సాక్షి, మేడ్చల్ : మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పంచాయతీ పరిధిలోని రాంకీ చెత్త డంపింగ్ యార్డ్‌లోని నీటి మడుగులో ఓ బాలుడి మృతదేహం కలకలం రేపింది. శాంతినగర్‌కు చెందిన కృష్ణ కుమారుడు రామకృష్ణ(4)గా అతడిని గుర్తించారు. పదిహేనేళ్ల క్రితం విజయవాడ నుంచి వలస వచ్చిన కృష్ణ, శాంతి నగర్‌లో నివసిస్తూ, చెత్తను సేకరించి జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి బాలుడు కనిపించకుండా పోయాడు.
బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు బాలుడు డంపింగ్ యార్డ్‌కు చెందిన నీటి మడుగులో శవమై తేలాడు. మృత దేహాన్ని మేకలు కాసే వ్యక్తి గుర్తించి బస్తీ వాసులకు తెలపడoతో, వారు పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న జవహర్ నగర్ సీఐ ఉమా మహేశ్వరరావు తన సిబ్బంది తో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ ను రప్పించిన తదనంతరం పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పటల్ కు తరలించారు.
డంపింగ్ యార్డులో బాలుడి మృతదేహం
Published Wed, Nov 22 2017 7:24 PM | Last Updated on Thu, Nov 23 2017 3:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment