
ఆమ్‌స్టర్‌డామ్: మనలో చాలా మంది నీళ్లలో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. అందుకే, చిన్నప్పుడు పిల్లలను ఏమాత్రం.. వదిలేసిన నీటి తొట్టే దగ్గరకు లేదా బకెట్‌లో చేయిపెట్టి సరదాగా ఆడుకుంటారనే విషయం మనకు తెలిసిందే. కాగా, కొంత మంది తల్లులు.. తమ పిల్లలను బకెట్‌లు, ట్రబ్‌లో కూర్చోబెట్టి వారు ఆడుకుంటుంటే తల్లిదండ్రులు సంబరపడిపోతుంటారు. ఇప్పటికి చాలా మంది వీకాఫ్ రాగానే.. నదులు, జలపాతాలు, డ్యామ్‌ల వద్దకు తమ కుటుంబాలతో వాలిపోతుంటారు. అక్కడ నీటితో సరదాగా ఆడుకోవడం చేస్తుంటారు.
ఇక్కడ అడవిలోని ఒక జింక కూడా నీటి కుంటలో దూకి చాలా సేపు సరదాగా గడిపింది. ప్రస్తుతం ఈ ఫన్నీవీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా, బ్యూటెంజిబిడెన్ అనే యూజర్ ప్రకృతి ప్రేమికుడు. ఇతను.. జంతువులు, ప్రకృతికి సంబంధించిన అరుదైన వీడియోలను సేకరించి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తుంటాడు. తాజాగా, ఆయన షేర్ చేసిన వీడియోలో.. ఒక అందమైన జింక ఒక నీటి కుంటను చూసింది. మెల్లగా అక్కడికి చేరుకుని నీటిలోదిగింది.
నీటిలో దూకుతూ.. పైకి వస్తు... కాసేపు సరదాగా గడిపింది. అయితే, ఆ జింకకు నీటిలో తనలాంటి మరో ప్రతిబింబం కన్పించడం వలన మరో జింక ఉందేమో అనుకుందో.. తన బలమైన కాళ్లతో నీటిని కొడుతూ.. అటు ఇటూ గెంతడం చేయసాగింది. నీటిలో దిగుతూ.. పైకి వస్తు, అటుఇటూ చూస్తు సరదాగా గడిపింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియరాలేదు. అయితే, దీన్ని బ్యూటెంజిబిడెన్ అనే యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ‘నీటిలో ఆడుకోవడమంటే ఎవరికి ఇష్టముండదు’.. అంటూ క్యాప్షన్ జతచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వావ్.. జింక ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది..’,‘మా చిన్నతనాన్ని గుర్తుకు తెచ్చింది..’,‘ప్రకృతిని బాగా ఎంజాయ్ చేస్తోంది..’ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment