dead body found
-
కాలువలో సిక్కిం మాజీ మంత్రి మృతదేహం
గాంగ్టక్: సిక్కిం మాజీ మంత్రి ఆర్సీ పౌడ్యాల్ (80) మృతదేహం పశ్చిమ బెంగాల్లో దొరికింది. సిలిగురి సమీపంలోని తీస్థా కాలువలో మంగళవారం మృతదేహం లభించినట్లు పోలీసులు వెల్లడించారు. చేతి వాచ్, ధరించిన దుస్తుల ఆధారంగా ఆయన్ను గుర్తించారు. మృతదేహం తీస్థా నదిలో కొట్టుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు. పౌడ్యాల్ జూలై 7న తన స్వస్థలమైన పాక్యోంగ్ జిల్లా చోటాసింగ్టామ్లో ఇంటి నుంచి సోదరి వద్దకు బయల్దేరి తిరిగి రాలేదు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి గాలించారు. 9 రోజుల తరువాత ఆయన మృతదేహం లభించింది. పౌడ్యాల్ మృతి పట్ల సీఎం తమాంగ్ సంతాపం వ్యక్తం చేశారు. -
పార్క్‌లో సహాయ కలెక్టర్ సస్మిత డెడ్‌బాడీ.. ఆత్మహత్య లేక హత్యా?
భువనేశ్వర్: అదనపు కలెక్టర్ కార్యాలయంలో సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మహిళ మృతిచెందడం కలకలం సృష్టించింది. ఈ ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. అయితే, ఆమె మృతికి ఒత్తిడే కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. వివరాల ప్రకారం.. రుర్కెలాలో అదనపు కలెకర్ట్ ఆఫీసులో రాజగంగపూర్ ప్రాంతానికి చెందిన సస్మిత మింజ్ (35) సహాయ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే, పార్కులో ఉన్న జలాశయంలో మహిళ మృతదేహం తేలుతూ కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, ఈ నెల 15న సస్మిత విధులకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. 17వ తేదీన ఆమె నగరంలో ఒక హోటల్లో ఉన్నట్లు తెలిసింది. తల్లి, సోదరుడు హోటల్‌కి వెళ్లి ఆమెను కలవాలని ప్రయత్నించినా అందుకు ఆమె నిరాకరించారు. అయితే, కార్యాలయంలో ఒత్తిడి ఎక్కువగా ఉందని, తనకు విశ్రాంతి కావాలని, తాను ఎవరినీ కలుసుకోనని తెలిపారు. ఇదిలా ఉండగా.. మంగళవారం సాయంత్రం పార్కులో ఉన్న జలాశయంలో ఓ మహిళ మృతదేహం తేలుతూ కనిపించడంతో సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అగ్నిమాపక సిబ్బందిని తీసుకుని వచ్చి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. మృతదేహం సహాయ కలెక్టర్‌ది అని గుర్తించారు. జలాశయం తీరంలో ఆమె హ్యాండ్‌బ్యాగ్, చెప్పులు లభించాయి. ఆమె కుటుంబ సభ్యులు మృతి చెందిన సస్మిత మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. అనంతరం, మృతదేహాన్ని పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, అదనపు కలెక్టర్ కార్యాలయంలో కొంతమంది అధికారులు ఆమెను మానసికంగా వేధించడం వల్ల ఆత్మహత్య చేసుకుని ఉంటుందని లేదా హతమార్చి జలాశయంలో విసిరేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. పార్క్ పరిసరాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: యూపీలో మరో ఎన్కౌంటర్.. మహిళా కానిస్టేబుల్‌పై దాడిలో.. -
సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం.. తప్పించుకునే యత్నంలో ఇరుక్కుపోయారు
సాక్షి, హైదరాబాద్/రామ్‌గోపాల్‌పేట: సికింద్రాబాద్ మినిస్టర్స్ రోడ్‌లోని రాధా ఆర్కేడ్‌లో ఉన్న డెక్కన్ కార్పొరేట్ గోడౌన్ అగ్నిప్రమాదంలో గల్లంతైన ముగ్గురిలో ఒకరి మృతదేహానికి సంబంధించిన ఎముకలు, సగం కాలిన పుర్రెను హైదరాబాద్ క్లూస్ టీమ్ శిథిలాల నుంచి రికవరీ చేసింది. గురువారం ఈ ప్రమాదం జరగ్గా శనివారం సాయంత్రం ఇవి లభించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మిగిలిన ఇద్దరు కూడా మృతి చెందే ఉంటారని, వాళ్ల ఎముకలు స్వాధీనం చేసుకోవడం కష్టసాధ్యమని ఓ అధికారి వ్యాఖ్యానించారు. భవనంలోని పరిస్థితులు ఇప్పటికీ నేరుగా అడుగు పెట్టడానికి అనువుగా లేకపోవడంతో విక్టిమ్ లొకేషన్ కెమెరా(వీఎల్సీ)తో కూడిన డ్రోన్ల సాయంతో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. శుక్రవారం వాడిన డ్రోన్‌కు అదనంగా శనివారం మరొకటి వినియోగించగా... ఆదివారం కూడా ఈ గాలింపు ప్రక్రియ జరుగనుంది. లిఫ్ట్ వద్ద షట్టర్ మూసి ఉండటంతో... గోదాములో అగ్నిప్రమాదం జరిగి పొగలు వస్తున్న సమయంలో ఆ సంస్థ ఉద్యోగులైన జునైద్, వశీం, జహీర్ అక్కడే ఉన్నారు. అప్పటికే పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు పైఅంతస్తుల్లో ఇరుక్కున్న నలుగురు కూలీలను రెస్క్యూ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ‘డెక్కన్’ యజమాని ఆదేశాల మేరకు ముగ్గురు ఉద్యోగులు మొదటి అంతస్తులో ఉన్న సరుకు తీసుకురావడానికి లోపలకు ప్రవేశించారు. ఇది జరిగిన కొద్దిసేపటికే పొగతో పాటు మంటలూ ఎక్కువ కావడం.. అవి మొదటి అంతస్తును చుట్టేయడంతో ఆ ముగ్గురూ తప్పించుకోవడానికి భవనం వెనుక వైపున ఉన్న లిఫ్ట్ వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే మొదటి అంతస్తుకు, లిఫ్ట్‌కు మధ్య ఉండే షట్టర్ లాక్ చేసి ఉండటంతో అక్కడే ఉండిపోయి పొగ వల్ల మరణించడమో, లేదా అపస్మారక స్థితిలోకి వెళ్లి సజీవ దహనం కావడమో జరిగి ఉంటుందని అక్కడి పరిస్థితులను పరిశీలించిన అధికారులు చెబుతున్నారు. కూలిన శిథిలాల్లో మరో ఇద్దరి అవశేషాలు... ఈ భవనానికి వెనుక వైపుగా దాదాపు అన్ని ఫ్లోర్లకు సంబంధించిన శ్లాబ్స్ కూలిపోయాయి. మొదటి అంతస్తులో ఉన్న షట్టర్ వద్దా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. షట్టర్ పక్కన గోడ వద్ద ఉన్న యువకుడి మృతదేహంపై శ్లాబ్ ముక్కలు పడటంతో స్వాధీనం చేసుకున్న ఎముకలు మాత్రమే మిగిలాయని అధికారులు చెప్తున్నారు. మిగిలిన ఇద్దరూ చనిపోయే ఉంటారని, వారి ఎముకలు వంటి అవశేషాలు శకలాల్లో పడిపోయి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఆదివారం వీటి కోసం గాలించాలని భావిస్తున్నారు. ఈ అవశేషాలను బయటకు తీసుకురావడానికి క్లూస్ టీమ్‌తో పాటు డీఆర్ఎఫ్ అధికారులు తీవ్రంగా శ్రమించారు. సిటీ క్లూస్‌టీమ్ అధికారులు తమ వద్ద ఉన్న 3డీ స్కానర్‌తో భవనాన్ని విశ్లేషించారు. ఆపై భవనం ఎడమ వైపున ఉన్న సందు నుంచి వెనక్కు వెళ్లారు. అక్కడ కిటికీ సహాయంతో లోపలకు వెళ్లి సగం పడిపోయిన గ్రిల్ ఎక్కడం ద్వారా మొదటి అంతస్తునకు చేరుకున్నారు. అక్కడ శనివారం సాయంత్రానికి కూడా వేడిగానే ఉండటం గమనార్హం. డీఎన్ఏ పరీక్షలకు మాంసం, ఎముకలు.. ఈ అవశేషాలను శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో క్లూస్ టీమ్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వెంకన్న, లాలాపేట క్లస్టర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంజయ్ సేకరించారు. వీటిని తొలుత గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. స్వాధీనం చేసుకున్న వాటిలో సగం కాలిన పుర్రె, కాళ్లు, చేతులకు సంబంధించిన కీలు, తొడ ఎముకలు ఉన్నాయి. తొడ ఎముక వద్ద కొంచెం కాలిన మాంసం కూడా లభించింది. దీన్ని సేకరించి డీఎన్ఏ పరీక్షలకు పంపనున్నారు. ఇప్పటికే ఆ ముగ్గురి బంధువులు నగరానికి చేరుకోవడంతో వారి నుంచి నమూనాలు తీసి ఆ మాంసంతో పోల్చనున్నారు. ఈ నివేదిక వచ్చిన తర్వాతే అది ఎవరి మృతదేహానికి సంబంధించినదో తేలుతుందని నిపుణులు చెప్తున్నారు. ‘చెల్లా చెదురుగా దొరికిన ఎముకలు తదితరాలు కూడా 80 శాతం కాలిపోయాయి. గట్టిగా పట్టుకుంటే బూడిదలా మారేలా ఉన్నాయి. ఒకటి రెండు రోజుల్లో డీఎన్ఏ నివేదిక వస్తుంది’ అని డాక్టర్ వెంకన్న తెలిపారు. భవనం లోపల ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మరో ఇద్దరికి సంబంధించిన అవశేషాలైనా దొరుకుతాయా లేదా అనే సందేహాలూ నెలకొన్నాయి. -
తమిళ్‌సెల్వి అదృశ్యం కేసు విషాదాంతం.. అస్థిపంజర స్థితిలో మృతదేహం
సాక్షి, చెన్నై/తిరుపతి: తమిళనాడుకు చెందిన తమిళ్‌సెల్వి అదృశ్యం కేసు విషాదంగా ముగిసింది. నారాయణవనం కైలాసనాథకోన అడవిలో శవమై కనిపించింది. కట్నం కోసం వేధించి, అందుకు భార్య అంగీకరించిక పోవడంతో హత్య చేశాడు. ఆపై తప్పించుకోవాలని చూశాడు. తమిళ్‌సెల్వి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. వివరాలు ఇలా.. తమిళనాడు రాష్ట్రం చెన్నై సమీపంలోని పుజిల్‌కు చెందిన తమిళ్‌సెల్వి(18) ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దనే ఉంటోంది. చెన్నై రెడ్‌హిల్స్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్న మదన్ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. మూడేళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. కొంత కాలం పాటు సంసారం సజావుగా సాగింది. వరకట్నం తేవాలంటూ మదన్ తరచూ భార్యను వేధించేవాడు. ఈ నేపథ్యంలో జూన్ 25న తమిళ్‌సెల్విని తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలోని కైలాసనాథకోనకు తీసుకొచ్చాడు. కత్తితో పొడిచి హతమార్చాడు. అయితే చాలా కాలంగా కుమార్తె కనిపించకపోవడంతో తమిళ్‌సెల్వి తల్లిదండ్రులు బల్గిత్, మాణిక్యం రెడ్‌హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితం లేకపోవడంతో మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం ఆదేశాలతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా మదన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో తమదైన శైలిలో విచారణ చేశారు. చదవండి: ప్రేమ పెళ్లి, మూడేళ్లు సంసారం.. బయటకు వెళ్దామని తీసుకెళ్లి.. దీంతో అసలు విషయం బయటపడింది. ఆదివారం తమిళనాడు పోలీసులు నారాయణవనం పోలీసుల సహాయంతో కైలాసనాథకోనలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. జూన్ 23వ తేదీ వీరిద్దరూ కొండపైకి వెళ్లినట్లు, కొంత సమయానికి మదన్ ఒక్కడే కొండ నుంచి కిందకు వచ్చి మోటార్‌సైకిల్‌పై వెళ్లినట్లు గుర్తించారు. స్థానికుల సాయంతో గాలించగా అస్థిపంజర స్థితిలో తమిళ్‌సెల్వి మృతదేహం కనిపించింది. పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగిస్తామని నారాయణవనం ఎస్ఐ పరమేశ్‌నాయక్ తెలిపారు. కాగా మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి వివాహం చేసుకోవడమే కాకుండా తాగుడు, గంజాయికి బానిసైన మదన్‌ను కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిడండ్రులు కోరారు. -
అబ్దుల్లాపూర్ మెట్లో దారుణం.. జంట మృతదేహాల కలకలం
