వివాహితపై మాజీ ప్రజాప్రతినిధి లైంగిక వేధింపులు
మరిపెడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
మరిపెడ రూరల్: కోరిక తీరుస్తేనే నా మామిడి తోటలో నుంచి దారి ఇస్తా.. లేదంటే ఇటునుంచి రావొద్దని ఓ గ్రామ మాజీ ప్రజాప్రతినిధి వివాహిత ను లైంగికంగా వేధించాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎడ్జెర్ల గ్రామ పరిధిలోని గుర్రప్పతండాలో ఆలస్యంగా సోమవారం వెలుగు చూసింది.
వివరాల ప్రకారం.. గుర్రప్పతండా గ్రామ పంచాయతీకి చెందిన వివాహిత భర్త కుటుంబానికి తండా శివారులో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అదే గ్రామ పంచాయతీకి చెందిన వరుసకు బాబాయ్ అయ్యే గ్రామ మాజీ ప్రజాప్రతినిధికి చెందిన మామిడితోటలో నుంచి వారి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాల్సి ఉంది. కాగా, సుమారు 50 మంది రైతు కుటుంబాలు మామిడి తోటలోని దారి నుంచి తమ వ్యవసాయ క్షేత్రాలకు రాకపోకలు కొనసాగిస్తారు.
ఈ క్రమంలో ఈ నెల 26న సదరు వివాహిత కూడా తన వ్యవసాయ భూమి వద్దకు ఒంటరిగా వెళ్తుండగా.. మాజీ ప్రజా ప్రతినిధి ఎదురుగా వచ్చి ఆమెను ఆపాడు. తన కోరిక తీరుస్తేనే మామిడితోటలో నుంచి నడవాలని లైంగికంగా వేధించాడు. ఈ క్రమంలో బాధిత వివాహిత మరుసటిరోజు తన భర్తకు జరిగిన విషయం చెప్పింది. ఈమేరకు ఆమె తన భర్తతో కలిసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఈ విషయంపై మరిపెడ పోలీసులను వివరణ కోరగా బాధిత వివాహిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment