Arpita Mukherjee.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీ స్కామ్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న నటి అర్పితా ముఖర్జీని ఈడీ విచారించిన విషయం తెలిసిందే.
కాగా, ఈడీ దాడుల్లో భాగంగా కోల్‌కత్తాలోని అర్పితా ముఖర్జీ ఫ్లాట్‌లో రికార్డు స్థాయిలో రూ. 50కోట్లు వరకు నగదు, కిలోల చొప్పున బంగారం దొరికింది. కానీ, అర్పితా ముఖర్జీకి చెందిన నాలుగు కార్లు మాత్రం కనిపించకపోవడం మిస్టరీగా మారింది. ఈ కార్లులో భారీ ఎత్తున్న డబ్బు తరలించినట్టు ఈడీ అధికారులు తెలిపారు. అయితే, మిస్సైన కార్లను ఆడీ ఏ4, హోండా సిటీ, హోండా సీఆర్‌వీ, మెర్సిడెస్ బెంజ్ కార్లుగా ఈడీ వర్గాలు గుర్తించాయి. ఈ కార్లలో నగదు ఉన్నట్టు వెల్లడించారు. ఇక, అర్పితా ముఖర్జీ అరెస్ట్ సమయంలో ఆమె ఇంట్లో కేవలం తెలుపు రంగు మెర్సిడెస్ బెంజ్ కారు మాత్రమే ఉందని.. ఆ కారును స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, సీసీటీవీ ఫుటేజీని ఆధారంగా కనిపించకుండాపోయిన కార్లను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.
ఇదిలా ఉండగా.. అవినీతి, అక్రమార్జన ఆరోపణల నేపథ్యంలో పార్థా ఛటర్జీకి టీఎంసీ బిగ్ షాకిచ్చింది. ‘పార్థా ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నా. తప్పు చేసినవారిపై టీఎంసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అధికారాన్ని దుర్వినియోగం చేసేవారి పని పట్టడానికి మా వద్ద చాలా ప్లాన్స్ ఉంటాయి.. అవన్నీ చెప్పలేం’ అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఛటర్జీకి ఉద్వాసన నేపథ్యంలో ఆ శాఖలు సీఎం మమత తనవద్దే పెట్టుకోనున్నారు.
4 luxury cars missing from Partha Chatterjee aide Arpita Mukherjee's residence.#ArpitaMukherjee #ParthaChaterjee #nvbcnews pic.twitter.com/0tyvp0iJS8
— NVBC News (@NewsNvbc) July 29, 2022
ఇది కూడా చదవండి: మంత్రి పార్థా ఛటర్జీకి షాకిచ్చిన సీఎం మమత
Comments
Please login to add a commentAdd a comment