
ఆ జింక ఎక్కడిది?
చౌటుప్పల్: చౌటుప్పల్ గుండ్లబావి గ్రామంలో ఈ నెల 23న దొరికిన జింక ఎక్కడి నుంచి వచ్చిందనేది మిస్టరీగా మారింది. గొర్రెల కాపరికి దొరికిన జింక పిల్లని అదే గ్రామానికి చెందిన జెడ్పీటీసీ బుచ్చిరెడ్డి స్థానిక అటవీశాఖ కార్యాలయంలో అప్పగించారు. ఆ సమయంలో కాలికి చిన్న గాయం తప్ప పూర్తిస్థాయి లో అరోగ్యంగా ఉంది. మరుసటి రోజు జింక మృతి చెందింది.
జింక దొరికిన గ్రామానికి సమీపంలో అటవీ భూములు కూడా లేవు. ఇటీవల మహదేవ్‌పూర్ అడవుల్లో దుప్పుల వేట ఘటనకు.. ఈ జింకకు సంబంధాలేమైనా ఉన్నాయోమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.