jibe
-
దమ్ముంటే అక్కడ గెలవండి! చిదంబరానికి మంత్రి హరీష్ రావు కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణాల బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య విమర్శల వేడి రాజుకుంటోంది. ముఖ్యంగా ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందన్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం వ్యాఖ్యలపై తెలంగాణా మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేత చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉందంటూ ఎక్స్ (ట్విటర్)లో ఒక పోస్ట్ పెట్టారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం గురించి చిదంబరం మాట్లాడటం దొంగే దొంగ అన్నట్టుగా ఉందని అపుడుఅధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. అప్పటి నెహ్రు ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే కదా పొట్టి శ్రీరాములు చనిపోయారనీ,చరిత్ర తెలియనిది కేసీఆర్‌కి కాదుచిదంబరమే చరిత్ర తెలియకుండా వక్ర భాష్యాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు. హైదరాబాద్ అనేది ఓ రాష్ట్రంగా ఉండేదనే సంగతిని మర్చి,అప్పట్లో మద్రాసు రాష్ట్రం ఉండేదని, తెలంగాణ రాష్ట్రం లేకుండే అని చిదంబరం మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ అప్పులు, ఆదాయం పై చిదంబరం దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కన్నా ఎంతో బాగుందని గ్రహించాలన్నారు. అలాగే తమ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ నివేదికల్ని పరిశీలిస్తే మంచిదని కూడా అన్నారు. చిదంబరం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కారని పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ కాదు పదకొండు సార్లు అవకాశమిచ్చారు. చిదంబరంకు దమ్ముంటే ఆయన సొంత రాష్ట్రం తమిళనాడులో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. తెలంగాణ సాధించింది కేసీఆర్ . సాధించిన తెలంగాణను అభివృద్ది చేసి దేశానికే రోల్ మెడల్‌గా నిలిపింది కేసీఆర్ అంటూ ట్వీట్ చేశారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా, ఎంతమంది వచ్చి దుష్ప్రచారం చేసినా.. యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నరు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీనే దీవించబోతున్నారు అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా తొమ్మిదిన్నర ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పు భారీగా పెరిగిందని చిదంబరం కేసీఆర్ సర్కార్‌పై ధ్వజమెత్తారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోమాట్లాడిన ఆయనతెలంగాణ అప్పు రూ.3.66లక్షల కోట్లకు చేరుకుందని, ప్రతి తెలంగాణ పౌరుడిపై సగటున రూ. లక్ష అప్పు ఉందని వ్యాఖ్యానించారు. వంట గ్యాస్ సిలిండర్ ధర ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. హైదరాబాద్‌లోనే ఎక్కువనీ, నిరుద్యోగం, అధిక ధరల్ని నియంత్రించడంలో ఇంతచేసినా ప్రభుత్వం విద్య, ఆరోగ్య రంగానికి కేటాయిస్తున్న నిధులు అరకొరగానే ఉన్నాయని విమర్శించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేత చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉంది తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం.. దాన్ని వెనక్కి తీసుకున్న ఫలితంగా కదా ఉద్యమంలో యువకులు బలిదానం చేసింది. 👉 పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం గురించి చిదంబరం మాట్లాడటం దొంగే దొంగ అన్నట్టుగా ఉంది. 👉పొట్టి… — Harish Rao Thanneeru (@BRSHarish) November 16, 2023 -
'రాహుల్ వల్ల కళావతికి ఏం ఒరిగింది..?' అమిత్ షా ఫైర్..
ఢిల్లీ: కేంద్రంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. 13 సార్లు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి.. అన్నీసార్లు విఫలమైన నాయకుడు ఇక్కడ ఉన్నాడంటూ పరోక్షంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 2008లో మహారాష్ట్రంలోని విదర్భలో వితంతువు కళావతి ఇంటిని సందర్శించిన విషయాన్ని గుర్తుచేసి.. రాహల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 2008లో రాహుల్ గాంధీ మహారాష్ట్రంలోని విదర్భకు చెందిన కళావతి అనే వితంతు మహిళ ఇంటిని సందర్శించారు. 2005లోనే అప్పుల బాధతో కళావతి భర్త మరణించగా.. ఆమె బాగోగులు రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆమె పేరు దేశమంతటా మారుమోగింది. ఈ అంశాన్ని గుర్తు చేసిన అమిత్ షా.. ఆ తర్వాత ఆరేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కళావతికి చేసిన మేలు ఏంటో చెప్పాలని ప్రశ్నించాడు. మోదీ ప్రభుత్వంలోనే ఆమెకు గ్యాస్, ఇళ్లు, కరెంటు, రేషన్ అందాయని చెప్పారు. 'కళావతి ఇంట్లో అప్పట్లో రాహుల్ గాంధీ భోజనం కూడా చేసి వచ్చారు. కానీ ఆమె జీవితమంతా అనుభవించిన చీకటిని మాత్రం పారదోలలేకపోయారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు వచ్చింది. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే భారత-అమెరికా అణుఒప్పందంతో దేశమంతటా వెలుగులు పంచుతున్నాము.' అని అమిత్ షా స్పష్టం చేశారు. మణిపూర్ అంశంపై పట్టుబట్టిన ప్రతిపక్షాలు కేంద్రంపై అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టాయి. ఆ తీర్మానంపై నేడు చర్చ జరిగింది. అటు.. రాహుల్ గాంధీ ఎంపీగా మళ్లీ పదవి పొందిన అనంతరం నేడు తొలిసారి లోక్‌సభలో మాట్లాడారు. మణిపూర్ అంశంలో కేంద్రాన్ని నిందించారు. అటు తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు గంటల పాటు నిర్విరామంగా మాట్లాడారు. ఇదీ చదవండి: 'అగ్నికి ఆజ్యం పోయెుద్దు..' అమిత్ షా ఫైర్.. -
కేబినెట్ విస్తరణపై రాహుల్ గాంధీ సెటైర్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. ప్రధానంగా దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత, ఇటీవలి కేబినెట్ విస్తరణను టార్గెట్‌గా చేసుకుని ఆయన విమర్శలు గుప్పించారు. దేశంలో మంత్రుల సంఖ్య పెరిగింది కానీ, కోవిడ్ వ్యాక్సిన్లు కాదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా టీకాల గణాంకాల వివరాలను ట్విటర్లో రాహుల్ షేర్ చేశారు. రోజుకు సగటు టీకాల లెక్కలను వివరిస్తూ, ఇలా అయితే దేశంలో డిసెంబర్ 2021 నాటికి అందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా పూర్తవుతుందనే సందేహాలను ఆయన లేవనెత్తారు. ‘వేర్ ఆర్ వ్యాక్సిన్’ అనే హ్యష్‌ట్యాగ్ తో రాహుల్ ట్విటర్ ద్వారా తన దాడిని ఎక్కుపెట్టారు. దేశంలో వ్యాక్సిన్ల కొరత సమస్యపై ఇప్పటికే అనేకసార్లు ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్, మహమ్మారి థర్డ్ వేవ్ ఆందోళన నేపథ్యంలో దేశ జనాభాకు త్వరితగతిన టీకాలందించే కార్య్రకమాన్ని మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ తాజా ట్విట్ చేయడం గమనార్హం. కాగా రెండోసారి అధికారాన్ని చేపట్టిన తరువాత మోదీ తన కేబినెట్‌ను భారీగా విస్తరించిన సంగతి తెలిసిందే. తద్వారా ప్రభుత్వంలో 43 మంది మంత్రులను చేర్చుకోగా మొత్తం మంత్రుల సంఖ్య 77 కి చేరింది. मंत्रियों की संख्या बढ़ी है, वैक्सीन की नहीं!#WhereAreVaccines pic.twitter.com/gWjqHUVdVC — Rahul Gandhi (@RahulGandhi) July 11, 2021 -
పెట్రో సెగ : కేంద్ర ఆర్థికమంత్రిపై హీరో సెటైర్
సాక్షి,ముంబై: వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న పెట్రో ధరలపై దేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైతోంది. ఈ నేపథ్యంలో హీరో సిద్ధార్థ విమర్శలు గుప్పించారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై సోషల్ మీడియాలో తన దాడిని ఎక్కుపెట్టారు. ‘మామి తరువాతి స్థాయికి చేరుకున్నారు. ‘ఉల్లిపాయలు లేవు, మెమరీ లేదు, ప్రిన్సిపల్స్ లేవు.. మామి రాక్స్’ అంటూ ట్వీట్ చేశారు. అయితే పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతున్న నేపథ్యంలో పెట్రోలును జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే.. ధరలు దిగొచ్చే అవకాశం ఉందని నిర్మలా గతవారం వ్యాఖ్యానించారు. ధరల అదుపునకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక యంత్రాంగాన్ని రూపొందించాల్సి ఉంటుందన్నారు. మరోవైపు హద్దే లేకుండా పెరుగుతున్నపెట్రోలు, డీజిల్ ధరలపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పటికే మీమ్స్, వ్యంగ్యోక్తులతో బీజేపీ సర్కార్‌పై నెటిజన్లు విరుచుక పడుతున్నారు. పెట్రోలు ధరలను భారీగా పెంచుతూ సామాన్యులపై భారం మోపుతున్నారంటూ 2013లో కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడిన నిర్మలా సీతారామన్, తాజా పెంపుపై మాత్రం ఆర్థికమంత్రిగా విభిన్నంగా స్పందించారు. దీనికి ఆయిల్ కంపెనీలే బాధ్యత వహించాలని, ఇంధన ధరల నియంత్రణ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండదని పేర్కొనడం గమనార్హం. ఈ వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు ఫిబ్రవరి మాసంలో రికార్డు స్తాయిలో పుంజుకున్న పెట్రోలు, డీజిల్ గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. Maami is next level flexible in her belief system. No onions, no memory, no principles. Maami rocks! https://t.co/4WZ791m1HV — Siddharth (@Actor_Siddharth) February 22, 2021 -
మాటలు–మంటలు
వ్యంగ్యం, వెటకారం, పరిహాసం వగైరాలు అన్నివేళలా నవ్వు పుట్టించవు. వాటిని ఎడాపెడా ఉపయోగించేవారు కూడా కేవలం ఆ ఉద్దేశంతో మాత్రమే మాట్లాడరు. అవతలివారిని కించపరచడానికి కావొచ్చు... ఆగ్రహం తెప్పించడానికి కావొచ్చు... ఎత్తిపొడుపు కోసం కావొచ్చు... ఇష్టానుసారం మాట్లాడతారు. రాష్ట్రపతి ప్రసం గంపై జరిగిన చర్చకు జవాబిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో బుధవారం చేసిన ఒక వ్యాఖ్య కాంగ్రెస్‌కు ఆగ్రహం కలిగించింది. ‘రెయిన్ కోటు వేసుకుని బాత్రూంలో స్నానం చేసే కళ ఆయనకే తెలుసు’ అని మోదీ వ్యంగ్యంగా అన్నారు. ఎన్ని స్కాంలు బయటపడినా మన్మోహన్పై నిందపడలేదని చెప్పడం ఆయన ఉద్దేశం కావొచ్చు. కాంగ్రెస్ ఇందుకు ఆగ్రహించి సభ నుంచి వాకౌట్ చేసింది. అది మన్మోహన్‌ను వ్యక్తిగతంగా అన్న మాట కాదని, యూపీఏ పాలన తీరుపై చేసిన వ్యాఖ్యానమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ సర్దిచెప్పినా కాంగ్రెస్ మాత్రం గురువారం కూడా వాకౌట్ చేయడంతోపాటు బడ్జెట్ సమావేశాల రెండో దశలో నరేంద్ర మోదీ పాల్గొన్నప్పుడల్లా సభను బహిష్కరిస్తామని ప్రకటిం చింది. తమకు మద్దతుగా ఇతర పక్షాలు కూడా పాల్గొంటాయని చెబుతోంది. బడ్జెట్ సమావేశాల సమయంలో విపక్షాలు ఇలాంటి నిర్ణయాన్ని అమలు చేస్తే ప్రభుత్వా నికి ఇబ్బందికరమే. ఇతర నేతల కంటే నరేంద్ర మోదీ భిన్నమైనవారు. ఆయనను బలంగా అభి మానించేవారున్నట్టే... బలంగా వ్యతిరేకించేవారు కూడా ఉంటారు. అయితే సమ యస్ఫూర్తిగా మాట్లాడటంలో, ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించి గుక్కతిప్పు కోకుండా చేయడంలో ఆయన్ను మించినవారు ఉండరని ఈ రెండు వర్గాలూ ఒప్పు కుంటాయి. గుజరాత్ నుంచి ఢిల్లీకి రావడంలో ఈ కళ మోదీకి ఎంతవరకూ తోడ్ప డిందో బీజేపీ దిగ్గజాలకు తెలిసి ఉంటుంది. మూడేళ్లనాటి సార్వత్రిక ఎన్నికల సమరంలో ఆయన బీజేపీ పక్షాన ఎలా ప్రచారం చేశారో అందరూ గమనించారు. పదునైన విమర్శలతో ప్రత్యర్థులపై నిర్దాక్షిణ్యంగా పిడుగులు కురిపించడంలో మోదీకెవరూ సాటిరారు. ఒక మాటంటే పది మాటలనే రకం ఆయన. అయితే అప్పట్లో అందుకు కలిసొచ్చిన అంశాలున్నాయి. కేంద్రంలో బీజేపీ దీర్ఘకాలం అధికారంలో లేకపోవడం... ప్రత్యేకించి మోదీ తొలిసారి కేంద్రంలో అడుగుపెట్టడం ఆయనకు అనుకూలాంశాలు. యాదృచ్ఛికమే అయినా మన్మోహన్పై మోదీ వ్యంగ్య బాణం సంధించడానికి ముందురోజే సుప్రీంకోర్టులో వ్యంగ్యంపై దాఖలైన వ్యాజ్యం విచారణకొచ్చింది. ‘మా సిక్కుల్ని అందరూ హేళన చేస్తున్నారు. పరమ మూర్ఖులుగా చిత్రీకరిస్తున్నారు. ఇలాంటి జోకుల్ని తక్షణమే నిషేధించండి’ అంటూ పంజాబ్‌కు చెందిన న్యాయవాది ఒకరు ఆ కేసు దాఖలు చేశారు. ‘పౌరులకు నైతిక నియమావళిని ఎలా జారీ చేస్తామ’ని ఈ సందర్భంగా న్యాయమూర్తులు ప్రశ్నిం చారు. అలాంటివి అరికట్టడమన్నది చట్టసభల పరిధిలోకి వస్తుందని అభిప్రాయ పడ్డారు. కానీ చట్టసభలే అలాంటి వ్యంగ్యాస్త్రాలకు వేదికలవుతున్నాయని ఆ మర్నాడే రుజువైంది. ఇలా మంచీ మర్యాదా లేకుండా మాట్లాడటమేనా అని నిలదీసిన కాంగ్రెస్‌కు... మీరు మర్యాద తప్పి మాట్లాడలేదా అని ఎదురు ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం లూటీ, దోపిడీ అంటూ అదే సభలో మన్మోహన్ మాట్లాడటాన్ని గుర్తు చేశారు. అలాంటి పదాలు వాడే ముందు 50 సార్లు ఆలోచించి ఉండాల్సిందని కూడా కాంగ్రెస్‌కు హితవు చెప్పారు. తనది భిన్నమైన మార్గమని, మాటంటే పడి ఊరుకోబోనని ఈ జవాబు ద్వారా మోదీ తెలియజెప్పారు. ఇంతకూ ఈ సమా వేశాల పరమార్ధం బడ్జెట్‌ను ఆమోదించడం, అలా ఆమోదించే ముందు కూలం కషంగా చర్చించడం. జనం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాన్ని కనుగొ నడం. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ప్రకటన చేయాలంటూ విపక్షాలు చేసిన అలజడితో శీతాకాల సమావేశాలు నిష్ఫలమ య్యాయి. ఆ సమావేశాల కాలంలో అదే సమస్యపై వెలుపల అనేక సభల్లో మాట్లా డిన ప్రధాని విపక్షాలు డిమాండ్ చేసినందుకు కాబోలు... పార్లమెంటులో మాత్రం పెదవి విప్పలేదు. నోట్ల రద్దు ప్రకటన చేశాక మొదలైన కష్టాలు జనవరి నెల మధ్యవరకూ జనాన్ని వెంటాడాయి. సంపన్నుల ముంగిట్లోకి సరికొత్త నోట్లు వచ్చి వాలితే సామాన్యులు మాత్రం గంటల తరబడి క్యూలు కట్టాల్సివచ్చింది. వంద మంది మరణించారు. చిన్న తరహా పరిశ్రమలపై, చిరు వ్యాపారాలపై పెద్ద నోట్ల రద్దు చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. కనీసం ఇప్పుడైనా పెద్ద నోట్ల రద్దుపైనా, దానివల్ల బయటపడిన నల్ల డబ్బుపైనా సవివరమైన ప్రకటన చేయలేదు. సరిగదా నోట్లు రద్దుచేశాక ఒక్క రోజంటే ఒక్క రోజు కూడా కరెన్సీ లోటు రాలేదని రాజ్యసభలో ఒక ప్రశ్నకు జవా బుగా కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ‘గజం మిథ్య... పలాయనం మిథ్య...’ అన్నట్టు అంతా సవ్యంగా గడిచిందని పార్లమెంటు సాక్షిగా ఆయన చెప్పిన మాటలు విస్మయాన్ని కలిగిస్తాయి. నన్నూ, ప్రభుత్వాన్నీ విమర్శించండి. ఆర్బీఐని, దాని గవర్నర్‌నూ ఎందుకు ఇందులోకి లాగుతారని మోదీ ప్రశ్నించారు. అయితే పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో ఉర్జిత్ పటేల్‌ను తోటి సభ్యు లంతా నిలదీస్తుంటే ఆయనకు అండగా నిలబడింది మన్మోహనేనని మోదీ మరిచి నట్టున్నారు. మన్మోహన్పై మోదీ చేసిన వ్యాఖ్యను ఎవరూ సమర్ధించలేరు. అది యూపీఏ పాలనను ఉద్దేశించి అన్న మాట మాత్రమేనని అనంతకుమార్ చెప్పడం ఇందువల్లే కావొచ్చు. ఏ నిర్ణయమైనా అందరికీ నచ్చాలని లేదు. అందునా తీవ్ర ప్రభావం కలిగించే పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలనూ, దాని పర్యవసానాలనూ అందరూ మౌనంగా భరించాల్సిందేనని ఆశించడం న్యాయమేనా? ఇంతకూ నేతలు తమకు దక్కాల్సిన మర్యాద గురించి, తమ మనోభావాలు దెబ్బతినడం గురించి ఇంత పట్టుదలగా ఉంటున్నారు. మంచిదే. మరి సాధారణ పౌరులకు దక్కాల్సిన గౌరవమర్యాదల మాటేమిటి? వారి హక్కుల ఉల్లంఘన మాటేమిటి? చేసిన వాగ్దా నాల సంగతేమిటి? వారి ప్రయోజనాలను రక్షించేదెవరు?