
నిజామాబాద్ క్రైం : బోధన్ మహబూబ్‌నగర ప్యాసింజర్ రైల్‌లో ఓ గుర్తు తెలియని వృద్దుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని గురువారం రైల్వే పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం బోధన్ నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్తున్న రైల్‌లో వృద్ధుడు ఎలాంటి కదలికలు లేకుండా పడిఉండటంతో ప్రయాణికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రైలు బోగి నుంచి వృద్ధుడి మృతదేహాన్ని కిందకు దింపారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి పోస్టుమార్టం గదికి తరలించి భద్రపరిచినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. వృద్ధుడికి సంబంధించిన వారు ఉంటే రైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు.