కలవరపెడుతున్న 'జాంబీ డీర్‌ వ్యాధి'! మనుషులకు కూడా వస్తుందా? | Zombie Deer Disease Infecting Animals In US Is It Spread Humans Too, Here's All You Need To Know - Sakshi
Sakshi News home page

Zombie Deer Disease: కలవరపెడుతున్న 'జాంబీ డీర్‌ వ్యాధి'! మనుషులకు కూడా వస్తుందా?

Published Wed, Dec 27 2023 11:12 AM | Last Updated on Wed, Dec 27 2023 12:28 PM

 Zombie Deer Disease Infecting Animals In US Is It Spread Humans Too - Sakshi

మానవ తప్పిదాలతో పర్యావరణాన్ని చేజేతులారా కలుషితం చేశాం. దానికి ప్రతిగా రోజుకో కొత్త వింత వ్యాధులు ప్రకృతి ‍ప్రకోపానికి ఫలితమా! అన్నట్టుగా పుట్టుకొస్తున్నాయి. ఆ వ్యాధులు జంతువులను నుంచి మొదలు పెట్టి మానవులకు సంక్రమిస్తున్నాయి. వాటికి చికిత్స విధానం ఉందో లేదో తెలియని స్థితి. పోనీ రాకుండా నివారించేలా ఏం చేయాలో ఎలా సంక్రమించకుండా చెయ్యాలనేది కూడా చిక్కు ప్రశ్నే. అలాంటి మరో వింత వ్యాధి అగ్రరాజ్యాన్ని ఓ కుదుపు కుదుపేస్తుంది. అ‍క్కడ ఏటా వందలాది జంతువులు ఈ వ్యాధి బారినపడటంతో ఎక్కడ మానవులకు సంక్రమిస్తుందో అని భయాందోళన చెందుతున్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ ఏంటా వ్యాధి? మానువులకు సంక్రమించే అవకాశం ఉందా?

అగ్రరాజ్యం అమెరికాలో 'జాంబీ డీర్‌ వ్యాధి' కలకలం సృష్టిస్తోంది. అక్కడ వందలాది జంతువులు ఈ వ్యాధి బారిన పడి మరణిస్తున్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా ఎల్లోస్టోన్‌ నేషనల్‌ పార్క్‌లోని జంతువుల్లో తొలిసారిగా ఈ వ్యాధిని కనుగొన్నారు. ఆ తర్వాత నుంచి వందల కొద్ది జంతువులు ఈ వ్యాధి బారినే పడటం శాస్త్రవేత్తలను ఒకింత భయాందోళనలకు గురి చేసింది. ఈ వ్యాధి ప్రముఖంగా ఉత్తర అమెరికా, కెనడా, నార్వే, దక్షిణ కొరియా వంటి ప్రాంతాల్లోని జింక, లేళ్లు, దుప్పి వంటి జంతువుల్లో ప్రబలంగా ఉన్నట్లు తెలిపారు. దీని కారణంగా బద్ధకం, ఉన్నటుండి తూలిపోవడం, ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం వంటి నాడీ సంబంధిత లక్షణాలు బహిర్గతమవుతాయి.

ప్రధానంగా జంతువులకే సంక్రమించినప్పటికీ అది చివరికి మానవులకు కూడా సంక్రమించే ప్రమాదం లేకపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ 'జాంబీ డీర్‌ డిసీజ్‌'ని వైద్య పరిభాషలో (క్రానిక్‌ వేస్టింగ్‌ డిసీజ్‌(సీడబ్ల్యూడీ) అంటారు. అంటే ప్రోటీన్‌ ముడతల్లో తేడాలతో వచ్చే అరుదైన వ్యాధి. దీన్ని చాలా నెమ్మదిగా చుట్టుముట్టే ప్రమాదకర వ్యాధిగా నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు మానవులకు సోకిన దాఖలాలు లేకపోయినా భవిష్యత్తులో మానవులకు సంక్రమించదన్న గ్యారంటీ లేదని ఎపిడెమియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు బ్రిటన్‌లో వచ్చిన 'మ్యాడ్‌ కౌ వ్యాధి(పిచ్చి ఆవు వ్యాధి)' గుర్తు చేసుకున్నారు. వందలకొద్ది ఆవులను వధించడంతో వచ్చిన పిచ్చి ఆవు వ్యాధి ఎలా మానువులకు సంక్రమించిందో ఉదహరిస్తూ వార్నింగ్‌ ఇస్తున్నారు నిపుణులు.

ఈ మేరకు సీడబ్ల్యూడీ పరిశోధకుడు డాక్టర్‌ కోరి ఆండర్సన్‌ మాట్లాడుతూ..మానువులకు వస్తుందా? రాదా? అని నిర్థారించి చెప్పకలేకపోయినప్పటికీ.. సంసిద్ధగా ఉండటం మాత్రం ముఖ్యమని నొక్కిచెప్పారు. ఇది ఒక ప్రాంతంలో విజృంభిస్తే..పూర్తి స్థాయిలో తొలగించడం అసాధ్యం అని అన్నారు. ఇది ఆయా భూభాగంలోని మట్టి లేదా ఉపరితలాల్లో ఏళ్లుగా ఆ వ్యాధి కొనసాగుతుందని చెబుతున్నారు. ఇది ఒక రకమైన ప్రోటీయోపతి లేదా నిర్మాణపరంగా అసాధారణమైన ప్రోటీన్ల వ్యాధి.

ఇది సోకిన జంతువులు గానీ మనుషులు గానీ చనిపోతే అక్కడ భూమిలోనే డికంపోజ్‌ అయితే అలానే ఆ వ్యాధి తాలుకా గ్రాహకాలు ఉండిపోతాయి. దీంతో కొన్నేళ్ల పాటు ఆయా ప్రాంతాల్లో ఆ వ్యాధి కొనసాగుతుంది. ఎలాంటి క్రిమి సంహరకాలు, ఫార్మాల్డిహైడ్‌, రేడియేషన్‌ల, అధిక ఉష్ణోగ్రతలకు ఆ వ్యాధి లొంగదని మరింతగా నిరోధకతను చూపిస్తుందని అన్నారు. ఈ విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) 1997 నుంచే సీడబ్ల్యూడీకి సంబంధించిన వ్యాధులు మానవులకు సంక్రమించకుండా నిరోధించే ప్రాముఖ్యత గూర్చి నొక్కి చెబుతుండటం గమనార్హం. 

(చదవండి: అనుకోని ప్రమాదంలో చిద్రమైన వ్యక్తి ముఖాన్ని పునర్నిర్మించిన శాస్త్రవేత్తలు!)


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement