un identified person
-
రెలులో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం
నిజామాబాద్ క్రైం : బోధన్ మహబూబ్‌నగర ప్యాసింజర్ రైల్లో ఓ గుర్తు తెలియని వృద్దుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని గురువారం రైల్వే పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం బోధన్ నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్తున్న రైల్లో వృద్ధుడు ఎలాంటి కదలికలు లేకుండా పడిఉండటంతో ప్రయాణికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రైలు బోగి నుంచి వృద్ధుడి మృతదేహాన్ని కిందకు దింపారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి పోస్టుమార్టం గదికి తరలించి భద్రపరిచినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. వృద్ధుడికి సంబంధించిన వారు ఉంటే రైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు. -
గుర్తుతెలియని మహిళ హత్య
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ముదిరెడ్డిపల్లె సమీపంలోని పొలాల్లో గుర్తుతెలియని మహిళ శవాన్ని గుర్తించారు. గ్రామస్థులు గురువారం పొలంపనుల్లో ఉండగా పొలాల సమీపంలోని పొదల్లో కాలిన శరీరంతో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మహిళను హతమార్చి పెట్రోల్ పోసి కాల్చి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న బాలానగర్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడి దారుణ హత్య
నల్గొండ: గుర్తుతెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం లక్కవరం గ్రామ శివారులోని అటవీ భూమిలో గుర్తుతెలియని యువకుని మృతదేహాన్ని గురువారం స్థానికులు కనుకొన్నారు. 30 సంవత్సరాల వయసున్న యువకున్ని ఎక్కడో హత్యచేసి తమ గ్రామశివారుకు తీసుకువచ్చి పెట్రోల్ పోసి కాల్చివేశారని గ్రామస్థులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.