మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ముదిరెడ్డిపల్లె సమీపంలోని పొలాల్లో గుర్తుతెలియని మహిళ శవాన్ని గుర్తించారు. గ్రామస్థులు గురువారం పొలంపనుల్లో ఉండగా పొలాల సమీపంలోని పొదల్లో కాలిన శరీరంతో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మహిళను హతమార్చి పెట్రోల్ పోసి కాల్చి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న బాలానగర్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.