సాక్షి, హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జంట మృతదేహాల కలకలం చోటుచేసుకుంది. కొత్తగూడెం బ్రిడ్జ్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ యువతి, యువకుడి మృతదేహాలు లభ్యమయ్యాయి. నగ్నంగా మృతదేహాలు ఉన్నాయి. గుర్తు పట్టడానికి వీలులేకుండా శవాలు కుళ్లిన స్థితిలో ఉన్నాయి. ఏకాంతంగా ఉన్న జంటను దుండగులు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం మృతులు కవాడిగూడకు చెందిన వారుగా సమాచారం. మృతి చెందిన యువకుడిని యశ్వంత్, యువతిని జ్యోతిగా గుర్తించారు యువతి ముఖం గుర్తు పట్టడానికి వీల్లేకుండా ఉంది. సంఘటన స్థలానికి కొద్దిదూరంలోనే హోండా యాక్టివాను పోలీసులు గుర్తించారు. యువతీయువకులు హత్యకు గురయ్యారా? లేక బలవన్మరణానికి పాల్పడ్డారా? మరేదైనా ప్రమాదమా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మూడు రోజుల క్రితం జరిగిందని అనుమానిస్తున్నారు. -
యూపీలో సంచలనం.. ఆయన ఫామ్ హౌస్ వద్ద యువతి మృతదేహం..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో గురువారం నుంచి అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైన విషయం తెలిసిందే. యూపీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఓ సంచలన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కాన్పూర్‌కు చెందిన ఓ వ్యాపారి ఇంట్లో కోట్ల రూపాయల డబ్బును అధికారులు సీజ్ చేసిన ఘటన మరువక ముందే మరో వార్త దుమారం రేపుతోంది. యూపీ మాజీ మంత్రి కుమారుడికి చెందిన ఆశ్రమం దగ్గరలో గురువారం కుళ్లిపోయిన స్థితిలో మెడ కోసి ఉన్న ఓ యువతి మృతదేహం దొరకడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై ఉన్నావ్ ఎస్పీ శశి శేఖర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉన్నావ్‌లో యువతి(22) కనిపించడంలేదంటూ డిసెంబర్ 8వ తేదీన ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో డిసెంబర్ 10న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు వెల్లడించారు. కేసు విచారణలో భాగంగా ఓ వ్యక్తి అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అలాగే దర్యాప్తులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)కి చెందిన దివంగత మాజీ మంత్రి ఫతే బహదూర్ సింగ్ కుమారుడు రాజోల్ సింగ్‌ను జనవరి 24న అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. చదవండి: హిజాబ్ అంశాన్ని పెద్దది చేయకండి: సుప్రీం కోర్టు అయితే తాజాగా యువతి మృతదేహాన్ని రాజోల్ సింగ్ ఆశ్రమం సమీపంలో స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం శుక్రవారం యువతి మెడ భాగంగా కట్ చేసి ఉన్నట్టు నివేదికలో వెల్లడించారు. ఇదిలా ఉండగా.. బాధితురాలి తల్లి విలేకరులతో మాట్లాడుతూ.. తన కుమార్తెను రాజోల్ సింగ్ అతని ఆశ్రమంలో చంపి పాతిపెట్టాడని ఆరోపించారు. వారిపై అనుమానంతోనే తాను ఆశ్రమానికి వెళ్లి అక్కడ కొంత స్థలం తనిఖీ చేసినట్టు వెల్లడించారు. ఈ విషయంలో తనకు పోలీసులు సహకరించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సరైన సమయంలో స్పందించి ఉంటే తన కుమార్తె బతికుండేదని కన్నీటిపర్యంతమయ్యారు. చదవండి: మోదీలు, ఈడీలు, సీబీఐలు నన్ను భయపెట్టలేవు -
హైదరాబాద్: వాటర్ ట్యాంక్‌లో డెడ్‌బాడీ కలకలం..ఆందోళనలో జనం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌లో ఓ మృతదేహం కలకలం రేపుతోంది. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హరినగర్ రీసాలగడ్డ వాటర్ ట్యాంక్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేయడానికి వచ్చిన వాటర్ వర్క్స్ సిబ్బందికి మృతదేహం కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చదవండి: నన్ను ఎందుకు కొట్టావు? పోలీసులకు చుక్కలు చూపించిన వ్యక్తి మంచి నీటి ట్యాంకులో లభించిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వ్యక్తి ప్రమాదవశాత్తూ వాటర్ ట్యాంక్‌లో పడి ఉంటాడా? లేక ఎవరన్నా హత్య చేసి వాటర్ ట్యాంక్‌లో పడేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం విషయం తెలియడంతో సంఘటన స్థలం వద్దకు స్థానికులు భారీ ఎత్తున్న చేరుకున్నారు. కాగా గత కొన్ని రోజులుగా వాటర్ ట్యాంక్‌లోని నీటిని తాగిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చదవండి: డ్రంకెన్ డ్రైవ్.. రక్తంలో ఆల్కహాల్‌ని ఎలా లెక్కిస్తారు? -
బంజారాహిల్స్: గుర్తు తెలియని మృతదేహం లభ్యం
సాక్షి, బంజారాహిల్స్: ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన బంజారాహిల్స్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం. 2 ఇందిరానగర్–కృష్ణానగర్ మెయిన్ రోడ్డులోని గ్రీన్ బావర్చి హోటల్ వద్ద ఫుట్‌పాత్‌పై ఓ మృతదేహం పడి ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకుని చుట్టూ పక్కల ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో దీంతో గుర్తు తెలియని మృతదేహం కింద కేసు నమోదు చేసుకున్నారు. సంబం«దీకులు ఎవరైనా ఉంటే 9490549778 నంబర్‌ను సంప్రదించాలన్నారు. చదవండి: కుత్బుల్లాపూర్: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం -
కారుని దగ్ధం చేసిన దుండగులు.. డిక్కీలో డెడ్‌బాడీ
సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో గుర్తు తెలియని దుండగులు మంగళవారం తెల్లవారు జామున కారుని తగలబెట్టేశారు. దగ్ధమైన కారుని పరిశీలించగా డిక్కీలో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. కారుతోపాటు గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం కాలిపోయి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహం ఎవరిదన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మంటల్లో కాలిబూడిదైన కాగా TS 05 EH 4005 అనే నెంబర్ ప్లేట్ కలిగి ఉంది. కామారెడ్డి జిల్లా పిట్లం గ్రామానికి చెందిన ధర్మకారి శ్రీనివాస్‌రెడ్డిదిగా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ నిన్న స్వగ్రామం నుంచి హైద్రాబాద్ వచ్చాడు. అయితే శ్రీనివాస్ మొబైల్ రాత్రి నుంచి స్విచ్చాఫ్‌లో ఉందని అతని భార్య తెలిపింది. కారులోని మృతదేహం ఎవరిదనే విషయంపై ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. విచారణ కొనసాగుతోంది. -
విషాదం: అదృశ్యమైన సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతదేహం లభ్యం
సాక్షి, కామారెడ్డి: అదృశ్యమైన సాఫ్ట్వేర్ ఉద్యోగి రాజేష్ మృతదేహం లభ్యమైంది. మాచారెడ్డి మండలం ఇసాయిపేట శివారులో రాజేష్ మృతదేహం లభ్యమైంది. హత్య లేక ఆత్మహత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అరుణ మృతదేహం లభ్యం; రైతుల ఆవేదన
సాక్షి, మనూరు(నారాయణఖేడ్): నాలుగు రోజుల క్రితం తాను మంజీరా నదిలో దూకి చనిపోతున్నాని సంగారెడ్డి రైతు శిక్షణ కేంద్రంలో ఏఓగా పనిచేస్తున్న అరుణ(34) తన కుటుంబీకులకు తెలిపిన సంగతి తెలిసిందే. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసు యంత్రాంగం నదిలో ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని శనివారం సాయంత్రం రప్పించి నదిలో వెతకడం ప్రారంభించగా ఆదివారం ఉదయం రెండు బృందాలతో నదిలో దిగువ, ఎగువ ప్రాంతంలో ప్రత్యేక బోటుల ద్వారా గాలించారు. దీంతో రాయిపల్లి వంతెన వద్ద ఎగువన సిరూర్, పాంపడ్ శివారులో తేలిన మృతదేహాన్ని కనుగొన్నారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకురావడంతో నాలుగు రోజుల ఉత్కంఠకు తెరపడింది. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించి శవాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. అంత్యక్రియలు వారి స్వస్థలమైన నాగల్గిద్ద మండలం మోర్గి గ్రామంలో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. మృతురాలి తమ్ముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జహీరాబాద్ డీఎస్పీ శంకర్రాజు, ఖేడ్ సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్ఐ నరేందర్‌లు పేర్కొన్నారు. గాలింపు చర్యల్లో రాయికోడ్, నాగల్గిద్ద ఎస్ఐలు ఏడుకొండలు, శేఖర్లు మూడురోజులగా పాల్గొని పర్యవేక్షించారు. చదవండి: మంజీరలో ఏఓ గల్లంతు? కుటుంబ సభ్యుల వేధింపులు, ఆర్థిక ఇబ్బందులే కారణం మృతికి గల కారణం ఆమె కుటుంసభ్యుల వేధింపులేనని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చే శారు. గత కొన్నాళ్లుగా అరుణ భర్త హోటల్ బిజినెస్‌లు నిర్వహించి నష్టపోవడంతో అరుణ బ్యాంకు నుంచి హౌసింగ్ లోన్ సైతం తీసుకోవడం జరిగిందన్నారు. అయినా కూడా భర్త శివశంకర్‌తోపాటు కుటుంబీకుల వేధింపులు భరించకపోవడంతో ఇలాంటి సంఘటనకు ఒడికట్టిందని కన్నీటి పర్యంతమయ్యారు. ఆవేదన వ్యక్తం చేసిన ఖేడ్ ప్రాంత రైతులు.. నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో అరుణ గతంలో వ్యవసాయ అధికారిగా పనిచెయ్యడంతో ఇక్కడి రైతులతో ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎళ్లవేళలా రైతలుకు అందుబాటులో ఉంటూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈమె ప్రాథమిక విద్యాభ్యాసం ఖేడ్‌లోని ప్రగతి విద్యానిలయం పాఠశాలల్లో జరిగింది. ఎంసెట్ రాసి అగ్రికల్చర్ బీఎస్సీ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో చేసిన అనంతరం 2009లో జోగిపేట్‌లో ఏఈఓగా 2010లో ఏఓగా కల్హేర్ పోస్టింగ్ రాగా కంగ్టి, మనూరు మండలాల ఇన్చార్జిలుగా వ్యవహరించడం జరిగింది. 2018లో సంగారెడ్డికి వెళ్లి అక్కడ రైతు శిక్షణ కేంద్రంలో విధులను నిర్వహించారు. ఏఓ కుటుంబ సభ్యులకు పరామర్శ నారాయణఖేడ్: మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న రైతు శిక్షణా కేంద్రం ఏఓ అరుణ కుటుంబ సభ్యులను జిల్లా వ్యవసాయశాఖ జేడీఏ నర్సింహారావు, వ్యవసాయశాఖ ఉద్యోగుల సంఘం నాయకులు వైద్యనాథ్, వ్యవసాయ సిబ్బంది, ఆమ్ఆద్మీ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బోర్గి సంజీవులు పరామర్శించి ఓదార్చారు. అభినందించిన డీఎస్పీ రాయికోడ్(అందోల్): మండల శివారులోని మంజీర నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఏఓ అరుణ మృతదేహాన్ని ఆదివారం మండలంలోని పాంపాడ్ శివారులో గుర్తించి ఒడ్డుకు తెచ్చారు. మృతదేహం కోసం గత నాలుగు రోజులుగా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో సాహసంగా కృషి చేసిన స్థానిక మత్స్యకారులు, ఎన్డీఆర్ఎఫ్, తెలంగాణ టూరిజం శాఖ, అగ్నిమాపక తదితర శాఖల సిబ్బందిని జహీరాబాద్ డీఎస్పీ శంకర్‌రాజ్ శాలువాతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ చంద్రయ్య, బాసిత్ పటేల్, ఆయా శాఖల సిబ్బంది, మత్స్యకారులు ఉన్నారు. -
ఇటలీ పోలీసులను కలవరపెడుతోన్న మృతదేహం
