
వామ్మో దుప్పి.. శరవేగంగా బైకర్‌పై జంప్!
మనుషులు ప్రయాణాల్లో ఉన్నప్పుడు అడవుల్లోని జంతువులు వారికి తారసపడటం.. ఎదురుపడటం అప్పుడప్పుడు జరుగుతూ ఉండేదే. కానీ అరుదైన రీతిలో ఓ భారీ దుప్పి శరవేగంగా దూసుకొచ్చి.. వేగంగా వెళుతున్న బైకర్ మీద నుంచి దూకేసింది. వర్జినీయాలోని అలెగ్జాండ్రియాలో ఒక బృందంపై బైకులపై వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బైకర్లు వేగంగా దూసుకెళుతున్న తరుణంలో ఓ భారీ దుప్పి రోడ్డును క్రాస్ చేసేందుకు ప్రయత్నించింది.
బైకులు వేగంగా వెళుతున్నా.. తనదైన శైలిలో బైకులపై నుంచి శరవేగంగా దుప్పి జంప్ కొట్టి రోడ్డు దాటింది. ఇలా జంప్ చేసే క్రమంలో ఓ బైకర్‌కు దాని కాళ్లు తగిలాయి. దీంతో బైక్‌ను సంభాళించుకోలేకపోయిన అతను కిందపడ్డాడు. వెనుక వస్తున్న మరో బైకర్ దీనిని వీడియో తీశాడు. ఒళ్లు గగుర్పొడిచేరీతిలో దుప్పి చేసిన ఈ జంప్ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వేలమంది ఈ వీడియోను షేర్ చేసుకుంటున్నారు.