శ్రీకాకుళం న్యూకాలనీలో ఘటన
మృతురాలిది పొందూరు మండలం మొదలవలస
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని న్యూకాలనీలో 53 ఏళ్ల వివాహిత పూజారి కళావతి దారుణ హత్యకు గురయ్యారు. శనివారం మ«ధ్యాహ్నం రెండున్నర గంటలకు తన స్వగ్రామం పొందూరు మండలం మొదలవలస నుంచి శ్రీకాకుళం నగరానికి తన వ్రస్తాలు తెచ్చుకుంటానని స్కూటీపై వచ్చిన ఆమె రోజు గడిచినా ఇంటికి వెళ్లకపోవడం.. ఆదివారం రాత్రి న్యూకాలనీ ఎక్సైజ్ కార్యా లయం సమీపంలోని ఓ బిల్డింగ్ పై ఫ్లోర్ బాత్రూమ్‌లో విగతజీవిగా పడి ఉండటం స్థానికంగా సంచలనం రేపింది.
రెండో పట్టణ పోలీసులు, కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. పొందూరు మండలం మొదలవలస గ్రామానికి చెందిన పూజారి వెంకటరావు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. అతని భార్య కళావతి. వీరికి ఇద్దరు మగ పిల్లలు, ఓ కుమార్తె ఉన్నారు. ఈమెకు నగరంలో సత్సంగంకు భజనలకు వెళ్లే అలవాటు ఉంది. శనివారం నగరానికి స్కూటీపై వచ్చిన ఆమె రాత్రయినా ఇంటికి వెళ్లలేదు. దీంతో ఆమె సత్సంగానికి వెళ్లి ఉంటారని కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఉదయం అక్కడ ఉన్న గురువుకు ఫోన్ చేశాక రాలేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
సీసీ కెమెరాలు పరిశీలించడంతో..
ఎక్సైజ్ కార్యాలయం ఎదురుగా ఉన్న వీధి చివరన, మరికొన్ని చోట్ల సీసీ కెమెరాలు పరిశీలించగా చైతన్య కళాశాల వద్ద ఆమె స్కూటీ ఆపి పార్క్ చేయడం, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి రెడ్డిమ్ ఎంటర్‌ప్రైజస్ బిల్డింగ్ ఒకటో ఫ్లోర్‌కు మెట్లెక్కుతూ ఉండటం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత ఆమె దిగడం రికార్డు కాలేదు. దీంతో రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు తన సిబ్బందితో పాటు క్లూస్ టీమ్‌తో పై ఫ్లోర్ రూమ్‌లోకి వెళ్లి చూడగా పక్కనే ఉన్న బాత్రూమ్‌లో కళావతి విగతజీవిగా పడి ఉంది.
పరిసరాలన్నీ పరిశీలించగా బాత్‌రూమ్ పక్కన ఉన్న గదిలో బెడ్ ఉండటం, దానిపై రెండు తలగడల్లోని ఓ తలగడపై రక్తపు మరక ఉండటం, కళావతి ముక్కు నుంచి కూడా రక్తం కారి ఉండటాన్ని బట్టి హత్యగా భావించి పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె వచ్చిన బిల్డింగ్ ఓనర్ సూరిబాబు అనే వ్యక్తి. అందులో పై ఫ్లోర్‌లో అండలూరి శరత్‌కుమార్ అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. ఆ వ్యక్తితో గత కొంతకాలంగా ఆమె సన్నిహితంగా ఉంటున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వీడిన బాలుడి హత్య మిస్టరీ
Comments
Please login to add a commentAdd a comment