతుంది. యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ వ్యాధి సోకిన ప్రతి 10 మందిలో 8 మందికి లక్షణాలు కనిపించవు. అయితే వాంతులు, విరేచనాలు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకిన అనంతరం తగిన చిక్సిత్స అందకపోతే బాధితులు మృతి చెందే అవకాశం ఉంది. కేరళలో ఈ వ్యాధి సోకి 2019లో ఒకరు, 2022లో ఒకరు మృతి చెందనట్లు నివేదికలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment