ప్రేమ వ్యవహారమా! వివాహేతర సంబంధమా? | - | Sakshi
Sakshi News home page

ప్రేమ వ్యవహారమా! వివాహేతర సంబంధమా?

Nov 28 2024 1:34 AM | Updated on Nov 28 2024 1:54 PM

-

చండ్రుపల్లిలో యువకుడి దారుణహత్య

ఇద్దరు బైక్‌పై వచ్చి హత్య చేసి పరార్‌

అడ్డొచ్చిన హార్వెస్టర్‌ డ్రైవర్‌పై దాడికి యత్నం

వివరాలు సేకరిస్తున్న పోలీసులు

కాళేశ్వరం: ఓ యువకుడిని ఇద్దరు దుండగులు నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం చండ్రుపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కొమ్మెర గ్రామానికి చెందిన ముత్యాల చంద్రక్క, అంకయ్య దంపతుల చిన్నకుమారుడు శ్రీకాంత్‌గౌడ్‌(23) నాలుగు రోజుల నుంచి తన హార్వెస్టర్‌తో చండ్రుపల్లిలో వరి పొలాల కోతలు చేపడుతున్నాడు. 

ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఇద్దరు దుండగులు పల్సర్‌బైక్‌పై వచ్చి శ్రీకాంత్‌గౌడ్‌తో గొడవ పడ్డారు. కత్తులతో పొడిచి హత్య చేశారు. దీనిని గమనించిన హార్వెస్టర్‌ డ్రైవర్‌ కమ్మగోని ప్రదీప్‌గౌడ్‌ పరుగున వచ్చిన ఆపే ప్రయత్నం చేయగా అతడిపై కూడా దాడికి పాల్పడేందుకు యత్నించారు. దీంతో అతను భయపడి దుండగులు వచ్చిన బైక్‌ తాళాలు తీసుకుని గ్రామంలోకి పరుగులు తీశాడు. గ్రామస్తులు వస్తారని భయపడిన దుండగులు పొలాల మీదుగా పరారయ్యారు.

యువకుడి కాల్‌ డేటా పరిశీలిస్తున్న పోలీసులు
కాగా, ఈ హత్యకు ప్రేమ వ్యవహారమా! వివాహేతర సంబంధమా లేదా మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు సదరు యువకుడి కాల్‌ డేటా పరిశీలిస్తున్నారు. మహదేవపూర్‌ సీఐ రామచంద్రారావు, మహదేవపూర్‌, కాళేశ్వరం ఎస్సైలు పవన్‌కుమార్‌, చక్రపాణితోపాటు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అన్నారం పరిధిలోని సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. దుండగుల పల్సర్‌ బైక్‌, తమ వెంట తీసుకొచ్చిన తెల్ల కల్లు బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

మృతుడి కుటుంబ సభ్యుల వద్ద హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. కాగా, దుండగులు కొమ్మెర గ్రా మంలో కూడా మృతుడి ఇంటి వద్ద, చండ్రుపల్లి పరిసరాల్లో నాలుగు రోజులు రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. ఈ ఘట నపై మృతుడి సోదరుడు శ్రీధర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామచంద్రారావు తెలిపా రు. మృతదేహాన్ని మహదేవపూర్‌ ఆసుపత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement