deer
-
నల్లమల.. వణ్యప్రాణుల ఖిల్లా
-
జింకల అమ్మ
కొన్ని బిరుదులు కోరుకోకపోయినా వస్తాయి. అనురాధరావు(Anuradha Rao)కు ‘డీర్ ఉమన్’ బిరుదు అలా వచ్చిందే. ‘జింక కనిపిస్తే కచ్చితంగా వేటాడాల్సిందే’ అన్నట్లుగా ఉండే ఆ దీవుల ప్రజలలో మార్పు తెచ్చింది అనురాధ. ఆమెకు జింకలు జంతువులు కాదు. కుటుంబ సభ్యులు. వాటితో ఆడుతుంది,పాడుతుంది. కబుర్లు చెబుతుంది. మేత నుంచి సంరక్షణ వరకు అన్నింటినీ దగ్గరుండి చూసుకుంటుంది. అందుకే ఆమె డీర్ ఉమెన్.అండమాన్ నికోబార్ దీవులలో ఉంటున్న అనురాధరావుకు జింకలతో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. ఆ విశిష్ఠ అనుబంధమే ఆమెను ‘డీర్ ఉమెన్’(Deer Woman) అని పిలుచుకునేలా చేసింది. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు అనురాధ పూర్వీకుల్ని అండమాన్‌కు బందీలుగా తీసుకెళ్లారు. ఈ ద్వీపంలో ఆమె నాల్గవ తరం నివాసి.‘చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. బాల్యం నుంచి జింకలు అంటే ఇష్టం. అవి మా కుటుంబ సభ్యులలాగే భావించేదాన్ని. ఈ ద్వీపంలోని జింకలతో నాకు మంచి అనుబంధం ఉంది’ అంటుంది అనురాధ. ఆహారం ఇవ్వడం నుంచి సంరక్షణ వరకు జింకల పట్ల ఆమె ఎంతో చొరవ చూపుతుంది. జింకల గురించి ఆమె చూపుతున్న ప్రేమ మనుషులు, జంతువుల మధ్య పరస్పర నమ్మకాన్ని నెలకొల్పేలా ఉంది.‘ఒకప్పుడు మనుషులను చూడగానే జింకలు భయపడిపారిపోయేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. వాటి నమ్మకాన్ని చూరగొనడానికి చాలా ఓపికగా పనిచేశాను. వాటితో ఎంతో సమయం గడిపాను. వాటికి దగ్గరై వాటి మనస్తత్వాన్ని లోతుగా అర్థం చేసుకున్నాను’ అంటుంది అనురాధరావు. జింకల సంక్షేమం పట్ల ఆమె అంకితభావం ద్వీపంపై బలమైన ప్రభావాన్ని చూపించింది. జంతువుల పట్ల దయగల ద్వీపంగా అండమాన్‌ను మార్చివేసింది. -
మొసలి అస్వస్థత
వేసవికాలం.. సుందరవనం అనే అడవిలో ఒక జింక పిల్ల అమ్మకు చెప్పకుండా బయలుదేరింది. దానికి దాహమై నీరు తాగడానికి ఒక మడుగులోకి దిగింది. ఆ మడుగులో ఒక మొసలి ఉందన్న సంగతి ఆ జింకపిల్లకు తెలియదు. అది నీటిలోకి దిగిన వెంటనే ఆ మొసలి దాని కాలును గట్టిగా పట్టుకుంది. అప్పుడది అమ్మకు చెప్పకుండా వచ్చినందుకు ఎంతో బాధపడింది. తర్వాత లేని ధైర్యం తెచ్చుకొని మొసలితో ‘ఓ మొసలి మామా! నీకు అస్వస్థతగా ఉన్నట్లు తెలుస్తోంది. దానికో మందు చెబుతాను. నన్ను వదిలిపెట్టు అంది. ఆ మొసలి నిజంగానే అస్వస్థతతో బాధపడుతున్నది. అది జింకపిల్ల మాటలకు ఆశ్చర్యపోయి ‘నీకు నా అస్వస్థత సంగతి ఎలా తెలుసు?’ అని అడిగింది. ‘నువ్వు నా తల బదులు కాలు పట్టుకున్నప్పుడే తెలిసింది’ అని చెప్పిందా జింకపిల్ల తెలివిగా. అప్పుడే అక్కడికి ఒక బుజ్జి నక్క రావడాన్ని గమనించింది జింకపిల్ల. వెంటనే అది ‘అదిగో! ఆ నక్కను తింటే నీ అస్వస్థత మాయమౌతుంది. దాన్ని పట్టుకో!’అంటూ ఆ బుజ్జి నక్కను చూపించింది. సరేనంటూ ఆ జింకపిల్లను వదిలిపెట్టింది మొసలి. ఒడ్డుకు చేరిన జింక పిల్ల ‘బతుకు జీవుడా’ అనుకుంటూ ఎదురుగా ఉన్న బుజ్జి నక్క ఆగమన్నా ఆగకుండా పరుగెత్తింది. బుజ్జి నక్కకూ ఆ మడుగులో మొసలి ఉన్న సంగతి తెలియదు. అది కూడా అమ్మకు చెప్పకుండానే వచ్చింది. ఆ జింకపిల్ల వలె అదీ నీళ్లు తాగడానికి మడుగులోకి దిగింది. అప్పుడా మొసలి బుజ్జి నక్క కాలును పట్టుకొని ‘నా అస్వస్థతకు నీ మాంసమే మందని ఆ జింకపిల్ల చెప్పింది. నిన్ను తిని నా అస్వస్థతను పోగొట్టుకుంటాను’ అన్నది. వెంటనే బుజ్జి నక్క తెలివిగా ‘అయ్యో.. నేను వింత వ్యాధితో బాధపడుతున్నాను. నన్ను తిన్నవారిక్కూడా వ్యాధి సోకుతుంది. కావాలంటే అదిగో ఆ ఒడ్డు మీదున్న తోడేలు పిల్లనడుగు’ అంది. అప్పుడు మొసలి ‘ఈ నక్క చెప్పింది నిజమేనా’ అంటూ తోడేలును అడిగింది. ‘ఔను నిజమే’ అంది తోడేలు పిల్ల. అప్పుడు నక్క ‘నీ అస్వస్థతకు సరైన మందును వైద్యుడైన ఎలుగుబంటి చెబుతుంది దాన్నడుగు’ అన్నది. దాంతో బుజ్జి నక్కను వదిలేసింది మొసలి. వెంటనే తోడేలుతో కలిసి నక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంతలోకే ఎలుగుబంటి వచ్చిందక్కడికి. మొసలి తన అస్వస్థతకు దాన్ని మందు అడిగింది. మొసలి ఆ మడుగులో ఉన్న సంగతి ఎలుగుబంటికి తెలుసు గనుక అది నీటిలోకి దిగకుండానే ఒడ్డు మీదే ఉండి, కొన్ని ఆకులను దానిపై విసిరేసి వాటిని తినమని చెప్పింది. ఆ ఆకులను ఆరగించింది మొసలి. తర్వాత ‘ఎలుగు మామా! ఆ బుజ్జి నక్కకు వింత వ్యాధి ఉందట.. నిజమేనా!’అని అడిగింది అమాయకంగా. అప్పుడు ఎలుగుబంటి నవ్వి ‘దానికా వ్యాధి ఉంటే నా దగ్గరకు వచ్చేది. ఈ అడవిలో నేను తప్ప వైద్యం చేసేవారు లేరు కదా’ అంది. ‘మరి తోడేలు కూడా అది నిజమని చెప్పిందే’ అంది మొసలి. ‘దానికది ఊతపదం. ఏం మాట్లాడినా అది ఔను! నిజమే అంటుంది. ఆ జింక పిల్ల,బుజ్జి నక్క తెలివిగలవి. ఆపదలో ఎలా తప్పించుకోవాలో చేసి చూపెట్టాయి. అయినా నువ్వు జంతువుల పిల్లల మీద పడటమేంటీ? రేప్పొద్దున నీ బిడ్డను ఏ జంతువైనా మింగేస్తే నీకెలా ఉంటుంది? అలాగే మిగిలిన జంతువులు కూడా కదా! చిన్న జంతువులకు భవిష్యత్తు ఉందని, వాటి జోలికి వెళ్లొద్దని మృగరాజు సింహం జంతువులన్నిటినీ ఆదేశించింది. అది నీకు తెలీదా? వాటిని చంపుతున్నావు కనుకనే నీ ఆరోగ్యం చెడింది. ఈ సంగతి సింహానికి తెలిస్తే ఊరుకోదు. ఇకనుంచైనా వాటి జోలికి వెళ్లకు. అదిగో! ఆ చెట్టు పండ్లను తిని కడుపు నింపుకో! అవి ఆరోగ్యాన్నిస్తాయి’ అంది ఎలుగుబంటి. ‘ఈ అడవిలో ఉన్న ఈ ఒక్క మడుగు వల్ల పాపం చిన్న జంతువులన్నీ ఈ మొసలికి చిక్కుతున్నాయి. మరికొన్ని కొలనులు తవ్వించి, జంతువుల దాహార్తి తీర్చమని సింహానికి చెప్పాలి’ అనుకుంటూ అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. -
హరిణి.. హరివిల్లులా!
తూర్పు కనుమల్లో భాగమైన నల్లమల (Nallamala) అడవులంటేనే జీవవైవిధ్యానికి పెట్టింది పేరు. ఏనుగు, సింహం (Lion) తప్ప తక్కిన జంతువులన్నింటికీ ఈ అడవి ఆవాసప్రాంతంగా నిలిచింది. 17 రకాల కార్నివోర్స్ (మాంసాహార జంతువులు), 8 రకాల హెర్బీవోర్స్ (శాకాహార జంతువులు)తో పాటు పలు రకాల పక్షులు, సరీసృపాలు, చేపలు, ఉభయచర జీవులు, కీటకాలు తదితర జంతుజాలం ఈ అడవిలో సహజీవనం చేస్తూ బయోడైవర్సిటీకి (Biodiversity) ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. 8 రకాల హెర్బీవోర్స్లో ఏడు రకాలు జింకలే ఉండటం విశేషం. వీటిల్లో 300 కేజీల బరువు తూగే కణితి (సాంబర్), నీల్గాయ్ వంటి భారీ జింకలతో పాటు కుందేలు కంటే కాస్త చిన్నదిగా కనిపించే మౌస్‌డీర్ సెతం ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని నాగార్జున సాగర్– శ్రీశైలం (Srisailam) అభయారణ్యం పరిధిలోని ఆత్మకూరు అటవీ డివిజన్లో ఇవి అధిక సంఖ్యలో సంచరిస్తున్నాయి. – ఆత్మకూరు రూరల్ప్రమాదం అంచున.. కొండ గొర్రె కంటే కాస్త భారీగా, కణుతుల కంటే కాస్త చిన్నగా ఉండే మరో ఆంటిలోప్.. బుర్రజింక. చింకారా అనికూడా పిలిచే ఈ జింక తలపై రెండు కొమ్ములు కృష్ణజింకను పోలి పురి తిరిగి ఉంటాయి. కానీ వాటి అంత పొడవు పెరగవు. నల్లమలలో వీటి సంఖ్య బాగా తగ్గిపోయింది. అరుదుగా మాత్రమే ఇవి కనిపిస్తున్నాయి. రైతులు వ్యవసాయ ఉపకరణాలలో చింకారా కొమ్ములను అందంగా వినియోగిస్తుంటారు. చర్నాకోల పిడిగా, మోకులు, పగ్గాలు తయారు చేసేందుకు ఉపయోగపడే పరికరంగా కూడా వీటి కొమ్ములను రైతులు సేకరించే వారు. సాంబర్ డీర్..జింకలలో అతి పెద్దది కణితి(సాంబర్ డీర్). దట్టమైన అటవీ ప్రాంతంలోని పర్వత ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా జీవిస్తుంటాయి. ఇవి పెద్ద పంగల కొమ్ములు కలిగి ఉంటాయి (మగవాటికి మాత్రమే కొమ్ములుంటాయి). ఈ కొమ్ములను అవి నిర్ణీత సమయంలో విసర్జిస్తుంటాయి. కొన్ని సార్లు ఆడ కణితి కోసం జరిగే పోరాటంలో అవి ఊడి పోతుంటాయి.నల్లమలలో ప్రధాన రక్షిత వన్యప్రాణి అయిన పెద్దపులికి ఆహార జంతువులుగా జింకలు పర్యావరణ సమతుల్యానికి తమవంతు కృషి చేస్తున్నాయి. జింకలతో పాటు అడవి పంది, ముల్ల పంది, కుందేలు వంటి జంతువులు కూడా పులి ఆహార మెనూలో ఉన్నాయి. కణుతులు ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని పెద్ద పులులకు చక్కటి ఆవాసంగా గుర్తిస్తారు. నేనూ జింకనే..జింకకాని జింక ఈ మౌస్ డీర్. నిజానికి ఇది జింకజాతి వన్యప్రాణి కాదు. కాని రూపం బట్టి దీన్ని మూషిక జింకగా చెబుతారు. ఇది పంది జాతికి చెందిన ప్రాణి. వెనక కాళ్లు కాస్త బలహీనంగా కనిపించే ఈ జింక పూర్తిగా దట్టమైన వర్షారణ్యాలను పోలిన అడవుల్లో కనిపిస్తుంది. పెద్ద కుందేలు పరిమాణంలో ఉండే మూషిక జింక నల్లమలలోని గుండ్లబ్రహ్మేశ్వరం, రుద్రకోడు, పెచ్చెర్వు వంటి దట్టమైన పర్వతప్రాంత అడవుల్లో కనిపిస్తుంది. ఇది సాధారణంగా రాత్రుళ్లు మాత్రమే తిరుగాడుతుంది. చెట్టు తొర్రల్లో నివాసముంటుంది. నల్లమలలో ఇది అంతరించి పోయింది అనుకున్న సమయంలో తిరిగి కనిపిస్తుండటం శుభపరిణామం. కొమ్ములతోకుమ్మేస్తూ..తలపై రెండు, పనపై మరో రెండు చిన్న కొమ్ములు కలిగి ఉండడమే కొండ గొర్రె ప్రత్యేకత. ఈ కారణంగానే కొండగొర్రెను చౌసింగా అని కూడా పిలుస్తారు. నల్లమలలోని కొండ తిప్పలపై నివసించే ఈ వన్యప్రాణి ఉనికి దట్టమైన పచ్చటి అడవికి గుర్తుగా చెప్పుకోవచ్చు. కొండగొర్రె తనను తాను మాంసాహార జంతువుల నుంచి రక్షించుకునేందుకు కొండకొమ్ముల ఏటవాలును వీలుగా ఉపయోగించుకుంటుంది. కొండగొర్రె మాంసం రుచిగా ఉంటుందన్న కారణంగా ఇవి ఎక్కువగా వేటగాళ్ల చేతిలో బలి అవుతుంటాయి. అడవికే అందం..పొడ దుప్పి (స్పాటెడ్ డీర్).. దీనిని చుక్కల దుప్పి అని కూడా అంటారు. జింకలలో అత్యంత అందమైనది. బంగారు వర్ణం చర్మంపై తెల్లటి మచ్చలతో అత్యంత లావణ్యంగా కనిపిస్తుంది. వీటిలో కూడా మగ వాటికి పంగలతో కూడిన కొమ్ములు ఉంటాయి. దుప్పులు కూడా తమ కొమ్ములను వదులుతుంటాయి. మగ దుప్పి అరిచే శబ్దాన్ని బట్టి వర్లుపోతు అనికూడా పిలుస్తారు. ఇవి అడవుల్లో అన్ని ప్రదేశాల్లో సంచరిస్తుంటాయి. పులి ఆహారంలో ఇది కూడా ఉంది.మనిమేగం.. ప్రత్యేకం నల్లమలలో ప్రధానంగా కనిపించే మరో ఆంటిలోప్ మనిమేగం (నీల్గాయ్). ఇది కూడా భారీ శరీరాన్ని కలిగి ఉంటుంది. కొంతమేర గుర్రాన్ని పోలి ఉండే మగ మనిమేగాలు వయస్సుకు వచ్చాక నల్లటి పైకప్పుతో కనిపిస్తాయి. అందుకే వీటిని నల్లపోతు అనికూడా అంటారు. కృష్ణజింకలు, మనిమేగాలు ఎక్కువగా సంచరిస్తున్నాయంటే అది అటవీ క్షీణతకు సంకేతంగా భావిస్తారు. ఎందుకంటే ఈ రెండు జింకలు పెద్దపెద్ద గడ్డి మైదానాల్లో మాత్రమే మనగలుగుతాయి. జంగిల్ మే సవాల్.గడ్డి మైదానాల్లో గుంపులుగా జీవించే జింకల్లో కృష్ణజింక (బ్లాక్ బక్) ప్రధానమైనది. మగ జింకలకు పొడవాటి కొమ్ములు ఉంటాయి. పురి తిరిగినట్లుండే ఈ కొమ్ములపైన ఉన్న పురులను బట్టి వాటి వయస్సును నిర్ధారిస్తారు. ఇవి బాగా వయస్సుకు వచ్చాక వాటి చర్మం నల్లటి కప్పును కలిగి అందంగా తయారవుతుంది. ఇలా బలంగా నల్లటి కప్పుతో కనిపించే కృష్ణజింక.. జింకల గుంపుకు నాయకత్వం వహిస్తుంది. చదవండి: లైవ్‌లో కోడిపందేలపై బెట్టింగ్‌లు...అత్యంత వేగంగా పరిగెత్తే వీటిని వేటాడే మాంసాహార జంతువు నల్లమలలో లేదు అంటే అతిశయోక్తి కాదు. గంటకు 100 కి.మీ పైగా వేగంతో పరిగెత్తే చీతాలు దేశంలో కనుమరుగు కావడంతో వీటికి పోటీపడి పరిగెత్తే జంతువులు లేకుండా అయ్యాయి. తోడేల్లు, హైనాలు మాటువేసి వీటిని చంపుతుంటాయి. కృష్ణ జింక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక జంతువుగా ఉంది.జీవవైవిధ్యంలో జింకలు కీలకం నల్లమలలో ముఖ్య రక్షిత వన్యప్రాణి పెద్దపులి, ఆతరువాతి స్థానాల్లో ఉన్న చిరుత వంటి మాంసాహార జంతువులకు ఆహార సమృద్ధి కలిగిస్తూ మొత్తం పర్యావరణ సంరక్షణలో జింకలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. పెద్దపులికి నల్లమల ఆవాసంగా మారడంలో ఈ జింకలు కూడా ప్రధాన కారణం. నల్లమలలో జీవ వైవిధ్యంలో ఇవి కీలకంగా ఉన్నాయి. – పట్టాభి, ఎఫ్ఆర్వో, ఆత్మకూరు రేంజ్ -
జింక చర్మాల అక్రమ రవాణా
వజ్రకరూరు: అనంతపురం, కర్నూలు జిల్లాల్లో జింకలను వేటాడి చంపి..వాటి మాంసాన్ని విక్రయించడంతో పాటు చర్మాలను అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అనంతపురం జిల్లా వజ్రకరూరు పోలీసులు అరెస్టు చేసి 24 జింక చర్మాలు, రెండు కొమ్ములు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం వజ్రకరూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ నాగస్వామి..ఫారెస్ట్ సెక్షన్ అధికారి కరీముల్లా, బీట్ ఆఫీసర్ సతీష్‌తో కలసి కేసు వివరాలను వెల్లడించారు.గుంతకల్లుకి చెందిన షికారి దేవరాజు, షికారి గోవిందు, అనంతపురం నగరానికి చెందిన షికారి బాబు, షికారి బాలరాజు, గుంతకల్లు మండలం ఆచారమ్మ కొట్టాలకు చెందిన వడ్డే పెద్దఅంజి గుంతకల్లు, వజ్రకరూరు, ఆలూరు, చిప్పగిరి తదితర ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో కత్తెరలు ఏర్పాటు చేసి జింకలను వేటాడేవారు. వాటి మాంసాన్ని విక్రయించి చర్మాలను కర్ణాటకలోని బళ్లారి, కంప్లి, హొస్పేట్ తదితర ప్రాంతాలకు అక్రమ రవాణా చేసేవారు.శనివారం సాయంత్రం 24 జింక చర్మాలు, రెండు కొమ్ములను సంచుల్లో వేసుకుని కర్ణాటక వైపు వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం రాగా.. అటవీ శాఖ అధికారులతో కలసి వజ్రకరూరు మండలం కొనకొండ్ల సమీపంలోని బళ్లారి జాతీయ రహదారిలో వీరిని పట్టుకున్నారు. నిందితులను ఆదివారం అనంతపురంలోని మొబైల్కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు. -
గోదా‘వడి’.. జింకల్లో అలజడి
సాక్షి అమలాపురం:చుట్టూ ఇసుక తిన్నెలు.. వాటి మధ్య ఒంపులు తిరుగుతూ ప్రవహించే గోదావరి.. అక్కడక్కడా నీటి చెలమలు.. ఆరు అడుగుల ఎత్తున పెరిగే గడ్డి దుబ్బులు.. వాటి కొసన తెల్లటి వింజామరల్లాంటి గడ్డి పువ్వులు. ప్రకృతి స్వర్గధామమైన కోనసీమలో గోదావరి లంకల్లో కనిపించే సహజ దృశ్యాలు ఇవి. చూసిన కనులదే భాగ్యం అన్నట్టు అప్పుడప్పుడూ చెంగుచెంగున గెంతే కృష్ణ జింకల సమూహాలు కనువిందు చేస్తాయి. గోదావరి నదీ పాయల్లోని మధ్య ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొన్ని లంకల్లో జనం నివాసముండరు. ఆ లంకల్లో కృష్ణ జింకలు నివాసముంటున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం, కొత్తపేట, అయినవిల్లి, ఆత్రేయపురం, ఆలమూరు, తూర్పుగోదావరి జిల్లా పరిధిలో రాజమహేంద్రవరం రూరల్, కడియం మండలాల్లోని గౌతమీ గోదావరి లంకల్లో వీటి ఉనికి అధికం. ఇటీవల మొక్కజొన్న పట్టుబడికి వెళ్లిన రైతులు ఊబలంక, నారాయణలంక, రావులపాలెం, కేదార్లంక సమీపంలో కృష్ణ జింక గుంపులు ఉండటాన్ని గుర్తించారు. లంక రైతులకు ఇవి పెంపుడు జంతువులుగా మారిపోయాయి. వీటి ఆలనాపాలనా స్థానిక లంక రైతులే చూస్తుంటారు. వీటిని వేటాడేందుకు వచి్చన వారిని రైతులే అడ్డగిస్తారు. అవసరమైతే పోలీసులకు, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించిన సందర్భాలున్నాయి. ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టాలి గోదావరిలో లంక భూములను రెవెన్యూ అధికారులు సొసైటీలకు అప్పగిస్తున్నారు. ఇక్కడ వరదలకు ఇసుక మేటలు వేస్తుంది. ఇది వ్యవసాయానికి యోగ్యం కాదంటూ ప్రజాప్రతినిధులతో కలిసి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. తవ్వకాల వల్ల ఇక్కడ ఉండే చీమచింత చెట్లు, తుమ్మ చెట్లు, రేగి చెట్లు, రెల్లు గడ్డి దుబ్బులు కనుమరుగవుతున్నాయి. దీంతో కృష్ణ జింకలకు సహజ సిద్ధమైన ఆవాసాలు లేకుండా పోతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇవి నివాసముంటున్న లంక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలను ప్రభుత్వం నిలిపివేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. లంకలను అటవీ ప్రాంతాలుగా మార్పు చేయాలని, అప్పుడే ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టేందుకు వీలు కలుగుతుందని వారంటున్నారు. దీంతోపాటు వరదల సమయంలో వీటి రక్షణకు సరైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. వరదలతో ముప్పు వేటగాళ్ల కన్నా గోదావరి వరద కృష్ణ జింకల ఉనికికి ప్రమాదంగా మారింది. ప్రస్తుతం గోదావరికి వరద పోటెత్తడంతో కృష్ణ జింకల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. పోలవరం పరిసర ప్రాంతాల్లో కృష్ణ జింకలు వరదలు వచ్చిన సమయంలో అటవీ ప్రాంతాలకు వెళ్లిపోయేవి. కాని కోనసీమ జిల్లాలో ఆ పరిస్థితి లేదు. ఇవి వరదల్లో కొట్టుకుపోవడం లేదా ఏటిగట్లలో సురక్షిత ప్రాంతాల్లో రక్షణ పొందుతుంటాయి. 2022లో భారీ వరదలకు అధికంగా కృష్ణ జింకలు మృత్యువాత పడ్డాయని లంక రైతులు చెబుతున్నారు. వరదల సమయంలో రైతులను, పశువులను పడవల మీద మెరక ప్రాంతాలకు, ఏటిగట్ల మీదకు తరలిస్తుంటారు. అయితే జింకలను పట్టుకోవడం నేరం కావడం.. అవి వేగంగా పరుగు పెట్టడం వల్ల వీటిని మెరకకు తరలించడం ఇక్కడ రైతులకు అసాధ్యంగా మారింది. మంత్ర ముగ్ధులను చేసే కృష్ణ జింకలు కృష్ణ జింక అరుదైన జంతువు. మన రాష్ట్ర అధికార జంతువు కూడా. నలుపు.. తెలుపు.. గోధుమ వర్ణాల్లో మెలికలు తిరిగిన కొమ్ములతో... చెంగుచెంగున గెంతుతూ చూపరులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఇవి మన దేశంతోపాటు పాకిస్తాన్, నేపాల్‌లో కూడా ఉంటాయి. పచ్చగడ్డితోపాటు పండ్లను ఆహారంగా తీసుకునే ఈ జింకలు 15 నుంచి 20 కలిసి మందగా తిరుగుతుంటాయి. వీటి కొమ్ములు మూడు నాలుగు మెలికలు తిరిగి 28 అంగుళాల పొడవు ఉంటాయి. మగ జింకలు పైభాగం నలుపు, లేదా గోధుమ రంగులో ఉంటుంది. దిగువన తెల్లరంగులో ఉంటుంది. ఆడజింకలు పూర్తిగా గోధుమ రంగులో ఆకట్టుకునేలా ఉంటాయి. లంకలను అటవీ ప్రాంతాలుగా గుర్తించాలి జింక రక్షణ కోసం అటవీ, జీవవైవిధ్య మండలిని, జిల్లా రెవెన్యూ అధికారులను పలు దఫాలుగా కోరుతున్నా ప్రయోజనం లేకుండా పోయింది. జింకలు నివాసముంటున్న లంకలను అటవీ ప్రాంతాలుగా గుర్తిస్తే ఆ చట్టాలతో కొంత రక్షణ కలుగుతుంది. లేకపోతే భవిష్యత్ తరాలు కృష్ణ జింకలను కేవలం ఫొటోల్లోనే చూడాల్సి వస్తుంది. – పెదపూడి బాపిరాజు, వాడపాలెం, కొత్తపేట మండలం ప్రభుత్వానికి నివేదిస్తాం కృష్ణ జింకల రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిస్తాం. వరదల సమయంలో కృష్ణ జింకలు అవి ఎంపిక చేసుకున్న సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతాయి. వరదలు తగ్గిన తరువాత తిరిగి తమ నివాస ప్రాంతాలకు వెళతాయి. – వరప్రసాద్, కోరంగి వైల్డ్ లైఫ్ రేంజ్, కాకినాడ జిల్లా -
బాలికను కాటేసిన జింక బొమ్మ
కర్ణాటక: శివమొగ్గ నగరంలో డ్రైనేజీ కాలువపై నిలబడి ఉండగా స్లాబు కూలి వ్యక్తి మరణించిన సంఘటన మరువక ముందే మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ముద్దనకొప్పలో ఉన్న ట్రీ పార్క్‌లో సిమెంటు జింక బొమ్మపై కూర్చుని బాలిక ఆడుకుంటుండగా జింక విరిగిపడి బాలిక నిమిషాల్లోనే మరణించింది. వాకింగ్ వస్తే.. వివరాలు.. గాంధీ బజార్ రోడ్డులో బట్టల షాపు యజమాని అయిన హరీష్ అంబోరె, లక్ష్మీ దంపతుల కుమార్తె సమీక్ష (6), లక్ష్మీ, కూతురుతో కలిసి ఆదివారం సాయంత్రం పార్క్‌కు వాకింగ్ కోసం వచ్చారు. ఈ సమయంలో సమీక్ష అక్కడ ఉన్న జింక బొమ్మపై కూర్చుంది. ఇంతలో ఆ బొమ్మ కూలిపోవడంతో కిందపడ్డ సమీక్ష తీవ్ర గాయాలపాలైంది. హఠాత్ పరిణామంతో లక్ష్మీ కేకలు వేస్తూ కూతురిని మెగ్గాన్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆమె చేతుల్లో చిన్నారి కన్నుమూసింది. కలెక్టరేట్ ముందు నిరసన ఈ నేపథ్యంలో మంగళవారం భావసార క్షత్రియ మహాజన సమాజం నేతలు కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. పార్కులో నాసిరకం నిర్మాణాలే ఈ ఘోరానికి కారణమని, అనేక బొమ్మలు శిథిలమైనట్లు తెలిపారు. అధికారులు కనీసం పట్టించుకోవడం లేదన్నారు. చేయని తప్పుకి బాలిక చనిపోయిందని, ఆ కుటుంబానికి పరిహారం అందజేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సుమారు పాతిక ఎకరాల్లో ఉన్న పార్కును అటవీశాఖ పర్యవేక్షిస్తోంది. -
కలవరపెడుతున్న 'జాంబీ డీర్ వ్యాధి'! మనుషులకు కూడా వస్తుందా?
