Kalavati
-
శరత్ అనే వ్యక్తితో కళావతి సన్నిహితంగా..!
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని న్యూకాలనీలో 53 ఏళ్ల వివాహిత పూజారి కళావతి దారుణ హత్యకు గురయ్యారు. శనివారం మ«ధ్యాహ్నం రెండున్నర గంటలకు తన స్వగ్రామం పొందూరు మండలం మొదలవలస నుంచి శ్రీకాకుళం నగరానికి తన వ్రస్తాలు తెచ్చుకుంటానని స్కూటీపై వచ్చిన ఆమె రోజు గడిచినా ఇంటికి వెళ్లకపోవడం.. ఆదివారం రాత్రి న్యూకాలనీ ఎక్సైజ్ కార్యా లయం సమీపంలోని ఓ బిల్డింగ్ పై ఫ్లోర్ బాత్రూమ్లో విగతజీవిగా పడి ఉండటం స్థానికంగా సంచలనం రేపింది. రెండో పట్టణ పోలీసులు, కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. పొందూరు మండలం మొదలవలస గ్రామానికి చెందిన పూజారి వెంకటరావు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. అతని భార్య కళావతి. వీరికి ఇద్దరు మగ పిల్లలు, ఓ కుమార్తె ఉన్నారు. ఈమెకు నగరంలో సత్సంగంకు భజనలకు వెళ్లే అలవాటు ఉంది. శనివారం నగరానికి స్కూటీపై వచ్చిన ఆమె రాత్రయినా ఇంటికి వెళ్లలేదు. దీంతో ఆమె సత్సంగానికి వెళ్లి ఉంటారని కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఉదయం అక్కడ ఉన్న గురువుకు ఫోన్ చేశాక రాలేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. సీసీ కెమెరాలు పరిశీలించడంతో.. ఎక్సైజ్ కార్యాలయం ఎదురుగా ఉన్న వీధి చివరన, మరికొన్ని చోట్ల సీసీ కెమెరాలు పరిశీలించగా చైతన్య కళాశాల వద్ద ఆమె స్కూటీ ఆపి పార్క్ చేయడం, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి రెడ్డిమ్ ఎంటర్‌ప్రైజస్ బిల్డింగ్ ఒకటో ఫ్లోర్‌కు మెట్లెక్కుతూ ఉండటం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత ఆమె దిగడం రికార్డు కాలేదు. దీంతో రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు తన సిబ్బందితో పాటు క్లూస్ టీమ్‌తో పై ఫ్లోర్ రూమ్‌లోకి వెళ్లి చూడగా పక్కనే ఉన్న బాత్రూమ్లో కళావతి విగతజీవిగా పడి ఉంది. పరిసరాలన్నీ పరిశీలించగా బాత్రూమ్ పక్కన ఉన్న గదిలో బెడ్ ఉండటం, దానిపై రెండు తలగడల్లోని ఓ తలగడపై రక్తపు మరక ఉండటం, కళావతి ముక్కు నుంచి కూడా రక్తం కారి ఉండటాన్ని బట్టి హత్యగా భావించి పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె వచ్చిన బిల్డింగ్ ఓనర్ సూరిబాబు అనే వ్యక్తి. అందులో పై ఫ్లోర్లో అండలూరి శరత్‌కుమార్ అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. ఆ వ్యక్తితో గత కొంతకాలంగా ఆమె సన్నిహితంగా ఉంటున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీడిన బాలుడి హత్య మిస్టరీ -
'రాహుల్ వల్ల కళావతికి ఏం ఒరిగింది..?' అమిత్ షా ఫైర్..
ఢిల్లీ: కేంద్రంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. 13 సార్లు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి.. అన్నీసార్లు విఫలమైన నాయకుడు ఇక్కడ ఉన్నాడంటూ పరోక్షంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 2008లో మహారాష్ట్రంలోని విదర్భలో వితంతువు కళావతి ఇంటిని సందర్శించిన విషయాన్ని గుర్తుచేసి.. రాహల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 2008లో రాహుల్ గాంధీ మహారాష్ట్రంలోని విదర్భకు చెందిన కళావతి అనే వితంతు మహిళ ఇంటిని సందర్శించారు. 2005లోనే అప్పుల బాధతో కళావతి భర్త మరణించగా.. ఆమె బాగోగులు రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆమె పేరు దేశమంతటా మారుమోగింది. ఈ అంశాన్ని గుర్తు చేసిన అమిత్ షా.. ఆ తర్వాత ఆరేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కళావతికి చేసిన మేలు ఏంటో చెప్పాలని ప్రశ్నించాడు. మోదీ ప్రభుత్వంలోనే ఆమెకు గ్యాస్, ఇళ్లు, కరెంటు, రేషన్ అందాయని చెప్పారు. 'కళావతి ఇంట్లో అప్పట్లో రాహుల్ గాంధీ భోజనం కూడా చేసి వచ్చారు. కానీ ఆమె జీవితమంతా అనుభవించిన చీకటిని మాత్రం పారదోలలేకపోయారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు వచ్చింది. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే భారత-అమెరికా అణుఒప్పందంతో దేశమంతటా వెలుగులు పంచుతున్నాము.' అని అమిత్ షా స్పష్టం చేశారు. మణిపూర్ అంశంపై పట్టుబట్టిన ప్రతిపక్షాలు కేంద్రంపై అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టాయి. ఆ తీర్మానంపై నేడు చర్చ జరిగింది. అటు.. రాహుల్ గాంధీ ఎంపీగా మళ్లీ పదవి పొందిన అనంతరం నేడు తొలిసారి లోక్‌సభలో మాట్లాడారు. మణిపూర్ అంశంలో కేంద్రాన్ని నిందించారు. అటు తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు గంటల పాటు నిర్విరామంగా మాట్లాడారు. ఇదీ చదవండి: 'అగ్నికి ఆజ్యం పోయెుద్దు..' అమిత్ షా ఫైర్.. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
రోడ్డు దాటుతున్న మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో.. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా వీరవాసంలో శుక్రవారం చోటుచేసుకుంది. తోలేరుకు చెందిన జడ్డు కళావతి(50) వీరవాసంలో రోడ్డు దాటుతుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆమె మృతిచెందింది. సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.