రోమ్: ఓ తల్లి తన బిడ్డను తీసుకుని షాపింగ్‌కని వెళ్లింది. ఐదు రోజుల తర్వాత శవమై కనిపించింది. ఆమెతో పాటు వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి ఆచూకీ తెలియలేదు. ప్రస్తుతం ఇటలీ పోలీసులు ఆ చిన్నారి కోసం వెతుకుతున్నారు. వివరాలు.. వివియాని పారిసి(43) అనే మహిళ ఈ నెల 3న నాలుగేళ్ల తన కొడుకు జియోలేకి షూస్ కొనడం కోసం మెస్సినా వెళుతున్నాను అని తన భర్తకు చెప్పి.. కొడుకును తీసుకుని ఇంటి నుంచి వెళ్లింది. అయితే వెళ్లే దారిలో రోడ్డు రిపేర్ ఉండటంతో సిసిలీలోని మోటార్వే దారి గుండా వెళ్లింది. ఐదు రోజుల తర్వాత ఆమె మృతదేహం కరోనియా పట్టణం సమీపంలోని ఓ అడవిలో కుళ్లిన స్థితిలో లభ్యమయ్యింది. ఆమెతో పాటు వెళ్లిన నాలుగేళ్ల జియోలే ఆచూకీ కోసం ప్రస్తుతం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. (30 నిమిషాల్లో హ్యాకింగ్, విస్తుపోయే నిజాలు!) ఈ క్రమంలో ఓ అధికారి మాట్లాడుతూ.. ‘కొందరు పారిసి చేతిలో పిల్లడిని చూశామని చెప్పారు. మరి కొందరు ఆమె ఒంటరిగా నడిచి వెళ్లడం చూశామన్నారు. పారిసి చెయ్యి దారుణంగా విరిగిపోయింది. ఇది తప్ప ఆమె శరీరం మీద ఇంకా ఎలాంటి గాయాలున్నాయో తెలీడం లేదు. ఆమె గొంతు కోసి చంపి ఉంటారనే అనుమానం ఉంది. కానీ శరీరం తీవ్రంగా కుళ్లిపోవడం చేత ప్రస్తుతానికి ఏం చెప్పలేకపోతున్నాం. పోస్టుమార్టం రిపోర్టు వస్తే ఏం జరిగిందనేది తెలుస్తుంది. ఇక ఆమె పిల్లాడు జియోలే తప్పి పోయి అయినా ఉండాలి. లేదా దుండగులు ఆమెను హత్య చేసి పిల్లాడిని లాక్కెళ్లి ఉంటారని అనుమానిస్తున్నాం. ప్రస్తుతం జియోలేని క్షేమంగా తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అన్నారు. ప్రస్తుతం ఈ కేసు ఇటలీలో సంచలనం రేపుతోంది. పోలీసుల తీరు పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జియోలే తండ్రి డేనియల్ మొండెలో మీడియాతో మాట్లాడుతూ తన భార్య డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలిపాడు. ఇది కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల అది తీవ్రతరం అయ్యిందన్నాడు. అయితే పారిసి ఎవరికి హాని కలిగించదని ఆమె స్నేహితులు మీడియాకు తెలిపారు. -
మానవత్వం వర్షార్పణం
ఎంజీఎం: కరోనా పుణ్యమా అని మానవత్వం మంటగలుస్తోంది. ఆస్పత్రి ఆవరణలో ఓ మృతదేహం గంటల తరబడి వర్షంలో తడుస్తున్నా.. ఎవరూ పట్టించుకోని అమానవీయ ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. హన్మకొండకి చెందిన ఏనబోతుల స్వరాజ్యలక్ష్మి (68)ని ఆమె బంధువులైన ఇద్దరు మహిళలు సోమవారం మధ్యాహ్నం ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమె శ్వాసకోశ వ్యాధితో బాధ పడుతుండటంతో కోవిడ్ వార్డుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడ పరీక్షిం చగా.. కోవిడ్ లక్షణాలు లేవని తేలడంతో క్యాజువాలిటీ విభాగానికి తరలించారు. చికి త్స పొందుతున్న క్రమంలో స్వరాజ్యలక్ష్మి పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతదేహాన్ని వైద్య సిబ్బంది క్యాజువాలిటీ ప్రాంగణం వరకు తీసుకొచ్చి వదిలిపెట్టారు. కాగా, స్థానికుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో స్వరాజ్యలక్ష్మి బం ధువులైన ఇద్దరు మహిళలు అక్కడి నుంచి దూరంగా వెళ్లి.. కుటుంబసభ్యులకు ఫోన్లు చేస్తూ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించారు. ఆ సమయంలో మృతదేహం కాజ్యు వాలిటీ వద్దే ఆరు బయట ఉండగా వర్షం మొదలైంది. వెంట వచ్చిన వారు దగ్గర లేక, సిబ్బంది పట్టించుకోక రెండు గంటలపాటు మృతదేహం వర్షంలో తడిసిపోయింది. చివరకు అంత్యక్రియల ఏర్పాట్లు పూర్తయ్యాక మృతదేహాన్ని తీసుకెళ్లారు. -
ఎవరిదీ శవం?
రాంగోపాల్‌పేట్: రైల్వే పట్టాల పక్కన పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి రైల్వే పట్టాల పక్కన పడేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో నాలుగు రోజుల క్రితమే ఆ వ్యక్తి చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెల 2న బన్సీలాల్‌పేట్‌కు చెందిన యువకుడు మిస్సింగ్ కావటంతో ఈ మృతదేహం అతనిదేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. బైబిల్ హౌజ్ ప్రాంతంలోని రైల్వే పట్టాలకు దూరంగా చెట్ల పొదల్లో ఓ మృతదేహం పడి ఉందన్న సమాచారంతో మహంకాళి, గాంధీనగర్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిర్మానుష్య ప్రదేశం కావడం, పూర్తిగా చీకటిగా ఉండటంతో మృతదేహాన్ని గుర్తించడం కష్టం కావడంతో పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించలేదు. మృతదేహాన్ని తరలించడం కూడా కష్టంగా ఉండటంతో అక్కడే ఉంచారు. గురువారం ఉదయం మృతదేహాన్ని తరలిస్తామని పోలీసులు చెప్పారు. గత నెల 31 నుంచి బన్సీలాల్‌పేట్‌కు చెందిన ఓ యువకుడు మిస్సింగ్ అయ్యాడు. అతని బంధువులు ఈ నెల 2న గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కనిపించకుండా పోయిన రోజు ఆ యువకుడు అదే ప్రాంతానికి చెందిన నలుగురు యువకులతో కలిసి ఉండటం గమనించిన స్థానికులు, బంధువులు పోలీసులకు ఈ విషయం చెప్పారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నిందితులను బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో బన్సీలాల్‌పేట్‌లో చంపేసి రైల్వే పట్టాల పక్కన పడేసినట్లు చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే మహంకాళి ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాస్, చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్‌లు అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
చేతిని నరికి ప్రేయసి ఇంటి ముందు..
సాక్షి, క్రిష్ణగిరి: క్రిష్ణగిరి సమీపంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన దుండగుడు అతని చేతిని నరికి గోనెసంచిలో వేసుకుని తీసుకెళ్లి ప్రేయసి ఇంటి ముందు పడేసి వెళ్లిన ఉదంతం చోటు చేసుకుంది. వివరాల మేరకు.. వేలూరు జిల్లా వాలాజ ప్రాంతానికి చెందిన తమిళరసన్‌కు క్రిష్ణగిరి భారతీనగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం ఉండేది. మంగళవారం రాత్రి క్రిష్ణగిరికి వచ్చిన ఇతడు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి అతని చేతిని గోనెసంచిలో వేసుకుని ప్రేయసి ఇంటి ముందు పడేసి వెళ్లాడు. (కొద్ది సేపట్లో భర్త రెండో పెళ్లి.. ) విషయం తెలుసుకొన్న క్రిష్ణగిరి తాలూకా పోలీసులు చేతిని స్వాధీనపరుచుకొని శవం కోసం గాలించగా గిడ్డంబట్టి వద్ద ప్రైవేట్ ఆస్పత్రి పక్కన శవం కనిపించింది. పోలీసులు శవాన్ని స్వాదీనపరుచుకొని విచారణ జరుపగా తమిళరసన్ ఇంతకు ముందే రౌడీగా ఉన్నట్లు కేసులు నమోదయ్యాయని, క్రిష్ణగిరిలోని రౌడీలతో అతనికి సంబంధం ఉన్నట్లు తెలిసింది. దారుణహత్యకు గురైన వ్యక్తి ఆచూకీ తెలియలేదని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితున్ని పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. (భర్త హత్యకు పక్కాగా స్కెచ్) -
కృష్ణానదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
సాక్షి, అచ్చంపేట : కృష్ణానదిలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎడమ పాతాళగంగ వద్దనున్న మత్స్యకారులు నదిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి వెంటనే అమ్రాబాద్ పోలీసులకు సమాచారం తెలియపరిచారు. దీంతో అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు, అమ్రాబాద్ సీఐ బీసన్న, ఈగలపెంట ఎస్ఐ వెంకటయ్య పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో పంచనామా చేసి దో మలపెంటలోని శ్మశాన వాటికలో ఖననం చేశామన్నారు. మృతుడు బ్లూకలర్ షర్టు, బ్లాక్ ప్యాంట్ ధరించి ఉన్నాడని, వయస్సు 38– 40 ఏళ్లు, 5.7 అడుగుల ఎత్తు ఉన్నాడన్నారు. ఎక్కడైనా మిస్సింగ్ కేసు ఉంటే పోలీసులను సంప్రదించాలని కోరారు. కాగా శ్రీశైలం ఆ నకట్ట దిగువన గత శనివారం కృష్ణానది వంతెనపై కలకలం రేపిన రక్తపు మరకలకు సంబంధించి గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని హత్య చేసి కృష్ణానదిలో పడేసి ఉం టారని పోలీసులు అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. (చదవండి : కృష్ణానది బ్రిడ్జిపై రక్తపు మరకలు) -
కుందూలో మూడో మృతదేహం లభ్యం
సాక్షి, కడప(రాజుపాళెం) : మండలంలోని కుందూనదిలో గాదెగూడూరుకు చెందిన కాకనూరు వెంకటలక్షుమ్మ (45) మృతదేహాన్ని సోమవారం సాయంత్రం కనుగొని ఒడ్డుకు చేర్చారు. ఇప్పటికే కాకనూరు తిరుపతిరెడ్డి, ఆయన కుమార్తె కాకనూరు ప్రవళిక మృతదేహాలను పోలీసులు కుందూనదిలో కనుగొన్న విషయం తెలిసిందే. గత గురువారం మండలంలోని గాదెగూడూరు గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఈముగ్గురు అదృశ్యంపై రాజుపాళెం ఎస్ఐ లక్ష్మీప్రసాదరెడ్డి మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూలూరు–కొట్టాల గ్రామాల మధ్య తిరుపతిరెడ్డి ద్విచక్ర వాహనం ఉండటంతో ఈ ముగ్గురు కుందూనదిలో దూకి ఉండవచ్చునని అనుమానంతో పోలీసులు నదిలో తెప్పల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఐదు రోజులుగా ఎస్ఐ లక్ష్మీప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో మైదుకూరు మండలంలోని ఏకర్లపాళెంకు చెందిన గజ ఈతగాళ్లు, కర్నూలుకు చెందిన ఎస్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు, రాజుపాళెం ఏఎస్ఐ సుబ్బారెడ్డి, పోలీసులు చంద్రానాయక్, ఓబులేసు కుందూనదిలో వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ కష్టపడి ముగ్గురి మృతదేహాలను కనుగొన్నారు. ఆ మృతదేహాలు కుందూలో లభ్యం కావడంతో తిరిగి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేపడతామన్నారు. ప్రజల నుంచి ఎస్ఐ, పోలీసులకు ప్రశంసలు.. కాకనూరు తిరుపతిరెడ్డి, ఆయన భార్య వెంకటలక్షుమ్మ, కుమార్తె ప్రవళిక మృతదేహాలను కుందూనదిలో నీటి ఉధృతి అధికంగా ఉన్నా కష్టపడి ఐదురోజులుగా గజ ఈతగాళ్ల సాయంతో వెలికితీయడంతో ప్రజలు పోలీసుల తీరును ప్రశంసిస్తున్నారు. -
శునక విశ్వాసం; యజమాని మృతదేహం లభ్యం
సాక్షి, పాడేరు(విశాఖపట్టణం) : విశాఖ ఏజెన్సీలో భారీ వర్షాల కారణంగా మత్స్యగెడ్డలో గల్లంతైన గిరిజనుడి ఆచూకీ కొన్ని రోజుల తర్వాత అతని పెంపుడు కుక్క కారణంగా లభ్యమైంది. పాడేరు మండలం పాతరపుట్టుకి చెందిన లక్ష్మయ్య 20 రోజుల క్రితం వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న సమయంలో మత్స్యగెడ్డ ప్రవాహానికి కొట్టుకుపోయాడు. కుటుంబ సభ్యులు మృతదేహం కోసం ఎంత గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. కాగా అతడి పెంపుడు కుక్క మాత్రం పట్టు వదలకుండా గాలిస్తూనే ఉంది. చివరికి వరద ఉధృతి తగ్గడంతో మంగళవారం మధ్యాహ్నం ఇసుక దిబ్బల్లో కూరుకుపోయిన లక్ష్మయ్య మృతదేహం జాడ కనుక్కుంది. కాళ్లతో అతడి చొక్కాను బయటకు లాగే ప్రయత్నం చేసింది. వెంటనే దుర్వాసన రావడంతో కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని ఆర్ఐ వెంకటరమణ, వీఆర్ఏ సింహాచలానికి చేరవేశారు. పెంపుడు కుక్క పుణ్యమా అని ఎట్టకేలకు మృతదేహం లభ్యమైంది. అయితే వ్యక్తి చనిపోయాడన్న వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. -
అనుమానం నిజమే..