మానవ తప్పిదాలతో పర్యావరణాన్ని చేజేతులారా కలుషితం చేశాం. దానికి ప్రతిగా రోజుకో కొత్త వింత వ్యాధులు ప్రకృతి ప్రకోపానికి ఫలితమా! అన్నట్టుగా పుట్టుకొస్తున్నాయి. ఆ వ్యాధులు జంతువులను నుంచి మొదలు పెట్టి మానవులకు సంక్రమిస్తున్నాయి. వాటికి చికిత్స విధానం ఉందో లేదో తెలియని స్థితి. పోనీ రాకుండా నివారించేలా ఏం చేయాలో ఎలా సంక్రమించకుండా చెయ్యాలనేది కూడా చిక్కు ప్రశ్నే. అలాంటి మరో వింత వ్యాధి అగ్రరాజ్యాన్ని ఓ కుదుపు కుదుపేస్తుంది. అక్కడ ఏటా వందలాది జంతువులు ఈ వ్యాధి బారినపడటంతో ఎక్కడ మానవులకు సంక్రమిస్తుందో అని భయాందోళన చెందుతున్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ ఏంటా వ్యాధి? మానువులకు సంక్రమించే అవకాశం ఉందా? అగ్రరాజ్యం అమెరికాలో 'జాంబీ డీర్ వ్యాధి' కలకలం సృష్టిస్తోంది. అక్కడ వందలాది జంతువులు ఈ వ్యాధి బారిన పడి మరణిస్తున్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లోని జంతువుల్లో తొలిసారిగా ఈ వ్యాధిని కనుగొన్నారు. ఆ తర్వాత నుంచి వందల కొద్ది జంతువులు ఈ వ్యాధి బారినే పడటం శాస్త్రవేత్తలను ఒకింత భయాందోళనలకు గురి చేసింది. ఈ వ్యాధి ప్రముఖంగా ఉత్తర అమెరికా, కెనడా, నార్వే, దక్షిణ కొరియా వంటి ప్రాంతాల్లోని జింక, లేళ్లు, దుప్పి వంటి జంతువుల్లో ప్రబలంగా ఉన్నట్లు తెలిపారు. దీని కారణంగా బద్ధకం, ఉన్నటుండి తూలిపోవడం, ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం వంటి నాడీ సంబంధిత లక్షణాలు బహిర్గతమవుతాయి. ప్రధానంగా జంతువులకే సంక్రమించినప్పటికీ అది చివరికి మానవులకు కూడా సంక్రమించే ప్రమాదం లేకపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ 'జాంబీ డీర్ డిసీజ్'ని వైద్య పరిభాషలో (క్రానిక్ వేస్టింగ్ డిసీజ్(సీడబ్ల్యూడీ) అంటారు. అంటే ప్రోటీన్ ముడతల్లో తేడాలతో వచ్చే అరుదైన వ్యాధి. దీన్ని చాలా నెమ్మదిగా చుట్టుముట్టే ప్రమాదకర వ్యాధిగా నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు మానవులకు సోకిన దాఖలాలు లేకపోయినా భవిష్యత్తులో మానవులకు సంక్రమించదన్న గ్యారంటీ లేదని ఎపిడెమియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు బ్రిటన్‌లో వచ్చిన 'మ్యాడ్ కౌ వ్యాధి(పిచ్చి ఆవు వ్యాధి)' గుర్తు చేసుకున్నారు. వందలకొద్ది ఆవులను వధించడంతో వచ్చిన పిచ్చి ఆవు వ్యాధి ఎలా మానువులకు సంక్రమించిందో ఉదహరిస్తూ వార్నింగ్ ఇస్తున్నారు నిపుణులు. It starts. You watch: be walking down the street one day, happy about how things are finally going right, and CHOMP!! zombie deer bites ya in the ass. pic.twitter.com/HOgQuQ5lEp — Ryan (@Ryno_Charger) December 24, 2023 ఈ మేరకు సీడబ్ల్యూడీ పరిశోధకుడు డాక్టర్ కోరి ఆండర్సన్ మాట్లాడుతూ..మానువులకు వస్తుందా? రాదా? అని నిర్థారించి చెప్పకలేకపోయినప్పటికీ.. సంసిద్ధగా ఉండటం మాత్రం ముఖ్యమని నొక్కిచెప్పారు. ఇది ఒక ప్రాంతంలో విజృంభిస్తే..పూర్తి స్థాయిలో తొలగించడం అసాధ్యం అని అన్నారు. ఇది ఆయా భూభాగంలోని మట్టి లేదా ఉపరితలాల్లో ఏళ్లుగా ఆ వ్యాధి కొనసాగుతుందని చెబుతున్నారు. ఇది ఒక రకమైన ప్రోటీయోపతి లేదా నిర్మాణపరంగా అసాధారణమైన ప్రోటీన్ల వ్యాధి. Scientists confirm this is the best approach to combating the zombie deer disease pic.twitter.com/HmQKCF8STO — Hot White Hennessy (@Phillystunna221) December 25, 2023 ఇది సోకిన జంతువులు గానీ మనుషులు గానీ చనిపోతే అక్కడ భూమిలోనే డికంపోజ్ అయితే అలానే ఆ వ్యాధి తాలుకా గ్రాహకాలు ఉండిపోతాయి. దీంతో కొన్నేళ్ల పాటు ఆయా ప్రాంతాల్లో ఆ వ్యాధి కొనసాగుతుంది. ఎలాంటి క్రిమి సంహరకాలు, ఫార్మాల్డిహైడ్, రేడియేషన్ల, అధిక ఉష్ణోగ్రతలకు ఆ వ్యాధి లొంగదని మరింతగా నిరోధకతను చూపిస్తుందని అన్నారు. ఈ విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) 1997 నుంచే సీడబ్ల్యూడీకి సంబంధించిన వ్యాధులు మానవులకు సంక్రమించకుండా నిరోధించే ప్రాముఖ్యత గూర్చి నొక్కి చెబుతుండటం గమనార్హం. Damn, Rudolph caught the zombie deer disease 💀 pic.twitter.com/vdEZr9aHyh — Creepy.org (@CreepyOrg) December 25, 2023 (చదవండి: అనుకోని ప్రమాదంలో చిద్రమైన వ్యక్తి ముఖాన్ని పునర్నిర్మించిన శాస్త్రవేత్తలు!) -
Video: ఇదేం వింత.. పామును కసకస నమిలేసిన జింక..
అడవి అనే పదం వింటే కృూర జంతువులు, వాటి వేట గుర్తుకొస్తుంది. జంతురాజ్యమైన అడవిలో సాధు జంతువులు తమకు ఎప్పుడు, ఏ వైపు నుంచి ప్రమాదం వచ్చిపడుతుందోనని భయపడుతూనే బతుకుతుంటాయి. సాధారణంగా పులులు, సింహాలు ఎక్కువగా టార్గెట్ చేసేది జింకలనే. జింకలు చాలా సున్నితమైనవి. ఇవి పూర్తిగా శాఖాహారులు.. మాంసాహారం జోలికి వెళ్లవు. గడ్డి, ఆకులు, పండ్లు తింటూ తమ జీవనాన్ని కొనసాగిస్తుంటాయి. అయితే సాధు జంతువైన ఓ జింక మాంసాహారాన్ని తీసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నమ్మడానికి విడ్డూరంగా ఉన్నా.. ఇదే నిజం.. జింక ఏకంగా చనిపోయిన పామును నోటితో నమిలి మింగేసింది. ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత్ నందా ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ‘ప్రకృతిని బాగా అర్థం చేసుకోవడానికి కెమెరాలు ఉపయోగపడుతున్నాయి. శాఖాహారులైన జంతువులు ఒక్కోసారి పాములను కూడా తింటాయి’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హెర్బివర్(శాఖాహారి) జాతికి చెందిన జింక ఇలా మాంసాహారం తినడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని నెటిజన్లు చెబుతున్నారు.మరోవైపు జింకలు మాంసాన్ని వెంబడించవచ్చని నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ పేర్కొంది. జింకలో ఫాస్పరస్, ఉప్పు, కాల్షియం వంటి ఖనిజాలను ఉండవని.. ముఖ్యంగా శీతాకాలపు నెలలలో మొక్కల జీవితం తక్కువగా ఉంటుందని,. ఈ కారణాలతో జింకలు మాంసాన్ని తినడానికి అవకాశం ఉంటుందని తెలిపింది. చదవండి: ఆ రోబోకి మనిషిలా శ్వాస తీసుకోవడం, చెమటలు పట్టడం జరుగుతాయట! Cameras are helping us understand Nature better. Yes. Herbivorous animals do eat snakes at times. pic.twitter.com/DdHNenDKU0 — Susanta Nanda (@susantananda3) June 11, 2023 -
ఉప్పు తప్పించును వేసవి ముప్పు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వేసవి మండిపోతుండటంతో జంతువుల ఆరోగ్య పరిరక్షణపై అటవీ అధికారులు దృష్టి సారిస్తున్నారు. మనుషుల్లాగే వన్యప్రాణులు కూడా శరీరంలో ఖనిజాల (మినరల్స్) శాతం తగ్గిపోతే అనారోగ్యం బారిన పడతాయి. రోజువారీ ఆహారంలో భాగంగా ఖనిజాలు.. కూడా సరిగా అందితేనే జీవ క్రియలు సజావు గా సాగుతాయి. అయితే అడవుల్లో బతికే జంతువులు సహజ సిద్ధంగా తినే మేత ద్వారా ఉప్పు (సోడియం)ను తీసుకుంటాయి. బండలు, కర్రల్ని, నీటి మడుగుల వద్ద మట్టిని నాకుతూ శరీర సమతాస్థితిని కాపాడుకుంటాయి. అయితే గతంలో కంటే ప్రస్తుతం సహజసిద్ధ ఉప్పు లభ్యత తగ్గిపోయింది. మరోవైపు వేసవిలో డీహైడ్రేషన్ కారణంగా మరింత ఎక్కువగా మినరల్స్ అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో తగినంత ఉప్పు అందకపోతే వన్యప్రాణులు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. దీని ని దృష్టిలో ఉంచుకుని వాటి ఆవాసాల్లోనే నీటి కుంటల వద్ద అధికారులు ఉప్పు గడ్డలు ఏర్పాటు చేస్తున్నారు. గత రెండేళ్లుగా కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలో ఈ పద్ధతిలో జంతువుల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. మట్టి, ఉప్పును కలిపి.. సహజమైన ఉప్పు, చెరువు మట్టి రెండింటినీ కలిపి (70 శాతం ఉప్పు, 30 శాతం చెరువు పూడిక మట్టి) కుప్పలా తయారు చేస్తారు. ఒక అడుగు లేదా అడున్నర ఎత్తులో నీటి కుంటలకు సమీపంలో జంతువులకు కనిపించేలా ఉంచుతారు. దాహం తీర్చుకోవడానికి వచ్చే జంతువులు కాళ్లు, కొమ్ములతో కుప్పల్ని గీరుతూ, మట్టిలో ఉన్న ఉప్పును నాలుకతో చప్పరిస్తుంటాయి. ఒక దాన్ని చూసి మరొకటి అలా నాకుతూ ఉంటాయి. ఒక్కోసారి గుంపులుగా కూడా వస్తుంటాయి. అలా పదే పదే నాకడం వల్ల వాటికి అవసరమైనంత ఉప్పు లభిస్తుంది. ఇప్పటికీ గ్రామాల్లో పశువులు, మేకలు, గొర్రెలకు ప్రత్యేకంగా ఉప్పును నాకిస్తుంటారు. ఈ విధానాన్నే అధికారులు అడవిలో ఉపయోగిస్తున్నారు. మొదట మార్కెట్లో దొరికే రెడీమేడ్ ఉప్పు గడ్డలను వాడేవారు. అయితే వాటి గడువు తేదీ, ప్రాసెస్ కారణంగా జంతువులకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని అటవీ సిబ్బందే సాధారణ ఉప్పును మట్టితో కలిపి జంతువులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఖనిజ లోపం ఏర్పడకుండా.. వన్యప్రాణుల్లో ఖనిజ లోపం రాకుండా నీటికుంటల వద్ద ఉప్పు గడ్డలను ఏర్పాటు చేస్తున్నాం. దాహం తీర్చుకోవడానికి వచ్చినప్పుడు మట్టిలో ఉన్న ఉప్పును అవి చప్పరిస్తున్నాయి. ఇది వాటి ఆరోగ్యాన్ని కాపాడుతోంది. – ఎస్.మాధవరావు ఎఫ్‌డీవో, జన్నారం, మంచిర్యాల జిల్లా -
జింక డాన్స్ అదుర్స్
-
మూషిక జింక.. లగెత్తడమే ఇక.. ప్రపంచ జింక జాతుల్లో అతి చిన్నవి
బుట్టాయగూడెం: ఒకప్పుడు మూషిక మొహం.. జింక దేహంతో అలరారిన పురాతన కాలం నాటి అతి చిన్న మూషిక జింకలు (మౌస్ డీర్) పాపికొండలు అభయారణ్యంలో సందడి చేస్తున్నాయి. అంతరించిన జంతువుల జాబితాలో కలిసిపోయిన ఆ బుల్లి ప్రాణులు ప్రపంచ జింక జాతుల్లో అతి చిన్నవి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల సంవత్సరాల క్రితమే పుట్టిన మూషిక జింక శరీర అమరికలో ఇప్పటివరకు ఎటువంటి మార్పులు జరగలేదట. అందుకే వీటిని సజీవ శిలాజంగా పరిగణిస్తారు. భారత ఉప ఖండంలో మాత్రమే కనిపించే మూషిక జింకల సంచారం పాపికొండలు అభయారణ్యంలోనూ ఉన్నట్టు వైల్డ్‌లైఫ్ అధికారులు గుర్తించారు. జానెడు పొడవు.. రెండు నుంచి మూడు కిలోల బరువుండే మూషిక జింకల సంరక్షణకు ఫారెస్ట్, వైల్డ్‌లైఫ్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. శబ్దం వినబడితే ప్రాణం హరీ! మూషిక జింకలను స్థానిక గిరిజనులు వెదురు ఎలుకలని పిలుస్తారు. వీటికి భయం ఎక్కువ. పెద్ద శబ్దాలు విన్నా.. ఏవైనా జంతువులు దాడి చేసేందుకు వచ్చి నా.. ఎవరైనా వీటిని పట్టుకున్నా భయంతో గుండె పగిలి మరణిస్తాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే మూషిక జింకలు రాత్రి వేళల్లో మాత్రమే అడవిలో సంచరిస్తాయని పేర్కొంటున్నారు. ఇవి ఎక్కువగా వెదురు కూపుల్లోనే నివసిస్తుంటాయి. అడవిలో రాలిన పువ్వులు, పండ్లు, ఆకుల్ని తింటాయి. ఉసిరి, మంగ కాయలు, పుట్ట గొడుగులు, పొదల్లోని లేత ఆకులను ఇష్టంగా తింటాయి. మూషిక జింకల గర్భధారణ కాలం ఆరు నెలలు. ఒక ఈతలో ఒకట్రెండు పిల్లలను మాత్రమే కంటుంది. మళ్లీ వెంటనే సంతానోత్పత్తికి సిద్ధం కావడం వీటి ప్రత్యేకత. చిరుతలు, అడవి కుక్కలు, అడవి పిల్లులు, గద్దలు ఈ మూషిక జింకలను వేటాడుతూ ఉంటాయి. వీటికి తోడు అడవుల నరికివేత, అడవిలో కార్చిచ్చు, వేటగాళ్ల ముప్పు వంటివి మూషిక జింకల ఉనికికి ప్రమాదంగా పరిణమిస్తున్నాయి. పాపికొండల్లో వీటి సంఖ్య 500 పైనే అరుదైన మూషిక జింకల సంచారం పాపికొండలు అభయారణ్యంలో ఎక్కువగానే ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో దట్టమైన అరణ్యం ఉండటం.. వెదురు కూపులు ఎక్కువగా ఉండటంతో 500కు పైగా మూషిక జింకలు ఇక్కడ నివసిస్తున్నట్టు అంచనా. అభయారణ్యంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు మూషిక జింకల జాడ చిక్కినట్టు చెప్పారు. సంతతి పెరుగుతోంది అరుదైన మూషిక జింకలు పాపికొండలు అభయారణ్యంలో ఉన్నాయి. ఇవి ఇతర ప్రాంతాల్లో అంతరించిపోయే జీవులుగా ఉన్నా.. వీటి సంతతి ఇక్కడ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ట్రాప్ కెమెరాల్లో కూడా ఈ మూషిక జింకలు చిక్కాయి. ఇవి సంచరించే ప్రాంతాల్లో జన సంచారం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. దీంతో వీటి ఉనికి బాగా పెరుగు తున్నట్టు గుర్తించాం. – దావీదురాజు నాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, పోలవరం, ఏలూరు జిల్లా -
పాపం.. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాయి
సాక్షి, తిరుపతి: సూళ్లూరుపేట పట్టణంలోని కోళ్లమిట్ట జనావాసంలోకి పలు జింకలు తప్పిపోయి వచ్చాయి. ఈ క్రమంలో షార్ క్వార్టర్స్ డీఓఎస్ కాలనీ ఫెన్సింగ్‌లో ఇరుక్కుని ఓ జింక మృత్యువాత పడింది. జింకలను చూసి కుక్కలు తరమడంతో మరో జింక బావిలో పడిపోయింది. దీనిని గమనించిన స్థానిక యువకుడు వినోద్.. చాకచక్యంగా బావిలో నుంచి జింకను కాపాడాడు. అనంతరం దానికి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. చదవండి: ‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక -
కళ్ల ముందు జింక ఉన్నా.. వేటాడని పులి.. వీడియో వైరల్..
పులి వేటాడితే మామాలుగా ఉండదు. అదనుచూసి చీల్చిచెండాడుతుంది. మరి అలాంటి వన్యమృగం కళ్ల ముందు జింక ప్రత్యక్షమైతే ఊరుకుంటుందా.. వెంటాడి వేటాడి దాని ఆకలి తీర్చకుంటుంది కదా..! కానీ ఈ పులి మాత్రం అలా చేయలేదు. జింక కళ్లముందే కదలాడుతున్నా దాన్ని అసలు పట్టించుకోలేదు. దాన్ని చూస్తూ పక్కనుంచి నడుచుకుంటూ వెళ్లింది తప్ప వేటాడేందుకు ప్రయత్నించలేదు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉత్తరాఖండ్ అటవీ శాఖ ట్విట్టర్లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. 'పులి దానికి ఆకలిస్తేనే వేటాడుతుంది, లేదా ఎవరైనా హాని చేయాలని ప్రయతిస్తేనే దాడి చేస్తుంది. కళ్లముందు జింక ఉన్నా ఏమీ అనుకుండా ఎలా నడుచుకుంటూ వెళ్తుందో చూడండి. పులి ఒక సాధవు.' అని అటవీ అధికారి ట్వీట్ చేశారు. The tiger is a monk. It won't bother you, or be bothered by you. It tries to maintain its composure as much as it can. Even if you are around it, it will most likely be unfazed. And even when a tiger expresses its aggression, it is mock. It's a construct. pic.twitter.com/FcxsduIMx2 — Ramesh Pandey (@rameshpandeyifs) March 1, 2023 ఈ వీడియోపై నెటిజ్లను భిన్నరకాలుగా స్పందించారు. పులి చాలా సైలెంట్‌గా వేటాడుతుంది, ఈ ఒక్క వీడియో చూసి దాన్ని సాధువు అనలేం అని ఓ యూజర్ రిప్లై ఇచ్చాడు. ఆ జింకకు నిజంగా గట్స్ ఉన్నాయి. లేకపోతే పులికి ఎదురుగా అలా ఎందుకు నిలబడుతుంది? దాని జీవితంపై ఆశలు వదిలేసుకుని ఇలా చేసి ఉంటుంది. అని మరో యూజర్ రాసుకొచ్చాడు. చదవండి: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇకపై ఉదయం 3 వరకు బార్లు ఓపెన్.. ఎక్కడంటే? -
Viral Video: రోడ్డు దాటుతూ.. ట్రాఫిక్ రూల్స్ పాటించిన జింక
-
చీతాల మేత కోసం చీతల్! తీవ్రదుమారం
భోపాల్: ప్రాజెక్టు చీతాలో భాగంగా.. నమీబియా నుంచి భారత్‌కు రప్పించిన చీతాల విషయంలో రోజుకో విమర్శ వినిపిస్తోంది. చీతాల రాకతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిసిందే. తాజాగా ఓ ప్రచారం వెలుగులోకి రావడంతో బిష్ణోయ్ కమ్యూనిటీ ప్రజలు నిరసనలకు దిగారు. చీతాల కోసం రాజస్థాన్ నుంచి తెప్పించిన చీతల్(మచ్చల జింక)లను మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్‌లో వదిలినట్లు ప్రచారం మొదలైంది. దీంతో రాజస్థాన్‌కు చెందిన బిష్ణోయ్ తెగ నిరసనలకు దిగింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి సైతం లేఖ రాసింది ఆ తెగ. చీతల్ అనేది అంతరించిపోయే స్థితిలో ఉన్న జంతుజాలమని, అధికారులు తీసుకున్న అర్థంపర్థం లేని నిర్ణయంపై పునరాలోచన చేయాలని వాళ్లు ప్రధానిని లేఖలో కోరారు. అంతేకాదు.. హర్యానా ఫతేబాద్ కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించి.. మినీ సెక్రటేరియెట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. అయితే.. మధ్యప్రదేశ్ అటవీ శాఖ అధికారులు ఈ వివాదంపై స్పష్టత ఇచ్చారు. రాజస్థాన్ నుంచి చీతల్‌ను తెప్పించలేదని, ఎందుకంటే.. అలా తెప్పించాలంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అనే విషయాన్ని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి కునో నేషనల్ పార్క్‌లోనే 20వేలకు పైగా చీతల్స్ ఉన్నాయని, కాబట్టి, బయటి నుంచి తెప్పించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ప్రధాని మోదీ తన పుట్టినరోజు సందర్భంగా.. నమీబియా(ఆఫ్రికా దేశం) నుంచి తెప్పించిన ఎనిమిది చీతాలను సెప్టెంబర్ 17వ తేదీన గ్వాలియర్ కునో నేషనల్ పార్క్‌లోకి విడుదల చేశారాయన. ఛత్తీస్‌గఢ్(అప్పట్లో మధ్యప్రదేశ్) కొరియా జిల్లాలో 1947లో భారత్‌లో చివరి చీతా కన్నుమూసింది. ఆపై 1952 నుంచి చీతాలను అంతరించిన జాబితాలో చేర్చింది భారత్. ఇదీ చదవండి: డివైడర్‌పై పడుకోవడమే వాళ్లు చేసిన పాపం! -
కృష్ణ జింక.. కేరాఫ్ లంక
సాక్షి, అమరావతి : గోదావరి లంకల్లో కృష్ణ జింకలు పెద్ద ఎత్తున ఉన్నట్టు స్పష్టమైంది. ఇటీవల వచ్చిన వరదలతో లంకలు మునిగిపోయి అవి బయటకు రావడంతో ఈ విషయం వెల్లడైంది. లంకల్లో ఎవరికీ కనిపించకుండా వందల సంఖ్యలో జింకలున్నట్టు తేలింది. వాటి ఆవాసాలుగా ఉన్న ఇసుక దిబ్బలను వరద నీరు ముంచెత్తడంతో అవి సమీపంలోని గ్రామాల్లోకొచ్చాయి. అలా వచ్చిన కొన్ని కుక్కల దాడికి గురయ్యాయి. ధవళేశ్వరం బ్యారేజీ సమీపంలో కడియం మండలం వేమగిరి పులసల లంకలో భారీగా వాటి ఉనికి ఉన్నట్టు తేలింది. అప్పుడప్పుడూ బ్యారేజీ దిగువన సందర్శకులకు అవి తారసపడుతుండేవని చెబుతుంటారు. ఈ లంక ఎత్తుగా ఉండటంతో ఎంత వరద వచ్చినా మునిగేది కాదు. దీంతో కృష్ణ జింకలకు ఎప్పుడూ ఇబ్బంది ఎదురవలేదు. ఈ సారి మాత్రం రికార్డు స్థాయిలో వరద రావడంతో పులసల లంక నీట మునిగింది. వరద ఉధృతికి కొన్ని జింకలు కొట్టుకుపోగా.. మరికొన్ని గోదావరిని ఈదుకుంటూ సమీపంలోని గ్రామాలకొచ్చాయి. అలా వచ్చిన వాటిపై కుక్కలు దాడి చేయడంతో కొన్ని మృతి చెందాయి. వరదల వల్ల ఆహారం అందక, జనం మధ్యలో ఇమడ లేకపోయాయి. కొన్నింటిని రైతులు సజీవంగా పట్టుకుంటున్నా కొంత సేపటికే అవి మృతి చెందుతున్నాయి. ఇలా 20 జింకలను స్థానికులు పట్టుకోగా వాటిలో మూడు మృతి చెందాయి. మిగిలిన వాటిని అటవీ శాఖాధికారులు రక్షించి చికిత్స చేస్తున్నారు. త్వరలో వివరాల సేకరణ జింకలు భారీగా ఉన్నట్టు తేలడంతో పూర్తి సమాచారం కోసం అటవీ శాఖాధికారులు తొలిసారి సర్వే నిర్వహించనున్నారు. లంకల్లో వాటి వాస్తవ సంఖ్య, వాటి ఆహారపు అలవాట్లు, వాటికున్న ప్రమాదాలతో పాటు.. ఎంత వరద వస్తే వాటికి ఇబ్బంది కలుగుతుందనే వివరాలను సేకరిస్తారు. వరద పూర్తిగా తగ్గాక ఈ సర్వే ప్రారంభిస్తామని రాజమండ్రి డీఎఫ్‌వో సెల్వం చెప్పారు. సర్వే తర్వాత వాటి పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పూర్తి సమాచారం కోసం సర్వే చేయనున్న అటవీ శాఖ కృష్ణ జింకలు ఒత్తిడికి లోనైతే ప్రాణాలు కోల్పోతాయి. ఒక్కసారిగా జనాలను చూసినా అవి హడలిపోయి ప్రాణాలు కోల్పోతాయి. మూడు జింకలు అలాగే చనిపోయి ఉంటాయని అటవీ శాఖాధికారులంటున్నారు. జింకల సమాచారం తెలిసిన వెంటనే అటవీ శాఖాధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి లంక ప్రాంతాల్లో బోట్లపై గాలించారు. గోదావరితో పాటు వాటి పాయలైన గౌతమి, వశిష్ట, వైనతేయి, వృద్ధ గౌతమి పరిధిలోని లంకను కృష్ణ జింకలు ఆవాసాలుగా మార్చుకున్నాయి. గోదావరి మధ్యలో ఎత్తుగా గడ్డి పెరిగే ఇసుక దిబ్బల్లో ఇవి స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు తేలింది. ఆ లంకల్లోకి ఎవరూ వెళ్లే అవకాశం లేకపోవడంతో వాటి సంఖ్య భారీగా ఉంటుందని గుర్తించలేదు. తాజా అంచనాల ప్రకారం ధవళేశ్వరం నుంచి యానాం వరకూ ఉన్న లంకల్లో అవి వందల సంఖ్యలో ఉన్నట్టు చెబుతున్నారు. -
పిల్లల కథ: ఎవరు ఎక్కువ ప్రమాదం?
ఒక అడవిలో జింకపిల్ల ఒకటి వుండేది. చాలా తెలివైనది. దాని తెలివికి ముచ్చటపడిన ఆ అడవి జంతువులన్నీ ‘నీలాంటి తెలివిగలవారు రాజుగారి కొలువులో వుంటే మన జంతువులకు మేలు జరగొచ్చు. అదీగాక నీ తెలివికి గుర్తింపూ దొరుకుతుంది’ అని సలహానిచ్చాయి. దాంతో ఆ జింకపిల్ల.. సింహరాజు దగ్గర కొలువు కోసం బయలుదేరింది. అది వెళ్లేముందు జింకపిల్ల తల్లి దాన్ని హెచ్చరించింది ‘మంత్రి నక్కతో మాత్రం జాగ్రత్త’ అంటూ. సింహరాజుని కలిసి కొలువు అడిగింది జింకపిల్ల సింహం కొన్ని ప్రశ్నలు అడిగింది. జింకపిల్ల సమాధానాలు ఇచ్చింది. దాని తెలివి తేటలకు అబ్బరపడ్డ సింహం దానికి తన కొలువులో ప్రధాన సలహా దారుగా ఉద్యోగమిచ్చింది. మంత్రి నక్క.. జింకకు అభినందనలు తెలిపింది ‘నీలాంటి తెలివైనవారు వుండటం వల్ల నాకూ పని భారం తగ్గుతుంది’ అంటూ. ‘ ఇంత మంచి నక్క గురించి అమ్మ ఏంటీ అలా హెచ్చరింది?’ అనుకుంది జింక. నిజానికి జింకపిల్ల కొలువులోకి రావడం నక్కకి యిష్టంలేదు తన ప్రాబల్యం తగ్గితుందని. అయితే బయటపడకుండా సమయం కోసం ఎదురు చూడసాగింది. (పిల్లల కథ: జానకమ్మ తెలివి) ఒకరోజు సింహం.. జింకపిల్ల తెలివితేటల్ని నక్క ముందు ప్రశంసించింది. ‘ఏంటో నాకైతే ఆ జింకపిల్ల అది పక్క రాజ్యం వారు పంపిన గూఢచారేమోనని అనుమానం. త్వరలో సాక్ష్యాలతో రుజువు చేస్తా’ అన్నది. ఒకరోజు ఎలుగు, తోడేలుకు ఏదో ఆశ చూపి సాక్షులుగా తీసుకొచ్చి జింకపిల్ల గూఢచారి అని రుజువు చేయబోయింది. అప్పుడు ఆ కొలువులోనే ఉన్న ఏనుగు ‘ప్రభూ! జింకపిల్ల తెలివైనదని, అది కొలువులో వుంటే బావుంటుందని మేమే దాన్ని మీ దగ్గరకు పంపాం. అది గూఢచారి కాదు’ అని వాదించింది. ఆ వాదనకు భయపడ్డ ఎలుగుబంటి, తోడేలు నిజం చేప్పేశాయి. సింహం కోపంతో నక్కకు చురకలు అంటించింది. తల్లిని కలవడానికి జింకపిల్ల ఇల్లు చేరింది. జరిగింది చెప్పి ‘అమ్మా.. క్రూరజంతువైన సింహం కొలువులో చేరతానంటే ఒప్పుకున్నావు కానీ నక్క లాంటి జంతువుతో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించావు ఎందుకు?’ అని అడిగింది. ‘చెడ్డవారని ముందుగానే తెలిస్తే జాగ్రత్తగా వుంటాం కానీ మంచివారుగా కనిపిస్తూ గోతులు తవ్వేవారినే కనిపెట్టలేం. వారే చాలా ప్రమాదం. సింహం క్రూరజంతువు అని తెలుసు గనక జాగ్రత్తగా వుంటాం. కానీ నక్కలాంటివారు మంచిగా నటిస్తూ కీడు చేయ చూస్తారు. అందుకే అలాంటివారితో జాగ్రత్తా అని చెప్పాను. నీకూ అదే ఎదురైంది గనక ముందు ముందు అలాంటివారితో మరింత జాగ్రత్తగా వుండు’ అంది తల్లి. జింకపిల్ల తన తల్లి సలహా పాటిస్తూ జీవితాన్ని హాయిగా గడిపింది. -
హృదయ విదారకం: బిడ్డను కాపాడటం కోసం శత్రువుకెదురెళ్లి తల్లి ప్రాణ త్యాగం
ప్రపంచంలోని తల్లి ప్రేమను మించింది ఏదీ లేదు. తనకంటే పిల్లల గురించే ఎక్కువ ఆలోచించే ఏకైక వ్యక్తి అమ్మ. పిల్లలు ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లికి చిన్నవారే. ఏ ఆపద ఎదురైనా వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ప్రమాదం నుంచి పిల్లలను రక్షించుకునేందుకు చివరికి తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా త్యాగం చేస్తోంది.. తాజాగా తల్లి ప్రేమకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐఏఎస్ అధికారిణి సోనాల్ గోయెల్ ఓ జింకపై దాడి చేయబోతున్న మొసలి వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఇందులో నదిలో ఆకలితో ఉన్న ఓ మొసలికి కొంత దూరంలో జింక ఈత కొడుతూ కనిపించింది. జింకను ఆహారంగా చేసుకోవాలని భావించిన మొసలి.. దానిని పట్టుకునేందుకు వేగంగా కదులుతుంది. అయితే కొంత దూరంలో ఉన్న తల్లి జింక రాబోయే ప్రమాదాన్ని గమనిస్తుంది. తన బిడ్డను రక్షించుకునేందుకు వెంటనే నీటిలోకి దూకి రెండింటి మధ్యలోకి వస్తుంది. దీంతో దూరంలో ఉన్న పిల్ల జింకను వదిలేసి పక్కనే ఉన్న తల్లి జింక మొసలికి ఆహారంగా మారుతుంది. No words can describe the power, beauty and heroism of mother's love 🙏🏻 Heartbreaking video of a mother deer sacrificing herself for saving her baby 😞 It reminds us to Never ignore your parents and family. Respect them and take care of them when it's your turn 🙏🏻 (VC : SM ) pic.twitter.com/e8K9WQiqIc — Sonal Goel IAS (@sonalgoelias) April 6, 2022 తన బిడ్డను కాపాడుకునే క్రమంలో తల్లి జింక ప్రాణత్యాగం చేస్తుంది. ఏప్రిల్ 6న పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు జింక ప్రాణ త్యాగం తల్లి ప్రేమకు నిదర్శనమని ప్రశంసిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటన గుండెల్ని పిండేస్తోందని కామెంట్ చేస్తున్నారు. తల్లికి తన బిడ్డ పట్ల ఉన్న ఎనలేని ప్రేమను గుర్తు చేస్తుందంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. చదవండి: Viral Video: ఓరిని తెలివి సల్లగుండా.. పరీక్షల్లో ఇలా కూడా కాపీ కొడతారా! Mother is the heartbeat in the home and without her, there seems to be no heartthrob No any one palace full of her — MATALABKHAN7429 (@MATALABKHAN7421) April 6, 2022 getting emotional!!! true lesson.... Maa To Maa hoti hai.. — Sunil Sihag 🇮🇳 (@SunilSihagMiran) April 6, 2022 -
దుప్పి.. కళ్లుగప్పి
సత్తుపల్లి(ఖమ్మం) : తాళం వేసితిని.. గొళ్లెం మరిచితిని’అన్న చందంగా మారిన అటవీ శాఖాధికారుల వ్యవహార శైలి విమర్శలకు తావిస్తోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రూ.1.7 కోట్లతో అర్బన్ పార్కును అభివృద్ధి చేశామని.. వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపట్టామని అధికారులు చెబుతున్నా ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి లోపించిందనే ఆరోపణలున్నాయి. సత్తుపల్లిలో అర్బన్ పార్కు ఏర్పాటు ప్రాంతంలో సహజ సిద్ధంగానే దుప్పులు, పునుగులు, కుందేళ్లు, తాబేళ్లు ఉన్నాయి. వీటిని సంరక్షించేందుకు అటవీశాఖ 375 ఎకరాల్లో కంచె, గోడల నిర్మాణం చేపట్టారు. ఇటీవల కొత్తూరు వైపు దుప్పి కంచె దాటుకుని సమీప ఇళ్లల్లోకి వెళ్లగా స్థానికులు పట్టుకుని అటవీశాఖకు అప్పగించారు. మరికొన్ని దుప్పులు కంచె దాటే క్రమంలో తీగలు తగిలి మృత్యువాత పడగా, రేజర్ల గ్రామానికి చెందిన ఒక దుప్పిని హతమార్చి మాంసం విక్రయించడంతో కేసులు నమోదయ్యాయి. గురువారం అర్ధరాత్రి కూడా జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైపు నుంచి దుప్పులు రోడ్లపై పరుగులు తీస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇటీవల పార్కు నిర్వహణ పేరిట రుసుము కూడా వసూలు చేయడం ఆరంభించిన అటవీ అధికారులు వన్య ప్రాణుల సంరక్షణపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. -
మిమ్మల్ని విడిచి యాడకీ పోను..!
అడవిని వదిలి ఒకరింట్లో ఆదరణ పొందుతున్న జింక తిరిగి వెళ్లనంటోంది. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి అటవీ ప్రాంతానికి చేరువలోని లక్కవరప్పాడులో రెండేళ్ల క్రితం రెండు నెలల వయసున్న చుక్కల జింక దారి తప్పి వచ్చేసింది. గూనా చిన్నోడు–దేవి దంపతులు చూసి దీనిని తమ బిడ్డలా పెంచుతున్నారు. గూనా చిన్నోడు, దేవి దంపతుల ఇంటికి వచ్చిన జింక పిల్ల ఇదే (ఫైల్).. ఆ జింక ఆ కుటుంబంతోనే కాదు ఊరంతా కలియతిరుగుతూ అందరికీ చేరువైంది. ఇటీవల అటవీ అధికారులు ఈ వన్య ప్రాణిని గమనించారు. చిన్నోడు దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చి దానిని సమీప అడవుల్లో వదిలి వచ్చారు. అయితే ఆ జింక మర్నాడే తిరిగి వచ్చేసింది. దీంతో చిన్నోడు దంపతులు దానిని ఆనందంతో అక్కున చేర్చుకున్నారు. –రాజవొమ్మంగి -
పులిపై సమ్మక్క, జింకపై సారలమ్మ... ఈ రూపాలు ఎలా వచ్చాయో తెలుసా ?
-
యాక్సిడెంట్ అయింది! వైద్యం చేయండి డాక్టర్: జింక
మన కళ్లముందే రోడ్డుపై ఎన్నో మూగజీవాలు రోడ్డు ప్రమాదాలకు గురవడం చూసి ఉంటాం. ఎవరో కొంతమంది సహృదయులు వాటిని చేరదీసి పశువైద్యశాలకు తరలించడం వంటివి చేస్తారు. లేదంటే అవి అలా గాయాలతోనే బాధపడుతూ ఉండిపోతాయి. కానీ ఇక్కడొక జింక మనిషిమాదిరి ఆసుపత్రికి వచ్చి మరీ చికిత్స చేయించుకుంది. (చదవండి: హమ్మయ్య దూకేశా!! ఏనుగునైతే మాత్రం దూకలేననుకున్నారా.. ఏం?) అసలు విషయంలోకెళ్లితే... అమెరికాలో ఒక జింకను కారు ఢీ కొట్టడంతో దానికి గాయాలవుతాయి. అయితే ఆ జింక వెంటనే సమీపంలోని లూసియానాలో ఉన్న బాటన్ రూజ్‌లోని అవర్ లేడీ ఆఫ్ ది లేక్ రీజనల్ మెడికల్ సెంటర్లోకి ప్రవేశిస్తుంది. పైగా చికిత్స కోసం ఆ మెడికల్ సెంటర్లో అటూ ఇటు పరిగెడతూ చాలా కష్టపడుతుంది. అంతేకాదు ఆవరణలో పడుతూ లేస్తూ ఆయాస పడుతుంది. అక్కడ ఉన్న ఎస్కలేటర్‌ను సైతం ఏదోరకంగా ఎక్కి రెండో అంతస్తుకి చేరుకుంటుంది. దీంతో అక్కడ ఉన్న వైద్యులు, సందర్శకులు ఆశ్చర్యపోతారు. అయితే అక్కడ ఉన్న పశువైద్యుడు జింకను పరిశీలించి వైద్యం చేస్తాడు. మా వైద్యులు ఎప్పడూ సదా వైద్యం చేయడానికి సిద్ధంగా ఉంటారంటూ అవర్ లేడీ ఆఫ్ లేక్ రజినల్ మెడికల్ సెంటర్ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మీరు కూడా ఓసారి వీక్షించండి. (చదవండి: కారులోనే ఆల్కహాల్ టెస్టింగ్ టెక్నాలజీ) -
జింకకు కరోనా వైరస్.. అమెరికాలో తొలి కేసు నమోదు..
న్యూయార్క్: మనుషుల్లో మాత్రమే కనిపించిన కరోనా మహమ్మారి తీవ్రత జంతువుల్లోనూ మొదలైంది. తొలి సారిగా జింకకు కరోనా వైరస్ సోకింది. అమెరికాలోని ఓహియో రాష్ట్రంలోని అడవి తెల్ల తోక జింకకు కొవిడ్-19 వైరస్ సోకిందని అమెరికా వ్యవసాయ శాఖ నివేదించింది. జింకకు కరోనా వైరస్ ఎలా సోకిందనేది ఇంకా తేలలేదని అమెరికా ప్రతినిధి లిండ్సే కోల్ తెలిపారు. మనుషుల ద్వారా, ఇతర జింకలు, మరొక జంతు జాతుల ద్వారా వైరస్ సోకి ఉంటుందని తాము అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 ఉన్న వ్యక్తితో సన్నిహిత సంబంధాలు ఉన్న జంతువులకు కరోనా సోకిందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఒహియో స్టేట్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ కొనసాగిస్తున్న అధ్యయనాలలో భాగంగా జింకకు కొవిడ్-19 వైరస్ సోకినట్లు బయటపడింది. గతంలో కుక్కలు, పిల్లులు, సింహాలు, చిరుత పులులు, గొరిల్లాలకు కరోనా వైరస్ సోకిందిజ చదవండి: Kerala: కరోనా విజృంభణ, కీలక నిర్ణయం US reports world's first deer with Covid-19 https://t.co/VdVw1RCoLw pic.twitter.com/gqptYB2Bvf — The Times Of India (@timesofindia) August 28, 2021 -
వావ్.. ప్రకృతిని ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది!
ఆమ్స్టర్డామ్: మనలో చాలా మంది నీళ్లలో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. అందుకే, చిన్నప్పుడు పిల్లలను ఏమాత్రం.. వదిలేసిన నీటి తొట్టే దగ్గరకు లేదా బకెట్లో చేయిపెట్టి సరదాగా ఆడుకుంటారనే విషయం మనకు తెలిసిందే. కాగా, కొంత మంది తల్లులు.. తమ పిల్లలను బకెట్లు, ట్రబ్లో కూర్చోబెట్టి వారు ఆడుకుంటుంటే తల్లిదండ్రులు సంబరపడిపోతుంటారు. ఇప్పటికి చాలా మంది వీకాఫ్ రాగానే.. నదులు, జలపాతాలు, డ్యామ్‌ల వద్దకు తమ కుటుంబాలతో వాలిపోతుంటారు. అక్కడ నీటితో సరదాగా ఆడుకోవడం చేస్తుంటారు. ఇక్కడ అడవిలోని ఒక జింక కూడా నీటి కుంటలో దూకి చాలా సేపు సరదాగా గడిపింది. ప్రస్తుతం ఈ ఫన్నీవీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా, బ్యూటెంజిబిడెన్ అనే యూజర్ ప్రకృతి ప్రేమికుడు. ఇతను.. జంతువులు, ప్రకృతికి సంబంధించిన అరుదైన వీడియోలను సేకరించి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తుంటాడు. తాజాగా, ఆయన షేర్ చేసిన వీడియోలో.. ఒక అందమైన జింక ఒక నీటి కుంటను చూసింది. మెల్లగా అక్కడికి చేరుకుని నీటిలోదిగింది. నీటిలో దూకుతూ.. పైకి వస్తు... కాసేపు సరదాగా గడిపింది. అయితే, ఆ జింకకు నీటిలో తనలాంటి మరో ప్రతిబింబం కన్పించడం వలన మరో జింక ఉందేమో అనుకుందో.. తన బలమైన కాళ్లతో నీటిని కొడుతూ.. అటు ఇటూ గెంతడం చేయసాగింది. నీటిలో దిగుతూ.. పైకి వస్తు, అటుఇటూ చూస్తు సరదాగా గడిపింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియరాలేదు. అయితే, దీన్ని బ్యూటెంజిబిడెన్ అనే యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ‘నీటిలో ఆడుకోవడమంటే ఎవరికి ఇష్టముండదు’.. అంటూ క్యాప్షన్ జతచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వావ్.. జింక ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది..’,‘మా చిన్నతనాన్ని గుర్తుకు తెచ్చింది..’,‘ప్రకృతిని బాగా ఎంజాయ్ చేస్తోంది..’ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. -
కుక్కలు చంపాయి.. ఊరంతా పంచుకున్నారు
ములకలపల్లి (భద్రాద్రి కొత్తగూడెం) : దాహం తీర్చుకునేందుకు గ్రామంలోకి వచ్చిన దుప్పిపై కుక్కలు దాడిచేయడంతో మృతి చెందింది. ఈ క్రమంలో మృత్యువాత పడిన దుప్పిని కోసిన గ్రామస్తులు మాంసాన్ని పంచుకున్నారు. దీంతో అటవీ అధికారులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చాపరాలపల్లి శివారు అటవీ ప్రాంతం నుంచి ఓ దుప్పి దాహార్తి తీర్చుకునేందుకు గ్రామంలోకి వచ్చింది. ఈ క్రమంలో ఊరకుక్కలు దాడి చేయడంతో మృతిచెందింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కొందరు దుప్పిని కోసి మాంసం పంచుకున్నారు. జరిగిన విషయం అటవీ అధికారులకు తెలియడంతో ఎఫ్ఎస్ఓ కిషన్ ఆధ్వర్యంలో అర్ధరాత్రి వేళ గ్రామంలో తనిఖీలు చేసి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిదిమంది గ్రామస్తులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చాపరాలపల్లి (ఈస్ట్) బీట్ ఆఫీసర్ మల్లికార్జునరావు శనివారం వెల్లడించారు. -
వాల్‌మార్ట్‌లో జింక హల్చల్.. సిబ్బంది భలే కంట్రోల్ చేశారే! వైరల్
మనుషుల అభివృద్ధి పేరుతో నగరాలను విస్తరించూకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతాలు కూడా జననివాసాలుగా మారుతున్నాయ్.దీని కారణంగా అడవులు తగ్గి జంతువులు నగరాల్లో సంచరించడం ఇటీవల మామూలుగా మారిపోయింది. కొన్ని సందర్భాల్లో అవి మనుషుల మధ్య కనిపిస్తు అవి బెదురుతూ మనల్ని భయపెడుతున్నాయి. కాగా ఈ సన్నివేశాలు రికార్డు కావడం, నెట్టింట వైరల్ గా మారి హల్ చల్ చేయడం తెలిసిందే. ప్రస్తుతం అలాంటి తరహాలో ఓ జింక్ వాల్‌మార్ట్‌లోకి రాగా దాన్ని కంట్రోల్ చేయడానికి నానతంటాలు పడ్డాడు ఓ సిబ్బంది. వివరాల్లోకి వెళితే.... విస్కాన్సిన్ వాల్‌మార్ట్‌లో అనుకోని కస్టమర్ రూపంలో ఓ జింక షాపులోకి వచ్చింది. పాపం అక్కడి పరిసరాలు అంతా కొత్తగా ఉండే సరికి కాస్త బెదిరి నానా హైరానా చేసింది. ఇక షాపును ధ్వంసం చేస్తుండడంతో అందులోని ఓ సిబ్బంది మాత్రం ధైర్యంగా ఆ జింకను కట్టడి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందులో.. జింకను నడవకుండా సిబ్బంది చాకచక్యంగా దాన్ని నియంత్రిస్తూ వ్యవహరించాడు. జంతువు పట్టు నుండి బయటపడటానికి ప్రయత్నించినప్పటికీ, వదలకుండా అలానే ఆ సిబ్బంది ఉండగా ఈ క్రమంలో ఇతర సిబ్బంది దాని బయటకు పంపడానికి వెనుక తలుపు తెరిచి పంపేసి హమ్మయ్యా అనుకున్నారు. ఈ ఘటన జూన్ 23 న బారాబూలో జరిగగా, ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. When a deer got loose inside a Wisconsin Walmart, one brave employee pinned it with her bare hands until coworkers could rush to open a back door. According to reports, the deer was then released outside safely. pic.twitter.com/a3rzY9wMkg— NowThis (@nowthisnews) June 30, 2021 -
రౌండప్ చేశాయంటే కష్టమే!
-
తెలివైన జింకలు.. రౌండప్ చేశాయంటే కష్టమే!
సాక్షి సెంట్రల్ డెస్క్: ఒకటీ రెండు కాదు.. పదో, వందో కాదు.. వేల కొద్దీ జింకలు తుఫాను గాలిలా గుండ్రంగా తిరుగుతున్నాయి. అదీ మెల్లమెల్లగా ఏమీ కాదు.. ఉరుకులు పరుగులతో రౌండ్స్ వేస్తున్నాయి. మరి ఇవి ఎందుకిలా తిరుగుతున్నాయనే డౌట్ వస్తోంది కదా.. ఇదంతా భద్రత కోసమే. తమపై దాడి చేయడానికి వచ్చిన జంతువులను కన్ఫ్యూజ్ చేసి, బెదరగొట్టేందుకు ఉత్తర ప్రాంత దేశాల్లోని రెయిన్‌డీర్ జింకలు ఇలా చేస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏదైనా ఆపద ముంచుకొచ్చిందని అనుమానం రాగానే.. జింకలన్నీ గుండ్రంగా తిరగడం మొదలుపెడ్తాయని, పిల్లలను మధ్యలో ఉంచి రక్షణ కలిపిస్తాయని అంటున్నారు. మామూలుగా వేటకుక్కలు, తోడేళ్లు, పులుల వంటి క్రూర జంతువులు.. మందలుగా ఉన్న జింకలు, లేళ్లు, అడవి గేదెల నుంచి ఒక్కొదానికి వేరుచేయడానికి ప్రయత్నిస్తాయి. మంద నుంచి విడిపోయిన దానిని చుట్టుముట్టి చంపి తింటాయి. ఇలాంటి పరిస్థితి రాకుండా, మందలో ఏదో ఒక్క జింకను టార్గెట్ చేయలేకుండా కన్ఫ్యూజ్ చేసేందుకు రెయిన్ డీర్లు గుండ్రంగా తిరుగుతాయి. ఇందులోనూ బలంగా, పెద్దగా ఉన్న జింకలు అంచుల్లో తిరుగుతూ.. పిల్లలు, చిన్నవి మధ్యలో ఉంటాయి. ఉత్తర రష్యాలోని ముర్మాన్సక్ ప్రాంతంలో ఫెడొసెయెవ్ అనే ఫొటోగ్రాఫర్ డ్రోన్‌తో ఈ ఫొటోలు తీశారు. ఇంతకీ ఈసారి ఈ జింకలు ఎవరికి భయపడ్డాయో తెలుసా? వాటికి వ్యాక్సిన్ వేయడానికి వచ్చిన ఓ వెటర్నరీ డాక్టర్‌ను చూసి జడుసుకున్నాయట. -
వామ్మో.. ఇలా వచ్చి, అలా తన్నుకుపోయింది!
జైపూర్: గద్దలా తన్నుకుపోవడం అని చాలాసార్లు అంటుంటాం.. వింటుంటాం కూడా.. కానీ ఎప్పుడైనా చూశారా.. ఇదిగో ఇప్పుడు చూసేయండి.. ఈ స్టెప్పీ జాతికి చెందిన గద్ద వేటాడటంలో మంచి నేర్పరులు.. టార్గెట్ మిస్కావు..ఆ అడవిలో పాపం ఒక జింక పిల్ల తన తల్లినుంచి తప్పిపోయినట్టుంది. అయితే..ఆకాశం నుంచి ఒక గద్ద ఆ పిల్ల జింకను గమనించింది. వెంటనే ఆమాంతం కిందకు వచ్చి ఒక్క ఉదుటున జింక పిల్లను వాటి పదునైన కాలితో పట్టుకోని వెళ్లిపోయింది. అయితే, ఈ సంఘటన రాజస్తాన్‌లోని తాల్ చప్పర్ అభయారణ్యంలో చోటుచేసుకుంది. దీన్ని బైజూ పాటిల్ అనే ఫొటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు. ఇంతకీ ఈ కృష్ణ జింక పిల్ల సంగతేమైందంటారా? ముందే చెప్పాంగా.. అవి టార్గెట్ మిస్ కావని.. -
ఆడుకునేందుకు వెళ్లి ఊహించని ఫ్రెండ్‌తో..
నాలుగేళ్ల పిల్లాడు ఆడుకునేందుకు బయటకు వెళ్లి ఊహించని ఫ్రెండ్‌తో ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ చిన్నారి కొత్త స్నేహితుడ్ని చూసిన అతడి తల్లి ఒకింత ఆశ్చర్యపోయింది. వెంటనే తన మొబైల్ తీసుకుని స్టైల్‌గా ఉన్న ఇద్దరి ఫోటోలను తీసింది. అయితే ఆ బుడతడి కొత్త ఫ్రెండ్ మరెవరో కాదు జింక పిల్ల. అమెరికాలోని వర్జీనియాలో ఈ అరుదైన ఘటన జరిగింది. చదవండి: పెళ్లిలో భర్త పర్మిషన్తో లవర్ని.. వివరాలు.. విహారయాత్ర కోసం స్టెఫానీ బ్రౌన్ కుటుంబం వర్జీనియాలోని మసానుటెన్కు వచ్చింది. డొమినిక్ అనే నాలుగేళ్ల పిల్లాడు ఈ నెల 26న ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. కొంతసేపటికి తర్వాత తిరిగి వచ్చిన కుమారుడ్ని చూసి అతడి తల్లి స్టెఫానీ బ్రౌన్ ఆశ్చర్యపోయింది. ఆ చిన్నారితో కలిసి వచ్చిన జింక ఏ మాత్రం భయపడకుండా తలుపు పక్కన నిలబడింది. అయితే దాని తల్లి తన పిల్ల కోసం చూస్తుందని, ఆ జింక పిల్లను తిరిగి పార్కులో వదిలేయమని చెప్పింది. కాగా, కొత్త ఫ్రెండ్‌తో తన కుమారుడు చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను స్టెఫానీ బ్రౌన్ ఫేస్బుక్లో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. చదవండి: వందల సంఖ్యలో సాలీడులు.. వారి పరిస్థితి ఏంటో -
చిరుతకు ఝలక్: ఈ జింక చర్య ఊహాతీతం
చిరుతకు తన వేగమే ఆయుధం అన్న సంగతి తెలిసిన విషయమే! కానీ, అది అన్ని సందర్భాలలో కాదు. కొన్ని సార్లు వేగంతో కూడిన ఆవేశం కంటే సరైన సమయంలో తీసుకునే చిన్న ఆలోచన ప్రాణాలు రక్షిస్తుంది. ఇందుకు బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన ఈ వీడియో నిదర్శనం. వీడియోలో.. ఓ జింక నీటి కుంట దగ్గర నీళ్లు తాగుతోంది. జింకను చూసిన ఓ చిరుత అత్యంత వేగంగా దాని వైపు దూసుకువచ్చింది. దీంతో ఉలిక్కిపడ్డ జింక వెనక్కు పరిగెడుతున్నట్లుగా పరిగెత్తి ఆవెంటనే యూటర్న్ తీసుకుని ముందుకు దూసుకెళ్లింది. ( నువ్వు కొరికితే నేను కూడా కొరుకుతా ) అతి ఆవేశం, వేగంతో ఉన్న చిరుత జింక చర్యకు కంగుతింది. నియంత్రణ కోల్పోయి సర్రున ముందుకు దూసుకుపోయింది. జింక ప్రాణాలతో అక్కడినుంచి తప్పించుకుపోయింది. 15 సెకన్ల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 2 లక్షల వ్యూస్, 12 వేల లైకులు, 1200 రీట్వీట్లు సొంత చేసుకుంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు... ‘‘ జింక తెలివిగా తప్పించుకుంది.. అద్భుతం... వేగమే చిరుత కొంపముంచింది... చిరుత దుమ్మ లేపింది.. జింక తెలివి చూపింది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
నీళ్లు తాగేందుకు వస్తే.. కాళ్లు నరికారు
సాక్షి, కొత్తగూడ: నీళ్లు తాగేందుకు వచ్చిన వన్యప్రాణి సాంబర్ డీర్ కాళ్లను దుండగులు కిరాతకంగా నరికారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం రేణ్యాతండా సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. రేణ్యాతండా, చిన్నతండా మధ్య ఉన్న చెరువులో నీళ్లు తాగడానికి సాంబర్ డీర్ రాగా, కొందరు యువకులు గట్టిగా అరిచారు. చదవండి: (పెళ్లయిన తొమ్మిది నెలలకే...) భయపడిన జంతువు చెరువులోకి దిగి ఈదుకుంటూ కట్ట ఎక్కి పొలాల్లోకి దిగింది. అక్కడ బురదగా ఉండడంతో పరుగెత్తలేక నిలిచిపోయింది. సదరు యువకులు గొడ్డళ్లతో వెంబడిస్తూ జంతువు వెనక వైపు కాళ్లు నరికారు. రెండు కాళ్లు విరిగిన సాంబర్ జింక గట్టిగా అరవడంతో స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. దీంతో దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. వన్యప్రాణిని ట్రాక్టర్లో హన్మకొండలోని వనవిజ్ఞాన కేంద్రానికి తరలించి శస్త్రచికిత్స చేయించారు. చదవండి: (అడవంతా జల్లెడ!) -
అద్భుతంగా మారిన సంగీతం...
-
అనుకోని అతిధి రాకతో అద్భుతం..
ఇంటర్నెట్ ప్రపంచంలో వింతలకు కొదవ లేదు. సామాజిక మాద్యమాలలో ఎక్కడ చూసిన మనల్ని ఆశ్చర్యపరిచే విషయాలు కనబడుతూనే ఉంటాయి. అలాంటి ఒక విషయాన్నే మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ‘నా హార్ప్ సెషన్ డిస్నీ చలన చిత్రంగా మారింది’ అనే శీర్షికతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ యువతి ఆరుబయట నిలబడి ఒక వీణలాంటి (తీగలతో కూడిన ముక్కోణ ఆకారపు వాద్యము) పరికరాన్ని వాయించింది. 1965లో వచ్చిన ‘హిట్ ది సౌండ్ ఆఫ్ సైలెన్స్’ అనే మ్యూజిక్‌ను ప్లే చేసింది. దీనిని వాయిస్తున్న సమయంలో ఆమె వీడియో తీసుకుంది. చదవండి: ఎక్కడా చూసి ఉండరు.. ఇండియాలోనే సాధ్యం! తరువాత ఆ వీడియోను చూసి ఆమె ఆశ్చర్య పోయింది. మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు అటుగా వచ్చిన ఒక జింక దానిని వింటూ అక్కడే ఆగిపోయింది. జాగ్రత్తగా ఆ సంగీతాన్ని వింటూ, ఆ వాయిద్యాన్ని చూస్తూ అక్కడే ఉండిపోయింది. తరువాత ఆ జింక అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వీడియో ముగుస్తుంది. దీనిని చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘ చాలా క్యూట్‌గా ఉంది. అది మీ దగ్గరకు రావాలనుకుంది కానీ భయంతో అక్కడే ఉండిపోయింది అనుకుంటా. దానికి మీ సంగీతం బాగా నచ్చింది’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ఇది ప్రపంచంలోనే క్యూటెస్ట్ విషయం అని మరో నెటిజన్ స్పందించాడు. ఈ వీడియోను ఇప్పటి 32,000లకు పైగా లైక్ చేయగా 880కి పైగా కామెంట్స్ వచ్చాయి. చదవండి: వైరల్: పులికి చెమటలు పట్టించిన పైథాన్ -
వైరల్: క్షణాల్లో ప్రాణం పోయే పరిస్థితి.. కానీ..
బ్యాంకాక్: అడవిలో ఉండే చిన్న జంతువులు, పక్షులను భారీ కొండ చిలువలు నిమిషాల వ్యవధిలో మింగేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కొండ చిలువ బారినపడి ప్రాణాలతో బయటపడటం అంత సులభం కాదు. అంత దృఢంగా అవి మనుషుల్ని, జంతువులన్ని పట్టేసుకుంటాయి. అయితే, కొండ చిలువకు ఆహారమయ్యే ప్రాణాపాయ పరిస్థితుల నుంచి ఓ జింక క్షేమంగా బయటపడింది. దీనికి సంబంధించిన వీడియోను డుసిత్ జూ అసిస్టెంట్ డైరెక్టర్ ట్విటర్లో పోస్ట్ చేశారు. థాయ్‌లాండ్‌లోని ఖావో ఖేవ్ ఓపెన్ జూలో తీసినట్లు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. (వికలాంగుడికి శునకం అండ) ఓ భారీ పైథాన్ ఓపన్ జూలో ఉన్న ఓ రోడ్డుపై నుంచి వెళ్తున్న చిన్న జింక పిల్లను చుట్టుకొని మింగేయడానికి ప్రయత్నించింది. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ యువకుడు చెట్టు కొమ్మతో కొండచిలువను కొట్టడంతో కోపంతో ఒక్కసారిగా అతనిపై దాడి చేయబోయింది. ఇక యువకుడు మరోసారి కొట్టడంతో భయంతో కొండ చిలువ జింకను వదిలి చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. దీంతో జింక బతికిపోయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘ అత్యంత దారుణమైన ప్రమాదం నుంచి జింక క్షేమంగా బయటపడింది’అని కామెంట్లు చేస్తున్నారు. ‘వీడియోను చూస్తున్నంత సేపు ఆ పైథాన్ జింకను మింగిస్తుందేమో అన్న భయం కలిగింది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఈ వీడియోను 9. 4 లక్షల మంది వీక్షించగా, 17 వేల మంది లైక్ చేశారు. -
క్షణాల్లో ప్రాణం పోయే పరిస్థితి..
-
పై కప్పు నుంచి ఇంట్లో పడ్డ జింక
ముంబై: అర్ధరాత్రి భయంకర శబ్ధాలు వినడంతో నిద్రలో నుంచి ఉలిక్కి పడి లేచిన కుటుంబం ఎదురుగా ఉన్న జంతువును చూసి షాక్‌కు గురైంది. ఓ పక్కగా జింక బిక్కుబిక్కుమంటూ కూర్చుండటం చూసి వారు అధికారులకు సమాచారమిచ్చారు. ఈ అరుదైన ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని పోవాలి ప్రాంతంలో ఆదివారం ఉదయం ఒంటి గంట సమయంలో ఓ మచ్చల జింక తనను వేటాడుతున్న చిరుత నుంచి తప్పించుకునే క్రమంలో పై కప్పు నుంచి ఓ ఇంట్లో పడింది. అప్పటికీ ఆ పులి దాన్ని వదిలిపెట్టకుండా వేటాడేందుకు ప్రయత్నించింది. ఆ ఇంటి పైకప్పుపై దాడికి దిగి అనంతరం వెనుదిరిగి వెళ్లిపోయింది. (వైరల్ : ఇదేం వింత స్నేహం?!) ఈ శబ్ధాలకు నిద్రలో నుంచి ఉలిక్కి పడిన లేచిన కుటుంబ సభ్యులు ఎదురుగా ఉన్న మచ్చల జింకను చూసి స్థానువులైపోయారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారమివ్వగా వారు వెంటనే అక్కడికి చేరుకుని జింకను రక్షించి సంజయ్ గాంధీ జాతీయ పార్కుకు తరలించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో జింక ఎటూ కదలకుండా ఒకేచోట కూర్చుని ఉంది. ఈ ఘటన గురించి అటవీ అధికారి సంతోష్ కంక్ మాట్లాడుతూ.. ఇతర జంతువు జింకను వేటాడటంతో అది పైకప్పు మీద నుంచి ఇంట్లో పడిందని పేర్కొన్నారు. (డేంజర్.. ఆ బ్రిడ్జి మీదకు వెళ్లకండి!) -
నిజంగా ఇది నమ్మశక్యం కాని విషయం
ఢిల్లీ : పైథాన్ ఒక జింకను నిమిషాల వ్యవధిలో మింగేయడం మీరెప్పుడైనా చూశారా.. ఒకవేళ చూడకపోతే మాత్రం వెంటనే ఈ వీడియో చూడండి. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి పర్వీన్ కశ్వాన్ తన ట్విటర్లో షేర్ చేశారు. ' ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం. ఎంత ఆకలేసిందో తెలియదు గానీ బర్మెస్ జాతికి చెందిన పైథాన్ చూస్తుండగానే నిమిషాల వ్యవధిలోనే జింకను మింగేసిందంటూ' క్యాప్షన్ జత చేశాడు. ఇంతకుమందు మనం చూసిన చాలా వీడియోల్లో పైథాన్ కుందేళ్లు, ఇతర చిన్న జంతువులను తినడం చూశాము. కానీ మొత్తం రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియోలో పైథాన్ జింకను చుట్టూసి మెళ్లిగా నోరును పెద్దది చేస్తూ చూస్తుండగానే స్వాహా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన తర్వాత పాములకు అంత జీర్ణశక్తి ఎక్కడి నుంచి వస్తుందనే అనుమానం తప్పకుండా కలుగుతుంది. (వైరల్: చెవిలో గూడు కట్టిన ‘స్పైడర్’) -
భీమిలి తీరంలో జింక చక్కర్లు
తగరపువలస (భీమిలి): భీమిలి సముద్ర తీరంలో ఓ జింక చక్కర్లు కొడుతోంది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారాయి. కంబాలకొండ అటవీ ప్రాంతం నుంచి తరచూ జింకలు తాగునీటి కోసం జాతీయ రహదారిపైకి వచ్చేస్తూ వాహనదారుల కంటికి కనిపిస్తుంటాయి. మనుషుల అలికిడి తగిలితే మళ్లీ లోపలికి వెళ్లిపోతుంటాయి. రెండు రోజులుగా ఓ జింక భీమిలి తీరానికి వచ్చేసి ఇక్కడ సముద్రంలోకి వెళ్లడానికి ప్రయత్నించి అలలు రావడంతో వెనక్కు తగ్గుతోందని స్థానికులు చెబుతున్నారు. -
అదిగో చిరుత.. ఇదిగో జింక
పశ్చిమ ఏజెన్సీలోని పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో ఉన్న పోలవరం, బుట్టాయగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గల రేంజ్‌ల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో ఉన్న అడవుల్లో వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. వన్యప్రాణి సంరక్షణ అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వీటి కదలికలను గుర్తించారు. వీటి సంరక్షణ కోసం అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షి, బుట్టాయగూడెం(పశ్చిమగోదావరి) : జిల్లాలోని పోలవరం, బుట్టాయగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల పరిధితో పాటు పాపికొండల నేషనల్ పార్కుగా సుమారు 1.12 లక్షల హెక్టార్లలో అభయారణ్యం విస్తరించి ఉంది. అందులో ఎలుగుబంటులు, కొండ గొర్రెలు, జింకలు, కొండ చిలువలు, అడవి పందులు, ఆగలి, గెద్దలు, నెమళ్లు, చిరుత పులులు, కురుడు పందులు, చుక్కల దుప్పిలు, సాంబాలు, జాకర్స్, ముళ్ల పందులు, ముంగీసలు వంటి జంతువులు అధికంగా ఉన్నట్లు వన్యప్రాణి విభాగం అధికారులు చేసిన సర్వేల్లో బయట పడింది. పాపి కొండల అభయారణ్యంలో చిరుతపులి, జింకలు, దుప్పులు, కొండ గొర్రెలు, అడవిదున్నలు ఉన్నట్లు గుర్తించారు. 5 ఫారెస్ట్ రేంజ్‌ల పరిధిలో 60 బీట్లలో 2018లో జంతుగణన కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో ఈ ప్రాంతంలో చిరుత పులులతో పాటు పలు వన్యప్రాణులు ఉన్నట్లు తేలడంతో వాటి సంరక్షణ కోసం గోగులపూడి సమీపంలో బేస్ క్యాంపు, పోలవరం మండలంలోని టేకూరు వద్ద మరో బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బేస్ క్యాంపులో ఐదుగురు చొప్పున సిబ్బంది పని చేసేవిధంగా ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేశారు. అభయారణ్యం సంరక్షణ, జంతువుల ఉనికి తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పలు ప్రదేశాల్లో సంచరిస్తున్న అడవి జంతువుల కదలికలు ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. పాపికొండల అభయారణ్యంలో చిరుతపులి జాడ ఉందని తేలింది. దీనితో పాటు కార్నివోర్స్, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, నక్కలు, తోడేళ్లు, అడవి కుక్కలు, కుందేళ్లు, లేళ్లు, కనుజులు, అడవి పందుల జాడ కూడా ఉన్నట్లు తేలింది. పోలవరం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, కుక్కునూరు అటవీరేంజ్ పరిధిలో నిర్వహించిన జంతు గణనల్లో పోలవరం రేంజ్ పరిధిలో సుమారు 30 అడుగుల గిరినాగులు కూడా ఉన్నట్లు తేలిందని అధికారులు చెప్పారు. కానరాని పెద్ద పులుల జాడ 2018లో నిర్వహించిన జంతు గణనల సర్వేలో జీవజాతుల సంఖ్య పెరిగినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అయితే ఈ ప్రాంతంలో పెద్దపులుల జాడ ఉన్నట్లు ఎక్కడా సమాచారంలేదని అధికారులు చెబుతున్నారు. అయితే పెద్దపులి జాడ కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తద్వారా సీసీ కెమెరాల ద్వారా బంధించే విధంగా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెప్పారు. అయితే ఈ ప్రాంతంలో పులుల సంచారం కూడా ఉందని, అయితే కెమెరాల్లో బందీ కావడంతో పాటు ఆచూకీ లభిస్తేనే వెల్లడిస్తామని అంటున్నారు. వేసవిలో వణ్యప్రాణుల దాహర్తి తీరుతుందిలా.. వేసవిలో వణ్యప్రాణుల దాహర్తిని తీర్చేందుకు అటవీశాఖ అధికారులు నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తారు. కుక్కలు, వాహనాల బారిన పడకుండా అటవీప్రాంతంలో జంతువులు సంచరించే ప్రాంతంలో సాసర్వెల్(నీటి తొట్టె) ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీటితో నింపుతారు. బేస్‌క్యాంప్ సిబ్బందితో కలిసి అధికారులు ప్రతీరోజూ నీటిని పరిశీలించి అందులో చెత్తలేకుండా చూస్తారు. నీటి తొట్టె పక్కనే ఉప్పుముద్దను కూడా ఏర్పాటు చేస్తారు. వన్యప్రాణుల దాహార్తిని తీర్చుకుని ఉప్పుముద్దను నాకుతాయి. దీంతో ఎండ బారి నుంచి కాపాడుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పోలవరం, కన్నాపురం, కుక్కునూరు, వేలేరుపాడు రేంజ్ పరిధిలో సుమారు 70 వరకూ నీటి తొట్టెలు 150 వరకూ చెక్‌డ్యామ్‌లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే వన్యప్రాణులకు వేసవిలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నామని వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో వేణుగోపాల్ తెలిపారు. వెంటాడుతున్న నిధుల కొరత వేసవిలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అధికారులు అనేక అవస్థలు పడుతున్నారు. నీటితొట్టెల్లో నీటిని ట్యాంక్‌ల ద్వారా తరలించేందుకు, ఇతర ఏర్పాట్లకు నిధుల కొరత వెంటాడుతున్నట్లు అధికారులు అంటున్నారు. నిధుల కోసం ప్రతిపాదనలు పంపినా మంజూరుకాలేదని దీనితో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు. జంతు సంరక్షణ కోసం చర్యలు అటవీ ప్రాంతంలోని జంతువులను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వేసవిలో వన్యప్రాణి దాహర్తి తీర్చేందుకు నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తున్నాం. అలాగే చెక్‌డ్యామ్‌లు, ర్యాపిడ్ ఫీల్డ్ డ్యామ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. అయితే పనులకు సంబంధించి కాస్త నిధుల కొరత ఉన్నమాట వాస్తవమే. గత ఏడాది నుంచి నిధులు మంజూరు కావడంలేదు. – జి.వేణుగోపాల్, డిప్యూటీ రేంజర్ అధికారి వైల్డ్‌లైఫ్, పోలవరం -
ప్రసవ వేదన.. ప్రాణ తపన
రాయదుర్గం: ప్రసవవేదన వేళ ఓ జింకపై శునకాలు దాడి చేయడంతో గర్భస్థ జింక సహా తల్లి జింక మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాల్లో ఆదివారం చోటుచేసుకుంది. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలోని చిట్టడవిలో వందలాది మూగజీవాలు జీవనం సాగిస్తున్నాయి. వాటికి అనువైన వాతావరణం కల్పించడంలోనూ హెచ్‌సీయూ పాలకవర్గం, విద్యార్థులు, వైల్డ్‌లెన్స్ గ్రూపు సభ్యులు కృషి చేస్తూనే ఉన్నారు. కానీ అప్పుడడప్పుడు కుక్కలు, వేటగాళ్ల బారిన పడి మూగజీవాలు మృత్యువాత పడుతూనే ఉన్నాయి. తాజాగా హెచ్‌సీయూ క్యాంపస్ పరిసరాల్లో చోటుచేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో హెచ్‌సీయూ సెక్యూరిటీ సిబ్బంది క్యాంపస్‌లోని నల్లగండ్ల చెరువు ఫెన్సింగ్‌ను పరిశీలించేందుకు వచ్చారు. ఈ సమయంలో అక్కడ మృత్యువాత పడిన జింక కనిపించింది. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో సెక్యూరిటీ అధికారులు అక్కడికి చేరుకొని జింకను పరిశీలించారు. ఇదే సమయంలో సమాచారం అందుకున్న వైల్డ్‌లెన్స్ ప్రతినిధులు కూడా చేరుకున్నారు. జింకను పరిశీలించగా.. అది ప్రసవ వేదన పడుతుండే సమయంలో కడుపులోపలి జింక తలభాగం బయటకు వచ్చిన సమయంలో కుక్కలు వెంబడించి దాడికి దిగాయని నిర్ధారించారు. అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చే సమయంలోనే ప్రసవమయ్యే అవకాశం ఏర్పడటంతో అది అటూఇటూ అనువైన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న తరుణంలోనే కుక్కలు వెంబడించగా నల్లగండ్ల చెరువు వైపు వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. ఇదే తరుణంలో అవి దాడి చేయడంతో తాను ప్రాణాలు వదలడంతోపాటు పుట్టబోయే జింకపిల్ల కూడా తల బయటకు వచ్చేస్తున్న తరుణంలో మృత్యువాత పడినట్లు గుర్తించారు. సమాచారం అందించినా.. జింక మృత్యువాత పడిన ఘటన వివరాలను చిలుకూరులోని అటవీ శాఖ అధికారులకు మధ్యాహ్నం 2 గంటలకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలోనే జింకను ఉంచి అక్కడే హెచ్‌సీయూ సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు, వైల్డ్‌లెన్స్ గ్రూపు ప్రతినిధులు సాయంత్రం 6.30 గంటల వరకు వేచి ఉన్నారు. కానీ అటవీశాఖాధికారులు అప్పటికీ చేరుకోలేదు. వారి నిర్లక్ష్యం పట్ల హెచ్‌సీయూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. హెచ్‌సీయూలో కుక్కల బెడద నుంచి మూగజీవాలను కాపాడాల్సిన అవసరం ఉందని వారు కోరారు. గతంలోనూ పలు సంఘటనలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. క్యాంపస్‌లోని పలు ప్రాంతాల్లో కుక్కలు సంచరిస్తున్నాయని, వాటిని క్యాంపస్ బయటకు వదలిపెట్టాలని సూచించారు. -
అనుకోని విషాదం
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: వేగంగా వెళ్తున్న బైక్‌కు జింక అడ్డు రావడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ చోదకునితోపాటు జింక కూడా దుర్మరణం పాలైంది. ఈ విషాదం నెలమంగల తాలూకా అప్పగొండనహళ్లిలో చోటుచేసుకుంది. అప్పగొండనహళ్లి గ్రామం నివాసి హరీష్ (21) మృతుడు. స్థానిక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న హరీష్ మంగళవారం తెల్లవారుజామున అక్కను బైక్‌పై ఎక్కించుకుని బస్టాండులో వదిలి తిరిగివస్తున్నాడు. ఎలా జరిగిందంటే మంగళవారం తెల్లవారుజాము.. మంచు కారణంగా ముందు ఏముందు సరిగా కనిపించడం లేదు. ఈ సమయంలో ఎక్కడినుంచో బైక్‌కు అడ్డుగా వచ్చిన జింకను హరీష్ త్వరగా గుర్తించకపోవడంతో దానిని ఢీకొన్నాడు. హరీష్ హెల్మెట్ ధరించకపోవడంతో కిందపడ్డ తక్షణం తలకు గాయమై ఘటనాస్థలంలోనే మృతిచెందాడు. ఇటు జింక తలకు కూడా తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందింది. త్యామగొండ్లు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వైరల్ : వామ్మో! కొండ చిలువ.. గాల్లోకి లేచి మరీ..
కొండచిలువలు నేలపై ఉండి మాత్రమే వేటాడుతాయని తెలుసు. కానీ నీటిలో ఉండి కూడా వేటాడుతాయని తాజా వీడియో ద్వారా తెలుస్తుంది. ఓ భారీ కొండచిలువ కొలనులో మాటువేసి ఓ జింకపిల్లను అమాంతం పట్టేసి శరీరాన్ని నుజ్జునుజ్జు చేసిన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను మహారాష్ట్రకు చెందిన ఏఎఫ్ఎస్ అధికారి ఒకరు ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో ఏముందంటే.. బురదతో నిండిన ఓ మడుగు వద్దకు నీళ్లు తాగేందుకు వచ్చిన జింకలను చూసిన కొండ చిలువ నెమ్మదిగా నీటి అడుగున ఈదుతూ ఆ జింకలను సమీపించింది. జింకలు దాన్ని గమనించకుండా నీళ్లు తాగడం కొనసాగించాయి. దీంతో కొండ చిలువ నీటి నుంచి ఒక్కసారిగా నిట్టనిలువుగా నిలుచుని జింక మెడను పట్టుకుంది. ఆ వెంటనే దాన్ని చుట్టేసి.. శరీరాన్ని నుజ్జు చేసింది. ఒళ్లు గగుర్పొడిచేలా ఈ వీడియో ఉంది. మహారాష్ట్రలోని చందా డివిజన్ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీల్లో రికార్డైన దృశ్యాలుగా తెలుస్తోంది. -
పాపమా? పుణ్యమా?!
శ్రావస్తి బౌద్ధ సంఘంలో విమలుడు మంచి భిక్షువు. బుద్ధుని ప్రబోధాల్ని చక్కగా ఆచరిస్తాడని పేరు. పంచశీల పాటించడంలో మేటి. ఒకరోజున ఒక అడవిమార్గంలో వెళ్తున్నాడు విమలుడు. అతని చెవికి ఒక జింక రోదన వినిపించింది. వెంటనే విమలుడు ఆ ఆర్తి, అరుపు వినిపించే వైపుకు నడక సాగించాడు. కొంతదూరం వెళ్లేసరికి అక్కడ ఒక జింక, దాని పిల్లలు కనిపించాయి.అవి తల్లి చుట్టూ తిరుగుతున్నాయి. అది గింజుకుంటూ మోర పైకెత్తి అరుస్తోంది. విమలుడు దగ్గరకి వెళ్లాడు. తల్లి జింక భయంతో మరింత బిగ్గరగా అరిచింది. పిల్ల జింకలు రెండూ దూరంగా పారిపోయాయి. ఎవరో వేటగాడు ఉచ్చులు పన్నాడు. ఆ ఉచ్చులో తల్లి జింక కాలు తగిలించుకుంది. అది ఎప్పటినుండి బలవంతాన లాక్కుంటోందో గానీ, ఆ ఉచ్చు మరింత బిగుసుకుపోయింది. కాలి చర్మం కూడా చీరుకుపోయి ఉంది. విమలుడు వెంటనే ఆ ఉచ్చు తొలగించాడు. తల్లి జింక విమలుడి వంక మెరిసే కళ్లతో చూస్తూ తన పిల్లల దగ్గరకు గెంతుతూ అరుస్తూ వెళ్లిపోయింది. ఈసారి దాని అరుపులో ఆనందం వినిపిస్తోంది. విమలుడు వాటివైపు చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయాడు. అంతలో.. అతని వెనుకనుండి... ‘‘ఓరీ! బోడిగుండూ! దుర్మార్గుడా! ఎంత పని చేశావు?’’అనే అరుపు వినిపించి వెనక్కి తిరిగాడు. వేటగాడు కోపంతో తన దగ్గరకు వేగంగా వస్తున్నాడు. ‘‘నేను ఆహారం కోసం ఉచ్చులు పన్నాను. నాకు దొరికిన ఆహారాన్ని నాకు కాకుండా చేశావు. నీవు చేసిన ఈ పనివల్ల ఈ రోజు నా కుటుంబం పస్తుండాలి. మా నోటికాడ కూడు తీసిన పాపం నీదే...’’ అని తిట్టుకుంటూ ఉచ్చులు తీసుకుని భిక్షువు వంక చుర చుర చూస్తూ చరచరా వెళ్లిపోయాడు. విమలుడు దారిలోకి వచ్చి ఆలోచిస్తూ నడక ప్రారంభించాడు. ‘‘నేను పాపం చేశానా?పుణ్యం చేశానా?’’ అనే సందేహంలో పడ్డాడు. ఆరామానికి వచ్చి, బుద్ధుని దగ్గరకు వెళ్లి, నమస్కరించి, విషయం చెప్పాడు. ‘‘విమలా! నీవు చేసింది పాపం కాదు. జీవ కారుణ్యానికి మించిన ధర్మం లేదు. నీవు శీల భ్రష్టుడివి కావు. నిందితుడివి కావు’’ అని మెచ్చుకున్నాడు.ఒక మంచిపని చేయడం వల్ల కొందరు నిందించినా బాధపడకూడదని విమలునికి అర్థమైంది. – డా. బొర్రా గోవర్ధన్ -
మహిళను షాక్‌కు గురిచేసిన జింక
అమెరికాకు చెందిన లిండా టెన్నెంట్ అనే మహిళను ఓ జింక షాక్ గురిచేసింది. ఈ ఘటన బ్రన్స్విక్లోని ఓ పెట్రోల్ పంప్ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లిండా ఆఫీస్‌కు వెళ్తుండగా.. పెట్రోల్ పంప్ వద్ద తన కారును నిలిపారు. అందులో నుంచి బయటకు దిగిన తర్వాత.. అటుగా దూసుకొచ్చిన జింక ఆమె తలపై నుంచి దూకింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొద్దిసేపు అలానే నిలబడిపోయారు. తన తలకు ఏమైనా అయిందా అని చూసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. దీనిని లిండా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే తనకు చిన్న గాయం మాత్రమే అయిందని.. ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. తొలుత ఎవరైనా దొంగలు తనపై దాడి చేయడానికి వచ్చారమోననని అనుకున్నానని తెలిపారు. కానీ ఒక్కసారిగి జింక తన పై నుంచి దూకడంతో భయపడ్డట్టు చెప్పారు. -
జింకను కాపాడిన అగ్నిమాపక శాఖ
చిత్తూరు,పలమనేరు: నీటికోసం వచ్చి మెట్లు లేని బావిలో పడిన జింకను స్థానిక అగ్ని మాపకశాఖ సిబ్బంది రక్షించారు. పట్టణ సమీపంలోని టీఎస్ అగ్రహారంలో బావిలో జింక పడిన విషయాన్ని గమనించిన గ్రామానికి చెందిన హనుమంతురెడ్డి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 60 అడుగుల లోతు ఉన్న ఈ బావిలోకి అగ్నిమాపక సిబ్బంది దిగి జింకను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి, అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. జింక బావిలో పడిందని తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. -
జింక చెరలో టైగర్
ద హంటర్ ఈజ్ నౌ.. ద హంటెడ్! వేటగాడే ఇప్పుడు వేటాడబడుతున్నాడు. గాల్లోకి లంఘించిన టైగర్ బోనులో పడింది. ఈ టైగర్ని నమ్ముకున్న వేలకోట్ల ఇండస్త్రీ... డోలాయమానంలో పడింది! సల్మాన్ ఖాన్‌లో ఎప్పుడూ ఇద్దరు మనుషులు ఉంటారు. ఐశ్వర్యకు పువ్విచ్చి ఐలవ్యూ చెప్పిన సల్మాన్, ఐశ్వర్యను చాచిపెట్టి చెంపదెబ్బకొట్టిన సల్మాన్. కత్రినాను స్టార్‌గా నిలబెట్టిన సల్మాన్, కత్రినాను ఛీ కొట్టిన సల్మాన్. యాభై ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని సల్మాన్, అనాథ చెల్లికి ఆకాశమంత పందిరి వేసి పెళ్లి చేసిన సల్మాన్. ఏదో ఒక వివాదంలో జైలుకు వెళ్లొస్తుండే సల్మాన్, ఎప్పుడూ ఏదో ఒక చారిటీకి విరాళాలిస్తుండే సల్మాన్. పుట్టుకతో మనిషిలో ఈ స్పిట్ పర్సనాలిటీ ఉండదు. పరిస్థితులు స్పి›్లట్ చేస్తుంటాయి. అబ్దుల్ రషీద్ సలీమ్ సల్మాన్‌ఖాన్ ఇలా ఇప్పటికి అనేకసార్లు స్పి›్లట్ అయ్యాడు. అయితే ఇవన్నీ తనకు తనుగా తెచ్చిపెట్టుకున్నవి తప్పితే ఎవరో తెచ్చిపెట్టిన పరిస్థితులు కావు. ఒక శిఖరం.. ఒక అగాధం యాభై రెండేళ్ల వయసు, ముప్పై ఏళ్ల కెరీర్, వందకు పైగా సినిమాలు ఉన్న సల్మాన్ చుట్టూ అనేక వివాదాలు, విమర్శలు, ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే వాటిల్లో కొన్ని మాత్రమే అతడు దోషి అని గానీ, నిర్దోషి అని గానీ నిర్ధారించవలసినవి. మిగతావన్నీ అతడి అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, ప్రియురాళ్లు, విరోధులు, ప్రత్యర్థులు ఎవరికివారుగా ఇస్తుండే తీర్పులు మాత్రమే. సల్మాన్ జీవితంలో ‘మైనే ప్యార్ కియా’ చిత్రం ఎంత గొప్ప శిఖరమో.. కృష్ణజింకను వేటాడ్డం అంత పెద్ద అగాధం. ఇవాళ్టికీ అతడు ఆ అగాధంలోంచి బయటికి రాలేకపోతున్నాడు. ఇరవై ఏళ్ల క్రితం ‘హమ్ సాత్ సాత్ హై’ చిత్రం షూటింగ్ విరామ సమయంలో జో«ద్‌పూర్‌లో వేటకు వెళ్లిన సల్మాన్.. ఈనాటికీ వేటాడబడుతున్న ఒక జింక! జింక చెరలో పడిలో పులి. చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి, సల్మాన్ కూడా. వేట సరదా.. నోటి దురుసు వేట సరదా ఒక్కటే కాదు, నోటి దురుసు కూడా అతడిని అనేకసార్లు వెంటాడి వెంటాడి వదిలిపెట్టింది. 2016లో ‘సుల్తాన్’ సినిమాలోని కుస్తీ సన్నివేశాల్లో తనెంత కష్టపడిందీ ప్రెస్‌మీట్ చెబుతూ.. ‘రేప్’ జరిగాక ఎలా ఉంటుందో అలా.. నా ఒళ్లు హూనం అయింది’ అన్నాడు సల్మాన్. దేÔ¶ వ్యాప్తంగా మహిళలు భగ్గుమన్నారు. తర్వాత క్షమాపణ చెప్పాడు కానీ, అనాలోచితంగా అన్న మాట వల్ల రేగిన జ్వాలను ఎన్ని వేల క్షమాపణలు మాత్రం ఆర్పేయగలవు? నవంబర్ 26 ముంబై ఉగ్రదాడుల మీద 2010లో సల్మాన్ చేసిన కామెంట్ కూడా ఆయన్ని దేశద్రోహి కన్నా తక్కువ కానీ ఒక ‘హీనుడి’గా నిలబెట్టింది. ‘‘పెద్దపెద్దవాళ్లు టార్గెట్‌గా ఉన్నారు కాబట్టి ఈ పేలుళ్ల గురించి రాద్ధాంతం చేస్తున్నారు కానీ, నిజానికి అంతలేదు’’ అని ఒక పాకిస్తానీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ అన్నాడు. ఈసారి దేశం మొత్తం భగ్గుమంది. ‘‘ఇందులో పాకిస్తాన్ తప్పేమీ లేదు. ఇండియా చేతగాని తనం ఉంది’’ అని కూడా అదే ఇంటర్వ్యూలో సల్మాన్ అన్నాడు. ఈ రెండు కామెంట్లపై అప్పట్లో దుమారం రేగింది. ‘ఈ దేశద్రోహిని ఉరి తియ్యాలి’ అనే నినాదాలు వినిపించాయి. (అయితే ఇదే సల్మాన్ 2008లో దేశంలోని ముస్లింల ఆగ్రహానికి కూడా గురయ్యాడు. గణేశ్ పూజను నిర్వహించినందుకు అతడిపై ఫత్వాలు జారీ అయ్యాయి!). మనసులో ఉన్నది అనేస్తాడు సల్మాన్ ఎమోషనల్. తటాలున ఒక మాట అనేస్తాడు. తన అనుకున్నవాళ్ల మీద ఏదైనా మాటొచ్చి పడితే.. అంతే వైల్ట్గా రియాక్ట్ అవుతాడు. ఐశ్వర్య విషయంలో వివేక్ ఒబేరాయ్‌తో, కత్రిన బర్త్‌డే ఫంక్షన్లో షారుక్ ఖాన్‌తో సల్మాన్ గొడవపడినప్పుడు అతడి ముఖం చూడాలి. వాళ్లిద్దర్నీ మీద పడి కొట్టినంత పని చేశాడు. 2014లో ముజఫర్‌నగర్ పునరావాస శిబిరాలలో కనీస వసతులు లేక పిల్లలు చనిపోతున్నారు. ఆ టైమ్‌లో సల్మాన్‌ఖాన్, మాధురీ దీ„ì త్, ఆలియాభట్, ఇంకా కొందరు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పిలిస్తే ‘సైఫై మహోత్సవ్’కి వెళ్లారు. దానిపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. వెంటనే ఆలియాభట్ క్షమాపణ చెప్పారు. అయితే సల్మాన్ ఆ విమర్శలపై అంతే స్థాయిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మా పని మేం చేస్తే తప్పేంటి?’’ అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నించడం పెద్ద వివాదం అయింది. మాట్లాడకుండా ఉంటే సరిపోయేది. కానీ మనసులో ఉన్నది అనేయడం సల్మాన్ నైజం. ఇవన్నీ.. సల్మాన్ మాటల వల్ల వచ్చిన ఇబ్బందులైతే.. చేతలతో అతడు తెచ్చిపెట్టుకున్న తలనొప్పులూ ఉన్నాయి. ఆత్మను వెంటాడే అంతరాత్మ 2002లో ముంబైలోని ఓ బేకరీ సమీపంలో పేవ్మెంట్ మీద పడుకున్న వారి మీదుగా కారును నడిపి ఒకరి మృతికి, ముగ్గురి గాయాలకు కారణమైన ఘటనలో సల్మాన్ ఏళ్ల పాటు విలన్‌గా నిలబడవలసి వచ్చింది. ఈ కేసు 13 ఏళ్లపాటు సాగింది. కేసు నుంచి అతడు బయటపడినా, అది ఎప్పటికైనా దెయ్యంలా అతడి అంతరాత్మను నిలదీసే ఘటనే. 2013లో బిగ్‌బాస్ రియాల్టీ షోలో సల్మాన్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అప్పటికి నాలుగేళ్లుగా అతడు షో ను హోస్ట్ చేస్తున్నాడు. కంటెస్టెంట్లుగా బాలీవుడ్ నటులను చేరదీసి, టీవీ యాక్టర్లను పక్కన పెడుతున్నాడని అతడిపై ఆరోపణ. అయితే తనకలాంటి పక్షపాతాలేవీ లేవని ఉండవని ట్వీట్ చేసి ఆ వివాదం నుంచి బయటపడే ప్రయత్నం చేశాడు. సల్మాన్. తర్వాతి ఏడాది గుజరాత్లో కైట్ ఫెస్టివల్ జరుగుతుంటే అక్కడికెళ్లాడు. దానికి అతడిని ఆహ్వానించింది.. ముస్లింలకు వ్యతిరేకి అయిన నరేంద్ర మోదీ. అలా సల్మాన్‌ఖాన్ మోదీని కలవడంపైన కూడా వివాదం అయింది. సల్మాన్ నటించిన ‘జై హో’ చిత్రాన్ని బాయ్‌కాట్ చెయ్యాలని ప్రదర్శనలు జరిగాయి. ఏడేళ్ల క్రితం ఓ మత్స్యకారుల కుటుంబాన్ని సల్మాన్, అతడి బాడీ గార్డులు బెదిరించారని బాంద్రా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. సముద్రం ఒడ్డున కాటేజీల ‘వ్యూ’కి అడ్డుగా ఉన్న పడవలను తొలగించాలని ఆ కుటుంబంతో సల్మాన్ గొడవకు దిగారన్నది ఆరోపణ. ఒకవైపే చూద్దామా?! సల్మాన్‌ని ఒక వైపు మాత్రమే చూస్తే వినిపించే విమర్శలు, కనిపించే వివాదాలు ఇవన్నీ. రెండో వైపున అతడిలో చేయూతనిచ్చే ‘మెంటర్’ ఉన్నాడు. ఆ సంగతి బాలీవుడ్లో ఇప్పుడు స్టార్లుగా వెలుగుతున్న కొంతమందికి తెలుసు. అతడిలో ఒక ధార్మికుడు ఉన్నాడు. ఛారిటీ వీరుడూ ఉన్నాడు. ఆ సంగతి అతడిచ్చిన కోట్ల రూపాయల విరాళాలతో సామాజిక సేవాకార్యక్రమాలు చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు తెలుసు. అలాగని ఈ ఛారిటీ వీరుడు.. కండల వీరుడికి గుడ్ బాయ్ అని సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. గుడ్డు గుడ్డే. బ్యాడ్ బ్యాడే. కొన్నిసార్లు మాత్రం ఉత్తిపుణ్యానికే.. లోకం మీద పడిపోతుంది. అలాంటప్పడు అతడిలోని గుడ్బాయే పైకి కనిపిస్తాడు. ‘భంగీ’ అనే మాటను వాడి ఎస్సీల మనోభావాలకు భంగం కలిగించాడని కొన్నేళ్ల క్రితం సల్మాన్ ఖాన్‌పై ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) కేసు వేసింది. అయితే రియాల్టీ షోలో అతడు ఉపయోగించిన ఆ ‘భంగీ’ అనే మాట ఒక ‘స్టెయిల్ ఆఫ్ డ్యాన్స్’ అని నిర్ధారణ అయ్యాక అతడు పునీతుడు అయ్యాడు.ఈ వివాదాలు, విమర్శలను పక్కన పెట్టి చూస్తే సల్మాన్ నిస్సందేహంగా ఈ దేశానికి అభిమాన పాత్రుడు. కోర్టు దోషి అనగానే దోషినైపోయానని సల్మాన్‌ఖాన్ అనుకోకపోవచ్చు. పైనింకా చాలా కోర్టులు ఉన్నాయి కదా అనీ అనుకోవచ్చు. అయితే కండలు తిరిగిన బలిష్టమైన ఆ దేహం లోపల ‘మనస్సాక్షి’ అనే కోర్టు ఒకటి ఉంటుంది. ఆ కోర్టు తీర్పును సల్మాన్ శిరసా వహించ వలసిందే. గాలిలో వెయ్యి కోట్లు! సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘రేస్ 3’ సినిమా షూటింగ్‌ను దాదాపుగా పూర్తి చేశారు. ఈ సినిమా రంజాన్ రిలీజ్‌కు రెడీ అయింది. ఆ తర్వాత ‘దబాంగ్’ ఫ్రాంచైజ్‌లో ‘దబాంగ్ 3, మరో సినిమా భరత్’, వీటితో పాటు.. రెమో డీసౌజాతో ఓ సినిమాను అంగీకరించారు. సల్మాన్ ఖాన్ సినిమా సూపర్ హిట్ అని టాక్ వస్తే చాలు.. ఆ సినిమా కలెక్షన్ ఈజీగా 300 కోట్ల క్లబ్‌కు చేరుకుంటుంది. అలాంటిది ఈ టైమ్‌లో సల్లూ భాయ్ జైలులో ఉంటే ఒప్పుకున్న మూడు సినిమాలు కలిపి దాదాపు 900 కోట్ల బిజినెస్ ఆగిపోతుందని ట్రేడ్ టాక్. ఇదిలా ఉంటే త్వరలో ప్రారంభం కానున్న ‘బిగ్ బాస్ 12’ టీవీ షోకి కూడా సల్మాన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.‘బిగ్ బాస్ 11’ ఎపిసోడ్‌కు 10 కోట్లు తీసుకున్నారట సల్మాన్. ఈజీగా 50కి పైగానే ఎపిసోడ్స్ ఉండే ఈ షో ద్వారానే ఆయనకు ఓ 50 కోట్లు దాకా వస్తుంది. ఇవి కాకుండా యాడ్స్ కూడా చేస్తుంటారు. అంటే సల్మాన్ జైలులో ఉంటే సుమారు వెయ్యి కోట్ల బిజినెస్ ఇరకాటంలో పడుతుందని బాలీవుడ్ అంచనా. -
కృష్ణజింకకు బిస్కెట్లు తినిపించా: సల్మాన్ ఖాన్
సాక్షి, ముంబై : రాజస్తాన్‌లో కృష్ణజింకలను వేటాడిన కేసు సుదీర్ఘకాలం నుంచి బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్‌ను వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో తన సహ నటులు సైఫ్ అలీఖాన్, సోనాలి బింద్రే, టబు, నీలమ్‌ను నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు.. సల్మాన్‌ను మాత్రం దోషిగా తేల్చింది. హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ సందర్భంగా రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో రెండు కృష్ణజింకలను సల్మాన్ ఖాన్ వేటాడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత కొన్నిరోజులకు ఆయన చింకారాలను (దుప్పిలను) కూడా వేటాడినట్టు, సెప్టెంబర్ 28, 1998 నాడు ఘోడా ఫార్మ్స్‌లో ఓ కృష్ణజింకను వెటాడినట్టు అభియోగాలు ఎదుర్కొన్నారు. 1998 అక్టోబర్ 2న బిష్ణోయ్ ప్రజలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతరించిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్న కృష్ణజింకలను వెటాడటం నేరం. ఇందుకు గరిష్టంగా ఆరేళ్ల జైలుశిక్ష పడే అవకాశుమంది. ఈ కేసులో 1998 అక్టోబర్‌లో అరెస్టైన సల్మాన్ ఆ తర్వాత ఐదు రోజులకు బెయిల్‌పై విడుదల అయ్యారు. జింకలను వెటాడిన ఒక కేసులో సల్మాన్‌కు ఇప్పటికే కిందికోర్టు శిక్ష విధించింది. అయితే, అదృష్టం ఆయన పక్షాన ఉండటంతో రాజస్థాన్ హైకోర్టు ఆ కేసును కొట్టివేసింది. కృష్ణజింకలను వేటాడిన మరో కేసులోనూ సల్మాన్ తాజాగా దోషిగా తేలడంతో ఆయనకు ఎంతకాలం శిక్షపడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ కేసు నేపథ్యంలో 2009లో ఎన్డీటీవీతో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ చెప్పిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ కేసులో తమ పక్షం వాదనను ఆయన మీడియాతో పంచుకున్నారు. హమ్ సాత్ సాథ్ హై సినిమా షూటింగ్ ముగించుకొని ఆ రోజు తాను, తన సహనటులు త్వరగా బయలుదేరామని, తాము వెళ్తుండగా కృష్ణజింకల గుంపు ఎదురుపడిందని, అందులోని ఒక దానికి తాము బిస్కెట్లు తినిపించామని ఆయన చెప్పారు. ‘ఒక జింక పొదలో ఇరుక్కోవడం మేం చూశాం. పెద్ద జింకల గుంపు అక్కడ ఉంది. పొదలో చిన్న జింక చిక్కుకుంది. అది కదల్లేక తీవ్రంగా భయపడుతోంది. నేను అక్కడి నుంచి దానిని బయటకు తీశాను. మేం దానికి కొంచెం నీళ్లు తాగించాం. జింక కొన్ని బిస్కెట్లను తిన్న తర్వాత అడవిలోకి పారిపోయింది’ అని సల్మాన్ వివరించారు. ఈ ఘటననే చిలువలు, పలువులు చేసి వివాదాన్ని ఇంతదాక తీసుకొచ్చారని ఆయన పేర్కొన్నారు. -
జింకను మింగేసిన పైథాన్
ఫ్లోరిడా: నైరుతి ఫ్లోరిడాలోని ఓ పైథాన్ తనకంటే బరువున్న ఓ జింకను మింగేసింది. కన్సర్వెన్సీ ఆఫ్ సౌత్ వెస్ట్ ఫ్లోరిడాకు చెందిన జాతీయ పార్కు అధికారులు ఈ ఘటనకు సంబంధించి వివరాలను వెల్లడించారు. కొలియర్-సెమీనోల్ స్టేట్ ఫారెస్ట్‌లో 15.88 కిలోల జింకను, 14.29 కిలోల పైథాన్ మింగేసింది. దీన్ని గుర్తించిన అధికారులు ఈ తతంగాన్ని మొత్తం డాక్యుమెంట్ రూపంలో పొందుపరిచారు. పైథాన్ జంతువును మింగేసిందని గుర్తించిన అధికారులు, వెంటనే పైథాన్ పొట్టను కోశారు. చనిపోయిన జింకను బయటకు తీసి, తిరిగి పైథాన్‌కు కుట్లు వేసి దాన్ని రక్షించారు. బర్మెస్ పైథాన్లు సాధారణంగా భారీగా ఆహారాన్ని తీసుకుంటాయని, కానీ మరీ ఇంత పెద్ద మొత్తంలో ఆహారాన్ని తీసుకోవడాన్ని గుర్తించడం ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు. హెర్పెటోలాజికల్ రివ్యూ 2018 మార్చిలో ఈ డాక్యుమెంట్‌ను పబ్లిష్ చేశారు. -
జింక మాంసం స్వాధీనం
అన్నానగర్: దేవాలావలో ఆదివారం 30 కిలోల జింక మాసాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. నీలగిరి జిల్లా కూడలూర్ తాలూకా దేవాలావా ప్రాంతంలో జింక మాంసం విక్రయిస్తున్నట్టుగా అటవీ శాఖాధికారులకు ఆదివారం సమాచారం అందింది. దీని ప్రకారం అటవీ శాఖ అధికారులు శరవణన్, లూయిష్, మిల్టన్ ప్రభు ఆ ప్రాంతానికి వెళ్లి విచారణ చేశారు. అదే ప్రాంతానికి చెందిన పుష్పరాజ్ ఇంట్లో తనిఖీ చేయగా 30కిలోల జింక మాంసం లభ్యమైంది. దీనికి సంబంధించి పుష్పరాజ్ (56), ఇతని కుమారుడు పేరళగన్ (26)లను దేవాలావ అటవీ శాఖ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ చేశారు. ఇందులో టేన్‌టి రేంజ్ నెంబర్–1 ప్రాంతంలో జింక మృతి చెంది ఉందని, దాన్ని మాంసం కోసం ఇంటికి తీసుకెళ్లినట్లుగా నిందితులు అటవీశాఖాధికారులకు తెలిపారు. తరువాత జింక మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి వారిద్దరిని అరెస్టు చేశారు. -
అమ్మగా మారి.. ఆలనా పాలనా..!
-
అమ్మగా మారి.. ఆలనా పాలనా..!
సాక్షి, వెబ్ డెస్క్ : ఫోటోలు చూసి ఆహారంతో సింహా ఆడుకుంటోందనుకుంటే మీరు పొరబడినట్లే..! ఔను. అడవి జంతువుల్లో రారాజుగా గుర్తింపు పొందిన సింహం ఓ చిన్న జింకపిల్లపై వల్లమాలిన ప్రేమను, ఆప్యాయతను పెంచేసుకుంది. ఓ మగ సింహం దాడిలో ఆడ సింహం కూనలు ప్రాణాలు కోల్పోయాయి. ఆ ఘటనతో తీవ్ర ఒత్తిడికి గురైన ఆడ సింహం.. అడవిలో ఒంటరిగా తన కంట పడ్డ జింక పిల్లను రక్షిస్తోంది. ఈ ఆడ సింహం జింక పిల్లపై సింహం కురిపిస్తున్న ప్రేమను ఫొటోగ్రాఫ్ గార్డన్ డొనోవాన్ తన కెమెరాలో బంధించారు. సింహాల ఫొటోలు తీయడం తనకు ఇష్టమని గార్డన్ చెప్పారు. అందులో భాగంగా జింక పిల్లను చంపడానికి వస్తున్న సింహాన్ని చిత్రించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, తాను ఎదురుచూసిన దానికి భిన్నంగా సింహం జింక పిల్లను సంరక్షించడం ప్రారంభించిందని చెప్పారు. నమీబియాలోని ఈటోషా జాతీయ పార్కులో ఈ సింహం, జింక పిల్ల ఉన్నాయి. -
కవ్వాల్కు వెయ్యి జింకలు
సాక్షి, హైదరాబాద్: పులులకు సమృద్ధిగా ఆహారం సమకూర్చటంతోపాటు అటవీ ఆవరణ వ్యవస్థను సమతుల్యంగా ఉంచేందుకు కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టుకు వీలైనంత త్వరగా వెయ్యి జింకలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నెహ్రూ జూలాజికల్ పార్కు, రంగారెడ్డి జిల్లా చిలుకూరు సమీపంలోని మృగవని జింకల పార్కుతోపాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని మాగనూరు కృష్ణా తీర ప్రాంతం నుంచి జింకలను తరలించాలని నిర్ణయించారు. ‘కవ్వాల్ పులికి ఫుడ్డు సవ్వాల్’ శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఫారెస్టు అధికారులు స్పందించారు. అటవీ సంరక్షణ ప్రధానాధికారి పీకే ఝా, వన్యప్రాణి సంరక్షణ ప్రధాన అధికారి మనోరంజన్ భాంజా, ప్రత్యేక అధికారి శంకరన్‌లు సమావేశమయ్యారు. ఈ నెలలోనే పులుల గణన ఉన్న నేపథ్యంలో విధివిధానాలతోపాటు ‘సాక్షి’ కథనంపై చర్చించారు. కవ్వాల్‌లో పులి ఆవాసాల్లో శాకాహార జంతువులు ఉండాల్సిన నిష్పత్తిలో లేవని అంచనాకు వచ్చారు. మహారాష్ట్రలోని తాడోబా అడవుల నుంచి కవ్వాల్కు వస్తున్న పులులు.. ఆహారం లేకనే తిరిగి వెళ్తున్నాయని అభిప్రాయపడ్డారు. మరోవైపు నెహ్రూ జూలాజికల్ పార్కు, రంగారెడ్డి జిల్లా మృగవని జింకల పార్కుల్లో ఎక్కువ సంఖ్యలో జింకలు ఉన్నాయని, వాటితో పాటు మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా తీరంలో జింకలు పంటచేలపై దాడి చేస్తున్న ఘటనలపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఆ జింకలను కవ్వాల్కు తరలించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం పీకే ఝా ‘సాక్షి’తో మాట్లాడారు. జింకల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి వాటిని తీసుకెళ్లి కవ్వాల్ టైగర్ షెల్టర్ జోన్లో వదిలేస్తామని చెప్పారు. అటవీ మధ్యలో నివాస గ్రామాల వల్ల కూడా పులులు వేరే ప్రాంతానికి తరలిపోతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ నివాస గ్రామాల తరలింపుపైనా దృష్టి పెట్టామని చెప్పారు. ప్రతి ఆదివాసీ కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తున్నామన్నారు. ఈ నెల 17 తర్వాత ఆదివాసీ గ్రామాల తరలింపునకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఈ నెల 22 నుంచి పులుల గణన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పులుల సంఖ్యను పక్కాగా తేల్చేందుకు అటవీ శాఖ సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో పులుల గణన చేపడతామని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పీకే ఝా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,100 బీట్లను గుర్తించామని, ప్రతి బీట్‌కు ఇద్దరు చొప్పున నియమించి పులుల లెక్కలు తీస్తామన్నారు. ఈసారి గణనకు సీసీ కెమెరాల వినియోగంతో పాటు పాద ముద్రలు, పెంటిక నిర్ధారణ పరీక్షలనూ పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఈ గణనలో స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవో సంఘం సభ్యుల సహకారం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న యువతీ యువకులు గణనలో పాల్గొనటానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. పులుల గణనను నాలుగేళ్లకోసారి నిర్వహిస్తారు. చివరిసారిగా 2013 జనవరిలో పులుల గణన చేపట్టారు. -
కవ్వాల్ పులికి ‘ఫుడ్డు’ సవ్వాల్!
సాక్షి, హైదరాబాద్ అది టైగర్ షెల్టర్ జోన్.. కానీ అక్కడే పుట్టి పెరిగిన పులి ఒక్కటంటే ఒక్కటి లేదు.. అయినా సరే పక్క రాష్ట్రాల నుంచి పులుల్ని రప్పించేందుకు అధికారులు కోట్లు వెచ్చిస్తున్నారు.. ఆ అడవిలో కృత్రిమంగా పశుగ్రాసం పెంచారు.. నీటి చెలమలు తీశారు.. చెక్‌డ్యాంలు కట్టారు.. అటవీ భూమి చుట్టూ కందకాలు తవ్వించారు.. కానీ పులికి కావాల్సిన తిండిని మాత్రం మరిచారు! పస్తులైనా ఉంటుంది కానీ పచ్చిగడ్డి తినదన్న లాజిక్‌ను మరిచిన అధికారులు.. కోట్లు పోసి లేని పులిని రా.. రమ్మని పిలుస్తున్నారు! అదే సమయంలో పులికి ఆహారమైన దుప్పులు, కృష్ణ జింకలు, మచ్చల జింకలు, మనుబోతులు, కొండ గొర్రెలను నిర్లక్ష్యం చేస్తున్నారు. వేటగాళ్లు వాటిని యథేచ్ఛగా చంపేస్తున్నా కళ్లు మూసుకుంటున్నారు. పులులే లేని చోట.. రాష్ట్ర అటవీ శాఖ కేంద్రానికి ఏం నివేదికలు పంపిందో ఏమో గానీ కేంద్ర ప్రభుత్వం కవ్వాల్ అభయారణ్యాన్ని 41వ పులుల సంరక్షణ కేంద్రం(టైగర్ షెల్టర్ జోన్)గా గుర్తించింది. 1,100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర అటవీ ప్రాంతాన్ని కవ్వాల్ టైగర్ ప్రాజెక్టుగా ప్రకటించారు. దీని అభివృద్ధికి కేంద్రం రూ.45 కోట్ల నిధులిచ్చింది. ఈ సొమ్ముతో అధికారులు పశుగ్రాసం పెంచారు. పులులు వస్తే తాగటానికి నీటి సాసర్లు, చెలిమలు తీయడంతోపాటు అన్ని ఏర్పాట్లు చేశారు. పులి అవాసం ఏర్పాటు చేసుకోవటానికి కనీసం 20 నుంచి 30 చ.కి.మీ. దట్టమైన అటవీప్రాంతం అవసరం. ప్రతి చదరపు కిలో మీటరుకు కనీసం 60 నుంచి 70 శాకాహార జంతువులు ఉండాలి. పులి సగటున ప్రతి మూడు రోజులకు ఒకసారైనా వేటాడుతుంది. కానీ కవ్వాల్ ప్రాంతంలో జింకలు, దుప్పులు, ఇతర అటవీ జంతువులు ఏ మేరకు ఉన్నాయన్న కచ్చితమైన లెక్కలు అటవీ శాఖ అధికారుల వద్ద లేవు. విచిత్రమేమిటంటే స్థానికంగా కవ్వాల్ అడవిలో పుట్టి పెరిగిన పెద్దపులి ఒక్కటి కూడా లేదు. అక్కడ పులుల సంచారంపై ఉట్నూరు మండలం కుమ్మరికుంటకు చెందిన భీమ్‌రావ్‌ను అడగ్గా.. ‘‘70 ఏళ్ల నుంచి ఈ అడవిలనే బతుకుతున్న. ఎన్నడూ పులిని చూడలె. దాన్ని జూసినట్టు మా నాయిన కూడా చెప్పలె!’’ అని పేర్కొన్నాడు. ఏమో.. రాకపోతాయా? ఈ నెలలో పులుల లెక్కింపు ఉండటంతో రాష్ట్ర అటవీ అధికారులు నానా హైరానా పడుతున్నారు. కవ్వాల్ అభయారణ్యానికి 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని తాడోబా, 100 కి.మీ. దూరంలో ఉన్న మరో టైగర్ ప్రాజెక్టు ఇంద్రావతిపైనే ఆశలు పెట్టుకున్నారు. పులుల సంచారానికి అవకాశం ఉన్న దారుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గమనిస్తున్నారు. ఇప్పటివరకు అక్కడ్నుంచి 7 నుంచి 9 పులులు వచ్చినట్లు నివేదికలు రూపొందించారు. ఇందులో ఓ పులి 2015లో వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు తీగలకు తగిలి చనిపోయింది. మిగతా పులులు కవ్వాల్ ప్రాంతంలోనే ఉన్నాయా? వెనక్కి వెళ్లాయా అన్న ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. ‘ఏమో.. ఈ నెలలో చేయబోయో పులుల జనాభా లెక్కల్లో తెలుస్తుంది’ అని చెబుతున్నారు. ప్రతి చ.కి.మీ.కు కనీసం 60–70 వరకు శాకాహార జంతువులు లేకుంటే పులులు రావని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉన్న జింకలకు రక్షణేది..? పులుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఫారెస్టు అధికారులు కవ్వాల్కు ఆనుకొనే ఉన్న ప్రాణహిత నదీ తీరంలోని జింకలను పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యానికి మూల్యంగా వెంచపల్లి రిజర్వ్ ఫారెస్టులోని జింకలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే దశకు వచ్చాయి. అదిలాబాద్ జిల్లా కోటపల్లి, పారుపల్లి, జనగామ, సుపాక, అర్జునగుట్ట, కిన్నారం గ్రామాల పరిధిలోని ప్రాణహిత నది ఒడ్డున వెంచపల్లి అభయారణ్యం విస్తరించి ఉంది. 1980లో వైల్డ్‌లైఫ్ అభయారణ్యంగా ఉన్న ఈ ప్రాంతంలో దాదాపు 250 నుంచి 300 వరకు కృష్ణ జింకలు ఉండేవి. క్రమంగా ఈ సంఖ్య పెరగటంతో 1999లో వెంచంపల్లిని కృష్ణ జింకల అభయారణ్యంగా ప్రకటించారు. కానీ వేటగాళ్లు ఇష్టారాజ్యంగా జింకలను వేటాడారు. 2007లో తీసిన లెక్కల ప్రకారం ఇక్కడ కేవలం 40 జింకలు మాత్రమే ఉన్నట్టు తేలింది. 2015లో మరోసారి లెక్కలు తీయగా.. కేవలం 5 కృష్ణ జింకలు ఉన్నట్టు తేలింది. ఆ తర్వాత రెండేళ్లకు చేసిన లెక్కల్ని అధికారులు బయటపెట్టలేదు. కృష్ణా తీరంలో కష్టకాలం మహబూబ్‌నగర్ జిల్లా తంగడి నుంచి జూరాల ప్రాజెక్టు వరకు 27 కి.మీ. మేర కృష్ణా తీరం ఉంది. నదికి ఉత్తరాన 34 గ్రామాలున్నాయి. ఈ పల్లెల్లో వేల సంఖ్యలో జింకలు ఉన్నాయి. తీరం వెంట గడ్డి లేకపోవటంతో స్థానికంగా పంట పొలాలపై దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయి. ఇది రిజర్వు ఫారెస్టు ప్రాంతం కాదు. ఫారెస్టు అధికారుల నిఘా పెద్దగా ఉండదు. ఇదే అదునుగా కర్ణాటకలోని రాయచూరు నుంచి వస్తున్న వేటగాళ్లు యథేచ్ఛగా జింకల్ని వేటాడుతున్నారు. ఈ 34 గ్రామాలకు కలిపి ఇద్దరు ఫారెస్టు వాచర్లు మాత్రమే ఉన్నారు. సాధారణంగా ఫోకస్ లైట్‌ను జింక కళ్లలోకి సూటిగా కొడితే అవి కదలకుండా నిలబడతాయి. వెంటనే మరో వ్యక్తి వెనుక నుంచి కర్రతో జింకను బలంగా కొట్టి చంపుతున్నారు. మూడు మెట్లను వదిలి.. అటవీ ఆవరణ వ్యవస్థలో పులిది చివరి మెట్టు. తొలిమెట్టులో గడ్డిజాతులు, పొదలు, చెట్లు ఉంటే.. రెండో మెట్టులో కుందేళ్లు, జింకలు, దుప్పులు కొండ గొర్రెలు వంటి శాకాహార జంతువులు ఉంటాయి. మూడో మెట్టులో వీటిని తిని బతికే నక్కలు, తోడేళ్లు, ఎలుగుబంటు లాంటి ద్వితీయ మాంసాహార జంతువులు ఉంటాయి. నాలుగో మెట్టులో పులి ఉంటుంది. పులి ఎదగాలంటే ఈ అటవీ ఆవరణ వ్యవస్థ సమతుల్యంగా ఉండాలి. పొదలు, గడ్డిజాతులతో పాటు జింకలు, కుందేళ్లు, కొండ గొర్రెలు, మనుబోతులు తగిన స్థాయిలో ఉండాలి. రాష్ట్ర అటవీ శాఖ అధికారులు పులులను ఆకర్షించే తొలి మూడు మెట్లలోని జీవులను నిర్లక్ష్యం చేస్తూ.. టైగర్ షెల్టర్ జోన్‌ను ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. -
పచ్చని పంట..జింకలతోనే తంటా
(మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా తీర ప్రాంత గ్రామాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) అడవి పందులు, కోతుల దాడులను తట్టుకోలేక రైతాంగం సంప్రదాయ పంటలను వదిలేసి పత్తి వైపు మొగ్గింది. కానీ కృష్ణా తీరం రైతులకు పత్తి వేసినా పంట దక్కే పరిస్థితి లేదు. కోతుల గుంపులకు మించిన జింకల మందలు పంటల మీద పడి స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో పంటను కాపాడుకునేందుకు రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అన్నదాతలు కంటి మీద కునుకేస్తే చాలు.. జింకల మందలు చేళ్ల మీదకొచ్చి మొలకలు, ఆకులు, కాయలను నమిలేస్తున్నాయి. తంగడి నుంచి జూరాల ప్రాజెక్టు వరకు కృష్ణా తీరం వెంట 30 వేల ఎకరాల్లో జింకలు పంటలను నాశనం చేస్తున్నాయి. దీనిపై తీరం వెంబడి 27 కిలోమీటర్ల మేర ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. రైతులను కదిపి చూసింది. జింకల మందలతో వేగలేక రైతులు వ్యవసాయాన్నే వదులుకునే పరిస్థితికి వస్తున్నారు. సిరులు పండే భూములను వదిలేసి వలసలు పోతున్న దృశ్యాలు కనిపించాయి. అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని బాధిత రైతులు చెబుతుంటే... ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని అధికారులు చెబుతున్నారు. పంటల మీద పడి.. 1980–1990 మధ్య కురుమగడ్డ, నారగడ్డ, నల్లగడ్డ ప్రాంతాల్లో పదుల సంఖ్యల్లో మచ్చల జింకలు, కృష్ణ జింకలు ఉండేవి. అప్పట్లో గుట్టల్లో మొలిచిన గడ్డి తిని బతికేవి. చేళ్ల మీదకు వచ్చేవి కావు. 15 ఏళ్ల కిందట రెండు లారీల్లో కొమ్ముల జింకలను తీసుకొచ్చి వదిలారని, అప్పటి నుంచే జింకల మందలు పెరిగిపోయాయని గజరందొడ్డి గ్రామానికి చెందిన రైతు మల్లప్ప చెప్పాడు. జింకలు పంటల మీద పడుతుండటంతో పగలూ రాత్రీ కాపలా కాస్తున్నారు. రాత్రంతా మేలుకుని ఉండాల్సిందే. ఒకవేళ నిద్రపోతే.. మంద చేను మీదపడి కాయ లేకుండా తినేస్తాయని ముడుమాల్‌కు చెందిన రైతు సుంకన్న చెప్పాడు. ఎంత జాగ్రత్తగా కాపు కాసినా 60 శాతం పంట జింకల పాలవుతోందని, ఎకరాకు 10 క్వింటాళ్లు రావాల్సిన పత్తి మూడు క్వింటాళ్లకు మించటం లేదని గుడెబల్లూరు చెందిన రైతు గురుమల్లప్ప చెప్పారు. ప్రెగడబండా, ఓబ్లాపూర్, గుడెబల్లూర్, ముడుమాల్, మురహార్‌దొడ్డి, అడవి సత్యావార్, మాగనూర్ రైతులు ఈ ఏడాది తమ పొలాలను బీడుగా వదిలేశారు. జింకల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తే... అటవీ నిబంధనల ప్రకారం అటవీ జంతువులు పంట నాశనం చేస్తే ఎకరాకు రూ.6 వేల వరకు నష్టపరిహారం చెల్లించాలి. ఇక్కడ 30 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినా అధికారులు ఇప్పటివరకు ఒక్క ఎకరాకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. జింకలతో సమస్య తీవ్రంగా ఉందనే విషయాన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయలేదు. ఇక్కడ 4 నుంచి 5 వేలకు పైగా జింకలు ఉన్నట్లు సమాచారం. ఈ సీజన్ దాటితే మరో వెయ్యి పెరిగే అవకాశం ఉంది. అధికారులు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే జింకల భవిష్యత్తుకు, రైతుల సాగుకు ఉపయోగకరంగా ఉంటుంది. తీరంలోనే వందల ఎకరాల్లో ప్రభుత్వ భూములున్నాయి. సంరక్షణ ప్రభుత్వానికి ఇబ్బందికరం అనుకుంటే.. కొన్ని స్వచ్ఛంద సంస్థలు జింకల పార్కును ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వైఎస్సార్ ఉన్నప్పుడు.. 2004 వరకు కర్నూలు జిల్లా ఆలూరు, మిడుతూరు మండలాల్లో జింకలు పంటల మీదపడి దాడులు చేసేవి. ప్రస్తుతం తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్టు కన్జర్వేటర్ పీకే ఝా అప్పట్లో కర్నూలు జిల్లా కన్జర్వేటర్‌గా ఉన్నారు. రైతులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి మొరపెట్టుకోగా.. పంట నష్టపరిహారం ఇవ్వటంతోపాటు, ప్రత్యేక పద్ధతులు అవలంబించి 6 నెలల్లో 3,500 జింకలను పట్టుకుని నాగార్జున సాగర్ వద్ద వదిలేశారు. అన్ని జింకలను ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా దూర ప్రాంతంలో వదలటం ప్రపంచ రికార్డుగా నిలిచింది. 30 వేల ఎకరాల్లో నాశనం మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణ మండలం తంగడి నుంచి కృష్ణా నది రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి జూరాల మీదుగా కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. తంగడి నుంచి జూరాల ప్రాజెక్టు వరకు 27 కిలోమీటర్ల తీరం. కృష్ణా పరీవాహక ప్రాంతమంతా సారవంతమైన నల్లరేగడి నేలలే. నదికి ఉత్తరం వైపున తెలంగాణకు చెందిన 34 గ్రామాలు విస్తరించి ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ గ్రామాల్లో 78 వేల ఎకరాల సాగు భూమి ఉంది. రైతులు జింకలకు భయపడి పప్పు ధాన్యాల సాగు వదిలేసి నాలుగేళ్లుగా పత్తి, ఆముదం సాగు చేస్తున్నారు. అయితే జింకలు వాటిని కూడా వదిలిపెట్టడం లేదు. పత్తి మొలకలు, కాయలను ఇష్టంగా తింటున్నాయి. ఆఖరికి ఆముదం గుత్తులను కూడా నములుతుండటంతో రైతులు నోరెళ్లబెడుతున్నారు. దీంతో మాగనూర్ మండలంలోని ప్రెగడబండా, ఓబ్లాపూర్, గుడెబల్లూర్, ముడుమాల్, మురహార్‌దొడ్డి, అడవి సత్యావార్, పుంజనూర్, అచ్చంపేట గ్రామాలు కృష్ణ మండలం పుంజనూరు, కొల్పూరు, ఫర్వాన్దొడ్డి, గజరం దొడ్డి, అమ్మపల్లి గ్రామాల్లోని దాదాపు 15 వేల ఎకరాల్లో పంటలు చేతికి అందలేదు. మక్తల్ మండలం కర్ణే, గుడిగండ్ల, మంతనిగోడు, జక్లేరు, ఉట్నూరు మండలం పులి మామిడి, అవుసలోని పల్లి, పెద్ద జప్యం, సమస్తపూర్, కొల్లూరు, నాగిరెడ్డి, పెద్దపుర్ల గ్రామాల్లో మరో 15 వేల ఎకరాల్లో పంట జింకల పాలైపోతోంది. వేట కూడా ఎక్కువే.. ఫారెస్టు రిజర్వు ప్రాంతం కాకపోవడంతో అటవీ అధికారుల నిఘా చాలా స్వలంగా ఉంది. ఇదే అదనుగా వేటగాళ్లు యథేచ్ఛగా జింకలను వేటాడుతున్నారు. 34 గ్రామాలకు కలిపి ఇద్దరు ఫారెస్టు వాచర్లు మాత్రమే ఉన్నారు. 10–15 రోజులకు ఒకసారి మాత్రమే వారి సంచారం ఉంటుంది. వేట నియంత్రణకు తీసుకున్న చర్యలు శూన్యం. స్థానిక వేటగాళ్లతోపాటు, పట్టణ ప్రాంతాలకు చెందిన హంటింగ్ హాబిచ్యువల్స్ జీపు, జిప్సీ వాహనాల్లో అధనాతన ఆయుధాలతో జింకలను వేటాడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఫోకస్ లైట్‌ను సూటిగా జింక కళ్లలోకి కొడితే అవి కదలకుండా నిలబడిపోతాయి. అదే అదునుగా వెనుక నుంచి కర్రలతో జింకను బలంగా కొట్టి చంపుతున్నారు. హాబిచ్యువల్స్ జిప్సీ, కమాండర్ జీపు హెడ్ లైట్‌ను జింకల కళ్లకు పెట్టి, తుపాకులతో కాల్చి చంపుతున్నట్లు పంట పోలాల్లో పని చేసుకునే రైతులు చెప్పారు. గడిచిన మూడేళ్ల కాలంలో ఇక్కడ ఫారెస్టు అధికారులు 24 హంటింగ్ కేసులు నమోదు చేశారు. రెండు రోజులు పోలె.. మాది ఓబులాపురం. 15 ఎకరాల భూమి ఉంటే జింకలకు భయపడి దున్నటం మానేసిన. అచ్చంపేటలో 17 ఎకరాలు పాలుకు తీసుకున్నా. 10 ఎకరాలు పత్తి, 7 ఎకరాలు కంది పెట్టిన. రెండు రోజులు సుశ్తు (జ్వరం) జేసి పోలె. జింకలు కాయలు మేసి పోయినయి. 10 ఎకరాలకు 10 క్వింటాళ్ల పత్తి కూడ కష్టమే. కంది అసలే వదిలిపెట్టిన. – చెంచూరి గోవింద్, ఓబులాపురం కూలికి పోతున్న నాకు 20 ఎకరాలు ఉంది. పోయినేడు 13 ఎకరాలు పత్తి, 6 ఎకరాల కందిపెట్టిన. ఎకరానికి తడవకు రూ.3 వేలు చొప్పున ఐదు తడవలు మందు కొట్టిన. ఇంత పెట్టుబడి.. జాగ్రత్త ఉన్నా.. జింకలు ఎక్కడి నుంచి వస్తయో మేసిపోతయి. ఇక లాభం లేదని కూలి పనులకు పోతున్న. – కుమ్మరి శంకరప్ప, ప్రెగడబండ భూమి కొనుక్కోర్రి.. మూడేళ్ల నుంచి పంట వేసుడేకాని చేతికి మాత్రం అందలేదు. జింకలను కొట్టొద్దని జెప్తరు. పంటలు పాయ, పెట్టుబడి పాయ.. ఎవరూ మా దిక్కే జూత్తలేరు. జింకలను తీసుకెళ్లి నల్లమల అడవుల్లో వదిలేయాలె. లేదంటే ఇక్కడి భూమినంతా జింకల కోసం లీజుకైనా తీసుకోవాలె. – రామకృష్ణారెడ్డి, ప్రెగడబండ తరలింపు సాధ్యం కాదు జింకలను బంధించి నల్లమలకు తరలించటం ఇప్పుడు సాధ్యం కాదు. ఈ ప్రాంతాన్ని జింకల పార్కుగా అభివృద్ధి చేసే ఆలోచన ఇప్పటికైతే లేదు. జింకల లెక్కలు తేల్చాల్సి ఉంది. పంట నష్టం జరిగిన చోట ఎకరాకు రూ.6 వేల పరిహారం చెల్లించి రైతులను ఆదుకుంటాం. – పీకే ఝా, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి -
నీది ఆకలి.. నాది బతుకు..!
వాషింగ్టన్ : బతకాలన్న కోరిక బలంగా ఉండాలేకానీ.. మృత్యు పాశం నుంచి తప్పించుకోవడం ఎంతసేపు. ఇది మనుషులకైనా జంతువులకైనా వర్తిస్తుంది. జీవించలేక.. జీవితం అంటే భయంతో జనాలు ఆత్మహత్యల వైపు నడుస్తున్నారు. అదే జంతవులు మాత్రం జీవించేందుకు ఆఖరిప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని విజయం సాధిస్తున్నాయి. ఇక్కడ ఫొటోలో మీరు చూస్తున్నది టాంజానియాలోని మారా నది. ఈ నదిని అక్కడి ప్రభుత్వం మొసళ్ల రక్షిత ప్రదేశంగా ప్రకటించింది. చుట్టూ కీకారణ్యంలో ప్రవహించే ఈ నదిలో నీటిని తాగేందుకు పలు జంతువులు వస్తుంటాయి. సరిగ్గా ఈ సమయంలో నీటిలోని మొసళ్లు జంతువులను పట్టి ఆకలి తీర్చుకుంటాయి. ఈ నేపథ్యంలో ఒక మధ్యాహ్నం గడ్డి తిని దాహం తీర్చుకునేందుకు నదిలోకి దిగాయి కొన్ని జింకలు.. జీబ్రాలు. అదే సమయంలో ఆకలితో ఉన్న ఒక మొసలి.. పెద్దగా నోరు తెరిచి.. ఎదురుగా ఉన్న జింకను పట్టుకునేందుకు ప్రయత్నించింది. తవరకూ నీటిలో అటూఇటూ తిరుగుతున్న జింకకు మృత్యుదేవతలా ఎదురుగా మొసలి కనిపించే సరికి పైప్రాణాలు పోయినట్టు అనిపించింది. లేని ధైర్యాన్ని,శక్తిని కూడట్టుకుని.. ఒక్కసారిగా మొసలి నోటికి అందకుండా.. అంతెత్తుకు ఎగిరింది. జింక ఎగరడం.. దూకడంతో ఏదో ప్రమాదం వచ్చిందని ఊహించిన మిగిలిన జంతువులు ఒడ్డుకు పరుగులు తీశాయి. కేవలం రెప్పపాటు కాలంలో జింక.. మొసలి దాటుకుని.. మూడుగెంతుల్లో ఒడ్డుకు చేరుకుంది. మారియా నది ఒడ్డుకు అన్నిరకాల జంతువులు వస్తుండడంతో వాటిని ఫొటోలు తీసేందుకు ప్రముఖ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫార్.. వార్నెన్ క్రెస్వెల్ అక్కడకు వెళ్లారు. జంతువుల మధ్య పోరాటాలు.. ఇతరత్రా పరిస్థితులను ఫొటోలు తీయాలని.. ఇక్కడకు వచ్చాను.. అయితే అనుకోకుండా.. ఈ ఫొటోలు తీశాను అని ఆయన చెప్పారు. -
ఈ శునకం నిజంగా హీరో!
ఎవరైనా ప్రమాదంలో ఉంటే కాపాడేందుకు కాస్త వెనకాముందు ఆలోచిస్తాం. మనకేదైనా నష్టం కలుగుతుందేమోనని భయపడతాం. కానీ జంతువులకు ఇలాంటి ఆలోచనలు, భయాలు ఉండవు కదా..? అందులో శునకం లాంటి విశ్వాసంగల జీవికి అసలే ఉండవనే విషయం మరోసారి రుజువైంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న శునకం ఆపదలో ఉన్న మరో మూగజీవిని కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. అమెరికాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. న్యూయార్క్‌కి చెందిన మార్క్ ఫ్రీలీ అనే వ్యక్తి తన పెంపుడు శునకంతో కలసి బీచ్‌లో నడుస్తున్నాడు. ఉన్నట్టుండి ఆ పెంపుడు శునకం ఒక్కసారిగా నీటిలోకి దూకింది. ఎందుకలా దూకిందో ఫ్రీలీకి కాసేపు అర్థం కాలేదు. అయితే నీటిలో చిక్కుకుని సాయం కోసం ఎదురు చూస్తున్న ఓ జింకను కాపాడేందుకు ఆ శునకం నీటిలో దూకిందని గ్రహించాడు. వెంటనే ఆ శునకం జింక పిల్లను కాపాడే ఘటనను వీడియో తీశాడు. జింక పిల్ల మెడ భాగాన్ని ఆ శునకం నోటితో పట్టుకుని నెమ్మదిగా ఒడ్డుకు తీసుకొచ్చింది. అంతేకాదు.. జింక పిల్లకు కొన్ని సపర్యలు కూడా చేసింది. ఈలోపు ఫ్రీలీ జంతు సంరక్షణ విభాగానికి సమాచారమిచ్చి జింకను ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఆ జింక పిల్ల కోలుకుంటోంది. -
ఈ శునకం నిజంగా హీరో!
న్యూయార్క్: ఎవరైనా ప్రమాదంలో ఉంటే కాపాడేందుకు కాస్త వెనకాముందు ఆలోచిస్తాం. మనకేదైనా నష్టం కలుగుతుందేమోనని భయపడతాం. కానీ జంతువులకు ఇలాంటి ఆలోచనలు, భయాలు ఉండవు కదా..? అందులో శునకంలాంటి విశ్వాసంగల జీవికి అసలే ఉండవనే విషయం మరోసారి రుజువైంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న శునకం ఆపదలో ఉన్న మరో మూగజీవిని కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. అమెరికాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. న్యూయార్క్‌కి చెందిన మార్క్ ఫ్రీలీ అనే వ్యక్తి తన పెంపుడు శునకంతో కలిసి బీచ్‌లో నడుస్తున్నాడు. ఉన్నట్టుండి ఆ పెంపుడు శునకం ఒక్కసారిగా నీటిలోకి దూకింది. ఎందుకలా దూకిందో ఫ్రీలీకి కాసేపు అర్థం కాలేదు. అయితే నీటిలో చిక్కుకుని సాయం కోసం ఎదురు చూస్తున్న ఓ జింకను కాపాడేందుకు ఆ శునకం నీటిలో దూకిందని గ్రహించాడు. వెంటనే ఆ శునకం జింక పిల్లలను కాపాడే ఘటనను వీడియో తీశాడు. జింక పిల్ల మెడ భాగాన్ని ఆ శునకం నోటితో పట్టుకుని నెమ్మదిగా ఒడ్డుకు తీసుకొచ్చింది. అంతేకాదు.. జింక పిల్లకు కొన్ని సపర్యలు కూడా చేసింది. ఈలోపు ఫ్రీలీ జంతు సంరక్షణ విభాగానికి సమాచారమిచ్చి జింకను ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఆ జింక పిల్ల కోలుకుంటోంది. -
వాహనం ఢీకొని జింక మృతి
కోడుమూరు రూరల్ : పట్టణ సమీపంలోని కర్నూలు రోడ్డులో మంగళవారం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జింక మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది జింక మృతదేహానికి పంచనామా నిర్వహించారు. అనంతరం పొలాల్లో పూడ్చిపెట్టారు. -
జింక ప్రాణాలు తీసిన అధికారుల నిర్లక్ష్యం
జూలకల్(గూడూరు రూరల్): కుక్కలదాడిలో గాయపడిన జింక సకాలంలో వైద్యమందక ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు ఫారెస్ట్, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే కారణమని జూలకల్గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జూలకల్ గ్రామంలోని రైతు వెంకటేశ్వరరెడ్డి పొలంలో శనివారం జింకపై కుక్కలు దాడి చేశాయి. గమనించిన రైతు దివాకర్‌రెడ్డి వాటి నుంచి జింకను విడిపించాడు. అనంతరం గాయపడిన జింకను స్థానిక తలారి గిడ్డయ్యకు అప్పగించాడు. ఆయన గూడూరులోని పశువైద్యశాలకు తీసుకెళ్లగా సెలవు దినం కావడంతో అక్కడ ఎవరూ లేరు. ఆసుపత్రి కాంపౌండర్ శ్రీనివాసులును పిలిపించి గాయమైన చోట కుట్లు వేయించాడు. చికిత్సకు ముందే అంటే ఉదయం ఉదయం 7 గంటలకు జింక గాయపడిన విషయాన్ని తలారి రెవెన్యూ అధికారులతో కర్నూలు అడవిశాఖ అధికారులకు సమాచారమిచ్చాడు. సాయంత్రం 6 గంటలైనా జింకను తీసుకెళ్లేందుకు ఏ ఒక్క అధికారి రాకపోవడం, మెరుగైన వైద్యం చేయించకపోవడంతో అది కోలుకోలేక మృతి చెందింది. కుక్కల దాడి నుంచి కాపాడి తీసుకొచ్చిన జింకను అధికారుల నిర్లక్ష్యమే ప్రాణం తీసిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
జింక మాంసం విక్రయం.. ఒకరి అరెస్ట్
పాతబస్తీలోని మురిగి బజార్ లో అడవి జంతువుల మాంసం విక్రయిస్తున్నారన్న పక్క సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. స్థానిక మురిగి బజార్ లోని మటన్ షాపులతో తనిఖీలు చేపట్టి జంతువుల మాంసం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఓ షాప్ లో రెండు జింకల మాంసము, 24 కమ్మేసు పీటలు, 7 కుందేళ్లు, 2 అడవి పిట్టలని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. షాప్ యజమాని సయీద్ జామర్ ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. జంతువుల మాంసాన్ని, ఇతరత్రా సామాగ్రిని అటవీ శాఖ అధికారులకు అందజేశారు. -
జింకను వెంబడించి చంపిన కుక్కలు
-
వామ్మో దుప్పి.. శరవేగంగా బైకర్పై జంప్!
మనుషులు ప్రయాణాల్లో ఉన్నప్పుడు అడవుల్లోని జంతువులు వారికి తారసపడటం.. ఎదురుపడటం అప్పుడప్పుడు జరుగుతూ ఉండేదే. కానీ అరుదైన రీతిలో ఓ భారీ దుప్పి శరవేగంగా దూసుకొచ్చి.. వేగంగా వెళుతున్న బైకర్ మీద నుంచి దూకేసింది. వర్జినీయాలోని అలెగ్జాండ్రియాలో ఒక బృందంపై బైకులపై వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బైకర్లు వేగంగా దూసుకెళుతున్న తరుణంలో ఓ భారీ దుప్పి రోడ్డును క్రాస్ చేసేందుకు ప్రయత్నించింది. బైకులు వేగంగా వెళుతున్నా.. తనదైన శైలిలో బైకులపై నుంచి శరవేగంగా దుప్పి జంప్ కొట్టి రోడ్డు దాటింది. ఇలా జంప్ చేసే క్రమంలో ఓ బైకర్‌కు దాని కాళ్లు తగిలాయి. దీంతో బైక్‌ను సంభాళించుకోలేకపోయిన అతను కిందపడ్డాడు. వెనుక వస్తున్న మరో బైకర్ దీనిని వీడియో తీశాడు. ఒళ్లు గగుర్పొడిచేరీతిలో దుప్పి చేసిన ఈ జంప్ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వేలమంది ఈ వీడియోను షేర్ చేసుకుంటున్నారు. -
జింక మృత్యువాత
కొలిమిగుండ్ల : గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో కల్వటాల–కొలిమిగుండ్ల గ్రామాల మధ్యన పుల్లారెడ్డి పాలిష్ ప్యాక్టరీ వద్ద ప్రధాన రహదారిపై బుధవారం జింక మృత్యువాత పడింది. మండలంలో వందల సంఖ్యలో జింకలు ఉన్నాయి. వేసవిలో నీటి కోసం కొండల్లో కిలోమీటర్ల పాటు కలియతిరిగినా చుక్క నీరు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో తెల్లవారు జామున నీటి కోసం ప్రధాన రహదారి దాటుతూ రోడ్డు ప్రమాదంతో జింక మృతి చెందింది. ఏఎస్ఐ ఉస్మాన్‌ఘని సంఘటన స్థలాన్ని పరిశీలించి.. అవుకు ఫారెస్ట్ అధికారులకు విషయాన్ని తెలిపారు. -
ఆ జింక ఎక్కడిది?
చౌటుప్పల్: చౌటుప్పల్ గుండ్లబావి గ్రామంలో ఈ నెల 23న దొరికిన జింక ఎక్కడి నుంచి వచ్చిందనేది మిస్టరీగా మారింది. గొర్రెల కాపరికి దొరికిన జింక పిల్లని అదే గ్రామానికి చెందిన జెడ్పీటీసీ బుచ్చిరెడ్డి స్థానిక అటవీశాఖ కార్యాలయంలో అప్పగించారు. ఆ సమయంలో కాలికి చిన్న గాయం తప్ప పూర్తిస్థాయి లో అరోగ్యంగా ఉంది. మరుసటి రోజు జింక మృతి చెందింది. జింక దొరికిన గ్రామానికి సమీపంలో అటవీ భూములు కూడా లేవు. ఇటీవల మహదేవ్పూర్ అడవుల్లో దుప్పుల వేట ఘటనకు.. ఈ జింకకు సంబంధాలేమైనా ఉన్నాయోమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
నాలుగు దారులు
బౌద్ధ వాణి ఒక అడవిలో నాలుగు రకాల జింకలున్నాయి. ఆ అడవిని ఆనుకొని ఒక రైతు తన పొలంలో బాగా ఏపుగా పచ్చగడ్డి పెంచాడు. ఆ గడ్డిని చూసి ఆశపడ్డ కొన్ని జింకలు వచ్చి పొలంలో పడి మేస్తూ, రైతు పన్నిన వలల్లో పడి, రైతుకి చిక్కాయి. అలా చిక్కిన జింకల్ని చూసిన కొన్ని జింకలు పచ్చగడ్డి అంటేనే భయపడిపోయి, నట్టడివిలోకి పారిపోయాయి. అక్కడ వాటికి ఆహారం దొరక్క, తిరిగి మరల వచ్చి, అదే పొలంలో మేస్తూ, రైతుకు చిక్కాయి. ఈ రెండు జింకల్ని చూసిన కొన్ని జింకలు, అడవిలో పొదలమాటున దాగి, రైతు లేడని తెలుసుకుని, జాగ్రత్తగా వచ్చి మేస్తూ ఉండేవి. ఇలా మేస్తున్న జింకల స్థావరాల్ని వెదికి, కనుగొన్న రైతు, వాటి స్థావరాల దగ్గరే వలపన్ని వాటినీ పట్టుకున్నాడు. ఇక కొన్ని జింకలు మాత్రం తమ స్థావరాలని ఆ రైతు కనిపెట్టనంత దూరానికి పోయి, అతనికి చిక్కకుండా, పొలంలో పట్టుబడకుండా కాపాడుకున్నాయి. జ్ఞానంతో, ధైర్యంగా జీవించాయి– అని, బుద్ధుడు ఈ కథ చెప్పి, ‘‘భిక్షువులారా! మనుషుల్లో విషయలోలత్వం కలిగిన దురాశాపరులు మొదటి రకం జింకలవంటివారు. విషయాలపట్ల భయపడి సమాజానికి దూరంగా అడవులకు పోయి, శరీరాన్ని ఎండకట్టుకుని ఫలితం లేదని తెలుసుకుని, తిరిగి మరలా ఆశల వలలో చిక్కుకునేవారు రెండోరకం వారు. వాదవివాదాలు, తర్కవితర్కాలే జ్ఞానంగా భావించి, కేవలం ఆచరణ లేని సిద్ధాంత రాద్ధాంతాలు ఎరిగిన వారు మూడోరకం వారు. కోర్కెల్ని అదుపులో ఉంచుకుని, తనను తాను తెలుసుకుని, తనను తాను పరిశుద్ధి చేసుకునేవారు నాలుగో రకం జింకలవంటివారు’’ అని ప్రబోధించాడు. ఏది మేలైన మార్గమో తెలుసుకున్న భిక్షువులు బుద్ధునికి ప్రణామం చేశారు. – డాక్టర్ బొర్రా గోవర్ధన్ -
వాహనం ఢీకొని జింక మృతి
ఓడీ చెరువు: వడ్డివారిపల్లి సమీపంలో కదిరి- హిందూపురం రహదారిపై సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఓ మగ జింక మృతి చెందింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందచేశారు. ఎస్ఐ సత్యనారాయణ, ఏఎస్ఐ ఇస్మాయిల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన జింకను ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు రామక్రిష్ణరాజు, రేణుకకు అప్పజెప్పారు. తాగునీటి కోసం వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెంది ఉంటుందని వారు భావిస్తున్నారు. జింక వయసు ఏడాదిన్నర ఉంటుందని తెలిపారు. -
జింకలు చెప్పే నీతి
నలభై ఐదేళ్ల తన ధర్మప్రచారంలో బుద్ధుడు ఏనాడూ సమయపాలన తప్పలేదు. అయితే, కొందరు భిక్షువులు ధర్మోపదేశాలు వినడానికి రోజూ వచ్చేవారు కాదు. ఒక రోజున అలాంటి ఒక యువ భిక్షుకుడితో, బుద్ధుడు ఈ కథ చెప్పాడు... ‘‘ఓ! భిక్షూ! పూర్వం అరణ్యంలో ఒక జింక ఉండేది. అది ఎన్నో విద్యలు నేర్చింది. అడవిలో ఇతర మృగాల నుండి, వేటగాళ్ల నుండి ఆపద వచ్చినప్పుడు సమయస్ఫూర్తితో ఎలా తప్పించుకోవాలో నేర్చింది. ఆ విద్యల్ని తన జాతివారికంతా నేర్పేది. దాని దగ్గర చతురుడు, చలనుడు అనే రెండు జింకలు చేరాయి. చతురుడు క్రమం తప్పకుండా గురువు చెప్పిన సమయానికి వచ్చేవాడు. చెప్పింది శ్రద్ధగా నేర్చేవాడు. కానీ, చలనుడు సమయానికి వచ్చేవాడు కాదు. దాని వల్ల విద్యలన్నీ నేర్వలేకపోయాడు. ఒక రోజున వేటగాళ్లు పన్నిన వలల్లో ఇద్దరూ చిక్కుకున్నారు. చతురుడు గురువు నేర్పినట్లు గాలిని బంధించి చనిపోయినవాడిలా పడివున్నాడు. కానీ, చలనుడు అలా చేయలేకపోయాడు. వేటగాళ్లు వచ్చి చలనుణ్ణి పట్టి బంధించారు. చతురుణ్ణి చూసి ‘చనిపోయిన జింక’ అనుకొని వలను ఎత్తారు. చలనుడు తప్పించుకొన్నాడు. భిక్షూ! చూశావా! సమయపాలన చేసే విద్యార్థికి పరిపూర్ణ జ్ఞానం లభిస్తుంది. లేనివానికి అరకొర జ్ఞానమే దక్కుతుంది. ఇలాంటి అలసత్వం వల్ల పరిపూర్ణ జ్ఞానివి కాలేవు. నిర్వాణం పొందలేవు’’ అని చెప్పాడు. ఆనాటి నుండి ఆ యువభిక్షువు క్రమం తప్పకుండా శిక్షణ పొందాడు. - బొర్రా గోవర్ధన్ -
జింక ఓ మహిళను పగబట్టిన వేళ..
-
జింక ఓ మహిళను పగబట్టిన వేళ..
న్యూజెర్సీ: సాధారణంగా పాములు పగబడతాయంటే విన్నాము.. మనుషులు పగబడతారంటే నిజంగా చూశాం. కానీ, బెదురుబెదురుగా ఉంటూ చీమ చిటుక్కుమన్న చెవులు నిక్కపొడుచుకొని తలపైకెత్తి చూసి పారిపోయేందుకు సిద్ధంగా ఉండే జింకలు కూడా పగబడతాయంటే నమ్ముతామా.. కానీ, నమ్మాలి. న్యూజెర్సీలో ఓ కొమ్ముల జింక ఇలాగే చేసింది. తనను ఢీకొట్టిన ఓ ఎస్యూవీ వాహనం నడుపుతున్న మహిళపై తన కసి కొద్దిగా దాడికి దిగింది. తన కొమ్ములతో డోర్ ఓపెన్ చేసి మరి యుద్ధం చేసినంతపని చేసి ఆమెకు చుక్కలు చూపించింది. ఈ క్రమంలో ఆమె కాలికి గాయం కూడా అయింది. అయితే, ఏదో ఒకలా ఆ జింక గట్టిగా తన్ని బయటపడిన ఆమె వెంటనే డోర్ వేసుకుంది. కానీ, కారుతగలడంతో గాయాలపాలయిన ఆ జింకా కొద్ది సేపటి తర్వాత చనిపోయింది. ఇద్దరు వ్యక్తులు కలిసి జాలిగా షికారుకు వెళుతుండగా రాత్రి పూట కొద్ది రోజుల కిందట ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదంతా పెట్రోలింగ్ కు వెళుతున్న ఓ అధికారి కారులోని డాష్ క్యామ్ లో రికార్డవ్వగా దానిని తాజాగా విడుదల చేయడంతో వైరల్ గా మారింది. -
వేటగాళ్ల బారిన పడిన జింక
మోతుగూడెం : వేటగాళ్ల బాణాల దాడికి తీవ్రంగా గాయపడిన ఓ జింక అడవి నుంచి తప్పించుకుని వచ్చి మోతుగూడెంలోని ఓ ఇంట్లోకి చొరబడింది. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. వణుకుతూ, తీవ్ర గాయాలతో ఉన్న జింకను ఆ ఇంటి యాజమాని పి.దేముడు స్థానికుల సహకారంతో లక్కవరం అటవీ రేంజర్ ఉషారాణికి అప్పగించారు. ఆమె తక్షణ వైద్యం కోసం ఆ జింకను చింతూరు ప్రభుత్వ పశు వైద్యశాలకు తరలించారు. -
మహబూబ్‌నగర్‌లో 40 జింకలు మృతి
-
మహబూబ్‌నగర్‌లో 40 జింకలు మృతి
పెబ్బేరు(మహబూబ్‌నగర్): రైతులు పెట్టిన విషం గుళికలు తిని దాదాపు 40 జింకలు చనిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు రైతులు కృష్ణా నదిలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. పంటను పురుగుల బారి నుంచి రక్షించుకునేందుకు మొదళ్ల వద్ద శుక్రవారం రాత్రి విషం గుళికలను చల్లారు. సమీపంలోని అటవీప్రాంతం నుంచి వచ్చిన జింకలు గడ్డి మేసుకుంటూ వచ్చి గడ్డితోపాటు గుళికలను కూడా తినేశాయి. దీంతో అ విష ప్రభావానికి లోనై దాదాపు నలబై జింకలు చనిపోయాయి. శనివారం ఉదయం గమనించిన రైతులు, స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. -
బిల్ట్ ఫ్యాక్టరీ అటవీ ప్రాంతంలో దుప్పి మృతి
మంగపేట : మంగపేట మండలంలోని కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ అటవీ ప్రాంతంలో బుధవారం దుప్పి మృతి చెందింది. 1977 లో సుమారు 700 ఎకరాల వరకు దట్టమైన అటవీ భూమిన అటవీ శాఖ బిల్ట్ కార్మాగారానికి అప్పగించింది. ఇందులో దు ప్పులు, జింకలు, కొండగొర్లు, ఇతర వన్యప్రాణులు జీవిస్తున్నాయి. అయితే ఇందులో వన్యప్రాణులకు రక్షణ కరువైంది. కుక్కలు అటవీ భూముల్లోకి వెళ్లి దుప్పులను చంపుతున్నా యి. బుధవారం కుక్కల దాడిలో దుప్పి మృ తి చెందినట్లు బిల్టు యాజమాన్యం స్థానిక డిప్యూటీరేంజ్ అధికారి సమాచారం అం దించగా ఆయన ఆదేశాల మేరకు మంగపే ట బీటాఫీసర్ సాంబయ్య మృతి చెందిన దుప్పిని పరిశీలించారు.అనంతరం బిల్ట్ సె క్యురిటీ సిబ్బందిచే అక్కడే దహనం చేయిం చారు. మృతి చెందిన దుప్పి వెనుక తొ డల బాగంలో కుల్లిపోయి పురుగులు పడిఉండడాన్ని బట్టి చూస్తుంటే నాలుగు రోజుల క్రిత మే అనారోగ్యం పాలై బయటకు వచ్చి పడిపోయిన దుప్పిని కుక్కలు పీక్కుతిని ఉండవచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. -
కుక్కల దాడిలోదుప్పి మృతి
పాతపట్నం మండలం గంగువాడలో మంగళవారం కుక్కల దాడిలో ఓ దుప్పి మృతిచెందింది. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న అటవీ శాఖాధికారులు విచారణ జరుపుతున్నారు. -
వేటగాళ్ల తూటాకు జింక బలి
నిజామాబాద్ జిల్లా రెంజల్లో వేటగాళ్ల తుపాకీ తూటాకు జాతీయ జంతువు జింక బలైంది. రెంజల్ మండలం తాడిబిలోలి గ్రామ సమీపంలో బుధవారం రాత్రి గురు తెలియని వ్యక్తులు జింకను కాల్చి చంపారు. గురువారం ఉదయం జింక కళేబరాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఎస్సై ప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. జింకను వేటగాళ్లే చంపి ఉంటారని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
వ్యక్తి నుంచి దుప్పి స్వాధీనం
దుబ్బాక: లచ్చపేటలో ఓ వ్యక్తి పెంచుకుంటున్న దుప్పిని అటవీ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. లచ్చపేటకు చెందిన నిమ్మ శ్రీనివాస్‌కు 8 నెలల కిందట అటవీ ప్రాంతంలో దుప్పి పిల్ల దొరికింది. దాన్ని ఇంటికి తెచ్చి 8 నెలలుగా పాలు పోసి, పచ్చ గడ్డి వేస్తూ పెంచుతున్నాడు. విషయం తెలుసుకున్న బీట్ ఆఫీసర్ రవి కిరణ్ గురువారం లచ్చపేటకు వెళ్లి దుప్పిని స్వాధీనం చేసుకున్నారు. మెదక్ అభయారణ్యంలో దుప్పిని వదిలివేయనున్నట్లు చెప్పారు. -
వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణి మృతి
వేటగాళ్ల ఉచ్చుకు ఒక దుప్పి, నాలుగు గేదెలు మృత్యువాడపడ్డాయి. గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఎర్రగుంట గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో వేటగాళ్లు వన్యప్రాణుల కోసం విద్యుత్ తీగలలో ఉచ్చు పెట్టారు. వాటికి చిక్కుకుని దుప్పి, నాలుగు గేదెలు ప్రాణాలు కోల్పోయాయి. ఆదివారం ఉదయం ఇది గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. -
జింకపై కుక్కల దాడి
నల్గొండ : నల్గొండ జిల్లా రాజాపేట మండలం పాముకుంట మధిర గ్రామ పంచాయతీలోని మల్లగూడెం గ్రామ శివారులో ఓ జింకపై కుక్కలు దాడికి దిగాయి. విషయం గమనించిన సమీప గ్రామప్రజలు కుక్కలను తరిమి జింకను రక్షించారు. గాయపడిన జింకకు చికిత్స చేసి అనంతరం సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. సమీప అడవుల్లో నుంచి దాహం తీర్చుకునేందుకు జింక బయటకు వచ్చి ఉండవచ్చునని గ్రామస్తులు భావిస్తున్నారు. -
నీటి కోసం వచ్చి.. కుక్కల పాలైంది..
అడవిలో నీళ్లు దొరక్క గ్రామ సమీపంలోకి వచ్చిన ఓ జింకపై కుక్కలు దాడి చేయడంతో మృత్యువాత పడింది. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం రావులపల్లిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. స్థానిక అడవిలోంచి ఓ జింక ఉదయం దాహం తీర్చుకునేందుకు రావులపల్లి గ్రామ సమీపంలో నిర్మిస్తున్న సోలార్ ప్లాంటు వద్దకు వచ్చింది. ఈక్రమంలో నీళ్లు తాగుతున్న జింకపై వీధికుక్కలు దాడి చేశాయి. గాయపడిన జింకను అక్కడే ఉన్న రైతులు గమనించి చేరదీసి ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. వికారాబాద్ నుంచి అధికారులు రావడం ఆలస్యమవడంతో పరిస్థితి విషమించి జింక మృతి చెందింది. అనంతరం ఫారెస్టు రేంజ్ అధికారి అరుణ జింకను ఖననం చేశారు. -
పురుగుల మందు ప్రభావంతో జింక మృతి
పొలానికి వేసిన పురుగుల మందులు ఓ జింక ప్రాణాన్ని బలితీసుకున్నాయి. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నక్కలదిన్నె, ఆర్.నాగులవరం గ్రామాల మధ్య పొలంలో జింక మృతిచెంది ఉండగా బుధవారం స్థానిక రైతులు గుర్తించారు. అటవీ అధికారులు వచ్చి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. రైతులు పొలానికి విషపు గుళికలు చల్లడంతో ఆ గడ్డి తిని, అక్కడి నీరు తాగడం వల్ల మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. -
వేటగాళ్లు అరెస్ట్ : జింక చర్మం స్వాధీనం
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలంలో ఆరుగురు వేటగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి జింక చర్మం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా వేటగాళ్లను పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. నర్వ మండలంలో పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేటగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఆకలి కేకలు
వర్షాభావ పరిస్థితులు, రోజురోజు పెరుగుతున్న ఎండలతో మెతుకుసీమ బీడుగా మారుతుంది. అయితే కరువు ప్రజలనే కాదు వణ్యప్రాణులను సైతం ఇబ్బంది పెడుతోంది. వణ్యప్రాణులు గ్రాసం దొరకక ఆకలికేకలతో అల్లాడుతున్నాయి. మనూరు మండలం మోర్గీ శివారులోగల బీడుభూముల్లో గతంలో దాదాపు 400ల జింకలు సంచరిస్తుండేవి. కానీ నేడు ఆ భీడుభూములో రాళ్లు తప్ప గ్రాసం లేదు. దీంతో జింకలు కనుమరుగయ్యాయి.తాగేందుకునీరు, మేతలేక గ్రామాల్లోకి వణ్యప్రాణులు వస్తున్నాయి. -కె.సతీష్,సాక్షిఫొటోగ్రాఫర్,సంగారెడ్డి -
సిద్థిపేటలో కృష్ణజింకను చంపిన దుండగులు
-
జనావాసాల్లో జింక
నల్లగొండ: నూతన భవన నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలో పడి జింకకు గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ పట్టణంలోని తిరుమల థియేటర్ సమీపంలో బుధవారం వెలుగుచూసింది. సమీపంలోని లతీఫ్ షావలి గుట్టపై సంచరిస్తున్న జింకను కుక్కలు తరమడంతో.. జనావాసాల్లోకి వచ్చి ప్రమాదవశాత్తు గుంతలో పడింది. ఇది గుర్తించిన స్థానికులు టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గుంటలో పడిన జింకను రక్షించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. -
సెంట్రల్ యూనివర్సిటీలో జింక కాల్చివేత
-
నగర శివారులో జింకమాంసం కలకలం
-
నగర శివారులో జింకమాంసం కలకలం
హైదరాబాద్: నగర శివారు ప్రాంతం గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. అటవీ ప్రాంతంలో జింకను వేటాడి చంపిన దుండగులు దాని మాంసాన్ని విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఓ ప్రభుత్వ అధికారి ప్రమేయం ఉన్నట్లు భావించిన పోలీసులు ఆయనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఏడాది కాలంలో ఈ ప్రాంతంలో జింకలను వేటాడిన ఘటనలు ఆరుకు పైగా నమోదైనప్పటికీ.. అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. -
వాహనం ఢీకొని జింక మృతి
తిరుమల ఘాట్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఓ జింకను బలితీసుకుంది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రోడ్డులో శనివారం ఉదయం తీవ్ర గాయాలతో ఓ జింక మృతి చెంది ఉండగా గుర్తించారు. రక్షణ కంచెను దాటుకుని రోడ్డుపైకి రావడంతో ప్రమాదం బారిన పడి ఉంటుందని భావిస్తున్నారు. -
అటవీ అధికారులకు జింక అప్పగింత
పిట్లం(నిజామాబాద్): గుంపు నుంచి తప్పించుకుని గ్రామంలోకి వచ్చిన జింకపిల్లను గుర్తించిన స్థానికులు దాన్ని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు. నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం చిల్లరగి గ్రామ సమీపంలో అటవీ ప్రాంతం నుంచి గ్రామ చెరువులో నీళ్లు తాగడానికి అప్పుడప్పుడు జింకలు వస్తూంటాయి. అలాగే వచ్చిన జింకపిల్ల తిరిగి దారి మరిచి గ్రామంలోనికి వచ్చేసింది. దాన్ని గమనించిన కొందరు యువకులు పట్టుకుని గ్రామ పంచాయతి ఆఫీసులో ఉంచి అటవీ అధికారులకు సమాచారం అందించారు. -
జింకను వేటాడిన నిందితుల అరెస్ట్
పెనుబల్లి: ఖమ్మం జిల్లా నీలాద్రీ గుడి అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లి జింకను చంపిన ఇద్దరు నిందుతులను అటవీ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం భవనపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఇద్దరు నిందితులు మంగళవారం సాయంత్రం నీలాద్రి అటవీ ప్రాంతంలో వేట కోసం బోలెరో వాహనంలో బయలుదేరారు. ఇది గమనించిన స్థానికులు లంకపల్లి డీఆర్వో రేణుకకు సమాచారం అందించారు. దీంతో ఆమె వెంటనే మంగళవారం రాత్రి అడవిలోకి వెళ్లి నిందితుల కోసం గాలించి వారిని పట్టుకున్నారు. కాగా, వీరివద్ద నుంచి ఒక తుపాకిని స్వాధీనం చేసుకొని బోలెరో వాహానాన్ని సీజ్ చేశారు. నిందితులు జింకును చంపి వాహనంలో వేసుకొని వస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని సత్తుపల్లి పారెస్ట్ డిపోకు తరలించారు. కాగా, నిందితుల పేర్లు అధికారులు ఇంకా బయట పెట్టలేదు. -
సీన్ రివర్స్ అయింది...
ఈ ఫొటోలో ఎలాంటి ట్రిక్కూ లేదు. మీరు చూస్తున్నది నిజమే. సాధారణంగా చిరుత ఎదురైతే ఏ జంతువైనా కాళ్లకు బుద్ధి చెప్పడం ఖాయం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఓ అడవి మృగాల గుంపుపై దాడికి దిగిన ఈ చిరుతను చూసి ఇతర జంతువులన్నీ పారిపోయాయి. కానీ ఈ దుప్పి మాత్రం ఊరుకోలేదు. వెంటనే ఎదురు దాడికి దిగింది. తన కొమ్ములతో చిరుతను కుమ్మేయడానికి దూసుకెళ్లింది. దీంతో కంగుతిన్న చిరుత..వెంటనే పలాయనం చిత్తగించింది. ఈ అరుదైన దృశ్యం కెన్యాలోని మసాయ్ మారా నేషనల్ రిజర్వ్ పార్కులో కనిపించింది. ఈ దృశ్యాలను మనోజ్ షా అనే వన్యప్రాణి ఫోటో గ్రాఫర్ తన కెమెరాలో బంధించారు. -
తెలంగాణ రాష్ర్ట చిహ్నాలను ప్రకటించిన ప్రభుత్వం
తంగేడు పువ్వు తుంగేడు పువ్వు శాస్త్రీయ నామం కాసియా ఆరికులటా. ఇది ఆయుర్వేద మందుల్లో ఎక్కువ ఉపయోగపడుతుంది. ఉబ్బసం, మధుమేహం తదితర వ్యాధుల నివారణకు దీనిని వినియోగిస్తారు. తంగేడుపై కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఒకరు పరిశోధన చేసి ఇది ఎయిడ్స్‌కు కూడా పనిచేస్తుందని ఇటీవల కనుగొన్నారు. తెలంగాణ పండుగ బతుకమ్మలో ఈ పువ్వుకు అత్యంత ప్రాధాన్యం ఉంది. అడవులు, గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లో తంగేడు చెట్లు విరివిగా కనిపిస్తుంటాయి. పంట పొలాల్లో విచ్చలవిడిగా రసాయనాలు వాడుతున్న కారణంగా చెరువు గట్లపై విరివిగా కనిపించే తంగేడు క్రమేణా అంతరించుకుపోతోంది. దీనిని సంరక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్ర పుష్పంగా ప్రకటించింది. జింక వన్యప్రాణి జింక చైతన్యానికి చిహ్నం. జింకలో 90 జాతులు ఉన్నాయి.రాను రాను వీటి జాతి అంతరించి పోతోంది. జంకలను సంరక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్ర జంతువుగా ప్రకటించింది. జిల్లాలోని అడవుల్లోనూ జింకలు ఉన్నాయి. వన్యప్రాణి సంరక్షణా కేంద్రాల్లో జింకలు మనకు చూడముచ్చటగా కనిపిస్తుంటాయి. పాలపిట్ట ఇండియన్ రోలర్‌గా పిలువబడే పాలపిట్ట ఉష్ణమండల ప్రాంతమైన దక్షిణాసియాలో సాధారణంగా కనిపించే పక్షి జాతుల్లో ఒకటి. అందంగా అద్భుతంగా కనిపించే పాలపిట్టను మన ప్రభుత్వం రాష్ట్ర పక్షిగా గుర్తిం చింది. తెలంగాణతోపాటు బీహార్, కర్ణాటక, ఆంధ్రాప్రదేశ్ రాష్ట్రాలు కూడా దీనినే రాష్ట్ర పక్షిగా గుర్తిస్తున్నాయి. ఈ పక్షిలో ఉన్న గొప్ప గుణమేమిటంటే.. మనుషుల పక్క నుంచి పోవడానికి ఏ మాత్రం భయపడదు. తన స్వేచ్ఛకు, స్వతంత్రానికి భంగం కలిగినప్పుడే ఇది ఎదురు దాడికి దిగుతుంది. దీని శాస్త్రీయ నామం బ్లూ జై. సంపదకు ప్రతీకగా కూడా దీన్ని గుర్తిస్తారు. కొంత మంది తమ ఇళ్లలో గూళ్లు కట్టి వీటిని పెంచుతుంటారు. జమ్మిచెట్టు జమ్మిచెట్టు గురించి పురాణల్లో చాలా కథలున్నాయి. అరణ్య వాసానికి వెళ్తున్న రాముడికి ఈ చెట్టు విశ్రాంతినిచ్చిందని అంటారు. రావణుడితో యుద్ధానికి బయల్దేరే సమయంలో ఆదిపరాశక్తిని శమ్మీ ఆకులతో పూజ చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు ఆయుధాలను ఈ చెట్టుపై ఉంచినట్లు అంటారు. శమీ వృక్ష రూపంలో ఉన్న అపరాజితా దేవి తనను వేడుకున్న వారికి విజయం చేకూరుస్తుందని నమ్ముతుంటారు. అందుకు నిదర్శనమే దసరా రోజున శమీ పూజ చేసి వాటి ఆకులను తీసుకొచ్చి పెద్దలకు ఇచ్చి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ. ఈ చెట్టు మనకు అరుదుగా కనిపిస్తుంటుంది. దసరా సందర్భంగా ఈ చెట్టు గుర్తుకొస్తుంది. -
పాలపిట్ట.. తంగేడు పువ్వు
తెలంగాణ రాష్ట్ర అధికార పక్షి, పుష్పం ఖరారు రాష్ట్ర జంతువు జింక.. వృక్షం జమ్మిచెట్టు ఈ చిహ్నాలకు తెలంగాణ సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యం: సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర జంతువుగా జింక , రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టు, రాష్ట్ర పుష్పంగా తంగేడును ఖరారు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సోమవారం సచివాలయంలో సీఎం అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో అధికార చిహ్నాలపై పలు ప్రతిపాదనలు వచ్చినా.. వాటిని కాదని తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలు, అలవాట్లకు అద్దంపడుతూ, చరిత్ర, పౌరాణిక నేపథ్యం ఉన్న వాటిని ఎంపిక చేశారు. ఇప్పటివరకు ఉన్న అధికారిక చిహ్నాలు ఆంధ్ర కోణం నుంచి ఎంపిక చేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ‘‘జింకకు భారతదేశంలో ప్రముఖ స్థానం ఉంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ జింకలు ఉన్నాయి. చిన్నచిన్న అడవుల్లోనూ అవి మనుగడ సాగిస్తాయి. అడవి జంతువుల్లో అత్యంత సున్నితమైన, అమాయకమైనదిగా జింకకు పేరుంది. తెలంగాణ ప్రజల మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందని జింకను ఎంపిక చేశాం’’ అని సీఎం వివరించారు. పాలపిట్టకు తెలంగాణ సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యం ఉందని, ప్రతి ఏటా దసరా పండుగ రోజు ఈ పక్షిని దర్శించుకోవడం ఓ పుణ్య కార్యక్రమంగా ప్రజలు భావిస్తారని పేర్కొన్నారు. పాలపిట్టను దర్శించుకోవడం శుభసూచకంగా ప్రజలు భావిస్తారని, లంకపై దండయాత్ర చేసే ముందు శ్రీరాముడు ఈ పక్షిని దర్శించుకున్నారని, అందుకే ఆయన ను విజయం వరించిందని పౌరాణిక గాథలు చెబుతున్నాయని వివరించారు. రాష్ట్రం కూడా విజయపథంలో నడవాలని రాష్ట్ర పక్షిగా పాలపిట్టను ఎంపిక చేసినట్లు సీఎం పేర్కొన్నారు. జమ్మిచెట్టు తెలంగాణ ప్రజల జీవితంలో అంతర్భాగమని చెప్పారు. పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టుపై ఉంచారని, తర్వాత వాటితోనే కౌరవులను ఓడించారన్నారు. విజయానికి సూచిక అయిన జమ్మిచెట్టు ఆశీర్వాదం ఇప్పుడు తెలంగాణకు కావాలని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దంగా నిలిచే బతుకమ్మ పండుగలో వాడే తంగేడు పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. అడవిలో సహజ సిద్ధంగా పెరిగే తంగేడు పూవు ప్రకృతికే అందాన్ని తెస్తుందని, ఈ పూలను సౌభాగ్యాన్ని కాపాడే విశిష్ట పుష్పంగా కూడా తెలంగాణ అడపడుచులు భావిస్తారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రానికి తంగేడు పూవును అధికారిక పుష్పంగా నిర్ణయించుకున్నట్లు వివరించారు. -
పచ్చగడ్డే కాదు.. పచ్చిమాంసమూ తింటాయి!
జంతు ప్రపంచం * పుట్టినప్పుడు దాదాపు అన్ని జింకలకీ ఒంటిమీద తెల్లని మచ్చలుంటాయి. కాలం గడిచేకొద్దీ కొన్నింటికి చెరిగిపోతాయి. కొన్నిటి శరీరంపై మిగిలిపోతాయి! * పుట్టిన అరగంటకే ఇవి నడుస్తాయి. నెల తిరిగేసరికే పరుగెత్తుతాయి. * ఇవి నాలుగు పళ్లతో పుడతాయి. మిగతా పళ్లు తరువాత మొలుస్తాయి! * జింకలన్నీ శాకాహారులని చాలామంది అనుకుంటారు. కానీ కొన్ని రకాల జింకలు మాంసాన్ని కూడా తింటాయి! * వీటి చెవులు ఎంత బాగా పని చేస్తాయంటే... కొన్ని కిలోమీటర్ల దూరంలో వినిపించే శబ్దాలను కూడా స్పష్టంగా వినగలవు. అంతేకాదు... శబ్దం వచ్చే దిశకు తమ చెవుల్ని తిప్పి మరీ వింటాయి! * చిన్నగా కనిపిస్తుంటాయి కానీ ఇవి చాలా ఆహారాన్ని తింటాయి. దాదాపు గంట, రెండు గంటల పాటు తింటే కానీ వీటికి కడుపు నిండదు! * చలికాలం వస్తే ఇవి బద్దకంగా అయిపోతాయి. ఆహారం కూడా చాలా తక్కువగా తీసుకుంటాయి. మళ్లీ వేసవి రాగానే ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంది! * ఏదైనా ప్రమాదం సంభవించబోతోందని అనుమానం వస్తే ఇవి తమ తోకల్ని పెకైత్తుతాయి. దాన్ని చూసిన ఇతర జింకలు పరుగందుకుంటాయి! * ఇవి కాస్త పిరికివనే చెప్పాలి. చిన్న చిన్న వాటికే బెదిరిపోతుంటాయి. శత్రువు దాడి చేసినప్పుడు మొదట ధైర్యంగా పరుగు తీసినా... ఉండేకొద్దీ బలహీనమైపోతాయి. దాంతో వాటికి చేతికి చిక్కి ఆహారంగా మారిపోతాయి! * ఇవి ఎప్పుడూ నేరుగా పరుగెత్తవు. వంకర టింకరగా, ముందువెనుకలు చూసుకోకుండా పరుగులు తీస్తాయి. దాంతో ఆ వేగాన్ని నియంత్రించుకోలేక ఒక్కోసారి అడ్డొచ్చినవాటిని గుద్దేస్తుంటాయి. అందుకే కొన్నిసార్లు చనిపోతుంటాయి కూడా! -
మరో ప్రపంచంలోకి ప్రయాణిద్దాం...
