ఢిల్లీ: కేంద్రంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. 13 సార్లు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి.. అన్నీసార్లు విఫలమైన నాయకుడు ఇక్కడ ఉన్నాడంటూ పరోక్షంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 2008లో మహారాష్ట్రంలోని విదర్భలో వితంతువు కళావతి ఇంటిని సందర్శించిన విషయాన్ని గుర్తుచేసి.. రాహల్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
2008లో రాహుల్ గాంధీ మహారాష్ట్రంలోని విదర్భకు చెందిన కళావతి అనే వితంతు మహిళ ఇంటిని సందర్శించారు. 2005లోనే అప్పుల బాధతో కళావతి భర్త మరణించగా.. ఆమె బాగోగులు రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆమె పేరు దేశమంతటా మారుమోగింది. ఈ అంశాన్ని గుర్తు చేసిన అమిత్ షా.. ఆ తర్వాత ఆరేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కళావతికి చేసిన మేలు ఏంటో చెప్పాలని ప్రశ్నించాడు. మోదీ ప్రభుత్వంలోనే ఆమెకు గ్యాస్, ఇళ్లు, కరెంటు, రేషన్ అందాయని చెప్పారు.
'కళావతి ఇంట్లో అప్పట్లో రాహుల్ గాంధీ భోజనం కూడా చేసి వచ్చారు. కానీ ఆమె జీవితమంతా అనుభవించిన చీకటిని మాత్రం పారదోలలేకపోయారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు వచ్చింది. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే భారత-అమెరికా అణుఒప్పందంతో దేశమంతటా వెలుగులు పంచుతున్నాము.' అని అమిత్ షా స్పష్టం చేశారు.
మణిపూర్ అంశంపై పట్టుబట్టిన ప్రతిపక్షాలు కేంద్రంపై అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టాయి. ఆ తీర్మానంపై నేడు చర్చ జరిగింది. అటు.. రాహుల్ గాంధీ ఎంపీగా మళ్లీ పదవి పొందిన అనంతరం నేడు తొలిసారి లోక్‌సభలో మాట్లాడారు. మణిపూర్ అంశంలో కేంద్రాన్ని నిందించారు. అటు తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు గంటల పాటు నిర్విరామంగా మాట్లాడారు.
ఇదీ చదవండి: 'అగ్నికి ఆజ్యం పోయెుద్దు..' అమిత్ షా ఫైర్..
Comments
Please login to add a commentAdd a comment