గాంగ్‌టక్: సిక్కిం మాజీ మంత్రి ఆర్సీ పౌడ్యాల్ (80) మృతదేహం పశ్చిమ బెంగాల్‌లో దొరికింది. సిలిగురి సమీపంలోని తీస్థా కాలువలో మంగళవారం మృతదేహం లభించినట్లు పోలీసులు వెల్లడించారు. చేతి వాచ్, ధరించిన దుస్తుల ఆధారంగా ఆయన్ను గుర్తించారు.
మృతదేహం తీస్థా నదిలో కొట్టుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు. పౌడ్యాల్ జూలై 7న తన స్వస్థలమైన పాక్యోంగ్ జిల్లా చోటాసింగ్‌టామ్‌లో ఇంటి నుంచి సోదరి వద్దకు బయల్దేరి తిరిగి రాలేదు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి గాలించారు. 9 రోజుల తరువాత ఆయన మృతదేహం లభించింది. పౌడ్యాల్ మృతి పట్ల సీఎం తమాంగ్ సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment