న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా చటర్జీ, ఆయన సన్నిహితురాలైన అర్పితా ముఖర్జీకి చెందిన రూ.46.22 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. రాష్ట్రంలో 2016లో చోటుచేసుకున్న టీచర్ల నియామకం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో పార్థా చటర్జీ, అర్పితా ముఖర్జీల ఆస్తులను జప్తు చేసినట్లు సోమవారం తెలిపింది.
ఈడీ సోమవారం వీరిపై ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ వేసింది. వీరిద్దరినీ ఈడీ జూలైలో అరెస్ట్ చేసింది. వీరికి చెందిన పలు ప్రాంతాల్లో దాడులు జరిపిన ఈడీ రూ.55 కోట్ల నగలు, నగదును స్వాధీనం చేసుకుంది. ఇలా ఉండగా, ఇదే కుంభకోణానికి సంబంధించి సీబీఐ నార్త్ బెంగాల్ యూనివర్సిటీ వీసీ సుబిరెస్ భట్టాచార్యను సోమవారం అరెస్ట్ చేసింది. అప్పట్లో ఆయన బెంగాల్ సెంట్రల్ స్కూల్ సర్వీస్ కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉండేవారు.
Comments
Please login to add a commentAdd a comment