పాఠశాలలకు సెలవు రోజులు. తిరిగి బడులు తెరిచే సమయానికి ఎన్నో అద్భుతమైన ప్రాంతాలను సంద ర్శించాలనుకునేవారికి వన్యప్రాణి కేంద్రాలు సరైన ఎంపిక. మన దేశంలో అభయారణ్యాలుగా పేరుపొందిన ప్రాంతాలు మన దేశంలో ప్రతి రాష్ర్టంలోనూ ఉన్నాయి. వాటిలో కొన్ని అభయారణ్యాల గురించి తెలుసుకుందాం. దగ్గరలో ఉన్న వన్యప్రాణి కేంద్రాలనైనా దర్శించాలనే ఆలోచనలకు ఈ వేసవి సెలవుల్లో ఓ రూపమిద్దాం... అప్పటిదాకా పుస్తకాల్లో పులి, సింహం, ఏనుగు, జింక, నక్క.... ఇలా ఎన్నో బొమ్మలను చూసిన పిల్లలు కళ్లెదురుగా ఆ జంతువులు కదలాడుతుంటే ఆనందంతో కేరింతలు కొడతారు. జంతువుల జీవనశైలిని తెలుసుకోవడానికి ఉత్సాహం చూపుతారు. ఈ వేసవిని మరింత వేడుకగా జరుపుకున్నామని సంబరపడతారు. గిర్ సింహాలకు ఇల్లు... ఆఫ్రికా మినహా సింహాలు నివాసం ఉండే చోటు ప్రపంచమంతా వెతికినా కనపడదు అనుకునేవారికి సరైన సమాధానం చూపుతుంది ‘గిర్ జాతీయ అభయారణ్యం.’ మన దేశంలో గుజరాత్ రాష్ట్రంలో ఉంది ఈ సింహాల వనం. గిర్ నేషనల్ పార్క్ ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి ఆసియాజాతి సింహాలకు ఇల్లు లాంటిది. సింహాలకు అత్యంత సురక్షితమైన ఈ వనం 1412 చ.కి.మీలలో ఉండగా, మరో 1153 చ.కి.మీ శాంక్చ్యురీకి కేటాయించారు. 1913లో 20 సింహాలున్న ఈ ప్రాంతంలో 2010 నాటికి వీటి సంఖ్య 411కు చేరింది. జింకల ఉత్పత్తిలో అతిపెద్ద స్థావరంగా పిలిచే ఈ ప్రాంతంలో 32 వేల జింకలు ఉన్నాయి. చిరుతలు 300కు పైగా, 40కి పైగా సరీసృపాలు, 250కి పైగా పక్షి జాతులు, 2 వేలకు పైగా ఇతర జంతుజాలాలు గిర్‌లో సందడిచేస్తుంటాయి. పర్యాటకులు.. నక్షత్ర తాబేళ్లను, కొండచిలువలు, నక్కలు, ఎలుగుబంట్లు, అడవి దున్నలను, గద్దలు, .. మొదలైనవాటినెన్నింటినో తమ కెమెరాలలో బంధించుకోవచ్చు. ఇలా వెళ్లాలి రోడ్డుమార్గాన: జునాగఢ్ పట్టణం నుంచి 55 కి.మీ, అహ్మదాబాద్ నుంచి 348 కి.మీ, రాజ్‌కోట్ నుంచి 156 కి.మీ. రైల్వేస్టేషన్: అహ్మదాబాద్/ రాజ్‌కోట్/ జునాగఢ్ విమానాశ్రయం: రాజ్‌కోట్ / అహ్మదాబాద్ ఇవి చూడవచ్చు గిర్ నేషనల్ పార్క్ చూసిన తర్వాత జునాగఢ్ ప్రాంత చరిత్రను తెలుసుకోవచ్చు. ఇక్కడి రాజకోటను, నాటి దేవాలయాలను, మ్యూజియాన్ని సందర్శించవచ్చు. పెరియార్ నేషనల్ పార్క్ పడమటి కనుమల్లో కేరళ- తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో సుమారు 350 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో విస్తరించి ఉంది పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం. కేరళలోని దర్శనీయ ప్రదేశాలలో అత్యంత ముఖ్యమైన ఈ ప్రాంతం ఇడుక్కి జిల్లాలో ఉంది. దశాబ్దాల తరబడి పర్యాటకులను అలరిస్తోన్న ఈ జాతీయవనాన్ని 1978లో కేరళ ప్రభుత్వం పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది. పెరియార్ నదిపై 1895లో జలాశయం నిర్మించడంతో ఏర్పడిన సరస్సుల నీటి అందాలతోనూ, పరుచుకున్న పచ్చదనంతోనూ ఈ ప్రాంత పర్యటన మాటల్లో చెప్పలేని అనుభూతిని కలిగిస్తోంది. పెరియార్ శాంక్చ్యురీలో గల సరస్సులో పడవ మీద ప్రయాణిస్తూ, ఇరువైపులా ఉండే అడవిలో సంచరించే జంతువులను, వాటి ప్రవర్తనను అతి దగ్గరగా, సురక్షితంగా చూసే అవకాశం పర్యాటకులకు కలుగుతుంది. అటవీ శాఖ అధికారుల లెక్కల ప్రకారం పెరియార్ శాంక్చురీలో సుమారు 600 ఏనుగులు, 450 జింకలు, 550 ఎలుగుబంట్లు, 180 నీలగిరి కోతులు, 45 పులులు, 15 చిరుతపులులు, పెద్ద సంఖ్యలో నక్కలు, ఎగిరే ఉడతలు, రంగు రంగుల పక్షులు.. పర్యాటకులను అలరిస్తున్నాయి. కొచ్చి పట్టణానికి 185 కి.మీ, కొట్టాయం రైల్వే స్టేషన్‌కు 114 కి.మీ దూరంలో ‘తేక్కడి’ అనే ప్రాంతం వన్యప్రాణుల నిలయంగా వాసికెక్కింది. పెరియార్ నదిలో బోటు షికారు చేసేవారు అడవిలో సంచరించే పులులు, ఏనుగులు, జింకలను చూడవచ్చు. సరస్సులో నీటిపై వాలి ఉండే చెట్టు కొమ్మలు.. వాటిపై వాలే వివిధ రకాల పక్షలు మనకు ఆనందానుభూతులను కలిగిస్తాయి. ఇక్కడి కోతుల అల్లరి చేష్టలు పర్యాటకులకు వినోదాన్ని కలిగిస్తుంటాయి. ఇక్కడ బస చేయాలనుకునే పర్యాటకుల కోసం సౌకర్యవంతమైన కాటేజీలు, రిసార్టులు ఉన్నాయి. తేక్కడిలోని రిసార్టుల్లో కేరళ ఆయుర్వేద కేంద్రాలకు సందర్శకుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఆయుర్వేద తైలాలతో శరీరానికి మర్దన చేయించుకునేందుకు నిత్యం వందల మంది వస్తుంటారు. ఇక్కడి రిసార్టుల్లో కేరళ వంటకాలు నోరూరిస్తుంటాయి. ఆహ్లాదం, ఆనందం పొందాలనుకునేవారు పెరియార్ నేషనల్ పార్క్ ఒక్కసారైనా సందర్శించాలి. పెరియార్ పార్క్‌కి.. ఇలా వెళ్లాలి విమానాశ్రయం: తమిళనాడులోని మదురై. కేరళలోని కొచ్చి. రైల్వేస్టేషన్: కొట్టాయం. కొట్టాయం నుంచి తేక్కడికి ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సదుపాయాలు ఉన్నాయి. సందర్శన సమయం: ఉదయం 6 గం.ల నుంచి రాత్రి 7 గం.ల వరకు. ఇవి చూడచ్చు... చేస్తూ పచ్చదనాన్ని తిలకించవచ్చు. బోట్లో షికారు ట్రీ హౌజ్‌లు రణథంభౌర్ పులుల స్థావరం... ఉత్తరభారత దేశంలో అతిపెద్దది రణథంభౌర్ జాతీయ పార్క్. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ జిల్లాలో ఉంది ఈ ప్రాంతం. జైపూర్ నుంచి 130 కి.మీ దూరంలో ఉన్న ఈ వన్యప్రాణి అభయారణ్యం పర్యాటకులకు అతిపెద్ద ఆకర్షణీయ ప్రాంతం. ఎంతో మంది వన్యప్రాణి ఫొటోగ్రాఫర్లకు, ప్రేమికులకు ఈ వనం మరపురాని అనుభూతినిచ్చే ప్రాంతం. రణథంభౌర్ జాతీయ వనం సుమారు 392 కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీంట్లో మాన్సింగ్ శాంక్చ్యురీ, కైలాదేవి శాంక్చురీ ప్రసిద్ధమైనవి. ఇక్కడ పులులను చాలా దగ్గరగా, సురక్షితంగా చూసే అవకాశం ఉంది. పచ్చటి ప్రకృతిని, వన్యప్రాణులను కనులారా వీక్షిస్తూ, పక్షుల కిలకిలారావాలను వింటూ ఆనంద విహారం చేయవచ్చు. పులులు, చిరుతలు, హైనాలు, జింకలు, అడవి పిల్లులు, నక్కలు, ఎలుగుబంట్లు, మొసళ్లు.. ఇలా ఎన్నో జంతువులును ఇక్కడ చూడవచ్చు. కృష్ణ జింకలు, హనుమాన్ లాంగూర్లు నీటిని తాగడానికి తరచూ సరస్సు వద్దకు వచ్చి, విశ్రాంతి తీసుకుంటుంటాయి. విరబూసిన పువ్వుల అందాలను తిలకించవచ్చు. సఫారీ టైమ్: ఉదయం 6 గం.ల నుంచి రాత్రి 9.30ని.ల వరకు. ఇలా వెళ్లచ్చు... దగ్గరలోని రైల్వేస్టేషన్: సవాయి మాధోపూర్ దగ్గరలోని విమానాశ్రయం: జైపూర్ ఇతర చూడదగినవి: రణథంభౌర్ కోట, జోగీ మహల్‌తో పాటు ఇక్కడ ఉన్న మూడు సరస్సులు.. ప్రధానంగా చూడదగినవి. కజిరంగా....ఖడ్గమృగాలను చూడాల్సిందే! అతి పెద్ద శక్తిమంతమైన జంతువులలో ఏనుగులు, ఖడ్గమృగాలకు కజిరంగా జాతీయ అభయారణ్యం పేరెన్నిక గన్నది. ఇప్పటి వరకు అనేకలక్షల మంది పర్యాటకులు సందర్శించిన రికార్డు ఈ అభయారణ్యానికి ఉంది. బ్రహ్మపుత్రా న ది ఒడ్డున, అస్సామ్ రాష్ట్రంలో నగావూ జిల్లాలో 430 చ.కి.మీ లలో విస్తరించి ఉంది ఈ జాతీయ వనం. బలిష్ఠమైన ఏనుగులు, ఖడ్గమృగాలు పచ్చని పచ్చిక మైదానాలలో తిరుగుతుంటాయి. ఏనుగులు, అడవిదున్నలు, లేళ్లు ఈ వనంలో ఎక్కువ. పక్షుల ఆవాసకేంద్రంగా కూడా కజిరంగా అంతర్జాతీయంగా పేరుగాంచింది. బ్రహ్మపుత్ర నదీ ప్రవాహంలో ఏర్పడిన చిన్న కొలనులు ఈ ప్రాంతంలో ఎన్నో ఉన్నాయి. 1904లో అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ సతీమణి మేరీ కర్జన్ ఈ ప్రాంతాన్ని సందర్శించారట. ఆ తర్వాత ఏడాది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచే క్రమంలో కజిరంగా అనే పేరును అధికారులు సూచించారట. వృక్షజాతులు: ఈ అభయారణ్యంలో మూడు రకాల అతిపెద్ద గడ్డి మైదానాలు ఉన్నాయి. వీటిలో బలిష్ఠమైన ఏనుగులు ఉన్నాయి. బ్రహ్మపుత్రా నదికి ఏర్పడిన వరదల వల్ల ఏర్పడిన సారవంతమైన భూములు ఇవి. ఈ వనం కమలాలకు ప్రసిద్ధి. నీటిలో పాకే మొక్కలు, అతి పొడవైన వృక్షాలతో ఈ ప్రాంతం కళకళలాడుతుంది. కర్బి గ్రామాలలో: అస్సాం పేరు వినగానే మనకు తేయాకు కళ్లముందు కనిపిస్తుంది. ఇక్కడ తేయాకు, కాఫీ, రబ్బర్ మొక్కల పెంపకం విస్తారంగా జరుగుతుంది. తోటల పెంపకం విశేషాలు దారంతా తెలుసుకుంటూ ముందుకు కదలవచ్చు. ఇలా వెళ్లాలి... విమానాశ్రయం: గౌహతి రైల్వేస్టేషన్: ఫర్కేటింగ్ బస్సు సదుపాయాలు ఉన్నాయి. సఫారీలో ఇలా... వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను సందర్శించేవారు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాలి. వన్యప్రాణి సంరక్షణ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలతో ముందుగా మాట్లాడి, వన్యప్రాణుల పట్ల ఎలా మెలగాలో... వారి సూచనలు తీసుకోవచ్చు. పార్క్ నిబంధనలను తప్పక పాటించాలి. నిషేధం ఉన్న ప్రాంతాలలోకి వెళ్లకూడదు. వాహనాలలో ప్రయాణించేటప్పుడు వేగం పోరాదు. శబ్దాలు, జంతువులను కవ్వించే పనులు చేయకూడదు. ఎవరైనా వన్యప్రాణులకు హానితలపెట్టే చర్యలు జరిపినప్పుడు వెంటనే పార్క్ అధికారులకు తెలియజేయాలి. వన్యప్రాణులకు - మీకు మధ్య కొంత దూరం ఉండేలా చూసుకోవాలి. పార్క్ లేదా అభయారణ్యం నుంచి ఎలాంటి వస్తువులనూ, బయటకు తీసుకురాకూడదు. ఆహారపదార్థాలు జంతువులకు వేయడం, తెచ్చిన పదార్థాల చెత్త అక్కడ వదిలి వేయడం తగదు. ఏదైనా అభయారణ్యానికి వెళ్లే ముందు వెంట కెమెరా, సన్‌స్క్రీన్ లోషన్, టోపీ... తీసుకెళితే మీ ప్రయాణం ఆహ్లాదంగా, సౌకర్యంగా సాగుతుంది. మీ యాత్రానుభవాలను పంపవలసిన చిరునామా: విహారి, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారా హిల్స్, హైదరాబాద్ -34. e-mail:sakshivihari@gmail.com -
గమ్యంపై గురి తప్పనీయకండి!
ప్రేరణ ఒక పనిని పూర్తి చేయడానికి మన ముందు రెండు దారులుంటే సులువైన దాన్నే మొదటగా ఎంచుకుంటాం. అవసరమైన దానికంటే అనువైన దాన్ని ఎంపిక చేసుకోవడానికే మనం మొగ్గు చూపుతాం. నదీ ప్రవాహంలో చిక్కుకున్నప్పుడు ఏ మాత్రం ప్రయత్నించకుండా, ఈదకుండా ఉంటే ప్రవాహ దిశలో కొట్టుకుపోతామే తప్ప తీరాన్ని చేరుకోలేం. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు ఎదురవుతాయి. గమ్యానికి దూరంగా తీసుకెళ్లడానికి ప్రేరేపిస్తాయి. అవి మనకు ఎంతో సౌకర్యవంతంగా కనిపిస్తాయి. వాటి బారిన పడితే లక్ష్యసాధన కష్టమవుతుంది. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కార్య దీక్షతో కష్టపడి పనిచేస్తేనే లక్ష్యం చేరుకుంటాం. వేటకు వెళ్లిన ఇద్దరు స్నేహితుల సంఘటనను ఇప్పుడు గుర్తుచేసుకుందాం... ఇద్దరు స్పానిష్ స్నేహితులు జింకలను వేటాడడానికి ఓ చిన్న వాహనంలో అడవికి బయలుదేరారు. అరణ్యంలోకి ప్రవేశించిన తర్వాత ఓ పక్కన తమ వాహనాన్ని నిలిపారు. మైదానాలు, లోయలు దాటుకుని ముందుకు నడిచారు. కొంత దూరం వెళ్లి, ఓ పొద చాటున నిల్చుని జింకల రాక కోసం ఎదురుచూస్తున్నారు. అటుగా వచ్చిన ఓ జింక వీరి కంటపడింది. వెంటనే తుపాకీతో దాన్ని కాల్చారు. నేలకొరిగిన జింకను తమ వాహనం వద్దకు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇద్దరు స్నేహితులు దాని తోకను పట్టుకుని వాహనం వైపునకు లాగుతూ తీసుకెళ్తున్నారు. జింక బరువుగా ఉండడం వల్ల వేగంగా కదలలేకపోతున్నారు. వారి కష్టాన్ని చూసిన ఓ రైతు కొమ్ములు పట్టుకుని లాగితే సులువుగా ఉంటుందని సలహా ఇచ్చాడు. ఇద్దరు స్నేహితులు ఒకరి ముఖం మరొకరు చూసుకుని రైతు సలహా పాటించాలని నిర్ణయించుకున్నారు. జింక మరోవైపునకు వెళ్లి కొమ్ములు పట్టుకుని లాగడం ప్రారంభించారు. ఇప్పుడు ముందుకంటే వేగంగా, సులభంగా జింక దేహాన్ని తీసుకెళ్లగలుగుతున్నారు. వారికి అంతకుముందు ఉన్న కష్టం కూడా లేదు. పది నిమిషాల తర్వాత ఇద్దరిలో ఒకతను మరొకరితో ‘రైతు సరైన విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు చాలా సులభంగా ఉంది’ అన్నాడు. అప్పుడు రెండో అతను స్పందిస్తూ ‘అవును, నువ్వన్నది నిజమే... కానీ మనం వాహనానికి దూరంగా వెళ్తున్నాం. అదొక్కటే సమస్య!’ అన్నాడు. పై కథ గురించి ఒక్కసారి ఆలోచించండి. కొమ్ములు పట్టుకుని లాగితే సులువని ఆ స్నేహితులు సంతోషించారు కానీ... తాము గమ్యానికి (వాహనానికి) దూరంగా వెళ్తున్నారని తెలుసుకోలేకపోయారు. మనం కూడా ప్రతి పనిలోనూ కొమ్ముల్లాంటి సులువైన మార్గాలనే అన్వేషిస్తాం. ఎంచుకున్న మార్గం సులువైనంత మాత్రాన సరిపోదు. అది సరైన దిశలో ఉందా? అనే విషయాన్ని గుర్తించాలి. మరో ముఖ్యమైన విషయం... ఒక పనిని పూర్తిచేస్తున్నప్పుడు సౌలభ్యంగా ఉన్న మార్గాలు ఎంచుకునే సందర్భంలో మన నిజమైన గమ్యం, లక్ష్యాలపై దృష్టిని మరలనీయొద్దు. విద్యార్థులు.. తమ ఇంటికి దగ్గర్లో ఇన్స్టిట్యూట్ ఉందనో లేదా కాలేజీ టైమింగ్స ఆశించిన విధంగా ఉన్నాయనే కారణంగా కళాశాలను, తమ కోర్సును ఎంచుకుంటున్నారు. తమ అభిరుచి, ఆకాంక్షలకు అనుగుణంగా ఉందా? అని చూడకుండానే నిర్ణయం తీసుకుంటున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థుల నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం తెరకెక్కిన బాలీవుడ్ సినిమా త్రీ ఇడియట్స్.. విద్యార్థుల ప్రవర్తనలను చక్కగా వివరించింది. ఇంజనీరింగ్ చదవాలనే ఆశయంతో కాకుండా గొప్ప విద్యాసంస్థలో సీటు లభించిందని కోర్సులో చేరే వారి భవిష్యత్తుకూ ఈ సినిమా అద్ధం పట్టింది. మీ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల గురించి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. జింక కొమ్ములు పట్టి లాగినట్లు లక్ష్యానికి దూరంగా వెళ్లే సందర్భాలనూ గమనించొచ్చు. నగరంలో వాహనాన్ని నడుపుతున్నట్లుగా మన జీవితంలోనూ సరైన దారులు వెంటనే దొరక్కపోవచ్చు. కానీ వెళ్లే దారి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. వెళ్లేదారిలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎగుడు దిగుడు రోడ్డుపై స్వారీ చేయాల్సి ఉంటుంది. అడ్డంకులూ, కష్టాలను అధిగమించాల్సి ఉంటుంది. అయితే గమ్యాన్ని చేరుకోవాలంటే అదొక్కటే మార్గం! మధ్యలో ఆకర్షణీయమైన కొత్త దారులు కన్పించవచ్చు, మీ మనసును మళ్లించేలా పురికొల్పొచ్చు. వాటికి లొంగకుండా నిర్దేశించుకున్న దారిలో పయనించాలి. లక్ష్యాలపై నుంచి దృష్టిని మరల్చొద్దు. ఎల్లప్పుడూ గమ్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకోవాలి. సులువైన దారిలో పయనించేందుకు సిద్ధపడేముందు ఏ దిశలో వెళ్తున్నారో గుర్తించడం ప్రధానం. -‘కెరీర్స్ 360’ సౌజన్యంతో -
కనువిందు.. కనుమరుగు?
సా క్షి, తిరుపతి: తిరుమల కాలిబాటలో ఉన్న జింకల పార్కును తరలించనున్నారు. జింకల పార్కును అక్కడ కొనసాగించడానికి కేంద్ర జూ అథారిటీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో, మరో ప్రాంతానికి తరలించనున్నట్టు తెలిసింది. అటవీ భూముల్లో దాదాపు 25 సంవత్సరాల క్రితం జింకల పార్కును టీటీడీ ఏర్పాటు చేసింది. తిరుమలకు నడిచి వెళ్లే భక్తులు కొద్ది సేపు జింకలను చూస్తూ ఇక్కడ సేదతీరుతుంటారు. వాటికి పండ్లు, ఫలహారాలు, బిస్కెట్లు అందజేస్తూ ఉంటారు. కిలోమీటరుకు 20 జింకలు మాత్రమే ఉండాలని జూ అథారిటీ నిబంధన ఉంది. టీటీ డీ ఏర్పాటు చేసిన జింకల పార్కు దాదాపు మూడు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే ఉంది. నిబంధనల ప్రకారం ఇందులో 50 నుంచి 60 జింకలు మాత్రమే ఉండాలి. అయితే 350 వరకు జింకలు ఉన్నట్లు సమాచారం. ఇది నిబంధనలకు విరుద్దంగా ఉండడంతో, దీనిని అక్కడ నుంచి తొలగించాలని టీటీడీకి నోటీసులు అందాయి. జింకలను తరలించే అవకాశం? ప్రస్తుతం జింకల పార్కు ఉన్న ప్రాంతమూ అటవీ శాఖకు చెందినదే కావడంతో, టీటీడీ కూడా అక్కడి నుంచి పార్కును తరలించడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఎక్కడకు తరలించాలనేది ప్రశ్నార్థకం. ఈ వ్యవహారం 2010 నుంచి నడుస్తోంది. అప్పటి టీటీడీ ట్రస్టు బోర్డు చైర్మన్ డీకే.ఆదికేశవులు నాయుడు జింకల పార్కును వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపుల పాయకు తరలించాలని ప్రతిపాదించారు. లేదా కొన్ని జూలకు పంపించాలనే ఆలోచన కూడా చేశారు. అయితే జింకలను తరలించే సమయంలో కొన్ని మరణించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. సరైన ఆహారం లేక.. 2010లో 270 జింకలు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 350కి దాటింది. వీటి నిర్వహణకు సంవత్సరానికి 25 నుంచి 30 లక్షల రూపాయల వరకు టీటీడీ ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. అయినా ఈ జింకలకు సరైన ఆహారం లేకపోవడంతో, యాత్రికులు ఇచ్చే తిండి కోసం ఆవురావురమంటూ ఉంటాయి. తినే తొందరలో ప్లాస్టిక్ కాగితాలను కూడా మింగేస్తున్నాయి. దీంతో కొన్ని అనారోగ్యం పాలవుతుండగా, మరికొన్ని మరణిస్తున్నాయి. జింకలకు సరైన ఆహార వసతి కల్పించి, యాత్రికులు ఇచ్చే చిరు తిండి తినకుండా అడ్డుకోవడానికి సిబ్బందిని కేటాయిస్తే ఇటువంటి సమస్యలుండవు. పార్కుకు అనుమతి రద్దు చేయడానికి జింకల మృతే ప్రధాన కారణమని తెలుస్తోంది. జింకలను ఇక్కడే ఉంచడం వల్ల, నడి చి వెళ్లే వారికి కొద్దిసేపు ఆటవిడుపుగా ఉంటుందని భక్తులు భావిస్తున్నారు. జింకల పార్కు ఇక్కడే ఉండాలి నడక మార్గంలోని జింకల పార్కును చూస్తూ, అలసట లేకుండా కొద్ది సేపు నడిచేయవచ్చు. ఇది ఇక్కడ ఉంటేనే బాగుంటుంది. టీటీడీ దగ్గర డబ్బుకు కొదవ లేదు. ఈ ప్రాంతాన్ని టీటీడీ తీసుకుని, బాగా అభివృద్ధి చేయాలి. జింకలకు మంచి ఆహారం పెట్టాలి. మరి ఎందుకు పెట్టడం లేదో తెలియడం లేదు. - డి. వేలాయుధం, భక్తుడు, వేలూరు ప్లాస్టిక్‌తో జింకలు మరణిస్తున్నాయి జింకల పార్కును అక్కడ నుంచి తరలించమని ఎప్పటి నుంచో అటవీ శాఖ కోరుతోంది. వాటిని ఎక్కడకు తరలించాలనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్లాస్టిక్ కాగితాలు తినడం వల్ల జింకలు మరణిస్తున్నాయి. జింకలకు అనవసరమైన ఆహారపదార్థాలను భక్తులు ఇవ్వకుండా ఉంటే మంచిది. - శ్రీనివాసులు డీఎఫ్‌వో టీటీడీ తిరుపతి జిల్లాలోని ఇడుపుల పాయకు తరలించాలని లేదా కొన్ని జూలకు పంపించాలనే ఆలోచన కూడా చేశారు. జింకలను తరలించే సమయం లో కొన్ని మరణించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల వాటిని ఇక్కడే ఉండేలా చూడాలని కోరుతున్నారు. సరైన ఆహారం లేక.. 2010లో 270 జింకలు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 350కి దాటింది. వీటి నిర్వహణకు ఏడా దికి రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు టీటీడీ ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. అయినా ఈ జింకలకు సరైన ఆహారం లేకపోవడంతో యాత్రికు లు ఇచ్చే తిండికోసం ఆవురావురమంటూ ఉం టాయి. తినే తొందరలో ప్లాస్టిక్ కాగితాలను కూడా మింగేస్తున్నాయి. దీంతో కొన్ని అనారోగ్యం పాలవుతుండగా, మరికొన్ని మరణిస్తున్నా యి. జింకలకు సరైన ఆహార వసతి కల్పించి, యాత్రికులు ఇచ్చే చిరు తిండి తినకుండా అడ్డుకోవడానికి సిబ్బందిని కేటాయిస్తే ఇటువంటి సమస్యలుండవు. పార్కుకు అనుమతి రద్దు చేయడానికి జింకల మృతే ప్రధాన కారణమని తెలుస్తోంది. జింకలను ఇక్కడే ఉంచడం వల్ల, నడి చి వెళ్లే వారికి కొద్దిసేపు ఆటవిడుపుగా ఉంటుందని భక్తులు భావిస్తున్నారు. జింకల పార్కు ఇక్కడే ఉండాలి నడక మార్గంలోని జింకల పార్కును చూస్తూ, అలసట లేకుండా కొద్ది సేపు నడిచేయవచ్చు. ఇది ఇక్కడ ఉంటేనే బాగుం టుంది. టీటీడీ దగ్గర డబ్బుకు కొదవ లేదు. ఈ ప్రాంతాన్ని టీటీడీ తీసుకుని, బాగా అభివృద్ధి చేయాలి. జింకలకు మంచి ఆహారం పెట్టాలి. మరి ఎందుకు పెట్టడం లేదో తెలియడం లేదు. - డి. వేలాయుధం, భక్తుడు, వేలూరు ప్లాస్టిక్‌తో జింకలు మరణిస్తున్నాయి జింకల పార్కును అక్కడ నుంచి తరలించమని ఎప్పటి నుంచో అటవీ శాఖ కోరుతోంది. వాటిని ఎక్కడకు తరలించాలనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్లాస్టిక్ కాగితాలు తినడం వల్ల జింకలు మరణిస్తున్నాయి. జింకలకు ఆహారపదార్థాలు భక్తులు ఇవ్వకుండా ఉంటే మంచిది. - శ్రీనివాసులు డీఎఫ్‌వో టీటీడీ తిరుపతి -
ఆగని వన్యప్రాణుల వేట
=కౌండిన్య అటవీ ప్రాంతంలో నాటు తుపాకుల మోత =ఉచ్చుల్లో ఇరుక్కుంటున్న జంతువులు =పశువులు, మేకల కాపరుల ప్రాణాలకు అపాయం =నిద్రావస్థలో అటవీశాఖ పలమనేరు నియోజకవర్గంలోని కౌండిన్య అటవీ ప్రాంతంలో కొన్నాళ్లుగా నాటుబాంబుల మోత, తుపాకి చప్పుళ్లు ఎక్కువయ్యూయి. అడవిలో వన్య ప్రాణుల వేట ముమ్మరంగా సాగుతోంది. వేటగాళ్ల నాటు తుపాకులకు పశువులు, మేకల కాపరులు, తేనె సేకరణకు వెళ్లే గిరిజనుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. అడవిలో అమర్చిన నాటు బాంబులను తొక్కడం, కొరకడంతో జంతువులు మృత్యువాతపడుతున్నాయి. వేటగాళ్ల ఉచ్చుల్లో ఎన్నో జంతువులు ఇరుక్కుంటున్నాయి. నిఘా కొరవడడంతో వేటగాళ్లు అటవీ ప్రాంతాల్లో వీరవిహారం చేస్తున్నారు. పలమనేరు/ వి.కోట, న్యూస్‌లైన్: పలమనేరు మండలం నుంచి బెరైడ్డిపల్లె, వి.కోట మండలం వరకు కౌండిన్య అభయారణ్యం వ్యాపించి ఉంది. ఈ ప్రాంతానికి దక్షిణంగా తమిళనాడులోని మోర్ధన అటవీ ప్రాంతం ఉంది. ఈ అడవిలో పదుల సంఖ్యలో ఏనుగులు, వేల సంఖ్యలో దుప్పులు, జింకలు, అడవి పందులు, కుందేళ్లు తదితర వన్య ప్రాణులున్నాయి. ఈ అడవిని ఆనుకుని దాదాపు 60 గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లోని కొందరు నిత్యం అడవికి వేటకెళ్లడం జీవనోపాధిగా మార్చుకున్నారు. ఈ ప్రాంతంలో వెయ్యి వరకు నాటు తుపాకులున్నట్లు అనధికార సమాచారం. గతేడాది పలమనేరు సర్కిల్ పోలీసులు జరిపిన దాడుల్లో వందలాది తుపాకులు పట్టుబడిన విషయం తెలిసిందే. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా దొరికింది కొన్నే అయినప్పటికీ, భారీ సంఖ్యలో ఇవి వేటగాళ్ల వద్ద ఉన్నట్లు సమాచారం. వేటగాళ్లు పగలు, రేయి అన్న తేడా లేకుండా అడవిలో వన్య ప్రాణులను వేటాడుతున్నారు. వేటగాళ్లు నాటు తుపాకులతో గుంపులుగుంపులుగా వె ళ్లడం ఇక్కడి రివాజు. కొందరు నాటు బాంబుల్లో వన్య ప్రాణులకు ఇష్టమైన పదార్థాలను ఉంచి అడవిలో పెట్టి వస్తుంటారు. వీటిని జంతువులు తినేటపుడు బాంబు పేలి అక్కడికక్కడే మృత్యువాత పడుతున్నాయి. ఇలా చనిపోయిన వాటిని మరుసటి రోజు వెళ్లి వేటగాళ్లు తీసుకొస్తుంటారు. ముఖ్యంగా ఈ నాటు బాంబులను కొరికి రెండు నెలల్లో 30 కుక్కల దాకా మృత్యువాత పడ్డాయి. రెండ్రోజుల క్రితం పలమనేరు మండలం కృష్ణాపురం అడవిలో కొందరు వేటగాళ్లు భారీగా నల్లమందు ఉండలను అడవిలో పెట్టి వచ్చారు. ఓ ఉండను తిన్న అడవిపంది తల ముక్కలైంది. ఆ అడవిపందిని వేటగాళ్లు తీసుకెళ్లారు. దీనిపై అటవీశాఖ విచారణ జరుపుతోంది. కమ్మీలు, వైర్లతో తయారు చేసిన ఉచ్చులను కొందరు పగటి పూట అడవిలో చెట్ల మధ్య అమర్చుతున్నారు. ఇరుక్కున్న జంతువుల మాంసాన్ని తీసుకువస్తున్నారు. భయం గుప్పిట్లో పశువుల కాపరులు నాటు తుపాకులతో అమాయకులకు బలయ్యే ప్రమాదం పొంచి ఉంది. గతంలో బెరైడ్డిపల్లె మండలంలోని దేవదొడ్డి అటవీ ప్రాంతంలో వేటగాళ్ల నాటుతుపాకుల దెబ్బకు పశువులకాపరి మృతిచెందాడు. రెండేళ్ల క్రితం పలమనేరు మండలంలోని కల్లాడు వద్ద ఓ వ్యక్తి మరణించాడు. రెండు నెలల క్రితం బెరైడ్డిపల్లె మండలంలోని కైగల్ అటవీ ప్రాంతంలో ఓ యువకుడు తేనె తీస్తుండగా వేటగాళ్ల నాటు తుపాకి దెబ్బకు గాయపడ్డాడు. నలుగురికి పైగా తూటాలు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికీ బయటకు పొక్కని మరెన్నో అడవిలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా అటవీశాఖ కళ్లు తెరచి తగిన చర్యలు తీసుకుని వన్య ప్రాణులను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.