water pond
-
ఈతకు వెళ్లి బాలుడు మృతి
నల్గొండ: చెరువులో ఈతకు వెళ్లి బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం పోచంపల్లి మండలంలోని మెహర్‌నగర్ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లి మండలం అంతమ్మగూడేనికి చెందిన బండారి ఈశ్వరయ్య, లలిత దంపతులకు యశ్వంత్(12), కుమార్తె ఉన్నారు. ఈశ్వరయ్య, లలిత దంపతులు స్థానికంగా ఓ రసాయన కంపెనీలో పనిచేస్తున్నారు. యశ్వంత్ చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని ప్రగతి స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు ఇవ్వడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. తల్లిదండ్రులిద్దరూ మంగళవారం ఉదయం కంపెనీలో పనికి వెళ్లగా.. యశ్వంత్ తన స్నేహితుడైన వస్పరి జశ్వంత్‌తో కలిసి మధ్యాహ్నం ఈత కొట్టేందుకు సైకిల్‌పై మెహర్‌నగర్ శివారులోని సిద్దప్ప చెరువు వద్దకు వెళ్లారు. ఇద్దరు చెరువు ఒడ్డున బట్టలు, చెప్పులు విడిచి చెరువులోకి దిగారు. కాగా యశ్వంత్ చెరువు ఒడ్డు నుంచి కొద్దిదూరం వెళ్లగానే పెద్ద గుంతలో మునిగిపోయాడు. అక్కడే ఉన్న వస్పరి జశ్వంత్ భయపడి ఊర్లోకి వెళ్లి యశ్వంత్ ఇంటి వద్ద సైకిల్ పెట్టి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దుస్తులను చూసి గుర్తించి.. ఇంటికి వచ్చిన యశ్వంత్ తల్లిదండ్రులు కొడుకు కనిపించకపోయేసరికి ఊరిలో వెతికారు. ఇరుగుపొరుగు వారిని కుమారుడి గురించి వాకబు చేశారు. మధ్యాహ్నం యశ్వంత్, జశ్వంత్ కలిసి చెరువు వైపు వెళ్లడం చూశానని గొర్రెల కాపరి వస్పరి పార్వతమ్మ చెప్పడంతో గ్రామస్తులతో కలిసి వెళ్లి చూడగా చెరువు ఒడ్డున యశ్వంత్ దుస్తులు, చెప్పులు కన్పించాయి. చెరువులోకి దిగి వెతకగా యశ్వంత్ మృతదేహం లభ్యమైంది. ఈ విషయం తెలుసుకొన్న చౌటుప్పల్ రూరల్ సీఐ మహేశ్, స్థానిక ఎస్ఐ విక్రంరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వావ్.. ప్రకృతిని ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది!
ఆమ్స్టర్డామ్: మనలో చాలా మంది నీళ్లలో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. అందుకే, చిన్నప్పుడు పిల్లలను ఏమాత్రం.. వదిలేసిన నీటి తొట్టే దగ్గరకు లేదా బకెట్లో చేయిపెట్టి సరదాగా ఆడుకుంటారనే విషయం మనకు తెలిసిందే. కాగా, కొంత మంది తల్లులు.. తమ పిల్లలను బకెట్లు, ట్రబ్లో కూర్చోబెట్టి వారు ఆడుకుంటుంటే తల్లిదండ్రులు సంబరపడిపోతుంటారు. ఇప్పటికి చాలా మంది వీకాఫ్ రాగానే.. నదులు, జలపాతాలు, డ్యామ్‌ల వద్దకు తమ కుటుంబాలతో వాలిపోతుంటారు. అక్కడ నీటితో సరదాగా ఆడుకోవడం చేస్తుంటారు. ఇక్కడ అడవిలోని ఒక జింక కూడా నీటి కుంటలో దూకి చాలా సేపు సరదాగా గడిపింది. ప్రస్తుతం ఈ ఫన్నీవీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా, బ్యూటెంజిబిడెన్ అనే యూజర్ ప్రకృతి ప్రేమికుడు. ఇతను.. జంతువులు, ప్రకృతికి సంబంధించిన అరుదైన వీడియోలను సేకరించి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తుంటాడు. తాజాగా, ఆయన షేర్ చేసిన వీడియోలో.. ఒక అందమైన జింక ఒక నీటి కుంటను చూసింది. మెల్లగా అక్కడికి చేరుకుని నీటిలోదిగింది. నీటిలో దూకుతూ.. పైకి వస్తు... కాసేపు సరదాగా గడిపింది. అయితే, ఆ జింకకు నీటిలో తనలాంటి మరో ప్రతిబింబం కన్పించడం వలన మరో జింక ఉందేమో అనుకుందో.. తన బలమైన కాళ్లతో నీటిని కొడుతూ.. అటు ఇటూ గెంతడం చేయసాగింది. నీటిలో దిగుతూ.. పైకి వస్తు, అటుఇటూ చూస్తు సరదాగా గడిపింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియరాలేదు. అయితే, దీన్ని బ్యూటెంజిబిడెన్ అనే యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ‘నీటిలో ఆడుకోవడమంటే ఎవరికి ఇష్టముండదు’.. అంటూ క్యాప్షన్ జతచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వావ్.. జింక ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది..’,‘మా చిన్నతనాన్ని గుర్తుకు తెచ్చింది..’,‘ప్రకృతిని బాగా ఎంజాయ్ చేస్తోంది..’ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. -
తీవ్ర విషాదం: చెరువులో పడి నలుగురు మృతి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. చెరువు వద్దకు ఆడుకోవడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయారు. అయితే వారిని కాపాడేందుకు వెళ్లిన ఓ వ్యక్తి కూడా మృతి చెందారు. నలుగురి మృతితో ఓజిలి మండలం రాజుపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజుపాలెం గ్రామంలో ఉన్న చెరువు వద్దకు మాచవరం హేమంత్(6), మాచవరం చరణ్ తేజ(8), జాహ్నవి(12) ఆడుకోవడానికి వచ్చారు. ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు చెరువు నీటిలో చిన్నారులు పడిపోయారు. అక్కడే సమీపంలో ఉన్న షేక్ ఖలీల్ (45) వెంటనే వారిని కాపాడేందుకు చెరువులోకి దూకాడు. వారిని కాపాడే క్రమంలో ఖలీల్ కూడా నీటిలో చిక్కుకుని మృతి చెందాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో విషాదంలో మునిగిపోయింది. ముగ్గురు చిన్నారులు ఒకే కుటుంబానికి చెందినవారు. అయితే వారిని కాపాడేందుకు వెళ్లి ఖలీల్ మృతి చెందడం ఆ కుటుంబాన్ని కలచివేసింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
నీటితొట్టిలో పడి బాలుడి మృతి
సాక్షి, జూలూరుపాడు(ఖమ్మం) : నీటి తొట్టిలో పడి 18 నెలల బాలుడు మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సాయిరాంతండా గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా.. సాయిరాంతండాకు చెందిన జాటోత్ రమేష్, నాగమణి దంపతులకు ఇద్దరు సంతానం. మొదటి సంతానం తేజస్వీని కాగా రెండవ సంతానం∙జాటోత్ లోక్షిత్ నాయక్. తల్లి నాగమణి ఇంటి పనిలో నిమగ్నౖమైంది, తండ్రి రమేష్ పని మీద బయటకు వెళ్లాడు. ఈ సమయంలో బాలుడు ఆడుకుంటూ ఇంటి ఆవరణంలో ఉన్న నీటి తొట్టిలో పడి పోయాడు. అప్పటి వరకు ఆడుకుంటున్న పిల్లవాడు కన్పించకపోవడంతో తల్లిదండ్రులు రమేష్, నాగమణిలు కంగారు పడి ఇంటి పరిసరాల్లో వెతకగా బాలుడు నీటి తొట్టిలో పడిపోయి ఉన్నాడు. బాలుడిని హుటాహుటిన జూలూరుపాడు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ)కి తరలించారు. వైద్యులు సలహామేరకు మెరుగైన వైద్యం కోసం చిన్నారి లోక్షిత్ నాయక్‌ను కొత్తగూడెం సింగరేణి ఆసుపత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
నీటికుంటలో పడి చిన్నారి మృతి
సాక్షి, ఓబులవారిపల్లె(కడప) : మండలంలోని కొర్లకుంట గ్రామానికి చెందిన పులి వైష్టవి (9) శనివారం ప్రమాద వశాత్తు సంజీవపురం చెరువులోని నీటికుంటలో పడి మృతి చెందింది. బంధువుల కథనం మేరకు.. కొర్లకుంట గ్రామనికి చెందిన పులి సుబ్రమణ్యం కూమార్తె వైష్టవి, గ్రామానికి చెందిన తోటి పిల్లలతో కలిసి సంజీవపురం చెరువులోనికి సాయంత్రం బహిర్భూమికి వెళ్లారు. వైష్టవి ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడిపోయి కేకలు వేసింది. తోటి పిల్లల కళ్లముందే ఆ చిన్నారి నీటి కుంటలో మునిగిపోయింది. విషయన్ని ఇంటికి వచ్చి పిల్లలు చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటహుటిన కుంటలోకి దిగి చిన్నారిని వెలికితీశారు. అప్పటికే మృతి చెందింది. పులి సుబ్రమణ్యం ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో మంచాన పడి ఉన్నాడు. వారికి ఒక కూమారుడు కూమార్తె ఉన్నారు. వైష్ణవి మృతితో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డాక్టర్ నాయక్ తెలిపారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వత్తలూరు సాయికిషోర్‌రెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులను పరమర్శించారు. -
బాలికను బలిగొన్న నీటికుంట
సాక్షి, బెళుగుప్ప(అనంతపురం) : తగ్గుపర్తి గ్రామ సమీపంలోని నీటికుంట ఓ బాలికను మింగింది. దప్పిక తీర్చుకునేందుకు వెళ్లిన బాలికను నీటికుంట మింగేసింది. మరొక బాలికను అటుగా వచ్చిన ఓ రైతు గమనించి రక్షించాడు. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తగ్గుపర్తి దళితవాడకు చెందిన అస్మిత (13) స్థానిక ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. దసరా సెలవులు రావడంతో ఇంటివద్దనే ఉంటోంది. మంగళవారం స్నేహితులు చిన్ని, శాలినితో కలిసి నల్లరేగడి భూముల్లోనూ, గట్లపైనా కాచే చిన్న కాకరకాయలను తీయడానికి వెళ్లింది. ఎండ తీవ్రతకు దప్పిక వేయడంతో నీటి కోసం వెదికింది. సమీపంలోనే గాలిమరల కంపెనీల రహదారుల కోసం మట్టిని తవ్వగా ఏర్పడిన గుంతల్లోకి వర్షపునీరు వచ్చి చేరింది. లోతు గమనించని చిన్నారులు నీరు తాగేందుకు వెళ్లారు. నీరు తాగుతున్న సమయంలో అస్మిత కాలుజారి కుంటలోకి పడిపోయింది. కాపాడే ప్రయత్నంలో స్నేహితురాలు చిన్ని సైతం పడిపోయింది. గట్టుపై ఉన్న శాలిని గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో పెట్రోలు అయిపోయి ద్విచక్రవాహనం తోసుకుంటూ వస్తున్న రైతు లక్ష్మినారాయణ అక్కడకు చేరుకుని చిన్నిని ఒడ్డుకు చేర్చాడు. లోతు ఎక్కువ ఉన్న చోట మునగడంతో అస్మిత దొరకలేదు. కొంతసేపటి తర్వాత మరికొందరితో కలిసి నీటికుంటలోకి దిగి అస్మితను బయటకు తీసుకొచ్చారు. అయితే అప్పటికే అస్మిత ప్రాణం విడిచింది. ‘ఇంతవరకు కళ్ల ముందు ఆడుకుంటూ ఉంటిరే.. అంతలోనే కానరాని లోకాలకు వెళ్తివా బిడ్డా’ అంటూ అస్మిత తల్లిదండ్రులు మారెక్క, వన్నరూప్పలు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
‘కన్నీటి’కుంట...
సాక్షి, జమ్మలమడుగు :నీటిని చూడగానే దిగి ఈతకొట్టాలనిపించింది. కానీ ఆ ఇద్దరు చిన్నారులకు కుంట లోతు తెలియదు..దీంతో వారు కుంటలో దిగిన కాసేపటికే ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఉదయం జమ్మలమడుగు మండలం గూడెంచెరువులో ఈ సంఘటన విషాదఛాయలు మిగిల్చింది. గూడెంచెరువు గ్రామానికి చెందిన లింగారెడ్డి..శివకల్యాణ్ వ్యవసాయ కూలీలు. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు. లింగారెడ్డికి సంజయ్ (9) ఒక్కడే సంతానం. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. శివకల్యాణ్‌కు ఇద్దరు పిల్లలు. పాప బాబు. బాబు లోకేష్(9) కూడా అదే స్కూలులో మూడో తరగతి చదువుతున్నాడు. సంజయ్, లోకేష్‌లు ఇద్దరూ మంచి మిత్రులు. వీరు సోమవారం మొహరం సెలవు వల్ల పాఠశాలకు వెళ్లలేదు. మరో ఇద్దరితో కలిసి కొండ ప్రాంతంలో కలిపండ్లు కోసుకుని వద్దామని గండికోట రహదారిలోకి వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షాలతో నీరు చేరిన ఓ కుంట దారిలో కనిపించింది. దీంతో ఇందులో దిగి ఈత కొడదామని సంజయ్, లోకేష్‌లు ఉత్సాహపడ్డారు. ఇంకేమీ ఆ లోచించకుండా వెంటనే నీటిలో దూకారు. ఈ ఇ ద్దరు పిల్లలకు ఈత సరిగా రాదు. 20 అడుగుల లో తుగా ఉన్న కుంటలో చిన్నారులు ఇరుక్కుపోయా రు. ఈతకు దిగని ఇద్దరు మిత్రులు వీరిని చూసి ఆందోళన చెందారు. బయటకు రాలేకపోతున్నారని గ్రహించారు. దీంతో వెంటనే భయపడుతూ ఊళ్లోకి వచ్చి గ్రామస్తులకు విషయం చెప్పారు. గ్రామస్తులు పరుగున వచ్చి కుంటకు చేరుకునేలోగానే లోకేష్..సంజయ్‌లు విగతజీవులయ్యారు. దీంతో స్థానికులు నిశ్చేష్టులయ్యారు. అసువులు బాసిన చిన్నారుల మృతదేహాలను చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. లోకేష్ తల్లి రెండేళ్ల క్రితం చనిపోయింది. ఈ బాలుడి మృతదేహం వద్ద తండ్రి కుప్పకూలి రోదించాడు. చిన్నారుల మృతికి గ్రామస్తులంతా కంటతడి పెట్టారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ ఎన్.నాగరాజు, అర్బన్‌సీఐ కత్తి శ్రీనివాసులు కుంటవద్దకు చేరుకున్నారు. ఫైర్ అధికారులు,స్థానికులతో కలిసి కుంట నుంచి చిన్నారుల మృతదేహాలను బయటికి తీయించారు. పోస్టు మార్టం కోసం జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
-
గాజులరామరంలో నీటి గుంతలో పడి ముగ్గురు మృతి
-
ప్రాణానికి ప్రాణం అడ్డేసి
నీటి కుంటలో పడిన కుమార్తెనుచూసి తల్లి తల్లడిల్లింది. తనకు ఈత రాదన్న విషయాన్ని మరిచిపోయినీటిలో దూకేసింది. గమనించిన యువకుడు చిన్నారిని కాపాడాడు. తాను బురదలో కూరుకుపోయి తనువు చాలించా డు. చిత్తూరు నగరంలోని ఇరువారంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికుల్ని కలచివేసింది. చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఇరువారం వికలాంగుల కాలనీ (పీహెచ్)కి చెందిన కార్తీక్, ధనలక్ష్మి దంపతుల కుమారుడు ఢిల్లీ ప్రసన్న (18) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివా రం ధనలక్ష్మి, ఆమె కుమారుడు ఢిల్లీ ప్రసన్న, అదే కాలనీకి చెందిన కన్నెకేశ్వరి, ఆమె కుమార్తె మమత, మనవరాలు పవిత్ర(9)తో కలిసిఇరువారం చెక్‌డ్యామ్ పక్కనున్న అడవుల్లోకి కట్టెలు కొట్టడానికి వెళ్లారు. మమత కట్టెలు కొట్టి వాటిని ఇంటి వద్ద వేసిరావడానికి వెళ్లింది. ఇంతలో పవిత్ర కాలుజారి నీటి కుంటలో పడిపోయింది. దీన్ని గమనించిన ధనలక్ష్మి తనకు ఈత రాదనే విషయాన్ని మరచిపోయి పవిత్రను కాపాడేందుకు నీటిలోకి దూకి బురదలో కూరుకుపోయింది. వారిని కాపాడడానికి పవిత్ర అమ్మమ్మ కన్నెకేశ్వరి నీటిలోకి దూకింది. అందరూ కేకలు వేస్తుండడంతో పక్కనే ఉన్న ఢిల్లీ ప్రసన్న నీటిలోకి దూకి పవిత్రను గట్టుపైకి విసిరేసి తాను బురదలో కూరుకుపోయాడు. గట్టుపై ఉన్న కాలనీకి చెందిన రమీజా అనే మహిళ తన చీర సాయంతో ధనలక్ష్మి, కన్నెకేశ్వరిని కాపాడింది. బురదలో కూరుకుపోయిన ఢిల్లీ ప్రసన్నను రోడ్డుపై అటుగా వెళుతున్న వారు బయటకులాగి ఆటోలో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతిచెందినట్టు ధ్రువీకరించారు. దీంతో పీహెచ్ కాలనీ వాసులు విషాదంలో మునిగిపోయారు. నువ్వు వెళ్లిపోయావా నాయనా.. ఉన్న ఒక్కగానొక్క కొడుకును బలితీసుకున్నావు.. నీకు న్యాయమేనా భగవంతుడా..’ అంటూ ఆ తల్లి కన్నీరుమున్నీరైంది. ఆమెను చూసి చుట్టుపక్కల వారూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. టూటౌన్ సీఐ వెంకటకుమార్ అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
నీటి గుంతలో పడి వృద్ధుడు మృతి
సిద్దవటం : మండలంలోని వెంకటాయపల్లెకు చెందిన రైతు జ్యోతి గంగులయ్య (70) నీటి గుంతలో పడి మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గంగులయ్య తాను సాగు చేసిన వేరుశెనగ పంటకు శనివారం సాయంత్రం నీరు పెట్టేందుకు వెళ్లాడు. బోరులో నుంచి మోటారు ద్వారా వచ్చే నీరు దునికే ప్రదేశంలో గుంత ఉండటంతో.. ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడిపోయాడు. ఆయన బయటకు రాలేక పోవడం, చుట్టు పక్కల పొలాల్లో రైతులెవరూ చూడక పోవడంతో ఊపిరాడక చనిపోయాడు. ఆదివారం ఉదయం పక్క పొలం రైతు ఈరిశెట్టి వెంకటసుబ్బయ్య తిరుగుతుండగా.. గంగులయ్య నీటి గుంతలో పడి ఉండటంతో వెళ్లి పలకరించాడు. ఆయన నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో చనిపోయినట్లు గ్రహించాడు. వెంటనే మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపాడు. వారు వచ్చి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. మృతదేహాన్ని వీఆర్వో చక్రధర్ పరిశీలించి తహసీల్దార్‌కు సమాచారం ఇచ్చారు. -
కనిపించకుండా పోయి.. శవమై తేలి..
సాక్షి, మేడ్చల్ : మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పంచాయతీ పరిధిలోని రాంకీ చెత్త డంపింగ్ యార్డ్‌లోని నీటి మడుగులో ఓ బాలుడి మృతదేహం కలకలం రేపింది. శాంతినగర్‌కు చెందిన కృష్ణ కుమారుడు రామకృష్ణ(4)గా అతడిని గుర్తించారు. పదిహేనేళ్ల క్రితం విజయవాడ నుంచి వలస వచ్చిన కృష్ణ, శాంతి నగర్లో నివసిస్తూ, చెత్తను సేకరించి జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి బాలుడు కనిపించకుండా పోయాడు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు బాలుడు డంపింగ్ యార్డ్‌కు చెందిన నీటి మడుగులో శవమై తేలాడు. మృత దేహాన్ని మేకలు కాసే వ్యక్తి గుర్తించి బస్తీ వాసులకు తెలపడoతో, వారు పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న జవహర్ నగర్ సీఐ ఉమా మహేశ్వరరావు తన సిబ్బంది తో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ ను రప్పించిన తదనంతరం పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పటల్ కు తరలించారు. -
శభాష్ చందన
సాక్షి, కర్ణాటక ,మండ్య : ఆ చిన్నారి సమయస్పూర్తి ఒకరి నిండు ప్రాణం కాపాడింది. దుకాణానికి వెళ్లిన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు నీటికుంటలో పడిపోవడంతో సకాలంలో స్పందించిన మరో చిన్నారి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు అక్కడికి చేరుకుని చిన్నారిని కాపాడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రీతూ, చందన ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరికి ఏడేళ్లు లోపు ఉంటాయి. ఒకే ప్రాంతంలో ఉండటమే కాకుండా ఎక్కడికి వెళ్లిన ఇద్దరు కలిసే వెళ్తారు. అతి చిన్న వయసులోనే ఆ స్నేహబంధం వీరి మధ్య పెనవేసుకుంది. మండ్య జిల్లా భారతీ నగర సమీపంలోని అణ్ణూరుకు చెందిన చంద్రశేఖర్, వినూత దంపతుల కుమార్తె రీతు, అజిత్ కుమార్, చందన దంపతులు కుమార్తె చందన కుటుంబాలు కూడా మంచి స్నేహితులు. ఇదిలా ఉంటే ఈనెల 10న ఈ ఇద్దరు చిన్నారులు తినుబండారాలు కొనుక్కోవడానికి దుకాణం వద్దకు వెళ్లారు. రీతు చెప్పుకు పేడ అంటింది. దారి సమీపంలో ఉన్న నీటి కుంటలోకి దిగి పేడను కడుక్కోవడానికి దిగారు. ఇదే సమయంలో రీతు నీటిలో పడిపోయింది. దాదాపు 8 అడుగుల లోతు ఉంది. రీతును బయటకు లాగడానికి చందన ప్రయత్నించింది. అయితే తన వల్ల కాకపోవడంతో ఇంటికి పరుగు పెట్టి రీతు తండ్రికి విషయం వివరించడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని రీతును బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఆదివారానికి బాలిక పూర్తిగా కోలుకోవడంతో ఆ ఇంట నవ్వులు పూశాయి. చందన ఆలస్యం చేసి ఉంటే తమ బిడ్డ బతికే అవకాశం లేదని రీతు తండ్రి చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు చందనను అభినందించారు. -
కళ్లముందే మునిగిపోతున్నా... గుర్తించలేకపోయారు..
దొడ్డబళ్లాపురం (రామనగర): సహచరుడు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్నా.. గమనించలేనంతగా సెల్ఫీ మోజులో మునిగి పోయారు వారు.. ఫలితంగా నిండు ప్రాణం నీటిపాలైంది. సహచరుడు నీటిలో మునిగిపోతున్న దృశ్యాలు కూడా వారు దిగిన సెల్ఫీల్లో స్పష్టంగా కనిపి స్తున్నాయి. ఈ దుర్ఘటన కర్ణాటకలో రామనగర జిల్లా రావగొండ్లు కొండ మీద చోటుచేసుకుంది. బెంగళూరు జయన గర్‌లోని నేషనల్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న 25 మంది సోమవారం ఎన్సీసీ క్యాంప్‌లో భాగంగా రావగొండ్లు కొండకు వెళ్లారు. విరామ సమయంలో కొండమీదున్న కోనేరులో ఈతకొట్టేందుకు దిగారు. ఈతరాని విశ్వాస్ నీటిలో మునిగిపోసాగాడు. అదే సమయంలో మిగతావారు సెల్ఫీ తీసుకుంటూ ఉండిపోయారు. విశ్వాస్ నీటిలో మునిగిపోతున్న చిత్రాలు ఆ సెల్ఫీల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొంతసేపటికి విశ్వాస్ కనిపించకపోవడంతో హడావుడిగా కోనేరులో వెతగ్గా అతని మృతదేహం బయటపడింది. -
నీటికుంటలో పడి బాలుడు మృతి
పాణ్యం : మండల కేంద్రానికి చెందిన ఈశ్వరమ్మ, అల్లూరయ్య దంపతుల కుమారుడు పవన్ (7) శనివారం నీటికుంటలో పడి మృతి చెందాడు. హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ వివరాల మేరకు.. తోటి బాలురతో కలసి పాణ్యం చెరువులో ఉన్న ఓ నీటికుంట వద్దకు ఆడుకునేందుకు వెళ్లిన పవన్.. ప్రమాదవశాత్తు నీటిలో పడ్డాడు. పిల్లలందరూ ఇంటికి వచ్చినా పవన్ రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లి గాలించగా అప్పటికే మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు ఐదేళ్ల క్రితం మార్కాపురం నుంచి పాణ్యం వచ్చారు. బొంతలు కుడుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమారులు. చివరి వాడు మృత్యువాతపడ్డాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
తిరుపతిలో విషాదం
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. నీటి కుంటలో పడి తల్లీ, కుమారుడు, కుమార్తె మృతిచెందారు. బట్టలు ఉతకడానికి నీటి కుంట వద్దకు వెళ్లిన ముగ్గురు ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించారు. తిరుపతి శివారు పాతకాలువలో ఓ మహిళ బట్టలు ఉతకడానికి వెళ్లింది. ఆమెతో పాటు కుమారుడు, కుమార్తె కూడా వచ్చారు. అక్కడే ఆడుకుంటున్న చిన్నారులు ప్రమాదవశాత్తు నీట మునగడం గుర్తించిన మహిళ వారిని రక్షించే క్రమంలో నీట మునిగింది. విషయం తెలుసుకున్న స్థానికులు ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. -
కుంటలో పడి బాలుడి మృతి
మరిపెడ(వరంగల్ జిల్లా): మరిపెడ మండలం దీస్యాతండాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నలగురు బాలబాలికలు సరదాగా ఈతకొడదామని దగ్గరలో ఉన్న కునాయ్కుంట వద్దకు వెళ్లారు. నలుగురిలో నగేష్(9) అనే బాలుడు ప్రమాదవశాత్తూ కుంటలో పడి మునిగిపోయాడు. ఈత రాకపోవడంతో చనిపోయాడు. పక్కనున్న ముగ్గురు భయపడి ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని వెలికి తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
నీటికుంటలో పడి చిన్నారి మృతి
కొత్తపల్లి: లింగాపురం గ్రామంలో రెండేళ్ల చిన్నారి ప్రమాదశాత్తు నీటి కుంటలో పడి మృత్యువాత పడ్డాడు. గ్రామానికి చెందిన సువార్తయ్య, శ్యామలమ్మ దంపతుల కుమారుడు దేవదాసు (20) చిన్నారులతో కలసి ఇంటి సమీపంలో సెంటర్ చర్చి దగ్గర ఆడుకుంటున్నాడు. దేవదాస్తు ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న నీటి కుంటలో పడ్డాడు. చిన్నారులు తల్లిదండ్రులకు చెప్పడంతో వారి వచ్చి బయటకు తీసేలోగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ శివశంకర్ నాయక్ గ్రామానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లుస్ఐ తెలిపారు. -
నీటిగుంటలో పడి చిన్నారి మృతి
ములుగు: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు నీటిగుంటలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ములుగు మండలం బండారుపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏడాదిన్నర చిన్నారి తల్లిదండ్రులు పనులు చూసుకుంటుండగా.. చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు ఉన్న నీటిగుంటలో పడి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
నీటి గుంతలో జారి పడి వ్యక్తి మృతి
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లె గ్రామ పరిధిలో ఆర్టీపీపీకి వెళ్లే మార్గంలో ఉన్న నీటి గుంత వద్దకు కాళ్లకు అయిన మట్టిని కడుక్కోవడానికి వెళ్లిన ఓ వ్యక్తి పొరబాటున జారి గుంతలో పడి మృతి చెందాడు. మృతుడు భార్య భువనేశ్వరి, కలమల్ల పోలీసులు తెలిపిన వివరాల మేరకు ... ముద్దనూరు మండలం నల్లబల్లె గ్రామానికి చెందిన గుగ్గల సుదర్శనరెడ్డి(35) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య భువనేశ్వరి ఉన్నారు. ఇంటికి ప్లాస్టిక్ కుర్చీలు తెచ్చుకునేందుకు శనివారం ద్విచక్ర వాహనంపై నల్లబల్లె గ్రామం నుంచి ప్రొద్దుటూరుకి సున్నపురాళ్లపల్లె మీదుగా బయలుదేరాడు. సున్నపురాళ్లపల్లె గ్రామ సమీపంలో ఉన్న రైల్వే వంతెన కింద బురద నీరు ఉంది. ఆ బురద నీటిలో నుంచి అలాగే వెళ్లడంతో సుదర్శనరెడ్డి కాళ్లకు బురద అయింది. ఈ బురదను కడుక్కోవడానికి సమీపంలో ఉన్న నీటి గుంత వద్దకు వెళ్లాడు. అక్కడ ప్రమాదశాత్తు గుంతలోకి జారి పడ్డాడు. గుంత సుమారు పది అడుగుల లోతు ఉండడంతో ఈత రాక సుదర్శన్‌రెడ్డి మునిగిపోయి ఉంటాడని భావిస్తున్నారు. ఆ దారిన వెళుతున్న ప్రయాణికులు గుంతలో తేలియాడుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కలమల్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి ఆచూకి గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. మృతుడి భార్య భువనేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కలమల్ల హెడ్ కానిస్టేబుల్ గురుశేఖర్‌రెడ్డి తెలిపారు. -
విద్యార్థిని మింగిన నీటిగుంత
ప్రమాదం జరిగిందని తెలిసినా.. నిర్లక్ష్యంగా వెళ్లిపోయిన ప్రిన్సిపాల్ విద్యార్థి బహిర్భూమికి వెళ్లగా చోటుచేసుకున్న దుర్ఘటన బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా శాయంపేట : పాఠశాల పరిసరాల్లో బహిర్భూమికి వెళ్లిన విష్ణు(10) అనే విద్యార్థి నీటి తటాకాన్ని తలపిం చేలా తవ్విన భారీ గుంతలో పడి దుర్మరణం పాల య్యాడు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం శాయంపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రేగొండ మండలం కొత్తపల్లిగోరికి చెందిన కొలిపాక రవి, మంజుల దంపతులకు ఇద్దరు కుమారులు వారిలో పెద్ద కుమారుడు వేణు పుట్టకతోనే అంగవైకల్యం కలిగి ఉన్నాడు. రెండో కుమారుడు విష్ణు గతేడాది మెుగుళ్లపల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో సీటు సంపాదించాడు. మొగుళ్లపల్లిలో పాఠశాల భవనం అందుబాటులోకి రాకపోవడంతో, తాత్కాలిక ఏర్పాటుగా శాయంపేట గురుకులంలోనే విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. కాగా, శాయంపేట గురుకులంలో స్థానిక విద్యార్థులు 450 మంది, మొగుళ్లపల్లికి చెందినవారు మరో 160 మంది చదువుతున్నారు. అయితే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అమాంతంగా పెరిగిం ది కానీ.. టాయిలెట్స్ సంఖ్య మాత్రం పెరగలేదు. మరోవైపు పాఠశాల ప్రిన్సిపాల్ మరుగుదొడ్లు, మూత్రశాలలకు తాళం వేసి ఉంచేవారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత్యంతరం లేక విద్యార్థులు ప్రతిరోజు బహిర్భూమి కోసం పరిసరాల్లోని నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లేవారు. కర్రను పట్టుకోబోయి.. ఈక్రమంలో శనివారం ఉదయం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన అనంతరం విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో విద్యార్థులు భోజనాలు ముగించుకొని, విద్యార్థి విష్ణు తోటి విద్యార్థులతో కలిసి పాఠశాలను ఆనుకొని ఉన్న ఓ ప్రైవేటు స్థలంలో బహిర్భూమికి వెళ్లారు. ఆ స్థలంలోని మెురంను తరలించగా మిగిలిన పెద్ద గుంతలో ఇటీవల కురిసిన వర్షాలకు నీళ్లు భారీగా చేరాయి. విద్యార్థి కొలిపాక విష్ణు ఆ గుంతలోకి కర్ర వేసి ఆడసాగాడు. ఇంతలో కర్ర అందులోకి పడిపోయింది. దీంతో ఆ కర్రను ఎలాగైనా పట్టుకోవాలని గుంత ఒడ్డుకు చేరుకొని అడుగువేశాడు. దీంతో ఒడ్డున ఉన్న మట్టిపెళ్లలు ఒక్కసారిగా కూలడంతో విష్ణు నీళ్లలోకి మునిగిపోయాడు. వెంటనే తోటి విద్యార్థులు విష్ణు చేతికి కర్ర అందించి.. ఒడ్డుకు లాగే ప్రయత్నం చేశారు. అది విఫలమైంది. విష్ణు నీళ్లలో మునిగిపోయాడు. దీంతో తోటి విద్యార్థులు కార్తీక్, గణేశ్, యశ్వంత్‌లు పరుగెత్తుకుంటూ వెళ్లి ఉపాధ్యాయులకు జరిగిన విషయాన్ని తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో మృతదేహం కోసం వెతికించారు. రాత్రి 8 గంటలకు విద్యార్థి మృతదేహం లభ్యమైంది. ప్రిన్సిపాల్‌పై సస్పెన్షన్ వేటు విద్యార్థి మృతదేహంతో విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు గురుకులం ఎదుట సోమవారం రాత్రి ధర్నాకు దిగారు. దీంతో పరకాల తహసీల్దార్ కృష్ణ గురుకులానికి చేరుకొని మృతిచెందిన విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగం ఇప్పించడంతో పాటు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామన్నారు. దీంతో వారు ఆందోళనను విరమించారు. కాగా, ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆరా తీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ ఎండీ ఖాజాను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. -
నీటికుంటలో పడి చిన్నారుల దుర్మరణం
జగదేవ్‌పూర్: మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సంక్రాంతి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన చిన్నారులు నీటికుంటలో పడి మృతిచెందారు. జగదేవ్‌పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా చేర్యాల మండలం కొమరెల్లికి చెందిన ప్రేమ కుమార్ (17), అదే మండలం పెద్దరాజుపేటకు చెందిన రాహుల్(14) సంక్రాంతి సెలవులకు అమ్మమ్మ ఊరైన చాట్లపల్లి వచ్చారు. ఇరువురు వరుసకు సోదరులు. ప్రేమ కుమార్ ఇంటర్ చదువుతుండగా... రాహుల్ 9వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం పొలంలో ఉన్న నీటికుంటలో దిగగా, లోతు ఎక్కువగా ఉండడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. స్థానిక రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. -
దళితుల ప్రతిఘటనా పోరాట దిక్సూచి ‘కారంచేడు’
30 ఏళ్ల క్రితం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్‌లోని సంపన్న గ్రామం కారంచేడులో మున్నంగి సువార్త అనే మాదిగ స్త్రీ ఆ ఊరి కమ్మ యువకులపై మంచినీళ్ల బిందెతో దాడిచేసింది. కారణం మాదిగ, మాల పల్లెలు మంచినీళ్లు తాగే చెరువులో ఇద్దరు కమ్మ యువకులు తమ గేదెలు కడుగుతూ, కుడితి నీళ్లను చెరువులో పోయటమే కాకుండా, ప్రశ్నించిన మున్నంగి సువార్తను, చర్నాకోలతో కొట్టారు. దాంతో ఆమె వారికి బిందెతో బుద్ధి చెప్పింది. వేలాది ఎకరాల సుసంపన్న భూములు, రాజకీయ, సినీ, వ్యాపార రంగాలలో కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించిన ప్రముఖులతో పాటు, స్వయానా అప్పటి సీఎం ఎన్.టి.రామారావు వియ్యంకుడు దగ్గుపాటి చెంచురామయ్య స్వగ్రామం అది. ఆ అహంకారమే మాదిగల మంచినీళ్ల చెరువులో గేదెలను కడిగేందుకు పురికొల్పింది. ఈ సంఘటనను కారణంగా చూపి జూలై 17, 1985న వేలాది మంది కమ్మ యువకులు బరిసెలు, గొడ్డ ళ్లు, కత్తులతో మాదిగ పల్లెపై దాడి చేశారు. స్త్రీలపై అత్యా చారాలు చేశారు. విచక్షణ లేకుండా రాక్షసంగా, క్రూరాతి క్రూరంగా వెంటపడి పాశవికంగా దాడి చేశారు. ఈ కులోన్మాద మృగాల దాడిలో దుడ్డు రమేష్, దుడ్డు వంద నం, దుడ్డు అబ్రహాం, తేళ్ల ఎహోషువా, తేళ్లమోఫే, తేళ్ల ముత్తయ్యలు నేలకొరిగారు. కారంచేడు ఘటన భారత దేశాన్ని ఒక కుదుపు కుదిపింది. అప్పటి వరకూ హరి జనులుగా గుర్తింపు పొందిన మాల మాదిగల్ని దళితులు అని పిలవటం ప్రారంభమైంది. కారంచేడు ఘటన తర్వాతే లక్షలాది దళితులు తమ అస్థిత్వం కోసం, హక్కుల కోసం, ఆత్మరక్షణ కోసం పిడికిళ్లు బిగించారు. 1989లో వచ్చిన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు అనేక అస్థిత్వ ఉద్యమాలకు కారంచేడు ఉద్యమ స్ఫూర్తి కారణం. కారంచేడు ఉద్యమమే భారత దేశం గుండెలపై కులం ప్రశ్నను ముద్రించింది. దళితుల సమస్యలన్నింటికీ పరిష్కారం రాజ్యాధికారమే అన్న డా॥అంబేడ్కర్ వాక్కును దళితుల మెదళ్లలో నింపింది. అయితే మహత్తరమైన దళితోద్యమాన్ని నిర్వీర్యం చేసిం ది దళిత నాయకత్వం. కోట్లాది మంది దళితుల ఆశలు నెరవేర్చేందుకు దిక్కు చూపే వేగుచుక్కలా అన్యాయా న్ని, అక్రమాన్ని ఎదుర్కొనేందుకు గర్జించే కోడెవయసు సింహంలా, ఉండాల్సిన దళితోద్యమం నేడు మోడువారి పోయింది. జాతి కోసం ఒక వీరుణ్ణి తయారు చేయలేక పోయింది దళిత నాయకత్వం. ‘నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించం డి.. ఒక పెనుమంటల పెనుగులాటనై మళ్లీ మళ్లీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను!’’ అన్న కలేకూరి కవితా స్ఫూర్తి తో కారంచేడు నెత్తుటి త్యాగాలను స్మరించుకుందాం. దళితోద్యమ విజయాలను దళిత నాయకత్వానికి, విదేశీ నిధులు అడుక్కునే స్వచ్ఛంద సంస్థలకు వదిలేద్దాం. వైఫ ల్యాలకు బాధ్యత వహిద్దాం. మోడువారిన 30 సంవ త్సరాల దళితోద్యమాన్ని సమీక్షించుకుందాం. డా॥అం బేడ్కర్ ఆశయ సాధన కోసం కారంచేడు వీరుల స్ఫూర్తితో ముందుకు కదులుదాం. (వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షులు, మాల మహాసభ) మొబైల్: 92913 65253 -
ఆమెను రక్షించబోయి.. ఈమె కూడా..
మార్కాపురం రూరల్ : పశువులను మేపేందుకు వెళ్లిన ఇద్దరు మహిళలు ప్రమాదవశాత్తు అక్కడి నీటికుంటలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. వృద్ధురాలిని రక్షించబోయిన యువతి కూడా కుంటకు బలైంది. ఈ సంఘటన మండలంలోని తిప్పాయపాలెంలో జరిగింది. వివరాలు.. మండలంలోని మిట్టమీదపల్లెకు చెందిన కుందురు గాలెమ్మ (65), కుందురు లక్ష్మీదేవి (20)లు గేదెలను మేపుకుంటూ తిప్పాయపాలెం వెళ్లారు. ఆ గ్రామ సమీపంలోని జాతీయ రాహదారి పక్కనే ఉన్న బోయర్లకుంట(వాల్మీకి కుంట) వద్దకు వెళ్లారు. నీరు తాగించేందుకు గేదెలను కుంటలోకి తోలారు. మళ్లీ వాటిని బయటకు తోలేందుకు గాలెమ్మ ప్రయత్నించి కుంటలో చిక్కుకుని బయటకు రాలేకపోయింది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన లక్ష్మీదేవి కూడా కుంటలో మునిగి గాలెమ్మతో పాటు ప్రాణాలు కోల్పోయింది. గాలెమ్మ స్వగ్రామం తిప్పాయపాలెం. ఆమె కుమార్తె పద్మావతిని మిట్టమీదపల్లెకు చెందిన వెన్నా సుబ్బారెడ్డికిచ్చి వివాహం చేసింది. అప్పటి నుంచి ఆమె మిట్టమీదపల్లెలోనే కుమార్తె వద్ద ఉంటోంది. కుమార్తె కుటుంబానికి చెందిన గేదెలను మేపుతూ ఉంటోంది. ఈ నేపథ్యంలో కుంటలో మునిగి లక్ష్మీదేవితో పాటు ప్రాణాలు కోల్పోయింది. లక్ష్మీదేవికి వివాహం కాలేదు. తండ్రి పాపిరెడ్డికి ఆమె రెండో కుమార్తె. ఈమెతో పాటు పాపిరెడ్డికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిద్దరి మృతి పట్ల తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. గాలెమ్మ కుమార్తె పద్మావతి దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తోంది. సీఐ శివరామకృష్ణారెడ్డి, రూరల్ ఎస్సై దేవకుమార్‌లు తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
నీటికుంటలో పడి తల్లీకూతురు మృతి
కేవీపల్లి, న్యూస్‌లైన్: నీటికుంటలో పడి తల్లీకూతురు మృతిచెందిన విషాద ఘటన చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం జిల్లేళ్లమంద పంచాయతీ బసన్నగారిపల్లెలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బండారు వెంకట్రమణ గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఇతను కూలిపనికి వెళ్లడంతో భార్య బీ.రూప(35), కుమార్తె శిరీష(10), కుమారుడు శివలు గొర్రెలను మేత కోసమని గ్రామ శివార్లలో తోలారు. మధ్యాహ్నం ఎండతీవ్రత ఎక్కువగా ఉండడంతో గొర్రెలను కడిగేందుకు పక్కనే ఉన్న కంజుమడుగుకు తోలారు. ఆపై వాటిని కడిగి పైకితోలేశారు. గుంటలో నుంచి పైకి ఎక్కేటప్పుడు కుమార్తె శిరీష ప్రమాదవశాత్తు కాలుజారి లోతులో పడిపోయింది. కుమార్తెను రక్షించేందుకు రూప గుంటలోకి దూకేసింది. ఇద్దరూ ఊపిరాడక తల్లడిల్లిపోయారు. గమనించిన శివ బిగ్గరగా కేకలు వేశాడు. గ్రామస్తులు హుటాహుటిన గుంట వద్దకు చేరేలోపే తల్లీకూతురు కన్నుమూశారు.