Ram Chandra Poudel
-
కాలువలో సిక్కిం మాజీ మంత్రి మృతదేహం
గాంగ్టక్: సిక్కిం మాజీ మంత్రి ఆర్సీ పౌడ్యాల్ (80) మృతదేహం పశ్చిమ బెంగాల్లో దొరికింది. సిలిగురి సమీపంలోని తీస్థా కాలువలో మంగళవారం మృతదేహం లభించినట్లు పోలీసులు వెల్లడించారు. చేతి వాచ్, ధరించిన దుస్తుల ఆధారంగా ఆయన్ను గుర్తించారు. మృతదేహం తీస్థా నదిలో కొట్టుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు. పౌడ్యాల్ జూలై 7న తన స్వస్థలమైన పాక్యోంగ్ జిల్లా చోటాసింగ్టామ్లో ఇంటి నుంచి సోదరి వద్దకు బయల్దేరి తిరిగి రాలేదు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి గాలించారు. 9 రోజుల తరువాత ఆయన మృతదేహం లభించింది. పౌడ్యాల్ మృతి పట్ల సీఎం తమాంగ్ సంతాపం వ్యక్తం చేశారు. -
నేపాల్ అధ్యక్షుడికి తీవ్ర అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు
న్యూఢిల్లీ: నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని ఏయిమ్స్‌కు తరలించారు. మంగళవారం ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో రామ్ చంద్రనుతో ఖాట్మాండులోని మహారాజ్‌గంజ్ త్రిభువన్ యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్‌కు తరలించారు. వైద్య పరీక్షల్లో ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో బుధవారం ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. కాగా గత నెల రోజుల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పౌడెల్ ఆసుపత్రిలో చేరడం ఇది రెండోసారి. ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఆయన్ను త్రిభువన్ టీచింగ్ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. గత 15 రోజులుగా యాంటీబయోటిక్స్ తీసుకుంటున్నప్పటికీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదని ఖాట్మండు వార్తాపత్రిక పేర్కొంది. నేపాల్ అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్ ఈఏడాది మార్చి 10న ఎన్నికయ్యారు. అదేనెల 13న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన రామచంద్ర.. పార్లమెంటులో రెండో అతిపెద్ద పార్టీ సీపీఎన్-యూఎంఎల్ మద్దతునిచ్చిన అభ్యర్థి సుభాష్ చంద్ర నెబ్‌మాంగ్‌పై విజయం సాధించారు. ఈయనకు 214 మంది ఎంపీలు, 352 మంది ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుల ఓట్లు వచ్చాయి. చదవండి: అమెరికాలో పోలీసుల అదుపులో 17 మంది ‘వాంటెడ్’ సిక్కులు