సాక్షి,దర్మసాగర్:అనుమానం నిజమైంది.అర్బన్‌జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రానికి సమీపంలోని వ్యవసాయబావిలో శనివారం గుర్తించిన టార్పాలిన్ కవర్లో ఉన్నది మృతదేహమేనని తేలింది.ఆదివారం ధర్మసాగర్ పల్లెబండ సమీపంలోని రైతు కొట్టె విజయభాస్కర్ వ్యవసాయబావిలో మృతదేహం లభ్యమవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని సుమారు 30– 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తిని దుండగులు పదునైన ఆయుధంతో విచక్షణ రహితంగా శరీరంలోని వివిధ భాగాలపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని బెడ్‌షీడ్(చీరలతో కుట్టినబొంత)లో చుట్టి దానిపై నుంచి టార్పాలిన్ కవర్లో ప్యాక్ చేశారు. అనంతరం దాని వెనుక పొడవైన బరువు ఉన్న బండరాయితో కట్టి వ్యవసాయ బావిలో పడవేశారు. కాగా మృతదేహాన్ని వ్యవసాయబావిలో పడేసి వారం రోజుల పైనే అవుతుందని పోలీసులు అభిప్రాయపడ్డారు. మృతుడి ఒంటిపై ఫుల్‌హ్యాండ్స్ షర్ట్, మొకాలివరకు ఉన్న గుడ్డతోపాటు, మృతుడి జేబులో బీడీకట్ట, అగ్గిపెట్టె ఉన్నాయి. ఇరవైనాలుగు గంటల తర్వాత మృదేహం వెలికి... దారుణహత్యకు గురైన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికుల సహకారంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది ఇరవైనాలుగు గంటల పాటు కష్టపడిపైకి తీశారు. కాజీపేట ఏసీపీ నర్సింగరావు, ఎల్కతుర్తి ఎస్సై శ్రీనివాస్ జీ, ఎస్సై కరీం, వేలేరు ఎస్సై వీరభద్రరావు ఉదయం ఘటనా స్థలానికి క్రేన్‌ను తెప్పించి తాళ్లతో బయటకు తీసేందుకు చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అనంతరం హన్మకొండ ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించగా జిల్లా ఫైర్ అధికారి భగవాన్ రెడ్డి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు నాగరాజులు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి సుచనల మేరకు బావిలోని నీటిని పూర్తిగా బయటకు తోడేసి, క్రేన్ సాయంతో నిచ్చెనను బావిలోకి దింపారు. అనంతరం గ్రామానికి చెందిన చిలుక రవీందర్, కొట్టె ప్రభాకర్‌లను ఆక్సిజన్ మాస్క్ వేసి బావిలోకి పంపించారు. వీరిద్దరు సుమారు అరగంటపాటు కష్టపడి మృతదేహాన్ని తాళ్లతో కట్టి బయటకు తీశారు. మృతుడి వివరాలు తెలుసుకుని హత్య కేసును చేధించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని కాజీపేట ఏసీపీ నర్సింగరావు తెలిపారు. వరుస ఘటనలతో భయాందోళన.. ధర్మసాగర్ మండల పరిధిలో కొద్ది నెలల వ్యవధిలోనే వరుస హత్యలు చోటు చేసుకోవటంతో మండల వాసులు భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో ముప్పారం శివారులో హత్యతోపాటు, మండలంలోని నారాయణగిరి గ్రామానికి చెందిన మరో వ్యక్తి వేలేరు సమీపంలో పట్టపగలే దారుణహత్యకు గురయ్యారు. కాగా ప్రస్తుతం మృతదేహం బయటపడిన వ్యవసాయబావిలో మూడు కిలో మీటర్లదూరంలో సుమారు ఎనిమిది నెలల క్రితం ఓ యువతి మృతదేహం సైతం బయటపడగా ఇప్పవరకు ఆ మృతురాలి వివరాలు సైతం తెలియరాలేదు. ఇప్పటికైనా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుని మరోసారి ఇటువంటి ఘటనలు జరుగకుండా చూడాలని, ఇప్పటి వరకు జరిగిన హత్యలకు కారణమైన వారిని గుర్తించి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. -
వ్యక్తి మృతదేహం గుర్తింపు
నెల్లూరు ,నాయుడుపేట: మండల పరిధిలోని స్వర్ణముఖి నది వద్ద ఉన్న వంతెన కింద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గురువారం మున్సిపల్ సిబ్బంది గుర్తించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్వర్ణముఖి నదిలో వంతెన వద్ద తాగునీటి మోటార్ మరమ్మతులకు గురై ఉండడంతో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు తన సిబ్బందితో గురువారం అక్కడికి వెళ్లారు. ఈక్రమంలో వ్యక్తి మృతదేహాన్ని చూసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, సబ్ ఇన్స్పెక్టర్ జి.వేణు, హెడ్‌కానిస్టేబుల్ తిరుపతిరావులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చుట్టుపక్కల గాలించినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడు బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగించేవాడని పోలీసులు గుర్తించారు. ఎండవేడిమికి తట్టుకోలేక మృతిచెంది ఉండొచ్చని భావిస్తున్నారు. వీఆర్వో నాగార్జునరెడ్డి సమక్షంలో శవ పంచనామా చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైల్వే ట్రాక్ పక్కన యువతి మృతదేహం
కర్నూలు, తుగ్గలి: మండలంలోని లింగనేనిదొడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ పక్కన ఓ యువతి మృతదేహం లభ్యమైంది. డోన్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. కాకినాడకు చెందిన చిన్న(27) బుధవారం హైదరాబాద్ నుంచి కాచిగూడ–యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో అనంతపురం బయలుదేరింది. తెల్లవారుజామున మార్గమధ్యంలో తుగ్గలి మండలం లింగనేనిదొడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ పక్కన ఆమె మృతదేహం పడిఉంది. గమనించిన స్థానికులు, రైల్వే సిబ్బంది డోన్ రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకొని కాకినాడకు చెందిన సత్యవతి కూతురు చిన్నిగా గుర్తించి తల్లికి సమాచారం చేరవేశారు. సత్యవతికి ఐదుగురు కూతుళ్లు కాగా చిన్ని మూడో సంతానం. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదివి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. మరో ఉద్యోగం వెతుక్కునే క్రమంలో అనంతపురం వెళ్లి అక్కడి నుంచి బెంగళూరు వెళ్లాలనుకుంది. ఈక్రమంలో ఆమె రైలు నుంచి జారిపడిందా? లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని రైల్వే పోలీసులు గురువారం తెలిపారు. -
మంత్రగాడనే నెపంతోనే హత్యగా అనుమానం?
తూర్పుగోదావరి, చింతూరు(రంపచోడవరం): అడవిలోని వాగు ఇసుకలో కప్పి ఉన్న ఓ మృతదేహం సోమవారం కనిపించడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. చింతూరు మండలం బొడ్డుగూడెం, ఏడుగురాళ్లపల్లి నడుమ ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ మృతదేహం సమీపంలోని బొడ్డుగూడేనికి చెందిన తాటి కన్నయ్య(60) అనే గిరిజనుడుగా గుర్తించారు. చింతూరు ఎస్సై శ్రీనివాస్‌కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని బొడ్డుగూడెం, ఏడుగురాళ్లపల్లి నడుమ జాతీయ రహదారి పక్కన ఉన్న పులివాగులో ఇసుకలో పైకిలేచి ఉన్న ఓ కాలు కనిపించడంతో దానిని గమనించిన వ్యక్తులు వీఆర్వోకు సమాచారం ఇచ్చారు. వీఆర్వో చింతూరు పోలీసులకు సమాచారమివ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా ఇసుకలో కప్పబడి ఉన్న మృతదేహం కనిపించింది. దానిని వెలికితీసిన పోలీసులు తొలుత గుర్తు తెలియని మృతదేహంగా భావించి కేసు నమోదు చేసి సమీప గ్రామాల్లో విచారించారు. దీంతో మృతుడు బొడ్డుగూడేనికి చెందిన తాటి కన్నయ్యదిగా అతని బంధువులు గుర్తించినట్టు ఎస్సై తెలిపారు. భార్య లేకపోవడంతో గ్రామంలో ఉండకుండా అతను తరచూ ఇతర గ్రామాలు తిరుగుతుంటాడని, గతనెలలో జరిగిన పోలింగ్‌లో భాగంగా గ్రామంలో ఓటు వేశాడని, అనంతరం తిరిగి తాము చూడలేదని బంధువులు చెప్పినట్టు పోలీసుల విచారణలో తేలింది. కన్నయ్య మృతదేహం కుళ్లిపోయి ఉండడంతో అతను ఎనిమిది నుంచి పది రోజుల క్రితం మరణించి ఉండవచ్చని ఎస్సై తెలిపారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించామని దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. మంత్రగాడనే నెపంతోనే హత్యగా అనుమానం? మృతుడు కన్నయ్యను మంత్రగాడనే నెపంతోనే హత్యచేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రాల నెపంతో ఈ ప్రాంతంలో ఇదే తరహాలో గతంలో పలు హత్యలు జరగడం దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. అనారోగ్యంతో తమ వారు ఎవరైనా మరణిస్తే ఫలానా వ్యక్తి మంత్రాలు చేయడం వల్లనే అతను మృతిచెందాడనే మూఢనమ్మకంతో సాటి వారిని హత్య చేయడం వంటి ఘటనలు చింతూరు మండలంలో చాలా చోటు చేసుకున్నాయి. ఇదే క్రమంలో కన్నయ్యను కూడా మంత్రగాడనే నెపంతోనే హత్యచేసి మృతదేహాన్ని వాగు ఇసుకలో పూడ్చిపెట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
పార్టీ కార్యాలయంలో దారుణ ఘటన
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో బీజేపీ బూత్ కార్యాలయంలో గురువారం ఉదయం ఓ మృతదేహం వేలాడుతూ కనిపించడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. మున్సిపల్ కార్పొరేషన్ 36వ వార్డులో జరిగిన ఈ ఘటనలో మృతుడిని కార్మికుడిగా పనిచేసే నిత్య మండల్ (42)గా గుర్తించారు. మార్నింగ్ వాక్కు వెళ్లిన స్ధానికులకు బూత్ కార్యాలయాంలో వేలాడదీసిన మృతదేహం కనిపించడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర బెంగాల్‌లోని సిలిగురిలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు మృతుడు బీజేపీలో చురుకుగా పనిచేసే కార్యకర్తని చెబుతున్నారు. -
మేఘాలయ గనిలో మృతదేహం లభ్యం
న్యూఢిల్లీ/ షిల్లాంగ్: మేఘాలయలో బొగ్గు గనిలో చిక్కుకుపోయిన ఘటనలో ఎట్టకేలకు ఒకరి మృతదేహం లభ్యమైంది. దీంతో పాటు కొన్ని అస్థిపంజరాలను గుర్తించామని నేవీ ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ చెప్పారు. రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ (ఆర్వోవీ)కు అమర్చిన కెమెరాల సాయంతో బుధవారం రాత్రి మృతదేహాన్ని, గురువారం అస్థిపంజరాలను గుర్తించారు. గని లోపల దాదాపు 160 అడుగుల లోతులో మృతదేహాన్ని, 210 అడుగుల లోతులో అస్థిపంజరాలను గుర్తించినట్లు చెప్పారు. గతేడాది డిసెంబర్ 13న ఈస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలోని అక్రమ బొగ్గు గనిలో 15 మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. -
తిరువళ్లూరులో కాలు.. కర్నూలులో మృతదేహం
తమిళనాడు, తిరువళ్లూరు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి కాలు తిరువళ్లూరులో లభ్యం కాగా, మృతదేహాన్ని 19 గంటల తరువాత ఆంధ్రప్రదేష్ రాష్ట్రం కర్నూలులో గుర్తించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి తాలుకా అత్తిపట్టు గ్రామానికి చెందిన సుధాకర్ (33) కాకలూరు సిప్కాట్లోని పరిశ్రమలో పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి పది గంటలకు షిఫ్ట్ ముగించుకుని ఇంటికి బైక్‌పై వెళుతున్నాడు. పాండూర్ వద్ద ముందుగా వెళుతున్న లారీని అధిగమిస్తుండగా, తిరుపతి నుంచి చెన్నై వైపు ఎదురుగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో బైక్ ఒకవైపు, హెల్మెట్ మరోవైపు పడి ఉండగా నడిరోడ్డుపై సుధాకర్ కాలు మాత్రం పడి ఉంది. మృతదేహం ఆచూకీ తెలియలేదు. ప్రమాదంపై స్థానికులు తిరువళ్లూరు తాలుకా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, మృతుని బంధువులు సుధాకర్ మృతదేహం కోసం అటు చెన్నై వరకు, ఇటు తిరుపతి వరకు ఉన్న వైద్యశాలల్లో తనిఖీలు చేపట్టారు. సుధాకర్ మృతదేహం లభించకపోవడంతో ఆగ్రహించిన బంధువులు ఉదయం ఏడు గంటలకు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు వారితో చర్చించి ఆందోళన విరమింపజేశారు. అయితే ఉదయం పది గంటలు దాటినా మృతదేహం అచూకీ తెలియకపోవడంతో బంధువులు రెండోసారి రాస్తారోకోకు దిగారు. పోలీసులు వారిని సమాధానపరిచారు. అయితే 1 గంట వరకు సుధాకర్ మృతదేహం లభ్యం కాకపోవడంతో మళ్లీ రోడ్డెక్కారు. దీంతో పోలీసులు విధిలేక ఆందోళన చేస్తున్న 140మందిని అరెస్టు చేశారు. ఆందోళన కారణంగా గంటల తరబడి వాహనాలు రోడ్డుకు ఇరువైపులా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తిరువళ్లూరులో కాలు.. కర్నూలులో మృతదేహం: ప్రమాదం జరిగిన స్థలంలో కాలు మాత్రమే పడి ఉండగా.. మిగతా శరీరం మాత్రం లభించలేదు. దీంతో డీఎస్పీ గంగాధరన్ నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అటూ తిరుపతి వరకు, ఇటు చెన్నై వరకు ఉన్న వైద్యశాలల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడా సుధాకర్ మృతదేహం లభించలేదు. పట్రపెరంబదూరు టోల్‌గేటు వద్ద సీసీ కెమెరాలను పరిశీలించగా ప్రమాదం జరిగిన సమయంలో ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో రెండు సిమెంట్ లారీలు వెళ్లినట్టు గుర్తించి కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో చెన్నై నుంచి కర్నూలు వెళ్లిన సిమెంట్ లారీలో మృతదేహం పడిఉన్నట్టు లారీ డ్రైవర్ కర్నూలు పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడి పోలీసులు తిరువళ్లూరు ఎస్పీకి తెలిపారు. అక్కడి నుంచి ఫొటో తెప్పించుకుని సుధాకర్ మృతదేహంగా నిర్ధారించారు. అనంతరం హుటాహుటిన కర్నూలు బయలుదేరారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు ఢీకొన్న వేగానికి పైకి ఎగిరి అక్కడ వెళుతున్న లారీలో మృతదేహం పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.