
మృతుని ఫైల్ ఫొటో
భువనేశ్వర్ ఒరిస్సా : పాఠశాల ప్రాంగణంలో గుర్తించిన మృతదేహం వివరాలు లభ్యమయ్యాయి. స్థానిక ఐఆర్‌సీ విలేజ్ నయాపల్లి ప్రాంతం ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రక్తపు మడుగులో మృతదేహం పడి ఉన్నట్లు స్థానికులు మంగళ వారం గుర్తించారు. ఈ మృతదేహం వివరాలు బుధవారం స్పష్టమయ్యాయి. స్థానిక సాలియా సాహిలో ఉంటున్న పూర్ణ నాయక్‌గా మృతుడిని గుర్తించారు. ఆయన కుటుంబీకుల సమాచారంతో మృతుడిని ఖరారు చేశారు.
రాజకీయ కక్షలతో ఆయనను హత్య చేసి ఉంటారని మృతుని భార్య సందేహం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన లోక్ సభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని కుటుంబీకులతో చర్చించినట్లు ఆమె తెలిపారు. ఆయన శ్రేయోభిలాషుల మద్దతు, ప్రోత్సాహంతో ఈ పోటీకి సిద్ధమవుతు న్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రచార కరపత్రాల్ని కూడా సిద్ధం చేసుకున్నారు. ఇంతలో ఆయన ఇలా మృతిచెందడం రాజకీయ కక్షగా భావిస్తున్నట్లు ఆమె వాపోయారు.