శ్రీ సత్యసాయి జిల్లా: జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గురువారం అదృశ్యమైన బాలుడు చేతన్ దారుణ హత్యకు గురయ్యాడు. అతడి మృతదేహాన్ని కర్ణాటక అటవీ ప్రాంతంలో గుర్తించారు.
వివరాల ప్రకారం.. మడకశిర నియోజకవర్గంలో దారుణం జరిగింది. ఎనిమిదో తరగతి విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నిన్నటి నుంచి చేతన్ కనిపించకపోవడంతో బాలుడు పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే కర్ణాటకలోని పావగడ అటవీ ప్రాంతంలో చేతన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో, చేతన్ పేరెంట్స్ కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment